nalini
-
వైట్‌హౌజ్‌కు బ్రైట్ స్టార్స్
అత్యుత్తమ ప్రతిభావంతుల గురించి పద్మిని పిళ్లై, నళినీ టాటాలు కాలేజి నుంచి యూనివర్శిటీ రోజుల వరకు ఎన్నోసార్లు విని ఉన్నారు. అలాంటి ప్రతిభావంతుల జాబితాలో ఇప్పుడు ఈ ఇద్దరు కూడా చేరారు. ఇది అదృష్టం కాదు. జ్ఞానదాహం, లోతైన విశ్లేషణ సామర్థ్యం తాలూకు అత్యుత్తమ ఫలితం. భారతీయ అమెరికన్లు పద్మిని పిళ్లై, నళిని టాటా ప్రతిష్ఠాత్మకమైన వైట్‌హౌజ్ ఫెలోస్ ప్రోంగ్రామ్ (2024–2025)కు ఎంపిక అయ్యారు....‘వైట్‌హౌజ్ ఫెలోస్ప్రోంగ్రాం’ కోసం ఈ ఏడాది అమెరికా నలుమూలల నుంచి 15 మందిని ఎంపిక చేశారు. వీరిలో భారతీయ మూలాలు ఉన్న పద్మిని పిళ్లై, నళిని టాటాలు ఉన్నారు.బోస్టన్‌కు చెందిన ఇమ్యూనో ఇంజనీర్ పద్మిని పిళ్లై సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేస్తుండగా, న్యూయార్క్‌కు చెందిన నళిని టాటా వైట్‌హౌజ్ ఆఫీస్ ఆఫ్ క్యాబినెట్ అఫైర్స్‌లో పనిచేస్తుంది. ‘వైట్‌హౌజ్ ఫెలోస్ ప్రోగ్రాం’ను 1964లో మొదలుపెట్టారు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మకమైన ప్రోంగ్రాములలో ఇదొకటి. తమ రంగంలో సాధించి విజయాలు, నాయకత్వ లక్షణాలు, ప్రజాసేవ... మొదలైనవి ఎంపిక ప్రక్రియలోని ప్రధాన అంశాలు.ఎంపికైన వ్యక్తులు క్యాబినెట్ కార్యదర్శులు, ఇతర ఉన్నత స్థాయి పరిపాలన అధికారులతో సహా వైట్‌హౌజ్ సీనియర్ సభ్యుల మార్గదర్శకత్వంలో ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తారు. ప్రైవేట్, ప్రభుత్వ రంగాలకు చెందిన నాయకులతో రౌండ్ టేబుల్ చర్చలలో వీరు కూడా పాల్గొంటారు. తగిన ప్రతిభ చూపితే ఉన్నతస్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది.గత సంవత్సరాలతో పోల్చితే ఈ సంవత్సరం ‘వైట్‌హౌజ్ ఫెలోస్ప్రోంగ్రాం’కు సంబంధించిన ఎంపిక ప్రక్రియ కఠినంగా ఉంది. అయినప్పటికీ తమ అద్భుత ప్రతిభతో వైట్‌హౌజ్ ఫెలోస్ప్రోంగ్రాంకు ఎంపికయ్యారు. అందుకే వీరిని ‘స్కిల్డ్ బంచ్’గా పిలుస్తున్నారు. అత్యుత్తమ నైపుణ్యం కలిగిన ఇమ్యునో ఇంజినీర్ గా పద్మిని పిళ్లైని వైట్‌హౌజ్ వెబ్సైట్ ప్రశంసించింది. పద్మిని గతంలో ఎంఐటీలో ట్యూమర్–సెలెక్టివ్ నానోథెరపీపై పనిచేసిన టీమ్‌కు నాయకత్వం వహించింది.2013లో అనారోగ్యానికి గురైన పద్మిని దాదాపు మరణపు అంచుల వరకు వెళ్లింది. ఆసుపత్రులలో రోజుల తరబడి గడిపింది. ‘ఆసుపత్రి నుంచి బయటపడిన తరువాత చిన్న పని చేసినా అలిసి పోయేదాన్ని. ఇలా అవుతోందేమిటా అని ఎన్నోసార్లు నిరాశకు గురయ్యాను. ఫుల్ ఎనర్జీ రావడానికి నెలల సమయం పట్టింది. నిరాశలో ఉన్నప్పుడు మనకు ధైర్యం చెప్పేవాళ్లు కుటుంబం, స్నేహితులలో ఉండడం అవసరం’ అంటుంది పద్మిని.రెగిస్ కాలేజీ నుంచి బయోకెమిస్ట్రీలో డిగ్రీ, యేల్ యూనివర్శిటీలో ఇమ్యునో బయాలజీలో పీహెచ్డీ చేసిన పద్మిని పిళ్లై కోవిడ్ మహమ్మారి విధ్వంసంపై లోతైన విశ్లేషణ చేసింది. వ్యాక్సినేషన్, ఇమ్యూనిటీ, వైరస్ ప్రభావంపై ఆమె ఆలోచనలను సీఎన్‌బీసీ, ది అట్లాంటిక్, న్యూయార్క్ టైమ్స్‌లాంటి ప్రముఖ మీడియా సంస్థలు కవర్ చేశాయి.ఇక నళిని టాటా విషయానికి వస్తే.. బ్రౌన్ యూనివర్శిటీలో న్యూరోబయోలాజీలో బీఎస్సీ, యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్‌లో ఎంఫిల్, నార్త్ వెస్ట్రన్ ఫీన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి ఎండీ చేసింది. ‘హార్వర్డ్ కెన్నడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్’లో డెమోక్రసీ, పాలిటిక్స్ అండ్ ఇనిస్టిట్యూషన్‌లో పట్టా పోందింది. ఎన్నో సైంటిఫిక్ జర్నల్స్‌లో పరిశోధనాత్మక రచనలు చేసింది. వైద్య విషయాలనైనే కాదు రాజకీయ, ఆర్థిక విషయాలపై కూడా నళినీ టాటాకు ఆసక్తి ఉంది. -
బికినీ ధరించిన మొదటి హీరోయిన్ ఎవరు..? ఆమె ఎలా మరణించారో తెలిస్తే..
బాలీవుడ్ హీరోయిన్ నళిని జయవంత్ 20వ శతాబ్దం మధ్యకాలంలో హిందీ చిత్రాలలో ఒక ఊపు ఊపేసింది. ముంబైలో పుట్టిన నళిని తనకు 15 ఏళ్ల వయసులోనే అంటే 1941లో హీరోయిన్గా బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ రోజుల్లో ఆమె నటించిన చిత్రాలలో లెక్కలేనన్ని భారీ హిట్లు కొట్టాయి. పరిశ్రమకు ఆమె చేసిన కృషి చాలా ఎక్కువగానే ఉన్నప్పటికీ , ఆమె తన తరువాతి సంవత్సరాలలో ఒంటరిగా జీవించి.. 84 సంవత్సరాల వయస్సులో 2010లో మరణించింది. ఆమె మరణం చాలా విషాధంతో కూడుకొని ఉంది. అత్యంత అందమైన హీరోయిన్గా గుర్తింపు 1950వ దశకంలో, ఫిల్మ్‌ఫేర్ నిర్వహించిన ఒక పోల్‌లో అత్యంత అందమైన మహిళగా ఆమె ఎంపికైంది. దిలీప్ కుమార్ వంటి స్టార్ హీరో కూడా తనతో పాటుగా కలిసి పనిచేసిన వారిలో గొప్ప నటి నళిని జయవంత్ అని ప్రశంసించారు. బాలీవుడ్ నివేదికల ప్రకారం, బికినీ ధరించిన మొదటి నటి నళిని జయవంత్ అని ఉంది. ఆమె ఇండియన్ ఒకప్పటి స్టార్ హీరోయిన్, దర్శకురాలు అయిన శోభనా సమర్థ్‌కు మొదటి కోడలు. 1950లో విడుదలైన సంగ్రామ్ చిత్రంలో నళిని జయవంత్ స్విమ్ సూట్ ధరించారు. అప్పట్లో ఆమె బికినీ ఫోటోలు ప్రేక్షకులను షాక్ గురిచేశాయి. ఈ చిత్రంలో అశోక్ కుమార్ సరసన నళిని జతకట్టింది. ఫిల్మ్‌ఫేర్ నివేదికల ప్రకారం ఆవారా (1951)లో నర్గీస్ స్విమ్ సూట్ ధరించింది. ఆ తర్వాత శోభనా సమర్థ్ కుమార్తె అయిన 'నూతన్' కూడా 'డిల్లీ కా థగ్' (1958) చిత్రంలో స్విమ్సూట్ను ధరించి మెప్పించారు. ఆ ఒక్క సినిమాతో నూతన్‌కు కూడ భారీ అవకాశాలు వచ్చాయి. అలా నూతన్, నళిని జయవంత్ ఒకే కుటుంబం నుంచి ఇద్దరూ బాలీవుడ్‌నే ఏలేశారు. నూతన్ సోదరి అయిన తనూజ కూతురే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్. నళినీ మరణించిన మూడు రోజులకు.. నళినీ జయవంత్ డిసెంబర్ 22, 2010న 84 ఏళ్ల వయసులో ముంబైలోని చెంబూర్ వద్ద ఉన్న యూనియన్ పార్క్‌లోని తన బంగ్లాలో 60 ఏళ్లుగా జీవించి కన్నుమూశారు. ఆమె మరణించిన మూడు రోజుల తర్వాత ఆమె మరణించినట్లు గుర్తించారు. ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్ వచ్చే వరకు కూడా నళినీ చనిపోయినట్లు ఎవరూ గమనించబడలేదు. దుర్వాసన రావడంతో గమనించిన ఒకరు సమాచారం ఇవ్వడంతో ఆమె మరణ వార్త బయటి ప్రపంచానికి తెలిసింది. 2001లో తన భర్త ప్రభు దయాళ్ మరణించిన తర్వాత నళినీ పూర్తిగా తనను తాను ఒంటరిగా ఉండేలా బంధించుకుంది. అలా తొమ్మిదేళ్ల పాటు జీవించి దారుణమైన స్థితిలో కన్నుమూసింది. ఆమెకు పిల్లలు లేరు. వృద్ధాప్యంలో బంధువులు కూడా ఆమె వద్దకు ఎవరూ రాకపోవడంతో ఒక అనాథలా తన జీవితాన్ని ముగించింది. 1941 నుంచి 1983 వరకు సుమారు 80కి పైగా చిత్రాల్లో నటించిన నళినీకి 2005లో దాదాహెబ్ ఫాల్కే అకాడమీ జీవితకాల సాఫల్య పురస్కారం దక్కింది. -
కాలేజీ రోజుల్లోనూ నాన్న కొట్టేవాడు, అమ్మకు చెప్తే..: నళిని కూతురు
నళిని.. ఇప్పుడంటే సీరియల్స్ చేస్తోంది కానీ ఒకప్పుడు సినిమాల్లో ఎక్కువగా కనిపించేది. విలనిజం పండించడంలో ఈమె దిట్ట. సినిమాల్లో, సీరియల్స్‌లో అవతలివారిని ముప్పతిప్పలు పెట్టే ఈమె నిజ జీవితంలోనూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. 1987లో దర్శకనటుడు, రచయిత రామరంజన్ను పెళ్లాడింది. వీరికి అరుణ, అరుణ్ అని ఇద్దరు కవలలు జన్మించారు. రానురానూ సంసారంలో గొడవలు రావడంతో నళిని- రామరాజన్ 2000వ సంవత్సరంలో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. విడాకులు.. గుక్కపెట్టి ఏడ్చిన నళిని కోర్టులో విడాకులు మంజూరు చేయగానే నళిని గుక్కపెట్టి ఏడ్చేయగా రామరాజు అతడిని ఓదార్చాడు. అది చూసి అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారట. అలా విడిపోయినప్పటికీ ఒకరిపై మరొకరు ఆప్యాయత కురిపించుకున్నారు. తాజాగా తమ పేరెంట్స్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది వారి కూతురు అరుణ. ఆమె మాట్లాడుతూ.. 'విడాకుల తర్వాత కూడా అమ్మానాన్న ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. అందుకు ఓ ఉదాహరణ చెప్తా.. 2010లో నాన్నకు యాక్సిడెంట్ అయింది. నా సోదరుడు ఫోన్ చేసి చెప్తే ప్రాంక్ కాల్ అనుకున్నాను. కానీ ఉదయానికల్లా అది బ్రేకింగ్ న్యూస్‌లో వచ్చింది. ఎప్పుడూ నాన్న గురించి అడిగేది! అది చూసి అమ్మ ఎంతో ఏడ్చింది. తనకు ఏయే అలర్జీలు ఉన్నాయి, ఏంటనేది అమ్మకే తెలుసు. అప్పట్లో అమ్మ సీరియల్స్‌తో చాలా బిజీగా ఉండేది. ప్రతిరోజు మేము ఆస్పత్రికి వెళ్లి రావడం, నాన్న కోలుకుంటున్న ఫోటోలను అమ్మకు చూపించడం.. ఇదే జరిగేది. నాన్న తింటున్నాడా? లేదా? అని అడిగి తెలుసుకునేది. వారి మధ్య అంత ఆప్యాయత ఉంది. అమ్మ కొట్టినప్పుడు నాన్న పట్టించుకునేవాడు కాదు. అలాగే నాన్న కొట్టినప్పుడు అమ్మ కూడా చూసీచూడనట్లుగానే వ్యవహరించేది. ఇద్దరూ కొట్టేవారు కొట్టేంతవరకు వచ్చిందంటే కచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుందని ఇద్దరూ బలంగా నమ్మేవారు. నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా నాన్న కొట్టాడు. ఎవరో బంధువులు వచ్చినప్పుడు లేచి పలకరించలేదని దండించాడు. అమ్మానాన్న విడాకులు తీసుకున్న తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ విషయం ఇంటికి వెళ్లి మా అమ్మకు చెప్తే నువ్వేదో తప్పు చేసుంటావు. అందుకే కొట్టాడని లైట్ తీసుకుంది. అలా ఇద్దరూ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. కానీ ఒంటరి తల్లిగా తను ఎన్నో సమస్యలు ఎదుర్కొంది' అని చెప్పుకొచ్చింది అరుణ. చదవండి: అక్కడ హను-మాన్ సినిమా ప్రదర్శించడం లేదట! డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన.. -
పదేళ్ల తర్వాత వెలుగులోకి.. ఎవరీ నళిని.. అసలు ఆమె కథేంటి?
సాక్షి, యాదాద్రి: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో ఉద్యమకారులపై లాఠీ ఝుళిపించలేక తన ఉద్యోగానికి రాజీనామా చేసిన మాజీ డీఎస్పీ దోమకొండ నళిని చాలా రోజుల తర్వాత వెలుగులోకి వచ్చారు. శనివారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని ఆమె కలిశారు. భువనగిరికి చెందిన నళిని తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో 2009లో తన డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తామని ఆ పార్టీ నాయకత్వం హామీ ఇచ్చింది. డిసెంబర్ 7న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో నళిని అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆమెకు మళ్లీ ఉద్యోగం ఇవ్వాలని నెటిజన్లు కామెంట్లు పెట్టా రు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని త్యాగం చేసిన నళినికి తిరిగి ఉద్యోగం ఇవ్వాలని ఇటీవల జరిగిన పోలీసు శాఖ సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరే దైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైనా ఆలోచించాలని చెప్పారు. అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలోనే సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నళిని కలిశారు. కుటుంబ నేపథ్యం ఇదీ.. భువనగిరికి చెందిన దోమకొండ సత్యనారాయణ, సత్యవతి దంపతుల కూతురు నళినికి డిగ్రీ మొదటి చదువుతున్న సమయంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా ఆత్మకూరుకు చెందిన నరేందర్‌తో వివాహం జరిగింది. సంతానం అయిన తరువాత కూడా నళిని చదువు కొనసాగించారు. ఫార్మసీలో డిప్లొమా పూర్తి చేసి కాకతీయ యూనివర్సిటీ నుంచి బీఎడ్ కూడా చేశారు. గ్రూప్–1, గ్రూప్–2 పరీక్షలు రాశారు. గ్రూప్ –2కు ఎంపిక కావడంతో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగంలో చేరారు. 2007లో గ్రూప్–1 రావడంతో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అదే ఏడాది జూన్ 1న డీఎస్పీగా ఎంపికయ్యారు. డీఎస్పీ శిక్షణ పూర్తయ్యాక హసన్‌పర్తి, హన్మకొండలో ప్రొబేషనరీ డీఎస్పీగా పనిచేశారు. మొదటి పోస్టింగ్ కరీంనగర్లో ఇచ్చినప్పటికీ, తర్వాత ఆర్డర్‌ను అప్పటి ప్రభుత్వం మార్చి మెదక్ డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చింది. 2009 డిసెంబర్9న తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తెలంగాణ ఉద్యమంపై అప్పట్లో జరిగిన అణచివేత, ఉద్యమకారులపై దాడులకు వ్యతిరేకంగా రాజీనామా చేసినట్లు ప్రకటించారు. డీఎస్పీ స్థాయి అధికారి ఉద్యోగానికి రాజీనామా చేయడం అప్పట్లో సంచలనం కలిగించింది. అదే రోజు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైనట్లుగా అప్పటి కేంద్రం ప్రకటించింది. ఉద్యోగానికి రాజీనామా చేసినప్పటికీ, అప్పట్లో ప్రభుత్వం దాన్ని ఆమోదించ లేదు. తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ నళిని 2009 డిసెంబర్ 24న 19 పేజీల లేఖను సోనియాగాంధీకి రాశారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినట్లుగా కేంద్రం ప్రకటనతో అప్పట్లో కొందరు ఉద్యమకారులు తిరిగి ఆమెను విధుల్లో చేరాలని ఒత్తిడి తేవడంతో రాజీనామా వెనక్కి తీసుకుంటూ లెటర్ ఇచ్చారు. ప్రభుత్వం కూడా తిరిగి విధుల్లోకి తీసుకుంది. రెండోసారి రాజీనామా.. ఎన్నికల్లో పోటీ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆలస్యం కావడంతో నళిని 2011 నవంబరు 1న మరోసారి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అమరవీరుల స్ఫూర్తి యాత్ర నిర్వహించారు. ఢిల్లీలో దీక్ష చేస్తానని ప్రకటించడంతో ప్రభుత్వం నళిని రాజీనామా ఆమోదించకుండా, డిసెంబరు 4న విధులనుంచి తొలగించింది. 2011 డిసెంబరు 9న తెలంగాణ ఇవ్వాలని, ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దీక్షకు దిగడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. తెలంగాణవాదుల వినతి మేరకు దీక్ష విరమించారు. ఆ తర్వాత తెలంగాణ నళిని క్రాంతిసేన ఏర్పాటు చేశారు. 2012లో పరకాల ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం అదే ఏడాది నవంబరు 1న బీజేపీలో చేరినప్పటికీ ఆమె రాజకీయాల్లో చురుకుగా లేరు. -
నా మనోవ్యధను అర్థం చేసుకున్నారు: మాజీ డీఎస్పీ నళిని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో.. తన డీఎస్పీ పదవికి దూరమై వార్తల్లోకి ఎక్కారు నళిని. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆమె పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఉద్యమకారులకు, ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకు తమ ప్రభుత్వంలో స్థానం ఉంటుందని.. ఆమె కోరుకుంటే అదే ఉద్యోగం కుదరకుంటే వేరే ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి సీఎస్‌ను ఆదేశించారు కూడా. ఈ తరుణంలో.. శనివారం ఆమె రేవంత్‌రెడ్డిని కలిశారు. అయితే.. తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనను ఆమె ఇదివరకే తిరస్కరించారు. తనకు ఉద్యోగంలో ఆసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ కేవలం మర్యాదపూర్వక భేటీ జరిగిందంతే. గత సమీక్షలో తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ అధికారులకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే అధికారులు సమాచారం అందించగా ఆమె సీఎం రేవంత్‌ను ఇవాళ కలిశారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డిని కలువడం సంతోషంగా ఉంది. ఉద్యోగం ఇప్పుడు నాకు అవసరం లేదు. డబ్బు, భౌతిక ప్రపంచం నుండి బయట పడ్డాను. ఇప్పుడు నాది ఆధ్యాత్మిక మార్గం. వేద కేంద్రాలకు ప్రభుత్వ సహకారం అడిగాను.. సీఎం సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వేదం , యజ్ఞం పుస్తకాలు పూర్తి చేస్తున్నా. సనాతన ధర్మం ప్రచారం చేస్తా. గతంలో నేను, సహఉద్యోగులు డిపార్ట్ మెంట్లో ఎదుర్కొన్న సమస్య పై సీఎంకు రిపోర్ట్ ఇచ్చాను. నాలాగా ఎవరు భాద పడవద్దన్నదే నా అభిప్రాయం. అప్పుడే నాకు బ్యూరోక్రసీ మీద నమ్మకం పోయింది. అందుకే ఆధ్యాత్మిక బాట ఎంచుకున్నా. నా విషయంలో జరిగిన అన్ని పరిణామాలు సీఎం దృష్టికి తీసుకెళ్లా. ఇప్పుడు నా మనసుకు నచ్చినట్లు సేవ చేస్తున్నా. ఇన్నాళ్ల నా మనోవ్యధను గుర్తించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి.. సీఎం రేవంత్‌కు ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారామె. -
నేను ఏ ఉద్యోగం చేయలేను
సాక్షి, హైదరాబాద్: తాను ఇప్పుడు ఏ ఉద్యోగం చేసే స్థితిలో లేనని, తనకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తానని మాజీ డీఎస్పీ నళినీ చెప్పారు. తెలంగాణ ఉద్యమం తర్వాత 12 ఏళ్లకు తెలంగాణ మూలాలున్న సీఎంగా రేవంత్‌రెడ్డి ఇన్నాళ్లకు తన పోరాటాన్ని, సంఘర్షణను జనం తెలుసుకొనే ఒక సందర్భం సృష్టించడం సంతోషంగా ఉందన్నారు. అందుకు రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ ఫేస్బుక్లో బహిరంగ లేఖను పోస్ట్ చేశారు. కొద్దిరోజులుగా మీడియా మిత్రులు తన ప్రతిస్పందన తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారని, అందుకే ఫేస్బుక్లో బహిరంగ లేఖ పెడుతున్నానని చెప్పారు. తన లేఖ చివరిలో డి.నళినీ ఆచార్య, యజ్ఞ బ్రహ్మ, వేద ప్రచారకురాలు అని పేర్కొన్నారు. ‘తెలంగాణ ఉద్యమంలో బతికి బయటపడి సర్వస్వం కోల్పోయిన వాళ్లలో నేను ముందు వరుసలో ఉన్నానన్న విషయం ప్రజలకు అర్థమైంది. నిజం నిలకడ మీద తెలుస్తుందన్నది నిరూపితమైంది. గతం ఒక రీల్ మాదిరి నా కళ్ల ముందు కదులుతోంది. ఇన్నాళ్లు నేను ఒక సస్పెండ్ ఆఫీసర్‌గా ‘సోషల్ స్టిగ్మా (కళంకం)’ను మోశాను. నన్ను ఆనాటి ప్రభుత్వం మూ డేళ్లు చాలా ఇబ్బంది పెట్టింది. క్షణక్షణం ఒక గండంలా గడిచింది’అని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంతో ప్రజలకు దగ్గరైనా.. తన బంధుమిత్ర పరివారమంతా వెలివేసిందని, పర్యవసానంగా ఇల్లు, కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతి అన్నీ కోల్పోయి జీవచ్ఛవంలా బతికానని ఆవేదన వ్యక్తం చేశారు. ‘దేవుడు నన్ను క్రిమినాలజీ (నేర శాస్త్రం) నుంచి ఫిలాసఫీ (వేదాంతం) వైపు నడిపించాడు. రెండేళ్ల క్రితం నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించారు. వేదమాత, యజ్ఞ దేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు. అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నాను. మీరు (సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి) రాజు, నేను బ్రాహ్మణిని. మీరు ఇచ్చే ప్రభుత్వ ఫండ్‌ను నేను స్వతంత్రంగా ఉంటూనే వేద, యజ్ఞ, ధారి్మక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తాను’అని పేర్కొన్నారు. ప్రస్తుతం సనాతన ధర్మానికి మూలా లైన ’వేదం యజ్ఞం’ అనే పుస్తకాన్ని తెలుగు, హిందీ భాషల్లో రాస్తున్నానని, అందువల్ల సీఎం రేవంత్‌రెడ్డిని కలవలేకపోతున్నట్టు నళినీ చెప్పారు. -
ఆమెకు అదే ఉద్యోగం ఎందుకు ఇవ్వొద్దు?: సీఎం రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను అడిగారు. నళినికి ఉద్యొగం చేయాలని ఆసక్తి వుంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీ.ఎస్, డీజీపీలను ఆదేశించారు. పోలీస్ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలేమైనా ఉంటే అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు. సచివాలయంలో శుక్రవారం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, పోలీస్ శాఖలో నియామకాలమీద సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా చాలా మంది తిరిగి ఉద్యొగాల్లో చేరిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఇదే నియమం పవిత్రమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నత ఉద్యోగాన్ని త్యజించిన నళినికి మాత్రం తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో అభ్యంతరాలు ఎందుకు ఉండాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు వచ్చినప్పుడు, నళినికి ఎందుకు అన్యాయం జరగాలని సీఎం అన్నారు. తిరిగి ఉద్యోగంలో చేరడానికి నళిని సుముఖంగా ఉంటే, వెంటనే ఆమెకు ఉద్యోగం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో మార్మోగిన పేరు డీఎస్పీ నళిని. తెలంగాణ కోసం ఉద్యమించే నా అన్నాచెల్లెళ్లపై లాఠీ ఝుళిపించలేనంటూ ఉన్నతాధికారులకు తేల్చి చెప్పారామే. అక్కడితో ఆగకుండా తన డీఎస్పీ ఉద్యోగాన్ని వదిలేసుకున్నారు. 2012లో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. అనంతరం ఉద్యమంలో భాగంగా ఆమె ఢిల్లీలో రెండు సార్లు దీక్షకు సైతం కూర్చున్నారు. అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం ఆమె ప్రస్తావన పుష్కరకాలం తర్వాత మళ్లీ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఇక నళినికి రాష్ట్రం ఏర్పడిని అనంతరం.. గత ప్రభుత్వంలో గానీ ఎలాంటి గుర్తింపు దక్కలేదు. అయితే ప్రభుత్వం మారగా ఇప్పుడైనా ఆమెకు సరైన గుర్తింపు దక్కాలని, చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తుండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. నళిని ఇప్పుడు పూర్తిగా భిన్నమైన జీవితాన్ని గడుపుతున్నారని, ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమెను డిసెంబర్ 4, 2011న సస్పెండ్ చేయడంతో మీడియాలో సంచలనంగా మారారు. ఆమెను దేశ ద్రోహంకు పాల్పడినట్లు నిందించడంపై అప్పటి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్రంగా ఖండించారని ఆమె గుర్తు చేసుకొంటున్నారు. ఇక ఆమె డిఎస్పీ ఉద్యోగంపై రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. ఢిల్లీలో దీక్ష, తెలంగాణ యాత్ర, పరకాల ఉప ఎన్నికలో పోటీ, బీజేపీ సభ్యత్వం తీసుకోవడం వంటివి అన్ని ఉద్యమంలో భాగంగానే చేశారు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆమె ఎవరినీ కలవలేదు. -
నళినిపై సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీస్, వైద్య..ఆరోగ్య శాఖలపై సమీక్ష సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ పోలీస్ అధికారిణి నళిని అంశాన్ని అధికారుల వద్ద ప్రస్తావించిన ఆయన.. ఆమెకు తిరిగి అదే ఉద్యోగం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ‘‘ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఓడిపోయాక.. తిరిగి ఉద్యోగాల్లో చేరుతున్నారు. అలాంటిది తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాన్ని వదులుకున్న నళినికి తిరిగి ఉద్యోగం ఇవ్వడం న్యాయమే. ఆమెకు అదే పొజిషన్ అప్పజెప్పండి. ఒకవేళ పోలీస్ శాఖలో తీసుకునేందుకు రూల్స్ అడ్డువస్తే.. మరేయితర డిపార్ట్మెంట్లోకి అయినా తీసుకోండి’’ అని సీఎం రేవంత్, సీఎస్.. డీజీపీలను ఆదేశించారు. పన్నెండేళ్ల కిందట.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులకు ఆమె అనుకూలంగా పని చేశారనే అభియోగాలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేశారామె. పారదర్శకంగా నియామకాలు చేపట్టండి తెలంగాణ రాష్ట్రంలో పోలీసు నియామకాలు చేపట్టాలని పోలీస్ శాఖను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అత్యంత పారద్శకంగా, అవకతవకలకు తావులేకుండా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారాయన. హోంగార్డుల నియామకాలను కూడా చేపట్టాలన్నారు. అలాగే.. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన నియామాకాల పై నివేదిక ఇవ్వాలని కోరారు. పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కోరుకొండ స్కూల్ లాగే రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు ఉంటుందని, ఉత్తర, దక్షిణ తెలంగాణ లో ఈ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. టైం టు టైం ఆలోచన చేయండి ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సచివాలయ అధికారుల్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అలా వచ్చే ప్రజల కోసం మంత్రుల ఛాంబర్లో నిర్దిష్టమైన టైం ఏర్పాట్లపై అధ్యయనం చేయాలని సూచించారాయన. అలాగే.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొదటివారంలో ఒకట్రెండు రోజులపాటు సభలు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తే.. అక్కడి ప్రజలు హైదరాబాద్ దాకా వచ్చే పరిస్థితి ఉండదని అన్నారు. ప్రతీ నెల మొదటి వారంలో రెండు రోజులపాటు సభలు నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కరానికి చోరవ చూపాలని అధికారులకు సూచించారాయన. అలాగే.. ఫిర్యాదుల్ని డిజిటలైజేషన్ చేయాలని, ప్రజా వాణికి వస్తున్న స్పందన దృష్ట్యా ఇంకా టేబుల్స్ పెంచాలని అధికారులకు చెప్పారు. అవసరం అయితే శిక్షణ లో ఉన్న ఐఎఎస్ ల సేవలను వినియోగించుకోవాలన్నారు. -
ఆ రెండింటి కోసమే పెళ్లి చేసుకోవాలనుకున్నా: 'కిక్' నటి
సీనియర్ నటి నళిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. 1980-90ల్లో క్రేజీ బ్యూటీగా మారింది. అలాంటి సమయంలోనే నటుడు, దర్శకుడు రామరాజన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత మనస్పర్థలు కారణంగా విడిపోయి విడాకులు తీసుకున్నారు. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందా?) ప్రస్తుతం సినిమాలు, టీవీ సీరియల్స్‌లో అమ్మ పాత్రలు చేస్తున్న నళిని.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవిత అనుభవాలు.. కరెక్ట్‌గా చెప్పాలంటే ప్రేమ, పెళ్లి, విడాకులు గురించి మాట్లాడింది. 'హీరోయిన్గా నేను బిజీగా ఉన్నప్పుడు ఏడాదికి 24 సినిమాల్లో నటించా. తినడం, నిద్రపోవడం కోసమే పెళ్లి చేసుకోవాలని భావించాను. అలాంటప్పుడు నటుడు రామరాజన్ని లవ్ చేశాను' 'కొన్నాళ్లకు మా ప్రేమ వ్యవహారం నా తల్లిదండ్రులకు చెప్పడంతో అప్పటినుంచి రామరాజన్‌తో నటించడానికి వాళ్లు ఒప్పుకోలేదు. రామరాజన్ మంచి నటుడు, తెలియకుండా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నిజంగా ఆయన బంగారు లాంటి మనిషి. తర్వాత మా ఇద్దరికీ ఎందుకో సెట్ కాలేదు. దీంతో విడిపోయాం. పెళ్లి రద్దయినా ఇప్పటికీ ఆయన్ని ప్రేమిస్తూనే ఉన్నా. ఈ విషయం ఆయనకు కూడా తెలుసు' అని నటి నళిని తన ఆవేదన బయటపెట్టింది. (ఇదీ చదవండి: విడాకుల న్యూస్‌పై స్పందించిన కలర్స్ స్వాతి!) -
సుప్రీం కోర్టుని ఆశ్రయించిన నళిని
న్యూఢిల్లీ: రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషి నళిని తనను విడుదల చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇదే కేసుల దోషిగా ఉన్న ఏజీ పేరారివాలన్ విడుల చేయాలని సుప్రీం కోర్టు ఆశ్రయించిన నెలరోజుల తర్వాత నళిని తనకు కూడా ఈ కేసు నుంచి ఉపశమనం కావాలంటు సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు. ఈ మేరుకు మే 18న పెరారివాలన్‌కి సుప్రీం కోర్టు విడుదల మంజూరు చేయడంతో ఈ కేసు నుంచి కాస్త ఉపశమనం పొందాడు. దీంతో ఇదే హత్య కేసులో నిందితులుగా ఉన్న నళిని, రవిచంద్రన్‌లు తమకు కూడా ఉపశమనం కావాలంటూ సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు. పైగా నళిని 31 ఏళ్లు పైగా జైలు జీవితాన్ని అనుభవించానని కాబట్లి ఇక తనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ పిటిషన్ పెట్టుకున్నారు. ఐతే 2015 నుంచి తమిళనాడు గవర్నర్ వద్దే పెండింగ్‌లో ఉంది. ఈ మేరకు నళిని తరుపు న్యాయవాది మాట్లాడుతూ...నళిని తనను విడుదల చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో తాము దీన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్ల పేర్కొన్నారు. పైగా 2018లోనే తమిళనాడు మంత్రి మండలి రాజీవ్ గాంధీ కేసులో దోషులను విడుదల చేయాలని గవర్నర్‌కి సిఫార్సు చేసిందని చెప్పారు. కానీ గవర్నర్ నిర్ణయం తీసుకోకుండా ఆ సిఫార్సును రాష్ట్రపతికి పంపించారని అన్నారు. ఐతే పెరారివాలన్‌కి సుప్రీం కోర్టు విడుదల మంజూరు చేసినప్పడూ నళిని, రవిచంద్రన్‌లు కూడా అతని తోపాటు సమానంగా ఈ కేసు నుంచి ఉపశమనం ఇవ్వాలని నళిని తరుఫు న్యాయవాది అన్నారు. వాస్తవానికి ఇదే కేసులోని మిగిలిన దోషులు నళిని, మురుగన్, సంతన్, రవిచంద్రన్, జయకుమార్, రాబర్ట్ పాయస్ల కేసును పరిశీలిస్తామని తమిళనాడు ప్రభుత్వం మే నెలలో పేర్కొంది. కానీ ఇంతవరకు ఆ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి, నళిని, రవిచంద్రన్‌లు మాత్రమే విడుదల కోసం సుప్రీం కోర్టుకి విజ్ఞప్తి చేసుకున్నారు. అయితే పెరారివాలన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ పై నిర్ణయం తీసుకోవడంలో గవర్నర్ ఆలస్యం చేయడంతో సుప్రీం కోర్టు అతని కేసుని పరిగణలోకి తీసుకుంది. పైగా మంత్రిమండలి సిఫార్సుకి కట్టుబడి ఉంటామంటూ, ఆర్టికల్ 142 కింద ప్రత్యేక అధికారాన్ని వినియోగించి ధర్మాసనం పెరారివాలన్‌ని విడుదల చేసింది కాని ఇదే విధానం మిగతా దోషులకు వర్తించకపోవచ్చు. (చదవండి: నళినికి నెల రోజుల పెరోల్) -
నటి కె.నళినికి జీవిత సాఫల్య పురస్కారం
దక్షిణ భారత చలనచిత్ర రంగానికి అందించిన విశేష కృషికి గాను ప్రముఖ నటి, కలైమామణి డాక్టర్ కె.నళినికి జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళా శక్తికి సెల్యూట్ చేస్తూ పక్వాన్ చెన్నై ఆధ్వర్యంలో 5వ వార్షిక రియలిస్టిక్ అవార్డ్స్ 2022 ప్రదానోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. పక్వాన్ చెన్నై నిర్వాహకులు సంజయ్ డాంగి, అనిల్ డాంగి మరియు హితేష్ కొఠారి నేతృత్వంలో విభిన్న రంగాలకు చెందిన మహిళల విజయాలను కొనియాడుతూ అవార్డులను అందజేశారు. ముఖ్య అతిథిగా చెన్నై కస్టమ్స్ జోన్ చీఫ్ కమిషనర్ ఎంవిఎస్ చౌదరి (చెన్నాల్ కస్టమ్స్ జోన్) పాల్గొని అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో ప్రము ఖ నటి కె.నళినికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. -
నళినికి నెల రోజుల పెరోల్
సాక్షి, చెన్నై: రాజీవ్‌హత్య కేసులో దోషి నళినికి నెల రోజులు పెరోల్ మంజూరైంది. ఈ కేసులో యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న ఏడుగురిలో నళిని ఒకరు. వీరిని ముందస్తుగా విడుదల చేయాలని తమిళనాడు కేబినెట్ 2018లో గవర్నర్‌కు సిఫారసు చేసినా రాజ్‌భవన్ నుంచి నిర్ణయం వెలువడలేదు. దాంతో గవర్నర్ అనుమతి లేకుండా తనను ముందస్తుగా విడుదల చేయాలని నళిని తదితరులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. అవి ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నళిని తరఫున తల్లి పద్మ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఆరోగ్యం సరిగాలేదని, ఈ దశలో కూతురు తనతో ఉండాలని కోరుకుంటున్నానని, పెరోల్ మంజూరు చేయాలని హైకోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ గురువారం న్యాయమూర్తులు వీఎన్ ప్రకాష్, ఆర్. హేమలత బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. నళినికి నెల రోజులు పెరోల్ ఇవ్వడానికి తమిళనాడు సర్కారు నిర్ణయించినట్టు ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నళినికి పెరోల్ మంజూరైంది. -
రాజీవ్‌గాంధీ హత్య కేసు: ఏడాది తర్వాత కలిశారు
వేలూరు: వేలూరు మహిళా సెంట్రల్ జైలులో మురుగన్, నళిని పటిష్ట పోలీస్ బందోబస్తు నడుమ ఏడాది తర్వాత శనివారం ఉదయం కలసి మాట్లాడుకున్నారు. రాజీవ్‌గాంధీ హత్య కేసులో వీరిద్దరు వేలూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే. కరోనా కారణంగా గత ఏడాది మార్చి నుంచి వీరు నేరుగా కలవకుండా ఫోన్ ద్వారా మాట్లాడుతున్నారు. ఏడా ది తర్వాత ప్రస్తుతం నేరుగా మాట్లాడేందుకు అనుమతించాలని నళిని న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీంతో జైళ్లశాఖ అనుమతితో మురుగన్‌ను పటిష్ట బందోబస్తు నడుమ మహిళా జైలు వద్దకు తీసుకొచ్చారు. ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. కలయిక అనంతరం మురుగన్‌ను పురుషుల జైలుకు తీసుకొచ్చారు. చదవండి: ఓటు వేయలేదని గునపాలతో దాడి -
జీవితానికి బందీలు వీళ్లిద్దరూ
పడని కష్టం లేదు ఫూలన్‌దేవి. ముప్పై ఏళ్లుగా జైల్లోనే నళిని. ఇద్దరివీ పోలికలేని జీవితాలు. ఆ.. ఒక పోలిక ఉంది!! వీళ్లను కన్నీళ్లు పెట్టించిందీ.. కరడు కట్టించిందీ అయినవాళ్లే. ఫూలన్‌ని తండ్రి అమ్మేశాడు. నళిని.. భర్తను నమ్మేసింది! జైలుకు కాదు.. జీవితానికి బందీలు వీళ్లిద్దరూ. పందొమ్మిదేళ్ల క్రితం ముప్పై ఏడేళ్ల వయసులో యూపీలోని మీర్జాపూర్ ఎంపీగా ఉన్నప్పుడు దుండగుల తుపాకీ గుండ్లకు బలైపోయారు ఫూలన్‌దేవి. అంతకు పదేళ్ల క్రితం తమిళనాడులో జరిగిన రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా తన ఇరవై రెండవ యేట నుంచీ జైల్లోనే ఉంది నళిని. ఈ ఇద్దరూ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. రావడానికి పెద్ద విశేషం కూడా ఏమీ లేదు నిజానికైతే! యూపీలో కాంగ్రెస్ రాజకీయ నాయకుడొకరు ఫూలన్ మరణించిన జూలై 25వ తేదీన ‘వీరాంగన ఫూలన్‌దేవి’ అని ట్వీట్ చేశారు. ఇరవై రెండు మంది అగ్రవర్ణాల వారిని నిలువునా కాల్చి చంపిన బందిపోటును వీరాంగన అనడం ఏమిటి అని ‘అగ్ర’హ జ్వాలలు రగిలాయి. నళిని కూడా పెద్దగా ప్రాముఖ్యానికి నోచుకోని ఒక కారణం వల్ల ఇటీవలే వార్తల్లోకి వచ్చి వెళ్లారు. జైల్లో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిందనీ, లేదు.. ఆత్మహత్య బెదిరింపుతో జైలు అధికారులను బ్లాక్మెయిల్ చేసిందనీ రెండు మాటలు వచ్చాయి. ఎక్కడా కలిసినవాళ్లు, ఏ విధంగానూ కలిపి చూడ్డానికి వీల్లేనివాళ్లూ.. ఫూలన్ దేవి, నళినీ. అయితే మోసపోవడం అన్నది ఇద్దరి జీవితంలోనూ ఉంది. ఫూలన్‌ని దేవిదిన్ నిషాద్ మోసం చేశాడు. నళినిని శ్రీహరన్ మోసం చేశాడు. నిషాద్ ఫూలన్ తండ్రి. శ్రీహరన్ నళిని భర్త. ఫూలన్ జీవితంలో అన్నీ పోరాటాలే. కాస్త పెద్ద మాటల్లో చెప్పాలంటే.. అణగారిన వర్గాల మహిళల సంక్షేమం కోసం పోరాటం. అగ్రవర్ణాల వారి దౌర్జన్యాలపై పోరాటం. సమాజంలోని అన్యాయాలు, అసమానతలపై పోరాటం. స్త్రీగా ఆమె పడిన కష్టాలే ఆమెను ‘వీరాంగన’ను చేశాయి. ఫూలన్‌ను పదహారేళ్ల వయసులో ఆమె పెదనాన్న కొడుకు ఆస్తి విషయమై అన్యాయంగా జైల్లో పెట్టించినప్పుడు మూడు రోజుల పాటు పోలీసులు ఆమెను చిత్రహింసలు పెట్టారు. చంబల్ లోయ బందిపోటు నాయకుడు ఆమెను అపహరించుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ముఠానాయకుల మధ్య చేతులు మారిన ప్రతిసారీ ఆమెపై లైంగిక దాడి జరిగింది. ఇవన్నీ కూడా ఆమె ఇరవయ్యవ యేటకే జరిగిపోయాయి. అన్నిటికన్నా ఆమె పడిన పెద్ద కష్టం పదకొండేళ్ల వయసులో! ఆ కష్టం తెచ్చిపెట్టింది బంధువులో, బందిపోట్లో, అగ్రవర్ణాల వారో కాదు. సొంత తండ్రి!! పుట్టీలాల్ అనే వ్యక్తికి ఫూలన్‌దేవిని అమ్మేశాడు. ధర.. ఒక ఆవు, ఒక సైకిల్. తల్లి నెత్తీనోరు మొత్తుకుంటుంటే తండ్రి ఆమెను కొట్టి ఒక మూలకు నెట్టేయడం చూస్తూనే ఉంది ఫూలన్. ‘‘ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తాం! కోసుకుంటామా!!’ అని తన గురించి అనడమూ వింటూనే ఉంది. అంతలోనే పుట్టీలాల్ వచ్చి ఫూలన్‌ని భుజాన వేసుకుని వెళ్లిపోయాడు. అతడి నుంచి పారిపోయి రావడంతో ఫూలన్ జీవితంలో పోరాటం మొదలైంది. అవును. ఆ వయసుకు పారిపోవడం కూడా పోరాటమే. అదీ ‘భర్త’అనే వింత జీవి నుంచి. బాధ్యత చూపని తండ్రి నుంచి. ‘నేనొక్కదాన్నే కాదు. ఇంకా చాలామందే ఉన్నారు నాలాంటి వాళ్లు’.. ఇదీ ఫూలన్.. తన బయోగ్రఫీ రాయడానికి 1983–94 మధ్య జైలుకు వచ్చి కలిసిన మాలాసేన్తో తొలిరోజు అన్నమాట. మాలాను పూలన్.. ‘దీదీ’అనేవారు. ఫూలన్ బతికి ఉంటే నళినికి ఇప్పుడు ఆమె ‘దీదీ’ అయి ఉండేవారేమో.. ఇరవై తొమ్మిదేళ్లుగా జైల్లో ఉన్న నళినిని విడిపించడానికి ఢిల్లీ నుంచి ఓ చిన్న పోరాటమో, పెద్ద ప్రయత్నమో చేసి. నళిని జీవిత చరిత్ర కూడా పుస్తకంగా వచ్చింది. ‘రాజీవ్ హత్య : హత్య వెనుక నిజాలు, ప్రియాంక–నళిని సమావేశం’ అనే ఆ పుస్తకాన్ని ఏకలైవన్ అనే రచయిత తమిళ్లో రాశారు. ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో అరెస్ట్ అయ్యే నాటికే నళిని రెండు నెలల గర్భవతి. శ్రీహరన్‌తో ప్రేమబంధం గురించి పుస్తకంలో ఉంది. అయితే ఒకటి మాత్రం వాస్తవం. శ్రీహరన్ ఒక ధ్యేయంతో నళిని ప్రేమించాడు. నళిని ఆ ప్రేమలో పడిపోయి, అతడితోపాటు విలువైన జీవితాన్ని జైలుపాలు చేసుకుంది. జైల్లోనే కూతుర్ని ప్రసవించింది. కూతురి పెళ్లి చేయడానికి పెరోల్ కోసం తిప్పలు పడింది. ఊహించని విధంగా శ్రీహరన్ ఆమె జీవితంలోకి ప్రవేశించి అంతా అస్తవ్యస్తం చేశాడు. అయితే ఇప్పటికీ ఆమె.. ‘‘రక్తాన్ని దాహంగొన్న తోడేళ్ల మధ్యలోకి మేము వెళ్లిపోయాము’’ అని అంటోందే తప్ప భర్తను, భర్త ప్రేమను తప్పుప ట్టడం లేదు! నళిని తల్లి పద్మావతి. మద్రాసులోని ఓ ఆసుపత్రిలో ఆమె నర్సుగా ఉన్నప్పుడు శ్రీలంక తమిళుడైన శ్రీహరన్ అద్దెకు ఇల్లు వెతుక్కుంటూ వచ్చి, వీళ్ల ఇంటి పక్కన చేరాడు. కొద్దిరోజుల తర్వాత ‘ఒంటి కన్ను’ శివరాసన్ వచ్చి శ్రీహరన్ రూమ్మేట్ అయ్యాడు. ఆ వెంటనే ‘థను’ (మానవబాంబు) వచ్చి చేరింది. ఇదంతా జరుగుతున్నప్పుడే నళిని, శ్రీహరన్ ప్రేమలో పడ్డారు. స్త్రీ జీవితంలోని కల్లోలానికి ప్రతీకలైన రెండు పేర్లు ఫూలన్, నళిని. నిన్న (ఆగస్టు 10) ఫూలన్ దేవి జయంతి. నళినికి జీవితంలో ఎప్పటికీ మరపునకు రాని రోజు మాత్రం మే 21. రాజీవ్ గాంధీ.. హత్యకు గురైన రోజు అది. -
వీడియో కాలింగ్‌కు అనుమతివ్వొచ్చుగా..!
సాక్షి, చెన్నై: విదేశాల్లో ఉన్న బంధువులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడేందుకు నళిని, మురుగన్‌లకు అనుమతి ఇవ్వవచ్చుగా అని కేంద్రానికి హైకోర్టు సూచించింది. ఈ విషయంగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దివంగత ప్రధాని రాజీవ్ గాంధి హత్య కేసులో నిందితుల విడుదలకు పట్టుబడుతూ సాగుతున్న న్యాయ పోరాటం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పరిస్థితుల్లో జైల్లో ఉన్న నిందితులు తీవ్ర మనో వేదనలో ఉన్నారని.. పెరోల్ ఇవ్వాలని కొన్ని పిటిషన్లు, తమ వాళ్లతో సంప్రదింపులకు అవకాశం ఇవ్వాలని మరికొన్ని పిటిషన్లు కోర్టుల్లో విచారణలో ఉన్నాయి. అదే సమయంలో తీవ్ర మానసిక వేదనకు గురైన నళిని గత వారం ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఈ పరిస్థితుల్లో నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్ ఒకటి సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయ స్థానం విదేశాల్లో ఉన్న బంధువులతో వీడియో కాల్ లేదా, ఆన్లైన్ ద్వారా మాట్లాడుకునేందుకు అనుమతి ఇవ్వవచ్చుగా అని కోర్టు కేంద్రానికి సూచించింది. నళిని, మురుగన్‌లు కుటుంబీకులతో మాట్లాడాలని, వారిని చూడాలన్న ఆశతో ఉన్నట్టుందని పేర్కొంటూ, ఈ విషయంగా వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. -
రాజీవ్ హంతకురాలు నళిని ఆత్మహత్యాయత్నం
సాక్షి, తమిళనాడు : మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితురాలు నళిని శ్రీహరన్ ఆత్మహత్యాయత్నం చేశారు. తమిళనాడులోని వేలురు జైలులో మంగళవారం ఉదయం ఆమె ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. విషయం గమనించిన జైలు సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఆమె ఈ చర్యకు పాల్పడటానికి కారణం తెలియరాలేదు. రాజీవ్ హత్య కేసులో దోషిగా తేలిన నళిని 29 ఏళ్లుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. బెయిల్ కోసం గతకొంత కాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తన కుమార్తె హరిత వివాహానికి ఆరు నెలలు పాటు పెరోల్‌పై విడుదలైన తిరిగి జైలుకు వెళ్లారు. రాజీవ్ హత్యకేసులో నళినితో పాటు ఆమె భర్త మురుగన్ సహా ఏడుగురు వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. గత 29 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న నళిని, సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపిన మహిళగా కూడా గుర్తింపు పొందారు. 1991, మే నెలలో ఎన్నికల ప్రచారం నిమిత్తం విశాఖ పట్నం నుంచి తమిళనాడులోని శ్రీ పెరుంబుదూర్‌కి వెళ్లిన రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ ఆత్మాహుతి దళ సభ్యులు బాంబు పేల్చి హతమార్చారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేయగా, అందులో నళిని ఒకరు. కాగా గతంలోనూ న్యాయస్థానం ఆమెకు ఒక్కరోజు పెరోల్ ఇచ్చింది. గత ఏడాది నళిని తండ్రి శంకర్ నారాయణన్ అంత్యక్రియల కార్యక్రమానికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. -
రాజీవ్ హత్యకేసులో దారులన్నీ మూతపడ్డట్లే..!
సాక్షి, చెన్నై: రాజీవ్ హత్య కేసు నిందితుల విడుదలకు దారులన్నీ మూసుకున్న నేపథ్యంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం వ్యాఖ్యలు ఎదురు చూపులకు దారితీశాయి. ఇందుకు తగ్గట్టుగా రాజ్‌భవన్ కార్యదర్శి ప్రభుత్వానికి లేఖ రాయడం గమనార్హం. రాజీవ్ హత్యకేసులో నింధితులుగా ఉన్న నళిని, మురుగన్, శాంతన్, పేరరివాలన్ సహా ఏడుగురి ఉరిశిక్ష యావజ్జీవంగా మారిన విషయం తెలిసిందే. శిక్షా కాలం ముగిసినా తాము జైలుకే పరిమితం కావడంతో విడుదల చేయాలని కోరుతూ నిందితులు కోర్టుల్ని ఆశ్రయిస్తూ వస్తున్నా ఫలితం శూన్యం. వీరి విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసినా, అది రాజ్‌భవన్‌కే పరిమితమైంది. తమను విడుదలచేసే రీతిలో గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వాలని మళ్లీ కోర్టు తలుపులు తట్టినా ప్రయోజనం శూన్యం. చివరకు బంతి రాజ్ భవన్ కోర్టులో పడింది. ఈ వ్యవహారంలో గవర్నర్ భన్వారిలాల్ పురోహిత్ ఇచ్చే నివేదిక మీద ఆధారపడి ఉంది. అదే సమయంలో శిక్షాకాలం ముగిసినా, జైలులోనే జీవితాలు మగ్గుతున్నాయంటూ నళిని దాఖలు చేసుకున్న పిటిషన్ హైకోర్టు న్యాయమూర్తులు సుబ్బయ్య, పొంగియప్పన్ బెంచ్ ముందుకు గత నెల విచారణకు వచ్చింది. ఈ సమయంలో కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ రాజగోపాల్ కోర్టుకు ఇచ్చిన వివరణ సర్వత్రా షాక్‌కు గురిచేసింది. తమిళనాడు ప్రభుత్వ తీర్మానాన్ని కేంద్రం ఎప్పుడో తిరస్కరించినట్టు వివరించారు. ఆ తీర్మానం విలువను ‘సున్న’గా పరిగణించాలని వాదించడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమ తీర్మానం గురించి నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌కు సిఫారసు చేసి ఉన్నట్టుగా పేర్కొనడంతో విచారణను ముగించే విధంగా, రాజీవ్ హంతకుల ఆశలు అడియాశలు అయ్యే రీతిలో కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. ఇక వీరి విడుదలకు అన్నిదారులు మూసుకున్నట్టే అన్నది స్పష్టం కావడంతో తమిళాభిమాన సంఘాలు, ఈలం మద్దతు సంఘాలు, పార్టీలు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసే పనిలో పడ్డాయి. మంత్రి వ్యాఖ్యలతో కాస్త ఊరట నళిని పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో ఇతర నింధితులు వేర్వేరుగా దాఖలు చేసుకున్న పిటిషన్లన్నీ ఒకదాని తర్వాత మరొకటి మున్ముందు రోజుల్లో తిరస్కరించే అవకాశాలు ఎక్కువే అన్న సంకేతాల నేపథ్యంలో న్యాయశాఖామంత్రి సీవీ షణ్ముగం వ్యాఖ్యలు ఎక్కడో కాస్త ఊరట కల్గించేలా ఉండడం గమనార్హం. అసెంబ్లీలో కొంగు ఇలంజర్ పేరవై ఎమ్మెల్యే తనియరసు సందించిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రమంలో న్యాయశాఖా మంత్రి సీవీ షణ్ముగం స్పందించారు. ఏడుగుర్ని విడుదల చేయాలన్న తపనతో తామూ ఉన్నామని, ఇందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారం గవర్నర్ చేతిలో ఉందని, తాము ఇప్పటికే నిర్ణయం తీసుకునేందుకు తగ్గట్టుగా సిఫారసులు చేసి ఉన్నామని వివరించారు. చదవండి: ఏంటయ్యా ఇంట్లోనే కూర్చోమంటున్నారు! రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ కార్యదర్శికి లేఖ కూడా రాసినట్టు పేర్కొన్నారు. ఇందుకు రాజ్ భవన్ నుంచి గవర్నర్ కార్యదర్శి సమాధానం పంపించి ఉన్నారని వివరించారు. రాజీవ్ హత్య కేసు, కుట్ర విషయంగా సీబీఐ, ఐబీలతో పాటుగా పలు విచారణ బృందాలతో పర్యవేక్షణ కమిటీ నియమించి ఉన్నట్టు ప్రకటించారు. ఆ కమిటీ కోర్టుకు ఇచ్చే నివేదిక మేరకు తదుపరి ప్రభుత్వ సిఫారసు మీద నిర్ణయం తీసుకుంటామని ఆ లేఖలో పేర్కొని ఉన్నారని మంత్రి ప్రకటించడంతో ఈ నివేదిక ఎలా ఉంటుందో, ఈ దారి రూపంలో నైనా వారి విడుదలకు మార్గం లభించేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి. -
రాజీవ్ హత్య: గవర్నర్‌నే సాగనంపే యత్నం
సాక్షి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకుల విడుదల కోసం ఏకంగా రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్‌నే సాగనంపే ప్రయత్నం న్యాయస్థానంలో బెడిసికొట్టింది. సదరు పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు కొట్టివేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. రాజీవ్‌గాంధీ హత్యకేసులో నళిని, మురుగన్, పేరరివాళన్, రాబర్ట్‌పయాస్, జయకుమార్, శాంతన్, రవిచంద్రన్.. ఈ ఏడుగురు ఖైదీలు వేలూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. వీరికి తొలుత పడిన ఉరిశిక్ష యావజ్జీవ శిక్షగా మారింది. యావజ్జీవ ఖైదీలుగా 28 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్నారు. వారిని విడుదల చేయాలని కోరుతూ గతంలో కొందరు వేసిన పిటిషన్‌కు సుప్రీంకోర్టు సానుకూలంగా ఒకింత స్పందించింది. ఖైదీల విడుదల అంశంపై తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ విచక్షణకు వదిలేసింది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉండగానే ఈ పరిణామాలు చోటుచేసుకోగా వారి విడుదలకు అనుకూలంగా అసెంబ్లీలో ఆమె తీర్మానం చేశారు. సదరు ఫైల్‌ను సుమారు నాలుగేళ్ల క్రితమే గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపారు. రాష్ట్రంలోని అనేక రాజకీయ పార్టీలు రాజీవ్ హంతకుల విడుదల కోసం పట్టుబట్టాయి. ప్రభుత్వ ఉదాసీనత వల్లే విడుదలలో జాప్యం చోటుచేసుకుందని ఆక్షేపించాయి. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి సైతం 2018 సెప్టెంబర్ 9వ తేదీన అసెంబ్లీలో మరోసారి తీర్మానం చేసి గవర్నర్ బంగ్లాకు పంపారు. ఈ దశలో రాజీవ్‌గాంధీతో పాటు మరణించిన వారి కుటుంబాల ఖైదీల విడుదలకు అభ్యంతరం తెలుపుతూ గవర్నర్‌కు వినతిపత్రాలు పంపారు. ఇది కేవలం రాజీవ్‌గాంధీ, ఖైదీల కుటుంబాలకు చెందిన అంశం కాదు ఇంటి పెద్ద మరణంతో తామంతా కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందనే వాదన లేవనెత్తారు. ఈ దశలో గవర్నర్ న్యాయశాస్త్ర నిపుణులను రాజ్‌భవన్‌కు పిలిపించుకుని చర్చించారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రిత్వ శాఖను సంప్రదించారు. సుమారు రెండున్నరేళ్లపాటు గవర్నర్ అనేక విడతలుగా రాజీవ్ హంతకుల విడుదల అంశంపై సమీక్షలు జరిపారు. ఆ తరువాత నుంచి నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. రాజీవ్ హంతకుల విడుదలపై గవర్నర్ ఔనని..కాదని..ఏ విషయాన్ని ప్రకటించక పోవడంతో రెండేళ్లకు పైగా ప్రతిష్టంభన నెలకొంది. ఏడుగురు ఖైదీల విడుదల విషయం దాదాపూ మూలపడిందనే చెప్పవచ్చు. గవర్నర్‌ను రీకాల్ చేయాలంటూ పిటిషన్ అసెంబ్లీ మంత్రివర్గ తీర్మానానికి అనుగుణంగా వ్యవహరించాల్సిన గవర్నర్ భన్వారీరాల్ రాజ్యాంగాన్ని ధిక్కరించినందున అతడిని రీకాల్ చేసేలా కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ చెన్నై కున్రత్తూరుకు చెందిన తందైపెరియార్ ద్రావిడ కళగం కాంచీపురం జిల్లా అధ్యక్షుడు కన్నదాసన్ ఇటీవల మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ వివరాలు.. ముఖ్యమంత్రి నియామకం మినహా ఇతర వ్యవహారాల్లో గవర్నర్ స్వతంత్య్రంగా వ్యవహరించేందుకు వీలులేదని రాజ్యాంగం 356 (1)లో పేర్కొని ఉంది. గతంలో బీజేపీ నేతగా, ఆర్ఎస్ఎస్ సానుభూతిపరునిగా ఉండిన భన్వారీలాల్.. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను వ్యతిరేకించే తమిళులపట్ల తన అయిష్టతను బహిరంగా చాటుకుంటున్నారు. అందుకే మంత్రివర్గ తీర్మానంపై 15 నెలలుగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాజ్యాంగశాసనాలను ధిక్కరించే విధంగా భన్వారీలాల్ వ్యవహరిస్తున్నందున న్యాయస్థానం జోక్యం చేసుకుని గవర్నర్ బాధ్యతల నుంచి ఆయనను తప్పించేలా ఉత్తర్వులు జారీచేయాలని ఆయన తన పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ విచారణకు అర్హమైనది కాదని న్యాయమూర్తులు సత్యనారాయణన్, హేమలతతో కూడిన ధర్మాసనం పేర్కొంది. మంత్రివర్గం చేసిన తీర్మానాలపై నిర్ణయం తీసుకునేందుకు గవర్నర్‌కు గడవు అంటూ ఉండదని గతంలోనే కోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. రాష్ట్రపతిచే నియమితులైన గవర్నర్‌ను పదవి నుంచి తొలగించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖను ఆదేశించలేమని వివరిస్తూ సదరు పిటిషన్‌ను శుక్రవారం కోర్టు కొట్టివేసింది. -
బార్బీలకు న్యూ లుక్
కొత్త సంవత్సరంలో కొత్త కొత్త ప్రొఫెషన్లలో బార్బీడాల్స్ కనిపించబోతున్నాయి! మెరైన్ బయాలజిస్ట్, ఆస్ట్రోఫిజిసిస్ట్, ఫొటోజర్నలిస్ట్, కన్సర్వేషనిస్ట్, ఎంటోమాలజిస్ట్ బార్బీలను డిజైన్ చేయడం కోసం ఆ బొమ్మల తయారీ సంస్థ.. నిజ జీవితంలోని సంబంధిత వృత్తి నిపుణుల సలహాలను తీసుకుంటున్నాయి. చూడగానే ఫలానా ప్రొఫెషన్ అని పిల్లలు గుర్తుపట్టే వి«ధంగా ఈ బార్బీలు ఉంటాయి. భారతీయ సంతతికి చెందిన ఫారెస్ట్ ఎకాలజిస్ట్ నళినీ నాదకర్ణి.. ‘సైంటిస్ట్ ఎక్స్‌ప్లోరర్’ (అన్వేషించే శాస్త్రవేత్త) బార్బీని డిజైన్ చేసేందుకు ఆ సంస్థకు తోడ్పడుతున్నారు. ఆరేళ్ల తన కుమార్తె తనకు సైంటిస్ట్ బార్బీ కావాలని కోరినప్పుడు సైటిస్ట్ అని గుర్తుపట్టేందుకు అవసరమైన డిజైనింగ్ గురించి అప్పటినుంచే ఆమె ఆలోచిస్తూ ఉండగా ఇప్పుడీ అవకాశం వచ్చింది. అమ్మే స్వయంగా డిజైన్ చేసిన బార్బీ కొద్ది రోజుల్లోనే కూతురి చేతుల్లోకి రాబోతోందన్న మాట. -
నళిని ప్రాణాలతో ఉందా.. చంపేశారా..?
నళిని 2017 నుంచి కన్పించడం లేదు. ఆమెను ఆ సీఐ చంపేసి ఆనవాళ్లు కనుక్కోకుండా శవాన్ని కూడా కాల్చేశాడని ఆమె భర్తతో పాటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఆమె ఏమైనట్లు.. ప్రాణాలతో ఉందా.. ఉంటే ఎక్కడుంది.. లేదంటే వారు చెప్పినట్లు చంపేశారా? దీనికి కారకుడైన ఆ సీఐకి తెలుగుదేశం పార్టీ పెద్దల అండదండలు ఉండటంతో గత ప్రభుత్వంలో పోలీసులు ఈ కేసును తొక్కి పెట్టారని వారి ఆరోపణ. ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డిపై తమకు సంపూర్ణ నమ్మకం ఉందని ఆయనను కలిసి మా గోడు చెప్పుకుటామని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇంతకీ ఎవరా నళినీ... ఏమిటా మిస్టరీ..? సాక్షి, కదిరి: కదిరి పట్టణానికి చెందిన రిటైర్డ్ హెల్త్ ఉద్యోగి కె.శ్రీరాములు భార్య నళిని. వీరికి డిగ్రీ పూర్తి చేసుకున్న సందీప్, అశోక్ అనే ఇద్దరు కుమారులున్నారు. సజావుగా సాగుతున్న వారి కాపురంలో ఆమెకు ఓ సీఐ పరిచయమైన తర్వాత గొడవలు మొదలయ్యాయి. భర్తతో కలిసి ఉన్నప్పుడే ఆమె తన భర్త నుంచి తనకు ప్రతి నెలా భరణం ఇప్పించాలని 2013 నవంబర్‌లో కదిరి కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు ఆమెకు ప్రతి నెలా రూ.3 వేలు ఇవ్వాలని ఆదేశించడంతో అలాగే ఇస్తూ వచ్చాడు. తనతో కలిసి ఉండగానే ఆమె ఇలా చేయడమేంటని ఆయన 2016 ఆగస్టులో పదవీ విరమణ అనంతరం భార్యకు దూరంగా ఉంటూ పెద్ద కుమారుడు సందీప్‌తో కలిసి అనంతపురానికి కాపురం మార్చేశాడు. దీంతో ఆమె తన చిన్న కొడుకు అశోక్‌తో కలిసి కదిరిలోనే ఉండేది. చిన్న కొడుక్కు బెంగుళూరులో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లిపోయాడు. తరచూ వచ్చి తల్లిని చూసి వెళ్లేవాడు. తిరుపతికని వెళ్లి తిరిగి రాలేదు 2017 మార్చి 14న అశోక్‌కు తల్లి నళిని ఫోన్ చేసి ‘నాకు ఆరోగ్యం బాగాలేదు. కిడ్నిలో రాళ్లు ఉన్నాయని డాక్టర్ చెప్పారు. తిరుపతికి వెళ్లి అక్కడ పెద్ద డాక్టర్ల దగ్గర చూపించుకొని వస్తాను’ అని చెప్పడంతో సరేనన్నాడు. ఆ తర్వాత తల్లి దగ్గర నుంచి ఎటువంటి ఫోన్లు రాకపోవడంతో కదిరికి వచ్చి వెదికాడు. చేసేది లేక నాన్నతో పాటు అన్న సందీప్‌కు విషయం తెలియజేశాడు. వారు వెంటనే తిరుపతికి వెళ్లి ఆసుపత్రులన్నీ విచారించారు. ఎక్కడా వైద్యం చేయించుకోలేదని నిర్ధారించుకొన్నాక 2017 ఏప్రిల్ 29న అశోక్ తన తల్లి నళిని కన్పించడం లేదంటూ కదిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు(క్రైం.నెం134/17)నమోదు చేశారు. గంగమ్మ మోరీ వద్ద గుర్తు తెలియని శవం తమ తల్లి ఆచూకీ ఏమైందంటూ అశోక్‌తో పాటు అన్న సందీప్, నాన్న శ్రీరాములు కలిసి ఓ రోజు కదిరి పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అడిగారు. దీంతో అక్కడున్న పోలీసు అధికారులు 2017 మార్చి 9వ తేదీన కదిరి మండలం ఎర్రదొడ్డి వద్ద ఓ మహిళను ఎవరో చంపేసి గుర్తు పట్టకుండా శవాన్ని కాల్చేశారని చెప్పారు. ఆమెకు సంబందించిన చెవి కమ్మలు, కాలి గొలుసులు, ఇతర ఆనవాళ్లు చూపెట్టడంతో ఆమె తమ తల్లే అని ఇద్దరు కొడుకులతో పాటు ఆమె భర్త కూడా పోలీసుల ఎదుట పేర్కొన్నారు. డీఎన్ఏ పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఆమె కుమారుడు అశోక్ బ్లడ్ శాంపిల్స్‌కు అవి సరిపోవడం లేదంటూ డీఎన్ఏ నివేదికలో వచ్చింది. మరి నళిని ఏమైనట్లు..? ఆనవాళ్లను బట్టి గంగమ్మ మోరీ దగ్గర చనిపోయింది తమ తల్లే అని ఆమె కుమారులు చెబుతున్నప్పటికీ డీఎన్ఏ రిపోర్ట్‌లో అందుకు విరుద్ధంగా రావడంతో ఎవరికైనా అనుమానం కలగక తప్పదు. అయితే నళిని భర్త ఓసారి నేరుగా హైదరాబాద్‌కు వెళ్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో విచారించగా పోలీసులు పంపిన శరీర భాగాలు మహిళవి కావని, అవి పురుషుడికి సంబంధించినవి కావడంతోనే మీ కుమారుడి రక్త నమూనాలతో సరిపోవడం లేదని అసలు విషయం చెప్పారు. దీంతో ఆయన అనుమానం నిజమైంది. ఆమెకు ఓ సీఐతో వివాహేతర సంబంధం ఉందని, ఆయన చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వారి ఒత్తిడి కారణంగా అప్పట్లో ఆ కేసును నీరు గార్చేశారని నళినీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ సీఐ చంపేశాడు చిత్తూరు జిల్లా పుత్తూరు (ప్రస్తుతం తిరుమల సీసీఎస్)సీఐగా ఉండే డి.కొండయ్యకు నా భార్య నళినితో కొనేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఆమె తిరుమల శ్రీవారి సన్నిధిలో సేవ పేరుతో ప్రతి నెలా 10, 15 రోజులు వెళ్లేది. మాకు అప్పుడు అనుమానం రాలేదు. నళినీ 2017 మార్చి 9 నుంచి కన్పించడం లేదు. అదే రోజు కదిరి మండలం ఎర్రదొడ్డి గంగమ్మ మోరీ వద్ద ఓ మహిళను చంపేసి శవాన్ని కూడా కాల్చేశారు. ఆమే నా భార్య అని ఆనవాళ్లను బట్టి నేను గుర్తించాను. అయితే ఆమె చనిపోయిన తర్వాత కూడా 6 నెలల పాటు ఆమె వాడుతున్న ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లో అతను అఫీషియల్ సిమ్ వేసుకొని ఉపయోగించాడు. ఆమె వాడుతున్న బీఎస్ఎన్ఎల్ నెం.94928 92028తో పాటు జియో నెం.83091 45636 నుంచి నా సెల్(నెం.94911 64082)కు 2017 ఏప్రిల్ 22న ఉదయం 10.24 గంటలకు 11 మిస్డ్ కాల్స్ వచ్చాయి. తర్వాత ఫోన్ లిఫ్ట్ చేస్తే ‘నా పేరు సుధాకర్‌రెడ్డి. మాది పులివెందుల. నేను నీ పెళ్లాం నళినీ పెళ్లి చేసుకొని బెంగుళూరులో కేఆర్ పురంలోని ఐశ్వర్య అపార్ట్మెంట్లో ఉన్నాము. మా కోసం ఆరా తీశావో నీ కొడుకులు ఇద్దరినీ చంపేస్తాను’ అని బెదిరించాడు. ఈ విషయం అప్పటి జిల్లా ఎస్పీకి 2017 ఏప్రిల్ 24న రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశాను. తర్వాత తాను సీఐనని కూడా ఫోన్ చేసి చెబుతూ మళ్లీ బెదిరించాడు. నా భార్య కేసు ఏమైందంటూ అప్పటి నుంచి ఇప్పటి వరకూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నందున ఆ సీఐకి ఆ పార్టీ పెద్దల అండదండలు ఉన్నాయి. అందుకే ఆ కేసు ముందుకు సాగలేదని మేము భావిస్తున్నాము. త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి మా బాధ చెప్పుకుంటాం. మాకు న్యాయం చేసి, ఖాకీ ముసుగులో ఉన్న ఆ నేరస్థుడిని పట్టుకొని శిక్షించాలని కోరతాం. – నళినీ భర్త శ్రీరాములు -
కూతురి పెళ్లి కోసం
నళినీ శ్రీహరన్ పెరోల్‌ను మద్రాస్ హైకోర్టు పొడిగించింది. కూతురు పెళ్లి ఏర్పాట్లు చూసుకోవడం కోసం తనను విడుదల చేయాలని నళిని చేసిన విజ్ఞప్తి మేరకు కోర్టు ఆమెకు నెల రోజుల సమయాన్ని ఇస్తూ, జూలై 25న విడుదల చేసింది. ఆ గడువు ముగిసినప్పటికీ పెళ్లి పనులు పూర్తి కాకపోవడంతో కోర్టు మరో మూడు వారాల సమయాన్ని నళినికి మంజూరు చేసింది. దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో నళిని ఇరవై ఐదేళ్లకు పైగా జైలు శిక్షను అనుభవిస్తున్నారు. -
నళిని కుమార్తె ఇండియా రాకలో ఆలస్యం
వేలూరు: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసు ముద్దాయి నళిని నెల పెరోల్‌పై వచ్చి వేలూరు సమీపంలోని సత్‌వచ్చారిలో ఉంటున్నారు. గత నెల 20న వేలూరు రంగాపురంలోని పులవర్ నగర్లో ద్రావిడ సిద్ధాంతాలకు చెందిన తమిళ పేరవై రాష్ట్ర జాయింట్ కార్యదర్శి సింగరాయర్ ఇంటిలో ఉంటున్న విషయం తెలిసిందే. ఇదిలాఉండగా కోర్టు నిబంధన మేరకు నళిని ప్రతిరోజూ ఉదయం సత్‌వచ్చారిలోని పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేస్తున్నారు. నళిని కుమార్తె హరిద్ర వివాహ ఏర్పాట్ల కోసం పెరోల్‌పై బయటకు వచ్చిన నళినితో ఆమె తల్లి పద్మ కూడా ఉంటున్నారు. ఈ సందర్భంగా నళిని తల్లి పద్మ మాట్లాడుతూ మనవరాలు హరిద్ర వివాహ ఏర్పాట్లు చేసేందుకు నళిని బయటకు వచ్చారని నెల రోజుల్లోనే మనుమరాలికి నలుగురిని ఎంపిక చేశామని హరిద్ర ఇండియాకు వచ్చిన వెంటనే నలుగురి ఫొటోలను చూపించి నిర్ణయించనున్నామన్నారు. లండన్‌లో ఉన్న హరిద్రకు సెప్టెంబర్ దాకా పరీక్షలు ఉన్నందున ఇండియాకు రావడంలో ఆలస్యం అవుతోందన్నారు. పరీక్షలు అయిన వెంటనే ఈమె తమిళనాడుకు రానున్నారని తెలిపారు. మరో నెల రోజుల పాటు పెరోల్ ఇవ్వాలని నళిని న్యాయవాది ఆధ్వర్యంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నామన్నారు. పెరోల్ పొడిగింపుపై జైలు అధికారులు మాట్లాడుతూ ఇప్పటికే నళినికి కోర్టు నెల పెరోల్ ఇచ్చిందని పొడిగించాలా వద్దా అనే దానిపై కోర్టు నిర్ణయించాల్సిన ఉందన్నారు. కోర్టు పెరోల్ పొడిగించకుంటే ఈనెల 25న సాయంత్రం 5 గంటలలోపు నళిని వేలూరు మహిళా జైలుకు రావాలని తెలిపారు. -
ఇంతకూ వైద్యం సేవా.. వ్యాపారమా?
కార్పొరేట్ వైద్యం రాజ్యమేలుతూ ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ప్రాథమిక ఆరోగ్య సేవలు నత్తనడకతో సాగుతున్న పరిస్థితిని సరిచేయడానికి ఫ్యామిలీ మెడిసిన్ ప్రాముఖ్యతని అన్ని దేశాలూ గుర్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ వైద్య కమిషన్ బిల్లు ప్రజా వ్యతిరేకత లక్ష్యంతో ఉంది. ఈ కమిషన్ సూచించే నియంత్రణలన్నీ ప్రభుత్వ కళాశాలలకి మాత్రమే వర్తిస్తాయి. అలాంటప్పుడు సమానత్వం ఎక్కడిది? ఒకే రకమైన, నాణ్యమైన విద్య ఎక్కడిది? ప్రైవేట్ వైద్యకళాశాలలు, డీమ్డ్ యూనివర్సిటీల్లో 15 శాతం సీట్లు యాజమాన్యం చేతిలో ఉండగా ఇప్పుడు ఈ బిల్లులో దాన్ని 50 శాతానికి పెంచడం పేదలకు ఎలా ఉపకరిస్తుంది? అందుకే ఇది ‘ప్రజా వ్యతిరేక, పేదల వ్యతిరేక బిల్లు’ మాత్రమే. మన వైద్య రంగాన్ని నిర్వీర్యపరిచే ఇలాంటి బిల్లులు సమానత్వాన్ని చాటలేవు. వైద్యాన్ని మొత్తంగా ప్రభుత్వపరం చేసి, ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరిచే విధానాలు మాత్రమే ప్రజల ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కాపాడగలవు. మన కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జాతీయ వైద్య కమిషన్ బిల్లు (ఎన్.ఎం.సి. బిల్) అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. అందుకే దేశవ్యాప్తంగా వైద్యరంగ నిపుణులు, వైద్య విద్యార్థులు తమ నిరస నని తెలుపుతున్నారు. 1956 నాటి భారతీయ మెడికల్ కౌన్సిల్ యాక్ట్‌ని రద్దు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎం.సి.ఐ.లో అవినీతి పేరుకు పోయినందుకు, దాన్ని రద్దుచేసి, వైద్యవిద్య, ఆరోగ్య రంగాల్లో ఈ కొత్త నియంత్రణలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. దీని ద్వారా దేశానికి అవసరమైన ఉన్నతస్థాయి వైద్యులని అందించవ చ్చని, అత్యాధునిక పరిశోధనని అమలు చేయవచ్చని, వైద్య కళాశాలలపై క్రమబద్ధమైన పర్యవేక్షణ వీలవుతుందని, సమస్యల పరిష్కా రానికి తగిన వేదిక ఏర్పడుతుందనీ ప్రభుత్వం వాదిస్తోంది. కానీ అవినీతి లేనిదెక్కడ? అవినీతిని రూపు మాపడం కోసం ఈ కొత్త కమిషన్ని ఏర్పాటు చేయాలని చెప్పే అమాత్యుల్లో ఎంతమంది లంచగొండులున్నారు? ఐదేళ్ల పరిపాలనా కాలంలో వారి ఆస్తులు ఎంత పెరిగాయో లెక్కలు తీసి ఫాస్ట్ కోర్టులకి అప్పగించాలని జస్టిస్ చలమేశ్వర్ సూచించారు. 34 శాతం కొత్త ఎంపీల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రజాస్వామిక సంస్కరణల సంస్థ (ఏడీఆర్) నిర్ధా రించింది. డాక్టర్లు ఎన్నుకున్న ఎంసీఐలో 120 మంది సభ్యులు ఉంటారు. వీరిలో కొందరు అవినీతిపరులున్నారనే నెపంతో ఆ సంస్థనే రద్దు చేస్తే, మరి పై అంచనాల ప్రకారం అసెంబ్లీలు, పార్ల మెంట్లు ఏమవ్వాలి? ఈ కమిషన్ సూచించే నియంత్రణలన్నీ ప్రభుత్వ కళాశాలలకి మాత్రమే వర్తిస్తాయి. అలాంటప్పుడు సమా నత్వం ఎక్కడిది? ఒకే రకమైన, నాణ్యమైన విద్య ఎక్కడిది? ప్రైవేటు కళాశాలలకి నియమ నియంత్రణలు ఉండవు. తనిఖీలు ఉండవు. నామమాత్రపు అనుమతితో కాలేజీ పెట్టవచ్చు. సీట్లు పెంచుకో వచ్చు. దాదాపు 80 మంది ఎంపీలకు ప్రైవేటు వైద్య కళాశాలలతో సంబంధాలున్నాయి. వాటి యజమానులుగానో, ట్రస్టీలుగానో, మేనే జింగ్ భాగస్వాములుగానో వాటిలో వారి ప్రమేయం ఉంది. అందుకే నియంత్రణలో ఈ పక్షపాత వైఖరి. ప్రైవేటు వైద్య కళాశాలలు 90వ దశకం తర్వాత విపరీతంగా పుట్టుకొచ్చాయి. వాటిని నియంత్రించి, ప్రమాణాలకి చేరని వాటిని రద్దుచేసి, మిగిలిన వాటిని ప్రభుత్వపరం చేయాలి. అప్పుడు నియం త్రణ సజావుగా, సమానంగా ఉంటుంది. అంతేగానీ, హెచ్చుతగ్గు లను అలాగే ఉంచి, సమానత్వం ఎలా సాధిస్తారు? ప్రస్తుతం ప్రైవేటు కళాశాలల్లో, డీమ్డ్ యూనివర్సిటీల్లో 80 శాతం సీట్ల ఫీజుని ప్రభుత్వం నిర్ణయిస్తుంటే, 15 శాతం సీట్లు ప్రైవేటు కాలేజీ చేతిలో ఉండేవి. ఇప్పుడు ఈ బిల్లులో దాన్ని 50 శాతం చేశారు. ఇది పేదలకి ఎలా ఉపకరిస్తుంది? అందుకే దీన్ని ‘ప్రజా వ్యతిరేక, పేదల వ్యతిరేక బిల్లు’గా డాక్టర్లు అభివర్ణిస్తున్నారు. గామీణ ప్రాంతాల్లో డాక్టర్లని పెంచే దిశగా ఈ బిల్లుని ఏర్పరిచామని చెప్పే ప్రభుత్వం ఇలా ధని కులకి కోటాని పెంచి, పేదలకి అవకాశాలు తగ్గించేస్తోంది. కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్లుగా కొందరికి లైసెన్స్ ఇచ్చే అధి కారం ఈ కమిషన్‌కి ఉంది. ఈ మధ్యస్థాయి ప్రాక్టీషనర్ల స్థాయి ఏమిటనేది స్పష్టం చేయడం లేదు. కానీ వారు ప్రాథమిక వైద్య స్థాయిలో కొన్ని మందులు వాడవచ్చని ప్రతిపాదించారు. ఎంబీబీఎస్ కాని వారికి ఆరు నెలల బ్రిడ్జి కోర్సు కలిగించి వారిని గ్రామీణ డాక్టర్లుగా గుర్తించే ప్రతిపాదనని అందరూ అడ్డుకోగా, ఇప్పుడు మాటలు మార్చి, అదే ప్రతిపాదనని దొడ్డితోవన తీసుకొచ్చి, నకిలీ డాక్టర్లకి అవకాశం కల్పిస్తున్నారు. అల్లోపతి డాక్టర్లు పల్లెలకు పోవడం లేదని, పల్లెల్లో ఆరోగ్య వ్యవస్థని పటిష్టం చేయడం కోసం ఈ చర్య తప్పదని అంటున్నారు. మనం ప్రతి ఏటా 60 వేల మంది డాక్టర్లని తయారు చేస్తున్నాం. వారిలో కొద్దిమందికి మాత్రమే కాంట్రాక్టు ఉద్యోగాలు దొరుకుతున్నాయి. మిగిలినవారు పల్లెలకి పోతామని, దానికి తగిన వసతులు కల్పించమని, జీతాలు తగినట్టు ఇవ్వమని చెబుతూ కొన్ని సౌకర్యాలు ఇవ్వమని కోరుతున్నారు. కానీ ఈ నిరు ద్యోగుల మొర ఆలకించకపోగా, నిపుణులని పక్కకి నెట్టి, అరకొర వైద్యం తెలిసిన వారిని అందలం ఎక్కించి ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. ఏ రంగానికి ఆ రంగాన్ని వృద్ధి చేయకుండా, అడ్డదారిలో వైద్యాన్ని ప్రవేశపెడితే, ఆయుష్ విద్యార్థులు మాత్రం తమ ప్రమాణాలని ఎలా పెంచుకోగలరు? వైద్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచి, ప్రభుత్వ వైద్య సంస్థల ప్రమాణాలని పెంచి, అల్లోపతి డాక్టర్ల నియామకాలను పెంచితే సమస్య పరిష్కారం అవుతుంది కానీ ఇలా చిట్కాలతో సమస్య తీరదు. నిజానికి మనకి డాక్టర్ల కొరత లేదు. స్పెషలిస్టుల కొరత ఉంది. పీజీ సీట్లు పెంచి, వారి నైపుణ్యాన్ని పెంచి, వారిని ప్రభుత్వ రంగంలో నిలిపి ఉంచుకోగలిగితే వైద్య రంగం పురోగమిస్తుంది. కానీ అన్ని రంగాల్లో లాగానే వైద్య రంగంలో కూడా కార్పొరేట్లకి రాయితీలు ఇస్తూ ప్రాథమిక వైద్య సేవలని దెబ్బ తీస్తున్నారు. మన దేశంలో ప్రాథమిక ఆరోగ్య విధానం దిగజారిపోతోంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచే విధానాలు అంటువ్యాధులని నియం త్రించే ప్రాథమిక సూత్రాలు అడుగంటిపోతున్నాయి. జీవన విధాన మార్పులతో వచ్చే వ్యాధులకి మాత్రమే ప్రాధాన్యతనిచ్చే కార్పొరేట్ వైద్యం రాజ్యమేలుతోంది. ప్రజల జీవన ప్రమాణాలని పెంచే ప్రాథ మిక ఆరోగ్య సేవలు నత్తనడకన సాగుతున్నాయి. దీన్ని సరిచేయ డానికి ఫ్యామిలీ మెడిసిన్ ప్రాముఖ్యతని అన్ని దేశాలూ గుర్తిస్తు న్నాయి. కానీ మన దేశంలో మాత్రం ఈ నిపుణుల సేవలని అంది పుచ్చుకోవడంలో విఫలం అవుతున్నాం. అన్ని వయసుల వారిని, అన్ని ప్రాథమిక వ్యాధులని పరీక్షించగల నైపుణ్యంగల ఈ డాక్టర్లని, ఈ రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ప్రాథమిక వైద్య కేంద్రాల్లో వీరి సేవలను ఉపయోగిస్తే ప్రాథమిక స్థాయిలో ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఏ వృత్తికి ఆ వృత్తి స్వయం నిర్ణయాధికార హక్కు ఉండాలి. అలా వైద్య వృత్తిని వైద్యులు నియంత్రించాలిగానీ ప్రభుత్వాలు కాదు. ప్రైవేటు కళాశాలలని ప్రభుత్వపరం చేయడానికి బదులు వారికి 50 శాతం సీట్ల ఫీజులపై పెత్తనాన్ని అప్పగించడం సమా నత్వం ఎలా అవుతుంది? వైద్య విద్యని మేధ కాక డబ్బు నియంత్రిస్తే నీట్ ఎందుకు? నెక్ట్స్ ఎందుకు? కష్టపడి చదవడం ఎందుకు? పేదల నోట్లో మన్ను ఎందుకు? విద్యని కొనుక్కునే డాక్టర్లు సామాన్యుల ఆశాజ్యోతులవుతారా? విద్య వైద్యం పూర్తిగా ప్రభుత్వపరంగా ఉండి ప్రజల అవసరా లను తీరిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది. కానీ ప్రస్తుతం ఈ రెండు రంగాల్లో ప్రైవేటు సంస్థలు రాజ్యమేలుతున్నాయి. ప్రభుత్వం తన బాధ్యతని దులిపేసుకోవడంతో ప్రజలు 80 శాతం వైద్య ఖర్చులను తామే భరిస్తూ నిరుపేదలవుతున్నారు. రైతుల ఆత్మహత్యలకి కార ణాల్లో వైద్య పరమైన అప్పులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. సేవా రంగాలను వ్యాపార రంగాలుగా మార్చడం మానాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెంచి, అందులో నైపుణ్యం గల డాక్టర్లని నియమించి, వైద్య విద్యా ప్రమాణాలను పెంచి, వాటి అనుబంధ ఆసుపత్రులకి కేటాయింపులు పెంచి, నాణ్యమైన పరికరాలు అందిస్తే వైద్యం అందరికీ అందుబాటులోకి వస్తుంది. ప్రాథమిక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలే తప్ప, అవకతవక సంస్కరణలతో వారిపై భారాన్ని పెంచి వారి ఆరోగ్యాన్ని దెబ్బతీయకూడదు. క్యూబా, థాయ్‌లాండ్, యూరప్ వంటి చోట్ల ఉన్న మెరుగైన వైద్య ఆరోగ్య సేవల అనుభవాన్ని అధ్యయనం చేసి మన వైద్య రంగాన్ని మెరుగు పర్చుకోవాలి. లేదంటే, ఈ తప్పుడు విధానాల వల్ల అంటువ్యాధులు ప్రబలి, జాతీయ భద్రతకే ముప్పు వాటిల్లవచ్చు. మనవైద్య రంగాన్ని నిర్వీర్యపరిచే ఇలాంటి బిల్లులు సమాన త్వాన్ని చాటలేవు. వైద్యాన్ని మొత్తంగా ప్రభుత్వపరం చేసి, ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరిచే విధానాలు మాత్రమే ప్రజల ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కాపాడగలవు. సేవా రంగాన్ని వ్యాపారం మింగేస్తే అలాంటి దేశానికి భవిష్యత్తు ఉండదు. - డాక్టర్ నళిని, పిల్లల వైద్య నిపుణులు -
తమ్ముడితో ఏకాంతంగా మాట్లాడిన నళిని
చెన్నై, వేలూరు: మద్రాసు హైకోర్టు తీర్పుతో 30 రోజల పాటు ఫెరోల్‌పై వచ్చిన నళిని రెండో రోజున వేలూరు సత్వచ్చారి పోలీస్ స్టేషన్లో సంతకం చేసి తమ్ముడితో ఏకాంత ప్రదేశంలో రహస్యంగా మాట్లాడారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో వేలూరు సెంట్రల్ జైలులో నళిని శిక్ష అనుభవిస్తున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో నళిని కుమార్తె హరిద్ర వివాహ ఏర్పాట్లు కోసం ఫెరోల్ కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 30 రోజుల పెరోల్ మీద నళిని సత్‌వచ్చారిలోని రంగాపురంలో ఉన్న తమిళ్ పేరవై ప్రధాన కార్యదర్శి సింగారాయర్ ఇంటి వద్ద ఉంటున్న విషయం తెలిసిందే. 30 రోజుల పాటు సత్‌వచ్చారిలోని పోలీస్ స్టేషన్లో నళిని సంతకం చేయాలని నిబంధన ఉండడంతో మూడవ రోజైన ఆదివారం ఉదయం సత్వచ్చారి పోలీస్ స్టేషన్లో సంతకాలు చేశారు. వీసీకే నేతలు మాట్లాడేందుకు నిరాకరణ: నళినితో కలిసి మాట్లాడేందుకు వీసీకే పార్టీకి చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విన్నయ అరసు వేలూరులోని నళిని ఇంటి వద్దకు చేరుకున్నారు, అయితే కోర్టు అనుమతి లేనిది ఎవరినీ మాట్లాడేందుకు అనుమతించబోమని పోలీసులు తెలిపారు. అనంతరం విన్నయరసు విలేకరులతో మాట్లాడుతూ ఇదే కేసులో జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురిని ఫెరోల్‌పై విడుదల చేసేందుకు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తాము ప్రస్తుతం నళినితో మాట్లాడేందుకు వచ్చామని అయితే కోర్టు అనుమతి లేకపోవడంతో తిరిగి వెళుతున్నామన్నారు. తమ్ముడితో ఏకాంతంగా మాట్లాడిన నళిని: 28 సంవత్సరాల అనంతరం జైలు నుంచి బయటకు వచ్చిన నళినిని చూసేందుకు ఆమె తమ్ముడు భాగ్యనాథన్ కుమార్తెతో కలిసి నళిని ఉంటున్న ఇంటి వద్దకు చేరుకున్నారు. అనంతరం నళిని కుమార్తె హరిద్ర వివాహ ఏర్పాట్లు గురించి ఏకాంతంగా చర్చించారు. పోలీసు స్టేషన్ వద్ద కూడా ఏకాంతంగా మాట్లాడినట్లు సమాచారం. -
ఎన్నాళ్లో వేచిన హృదయం
తమిళనాడు, వేలూరు: వేలూరు సెంట్రల్ జైలు నుంచి నళిని 28 సంవత్సరాల అనంతరం పెరోల్‌పై విడుదల అయ్యారు. ఆమెను కుమార్తె వివాహ ఏర్పాట్ల కోసం వేలూరు సత్‌వచ్చారిలోని ఒక ఇంట్లో ఉంచారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో వేలూరు సెంట్రల్ జైలులో నళినితో పాటు ఆమె భర్త మురుగన్ మొత్తం ఏడుగురు శిక్ష అనుభవిస్తున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో నళిని కుమార్తె వివాహ ఏర్పాట్లు కోసం పెరోల్ కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు విచారణ ఈనెల 5న విచారణ జరిగింది. ఈ కేసులో నళిని నేరుగా వెళ్లి ఆమె తన కుమార్తె జన్మించినప్పటి నుంచి ఇంత వరకు ఒక్క ముద్ద అన్నం కూడా పెట్టలేదని కనీసం తల్లిగా ఎటువంటి సేవను చేయలేదని తెలిపి ఆమె వాదనలను వినిపించింది. దీంతో విచారణ జరిపిన న్యాయమూర్తి 30 రోజులు పెరోల్ ఇస్తూ తీర్పునిచ్చారు. అదే విధంగా నళిని 30 రోజులు పెరోల్‌పై ఎక్కడ ఉండబోతున్నారు అనే విషయాలనుపది రోజుల్లో జైలు అధికారులకు తెలియజేయాలని తీర్పునిచ్చింది. నళినికి తల్లి పద్మ, కాట్పాడి బ్రహ్మపురానికి చెందిన ఒక మహిళ జామీను సంతకం చేశారు. దీంతో నళిని వేలూరు రంగాపురంలోని పులవర్ నగర్లో ద్రావిడ సిద్ధాంతాలకు చెందిన తమిళ పేరవై రాష్ట్ర జాయింట్ కార్యదర్శి సింగరాయర్ ఇంటిలో ఉంటూ వివాహ ఏర్పాట్లను చేసేందుకు నిర్ణయించడంతో ఆమె న్యాయవాది పుహలేంది ద్వారా జైలు అధికారులకు నకలను సమర్పించారు. ఇదిలా ఉండగా ఈనెల 20న సాయంత్రం 4 గంటలకు జైలు నుంచి పెరోల్‌పై బయటకు వస్తారని ఆశించారు. అయితే ఉన్నతాధికారుల నుంచి సమగ్రమైన ఆదేశాలు రాక పోవడంతో ఆమె రాక నిలిచి పోయింది. దీంతో నళినిని పెరోల్‌పై విడుదల చేయాలని బుధవారం సాయంత్రం వేలూరు సెంట్రల్ జైలు అధికారులకు ఆదేశాలు రావడంతో గురువారం ఉదయం 9.55 గంటలకు ఆమెను పటిష్ట పోలీస్ బందోబస్తు నడుమ బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెను పోలీస్ బందోబస్తుతో సత్‌వచ్చారిలోని రంగాపురంలో ఉన్న ద్రావిడ సిద్ధాంతాల తమిళ్ పేరవై ప్రధాన కార్యదర్శి సింగారాయర్ ఇంటి వద్దకు తీసుకొచ్చారు. నళిని తల్లి పద్మ, బంధువులు కన్నీటితో హారతి: నళిని పెరోల్‌పై బయటకు వస్తారని తెలుసుకున్న నళిని తల్లి పద్మ, బంధువులు రంగాపురంలోని ఇంటి వద్దకు చేరుకున్నారు. ఉదయం 10.30 గంటలకు రంగాపురంలోని ఇంటి వద్దకు చేరుకున్న నళినికి తల్లి పద్మ హారతి పట్టారు. 28 సంవత్సరాల అనంతరం నళిని బయట ప్రపంచానికి రావడంతో నళిని తల్లి పద్మతో పాటు బంధువులు హారతి పట్టారు. ఆ సమయంలో బంధువులు, తల్లి పద్మ, నళినిని చూసి కన్నీటి పర్వతమయ్యారు. రాజకీయనాయకులు, మీడియాతో మాట్లాడడంపై నిషేధం 30 రోజుల పెరోల్‌పై వచ్చిన నళిని రాజకీయ నాయకులతో పాటు మీడియాతో మాట్లాడకూడదని కోర్టు నిబంధనలు విధించడంతో ఎవరూ ఆమెను కలవలేక పోయారు. వారం రోజుల్లో లండన్ నుంచి వేలూరు రానున్న కుమార్తె లండన్‌లో ఉన్న నళిని కుమార్తె హరిద్ర వారం రోజుల్లో వేలూరుకు రానున్నారు. నళిని 30 రోజుల పాటు వేలూరు రంగాపురంలో ఉండడంతో ఆమె కుమార్తె వివాహం కూడా వేలూరులోనే జరగవచ్చునని తెలుస్తుంది. కుమార్తె వివాహం గురించి మురుగన్ ఇంత వరకు పెరోల్ కోరలేదు. వివాహ తేదీని బట్టి పెరోల్ కోరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇంటి వద్ద పటిష్ట బందోబస్తు: నళిని ఉంటున్న రంగాపురంలోని ఇంటి వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆమె ఉంటున్న ఇంటిలో మొదటి అంతస్తులో నళిని ఉండబోతున్నారు. దీంతో నళినిని చూసేందుకు ఎవరు వస్తారు, ఎవరు మాట్లాడతారు అనే విషయాలను పోలీసులు రిజిస్టర్లో నమోదు చేయనున్నారు. -
ఎట్టకేలకు పెరోల్‌పై విడుదలైన నళిని
సాక్షి, చెన్నై: మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకేసులో జీవితఖైదు అనుభవిస్తున్న నళిని ఎట్టకేలకు పెరోల్‌పై గురువారం జైలు నుంచి విడుదలైంది. తన కుమార్తె హరిత వివాహానికి ఆరు నెలలు పెరోల్ కావాలని మద్రాస్ హైకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. అయితే నళినికి ఆరు నెలలు ఇవ్వలేమనీ, ఇతర సాధారణ ఖైదీల్లాగే 30 రోజుల పెరోల్‌ను కోర్టు మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలైన నళినినీ తీసుకువెళ్లేందుకు ఆమె తల్లి వచ్చింది. ఈ సందర్భంగా నళిని మాట్లాడుతూ తన కుమార్తె విషయంలో తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తించలేకపోయానని, అంతేకాకుండా తండ్రి చనిపోయిన తర్వాత కూడా కుమార్తెగా కుటుంబానికి ఏమీ చేయలేకపోయాని, పెరోల్ లభించిన సందర్భంగా కుటుంబాన్ని కలవడంతో పాటు కుమార్తె వివాహాన్ని దగ్గరుండి జరిపించనున్నట్లు నళిని తెలిపింది. కాగా రాజీవ్ హత్యకేసులో నళినితో పాటు ఆమె భర్త మురుగన్ సహా ఏడుగురు వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. గత 28 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న నళిని, సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపిన మహిళగా కూడా గుర్తింపు పొందారు. 1991, మే నెలలో ఎన్నికల ప్రచారం నిమిత్తం విశాఖ పట్నం నుంచి తమిళనాడులోని శ్రీ పెరుంబుదూర్‌కి వెళ్లిన రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ ఆత్మాహుతి దళ సభ్యులు బాంబు పేల్చి హతమార్చారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేయగా, అందులో నళిని ఒకరు. కాగా గతంలోనూ న్యాయస్థానం ఆమెకు ఒక్కరోజు పెరోల్ ఇచ్చింది. గత ఏడాది నళిని తండ్రి శంకర్ నారాయణన్ అంత్యక్రియల కార్యక్రమానికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. -
రాజీవ్‌గాంధీ హంతకురాలు నళినీకి పెరోల్
-
జైలులోనే సజీవ సమాధి అవుతా..
-
జైలులోనే సజీవ సమాధి అవుతా..
- సంచలనానికి తెరలేపిన ‘రాజీవ్ గాంధీ హంతకులు’ - ఆమరణ నిరశనకు సిద్ధపడ్డ మురుగన్.. హైకోర్టుకు నళిని - దంపతులు త్వరలో విడుదలవుతారన్న న్యాయవాది వేలూరు: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషులుగా జైలు శిక్ష అనుభవిస్తోన్న మురుగన్, నళిని దంపతులు మరోసారి వార్తల్లో నిలిచారు. గడిచిన 26 ఏళ్లుగా కారాగారవాసం గడుపుతోన్న తనకు.. విడుదలవుతానన్న నమ్మకం లేదని, అందుకే జైలులోనే సజీవ సమాధి కావాలనుకుంటున్నట్లు మురుగన్ కోరుతున్నాడు. ఈ మేరకు తాను ఉంటోన్న వేలూరు సెంట్రల్ జైలులోనే ఆగస్టు 18 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేసుకునేలా అనుమతి ఇవ్వాలని కోరుతూ అధికారులకు వినతి పత్రం అందజేశాడు. శనివారం జైలులో మురుగన్‌ను కలిసివచ్చిన అనంతరం అతని తరఫు లాయర్ పుగళేంది ఈ విషయాలను మీడియాకు వెల్లడించాడు. రాజీవ్ గాంధీ హత్య కేసులో వేలూరు మహిళా జైలులో నళిని, పురుషుల సెంట్రల్ జైలులో మురుగన్, పేరరివాలన్, శాంతనులతో పాటు ఏడుగురు జీవిత శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే. మురుగన్-నళిని దంపతుల కుమార్తె.. ప్రస్తుతం లండన్‌లో డాక్టర్‌గా పనిచేస్తోన్న అరిత్ర త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నది. కుమార్తె వివాహన్ని దగ్గరుండి జరిపేందుకుగానూ ఆరు నెలల పెరోల్ అభ్యర్థిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వారి న్యాయవాది తెలిపారు. పెరోల్ కోసం నళిని గత నవంబర్లోనే వినతి పత్రం సమర్పించారని, గత జనవరిలో రెండోసారి కూడా విన్నవించుకున్నా అధికారుల నుంచి స్పందన రాలేదని, అందువల్లే హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు న్యాయవాది చెప్పారు. సోమవారం చెన్నై హైకోర్టులో నళిని తరఫున పిటిషన్ వేయబోతున్నట్లు పేర్కొన్నారు. నళిని-మురుగన్ త్వరలో విడుదలవుతారు! తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నళిని-మురుగన్‌లను విడుదల చేసే అవకాశం ఉందని న్యాయవాది పుగళేంది అన్నారు. కాగా, గతంలోనూ వీరి విడుదలకు తమిళ ప్రభుత్వం ప్రతిపాదను పంపడం, కేంద్ర ప్రభుత్వం దానిని నిరాకరించడం పలుమార్లు జరిగింది. 1991లో జైలుకు వచ్చేనాటికి నళిని రెండు నెలల గర్భవతి అని, ఆమెకు అరిత్రా అనే కుమార్తె జన్మించిందని, నాలుగు సంవత్సరాల పాటు ఆ పాప తల్లితోపాటే జైలులో ఉందని, ప్రస్తుతం లండన్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నదని నళిని-మురుగన్ల న్యాయవాది పుగళేంది గుర్తుచేశారు. (చదవండి: రాజీవ్ గాంధీ హత్య: ఇంకొన్ని విషయాలు..) -
నళిని నిరాహార దీక్ష విరమణ
వేలూరు (తమిళనాడు): వేలూరు మహిళా జైలులో గత ఐదు రోజులుగా నిరాహార దీక్షలో ఉన్న నళిని ఆదివారం దీక్ష విరమించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో వేలూరు మహిళా జైలులో నళిని, పురుషుల జైలులో మురుగన్, శాంతన్, పేరరివాలన్ శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే. అయితే తనను చెన్నై పుళల్ జైలుకు మార్చాలని ఈ నెల 12వ తేదీన నళిని జైలు అధికారులకు వినతి పత్రం అందజేశారు. లండన్‌లో ఉన్న తన కుమార్తెకు వివాహ ఏర్పాట్లు చేస్తున్నామని, తనను పుళల్ జైలుకు మార్చితే ఏర్పాట్లపై సమీపంలో నివాసం ఉంటున్న తన బంధువులతో మాట్లాడుకోవచ్చని ఆమె వినతిలో పేర్కొన్నారు. అయితే వినతి పత్రాన్ని స్వీకరించిన అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదంటూ ఈ నెల 14వ తేదీ నుంచి నళిని నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో పుళల్ జైలుకు మార్చాలన్న వినతిపై చర్యలు తీసుకుంటామని ఆదివారం జైలు అధికారులు హామీ ఇవ్వడంతో నళిని ఆహారం తీసుకున్నారు. -
25 ఏళ్ల తర్వాత కోర్టుకు హాజరైన మురుగన్
వేలూరు(తమిళనాడు): మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్ 25 ఏళ్ల తర్వాత మొట్ట మొదటి సారిగా వేలూరు కోర్టులో హాజరయ్యాడు. రాజీవ్ హత్య కేసులో మురుగన్, అతని భార్య నళినితో పాటు పేరరివాలన్, శాంతన్ మొత్తం ఏడుగురు వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే. జైలులో సెల్ఫోన్లు నిషేధం ఉన్న నేపథ్యంలో జైలు అధికారులు మురుగన్ గదిలో తనిఖీలు చేపట్టి రెండు సెల్ఫోన్లు, చార్జరు, రెండు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జైలు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. మురుగన్ సెల్‌ఫోన్ ఉపయోగించినందున మూడు నెలలపాటు ఎవరినీ కలిసి మాటాడేందుకు అవకాశం ఇవ్వలేదు. జైలు గదిలో సెల్‌ఫోన్ ఉపయోగించిన కేసులో వేలూరు జెఎం వన్ కోర్టులో గురువారం విచారణకు వచ్చింది. మురుగన్ కేసు విచారణ జరిపిన న్యాయమూర్తి మే నెల 4వ తేదికి వాయిదా వేశారు. అనంతరం పోలీసులు మురుగన్‌ను జైలుకు తీసుకెళ్ళారు. అయితే, ఆయనతో న్యాయవాది తప్ప ఎవరినీ కలిసి మాట్లాడేందుకు అనుమతించలేదు. మురుగన్ జైలులో స్వామిజీ తరహా మౌనవ్రతంలో ఉన్నట్లు పుకార్లు వచ్చిన విషయం విదితమే. వాటిని నిరూపించే విధంగా కోర్టులో హాజరయ్యే సమయంలో మురుగన్ గడ్డంతో షర్టు లేకుండా పచ్చ దుస్తులు మాత్రమే కప్పుకొని రావడంతో స్వామీజీ మాదిరి ఉన్నాడు. సాయిబాబా, మారియమ్మన్‌ల మొక్కుల కోసమే ఇలా మారినట్లు సమాచారం. -
నళిని, ప్రియాంకల మధ్య ఏం జరిగింది!
- పుస్తకంలో ఆ రోజు ఘటన పాతి పెట్టిన నిజాలు - పుస్తకం రూపంలో ‘నళిని’ మనో వేదన సాక్షి, చెన్నై : ‘‘ తనను చూడటానికి ప్రియాంకా వచ్చారు...తాము నిర్ధోషులం అని వ్యాఖ్యానించగానే, ఒక్క సారిగా ఆమెలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది...తీవ్రంగానే ఆక్రోశం..ఒక్క క్షణం నాలో కలవరం...! అంతలో నీ గురించి మాత్రం మాట్లాడూ’’ అని ఆమె అన్న మాటలు నేటికి తనకు బాగానే గుర్తున్నాయని రాజీవ్ హత్య కేసు నింధితురాలు నళిని తన పుస్తకంలో వివరించి ఉన్నారు. ఎనిమిదేళ్ల క్రితం ఆ ఇద్దరి మధ్య ఏలాంటి సంభాషణలు జరిగాయో అని ఎదురు చూస్తున్న వాళ్లకు గురువారం విడుదల కాబోతున్న నళిని ‘పాతి పెట్టిన నిజాలు’ పుస్తకం తేట తెల్లం చేయబోతున్నది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధి హత్య కేసులో నళిని, మురుగన్, శాంతన్, పేరరివాళన్లతో పాటుగా ఏడుగురిని సిబీఐ సమర్పించిన ఆధారాలతో దోషులుగా కోర్టు తేల్చిన విషయం తెలిసిందే. వీళ్లందరికీ తొలుత ఉరి శిక్ష పడ్డాయి. 2008లో హఠాత్తుగా రాజీవ్ గాంధి తనయ ప్రియాంక వేలూరు జైల్లో ప్రత్యక్షం కావడంతోప్రాధాన్యత సంతరించుకున్నది. తన తండ్రిని హతమార్చిన దోషుల్లో ఒకరిగా జైల్లో ఉన్న నళినితో ఆమె సంప్రదింపులు సాగినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ఆ ఇద్దరి మధ్య ఏం జరిగిందో అన్నది నేటికీ ప్రశ్నార్థకమే. ప్రియాంక సంప్రదింపు తదుపరి నళిని ఉరి శిక్ష కాస్త యావజ్జీవానికి మారింది. తదుపరి సాగిన పరిణామాలతో మిగిలిన వారి ఉరి శిక్షలు యావజ్జీవాలుగా మారిన విషయం తెలిసిందే. అయితే, నళని, ప్రియాంకల మధ్య అస్సలు ఏం జరిగింది, ఎలాంటి సంభాషణలు సాగాయె అన్న ప్రశ్నకు సమాధానాలు వెతుకుతున్న వాళ్లకు పుస్తకం రూపంలో నళిని సమాధానం ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. ఆరు వందల పేజిలతో కూడిన ఈ పుస్తకం గురువారం ఆవిష్కరించనున్నారు. ఈ పుస్తకంలో నళిని - ప్రియాంకల మధ్య సాగిన సంభాషణలు, తమ మీద సిబిఐ మోపిన అభియోగాలకు వ్యతిరేకంగా ప్రశ్నలు, నిర్ధోషులుగా చాటుకునేందుకు తగ్గట్టుగా అనేక అంశాలను పొందు పరిచినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో 2008లో తమ ఇద్దరి మధ్య ఏమి జరిగిందో..? అన్న వివరాలు ఆ పుస్తకం ద్వారా నళిని వివరించిన కొన్ని సంభాషణలు బుధవారం ఓ మీడియాకు చేరింది. {పియాంక ఆగ్రహం : 2008లో ప్రియాంక తనను చూడటానికి వచ్చినట్టు సమాచారం రాగానే, ఆమె దృష్టికి వాస్తవాలను తీసుకెళ్లేందుకు నిర్ణయించినట్టుగా ఆ పుస్తకంలో వివరించారు. ఆ మేరకు ఆమెతో మాట్లాడే సమయంలో , సిబిఐ తమ మీద అబాండాలు మోపినట్టు వివరించినట్టు పేర్కొని ఉన్నారు. ఎల్టీటీఈ నిబంధనల మేరకు పురుషులకు 26, స్త్రీలకు 21 ఏళ్లు వచ్చినప్పుడే వివాహం చేసుకోవాలని పేర్కొన బడి ఉన్నట్టు గుర్తు చేశానని సూచించారు. అయితే, 21 ఏళ్ల వయస్సు గల మురుగన్‌తో అప్పటికే తనకు వివాహం జరిగిందని పేర్కొని ఉన్నారు. నిబంధనల్ని ఉల్లంఘించి వివాహం చేసుకుంటే, శిక్షలు కఠినంగానే ఎల్టీటీఈలో ఉంటాయని , అలాంటప్పుడు తాము ఎలా ఆ సంస్థకు చెందిన వారిమో అని ప్రశ్నించినట్టు వివరించి ఉన్నారు. సంఘటన జరిగిన రోజున తాను పనిచేస్తున్న ప్రైవేటు సంస్థలోనే ఉన్నానని, ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని ఆమె వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు పేర్కొని ఉన్నారు. ప్యారీస్ నుంచి తానేదో మానవ బాంబుగా మారి రద్దీగా ఉన్న బస్సులో వెళ్లినట్టుగా సీబీఐ అభియోగాలు మోపి ఉన్నదని, రద్దీ గా ఉన్న బస్సులో బాంబుల్ని కట్టుకుని వెళ్లి ఉంటే, ఎవ్వరో ఒకరు గుర్తించ కుండా ఉండి ఉంటారా..? అని ప్రశ్నించినట్టు, మురుగన్‌ను ద్వితీయ శ్రేణి నాయకుడిగా చిత్రీకరించి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసినట్టు సూచించి ఉన్నారు. ఎల్టీటీఈలో ద్వితీయ శ్రేణి నాయకుడుగా తన భర్త ఉండి ఉంటే, సిబిఐ అరెస్టు చేసేలోపు వేదారణ్యం నుంచి పడవ ద్వారా ఎల్‌టీటీఈల వద్దకు చేరి ఉండే వాడు కాదా..? అని ప్రశ్నించినట్టు, అస్సలు తాము నిర్దోషులం అని,తమను అన్యాయంగా ఇరికించారని వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రియాంక తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు ఆ పుస్తకంలో వివరించి ఉన్నారు. ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేసిన సమయంలో ఒక్క సారిగా తనలో కలవరం బయలు దేరిందని, అయితే, క్షణాల్లో ఆమె తనతో అన్న మాటలు ఊరట నిచ్చాయని పేర్కొని ఉన్నారు. ముందు నీ గురించి మాత్రం మాట్లాడు, మిగిలిన వారి గురించి వద్దంటూ ఆమె ఆగ్రహంగా అన్న మాటలు నేటికీ గుర్తున్నాయంటూ ఆ పుస్తకంలో నళిని స్పందించి ఉండటంతో, ఈ పుస్తకంలో పాతి పెట్టిన నిజాలు మరెన్ని ఉన్నాయో అన్న ఉత్కంఠ బయలు దేరి ఉండటం గమనార్హం. -
రాజీవ్ గాంధీ హత్య: ఇంకొన్ని విషయాలు..
చెన్నై: ‘నా కూతుర్ని చూసి పదేళ్లైంది. తను లండన్‌లో డాక్టర్ అయిందని బంధువులు చెప్పారు. ఈ మధ్యే తనకో ఉత్తరం రాశా. నా కూతురు, జైల్లోనే ఉన్న నాభర్తతో కలిసి ఒకే ఒక్కరోజు గడపాలి. కని, అనాథగా వదిలేసినందుకు క్షమాపణ అడగాలి. తనను గుండెలనిండా కౌగిలించుకోవాలి’ ఇది..ప్రపంచంలోనే సుదీర్ఘకాలంగా జైలు శిక్ష అనుభవిస్తోన్న మహిళ, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషి నళిని శ్రీహరన్ చివరికోరిక. ఉరిశిక్ష పడిన దోషిగా గడిచిన 25 ఏళ్లుగా చెన్నైలోని వేలూరు సెంట్రల్ జైలులో ఉంటోన్న నళినిపై ఇప్పటివరకు ఎన్నో కథనాలు వచ్చాయి. కానీ మొదటిసారి ఆమె తన ఆత్మకథను చెప్పుకుంటున్నారు. తమిళంలో 500 పేజీల్లో పొందుపర్చిన నళిని ఆత్మకథ నవంబర్ 24న విడుదల కానున్న సందర్భంగా ఆ పుస్తకంలోని కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి.. తన తల్లి పేరు పద్మావతి అని, చెన్నైలో నర్స్ గా పనిచేసేదని, మహాత్మా గాంధీ ఓ సారి చెన్నై వచ్చినప్పుడు ఆమెకు పేరు పెట్టారని నళిని చెప్పుకొచ్చింది. 1991లో.. శ్రీహరన్ అనే వ్యక్తి నళిని ఇంట్లో ఇంట్లోకి అద్దెకు దిగడం, క్రమంగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడం, తల్లిని ఒప్పించి శ్రీలంక తమిళుడైన శ్రీహరన్ ని నళిని పెళ్లి చేసుకోవడం, కొంతకాలానికి ఇంట్లో చుట్టాల తాకిడి పెరిగగడం, శ్రీహరన్ కోసం శ్రీలంక నుంచి చాలా మంది వస్తూపోతుండటం తదితర విషయాలను నళిని తన ఆత్మకథలో పూసగుచ్చినట్లు వివరించారు. ఒక భయంకరమైన రోజు భర్తతో కలిసి ఇల్లు విడిచి పారిపోయానని, కొద్ది రోజులకే సీబీఐ వాళ్లు తమతోపాటు 14 మందిని అరెస్ట్ చేశారని, దాదాపు 50 రోజులపాటు ఇంటరాగేషన్ లో థార్డ్ డిగ్రీలో ఎన్నిరకాలుగా టార్చర్ పెడతారో అన్నీ అనుభవించానని నళిని పేర్కొన్నారు. ఇటీవల కోర్టుకు తీసుకొచ్చిన సందర్భంలో నళిని(ఇన్సెట్ నళిని-శ్రీహరన్ ల కూతురు అరిత్రా) ‘ఒక సారి జైల్లో నాతో మాట్లాడటానికి ఒకామెవచ్చింది. తనను తాను ప్రియాంకా గాంధీ అని పరిచయం చేసుకుంది. చాలా సేపు నాతో మాట్లాడింది. ‘మా నాన్న చాలా మంచివారు. ఆయనను ఎందుకు చంపారు?’అని పదేపదే ప్రశ్నించింది. నావరకు అది సమాధానం తెలియని ప్రశ్న! అసలు రాజీవ్ గాంధీ గురించి నాకేమీ తెలియదు. ప్రియాంకా గాంధీ నన్ను ఎందుకు కలిశారో అప్పుడే కాదు, ఇప్పటికీ నాకు అర్థంకాదు. నా భర్త పేరు శ్రీహరన్ అని కాకుండా మురుగన్ గా మారిపోవడమూ నాకు అంతుపట్టని విషయం. అరెస్ట్ అయ్యే నాటికి నేను రెండు నెలల గర్భవతిని. థార్డ్ డిగ్రీ టార్చర్ ను భరించానంటే కేవలం నా కడుపులో పెరుగుతున్న నలుసు కోసమే. కోర్టు విచారణకు తీసుకెళ్లినప్పుడా పోలీసులు మాకు వైద్యపరీక్షలు చేయిచేవాళ్లు. ఉరిశిక్ష పడబోతున్న నాకు అబార్షన్ చేయాలని పోలీసులు డాక్టర్లమీద ఒత్తిడి చేసేవారు. అందుకు డాక్టర్లు ఒప్పుకోలేదు. ఆ డాక్టర్లు ఎక్కడున్నారోగానీ వాళ్లకు నా నమస్కారాలు. జైలులోనే బిడ్డను కన్నా. పక్కనే మగవాళ్ల జైలులో నా భర్త శ్రీహరన్ ఉంటాడు. అప్పట్లో కలుసుకునే వీలండకపోయేది. పాపకు అరిత్రా అని పేరుపెట్టుకున్నాం. తనకు రెండేళ్లు నిండాక మా ఆయన తరఫు బందువులు అరిత్రను తీసుకెళ్లారు. 2005లో చివరిసారిగా నా కూతుర్ని చూశా. ఇప్పుడు తను లండన్ లో డాక్టర్ గా పనిచేస్తోందని, నన్ను, నా భర్తను విడుదల చేయాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందని బంధువుల ద్వారా తెలిసింది. 2000లో నాకు క్షమాభిక్ష పెట్టినప్పటి నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి భర్తను కలిసి మాట్లాడే అవకాశం కల్పించారు. ఆ కొద్దిసేపే కాస్త ఊరట దొరుకుతుంది. జైలు అధికారులు.. డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ఏఐడీఎంకే అధికారంలో ఉన్నప్పుడు మరోలా ప్రవర్తిస్తారు. జయలలిత సీఎంగా ఉన్నన్నాళ్లూ మాపై వేధింపులు ఉండవు. ఈ మధ్యే కొందరు బెదిరింపులు పంపుతున్నారు.. ‘నీ బిడ్డను లండన్ నుంచి శ్రీలంక వెళ్లిపొమ్మను.. లేకుంటే చంపేస్తాం’ అంటున్నారు. వాళ్ల చంపుళ్లు ఎలా ఉన్నా నాకు మాత్రం ఒక్కసారైనా బిడ్డను కలుసుకోవాలని ఉంది. నేను, నా భర్త, కూతురు.. ముగ్గురం కలిసి ఒక్కరోజు గడపాలి’ అని నళిని తన ఆత్మకథలో చివరి కోరికను వెల్లడిస్తారు. నవంబర్ 24న విడుదల కానున్న ఈ పుస్తకానికి మద్రాస్ హైకోర్టు మాజీ జడ్జి డి. హరిపరానథమన్, ఎండీఎంకే పార్టీ నేత వైకో, వీసీకే నేత తిరుమావలవన్, రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటుడు సీమాన్ తదితరులు ముందు మాటలు రాశారు. రాజీవ్ గాంధీ హత్య అనంతరం సీబీఐ అదుపులో మురుగన్ అలియాస్ శ్రీహరన్, నళిని(ఫైల్ ఫొటో) రాజీవ్ హత్యకేసుకు సంబంధించి కీలక పరిణామాలు.. -
కుమార్తె పెళ్లి కోసం విడుదల చేయండి
టీనగర్: ఇరవై ఆరేళ్ల జైలు జీవితం తనను మార్చివేసిందని, తన కుమార్తె వివాహం జరిపించేందుకు తనను విడుదల చేయాలంటూ నళిని కోర్టును కోరింది. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసు నిందితురాలు నళిని 26 ఏళ్లుగా జైల్లో ఉన్నారు. జైల్లో ఉండగా ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ బిడ్డకు మెకరా అని నామకరణం చేశారు. నళిని భర్త మురుగన్ కూడా 26 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్నారు. మెకరా బంధువుల సంరక్షణలో ఉంది. ప్రస్తుతం ఆమె లండన్‌లో ఉంటోంది. మెకరా పెళ్లి ఈడుకు వచ్చినందున ఆమెకు వివాహం చేసేందుకు నళిని ఆశిస్తోంది. 51 ఏళ్ల వయసుగల నళిని శారీరకంగా, మానసికంగా కృంగిపోయారు. ఆమె న్యాయవాది పుహలేంది తరపున రాతపూర్వకంగా ఇచ్చిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. తాను గత 26 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్నానని, తన భవిష్యత్తు ఎలావుంటుందో చెప్పలేనన్నారు. 2008 మార్చి నెలలో ఒక మహిళ వేలూరు జైలుకు వచ్చింద ని, ఆమెను తాను సరిగా గుర్తించలేకపోయానని తెలిపారు. తాను ప్రియాంకా అని తెలియజేయడంతో తాను నమ్మలేకపోయానని పేర్కొన్నారు. ఆ తర్వాత తేరుకున్న తాను తనకేమీ తెలియదమ్మా? అన్నానని, అందుకు ప్రియాంకా తన తండ్రి ఎంతో మంచి వ్యక్తి అని, ఎందుకు ఇలా చేశారు? కారణమేంటి? ఏ సమస్య అయినా చర్చలతో పరిష్కరించుకోవచ్చు కదా! అన్నట్లు తెలిపారు. దీన్ని తాను తట్టుకోలేక బిగ్గరగా రోదించానని, ప్రియాంకతో నాటి కలయిక ఇప్పటికీ మరచిపోలేకున్నట్లు తెలిపారు. తన కుమార్తెను 2005లో చూశానని, ఆ తర్వాత చూడలేదని తెలిపారు. ఆమెను చూసేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నట్లు తెలిపారు. ఆమెకు వివాహం చేయాలనుకుంటున్నానని, ఇందుకోసం తనను విడుదల చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. తనను విడుదల చేయాలంటూ నళిని దాఖలు చేసిన పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉంది. -
నళినితో మాట్లాడేందుకు భర్త విముఖత
వేలూరు: స్థానిక మహిళా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న నళినితో మాట్లాడేందుకు ఆమె భర్త మురుగన్ విముఖత వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో నళిని మహిళా జైలులోను, ఆమె భర్త మురుగన్‌లు పురుషుల జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ప్రతి 15 రోజులకు ఓసారి భార్యభర్తలిద్దరూ కలిసి మాట్లాడుకునేందుకు కోర్టు అవకాశం కల్పించింది. దీంట్లో భాగంగా గత నెల 20వ తేదీన నళిని, మురుగన్‌లు మాట్లాడుకున్నారు. ఇదిలాఉండగా శనివారం వీరిద్దరూ కలిసి మాట్లాడుకునేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఈ విషయాన్ని శనివారం ఉదయం జైలు అధికారులు మురుగన్‌కు తెలిపారు. అయితే ఇందుకు మురుగన్ విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. వేరే ఏ రోజైనా ఆమెతో మాట్లాడతానని మురుగన్ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. దీంతో మురుగన్ నళినితో కలిసేందుకు ఎందుకు నిరాకరించాడు? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
నళినికి సమన్లు
సాక్షి, చెన్నై: శారద చిట్స్ స్కాం కేసులో విచారణకు హాజరు కావాలని పి నళినికి సమన్లు జారీ అయ్యాయి. ఇది కాస్త కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం వర్గీయుల్లో ఉత్కంఠను రేపి ఉన్నది. ఇక, కాంగ్రెస్ గ్రూపు రాజకీయ వర్గాల్లో అయితే, ఈ సమన్ల చర్చ హోరెత్తుతున్నది. రాష్ట్ర కాంగ్రెస్‌లోని గ్రూపుల్లో బలమైన గ్రూపుగా కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం వర్గం ఉన్నది. ఇటీవల కాలంగా చిదంబరాన్ని టార్గెట్ చేసి ఆరోపణలు బయలు దేరుతుండడం ఆ వర్గీయుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నది. ఇప్పటికే చిదంబరం తనయుడు కార్తీచిదంబరం మీద జాతీయ స్థాయిలో చర్చల్లో ఉన్న పలు కేసుల వ్యవహారాల ఆరోపణలు చుట్టుముట్టే పనిలో పడ్డాయి. అదే సమయంలో చిదంబరం సతీమణి, న్యాయవాది నళిని చిదంబరం చుట్టూ ప్రస్తుతం శారద చిట్ ఫండ్ స్కాం ఆరోపణలు సాగుతుండటం రాష్ట్రంలో చర్చకు తెర లేపి ఉన్నది. ఆ స్కాంలో ఇప్పటికే ఓ మారు నళినిని సీబీఐ విచారించి ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో సాగిన ఈ స్కాం వ్యవహారం సెగ తమిళనాడుకు చెందిన నళిని చిదంబరాన్ని తాకి ఉండడం చిదంబరం వర్గాల్లో ఉత్కంఠను రేపుతున్నది. ఇక కాంగ్రెస్ గ్రూపు రాజీకీయాల్లో అయితే, చర్చ హోరెత్తుతున్నది. ఈ సమయంలో తాజాగా సీబీఐ నళిని చిదంబరానికి సమన్లు జారీ చేసి ఉండడం గమనార్హం. ఈ సమన్ల మేరకు సెప్టెంబర్ మొదటి వారంలో కోల్‌కతాలో సీబీఐ విచారణాధికారి ఎదుట ఆమె హాజరు కావాల్సి ఉంటుంది. శారద చిట్ ఫండ్ కేసులో ఇప్పటికే అరెస్టయిన వారి వద్ద జరిపిన విచారణ మేరకు ఇది వరకు ఓ మారు నళిని విచారణకు హాజరయ్యారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇదే కేసు విచారణలో నళినికి ప్రమేయం ఉన్నట్టుగా కొన్ని ఆధారాలు వెలుగులోకి వచ్చినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, ఇందులో ఏ మేరకు వాస్తవాలు ఉన్నాయో ఏమోగానీ, సీబీఐ మాత్రం సమన్లు జారీ చేసి ఉండటం చిదంబరం మద్దతు దారుల్లో ఉత్కంఠను రేపి ఉండటం ఆలోచించ దగ్గ విషయమే. ఈ సమన్ల నేపథ్యంలో ఈ శారద చిట్ ఫండ్ స్కాం వ్యవహారాన్ని నళిని నెత్తిన కూడా బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టుగా చిదంబరం మద్దతు దారులు ఆరోపిస్తున్నారు. -
విడుదలకు నో..
సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న నళిని దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు బుధవారం కొట్టివేసింది. గత 20 ఏళ్లకు పైగా జైలుశిక్షను అనుభవిస్తున్న కారణంగా తనను విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న ఆమె కోర్కెను కోర్టు నిరాకరించింది. రాజీవ్‌గాంధీ హత్య కేసులో నళినీ సహా ఏడుగురు వేలూరు జైలు లో యావజ్జీవ ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్నారు. 20 ఏళ్లకు పైగా జైలుశిక్షను అనుభవించేవారిని విడుదల చేయవచ్చంటూ తమిళనాడు ప్రభుత్వం 1994లో ఒక చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం విడుదలకు తాను అర్హురాలిని అంటూ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి, జైళ్లశాఖ డీఐజీకి 1994 ఫిబ్రవరిలో నళినీ విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విజ్ఞప్తిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మద్రాసు హైకోర్టులో ఇటీవల రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రభుత్వం బదులిస్తూ, నళినీ సహా ఏడుగురు విడుదలపై సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్నందున ఆమె దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను కొట్టివేయాల్సిందిగా ప్రభుత్వం హైకోర్టును కోరింది. నళినీ పిటిషన్ బుధవారం విచారణకు రాగా న్యాయమూర్తి సత్యనారాయణ ప్రభుత్వ వాదనతో ఏకీభవించారు. రాజీవ్ హంతకుల విడుదలపై సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్నపుడు మద్రాసు హైకోర్టు వేరుగా నిర్ణయాన్ని తీసుకునేందుకు వీలులేదని పేర్కొం టూ నళినీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ప్రకారం నళినీ విడుదలపై దాఖలు చేసుకున్న పిటిషన్‌ను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయమూర్తి సూచిం చారు. -
నళినికి పెరోల్ హైకోర్టు ఉత్తర్వులు
టీనగర్:రాజీవ్‌గాంధీ హత్య కేసులో జైల్లో ఉన్న నళినికి తండ్రి 16వ రోజు కార్యంలో పాల్గొనేందుకు ఒక రోజు పెరోల్ అందజేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. వేలూరు జైలులో యావజ్జీవ ఖైదీగా నళిని శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈమె హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఈ విధంగా తెలిపారు. తన తండ్రి శంకరనారాయణన్ గత ఫిబ్రవరి నెల 23వ తేదీ మృతిచెందారని, ఆయన అంత్యక్రియలు చెన్నైలో మరుసటి రోజు 24వ తేదీన జరిగాయని పేర్కొన్నారు. ఆ రోజున ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తనకు వేలూరు జైలు సూపరింటెండెంట్ పెరోల్ అందజేయడంతో తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ఇలావుండగా తన తండ్రి 16వ రోజు కార్యం ఈ నెల తొమ్మిదవ తేదీన జరుగనుందని, ఇందులో పాల్గొనేందుకు మూడు రోజులు అనగా ఎనిమిదవ తేదీ నుంచి 10వ తేదీ వరకు పెరోల్ కోరుతూ జైలు సూపరింటెండెంట్‌కు గత రెండవ తేదీన పిటిషన్ అందజేసినట్లు పేర్కొన్నారు. దీనిపై ఇంతవరకు పరిశీలన జరపలేదని, తనకు మూడు రోజులపాటు సెలవు అందజేసేందుకు సూపరింటెండెంట్‌కు ఉత్తర్వులివ్వాలని కోరారు. ఒక రోజు పెరోల్: హైకోర్టు నళిని తండ్రి 16వ రోజు కార్యంలో పాల్గొనేందుకు ఒక రోజు పెరోల్ అందజేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆమెకు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి బుధవారం సాయంత్రం నాలుగు గంటల వరకు ఒక రోజుపాటు పెరోల్ అందజేస్తున్నట్లు తెలిపారు. హైకోర్టు ఉత్తర్వుల ఆధారంగా వేలూరు సెంట్రల్ జైలు అధికారులు ఆమెను ఒక రోజు పెరోల్‌పై విడుదల చేశారు. పోలీసుల భద్రత మధ్య ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు. -
పెరోల్ కోసం నళిని వినతి
వేలూరు: రాజీవ్‌గాంధీ హత్య కేసులో వేలూరు మహిళా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న నళిని మూడు రోజుల పెరోల్ కోసం వినతి చేసినట్లు న్యాయవాది పుగయేండి తెలిపారు. రాజీవ్ హంతకులు మురుగన్, శాంతన్, పేరరివాలన్‌లతో పాటు మొత్తం ఏడుగురు వేలూరు సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నళిని న్యాయవాది పుగలేంది మహిళా జైల్లో ఉన్న నళిని పరామర్శించి మాట్లాడారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ నళిని తండ్రి శంకర్ నారాయణన్ గత వారం మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో తండ్రి 16వ రోజు కార్యం కోసం ఈనెల 8,9,10 తేదీల్లో మూడు రోజుల పెరోల్ కోసం వేలూరు మిహ ళా జైలు సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి వద్ద ఈనెల 2వ తేదీన నళిని వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ వినతిపై ఈనెల 7వ తేదీన కోర్టులో దాఖలు చేసి విచారించనున్నారన్నారని తెలిపారు. ఏడుగురి విడుదల గురించి 2014లో అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. ఏడుగురిని విడుదల చేసేందుకు ఎన్నికల కోడ్ ఆటంకం కాదన్నారు. -
ఆ ఇల్లే ఓ ఉద్యానవనం
ఇంటిపంట ‘సాక్షి’ ఇంటిపంట ఇచ్చిన స్ఫూర్తితో... స్వయంగా పండించిన సేంద్రియ పండ్లు, కూరగాయలనే తన కుటుంబ అవసరాలకు వినియోగించాలనే లక్ష్యంతో మేడపైన ఇంటి పంటలు పెంచుతున్నారు వనమామళె నళిని. గృహిణిగా ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రస్తుతం 300 కుండీల్లో వివిధ రకాల పూలు, పండ్లు, కాయగూర మొక్కలను టైపై పెంచుతున్నారు. తమ కుటుంబానికి సరిపడా పండ్లు, వారంలో మూడు రోజులకు సరిపోయే కూరగాయలను, ఇంటిపట్టునే పండించుకోవటం విశేషం. హైదరాబాద్ మెహిదీపట్నానికి చెందిన వనమామళ నళిని ‘సాక్షి’ దినపత్రికలో ‘ఇంటిపంట’ శీర్షిక స్ఫూర్తితో తమ ఇంటిపైన పండ్లమొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. అరటి, మునగ, పాల సపోటా, ఉసిరి, బొప్పాయి, బత్తాయి, దానిమ్మ, రెడ్ మలేషియన్ గోవా, చెర్రీ, థాయ్మాంగో లాంటి పండ్ల మొక్కలు.. బూడిద గుమ్మడి, పుచ్చ, దోస, కాకర, బీర, పొట్ల, సొర, చిక్కుడు తదితర తీగజాతి కూరగాయలు.. క్యాబేజీ, కాలీఫ్లవర్ , ఉల్లి, టమాటా, ఫ్రాన్స్ చిల్లీ, వంగ, బెండ తదితర కాయగూరలు... కరివేపాకు, గోంగూర, మెంతికూర, చుక్కకూర, బిర్యానీ ఆకు, పాలకూర లాంటి ఆకుకూరలను ఆవిడ మేడపైన కుండీల్లో పెంచుతున్నారు. ఇందుకోసం పాత ప్లాస్టిక్ డబ్బాలు, మినరల్ వాటర్ డబ్బాలు, చెక్క పెట్టెలు, పాలిథిన్ కవర్లు, మట్టి కుండీలను వినియోగిస్తున్నారు. ‘మట్టి, వరిపొట్టు, వర్మీ కంపోస్టు, కోకోపిట్లను సమాన నిష్పత్తిలో కలిపిన మట్టి మిశ్రమాన్ని వాడుతున్నాను. ఏడాదికోసారి కుండీల్లోని 60 శాతం మట్టి మిశ్ర మాన్ని తొలగించి.. కొత్త మట్టి మిశ్రమాన్ని నింపుతాను. వంటింటి వ్యర్థాలతో తయారుచేసిన కంపోస్టుతోపాటు జీవామృతాన్ని వారానికి ఒకసారి మొక్కలకు అందిస్తాను. ప్రతి రోజూ సాయంత్రం మొక్కలకు నీరు పోస్తున్నా. హానిచేసే కీటకాల నుంచి మొక్కలను రక్షించేందుకు కుంకుడు కాయల రసం, త్రీజీ (అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు సమాన నిష్పత్తిలో కలిపిన) కషాయాన్ని ఉపయోగిస్తున్నాను. ఈ మిశ్రమానికి 1:10 నిష్పత్తిలో నీరు కలిపి పది రోజులకు ఒకసారి పిచికారి చేస్తాను. దీంతోపాటు పల్చటి మజ్జిగను కొంచెం సర్ఫ్‌తో కలిపి పిచికారీ చేయటం వల్ల కీటకాలు, తెగుళ్ల బెడదను పూర్తిగా నివారించవచ్చు. వంటకు ఉపయోగించే ముందు చేప ముక్కలు కడిగిన నీళ్లను 3 రోజులు మురగబెట్టి కుండీల్లో నెలకోసారి పోస్తుంటాను. దీనివల్ల మొక్కల పెరుగుదల బాగుంది. పూత రాలటం ఆగిపోయింది.’ అన్నారామె. వేసవి ఎండల నుంచి మొక్కలకు రక్షణ కల్పించేందుకు గ్రీన్ షేడ్‌నెట్‌ను నళిని ఏర్పాటు చేసుకున్నారు. కుండీల్లో తేమ ఆరిపోకుండా కొబ్బరిపొట్టు, ఎండుటాకులను ఆచ్ఛాదనగా వేస్తున్నారు. రోజూ ఒక గంట సమయం కేటాయిస్తే చాలన్నారు. ఇదివరకు ప్రతి చిన్న విషయానికీ విసుగు, కోపం వచ్చేవని.. ఇంటిపంటల సాగు ప్రారంభించాక ఉత్సాహంగా ఉందన్నారు. ఖాళీ సమయాన్ని వెచ్చించి కుటుంబ సభ్యులకు ఆరోగ్యకరమైన ఆహారాన్నందిస్తున్నానన్న భావన ఎంతో తృప్తిని కలిగిస్తోంది. థాంక్స్ టూ ‘ఇంటిపంట’ అంటున్నారు నళిని. ్చజీజీ.ఠిఝఠీఃజఝ్చజీ.ఛిౌఝ ద్వారా ఆమెను సంప్రదించవచ్చు. - దండేల కృష్ణ, ఇంటిపంట డెస్క్ -
నళిని పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: రాజీవ్ గాంధీ హత్య కేసులో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసు నిందితురాలు నళిని శ్రీహరన్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సీబీఐ కేసుల్లో విధించిన శిక్షను రద్దు చేసే అధికారం ఒక్క కేంద్ర ప్రభుత్వానికే కట్టబెట్టే చట్టాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. రాజీవ్‌గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న నళిని ప్రస్తుతం తమిళనాడులోని వెళ్లూరు జైలులో ఉంది. -
చిదంబరం సతీమణిని ప్రశ్నించిన సీబీఐ
న్యూఢిల్లీ: శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం సతీమణి నళినిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. చెన్నైలో శనివారం సాయంత్రం ఆమెను సీబీఐ అధికారులు ప్రశ్నించారని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం జైలులో ఉన్న శారదా చిట్‌ఫండ్ చైర్మన్ సుదీప్త సేన్.. నళినికి లాయర్ ఫీజు కింద నళినికి కోటి రూపాయలు చెల్లించినట్టు వెల్లడించారు. దీనిపై ఆమెను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. నళినిని సీబీఐ అధికారులు ప్రశ్నించినట్టు వచ్చిన వార్తలను ఆమె సన్నిహితులు కొట్టిపారేశారు. శారదా చిట్‌ఫండ్ నుంచి న్యాయబద్దంగానే నళిని కోటి రూపాయలు తీసుకున్నారని చెప్పారు. -
నళిని బెయిల్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసు నిందితురాలు నళిని దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రాజీవ్ హత్యకేసుకు సంబంధించి గత 23 ఏళ్లుగా జైలులో ఉన్న తనను విడుదల చేయాలని కోరుతూ నళిని సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె తరఫున కోర్టులో పిటిషన్ దాఖలైంది. కాగా రాజీవ్‌గాంధీ హత్యకేసులో మరణశిక్ష పడిన మురుగన్, శాంతన్, పేరరివాలన్‌లు క్షమభిక్షకోరుతూ రాష్ట్రపతిని అభ్యర్థించగా దానిపై 10 సంవత్సరాలుగా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మళ్లీ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయకపోతే...
వేదిక కాలం ఎలా ఎవరి కోసమూ ఆగదో... వయసు కూడా అంతే. పరుగులు తీస్తుంది తప్ప ఎక్కడా ఆగనే ఆగదు. అందుకే అది మన చేయి దాటిపోయేలోపు చేయాల్సింది చేసెయ్యాలి. లేదంటే తర్వాత తీరిగ్గా బాధపడినా ఉపయోగం ఉండదు. ఈ ఉపోద్ఘాతం ఎందుకనేనా? నేను ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయలేదు. దానికి ఇప్పటికీ బాధపడుతున్నాను. నాన్న సివిల్ ఇంజినీర్. అమ్మ డాక్టర్. ఇద్దరూ ఎంత బిజీ అంటే... పొద్దున్న నేను లేవకముందు, సాయంత్రం నేను నిద్రపోయాక మాత్రమే నా ముఖాన్ని చూసేంత. దాంతో వాళ్లిద్దరి ముఖాలూ చూసే చాన్స్ నాకెప్పుడో కానీ దక్కేది కాదు. మొదట్లో బెంగగా ఉండేది. తర్వాత అలవాటైపోయింది. కాలేజీ ఈడు వచ్చేసరికి ఆ ఏకాంతం బాగుందనిపించేది. నేనేం చేసినా అడిగేవాళ్లు లేరని చాలా స్వేచ్ఛగా ఫీలయ్యేదాన్ని. నన్ను చేర్పించినప్పుడు మాత్రమే అమ్మా నాన్నలు నా కాలేజీలో అడుగు పెట్టారు. ఆ తర్వాత ఎప్పుడూ వచ్చిందే లేదు. నాకు మాత్రం ఏ లోటూ రానిచ్చేవారు కాదు. కావలసినంత పాకెట్ మనీ. అది దేనికి ఖర్చు పెడుతున్నానో చూసే తీరిక వారికెప్పుడూ లేదు. నేను ఆ డబ్బును పార్టీలు చేసుకోవడానికి ఉపయోగించాను. తిరగడానికి కారుంది. అందులో నేనెక్కడికి వెళుతున్నానో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మమ్మీకి గానీ, డాడీకి గానీ అనిపించలేదు. నేను ఆ కారును నా బాయ్ ఫ్రెండ్‌తో పిక్నిక్స్కి వెళ్లడానికి వాడుకున్నాను. నన్ను అడిగేవాళ్లు లేరన్న ఫీలింగ్ నన్నెంత పెడతోవ పట్టిస్తోందో అప్పుడు అర్థం కాలేదు. ఏనాడూ సరిగ్గా చదివింది లేదు కాబట్టి ఫైనల్ ఎగ్జామ్స్‌లో ఫెయిలయ్యాను. సప్లిమెంటరీ రాసినా పాసవ్వలేదు. మళ్లీ మళ్లీ రాయడంతోనే రెండేళ్లు గడిచిపోయింది. నా క్లాస్మేట్స్ అందరూ ముందుకెళ్లిపోయారు. త్వరత్వరగా చదువులు పూర్తి చేసి ఉద్యోగాల్లో సెటిలైపోయారు. ఎప్పుడూ చదువు మీద మనసు లేదు కాబట్టి నా చదువు పూర్తయ్యేసరికి చాలాకాలమే పట్టింది. అత్తెసరు మార్కులతో పాసయ్యాను కాబట్టి మంచి ఉద్యోగం వట్టి కల గానే మిగిలిపోయింది. నాన్న రికమెండేషన్‌తో ఏదో చిన్న ఉద్యోగమైతే వచ్చింది కానీ మిగతా వాళ్లలాగా నేను బాగా సెటిలవ్వలేకపోయానే అన్న బాధ ఇప్పటికీ నన్ను తొలిచేస్తూ ఉంది. కనీసం ఏదైనా ప్రభుత్వోద్యోగం కోసం ప్రయత్నిద్దామన్నా కూడా వయసు పరిమితి అయిపోయి, అదీ కలగానే మిగిలిపోయింది. చదువుకోవాల్సిన వయసులో సరదాల కోసం ఆరాటపడ్డాను. స్థిరపడాల్సిన వయసులో చదువు పూర్తి చెయ్యాలని ఆరాటపడ్డాను. ప్రశాంతంగా కాలు మీద కాలేసుకుని బతకాల్సిన వయసులో మంచి సెటిల్మెంట్ కోసం ఇంకా ఆరాటపడుతూనే ఉన్నాను. ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటికి అర్థం చేసుకున్నాను. కానీ ఏం లాభం... అందమైన కెరీర్‌ని, ఆనందకరమైన జీవితాన్ని కోల్పోయాను! - నళిని, బెంగళూరు -
నళిని నిరాహార దీక్ష!
దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్‌ను చూసేందుకు కోర్టు అనుమతించక పోవడంతో మహిళా జైలులో నళిని ఆహారం తినకుండా నిరాహారదీక్షకు దిగింది. మురుగన్ పురుషుల జైలులో, భార్య నళిని మహిళా జైలులో శిక్ష అనుభవిస్తు న్న విషయం తెల్సిందే. వీరు ప్రతి 15 రోజు లకు ఒకసారి మాట్లాడేందుకు గతంలో కోర్టు అనుమతించింది. అయితే కొద్ది రోజుల క్రితం మురుగన్ నుంచి సెల్‌ఫోన్, నగదును పోలీ సులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యం లో ఈ నెల 12న నళిని, మురుగన్‌లు కలుసుకోవాల్సి ఉంది. అయితే పోలీసులు అనుమతించలేదు. నిబంధనలకు విరుద్దంగా మురుగన్ జైలులో నగదు పెట్టుకున్నాడన్న నెపంతో రెండు నెలలు నళిని చూడకుండా నిషేధం విధించారు. విషయం తెలుసుకున్న నళిని జైలులో మౌన పోరాటం చేసోంది. మహిళా జైలులోని అధికారులు చర్చలు జరిపారు. ఆ సమయంలో తనకు ఆహారం వద్దని భర్తను చూడకుండా ఉండలేక పోతున్నానని నళిని కన్నీరు పెట్టుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు. గురువారం పూర్తిగా ఆహారం తీసుకోలేదు. చర్చల అనంతరం శుక్రవారం ఉద యం ఆమె ఆహారం తీసుకున్నట్లు తెలిపారు. -
జైలులో నళిని- మురుగన్ భేటీ
వేలూరు, న్యూస్‌లైన్: రాజీవ్ గాంధీ హత్య కేసులో వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నళిని, భర్త మురుగన్ శనివారం ఉదయం కలిసి మాట్లాడుకున్నారు. మురుగన్ పురుషుల జైలులో ఉండగా అతని భార్య నళిని మహిళా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నళిని, మురుగన్‌లు ఇద్దరూ నెలకోసారి కలిసేందుకు ఇది వరకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతి నెలా పోలీస్ బందోబస్తు నడుమ జైలులో కలిసి మాట్లాడుతున్నారు. శనివారం ఉదయం డీఎస్పీ ప్రభాకరన్ ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు నడుమ ఉదయం 7.30 గంటలకు మురుగన్‌ను మహిళా సెంట్రల్ జైలు వద్దకు వాహనంలో తీసుకొచ్చి నళినీతో కలిసి మాట్లాడే ఏర్పాట్లు చేశారు. ఉరిశిక్షను రద్దు చేసి జీవిత ఖైదీగా ప్రకటించిన అనంతరం నళిని, మురుగన్ కలవడం ఇదే మొదటి సారి కావడం విశేషం. -
నళిని పెరోల్‌కు విముఖత
తండ్రిని చూసేందుకు అనుమతి కోరిన రాజీవ్ గాంధీ హంతకురాలు నళినికి ఒక నెల రోజుల పాటు సెలవు మంజూరు చేసేందుకు విముఖత తెలుపుతూ జైళ్ల శాఖ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజీవ్ హత్య కేసులో వేలూరు జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న నళిని హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. తన తండ్రి రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ 95 ఏళ్ల వయసులో చివరి దశలో ఉన్నారని, చివరి రోజుల్లో ఆయనతో గడిపేందుకు ఒక నెల రోజుల పాటు తనకు సెలవు ఇవ్వాలని కోరారు. ఈ కేసు న్యాయమూర్తులు ఎస్.రాజేశ్వరన్, పిఎన్ ప్రకాష్ సమక్షంలో మంగళవారం విచారణకు వచ్చింది. వేలూరు జైలు సూపరింటెండెంట్ కరుప్పన్నన్ సంజాయిషీ పిటిషన్ దాఖలు చేశారు. తిరునెల్వేలి జిల్లా విక్రమ సింగ పురం జిల్లా సమీపాన గల అంబలవానపురంలో పిటిషనర్ నళిని తండ్రి శంకరనారాయణన్ నివసిస్తున్నారని ఆయన ఆరోగ్యకరంగా ఉన్నారని తెలిపారు. విక్రమసింగపురం కొండ ప్రాంతం కావడంతోను, పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నందున నళిని అక్కడ గడపడం సరికాదని అన్నారు. అంతేకాకుండా రాజకీయ నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆమెను కలిసే అవకాశం ఉందని విక్రమసింగపురం పోలీసు ఇన్స్పెక్టర్ ఆక్షేపణ వ్యక్తం చేసినట్లు తెలిపారు. దీని గురించి జైళ్ల శాఖ అధికారి కూడా నివేదిక దాఖలు చేసినట్లు తెలిపారు. నళిని పిటిషన్‌ను నిరాకరించాలని కోరారు. దీంతో ఈ కేసు విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేశారు. -
పెరోల్ ఇవ్వండి
సాక్షి, చెన్నై: రాజీవ్ హత్య కేసు నిందితురాలు నళిని పెరోల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. నెల రోజులు తనకు పెరోల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో మురుగన్, శాంతన్, పేరరివాలన్‌తో సహా నళినికి ఉరి శిక్ష పడిన విషయం తెలిసిందే. కొన్నాళ్లకు ఆమె ఉరి శిక్ష యావజ్జీవంగా మారింది. రాజీవ్ గాంధీ కుటుంబం కరుణించడంతోనే ఆమెకు శిక్ష తగ్గిందని చెప్పవచ్చు. నళినిని కలుసుకునేందుకు రాజీవ్ కుమార్తె ప్రియాంక గాంధీ వేలూరు జైలుకు సైతం వచ్చారు. ఇది వరకు మూడు రోజులు నళిని పెరోల్ మీద బయటకు వచ్చారు కూడా. అదే సమయంలో 22 ఏళ్లుగా కటకటాల్లో ఉన్న తనను విడుదల చేయాలని కోరుతూ నళిని కోర్టులను ఆశ్రయిస్తూ వస్తున్నారు. ఆమె విడుదల పిటిషన్లు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. అయితే, భర్త మురుగన్‌ను నెలకో సారి కలుసుకునే అవకాశం మాత్రం ఆమెకు దక్కింది. ఈ పరిస్థితుల్లో తాజాగా ఉరి శిక్షను ఎదుర్కొంటున్న ఖైదీల్లో ఆనందాన్ని నింపే విధంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో ఇక తమకు ఉరి తప్పిందన్న ఆనందంలో రాజీవ్ హత్య కేసు నిందితులు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఏకంగా నెల రోజుల పాటు పెరోల్ మీద బయటకు వచ్చేందుకు నళిని నిర్ణయించారు. తనను విడుదల చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ల విచారణ వేగవంతం చేయడంతోపాటుగా, పెరోల్ మీద బయటకు వచ్చి కొంతకాలం తన కుమార్తె, కుటుంబంతో కలసి ఉండేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందుకోసం బుధవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.పిటిషన్: 22 ఏళ్లుగా తాను వేలూరు కేంద్ర కారాగారంలో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నట్టు పిటిషన్లో నళిని వివరించారు. తన తండ్రి తంగనారాయణన్ (90) తిరునల్వేలి జిల్లా అంబలవానన్ పురంలో నివాసం ఉంటున్నారని గుర్తు చేశారు. తన తండ్రి అనారోగ్యంతో ఉన్నారని, ఆయనకు తోడుగా మరెవ్వరూ లేరని పేర్కొన్నారు. తాను ఆయనతో కొన్నాళ్లు ఉండి, ఆరోగ్య పరంగా సేవలను అందించేందుకు ఆశ పడుతున్నట్టు వివరించారు. తనకు నెల రోజులు పెరోల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇది వరకు తాను మూడు రోజులు పెరోల్ మీద బయటకు వచ్చానని గుర్తు చేశారు. తన తండ్రి కోసం పెరోల్ ఇవ్వాలని వేడుకున్నారు. ఈపిటిషన్ను న్యాయమూర్తులు రాజేశ్వరన్, ప్రకాష్ నేతృత్వంలోని బెంచ్ పరిశీలించింది. విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 11కు వాయిదా వేసింది. అదే రోజు రాష్ర్ట ప్రభుత్వం, జైళ్ల శాఖ, కేసు సంబంధిత అధికారులు రిట్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ నోటీసును న్యాయమూర్తులు జారీ చేశారు.