ఆ విషయం ఇంకా గుర్తుంది! | Aishwarya Rai Bachchan in 'Raat Aur Din' remake | Sakshi
Sakshi News home page

ఆ విషయం ఇంకా గుర్తుంది!

Published Sat, Sep 1 2018 2:47 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Aishwarya Rai Bachchan in 'Raat Aur Din' remake - Sakshi

ఐశ్వర్యారాయ్‌

బాలీవుడ్‌లో ‘గుజారీష్‌’ సినిమా తర్వాత దాదాపు ఐదేళ్ల గ్యాప్‌ తీసుకుని హీరోయిన్‌ ఐశ్వర్యారాయ్‌ ‘జజ్బా’ సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌పైకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఐశ్వర్య సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసినప్పటి నుంచీ అలనాటి క్లాసిక్‌ ఫిల్మ్‌ ‘రాత్‌ ఔర్‌ దిన్‌’ రీమేక్‌లో ఆమె లీడ్‌ రోల్‌ చేయనున్నారన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయంపై ఐశ్వర్యారాయ్‌ స్పందించారు. ‘‘కేవలం ‘రాత్‌ ఔర్‌ దిన్‌’ (1967) మూవీ మాత్రమే కాదు, ‘ఓ కౌన్‌ తీ’ (1964) రీమేక్‌లోనూ నేను నటించాలనుకున్నాను.

రీమేక్స్‌ ౖరైట్స్‌ విషయమై చర్చలు జరుగుతున్నాయి. ‘రాత్‌ ఔర్‌ దిన్‌’ రీమేక్‌లో నర్గిస్‌ దత్‌ క్యారెక్టర్‌ భలేగా ఉంటుంది. దాదాపు 13ఏళ్ల క్రితం ‘శబ్ద్‌’ సినిమాలో సంజయ్‌ దత్‌తో కలిసి నటించాను. అప్పుడు ‘రాత్‌ ఔర్‌ దిన్‌’ రీమేక్‌ చేస్తే అందులోని మా అమ్మ పాత్రకు నువ్వు అయితే బాగా సూట్‌ అవుతావు’ అని సంజయ్‌దత్‌ అన్నారు. ఆ విషయం ఇంకా గుర్తు ఉంది’’ అన్నారు ఐశ్వర్యారాయ్‌. నెక్ట్స్‌ భర్త అభిషేక్‌ బచ్చన్‌తో కలిసి ఐశ్వర్య ‘గులాబ్‌ జామున్‌’ సినిమాలో నటించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement