వేలూరు: రాజీవ్‌గాంధీ హత్య కేసులో వేలూరు మహిళా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న నళిని మూడు రోజుల పెరోల్ కోసం వినతి చేసినట్లు న్యాయవాది పుగయేండి తెలిపారు. రాజీవ్ హంతకులు మురుగన్, శాంతన్, పేరరివాలన్‌లతో పాటు మొత్తం ఏడుగురు వేలూరు సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నళిని న్యాయవాది పుగలేంది మహిళా జైల్లో ఉన్న నళిని పరామర్శించి మాట్లాడారు.
అనంతరం బయటకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ నళిని తండ్రి శంకర్ నారాయణన్ గత వారం మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో తండ్రి 16వ రోజు కార్యం కోసం ఈనెల 8,9,10 తేదీల్లో మూడు రోజుల పెరోల్ కోసం వేలూరు మిహ ళా జైలు సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి వద్ద ఈనెల 2వ తేదీన నళిని వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ వినతిపై ఈనెల 7వ తేదీన కోర్టులో దాఖలు చేసి విచారించనున్నారన్నారని తెలిపారు. ఏడుగురి విడుదల గురించి 2014లో అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. ఏడుగురిని విడుదల చేసేందుకు ఎన్నికల కోడ్ ఆటంకం కాదన్నారు.