ఈ దిశగా కసరత్తు మొదలుపెట్టని రాష్ట్ర ప్రభుత్వం
ఎస్సీ వర్గీకరణపై మాత్రం వన్‌మెన్ జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటుకు కమిటీ సిఫార్సు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) వర్గీకరణ ప్రక్రియ ఇప్పట్లో ముందుకు కదిలే అవకాశం కనిపించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఉపకులాల వర్గీకరణ కోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయగా.. ఆ కమిటీ మాత్రం కేవలం ఎస్సీ వర్గీకరణపైనే ప్రధానంగా దృష్టి సారిస్తోంది. దీంతో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాల్లో పురోగతి కనిపిస్తున్నప్పటికీ ఎస్టీ వర్గీకరణపై మాత్రం కమిటీ చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. దీంతో ఎస్టీ వర్గీకరణ అంశం కాస్త వెనకబడిపోయింది.
అసెంబ్లీలో సీఎం ప్రకటన..: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేపట్టి రిజర్వేషన్లు అమలు చేసే అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటిన తీర్పు చెప్పడం తెలిసిందే. ఈ తీర్పు వెలువడిన వెంటనే దేశంలోకెల్లా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను అమలు చేసే మొదటి రాష్ట్రం తెలంగాణ అవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇప్ప టికే జారీ చేసిన ఉద్యోగ నియామక నోటిఫికేషన్లకు కూడా వర్గీకరణను అమలు చేస్తామని స్పష్టం చేశా రు.
ఇందులో భాగంగా గత నెల 12న రాష్ట్ర ప్రభు త్వం నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన వర్గీకరణ కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలు, ఇందుకు అవసరమైన సూచనలను తమకు తెలియజేయాలని కమి టీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఇప్పటివరకు మూడుసార్లు సమావేశమైన కమిటీ.. వర్గీకరణపై ప్రత్యేక కార్యాచరణ తయారు చేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖను ఆదేశించడంతోపాటు పంజాబ్, హరియాణా, తమిళనాడులో అమలవుతున్న వర్గీకరణపై అధ్యయనానికి అధికారుల బృందాన్ని ఆయా రాష్ట్రాలకు పంపింది.
అధికారులు ఆ అధ్యయనాన్ని పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. తాజాగా ఎస్సీ వర్గీకరణకు వన్‌మెన్ జ్యుడీíÙయల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించింది. కానీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించిన ప్రక్రియ మాత్రం ముందుకు కదలడం లేదు.
వర్గీకరణ జాప్యంతో...: సీఎం ప్రకటనకు భిన్నంగా టీచర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా విడుదల చేశారు. మొత్తం 11 వేల టీచర్ ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను సైతం పూర్తి చేశారు. ఈ నెల 9న టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలు సైతం ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
మరోవైపు గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి దాదాపు 9 వేల ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక, ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. వైద్య విద్య అడ్మిషన్ల ప్రక్రియలోనూ దాదాపు 8 వేల సీట్లకు అడ్మిషన్ల ప్రక్రియలో రెండో విడుత వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ సైతం పూర్తి కావచి్చంది. వర్గీకరణ ప్రక్రియను తేల్చకపోవడంతో ఎస్సీ, ఎస్టీల్లోని ఉపకులాలకు సరైన న్యాయం జరగడం లేదనే వాదన రోజురోజుకు పెరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment