సంజయ్దత్కు 14 రోజుల పెరోల్ మంజూరు
బాలీవుడ్ హీరో సంజయ్దత్కు కొద్ది ఊరట లభించింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 14 రోజుల పెరోల్ మంజూరైంది. చికిత్స చేయించుకోడానికి వీలుగా ఈ ఊరటను కోర్టు మంజూరుచేసింది. అక్రమ ఆయుధాల కేసులో ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడిన సంజయ్ దత్.. ఈ సంవత్సరం మే 16వ తేదీ నుంచి పుణెలోని ఎరవాడ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
ముంబై పేలుళ్ల సమయంలో సంజయ్ దత్ వద్ద కూడా కొన్ని ఆయుధాలు లభించాయి. వాటిలో ఏకే-57 లాంటి రైఫిళ్లు కూడా ఉన్నాయి. ఆత్మరక్షణ కోసమే వాటిని ఉంచుకున్నట్లు చెప్పినా, వాటికి తగిన లైసెన్సు లేకపోవడంతో సంజూబాబాపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు సుదీర్ఘ కాలం పట్టడంతో ఇటీవలే సంజయ్దత్ జైల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే.
జైల్లో ఉన్నప్పుడు కూడా కొన్ని నాటకాలు ప్రదర్శించి అక్కడ దేశభక్తిని పెంపొందించేందుకు సంజయ్ ప్రయత్నించారు. పెరోల్ మంజూరు కావడంతో సంజయ్దత్ ఈరోజు సాయంత్రం లోపులే పుణె ఎరవాడ జైలు నుంచి విడుదల కానున్నారు.