సంజయ్‌దత్‌కు పెరోల్ | Actor Sanjay Dutt leaves Pune prison, will spend 30 days at home | Sakshi
Sakshi News home page

సంజయ్‌దత్‌కు పెరోల్

Published Sun, Dec 22 2013 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM

Actor Sanjay Dutt leaves Pune prison, will spend 30 days at home

 సాక్షి, ముంబై: పుణేలోని ఎరవాడ కారాగారంలో  జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు మరోసారి నెల రోజుల పెరోల్ లభించింది. ఈ విషయాన్ని జైళ్ల అదనపు డెరైక్టర్ జనరల్ మీరా బోర్వాంకర్ నిర్దారించారు. పుణే డివిజనల్ క మిషనర్ ప్రభాకర్ దేశ్‌ముఖ్ పెరోల్‌ను మంజూరు చేశారు. దీంతో శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో దత్ కారాగారం నుంచి బయటపడ్డారు. ఈ నేపథ్యంలో ఈసారి కొత్త సంవత్సరం వేడుకలను  కుటుంబసభ్యులు సంజయ్‌దత్‌తో జరుపుకునేందుకు వీలుక లిగింది. వాస్తవానికి దత్‌కు ఈ నెల ఆరో తేదీనే పెరోల్ మంజూరైంది.
 
 అయితే దీనిపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాన్యత కనిపించడంతో ఆమె అరోగ్యం బాగానే ఉందని, అయితే జైలు నుంచి బయటపడేందుకు దత్ అబద్ధాలు చెప్పాడంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో హోం మంత్రి  పాటిల్ దర్యాప్తునకు ఆదేశించారు. అయితే ఆ తర్వాత ఏంజరిగిందనే విషయం వెలుగులోకి రాకపోయినప్పటికీ 30 రోజుల పెరోల్ లభించింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement