రాజీవ్ హత్య కేసు దోషుల పిటిషన్‌పై సుప్రీం తీర్పు వాయిదా
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో మరణశిక్ష పడిన ముగ్గురు దోషులు తమ శిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం వాదనలు విని తీర్పును వాయిదా వేసింది. సంతన్, మురుగన్, పెరివాలన్‌ల న్యాయవాది, శిక్ష మార్పును వ్యతిరేకిస్తున్న కేంద్రం తరఫున అటార్నీ జనరల్ జీఈ వాహనవతి వాదనలు వినిపించారు. దోషుల క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో జరిగిన జాప్యం నిర్హేతుకం కాదని, శిక్షను మార్చకూడదని వాహన్‌వతి వాదించగా ప్రభుత్వ జాప్యం వల్ల పిటిషర్లు బాధలు అనుభవించారని, కోర్టు వారి శిక్షను మార్చాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది పేర్కొన్నారు.