న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసు నిందితురాలు నళిని దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రాజీవ్ హత్యకేసుకు సంబంధించి గత 23 ఏళ్లుగా జైలులో ఉన్న తనను విడుదల చేయాలని కోరుతూ నళిని సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు ఆమె తరఫున కోర్టులో పిటిషన్ దాఖలైంది. కాగా రాజీవ్‌గాంధీ హత్యకేసులో మరణశిక్ష పడిన మురుగన్, శాంతన్, పేరరివాలన్‌లు క్షమభిక్షకోరుతూ రాష్ట్రపతిని అభ్యర్థించగా దానిపై 10 సంవత్సరాలుగా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మళ్లీ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.