Rajiv gandhi murder case
-
రాజీవ్ గాంధీ హంతకులకు సుప్రీంకోర్టు లో ఊరట
-
రాజీవ్ గాంధీ హత్య కేసు: దోషికి పెరోల్
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న దోషి ఏజీ పెరరివళన్ పెరోల్ పొందారు. వైద్య పరీక్షల నిమిత్తం సుప్రీం కోర్టు సోమావారం ఆయనకి వారం రోజులపాటు పెరోల్ జారీ చేసింది. కాగా, నవంబర్12న అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని చూడటానికి, మేనకోడలు వివాహం హాజరుకావడానికి పెరోల్ పోందారు. ప్రస్తుతం పెరరివళన్ జీవిత ఖైదు శిక్షను చెన్నై సమీపంలోని పుజల్ సెంట్రల్ జైలులో అనుభవిస్తున్నారు. తాజాగా ఇచ్చిన పెరోల్ గడువు నవంబర్ 23 వరకు కొనసాగుతుంది. ఆయన గతంలో 2017లో తన తండ్రి అనారోగ్యంతో ఉంటే పెరోల్ పొందిన విషయం తెలిసిందే. చదవండి: రాజీవ్ హత్యకేసులో దారులన్నీ మూతపడ్డట్లే..! 1991లో చెన్నై సమీపంలోని శ్రీపెరంపుదూర్ వద్ద జరిగిన ఎన్నికల ర్యాలీలో ఎల్టీటీఈ ఆత్మాహుతి బాంబు దాడిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మృతి చెందిన విషయం తెలిసిందే. పెరరివళన్‌తో పాటు, ఈ కేసులో దోషులుగా తేలిన మురుగన్, అతని భార్య నలిని, సుతేంతిరా రాజా అలియాస్ సంతన్, రాబర్ట్ పయాస్, జయకుమార్, రవిచంద్రన్‌లకు జీవిత ఖైదు విధించారు. ఈ ఏడుగురిని విడుదల చేయాలనే తీర్మానాన్ని తమిళనాడు మంత్రివర్గం ఆమోదించగా, ఆ కేసుకు సంబంధించిన ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నది. -
రాజీవ్ హత్యకేసులో దారులన్నీ మూతపడ్డట్లే..!
సాక్షి, చెన్నై: రాజీవ్ హత్య కేసు నిందితుల విడుదలకు దారులన్నీ మూసుకున్న నేపథ్యంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం వ్యాఖ్యలు ఎదురు చూపులకు దారితీశాయి. ఇందుకు తగ్గట్టుగా రాజ్‌భవన్ కార్యదర్శి ప్రభుత్వానికి లేఖ రాయడం గమనార్హం. రాజీవ్ హత్యకేసులో నింధితులుగా ఉన్న నళిని, మురుగన్, శాంతన్, పేరరివాలన్ సహా ఏడుగురి ఉరిశిక్ష యావజ్జీవంగా మారిన విషయం తెలిసిందే. శిక్షా కాలం ముగిసినా తాము జైలుకే పరిమితం కావడంతో విడుదల చేయాలని కోరుతూ నిందితులు కోర్టుల్ని ఆశ్రయిస్తూ వస్తున్నా ఫలితం శూన్యం. వీరి విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసినా, అది రాజ్‌భవన్‌కే పరిమితమైంది. తమను విడుదలచేసే రీతిలో గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వాలని మళ్లీ కోర్టు తలుపులు తట్టినా ప్రయోజనం శూన్యం. చివరకు బంతి రాజ్ భవన్ కోర్టులో పడింది. ఈ వ్యవహారంలో గవర్నర్ భన్వారిలాల్ పురోహిత్ ఇచ్చే నివేదిక మీద ఆధారపడి ఉంది. అదే సమయంలో శిక్షాకాలం ముగిసినా, జైలులోనే జీవితాలు మగ్గుతున్నాయంటూ నళిని దాఖలు చేసుకున్న పిటిషన్ హైకోర్టు న్యాయమూర్తులు సుబ్బయ్య, పొంగియప్పన్ బెంచ్ ముందుకు గత నెల విచారణకు వచ్చింది. ఈ సమయంలో కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ రాజగోపాల్ కోర్టుకు ఇచ్చిన వివరణ సర్వత్రా షాక్‌కు గురిచేసింది. తమిళనాడు ప్రభుత్వ తీర్మానాన్ని కేంద్రం ఎప్పుడో తిరస్కరించినట్టు వివరించారు. ఆ తీర్మానం విలువను ‘సున్న’గా పరిగణించాలని వాదించడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమ తీర్మానం గురించి నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌కు సిఫారసు చేసి ఉన్నట్టుగా పేర్కొనడంతో విచారణను ముగించే విధంగా, రాజీవ్ హంతకుల ఆశలు అడియాశలు అయ్యే రీతిలో కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. ఇక వీరి విడుదలకు అన్నిదారులు మూసుకున్నట్టే అన్నది స్పష్టం కావడంతో తమిళాభిమాన సంఘాలు, ఈలం మద్దతు సంఘాలు, పార్టీలు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసే పనిలో పడ్డాయి. మంత్రి వ్యాఖ్యలతో కాస్త ఊరట నళిని పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో ఇతర నింధితులు వేర్వేరుగా దాఖలు చేసుకున్న పిటిషన్లన్నీ ఒకదాని తర్వాత మరొకటి మున్ముందు రోజుల్లో తిరస్కరించే అవకాశాలు ఎక్కువే అన్న సంకేతాల నేపథ్యంలో న్యాయశాఖామంత్రి సీవీ షణ్ముగం వ్యాఖ్యలు ఎక్కడో కాస్త ఊరట కల్గించేలా ఉండడం గమనార్హం. అసెంబ్లీలో కొంగు ఇలంజర్ పేరవై ఎమ్మెల్యే తనియరసు సందించిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రమంలో న్యాయశాఖా మంత్రి సీవీ షణ్ముగం స్పందించారు. ఏడుగుర్ని విడుదల చేయాలన్న తపనతో తామూ ఉన్నామని, ఇందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారం గవర్నర్ చేతిలో ఉందని, తాము ఇప్పటికే నిర్ణయం తీసుకునేందుకు తగ్గట్టుగా సిఫారసులు చేసి ఉన్నామని వివరించారు. చదవండి: ఏంటయ్యా ఇంట్లోనే కూర్చోమంటున్నారు! రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ కార్యదర్శికి లేఖ కూడా రాసినట్టు పేర్కొన్నారు. ఇందుకు రాజ్ భవన్ నుంచి గవర్నర్ కార్యదర్శి సమాధానం పంపించి ఉన్నారని వివరించారు. రాజీవ్ హత్య కేసు, కుట్ర విషయంగా సీబీఐ, ఐబీలతో పాటుగా పలు విచారణ బృందాలతో పర్యవేక్షణ కమిటీ నియమించి ఉన్నట్టు ప్రకటించారు. ఆ కమిటీ కోర్టుకు ఇచ్చే నివేదిక మేరకు తదుపరి ప్రభుత్వ సిఫారసు మీద నిర్ణయం తీసుకుంటామని ఆ లేఖలో పేర్కొని ఉన్నారని మంత్రి ప్రకటించడంతో ఈ నివేదిక ఎలా ఉంటుందో, ఈ దారి రూపంలో నైనా వారి విడుదలకు మార్గం లభించేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి. -
నళిని కుమార్తె ఇండియా రాకలో ఆలస్యం
వేలూరు: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసు ముద్దాయి నళిని నెల పెరోల్‌పై వచ్చి వేలూరు సమీపంలోని సత్‌వచ్చారిలో ఉంటున్నారు. గత నెల 20న వేలూరు రంగాపురంలోని పులవర్ నగర్లో ద్రావిడ సిద్ధాంతాలకు చెందిన తమిళ పేరవై రాష్ట్ర జాయింట్ కార్యదర్శి సింగరాయర్ ఇంటిలో ఉంటున్న విషయం తెలిసిందే. ఇదిలాఉండగా కోర్టు నిబంధన మేరకు నళిని ప్రతిరోజూ ఉదయం సత్‌వచ్చారిలోని పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేస్తున్నారు. నళిని కుమార్తె హరిద్ర వివాహ ఏర్పాట్ల కోసం పెరోల్‌పై బయటకు వచ్చిన నళినితో ఆమె తల్లి పద్మ కూడా ఉంటున్నారు. ఈ సందర్భంగా నళిని తల్లి పద్మ మాట్లాడుతూ మనవరాలు హరిద్ర వివాహ ఏర్పాట్లు చేసేందుకు నళిని బయటకు వచ్చారని నెల రోజుల్లోనే మనుమరాలికి నలుగురిని ఎంపిక చేశామని హరిద్ర ఇండియాకు వచ్చిన వెంటనే నలుగురి ఫొటోలను చూపించి నిర్ణయించనున్నామన్నారు. లండన్‌లో ఉన్న హరిద్రకు సెప్టెంబర్ దాకా పరీక్షలు ఉన్నందున ఇండియాకు రావడంలో ఆలస్యం అవుతోందన్నారు. పరీక్షలు అయిన వెంటనే ఈమె తమిళనాడుకు రానున్నారని తెలిపారు. మరో నెల రోజుల పాటు పెరోల్ ఇవ్వాలని నళిని న్యాయవాది ఆధ్వర్యంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నామన్నారు. పెరోల్ పొడిగింపుపై జైలు అధికారులు మాట్లాడుతూ ఇప్పటికే నళినికి కోర్టు నెల పెరోల్ ఇచ్చిందని పొడిగించాలా వద్దా అనే దానిపై కోర్టు నిర్ణయించాల్సిన ఉందన్నారు. కోర్టు పెరోల్ పొడిగించకుంటే ఈనెల 25న సాయంత్రం 5 గంటలలోపు నళిని వేలూరు మహిళా జైలుకు రావాలని తెలిపారు. -
స్టార్‌కు ఓ న్యాయం... మాకో న్యాయమా?
సాక్షి, చెన్నై: బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌కు ఓ న్యాయం...తమకు మరో న్యాయమా అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని రాజీవ్ హత్యకేసు నింధితులు ప్రశ్నించే పనిలో పడ్డారు. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల మేరకు సంజయ్‌దత్‌ను విడుదల చేసినట్టుగానే రాజీవ్ హత్య కేసు నిందితుల్ని కూడా విడుదల చేయాలని న్యాయవాదులు పట్టుబట్టే పనిలో పడ్డారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో నిందితులుగా ఉన్న నళిని, మురుగన్, శాంతన్, పేరరివాలన్, రవిచంద్రన్‌తో పాటు ఏడుగురి విడుదల వ్యవహారం రాష్ట్రంలో దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించినా, రాజ్‌భవన్‌లో స్పందన లేని దృష్ట్యా, చివరకు గవర్నర్ బన్వరిలాల్‌ను ప్రశ్నిస్తూ నిందితుల తరఫున రవిచంద్రన్ ఓలేఖ కూడా రాశారు. నిర్ణయం ఏమిటో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో పేరరివాలన్ కొన్నేళ్లుగా చేసిన న్యాయ పోరాటం, తీవ్ర ప్రయత్నాలకు ఫలితంగా ప్రస్తుతం ఓ కేసు విషయంగా కీలక ఆధారాల్ని సేకరించారు. ముంబై బాంబు పేలుళ్ల కేసులో నిందితుడిగా జైలుశిక్షను సైతం అనుభవించిన బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్ విడుదల వ్యవహారాన్ని పేరరివాలన్ గతంలో అస్త్రంగా చేసుకున్నారు. సీబీఐ విచారిస్తున్న, విచారించిన కేసుల్లో ముందస్తు విడుదల వ్యవహారంలో కేంద్రం ఆదేశాలు, నిర్ణయం తప్పనిసరి అన్న వాదనను పరిగణించి సమాచార హక్కు చట్టం మేరకు సంజయ్‌దత్ విడుదలకు వర్తింపచేసిన నిబంధనల వివరాలను పేరరివాలన్ సేకరించారు. ఇందులోని అంశాలన్ని పేరరివాలన్ తరఫు న్యాయవాదులు మీడియా దృష్టికి తెచ్చారు. ఇదేనా న్యాయం.. సంజయ్‌దత్‌ను ముందస్తుగా విడుదల చేసిన వ్యవహారంలో ఎలాంటి కేంద్రం అనుమతుల్ని మహారాష్ట్ర ప్రభుత్వం పొందనట్టుగా సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల మేరకు తేలాయి. మహారాష్ట్ర జైళ్ల శాఖ నింబంధనలకు అనుగుణంగానే ఆయన్ను విడుదల చేసి ఉండటం గమనార్హం. సంజయ్ దత్‌కు శిక్ష విధించిన సమయంలో కోర్టు తీవ్రంగానే స్పందించిన విషయాన్ని గుర్తు చేస్తూ, మరిన్ని వివరాలను రాబట్టి ఉన్నారు. అలాగే, సంజయ్ దత్ కేసును సీబీఐ విచారించిందని, అది కూడా బాంబు పేలుళ్ల కేసు అని, ఆ కేసులో కేంద్రం అనుమతి అన్నది పొందనప్పుడు, ఈ ఏడుగురి విడుదల విషయంలో మాత్రం ఎందుకు కేంద్రం అనుమతి...? అని పేరరివాలన్ న్యాయవాదులు ప్రశ్నించారు. సంజయ్ దత్‌కు ఓ న్యాయం...రాజీవ్ హత్య కేసు నింథితులకు మరో న్యాయం అన్నట్టుగా వ్యవహరిస్తుండటం విచారకరంగా పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టంలోని అంశాల్ని అస్త్రంగా చేసుకుని న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. అదే సమయంలో ఆ సమాచార హక్కు చట్టం ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, జైళ్ల శాఖ నిబంధనల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు సెక్షన్ 161 మేరకు ఎవ్వరి అనుమతి అన్నది లేకుండా తమిళనాడు ప్రభుత్వానికే ఆ ఏడుగురి విడుదల విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ఉందన్నారు. అంతే గాని, మంత్రి వర్గం ఆమోదాన్ని రాజ్ భవన్‌కు పంపించి, అక్కడ ఆమోదం కోసం ఎదురు చూడకుండా,త మిళనాడు ప్రభుత్వమే కీలక నిర్ణయం తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్చేస్తున్నారు. -
నా బిడ్డ పెళ్లికి వెళ్లనివ్వండి ప్లీజ్
దేశంలోనే దీర్ఘకాలంగా.. 28 ఏళ్లుగా.. జైల్లో ఉన్న మహిళా ఖైదీ నళిని ప్రస్తుతం కూతురి పెళ్లి ఏర్పాట్ల కోసం బెయిల్ ఇమ్మని అడుగుతోంది. కోర్టు ఆమె అభ్యర్థనపై విచారణను జూన్‌కి వాయిదా వెయ్యడంతో ఆమె ఇంకో రెండు నెలల పాటు వేచి ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే నళిని పూర్తిగా విడుదల అయ్యేదెప్పుడు? రాజీవ్‌గాంధీ హత్య కేసులో పాతికేళ్లకు పైగా జైలు శిక్షను అనుభవిస్తున్న నళినీ శ్రీహరన్ ఇప్పట్లో విడుదలయ్యే సూచనలు కనిపించడం లేదు. కానీ రెండేళ్ల క్రితం ఆమె ఆత్మకథ మాత్రం విడుదలైంది. 500 పేజీల ఆ తమిళ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు ప్రచురణకర్తలు చేస్తున్న ప్రయత్నాలకు అవరోధాలు ఎదురు కావచ్చని మొదట అంతా అనుకున్నప్పటికీ అలాంటిదేమీ జరగలేదు. పుస్తకాన్ని ఎండిఎంకె నేత వైకో ఆవిష్కరించారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి హరిపరంథామన్ తొలి ప్రతిని అందుకున్నారు. నళిని జైల్లో ఉండడంతో ఆమె లేకుండానే ఈ కార్యక్రమం జరిగింది.‘రాజీవ్ హత్య : హత్య వెనుక నిజాలు, ప్రియాంక–నళిని సమావేశం’ అనే అర్థం వచ్చే టైటిల్ ఉన్న ఈ తమిళ పుస్తకాన్ని ఏకలైవన్ అనే రచయిత రాశారు.1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబదూరులో ప్రధాని రాజీవ్ గాంధీ హత్య జరిగింది. అప్పటికి సరిగ్గా నెల ముందు ఎల్.టి.టి.ఇ. (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం) తీవ్రవాది శ్రీహరన్ (మురుగన్)తో నళిని వివాహం అయింది. రాజీవ్ హత్యోదంతంలో అరెస్ట్ అయ్యేనాటికే నళిని గర్భవతి. విచారణ ఖైదీగా ఆమెను వెల్లూరులోని మహిళా జైల్లో ఉంచారు. ఇవాళ్టికే ఆమె ఆ జైల్లోనే ఉన్నారు.నళిని ఆత్మకథలో ఆమె బాల్యం, శ్రీహరన్‌తో ఆమె ప్రేమబంధం, రాజీవ్ హత్యకేసులో ప్రత్యక్ష సాక్షిగా ఆమె పరారీలో ఉండడం, అరెస్ట్ అవడం, కస్టడీలోకి వెళ్లడం, అక్కడ చిత్రహింసలకు గురికావడం, జైల్లోనే బిడ్డను ప్రసవించడం, దోషిగా నిర్ధారణ అవడం, జైలు శిక్షను అనుభవించడం వంటివన్నీ ఉన్నాయి. చివరిగా.. 2008 మార్చి 19న రాజీవ్ కుమార్తె ప్రియాంక, నళిని రహస్యంగా జైల్లో కలుసుకుని, ‘‘మీరు మా నాన్నను ఎందుకు చంపారు?! ఆయన ఎంతో మంచివారు కదా!’’ అని ఉద్వేగంగా అడగడం, ఆ తర్వాత 90 నిమిషాల పాటు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ కూడా.. నళిని ఆత్మకథలో ఉన్నాయి. పేరు పెట్టింది గాంధీజీ! నళిని తల్లి పద్మావతి. ఆమెకు పద్మావతి అని పెట్టింది మహాత్మాగాంధీ అని అంటారు. పద్మావతి చెన్నైలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా ఉన్నప్పుడు శ్రీలంక తమిళుడైన శ్రీహరన్ అనూహ్యంగా వారి జీవితాల్లోకి వచ్చాడు. అద్దె ఇల్లు వెతుక్కుంటూ వచ్చి, వారి పక్కనే చేరాడు. కొన్నాళ్లకు ‘ఒంటికన్ను’ శివరాసన్.. శ్రీహరన్ రూమ్మేట్ అయ్యాడు. కొద్ది రోజుల్లోనే వాళ్లతో ‘థను’ వచ్చి చేరింది. (రాజీవ్‌గాంధీని చంపడానికి మానవబాంబుగా మారింది ఈ ‘థను’నే). ఈ క్రమంలో శ్రీహరన్, నళిని ప్రేమలో పడ్డారు. రాజీవ్ హత్య తర్వాత నిందితులందరితో పాటూ ఈ దంపతులూ అరెస్ట్ అయ్యారు. ‘‘రక్తాన్ని దాహంగొన్న తేడేళ్ల మధ్యలోకి మేము వెళ్లిపోయాము’’అని హత్య తర్వాత నళిని కోర్టులో తన వాదన వినిపించారు. అయినా శిక్ష తప్పలేదు. తర్వాత్తర్వాత సోనియా గాంధీ క్షమాభిక్షతో ఉరిశిక్షను తప్పించుకుని, యావజ్జీవ శిక్షను అమె అనుభవిస్తున్నారు.నళిని చెన్నైలో పుట్టారు. ఇంగ్లిష్ లిటరేచర్ చదివారు. శ్రీహరన్ ఆమె జీవితంలోకి ప్రవేశించేనాటికి ఆమె ఒక ప్రేవేటు కంపెనీలో చిరుద్యోగిగా పనిచేస్తున్నారు. అంత పెద్ద ఆత్మకథను రాసుకున్న నళిని ఇప్పటికీ ఒక ప్రశ్న వేధిస్తోంది. ఆ రోజు ప్రియాంక పనిగట్టుకుని తననెందుకు కలిశారో ఆమె అంతుబట్టడం లేదట! ఈ అనుమానాన్ని కూడా ఆమె తన పుస్తకంలో ప్రస్తావించారు. నళిని కూతురు హరిత ప్రస్తుతం యు.కె.లోని ఓ యూనివర్శిటీలో చదువుతోందన్నంత వరకే ప్రపంచానికి తెలుసు. నాలుగేళ్ల క్రితం హరిత జీమెయిల్ చాట్‌లో ఒక ఆంగ్ల దినపత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ.. తన తల్లిని, తండ్రిని విడిపించమనీ, జైలు జీవితం నుంచి వారికి విముక్తి కల్పించమని రాజీవ్ కుటుంబాన్ని, భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.ఆమె అభ్యర్థకు ఇంతవరకు మన్నింపు దొరకలేదు. నళిని ఎప్పటికి విడుదలవుతుందో తెలియదు!లండన్‌లో ఉంటున్న తన కూతురి పెళ్లి ఏర్పాట్ల కోసం ఆరు నెలలు బెయిలు మంజూరు చెయ్యాలని ఇటీవల నళిని తన లాయర్ ద్వారా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆ కేసును జూన్ 11కు వాయిదా వేస్తూ, ఈలోపు అత్యవసరం అయితే నళిని ‘వేసవి సెలవుల కోర్టులో’ తన వాదనను వినిపించుకోవచ్చని సూచించింది. నళిని కూతురు హరిత అలియాస్ మెగ్రా లండన్‌లోని అమ్మమ్మగారి ఇంట్లో ఉంటోంది. -
ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపలేదు
సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో శిక్షననుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని కేంద్రం పరిశీలనకు పంపినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఖండించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి అధ్యక్షతన ఈనెల 9వ తేదీన సమావేశమైన మంత్రివర్గం.. ఏడుగురు రాజీవ్ హంతకుల విడుదలకు సిఫారసు చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మాన ప్రతిని గవర్నర్‌కు కూడా పంపింది. అయితే, గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అనేక ఊహాగానాలు చోటుచేసుకున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రతులు ఈనెల 14న మాత్రమే తమకు అందాయని, నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని గవర్నర్ కార్యాలయం పేర్కొంది. -
గవర్నర్‌కు ఆ అధికారం లేదు
న్యూఢిల్లీ: రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషుల్ని విడుదల చేసేందుకు తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌కు ఎలాంటి అధికారాలు లేవని కేంద్ర హోం శాఖ వర్గాలు పేర్కొన్నాయి. రాజీవ్ హంతకుల్ని విడుదల చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర గవర్నర్‌కు సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ నేతృత్వంలోని బృందం దర్యాప్తును ఇంకా కొనసాగిస్తున్నందున.. దోషులకు శిక్ష తగ్గింపు లేదా రద్దు నిర్ణయం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని గవర్నర్ సంప్రదించాల్సి ఉంటుందని హోం శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. రాజీవ్ గాంధీ హత్య వెనుక భారీ కుట్ర కోణంపై విచారణ కొనసాగుతోందని, న్యాయ సాయం కోసం వివిధ దేశాలకు లేఖలు రాశామని సీబీఐ సారథ్యంలో మల్టీ డిసిప్లినరీ మానిటరింగ్ ఏజెన్సీ కొద్ది నెలల క్రితం సుప్రీంకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. సీఆర్పీసీ, 1973లోని సెక్షన్ 435 ప్రకారం శిక్ష తగ్గింపు, రద్దు కోసం కేంద్రంతో సంప్రదింపుల అనంతరం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. -
రాజీవ్ హంతకుల్ని విడుదల చేయండి
సాక్షి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత కారాగార శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు దోషులను విడుదల చేయాల్సిందిగా తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. ఆదివారం చెన్నైలో ముఖ్యమంత్రి పళనిస్వామి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఓ తీర్మానం చేసి గవర్నర్‌కు పంపింది. కాంగ్రెస్ మినహా తమిళనాడులోని మిగిలిన పార్టీలన్నీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా రాజీవ్ హత్య దోషులను విడుదల చేసేందుకు విముఖంగా ఉండటం తెలిసిందే. రాజీవ్ హత్య కేసులో మురుగన్, శాంతన్, అరివు, జయకుమార్, రాబర్ట్ పయాస్, నళిని, రవిచంద్రన్‌లు గత 27 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. రాజ్యాంగంలోని 161వ అధికరణం ప్రకారం వీరిని విడుదల చేసే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. 2014లో జయలలిత సీఎం ఉండగానే దోషులను విడుదల చేయాలని నిర్ణయించినా కేంద్రం అప్పట్లో సుప్రీంను ఆశ్రయించడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. తాజాగా ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని సుప్రీంకోర్టు కూడా గవర్నర్‌కే వదిలేసింది. మరి ఇప్పుడు గవర్నర్ కేంద్రాన్ని కాదని దోషులను విడుదల చేస్తారా అని ప్రశ్నించగా, ఇది రాష్ట్ర ప్రభుత్వ, ప్రజల నిర్ణయమనీ, గవర్నర్ అందుకు అనుగుణంగా నడచుకోవాల్సిందేనని మంత్రి జయకుమార్ వ్యాఖ్యానించారు. -
వేలూరు కోర్టుకు మురుగన్
వేలూరు: వేలూరు సెంట్రల్ జైలులో సెల్‌ఫోన్ ఉపయోగించాడని నమోదైన కేసులో మురుగన్ అనే నిందితుడిని మంగళవారం ఉదయం వేలూరు కోర్టులో హాజరుపరిచారు. గత ఏడాది మార్చి 26వ తేదీన జైలు అధికారుల తనిఖీ సమయంలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్ గదిలో సెల్‌ఫోన్ ఉన్నట్లు గుర్తించిన విషయం విదితమే. వేలూరు జేఎం -1 కోర్టులో దీనికి సంబంధించిన కేసు విచారణ జరుగుతున్నది. ఈనెల 2వ తేదీన నిందితుడిని నేరుగా హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. దీంతో అరక్కోణం డీఎస్పీ కుందలింగం ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నడుమ సెంట్రల్ జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చి న్యాయమూర్తి అలిసియా ముందు హాజరుపరిచారు. జైలు వార్డర్లు నందకుమార్, పెరుమాల్, బాగాయం ఎస్ఐ ప్రభాకరన్‌లను న్యాయమూర్తి విచారించారు. అనంతరం కేసు విచారణను ఈనెల 6వ తేదీకి వాయిదా వేయగా పోలీసులు బందోబస్తు నడుమ మురుగన్‌ను జైలుకు తీసుకెళ్ళారు. కాగా, ఈ కేసులో జైలులోని ఏడుగురు సాక్షులను విచారణ జరపాలని కోరుతూ మురుగన్ తరపు న్యాయవాది అరుణ్‌కుమార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
కన్నీటితో వెళుతున్నా..
కుమారుడిని చూసేందుకు అనుమతించలేదని మురుగన్ తల్లి ఆవేదన వేలూరు: జైలులోని కుమారున్ని చూడలేక కన్నీటితో శ్రీలంక వెళుతున్నానని మురుగన్ తల్లి చోమని అమ్మాల్ వాపోయారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో వేలూరు సెంట్రల్ జైలులో మురుగన్, శాంతన్, పేరరివాలన్‌లు పురుషుల జైలులో, మురుగన్ భార్య నళిని మహిళా జైలులో జీవిత శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో మురుగన్ తల్లి చోమని అమ్మాల్ శ్రీలంక నుంచి ఒక నెల టూరిస్ట్ విసాతో తమిళనాడు వచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు వేలూరు సెంట్రల్ జైలుకు వెళ్లి కుమారుడు మురుగన్‌ను చూడాలని దరఖాస్తు చేసుకుంది. అయితే జైలు అధికారులు అనుమతించలేదు. దీంతో ఆమె బయటకు వచ్చి విలేకరులతో కన్నీటి పర్వంతమవుతూ మాట్లాడారు. తాను ఒక నెల పర్యాటక విసాపై వచ్చానని గత వారంలో జైలు వద్దకు వెలితే తనను లోనికి అనుమతించలేదన్నారు. మురుగన్‌ను చూడాలని దరఖాస్తు చేసుకుంటే రెండు గంటల అనంతరం వచ్చి మురుగన్ జైలులో సెల్‌ఫోన్ ఉపయోగించిన కారణంగా మూడు నెలల వరకు ఎవరిని కలవకూడదని నిషేధించినట్లు తెలిపారన్నారు. అదే విధంగా తన కోడలు నళినిని చూసేందుకు కూడా అనుమతించలేదన్నారు. అనంతరం జైలులో ఉన్న శాంతన్‌ను చూసి మాట్లాడనని, తమిళనాడు ప్రభుత్వం తమను విడుదల చేస్తుందనే నమ్మకంతో ఉన్నామని తనతో చెప్పాడని తెలిపారు. -
కన్నీటితో వెలుతున్నా.. ఓ తల్లి ఆవేదన
వేలూరు: జైలులోని కుమారున్ని చూడలేక కన్నీటితో శ్రీలంక వెలుతున్నానని మురుగన్ తల్లి చోమని అమ్మాల్ వాపోయారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో వేలూరు సెంట్రల్ జైలులో మురుగన్, శాంతన్, పేరరివాలన్‌లు పురుషుల జైలులో, మురుగన్ భార్య నళిని మహిళా జైలులో జీవిత శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో మురుగన్ తల్లి చోమని అమ్మాల్ శ్రీలంక నుంచి ఒక నెల టూరిస్ట్ విసాతో తమిళనాడుకు వచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు వేలూరు సెంట్రల్ జైలుకు వెళ్లి కుమారుడు మురుగన్‌ను చూడాలని దరఖాస్తు చేసుకుంది. అయితే జైలు అధికారులు అనుమతించలేదు. దీంతో ఆమె బయటకు వచ్చి విలేకరులతో కన్నీటి పర్వంతమవుతూ మాట్లాడారు. తాను ఒక నెల పర్యాటక విసాపై వచ్చానని గత వారంలో జైలు వద్దకు వెలితే తనను లోనికి అనుమతించలేదన్నారు. మురుగన్‌ను చూడాలని ధరఖాస్తు చేసుకుంటే రెండు గంటల అనంతరం వచ్చి మురుగన్ జైలులో సెల్‌ఫోన్ ఉపయోగించిన కారణంగా మూడు నెలల వరకు ఎవరిని కలవకూడదని నిషేదించినట్లు తెలిపారన్నారు. అదే విధంగా తన కోడలు నళిని చూసేందుకు కూడా అనుమతించలేదని తెలిపారు. అనంతరం జైలులో ఉన్న శాంతన్‌ను చూసి మాట్లాడనని, తమిళనాడు ప్రభుత్వం తమను విడుదల చేస్తుందనే నమ్మకంతో ఉన్నామని తనతో చెప్పాడని తెలిపారు. -
విడుదలకు నో..
సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న నళిని దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు బుధవారం కొట్టివేసింది. గత 20 ఏళ్లకు పైగా జైలుశిక్షను అనుభవిస్తున్న కారణంగా తనను విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న ఆమె కోర్కెను కోర్టు నిరాకరించింది. రాజీవ్‌గాంధీ హత్య కేసులో నళినీ సహా ఏడుగురు వేలూరు జైలు లో యావజ్జీవ ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్నారు. 20 ఏళ్లకు పైగా జైలుశిక్షను అనుభవించేవారిని విడుదల చేయవచ్చంటూ తమిళనాడు ప్రభుత్వం 1994లో ఒక చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం విడుదలకు తాను అర్హురాలిని అంటూ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి, జైళ్లశాఖ డీఐజీకి 1994 ఫిబ్రవరిలో నళినీ విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విజ్ఞప్తిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మద్రాసు హైకోర్టులో ఇటీవల రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రభుత్వం బదులిస్తూ, నళినీ సహా ఏడుగురు విడుదలపై సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్నందున ఆమె దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను కొట్టివేయాల్సిందిగా ప్రభుత్వం హైకోర్టును కోరింది. నళినీ పిటిషన్ బుధవారం విచారణకు రాగా న్యాయమూర్తి సత్యనారాయణ ప్రభుత్వ వాదనతో ఏకీభవించారు. రాజీవ్ హంతకుల విడుదలపై సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్నపుడు మద్రాసు హైకోర్టు వేరుగా నిర్ణయాన్ని తీసుకునేందుకు వీలులేదని పేర్కొం టూ నళినీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ప్రకారం నళినీ విడుదలపై దాఖలు చేసుకున్న పిటిషన్‌ను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయమూర్తి సూచిం చారు. -
నళినికి పెరోల్ హైకోర్టు ఉత్తర్వులు
టీనగర్:రాజీవ్‌గాంధీ హత్య కేసులో జైల్లో ఉన్న నళినికి తండ్రి 16వ రోజు కార్యంలో పాల్గొనేందుకు ఒక రోజు పెరోల్ అందజేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. వేలూరు జైలులో యావజ్జీవ ఖైదీగా నళిని శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈమె హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఈ విధంగా తెలిపారు. తన తండ్రి శంకరనారాయణన్ గత ఫిబ్రవరి నెల 23వ తేదీ మృతిచెందారని, ఆయన అంత్యక్రియలు చెన్నైలో మరుసటి రోజు 24వ తేదీన జరిగాయని పేర్కొన్నారు. ఆ రోజున ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తనకు వేలూరు జైలు సూపరింటెండెంట్ పెరోల్ అందజేయడంతో తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ఇలావుండగా తన తండ్రి 16వ రోజు కార్యం ఈ నెల తొమ్మిదవ తేదీన జరుగనుందని, ఇందులో పాల్గొనేందుకు మూడు రోజులు అనగా ఎనిమిదవ తేదీ నుంచి 10వ తేదీ వరకు పెరోల్ కోరుతూ జైలు సూపరింటెండెంట్‌కు గత రెండవ తేదీన పిటిషన్ అందజేసినట్లు పేర్కొన్నారు. దీనిపై ఇంతవరకు పరిశీలన జరపలేదని, తనకు మూడు రోజులపాటు సెలవు అందజేసేందుకు సూపరింటెండెంట్‌కు ఉత్తర్వులివ్వాలని కోరారు. ఒక రోజు పెరోల్: హైకోర్టు నళిని తండ్రి 16వ రోజు కార్యంలో పాల్గొనేందుకు ఒక రోజు పెరోల్ అందజేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆమెకు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి బుధవారం సాయంత్రం నాలుగు గంటల వరకు ఒక రోజుపాటు పెరోల్ అందజేస్తున్నట్లు తెలిపారు. హైకోర్టు ఉత్తర్వుల ఆధారంగా వేలూరు సెంట్రల్ జైలు అధికారులు ఆమెను ఒక రోజు పెరోల్‌పై విడుదల చేశారు. పోలీసుల భద్రత మధ్య ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు. -
రాజీవ్ హంతకుల శిక్ష తగ్గింపు?
చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు నిందితులకు ఊరట కల్పించాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంపై కేంద్రం స్పందన తెలపాలంటూ.. తమిళనాడు ప్రభుత్వం కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహరిషికి లేఖ రాసింది. ఈ కేసులో వారు 20 ఏళ్లకుపైగా శిక్ష అనుభవిస్తున్నందున క్షమాభిక్ష పెట్టాలని ఆ లేఖలో కోరారు. -
నళినికి 12 గంటల పెరోల్
తండ్రి అంత్యక్రియలకు హాజరు సాక్షి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషి నళినీ శ్రీహరన్‌కు ఆమె తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బుధవారం 12 గంటల పెరోల్ మంజూరైంది. పెరోల్‌పై ఆమె వేలూరు జైలు నుంచి చెన్నైకి చేరుకుని తండ్రి శంకర నారాయణ్(91) అంత్యక్రియలకు హాజరయ్యారు. తర్వాత మళ్లీ జైలుకు వెళ్లారు.2004లో తన సోదరుడి పెళ్లికి పెరోల్‌పై విడుదలైన నళిని ఆ తర్వాత బయటి ప్రపంచాన్ని చూడడం ఇదే తొలిసారి. రాజీవ్ హత్య కేసులో ఆమెకు 1998లో ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించగా, 2000లో రాష్ట్ర గవర్నర్ ఆ శిక్షను జీవిత ఖైదుగా మార్చారు. -
రాజీవ్ హంతకులను విడుదల చేయాలి
-
ఉరి రద్దు సబబే
రాజీవ్ హత్య కేసు నిందితులకు ఊరట కేంద్రానికి చుక్కెదురు విడుదల ఎప్పుడో తమిళాభిమానుల హర్షం సాక్షి, చెన్నై: రాజీవ్ హత్య కేసు నిందితుల ఉరి శిక్ష రద్దు సబబేనని సుప్రీంకోర్టు సమర్థించడం ఈలం మద్దతు, తమిళాభిమాన సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడంతో, ఇక విడుదల నిర్ణయాన్ని కోర్టు ఎప్పుడు సమర్థిస్తుందోనన్న ఎదురు చూపులు పెరిగాయి. మాజీ ప్రధాని రాజీవ్ గాందీ హత్య కేసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నళిని, మురుగన్, శాంతన్, పేరరివాళన్‌లకు కోర్టు ఉరి శిక్ష విధించింది. తొలుత నళిని శిక్ష యావజ్జీవంగా మారింది. అయితే, మురుగన్, శాంతన్, పేరరివాళన్‌ల క్షమాభిక్ష ఏళ్ల తరబడి రాష్ట్రపతి భవన్లో పడి ఉండడం , చివరకు ఉరి అమలుకు పరిస్థితులు దారి తీశాయి. దీనిని వ్యతిరేకిస్తూ, తమిళనాట నిరసనలు రాజుకున్నాయి. ఎట్టకేలకు చివరి క్ష ణంలో ఉరి తాత్కాళికంగా నిలుపుదల చేశారు. తమ ఉరి శిక్షను వ్యతిరేకిస్తూ, రద్దు నినాదంతో సుప్రీంకోర్టును నిందితులు ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఉరి రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వారి ఉరి శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చింది. దీనిని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తీర్పును సమీక్షించాలని, తీర్పులో మార్పు అవసరం అని ఆ పిటిషన్లో సూచించారు. అదే సమయంలో నిందితుల ఉరిశిక్ష యావజ్జీవంగా మారడంతో తమిళాభిమాన మది కొల్లగొట్టే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏళ్ల తరబడి ఇప్పటికే జైలు జీవితాన్ని గడిపిన నిందితులు, ఇక స్వేచ్ఛాయుత ప్రపంచంలోకి వచ్చేందుకు వీలుగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. రాజీవ్ హత్య కేసు నిందితుల్ని విడుదల చేస్తూ తీర్మానం చే శారు. అయితే, దీనికీ కేంద్రం అడ్డు తగలడంతో వారు విడుదలయ్యేనా... అన్న ఎదురు చూపులు తప్ప లేదు. ఉరి రద్దు సబబే: ఉరి శిక్షరద్దును వ్యతిరేకిస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ రాజకీయ శాసనాల బెంచ్‌కు చేరింది. కొన్ని నెలలుగా విచారణ సాగుతూ వచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ ఎల్ దత్తు, న్యాయమూర్తి ఇబ్రహీం కలీఫుల్లా తదితరులతో కూడిన రాజకీయ శాసనాల బెంచ్ విచారిస్తూ వచ్చింది. బుధవారం తుది విచారణ ముగియడంతో గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును రాజకీయ శాసనాల బెంచ్ సమర్థించింది. ఉరి శిక్షను రద్దు చేస్తూ గతంలో ఇచ్చిన తీర్పు సబబేనని పేర్కొంటూ, కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో ఉరి రద్దు వ్యవహారం నుంచి రాజీవ్ హత్య కేసు నిందితులకు ఊరట లభించినట్టు అయింది. సుప్రీం తీర్పును ఈలం మద్దతు సంఘాలు, పార్టీలు, తమిళాభిమాన సంఘాలు ఆహ్వానిస్తూ, హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో ఆ నిందితుల విడుదల ఎప్పుడో అన్న ఎదురు చూపులు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ విడుదల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌కు మోక్షం ఎప్పుడు లభిస్తుందో, ఆ నిందితుల విడుదల సాధ్యమేనా..? అన్న మీమాంసలో ఈలం మద్దతు, తమిళాభిమాన సంఘాలు ఉన్నాయి. -
‘సుప్రీం’ చల్లని కబురు
యావజ్జీవ శిక్ష పడి జైళ్లలో మగ్గుతున్న వేలాదిమంది ఖైదీలకు ఇది ఉపశమనం కలిగించే కబురు. ఆ తరహా ఖైదీలను మళ్లీ చెప్పేవరకూ విడుదల చేయడానికి వీల్లేదని నిరుడు జూలైలో విధించిన స్టే ఉత్తర్వులను సుప్రీంకోర్టు గురువారం ఉపసంహరించుకుంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులను విడుదల చేస్తూ తమిళనాడు ప్రభుత్వం నిరుడు ఫిబ్రవరిలో తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ స్టే ఉత్తర్వులు వెలువడ్డాయి. అప్పట్లో దరిదాపుల్లోకొచ్చిన సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జయలలిత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సరిగ్గా ఆ కారణంగానే అప్పట్లో యూపీఏ సర్కారు కూడా హడావుడిగా సుప్రీంకోర్టు తలుపు తట్టింది. రాహుల్‌గాంధీ కూడా చురుగ్గా స్పందించారు. ‘ఈ దేశంలో మాజీ ప్రధానికే న్యాయం జరగకపోతే... ఆయనను చంపినవారినే స్వేచ్ఛగా వదిలేస్తే ఇక సామాన్యుడికి న్యాయం లభించేదెలా?’ అంటూ ఆయన వాపోయారు. జయ నిర్ణయంలాగే రాహుల్ స్పందన కూడా ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని చేసిందే. ఎందుకంటే, రాజీవ్ కేసులో ఉరిశిక్ష పడిన దోషు క్షమాభిక్ష పిటిషన్లపై ఏడేళ్లపాటు జాప్యం చేసింది యూపీఏ సర్కారే. అంతక్రితం ఎన్డీయే నాలుగేళ్లు ఆ పిటిషన్లను పెండింగ్‌లో ఉంచింది. ఇలా 11 ఏళ్లు కదలక మెదలక కూర్చున్న కేంద్రం వైఖరిని తప్పుబడుతూ ఆ ఉరిశిక్షలను సుప్రీంకోర్టు యావజ్జీవ శిక్షలుగా మార్చింది. ఆ వెంటనే తమిళనాడు కేబినెట్ ఆదరా బాదరాగా మొత్తం ఏడుగురినీ విడుదల చేయాలని తీర్మానించింది. ఈ తీర్మానమే దేశంలో యావజ్జీవ ఖైదీలపాలిట శాపమైంది. బయటి సమాజానికి జైలన్నా, ఖైదీలన్నా ఒక దురభిప్రాయం స్థిరపడి ఉంటుంది. అక్కడ ఉండేవాళ్లంతా కరుడుగట్టిన నేరస్తులన్న నమ్మకం ఉంటుంది. కానీ, లోనికి వెళ్లి చూస్తే తప్ప నిజమేమిటో అర్ధంకాదు. జైళ్లలో ఉండే మూడింట రెండొంతులమంది విచారణలో ఉన్న ఖైదీలేనని ఇటీవలి సర్వే తెలిపింది. పైగా వారు చేశారంటున్న నేరం రుజువై పడే శిక్షకు మించి జైళ్లలో మగ్గుతున్నవారు అనేకులున్నారని వివరించింది. ఈ ఖైదీల్లో వృద్ధాప్యానికి చేరుకుని కేన్సర్, ఎయిడ్స్, క్షయ, గుండెజబ్బు వంటి అనేక వ్యాధులతో బాధపడుతున్నవారున్నారు. చేసిన నేరమో, చేయకున్నా బనాయించిన కేసులోనో, కేవలం అనుమానంపైనో... అరెస్టయి బెయిల్‌కు అవసరమైన పూచీ కత్తులను చూపలేకనో వేలాదిమంది జైళ్లలో మగ్గిపోతున్నారు. దేశంలో మొత్తం 1391 జైళ్లుంటే అందులో పరిమితికి మించి ఖైదీలుంటున్నారని జాతీయ క్రైం రికార్డుల బ్యూరో చెబుతోంది. మన జైళ్లలో 118.4 శాతం ఖైదీలుంటున్నారని ఆ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఉన్న జైళ్లలో పెద్దవి సెంట్రల్ జైళ్లు కాగా వాటిల్లో 121.2 శాతం ఖైదీలుంటున్నారు. అంటే తెలిసో, తెలియకో నేరం చేసినవారిని సంస్కరించి వారిని సన్మార్గంలో పెట్టాల్సిన జైళ్లు వాస్తవానికి కిక్కిరిసి ఉంటున్నాయి. ఫలితంగా అక్కడకు వెళ్లినవారు సత్ప్రవర్తనను అలవర్చుకోవడం అటుంచి రోగగ్రస్తులవుతున్నారు. సరైన పర్యవేక్షణ సాధ్యంకాక నేర ప్రవృత్తిని పెంచుకుంటున్నారు. సాంకేతికంగా చూస్తే యావజ్జీవ శిక్ష అంటే జీవితాంతమూ...అంటే మరణించే వరకూ శిక్ష అనుభవించడమనే భావన ఉంది. కానీ సీఆర్పీసీ నిబంధనలు మాత్రం యావజ్జీవ శిక్షను ఆ రకంగా చూడటంలేదు. 14 ఏళ్లు శిక్ష అనుభవించిన ఖైదీలకు క్షమాభిక్షపెట్టే అధికారాన్ని అందులోని 432, 433 సెక్షన్లు రాష్ట్ర ప్రభుత్వాలకిచ్చాయి. అయితే, ఆరుగురు సభ్యులుండే సలహా బోర్డు సిఫార్సు తర్వాత మాత్రమే ప్రభుత్వాలు ఆ పని చేయాలి. పైగా సీబీఐ లేదా మరే ఇతర కేంద్ర సంస్థ అయినా దర్యాప్తు జరిపిన కేసుల్లో యావజ్జీవ శిక్ష పడినపక్షంలో అలాంటివారిని విడుదల చేసేముందు ఆ సంస్థ అనుమతిని తీసుకోవాలి. రాజీవ్ కేసు దోషుల విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఇలాంటి లాంఛనాలను పూర్తి చేయలేదన్న మాట వాస్తవమే. పైగా ఫలానా వారిని తాము విడుదల చేయదల్చుకున్నామని మాత్రమే కేంద్రానికి వర్తమానం పంపింది. అయితే సుప్రీంకోర్టు ఇన్నాళ్లుగా విధించిన స్టే దేశవ్యాప్తంగా వేలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తమిళనాడు సర్కారు నిర్ణయం తప్పొప్పుల మాటెలా ఉన్నా తమ అధికారానికి పరిమితులు విధించవద్దని రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును వెనువెంటనే కోరి ఉంటే బాగుండేది. కాస్త జాప్యం చేసినా కర్ణాటక, పశ్చిమబెంగాల్ తదితర ప్రభుత్వాలు కొన్ని ఈ స్టే ఉత్తర్వులను రద్దు చేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరాయి. 20 ఏళ్లు పైబడి శిక్ష అనుభవించిన ఖైదీలు సైతం జైళ్లలో ఉండటాన్ని అవి న్యాయమూర్తుల దృష్టికి తీసుకొచ్చాయి. ఏటా రిపబ్లిక్ డే(జనవరి 26), స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15), గాంధీ జయంతి (అక్టోబర్ 2) సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యావజ్జీవ శిక్ష పడిన ఖైదీలను, సత్ప్రవర్తన కారణంగా రెమిషన్ లభించిన ఖైదీలనూ విడుదల చేస్తున్నాయి. అయితే, అన్ని ప్రభుత్వాలూ ఒకే పద్ధతిని పాటించడంలేదు. మధ్యప్రదేశ్‌లో 14 ఏళ్ల శిక్ష తర్వాత యావజ్జీవ శిక్షపడినవారిని విడుదల చేస్తుంటే యూపీ 17 ఏళ్ల శిక్ష తర్వాత, మహారాష్ట్ర దాదాపు 24 ఏళ్ల శిక్ష తర్వాత విడుదల చేస్తున్నాయి. యావజ్జీవ శిక్ష విషయంలో ఉన్న అస్పష్టత కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది. ఇందువల్ల ఖైదీల హక్కులకు భంగం కలుగుతున్న సంగతిని అటు న్యాయస్థానాలుగానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలుగానీ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులకు ఎన్నో షరతులున్నాయి. అత్యాచారం, హత్య కేసుల్లో యావజ్జీవ శిక్షపడినవారికి ఇది వర్తించదు. యావజ్జీవ శిక్ష విధిస్తూ న్యాయస్థానాలు నిర్దిష్ట శిక్షా కాలాన్ని పేర్కొన్న పక్షంలో అలాంటివారికీ క్షమాభిక్ష పెట్టకూడదు. యూఏపీఏ వంటి చట్టాలకింద యావజ్జీవ శిక్షపడిన ఖైదీలు కూడా విడుదలకు అనర్హులు. సీబీఐ, ఎన్ఐఏ వంటి సంస్థలు దర్యాప్తు జరిపిన కేసుల్లో శిక్షపడినవారి విడుదల కూడా కుదరదు. ఇక రాజీవ్ కేసు దోషులు సరేసరి. తుది తీర్పు వెలువడే వరకూ వారి విడుదల సాధ్యంకాదు. ఈ కేసులో సాధ్యమైనంత త్వరగా తుది తీర్పు వెలువరించడంతోపాటు కారాగారాల అధ్వాన్నస్థితిపై సుప్రీంకోర్టు దృష్టిపెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన సూచనలివ్వాలి. 120 ఏళ్లనాటి జైళ్ల చట్టాన్ని సమూలంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కదలాలి. -
సోనియా అహంభావి!: నట్వర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యవహార శైలిని ఆ పార్టీ మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి నట్వర్‌సింగ్ తాను రాసిన ఆత్మకథ ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్: యాన్ ఆటోబయోగ్రఫీ’లో తూర్పారబట్టారు. సోనియాను నిరంతరం అనుమానించే వ్యక్తి గా, అహంభావిగా అభివర్ణించారు. కఠిన పదజాలంతో దుయ్యట్టారు. తన భర్త రాజీవ్‌గాంధీ హత్య కేసు విచారణ నత్తనడకన సాగుతోందన్న కోపంతో నాటి ప్రధాని పి.వి. నరసింహారావును దూరం పెట్టారని పేర్కొన్నారు. భారత్‌లో ఆమె అడుగుపెట్టినప్పటి నుంచీ రాజ వైభోగాన్ని అందుకున్నారన్నారు. అలాగే సోనియా కుమారుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపైనా, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పైనా పుస్తకంలో విమర్శలు గుప్పించారు. రాహుల్ మంచివాడైనప్పటికీ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా పనిచేయాలన్న చిత్తశుద్ధి ఆయనలో లేదని విమర్శించారు. పదేళ్లు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ పాలనలో తన ముద్రను వేయలేకపోయారన్నారు. బోఫోర్స్ కుంభకోణం వివాదం, షా బానో కేసు, రామజన్మభూమి అంశాలు, డార్జిలింగ్‌లో ఆందోళన విషయంలో రాజీవ్ గాంధీ సరిగ్గా వ్యవహరించలేకపోయారన్నారు. తాను పేర్కొన్న అంశాలపై సోనియామండిపడటంపట్ల నట్వర్‌సింగ్ శుక్రవారం స్పందిస్తూ పుస్తకంలోని ఏదో విషయంపై కలత చెందడం వల్లే ఆమె అలా ప్రతిస్పందించి ఉండొచ్చన్నారు. నిజాలు రాసినందుకు 50 మంది కాంగ్రెస్ నేతలు తనను అభినందించారని చెప్పారు. గాంధీ కుటుంబం సారథ్యం లేకపోతే కాంగ్రెస్ ఐదు గ్రూపులుగా చీలిపోతుందని నట్వర్ చెప్పారు. పార్టీని సోనియా గత 15 ఏళ్లుగా ఏకతాటిపై నిలుపుతూ వస్తున్నారన్నారు. పుస్తకంలోని అంశాల్లోని నిజానిజాలను తెలిపేందుకు స్వయంగా పుస్తకం రాస్తానంటూ సోనియా పేర్కొనడాన్ని నట్వర్ స్వాగతించారు. -
రణరంగం!
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సత్యమూర్తి భవన్ పరిసరాలు బుధవారం రణరంగాన్ని తలపించాయి. తమకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తారా? అంటూ తమిళ సంఘాలపై కాంగ్రెస్ నాయకులు రాళ్ల వర్షం కురిపించారు. తమిళ సంఘాలు కాంగ్రెస్ ఫ్లెక్సీలు, బ్యానర్లు తగులబెట్టారు. పరస్పరం కయ్యానికి కాలు దువ్వడంతో పెట్రోల్ బాంబుల మోత మోగింది. రాళ్ల వర్షం కురిసింది. పలువురి తలలు పగిలాయి. పరిస్థితి కట్టడికి పోలీసులు లాఠీలు ఝుళిపించారు. భారీ బలగాలు ఆ పరిసరాల్లో మోహరించాయి. సాక్షి, చెన్నై:రాజీవ్ హత్య కేసు నిందితులు నళిని, పేరరివాలన్, సంతాన్, మురుగన్ సహా ఏడుగురిని విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిని కేంద్రంలోని కాంగ్రెస్ సర్కారు అడ్డుకుంది. ఈ విడుదలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీఎన్‌సీసీ, అనుబంధ విభాగాల నేతృత్వంలో రోజుకో రీతిలో నిరసనలు జరుగుతూ వస్తున్నాయి. విడుదల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పట్టుబడుతూ కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేస్తూ వస్తుంటే, కేంద్రం తీరును నిరసిస్తూ తమిళ సంఘాలు పోరుబాట పట్టాయి. బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం సత్యమూర్తి భవన్ ముట్టడికి యత్నించాయి. ముట్టడి: నామ్ తమిళర్ కట్చి యువజన నేత అరివు సెల్వం నేతృత్వంలో పదుల సంఖ్యలో కార్యకర్తలు ఉదయం సత్యమూర్తి భవన్ వైపుగా బయలు దేరారు. చేతిలో ఎల్టీటీఈ నేత ప్రభాకరన్ చిత్ర పటాలు, బ్యానర్లను చేతబట్టి నిరసన ర్యాలీ నిర్వహించారు. మార్గం మధ్యలో వీరిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నిరసన కారులు నినాదాలతో హోరెత్తించారు. సత్యమూర్తి భవన్ వైపు తమను అనుమతించాలని పట్టుబట్టారు. పదుల సంఖ్యలో ఉన్న నామ్ తమిళర్ కార్యకర్తల్ని చివరకు పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆందోళన ముగిసిందని సర్వత్రా భావించారు. అయితే, అసలు చిచ్చు ఆ తర్వాతే రగిలింది. కాంగ్రెస్ వీరంగం: తమ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఎంత ధైర్యం అన్నట్టుగా నామ్ తమిళర్ కార్యకర్తల భరతం పట్టేందుకు కాంగ్రెస్ నాయకులు కరాటే త్యాగరాజన్, రంగ భాష్యం, కుమార్, రాయపురం మనోల నేతృత్వంలో కొందరు కార్యకర్తలు కార్యాలయం వద్ద మాటేశారు. అదే సమయంలో పోలీసులు అరెస్టు చేసినా, నలుగురు నామ్ తమిళర్ కట్చి కార్యకర్తలు వారి నుంచి తప్పించుకుని తమ నిరసన తెలియజేయడానికి యత్నించారు. సత్యమూర్తి భవన్ గేటు వద్దకు చేరుకోగానే, మాటేసిన కాంగ్రెస్ వర్గాలు రెచ్చి పోయాయి. ఆ నలుగురిని చితకబాది వదిలి పెట్టారు. పోలీసుల జోక్యంతో ఆ నలుగురి బతికి బయట పడ్డారు. పరస్పర దాడులు: తమ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన వారందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆ మార్గంలో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకోకు దిగడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగాయి. అదే సమయంలో తమ వాళ్ల మీద దాడి చేశారన్న సమాచారంతో నామ్ తమిళర్ కట్చి కార్యకర్తలు, పలు ఈలం తమిళాభిమాన సంఘాల కార్యకర్తలు వందల సంఖ్యలో అన్నా సాలైలో గుమిగూడారు. ఆ సరిసరాల్లోని కాంగ్రెస్ ఫ్లెక్సీలు, బ్యానర్లు చించి తగల బెట్టారు. ఓ సైకిల్‌ను దహనం చేశారు. కాంగ్రెస్ వర్గాలతో తాడో పేడో తేల్చుకునే విధంగా ముందుకు దూసుకెళ్లారు. తమపై దాడికి యత్నిస్తున్నారన్న సమాచారంతో కాంగ్రెస్ వర్గాలు మేల్కొన్నాయి. రెండు వర్గాలు పరస్పర దాడులకు దిగడంతో సత్యమూర్తి భవన్ పరిసరాలు రణరంగంగా మారాయి. దుకాణాలు మూత బడ్డాయి. వాహనాలను వదలి పెట్టి జనం ఉరకలు తీశారు. భయానక వాతావరణం నెలకొంది. పెట్రోల్ నింపిన బాటిళ్లను ఓ వర్గం మరో వర్గం మీద విసరడంతో చిచ్చు రాజుకుంది. రాళ్ల వర్షం కురవడంతో ఇరు వర్గాలతో పాటుగా పోలీసులు సైతం గాయపడ్డారు. ఊహించని రీతిలో వివాదం రాజుకోవడంతో భద్రతా కవచాలు కూడా లేని పరిస్థితుల్లో పోలీసులు వారిని అడ్డుకునే యత్నం చేశారు. లాఠీలకు పని పెట్టారు. కనిపించిన వాళ్లందరినీ తరిమి తరిమి కొట్టారు. జీపీ రోడ్డు మార్గంతో పాటుగా అన్నా సాలైలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఎట్టకేలకు అతి కష్టం మీద పరిస్థితిని పోలీసులు అదుపులోకి తెచ్చారు. జీపీ రోడ్డును మూసి వేశారు. సత్యమూర్తి భవన్ పరిసరాల్ని భద్రతా వలయంలోకి తెచ్చారు. నిరసనకు యత్నించిన వాళ్లపై కాంగ్రెస్ వీరంగంతో తమిళ సంఘాలు ఆక్రోశంలో రగులుతున్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రభుత్వానిదే బాధ్యత: తలలు పగలడంతో గాయపడిన పలువురు కార్యకర్తలను, పోలీసులను రాయపేట ఆస్పత్రికి తరించారు. సమాచారం అందుకున్న కేంద్ర నౌకాయూన శాఖ మంత్రి జికే వాసన్, సీనియర్ నేత ఈవీకేఎస్ ఇళంగోవన్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్ ఆస్పత్రికి వెళ్లి వారిని పరామర్శించారు. మీడియాతో జ్ఞానదేశికన్ మాట్లాడుతూ, పదే పదే తమ కార్యాలయాన్ని ముట్టడించడం లక్ష్యంగా కొన్ని సంఘాలు యత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రయత్నాలు మానుకోని పక్షంలో తామూ తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని, తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. తమ వాళ్లపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని, లేని పక్షంలో తామేంటో చూపించాల్సి ఉంటుందని శివాలెత్తారు. ఈవీకేఎస్ ఇళంగోవన్ మాట్లాడుతూ, తమ మీద దాడి జరుగుతుంటే, పోలీసులు చోద్యం చూశారని ధ్వజమెత్తారు. ప్రభ్తుత్వ కనుసన్నల్లోనే ఈ దాడి జరిగినట్టుందని అనుమానం వ్యక్తం చేశారు. కుట్రలు, కుతంత్రాలు మానుకోకుంటే కేంద్రంలోని తమ ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
సోనియూ, రాహుల్ దిష్టిబొమ్మల దహనం
వేలూరు, న్యూస్‌లైన్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్, శాంతన్, పేరరివాలన్ విడుదలను అడ్డుకోవడాన్ని ఖండిస్తూ నామ్ తమిళర్ పార్టీ నాయకులు వేలూరు సెంట్రల్ జైలు ఎదుట శనివారం మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సోని యూ, రాహుల్ గాంధీల దిష్టి బొమ్మలను జైలు వద్దకు తీసుకొచ్చి చెప్పులతో కొట్టి, పెట్రోల్ పోసి తగలబెట్టారు. అప్పటికే జైలు ఎదుటనున్న పోలీసులు అక్కడ కు చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ఆందోళనలో ఆ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు విన్సెం ట్, కార్యదర్శి శివ, యువకులు పాల్గొన్నారు. విడుదల చేస్తారు: న్యాయవాది పుగళేంది వేలూరు సెంట్రల్ జైలులో ఉన్న నళినితో పాటు మరో నలుగురిని విడుదల చేస్తారన్న నమ్మకం తనకు ఉందని న్యాయవాది పుగళేంది తెలిపారు. శనివారం మధ్యాహ్నం పురుషుల జైలులోని మురుగన్, శాంతన్, పేరరివాలన్, మహిళా జైలులోని నళినిని ఆయన పరామర్శించారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏడుగురిని విడుదల చేస్తామని ప్రకటించిందని అందులో ఉరిశిక్ష రద్దు చేసిన మురుగన్, శాంతన్, పేరరివాలన్‌లను విడుదల చేసేందుకు సుప్రీంకోర్టు ఆటంకం కల్పించిందన్నారు అయితే నళినితో పాటు రాబర్ట్ పయాస్, జయకుమార్, మొత్తం నలుగురిని విడుదల చేసేందుకు ఎటువంటి ఆటంకం లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జన్మదినోత్సవం రోజున నలుగురిని విడుదల చేస్తారని ఎదురు చూస్తున్నామన్నారు. దీనిపై మాట్లాడేందుకే తాను జైలుకు వచ్చానన్నారు -
జైలులో నళిని- మురుగన్ భేటీ
వేలూరు, న్యూస్‌లైన్: రాజీవ్ గాంధీ హత్య కేసులో వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నళిని, భర్త మురుగన్ శనివారం ఉదయం కలిసి మాట్లాడుకున్నారు. మురుగన్ పురుషుల జైలులో ఉండగా అతని భార్య నళిని మహిళా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నళిని, మురుగన్‌లు ఇద్దరూ నెలకోసారి కలిసేందుకు ఇది వరకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతి నెలా పోలీస్ బందోబస్తు నడుమ జైలులో కలిసి మాట్లాడుతున్నారు. శనివారం ఉదయం డీఎస్పీ ప్రభాకరన్ ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు నడుమ ఉదయం 7.30 గంటలకు మురుగన్‌ను మహిళా సెంట్రల్ జైలు వద్దకు వాహనంలో తీసుకొచ్చి నళినీతో కలిసి మాట్లాడే ఏర్పాట్లు చేశారు. ఉరిశిక్షను రద్దు చేసి జీవిత ఖైదీగా ప్రకటించిన అనంతరం నళిని, మురుగన్ కలవడం ఇదే మొదటి సారి కావడం విశేషం. -
క్షమాభిక్ష
రాజీవ్ హంతకుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మూడురోజుల్లో విడుదల చేస్తామన్న సీఎం కాంగ్రెస్ మినహా సర్వత్రా హర్షం చెన్నై, సాక్షి ప్రతినిధి: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురికి క్షమాభిక్ష పెట్టాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం నాటి అసెంబ్లీ సమావేశంలో ఆమె ప్రకటించారు. 23 ఏళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్న ఏడుగురికి మరో మూడు రోజుల్లో విముక్తి కలగనుంది. ముగ్గురి ఉరిశిక్షను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ప్రకటించిన మరుసటి రోజే వారందరినీ విడుదల చేయాలని తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రాహర్షం వ్యక్తమవుతోంది. ఖైదీలు మురుగన్, శాంతన్, పేరరివాళన్, రవి, రాబర్ట్, జయకుమార్, నళినీ వేలూరు జైలు నుంచి త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం 1991 మే 21న శ్రీపెరంబుదూరు సభకు హాజరైన రాజీవ్ గాంధీ ఎల్టీటీఈ చేతిలో దారుణహత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి 26 మందికి ఉరిశిక్ష విధిస్తున్నట్లు టాడా కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై నిందితులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. తదనంతరం మురుగన్, శాంతన్, పేరరివాళన్, నళినికి ఉరి శిక్ష సమంజసమేనంటూ సుప్రీంకోర్టు సమర్థించింది. మిగిలిన వారిలో ముగ్గురికి యావ జ్జీవం, 19 మందిని విడుదల చేయాలని తీర్పు చెప్పింది. ఉరిశిక్ష పడిన నలుగురు 1999 అక్టోబరు 8వ తేదీన సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేయగా కొట్టివేసింది. దీంతో తమకు క్షమా భిక్ష పెట్టాలని కోరుతూ అదే ఏడాది అక్టోబరు 17న రాష్ట్రపతికి విన్నవించుకున్నారు. అదేనెల 27న రాష్ట్రపతి సైతం నిరాకరించారు. రాష్ట్రపతి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చెన్నై హైకోర్టులో పిటిషన్ వేయగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీగా ఏర్పడి శిక్షను మరోసారి విశ్లేషించుకోవాలని 1999 నవంబరు 25న కోర్టు అదేశించింది. ఈ ఆదేశాల మేరకు అప్పటి సీఎం కరుణానిధి నాయకత్వంలో 2000 ఏప్రిల్ 19న కమిటీ సమావేశమైంది. రాజీవ్ హత్యకేసు నిందితుల్లోని నళినికి ఆడశిశువు ఉన్నందున బిడ్డ అనాథ కాకూడదన్న ఉద్దేశంతో ఉరిశిక్ష నుంచి ఆమెను మినహాయిస్తూ తీర్మానం చేశారు. మిగిలిన ముగ్గురికి యథావిధిగా ఉరిశిక్షను అమలు చేయాలని తీర్మానించారు. దీంతో ముగ్గురు 2000 ఏప్రిల్ 21న మళ్లీ క్షమాభిక్ష కోసం రాష్ట్రపతి పరిశీలనకు పంపగా నిరాకరించారు. దీంతో అదే నెల 28వ తేదీన మరోసారి రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసుకోవడంతోపాటూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విన్నవించుకున్నారు. అయితే ప్రభుత్వం ద్వారా వెళ్లిన విజ్ఞప్తులపై కేంద్రం 11 ఏళ్లుగా స్పందించలేదు. దీంతో చొరవతీసుకున్న సుప్రీం కోర్టు వారికి పడిన ఉరిశిక్షను రద్దుచేస్తున్నట్లుగా ఈనెల 18న ప్రకటించింది. జైలు నుంచి విడుదల చేసే అంశాన్ని రాష్ట్రప్రభుత్వానికే అప్పగిస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. ఉరిశిక్ష రద్దుతో ఆనందోత్సాహాలు జరుపుకున్న నిందితుల బంధువులు వారిని విడుదల చేయాలనే డిమాండ్‌ను వెంటనే లేవనెత్తారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఈ అంశం తెరపైకి రావడం అన్నాడీఎంకేకు అనుకూలమైంది. దీంతో సీఎం జయ వెంటనే విడుదలపై నిర్ణయాన్ని తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 432 ప్రకారం ప్రభుత్వ విచక్షణాధికారాలను వినియోగించి వారిని విడుదల చేయనున్నట్లు ఆమె సభలో ప్రకటించారు. చట్టంలోని నిబంధనలకు లోబడి తమ నిర్ణయాన్ని ఐపీసీ 435 ప్రకారం కేంద్రానికి పంపుతూ మూడోరోజుల్లో అభిప్రాయం తెలపాలని కోరినట్లు ఆమె చెప్పారు. గడువులోగా కేంద్రం స్పందించిన పక్షంలో ఆ ఏడుగురిని విడుదల చేసే అధికారం యథావిధిగా తమకు వస్తుందని ఆమె చెప్పారు. కాంగ్రెస్ మినహా సర్వత్రా హర్షం రాజీవ్ నిందితులకు జైలు నుంచి విముక్తి కల్పిస్తూ సీఎం జయ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. అయితే అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు ప్రిన్స్, రంగరాజన్, జాన్‌జాకబ్ నిరసనగా వాకౌట్ చేశారు. డీఎంకే అధినేత కరుణానిధి మీడియాతో మాట్లాడుతూ, ఇదే నిర్ణయాన్ని 2011లో తన హయాంలో వ్యక్తం చేసినపుడు జయ అభ్యంతరం పలికారని విమర్శించారు. అయితే ఈ రోజు తాను మాత్రం జయకు హర్షం తెలపుతున్నానని అన్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీలు, తమిళ సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. -
రాజీవ్ హంతకుల విడుదలకు నిర్ణయం
చెన్నై : మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషులకు ఉరి శిక్షను... యావజ్జీవ శిక్షగా మారుస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన మర్నాడే తమిళనాడు ప్రభుత్వం వారిని విడుదల చేయడానికి నిర్ణయించింది. బుధవారం ముఖ్యమంత్రి జయలలిత నాయకత్వంలో అత్యవసరంగా సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో తమిళనాట రాజకీయ లబ్దిపొందేందుకు తహతహలాడుతున్న ఏఐఏడిఎంకే పార్టీకి రాజీవ్ హంతకులు వరంలా కలిసొచ్చారని పరిశీలకులంటున్నారు. మరణశిక్ష అమలులో తీవ్రమైన జాప్యం జరిగిన అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు.. రాజీవ్ హంతకులకు విధించిన మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్పు చేయడంతో పాటు.. ఇప్పటికే 23ఏళ్ల పాటు జైలుశిక్ష అనుభవించిన దరమిలా.. రెమిషన్ ఇచ్చి విడుదల చేసే నిర్ణయాధికారాన్ని తమిళనాడు ప్రభుత్వానికి ఇచ్చింది. వెంటనే స్పందించిన డిఎంకే, ఎండిఎంకే, సిపిఐలు వారిని వెంటనే విడుల చేయాలని డిమాండ్ చేశాయి. శ్రీలంకలో తమిళుల అణచివేత నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న తమిళ సెంటిమెంటును ఎన్నికల వేళ తమకు అనుకూలంగా మలచుకోడానికి వేగంగా పావులు కదిపిన జయలలిత ప్రభుత్వం.. ఆఘమేఘాల మీద వారి విడుదలకు ఆదేశించింది.