శశికళకు ఎదురుదెబ్బ | shock to sasikala didnt get parole | Sakshi
Sakshi News home page

శశికళకు ఎదురుదెబ్బ

Published Tue, Oct 3 2017 8:19 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

శశికళకు ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమెకు పెరోల్‌ ఇచ్చేందుకు జైలు శాఖ నిరాకరించింది. అనారోగ్యంతో ఉన్న తన భర్తను చూసేందుకు తనకు పదిహేను రోజులు పెరోల్‌ ఇవ్వాలని శశికళ దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం ఏఐఏడీఎంకే నేత టీటీవీ దినకరన్‌ చెప్పారు. చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో శశికళ భర్త ఎం నటరాజన్‌ చికిత్స పొందుతున్న విషయం విదితమే. లివర్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉన్న నటరాజన్‌కు ప్రస్తుతం డయాలసిస్‌, ఇతర ఇంటెన్సివ్‌ కేర్‌ థెరఫీస్‌ను వైద్యులు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శశికళ పెరోల్‌కు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అయితే, ఆమెకు పెరోల్‌ కూడా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ అటు శశికళకు, దినకరన్‌కు నిరాశ ఎదురైంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement