
శివాజీనగర: హత్య కేసులో జైలు శిక్షకు గురైన ఓ కోలారు జిల్లావాసికి కోర్టు జీవితఖైదు విధించడంతో జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఏప్రిల్ 5న కోర్టు ఆదేశంతో పెరోల్ (సెలవు) పొంది ఏప్రిల్ 11న పెళ్లి చేసుకున్నాడు. ఏప్రిల్ 20వ తేదీకి సెలవు ముగిసింది.
అయితే ఆ సమయం చాలదని, హనీమూన్‌కి 60 రోజులు సెలవు కావాలని హైకోర్టులో పిటిషన్‌వేశాడు. జడ్జి జస్టిస్ ఎం.నాగప్రసన్న ధర్మాసనం ఈ అర్జీని విచారించింది. అతనికి పెరోల్‌ను మంజూరు చేస్తూ షరతులను కూడా విధించింది. ప్రతి ఆదివారం ఒకసారి నేరం జరిగిన పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment