జైలులో నళిని- మురుగన్ భేటీ | nalini meet with murugan from jail | Sakshi
Sakshi News home page

జైలులో నళిని- మురుగన్ భేటీ

Published Sun, Feb 23 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 AM

nalini meet with murugan from jail

 వేలూరు, న్యూస్‌లైన్: రాజీవ్ గాంధీ హత్య కేసులో వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నళిని, భర్త మురుగన్ శనివారం ఉదయం కలిసి మాట్లాడుకున్నారు.

 

మురుగన్ పురుషుల జైలులో ఉండగా అతని భార్య నళిని మహిళా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నళిని, మురుగన్‌లు ఇద్దరూ నెలకోసారి కలిసేందుకు ఇది వరకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతి నెలా పోలీస్ బందోబస్తు నడుమ జైలులో కలిసి మాట్లాడుతున్నారు.

 

శనివారం ఉదయం డీఎస్పీ ప్రభాకరన్ ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు నడుమ ఉదయం 7.30 గంటలకు మురుగన్‌ను మహిళా సెంట్రల్ జైలు వద్దకు వాహనంలో తీసుకొచ్చి నళినీతో కలిసి మాట్లాడే ఏర్పాట్లు చేశారు. ఉరిశిక్షను రద్దు చేసి జీవిత ఖైదీగా ప్రకటించిన అనంతరం నళిని, మురుగన్ కలవడం ఇదే మొదటి సారి కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement