కోర్టు తీర్పు ఎపిసోడ్‌.. నా వ్యాఖ్యలను వక్రీకరించారు: సీఎం రేవంత్‌ | CM Revanth Responds Over Supreme Courts Comments Issue | Sakshi
Sakshi News home page

కోర్టు తీర్పు ఎపిసోడ్‌.. నా వ్యాఖ్యలను వక్రీకరించారు: సీఎం రేవంత్‌

Published Fri, Aug 30 2024 10:43 AM | Last Updated on Fri, Aug 30 2024 10:43 AM

CM Revanth Responds Over Supreme Courts Comments Issue

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ లిక్కర్‌ స్కాం అంశంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టే ఉద్దేశ్యం తనకు లేదన్నారు. అలాగే, న్యాయ వ్యవస్థపై అపారమైన గౌరవం ఉంది అంటూ సీఎం కామెంట్స్‌ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘భారత న్యాయవ్యవస్థపై నాకు అత్యంత గౌరవం, పూర్తి విశ్వాసం ఉంది. నా వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు, పత్రికలు వక్రీకరించాయి. సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టే ఉద్దేశ్యం నాకు లేదు. ఇలా జరగడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. పత్రికల్లో వార్తల పట్ల బేషరతుగా నా విచారం వ్యక్తం చేస్తున్నాను. అలాంటి తప్పుడు వ్యాఖ్యలను నాకు ఆపాదించడం కరెక్ట్‌ కాదు’ అంటూ కామెంట్స్‌ చేశారు.

 

 ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ అంశంపై సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కవితకు బెయిల్ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరిందన్న రేవంత్ వ్యాఖ్యలను, ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి చేయాల్సిన వ్యాఖ్యలేనా అని జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం రేవంత్‌ రెడ్డి తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీని ప్రశ్నించింది. రాజకీయాల్లోకి కోర్టులను ఎందుకు లాగుతారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము రాజకీయ పార్టీలను సంప్రదించి ఆదేశాలు జారీ చేయాలా? అని నిలదీసింది. తమ ఆదేశాలపై రాజకీయ నేతలు చేసే వ్యాఖ్యలను పట్టించుకోబోమని తేల్చిచెప్పింది. ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలన్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement