జస్టిస్ విక్రమ్ నాథ్-జస్టిస్ అమునుల్లా
న్యూఢిల్లీ: ప్రస్తుతం సుప్రీంకోర్టు వెకేషన్‌లో ఉన్న కారణంగా దాన్ని సీనియర్లు ఎవరూ అడ్వాంటేజ్‌గా మార్చుకోవద్దని సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది. ఓ కేసును వెకేషన్ బెంచ్ ముందుకు తీసుకొచ్చిన కారణంగా సీనియర్ న్యాయవాది అయిన అభిషేక్ మను సింఘ్వికి ఈ విషయాన్ని సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ మంగళవారం తెలిపింది.
‘మిస్టర్ సింఘ్వి వేసవి సెలవుల్లో మీ కేసులను మేము వినము. ఈ విషయాన్ని మీ AORకి చెప్పండి. అప్పుడు ఏఓఆర్ మీ కేసును మెన్షన్ చేసి మీ కేసు తేదీ లిస్టింగ్‌ను పొందుతారు’ అని వెకేషన్ బెంచ్ పేర్కొంది.
‘సెలవుల్లో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు. మేము మీ కేసులను వినము. కానీ కౌన్సిల్ కేసులు తప్పకుండా వింటాం. ఎలాంటి కేసుల్లోనూ వాదనలు వినిపిస్తామని సీనియర్ లాయర్లు ముందుకు రావొద్దు. కేవలం అత్యవసరమైన మ్యాటర్లు మాత్రమే వెకేషన్ బెంచ్ వింటుంది. ఇక్కడ కూడా సీనియర్ లాయర్ల వాదనలు వినదలుచుకోలేదు. దీన్ని సీనియర్ లాయర్లు అందరూ ఫాలో కావాలి’ అని కోర్టు పేర్కొంది.
అయితే సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ దేవ్ మిగతా వెకేషన్ బెంచ్‌లు ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పలేదు కదా అని పాయింట్ అవుట్ చేసే యత్నం చేశారు. దీనిపై జస్టిస్ విక్రమ్ నాథ్ స్పందిస్తూ.. ‘మిస్టర్ దేవ్.. మేము సీనియర్ అడ్వకేట్లను వెకేషన్‌లో అనుమతించము. ఇది నా కోర్టులో మాత్రమే లేదు’ అని తెలపగా,. ‘ మేము ఈ విషయంలో ఎంతో పారదర్శకంగా ఉన్నాం’ అని మరో న్యాయమూర్తి అమునుల్లా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment