Senior advocate
-
సుప్రీంకోర్టులో సింగిల్ మాల్ట్ ఎపిసోడ్
న్యూఢిల్లీ: సంక్లిష్టమైన కేసులపై సీరియస్‌గా విచారణ జరిగే సుప్రీంకోర్టులో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. విస్కీ, దాని రకాలు తదితరాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, సీనియర్ న్యాయవాది దినేశ్ ద్వివేది మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణ నవ్వులు పూయించింది. సీజేఐ హాస్య చతురత అందరినీ అలరించింది. పారిశ్రామిక ఆల్కహాల్ ఉత్పత్తి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు సంబంధించిన వివాదంపై సీజేఐ నేతృత్వంలోని 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ముందు జరిగిన విచారణ ఇందుకు వేదికైంది. ఈ కేసులో యూపీ తరఫున వాదిస్తున్న ద్వివేది తెల్ల జుట్టు రంగులమయంగా కని్పంచడంపై జస్టిస్ చంద్రచూడ్ సరదాగా ఆరా తీశారు. హోలీ సంబరాలు కాస్త శ్రుతి మించడమే కారణమంటూ ద్వివేది కూడా అంతే సరదాగా బదులిచ్చారు. ‘‘ఈ విషయంలో దయచేసి నన్ను క్షమించాలి. నా మనవల నిర్వాకం కూడా ఇందుకు కొంతవరకు కారణమే. సంతానం, మనవలు మరీ ఎక్కువగా ఉంటే, అందులోనూ వారంతా మనతో పాటే ఉంటుంటే ఇలాంటి గమ్మత్తైన సమస్యలుంటాయి. తప్పించుకోలేం’’ అన్నారు. సీజేఐ అంతటితో వదల్లేదు. ‘అంతేగానీ, ఆల్కహాల్‌కు ఏ సంబంధమూ లేదంటారు!’ అంటూ చెణుకులు విసిరారు. విస్కీప్రియుడైన ద్వివేది అందుకు చిరునవ్వులు చిందించారు. ‘‘విస్కీ పాత్ర కూడా ఉందని నేను ఒప్పుకుని తీరాలి. హోలీ అంటేనే ఆల్కహాల్ పారీ్టలు. పైగా నేను విస్కీకి వీరాభిమానిని’’ అనడంతో అంతా గొల్లుమన్నారు. సింగిల్ మాల్ట్ విస్కీ విషయంలో ఇంగ్లండ్‌లో తనకెదురైన గమ్మత్తైన అనుభవాన్ని విచారణ సందర్భంగా ద్వివేది ఏకరువు పెట్టారు. ‘‘నేను సింగిల్ మాల్ట్ విస్కీనే ఇష్టపడతా. ఆ విస్కీకి స్వర్గధామంగా చెప్పదగ్గ ఎడింబర్గ్ వెళ్లానోసారి. సింగిల్ మాల్ట్ తెప్పించుకుని ఐస్‌క్యూబ్స్ వేసుకోబోతుంటే వెయిటర్ అడ్డుకున్నాడు. ‘ఇదేం పని! అది సింగిల్ మాల్ట్ విస్కీ. దాన్నలాగే నేరుగా ఆస్వాదించాలి. అంతేతప్ప ఇలా ఐస్క్యూబులూ సోడాలూ కలపొద్దు! పైగా దానికంటూ ప్రత్యేకమైన గ్లాస్ ఉంటుంది. అందులో మాత్రమే తాగాలి’ అంటూ సుదీర్ఘంగా క్లాస్ తీసుకున్నాడు. సింగిల్ మాల్ట్ తాగేందుకు ఇంత తతంగం ఉంటుందని అప్పుడే నాకు తెలిసొచి్చంది’’ అంటూ వాపోయారు. దాంతో న్యాయమూర్తులతో పాటు కోర్టు హాల్లో ఉన్నవాళ్లంతా పడీపడీ నవ్వారు. ధర్మాసనంలోని మిగతా న్యాయమూర్తులు కూడా తమ చెణుకులతో ఈ సరదా సన్నివేశాన్ని మరింత రక్తి కట్టించారు. పారిశ్రామిక ఆల్కహాల్‌తో పాటు విస్కీ, వోడ్కా వంటివి కూడా రాష్ట్రాల నియంత్రణ పరిధిలోకే వస్తాయంటూ ద్వివేది వాదించడంతో ఒక న్యాయమూర్తి కలి్పంచుకున్నారు. ‘‘ఇంతకీ మీరనేదేమిటి? ఆల్కహాల్ మందుబాబులకు కిక్కిచి్చనా, ఇవ్వకపోయినా రాష్ట్రాల ఖజానాకు మాత్రం కిక్కివ్వాల్సిందేనంటారా?’’ అనడంతో నవ్వులు విరిశాయి. ఇంకో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, ‘‘కొన్ని రకాల మద్యం రుచి కాలం గడిచేకొద్దీ పెరుగుతుందని, కొన్ని తేలిక రంగులోనూ మరికొన్ని ముదురు రంగులోనూ ఉంటాయని... ఇలా ఆల్కహాల్‌కు సంబంధించిన చాలా అంశాలను మీరు ఎంతో చక్కగా వివరించారు. సాక్ష్యంగా ఆయా రకాల మద్యం బాటిళ్లను ప్రవేశపెడితే ఎలా ఉంటుందంటారు!’’ అనడంతో కోర్టు హాలంతా మరోసారి నవ్వులతో దద్దరిల్లిపోయింది. -
తీక్షణ భావాల మృదుభాషి
‘‘ప్రతిపక్షం అన్నది ప్రజల అసంతృప్తిని ప్రతిఫలించే దృష్టికేంద్రం. ప్రతిపక్షమే లేకుంటే ప్రజాస్వామ్యమే ఉండదు’’ అని దృఢంగా నమ్మేవారు ఫాలీ శామ్ నారిమన్. ‘‘ప్రస్తుత పరిస్థితులతో ఎప్పటికీ మనం ఒక కొత్త రాజ్యాంగాన్ని రూపొందించుకోలేం’’ అని అనేవారు. ‘‘దారికి ఒప్పించటం, కోరినది ఇవ్వటం, ఓరిమి వహించటం’’ అనే ఔదార్యాలు లేకుండా అద్భుతమైన, వినూత్నమైన ఆలోచనలు మాత్రమే మనకొక ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని ఏనాటికీ అందించలేవు. పరిస్థితులను బట్టి చూస్తే భారతదేశంలో ప్రస్తుతం ఇవి మూడూ క్షీణించి ఉన్నాయి’’ అన్నది ఆయన అభిప్రాయం. ‘‘భారత పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల పరిరక్షణకు మన న్యాయమూర్తులు మరింత సుముఖంగా ఉండాలి’’ అనేవారు. ఆఫీసులో నా డెస్కుకు ఎదురుగా ఉన్న గోడకు ఫాలీ నారిమన్ ఫొటో వేలాడదీసి ఉంటుంది. అది ఆయన స్వాభావిక మృదుహాసాన్ని, మిలమిల మెరిసే కళ్లను పట్టివ్వదు కానీ, ఆయనలోని దృఢచిత్తాన్ని, ఒడుదొడు కులను తట్టుకోగలిగిన స్థితిస్థాపక గుణాన్ని మాత్రం ప్రతిఫలిస్తూ ఉంటుంది. కెమెరాలోకి గుచ్చి చూస్తూ, తన కుడి చేతితో కుర్చీ ఆన్పును దృఢంగా పట్టుకుని ఉన్న ఆయన తీరును గమనిస్తే... ఆయన – తనేమిటో తనకు తెలిసిన మనిషి అనీ, తనను తాను స్వీయ స్పృహ లేకుండా వ్యక్తపరచుకోగలరనీ మీరు పసిగట్టగలరు. ఆ గోడపైన ఉన్నది – ఆయన చివరి పుస్తకం ‘యు మస్ట్ నో యువర్ కాన్స్టిట్యూషన్’ ఆవిష్కరణ సందర్భంగా ఆయనతో నా చివరి ఇంటర్వ్యూకు ముందరి ఇంటర్వ్యూలో తీసిన ఫొటో. ఆ ఇంట ర్వ్యూలో ఆయన మాట్లాడిన చాలా విషయాలు మన దేశానికి ఒక సందేశం అనే నేను నమ్ముతున్నాను. ప్రసిద్ధ బ్రిటిష్ న్యాయ–విద్యావేత్త ఐవర్ జెన్నింగ్స్‌ను అంగీకా రంగా ఉటంకిస్తూ, నారిమన్ ఇలా అన్నారు: ‘‘పార్లమెంటులో అత్యంత ముఖ్యమైన వ్యవస్థ ప్రతిపక్షమే అని అనడంలో అవాస్తవ మేమీ లేదు. ప్రతిపక్షం అన్నది ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం. ప్రజల అసంతృప్తిని ప్రతిఫలించే దృష్టికేంద్రం. ప్రభుత్వం ఎంత ముఖ్య మైనదో, ప్రతిపక్షం పనితీరు కూడా దాదాపుగా అంతే ముఖ్యమైనది. ప్రతిపక్షమే లేకుంటే ప్రజాస్వామ్యమే ఉండదు.’’ అలా అని ప్రభుత్వాన్ని మనం ఎలా ఒప్పించగలమని ఇంటర్వ్యూ మధ్యలో నేను అడిగినప్పుడు, ఆయన నవ్వి ఊరుకున్నారు. అది నేను చేయగలిగిందైతే కాదు అన్నారు. ఏమైతేనేం, ఆయనే ఆ తర్వాత ‘‘నాకొచ్చిన సందేహాన్నే మీరు వ్యక్తం చేయటం నాకెంతగానో సంతోషంగా ఉంది’’ అన్నారు. నారిమన్ మాట్లాడే ధోరణి సూటిగా, సందర్భశుద్ధితో ఉంటుంది తప్ప... ఎప్పుడూ కూడా బాధించేలా, అభ్యంతరకరంగా ఉండదు. కొన్నిసార్లు ఆయనే మిమ్మల్ని మెల్లగా నడిపిస్తున్నారని కూడా మీరు తెలుసుకోలేరు. ఉదాహరణకు, బహుశా మేము తొలిసారి కలుసు కోవటం రచయిత పత్వంత్ సింగ్ ఇంట్లోననుకుంటా... ఆయన నా భుజం చుట్టూ చేయి వేసి – మిగతావాళ్లంతా డైనింగ్ టైబుల్ దగ్గర్నుంచి డ్రాయింగ్ రూమ్‌కు కదులుతూ ఉండగా – నన్ను ఒక మూలకు తోడ్కొని వెళ్లారు. ‘‘గుర్తుంచుకో! పత్వంత్ ఎప్పుడూ కూడా చివరి మాట తనదే కావాలని కోరుకుంటాడు. అలా ఉండేందుకు మీరు ఆయన్ని అనుమతిస్తే ఎప్పటికీ మీ స్నేహితుడిగా ఉంటాడు’’ అన్నారు. బాగా గుర్తు... పత్వంత్ని నేను ప్రశ్న మీద ప్రశ్న అడుగుతూనే ఉన్నాను. సన్నటి గీతను దాటేస్తున్నానేమోనని నారిమన్ నన్ను నెమ్మదిగా హెచ్చరిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం అతి సమీపంగా ప్రస్తావనకు వచ్చిన అనేక అంశాలపై ఇంటర్వ్యూలో నారిమన్ ఇదే విధమైన సున్నిత శైలిని అవలంబించారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పటికీ మనం ఒక కొత్త రాజ్యాంగాన్ని రూపొందించుకోలేం’’ అని ఆయన అన్నారు. ‘‘దారికి రప్పించటం, కోరినది ఇవ్వటం, ఓరిమి వహించటం’’ అనే ఔదార్యాలు లేకుండా అద్భుతమైన, వినూత్నమైన ఆలోచనలు మాత్రమే మనకొక ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని ఏనాటికీ అందించలేవు. ‘‘పరిస్థి తులను బట్టి చూస్తే భారతదేశంలో ప్రస్తుతం ఇవి మూడూ క్షీణించి ఉన్నాయి’’ అన్నారాయన. ఇటీవలి ఆయన మరణం తర్వాత నేను మళ్లీ ఆనాటి ఇంట ర్వ్యూను విన్నాను. నారిమన్ ఎంత బుద్ధిశాలిగా మాట్లాడారో వెంటనే గమనించాను. ‘‘రాజ్యాంగంలో ప్రవేశిక చాలా ముఖ్యమైన భాగం’’ అన్నారు. ప్రవేశికను ఆయన రాజ్యాంగం యొక్క మనస్సాక్షి అన్నారు. ప్రవేశికలోని ‘సౌభ్రాతృత్వం’ అనే భావన గురించే ఆనాడు ఆయన నొక్కి మాట్లాడారా? ప్రవేశికలో మాత్రమే ఉన్న మాట అది. ఆ తర్వాత ‘సహనశీలత’ వైపుగా మా సంభాషణను నడిపించింది నేను కాదు, ఆయనే! ప్రస్తుతం సమస్యేమిటంటే మనకు ‘‘సహనం లేదు’’ అన్నారాయన. మళ్లీ ఆ తర్వాత కూడా ఈ మాట అనడం కోసం ఆయన తన పుస్తకం హద్దులను సైతం దాటేశారు. ఆప్పుడు నేను పట్టుకోలేకపోయాను కానీ, ఇప్పుడు ఆయన మరణం తర్వాత ఆలోచిస్తే ఆయన ఎంత జాగ్రత్తగా ఆ సందేశాలు ఇచ్చారో కదా అని ఆశ్చర్యం కలుగుతోంది. మరికొన్ని కూడా ఉన్నాయి. భారత పౌరులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని నిలబెట్టేందుకు మన న్యాయమూర్తులు మరింత సుముఖంగా ఉండాలి అన్నారు. అలా ఉండేందుకు వారు ఇష్టపడకపోవటం ఆయన్నెంతో నిరాశకు గురి చేసింది. అయితే వారిని తీవ్రంగా విమర్శించేందుకు సంకోచించి, ‘క్యురేట్స్ ఎగ్’తో పోల్చి సరిపెట్టుకున్నారు... మంచీ ఉందీ, చెడూ ఉందీ... అయితే మంచిని చెడు తినేస్తోంది అనే అర్థంలో! నారిమన్‌తో నేను పలు ఇంటర్వ్యూలు చేశాను. తొలినాళ్లలో ఆయన స్పోర్టింగ్ బ్రేసెస్‌ని ధరించి ఉండేవారు. నాకు బౌ టై ఉండేది. మా మధ్య సంభాషణ గొప్ప శక్తితో, ఆసక్తితో సాగేది. మధ్యలో స్నేహ పూర్వకమైన అంతరాయాలను కలిగించుకునేవాళ్లం. ఉల్లాసం, ఉత్సాహం తరచూ మా ఇంటర్వ్యూలను నడిపించేవి. అవును, మా సంభాషణ గురించి ఇలాగే చెప్పాలి. ఆయన భార్య బాప్సి ఓ వైపున కూర్చొని ఉండి మా సంభా షణను ఆలకిస్తూ ఉండేవారు. దాదాపు ప్రతిసారీ ఆమె నన్ను భోజనానికి ఉండమనేవారు. ఆమె అలా అనడమే ఆలస్యం నేను భోజనా నికి తయార్! ఆయన నాతో పాటుగా కారు వరకు బయటికి నడిచి వచ్చేవారు. నేను వారికి వీడ్కోలు చెబుతున్నప్పుడు... ‘‘ఆమెకు నువ్వంటే అభిమానం’’ అని నవ్వుతూ అనేవారు. ఆ గుణం కూడా ఆయన గురించిన సముచితమైన విశేషణమే. ఆయన పట్ల నాకు గొప్ప గౌరవభావం. ఆయన మేధ నన్ను ముగ్ధుడిని చేసేది. మనసులో ఏదీ దాచుకోలేని ఆయన స్వభావం, ఒక సరైన పని చేయటంలో ఆయనకు ఉండే నిస్సంశయ నిబద్ధత నన్ను ఆశ్చర్యచకితుడిని చేసేవి. నేను కూడా ఆయనపై అభిమానం పెంచు కున్నాను. పెద్దగా పరిచయం లేకుండానే ఏర్పడే ఆప్యాయత వంటిది ఆ అభిమానం. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
సొలిసిటర్ జనరల్‌గా మళ్లీ తుషార్ మెహతా
న్యూఢిల్లీ: సీనియర్ న్యాయవాది తుషార్ మెహతా భారత సొలిసిటర్ జనరల్‌గా మళ్లీ నియమితులయ్యారు. 2018లో మొదటిసారిగా సొలిసిటర్ జనరల్‌గా నియమితులైన తుషార్ మెహతా పదవీ కాలాన్ని ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు పొడిగించింది. తాజాగా, మూడోసారి మరో మూడేళ్ల కాలానికి ఆయన్ను నియమిస్తూ సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతోపాటు సుప్రీంకోర్టుకు ఆరుగురు అదనపు సొలిసిటర్ జనరల్‌ను మూడేళ్ల కాలానికి పునర్నియమించింది. వీరు..విక్రమ్‌జీత్ బెనర్జీ, కేఎం నటరాజ్, బల్బీర్‌సింగ్, ఎస్వీ రాజు, ఎన్ వెంకటరామన్, ఐశ్వర్య భాటి. -
‘సుప్రీంకోర్టు వెకేషన్లో ఉంది.. అడ్వాంటేజ్‌గా మార్చుకోవద్దు’
న్యూఢిల్లీ: ప్రస్తుతం సుప్రీంకోర్టు వెకేషన్లో ఉన్న కారణంగా దాన్ని సీనియర్లు ఎవరూ అడ్వాంటేజ్‌గా మార్చుకోవద్దని సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది. ఓ కేసును వెకేషన్ బెంచ్ ముందుకు తీసుకొచ్చిన కారణంగా సీనియర్ న్యాయవాది అయిన అభిషేక్ మను సింఘ్వికి ఈ విషయాన్ని సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ మంగళవారం తెలిపింది. ‘మిస్టర్ సింఘ్వి వేసవి సెలవుల్లో మీ కేసులను మేము వినము. ఈ విషయాన్ని మీ AORకి చెప్పండి. అప్పుడు ఏఓఆర్ మీ కేసును మెన్షన్ చేసి మీ కేసు తేదీ లిస్టింగ్‌ను పొందుతారు’ అని వెకేషన్ బెంచ్ పేర్కొంది. ‘సెలవుల్లో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు. మేము మీ కేసులను వినము. కానీ కౌన్సిల్ కేసులు తప్పకుండా వింటాం. ఎలాంటి కేసుల్లోనూ వాదనలు వినిపిస్తామని సీనియర్ లాయర్లు ముందుకు రావొద్దు. కేవలం అత్యవసరమైన మ్యాటర్లు మాత్రమే వెకేషన్ బెంచ్ వింటుంది. ఇక్కడ కూడా సీనియర్ లాయర్ల వాదనలు వినదలుచుకోలేదు. దీన్ని సీనియర్ లాయర్లు అందరూ ఫాలో కావాలి’ అని కోర్టు పేర్కొంది. అయితే సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ దేవ్ మిగతా వెకేషన్ బెంచ్‌లు ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పలేదు కదా అని పాయింట్ అవుట్ చేసే యత్నం చేశారు. దీనిపై జస్టిస్ విక్రమ్ నాథ్ స్పందిస్తూ.. ‘మిస్టర్ దేవ్.. మేము సీనియర్ అడ్వకేట్లను వెకేషన్లో అనుమతించము. ఇది నా కోర్టులో మాత్రమే లేదు’ అని తెలపగా,. ‘ మేము ఈ విషయంలో ఎంతో పారదర్శకంగా ఉన్నాం’ అని మరో న్యాయమూర్తి అమునుల్లా పేర్కొన్నారు. -
'నేను 'గే' అయినందు వల్లే జడ్జిగా ప్రమోషన్ ఇవ్వట్లేదు'
సీనియర్ న్యాయవాది సౌర్‌భ్ కిర్పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను స్వలింగ సంపర్కుడు(గే) అయినందు వల్లే జడ్జిగా పదోన్నతి కల్పించడం లేదని పేర్కొన్నారు. న్యాయమూర్తల నియామక ప్రక్రియపై కేంద్రం దృష్టిసారించిన నేపథ్యంలో సీనియర్ అడ్వకేట్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. వాస్తవానికి సౌరభ్ కిర్పాల్ 2017లోనే జడ్జి కావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఆ ప్రతిపాదనలు ఆమోదానికి నోచుకోలేదు. కేంద్రమే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే జడ్జిగా పదోన్నతి లభించకపోవడానికి తన లైంగిక ధోరణే ప్రధాన కారణమని భావిస్తున్నట్లు సౌరభ్ కిర్పాల్ పేర్కొన్నారు. ఒక గేను న్యాయమూర్తిగా నియమించేందుకు కేంద్రం సుముఖంగా లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి: శ్రద్ధ హత్యకేసు.. అఫ్తాబ్‌కు ఐదు రోజుల కస్టడీ.. ఉరితీయాలని డిమాండ్ -
ఏజీ పోస్ట్ నాకొద్దు: రొహత్గీ
న్యూఢిల్లీ: అటార్నీ జనరల్ పదవిని సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రొహత్గీ తిరస్కరించారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆదివారం చెప్పారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్(91) పదవీ కాలం ఈ నెల 30వ తేదీతో ముగియనుండటంతో ఆ పదవికి రొహత్గీని కేంద్రం ఎంపిక చేయడం తెలిసిందే. వేణు గోపాల్ కూడా ఆరోగ్యో కరాణాలతో ఈ పదవిలో మరింతకాలం కొనసాగనని ఇప్పటికే చెప్పారు. ముకల్ రొహత్గీ కేంద్రం ఆఫర్‌ను తిరస్కరించాడని ప్రత్యేక కారణాలేమీ లేవని చెప్పారు. ఒకటికి రెండుసార్లు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. రొహత్గీ 2014 నుంచి 2017వరకు అటార్నీ జనరల్‌గా పనిచేశారు. ఒకవేళ కేంద్రం ఆఫర్‌కు ఆయన ఓకే చెప్పి ఉంటే ఈ పదవిని రెండోసారి చేపట్టేవారు. చదవండి: సోనియాతో నితీశ్, లాలూ కీలక భేటీ.. -
నిరూప్‌రెడ్డికి సీనియర్ న్యాయవాది హోదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన న్యాయవాది పి.నిరూప్‌రెడ్డికి సుప్రీంకోర్టు ఫుల్‌కోర్టు సీనియర్ న్యాయవాది హోదా కల్పించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ హోదా పొందిన తొలి వ్యక్తి నిరూప్‌రెడ్డి కావడం విశేషం. మెదక్ జిల్లాకు చెందిన సీనియర్ న్యాయవాది, మాజీ స్పీకర్, మాజీ మంత్రి పి.రామచంద్రారెడ్డి కుమారుడైన నిరూప్‌రెడ్డి 30 ఏళ్లుగా సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. రాజ్యాంగపరమైన అంశాలతోపాటు చట్టాలపై మంచి పట్టున్న న్యాయవాదిగా గుర్తింపు పొందిన ఆయన వాదనలు వినిపించిన 31 కేసుల్లో తీర్పులు రికార్డు (రిపోర్టబుల్) అయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ అడ్వొకేట్ జనరల్, అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా సేవలందించిన సీనియర్ న్యాయవాది వీఆర్ రెడ్డి, పూర్వ సొలిసిటర్ జనరల్ గోపాల సుబ్రమణ్యంతోనూ కలిసి ప్రాక్టీస్ చేశారు. 2013–18 సంవత్సరాల మధ్య గోవా, ఢిల్లీ రాష్ట్రాల తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. కాగా, హైకోర్టు న్యాయమూర్తులుగా పదవీ విరమణ చేసిన జస్టిస్ లింగాల నర్సింహారెడ్డి, జస్టిస్ నౌషద్ అలీతోపాటు ఢిల్లీలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరు న్యాయవాదులు అన్నం డీఎన్ రావు, యడవల్లి ప్రభాకర్‌రావులకు కూడా సుప్రీంకోర్టు సీనియర్ హోదా కల్పించింది. డీఎన్ రావు.. సుప్రీం న్యాయవాదిగా, అడ్వొకేట్ ఆన్ రికార్డు (ఏవోఆర్)గా ప్రాక్టీస్ చేసిన అన్నం సుబ్బారావు కుమారుడు. -
నిర్భయ తల్లి ఆశాదేవి ఆ నిర్ణయం తీసుకుంటారా?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ నిర్భయ తల్లి ఆశాదేవికి ఆసక్తికరమైన విన్నపాన్ని చేశారు. ఏడేళ్ల క్రితం తన కుమార్తె (నిర్భయ)పై సామూహిక హత్య చారం చేసిన వారిని క్షమించాలని ఆమె కోరారు. ఈ విషయంలో ఆమె పెద్దమనసు చేసుకోవాలని ఇందిరా విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగాఈ విషయంలో కాంగ్రెస్ అధినేత్రి, రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీని ఉదాహరణగా తీసుకోవాలని కోరారు. 1991లో తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీని మానవబాంబు ద్వారా హత్య చేసిన కేసులోనళినిని సోనియా క్షమించినట్టుగానే, నలుగురు దోషులకు కూడా ఆశాదేవి క్షమాభిక్ష పెట్టాలని కోరుతున్నామని జైసింగ్ ట్వీట్ చేశారు. తన కుమార్తె మరణాన్ని రాజకీయం చేస్తున్నారన్న ఆశాదేవి ఆవేదనకు పూర్తి మద్దతు తెలిపిన ఇందిరా మరణశిక్ష వద్దు.. ఉరి శిక్షలకు తాము వ్యతిరేకమని పేర్కొన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా రాజకీయాల్లోకి ప్రవేశించనున్నరాన్నవార్తలపై ఆశాదేవి తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా కోర్టులు, ప్రభుత్వంపై ఆమె ధ్వజమెత్తారు. అలాగే 2012లో నిర్భయ హత్యాకాండకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి, మహిళల భద్రత కోసం నినాదాలు చేసిన వ్యక్తులే, రాజకీయ ప్రయోజనం కోసం తన కుమార్తె మరణాన్ని వాడు కుంటున్నారని విమర్శించారు. తమ స్వార్థ రాజకీయ లాభాల కోసమే ఉరిశిక్ష అమలును అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అయితే గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా మహిళలపై హింసకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించేలా చూడాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి విజ్ఞప్తి చేశారు. అంతేకాదు దోషులను ఉరితీసే వరకు తనకు మనశ్శాంతి లేదంటూ కంట తడిపెట్టారు. ఈ నేపథ్యంలో ఇందిరాజైసింగ్ అభ్యర్థనను, ఆశాదేవి అంగీకరిస్తారా అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏం నేరమూ చేయని తన కుమార్తెను అతికిరాతంగా హత్య చేసిన వారికి మరణ శిక్షే న్యాయమంటూ.. ఏడేళ్లుగా అలుపెరుగని పోరాటం చేసిన ఆమె ఇపుడు హంతకులను క్షమిస్తారా? పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి, క్షమించడమనే ఉదాత్తమైన నిర్ణయం తీసుకుంటారా... లేదంటే..దేశవ్యాప్తంగా ఎందరో ఆడబిడ్డల కన్నతల్లులకు తీరని కడుపుశోకాన్ని మిగిల్చుతున్న వారికి ఇదే న్యాయమంటారా? వేచి చూడాలి కాగా 2012 డిసెంబర్ 16 రాత్రి దేశ రాజధానిలో కదిలే బస్సులో 23 ఏళ్ల నిర్భయపై సామూహిత్య హత్యాచారానికి పాల్పడిన కేసులో వినయ్, అక్షయ్, పవన్, ముకేశ్ అనే నలుగురు దోషులుగా (ఒక దోషి జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరో దోషి మైనర్ కావడంతో శిక్షనుంచి మ తప్పించుకున్నాడు) నిర్దారించారు. సుదీర్ఘ విచారణ, న్యాయపరంగా అన్ని అడ్డంకులను అధిమించిన అనంతరం ఫిబ్రవరి 1 న ఉదయం 6 గంటలకు వారిని ఉరి తీయనున్న సంగతి తెలిసిందే. చదవండి : ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు నిర్భయ దోషుల ఉరి : కొత్త ట్విస్టు చావును వాడుకోకండి.. నిర్భయ తల్లి కన్నీటి పర్యంతం While I fully identify with the pain of Asha Devi I urge her to follow the example of Sonia Gandhi who forgave Nalini and said she didn’t not want the death penalty for her . We are with you but against death penalty. https://t.co/VkWNIbiaJp — Indira Jaising (@IJaising) January 17, 2020 -
రెబెల్ న్యాయవాది
కొందరు ప్రశ్నించడానికే పుట్టినట్టుంటారు. ఎంతటివారినైనా నిలదీస్తారు. ఆ క్రమంలో ఎంత పరుషంగా మాట్లాడటానికైనా సిద్ధపడతారు. అవతలివారిని ఇరకాటంలోకి నెడతారు. అందుకే వారిని చూస్తే అధికార పీఠాలు వణుకుతాయి. ఆదివారం ఉదయం కన్నుమూసిన సుప్రసిద్ధ న్యాయకోవిదుడు రాంజెఠ్మలానీ ఆ కోవకు చెందిన అరుదైన వ్యక్తి. ‘తన మనసులోని మాటలను వ్యక్తం చేయడానికి వెనుదీయని ధైర్యశాలి జెఠ్మలానీ’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్న మాట అక్షరసత్యం. 2015లో చీఫ్ విజిలెన్స్ కమిషనర్(సీవీసీ)గా కెవి చౌదరి నియామకం జరిగినప్పుడు ‘ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని నేను ఎంతమాత్రం అనుకోలేదు. మీపై క్రమేపీ తగ్గుతూ వస్తున్న గౌరవం, ఇవాళ్టితో పూర్తిగా అడుగంటింది’ అని మోదీకి ఘాటైన లేఖరాసినా...‘మీరు విశ్వాసఘాతకులు. నాకు కృతజ్ఞతగా ఉండాల్సిన మీరు శత్రువుగా మారి వంచకులతో చేతులు కలిపారు’ అంటూ బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అడ్వాణీపై నిప్పులు చెరిగినా...మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ అధికారంలో ఉండగా ఆయనకు బోఫోర్స్‌పై రోజుకు పది ప్రశ్నలతో లేఖలు సంధిం చినా అది రాంజెఠ్మలానీకే చెల్లుతుంది. ఆ లేఖల గురించి ఒకరు ప్రస్తావించినప్పుడు రాజీవ్‌గాంధీ సహనం కోల్పోయి, ‘అరిచే ప్రతి కుక్కకూ జవాబివ్వాల్సిన అవసరం లేద’ని ఈసడిం చగా...‘అవును నేను కుక్కనే. ఈ ప్రజాస్వామ్యానికి కావలి కుక్క’ను అని రాంజెఠ్మలానీ తడుము కోకుండా ప్రత్యుత్తరమిచ్చారు. పదవుల పంపకం జరిగినప్పుడల్లా అవి దక్కనివారు అలగటం, నిష్టూరంగా మాట్లాడటం ఇంచుమించు అన్ని పార్టీల్లో గమనిస్తాం. ఆ ధోరణి జెఠ్మలానీలో కూడా కనబడుతుంది. అయితే ఆయన అలక విలక్షణమైనది. ముందూ మునుపూ ‘పనికొస్తుంద’ని ఏ విషయం దాచుకోవడం అంటూ ఉండదు. తాను ఏం ఆశించాడో, ఎందుకు ఆశించాడో చెప్పడంతోపాటు... నాయకుడు తన నెలా నట్టేట ముంచాడో కుండబద్దలు కొట్టడం జెఠ్మలానీ ప్రత్యేకత. ఆయన కాంగ్రెస్ మొదలుకొని అన్ని పార్టీల్లోనూ చేరారు. ఇంచుమించు అంతే వేగంగా బయటికొచ్చారు. రాజ్యసభ సభ్యత్వమో, మరొకటో ఇస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత మాట తప్పినప్పుడు నిప్పులు చెరగడం జెఠ్మలానీకి రివాజు. అలా అని ఆయన్ను సగటు రాజకీయ నాయకుడిగా భావించలేం. అనుకున్న పదవి దక్కి నిక్షేపంగా ఉన్నప్పుడు సైతం ఆయన మౌనంగా, ప్రశాంతంగా గడిపిన సందర్భం లేదు. అటల్ బిహారీ వాజపేయి కేబినెట్లో న్యాయ శాఖమంత్రి ఉంటూ అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఏఎస్ ఆనంద్‌కు వ్యతిరేకంగా ప్రకటన చేసి జెఠ్మలానీ పదవి పోగొట్టుకున్నారు. తదనంతరం 2004లో ఆయన వాజపేయిపైనే లక్నో నియోజకవర్గం నుంచి పోటీచేశారు. బీజేపీలో ఉంటూనే 2012లో అప్పటి అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి లేఖరాస్తూ యూపీఏ ప్రభుత్వ అవినీతిపై పార్టీ నేతలెవరూ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీయడంతో ఆగ్రహించిన పార్టీ ఆయన్ను ఆరేళ్ల పాటు బహిష్కరించగా, పార్టీపైనే పరువు నష్టం దావా వేశారు. ఆ సందర్భంలోనే అడ్వాణీపై నిప్పులు చెరిగారు. ఆయనే ఇతరులతో చేతులు కలిపి తన బహిష్కరణకు కారణమయ్యారని విమర్శించారు. జైన్ హవాలా కేసులో వాదించి ఆయన్ను నిర్దోషిగా నిరూపిస్తే, ఇది అడ్వాణీ చేసిన ప్రత్యుపకారమని దుయ్యబట్టారు. ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కూడా ఆయన మౌనంగా లేరు. రోజూ ఆయన చేసే పదునైన విమర్శలను తట్టుకోలేని ఇందిర ప్రభుత్వం ఆయనపై అరెస్టు వారెంట్ జారీ చేస్తే దానిపై బొంబాయి హైకోర్టు స్టే విధించింది. అనంతరం ఆయన కెనడా వెళ్లి అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా ఉద్యమించారు. దాన్ని తొలగించాకే దేశంలో అడుగుపెట్టారు. క్రిమినల్ కేసులు స్వీకరించడంలోనైనా, వాటిని వాదించడంలోనైనా జెఠ్మలానీ వ్యవహారశైలి ఎవరి ఊహకూ అందేది కాదు. సాక్షుల్ని క్రాస్ ఎగ్జామ్ చేయడంలో ఆయన సాటి దేశంలోనే మరెవరూ లేరంటారు. దాని వెనకున్న రహస్యాన్ని ఆయనొకసారి చెప్పారు. కక్షిదారు చెబుతున్న అంశాలపైనే ఆధారపడినా, కేవలం చట్టనిబంధనలు చదువుకు వెళ్లినా అనుకున్న ఫలితం రాదని... స్వయంగా ఘటనా స్థలానికెళ్లి సొంతంగా పరిశోధించి జరిగిందేమిటో తెలుసుకున్నప్పుడే ఏ కేసునైనా సమర్థవంతంగా వాదించగలుగుతామన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. ఏడు దశాబ్దాల న్యాయవాద వృత్తిలో గడించిన అపారానుభవం నుంచి చెప్పిన మాటలవి. దేశంలో నేర న్యాయ వ్యవస్థ ఒక రూపం సంతరించుకోవడంలో జెఠ్మలానీ పాత్ర ఎనలేనిది. ఆయన వాదించిన కేసులు చూస్తే జెఠ్మలానీ విలక్షణ శైలి అర్ధమవుతుంది. 70వ దశకంలో పేరుమోసిన స్మగ్లర్ హాజీ మస్తాన్ మొదలుకొని 90లనాటి హర్షద్ మెహతా, కేతన్ పారిఖ్ వంటి స్టాక్ మార్కెట్ స్కాం నిందితుల వరకూ...ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ హత్య కేసు నిందితులు, పార్లమెంటుపై దాడి కేసులో ఉన్న అప్పటి ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్ఏఆర్ జిలానీ వరకూ జెఠ్మలానీ స్వీకరించిన కేసులన్నీ దిగ్భ్రాంతిపరిచేవే. ఈ కేసుల్లో ఆయన మొక్కుబడిగా వాదించడం కాదు... తన వాదనా పటిమతో ఆ కేసుల్లోని బహుముఖ కోణాలను విప్పి చెప్పి, నిందితుల నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి చేసే ప్రయత్నాలు న్యాయమూర్తులనే అబ్బురపరిచేవి. సమాజం గీసే లక్ష్మణరేఖలు ఎప్పుడూ జెఠ్మలా నీని నివారించలేకపోయాయి. ఈ కేసుల్లోని నిందితులు జాతి వ్యతిరేకులని, దేశద్రోహులని, వారి తరఫున వాదించినవారూ ద్రోహులేనని గుండెలు బాదుకుంటున్నవారిని చూసి ఆయన జాలిపడి ఊరుకునేవారు. నేర నిరూపణ జరిగేవరకూ ఏ కేసులోని నిందితులైనా నిరపరాధులేనన్నది ఆయన నిశ్చిత భావన. సంపన్న కక్షిదారుల నుంచి ఫీజు రూపంలో భారీగా వసూలు చేయడం, నిస్సహాయ కక్షిదారుల తరఫున ఉచితంగా వాదించడం జెఠ్మలానీ ఎంచుకున్న విధానం. ఆయన జీవిత చరిత్ర పుస్తకం పేరు ‘తిరుగుబాటుదారు’. జెఠ్మలానీ చివరి వరకూ అలాగే జీవించారు. -
‘సీబీఐని నిరోధించే అధికారం లేదు’
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని రాష్ట్రంలోకి ప్రవేశించకుండా నిరోధించే అధికారం రాష్ట్రాలకు లేదని సుప్రీం కోర్టు న్యాయవాది ఎం.ఎల్ శర్మ స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీబీఐ విచారణ చేపట్టే అధికారాన్ని నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సీబీఐని పూర్తిగా నియంత్రించే అధికారం రాష్ట్రానికి ఉండదన్నారు. కేసులను బట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నియంత్రణ విధించవచ్చని, కానీ ఏకమొత్తంగా సీబీఐని నిరోధించడం సాధ్యం కాదన్నారు. షెడ్యూల్ 7ఏ ప్రకారం సీబీఐపై పార్లమెంట్‌కు అధికారం ఉందని, ఇది రాజ్యంగ పరమైన సంక్లిష్ట సమస్యగా ఈ జీవోను కోర్టు కొట్టేస్తుందని పేర్కొన్నారు. షెడ్యూల్ 7 ప్రకారం కేంద్రానికి సీబీఐపై అధికారం ఉదని, పార్లమెంట్ చట్టానికి వ్యతిరేకంగా కన్సెండ్ ఇవ్వడానికి వీలులేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీ ప్రభుత్వం ఈ జీవో తెచ్చినట్లు అర్థమవుతోందన్నారు. ఈ కేసును చాలా సూక్ష్మంగా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. సెక్షన్ 6 కొట్టివేయాలని సుప్రీంకోర్టులో సోమవారం కేసు వేయనున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిషేధం విధిస్తుందో కారణాలు చెప్పాలని, సుప్రీంకోర్టు ఈ విషయాల్లో తప్పనిసరిగా డైరెక్షన్స్ ఇస్తుందన్నారు. ఈ జీవోను నిరోధిస్తూ తక్షణమే కేంద్రం ఆర్డినెన్సు తీసుకురావాలన్నారు. టీడీపీ ఎంపీ పై ఇప్పటికే ఐటీ సోదాలు జరిగాయని, ఈ నేపథ్యంలోనే భయంతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతుందన్నారు. చదవండి: ఏపీలో సీబీఐకి నో ఎంట్రీ -
కోర్టు ప్రాంగణంలోనే మహిళా న్యాయవాదిపై..
సాక్షి, న్యూఢిల్లీ : కోర్టు ప్రాంగణంలోని తన గదిలోనే మహిళా న్యాయవాదిపై సీనియర్ న్యాయవాది లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది. దక్షిణ ఢిల్లీకి చెందిన సాకేత్ కోర్టులోని తన చాంబర్లో శనివారం రాత్రి సీనియర్ న్యాయవాది అదే కోర్టులో మహిళా న్యాయవాదిపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారని డీసీపీ రొమిల్ బనియా తెలిపారు. లైంగిక దాడి జరిగిందనే ఆరోపణలు వచ్చిన న్యాయవాది చాంబర్‌ను సీల్ చేశామని, ఫోరెన్సిక్ లేబొరేటరీ, క్రైమ్ టీమ్ దాన్ని పరిశీలించారని చెప్పారు. బాధితురాలి స్టేట్మెంట్ను నమోదు చేసుకుని ఆమెను వైద్యపరీక్షలకు తరలించామని తెలిపారు. బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి సాకేత్ కోర్టులో హాజరుపర్చామని పేర్కొన్నారు. -
సీనియర్ న్యాయవాది పీపీ రావు కన్నుమూత
► గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస ► బాబ్రీ మసీదు సహా పలు కేసుల్లో తనదైన ముద్ర వేసిన పీపీ రావు ► 1991లో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక ► 2006లో పద్మభూషణ్ అవార్డు ప్రదానం చేసిన కేంద్రం ► స్వస్థలం ప్రకాశం జిల్లా మొగిలిచర్ల.. నేడు ఢిల్లీలో అంత్యక్రియలు సాక్షి,న్యూఢిల్లీ/అమరావతి/కందుకూరు: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత పావని పరమేశ్వర రావు(84) గుండెపోటుతో కన్నుమూశారు. ఢిల్లీలోని ఇండియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచర్లకు చెందిన పీపీ రావు ప్రాథమిక విద్యాభ్యాసం కనిగిరిలో సాగింది. నెల్లూరులోని వీఆర్ కళాశాలలో ఇంటర్‌తో పాటు బీఏ చదివారు. అనంతరం హైదరాబాద్‌లోని ఉస్మానియా వర్సిటీలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. విద్యాభాసం పూర్తయిన తర్వాత 1961 నుంచి కొంతకాలంపాటు ఢిల్లీ యూని వర్సిటీలో న్యాయ విద్యను బోధించారు. 1967లో న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టిన పీపీ రావు.. సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయ వాదిగా పేరు గడించారు. బాబ్రీ మసీదు కూల్చివేతతో పాటు పలు చారిత్రాత్మకమైన కేసులను ఆయన వాదించారు. బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడాన్ని ప్రముఖ న్యాయవాదులు రాంజెఠ్మలానీ, శాంతిభూషణ్ సవాల్ చేయగా.. పీపీ రావు వారి వాదనలను సమర్థంగా తిప్పికొట్టారు. 1991లో ఆయన సుప్రీంకోర్టు బార్ అసోసి యేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తదనంతర కాలంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2006లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. 2014లో లోక్‌పాల్ సెలక్షన్ కమిటీలో సభ్యునిగా నియమితులయ్యారు. కాగా, నాలుగు నెలల కిందట గుండెపోటు రావడంతో వైద్యుల సలహా మేరకు ఢిల్లీలోని తన నివాసంలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. బుధవారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆయన్ని వెంటనే సమీపంలోని ఇండియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్కి తరలించగా.. చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఆయన అంత్యక్రియలను గురువారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని లోధీ శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు ఆయన కోడలు, సీనియర్ న్యాయవాది మహాలక్ష్మి పావని తెలిపారు. కాగా, పీపీ రావు మృతిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గౌరవ్ భాటియా బుధవారం వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. జగన్ సంతాపం సీనియర్ న్యాయవాది పావని పరమేశ్వర రావు మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. పీపీ రావు న్యాయవాదిగా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని, ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియా డారు. పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలు, వివిధ కమిటీల ద్వారా ఆయన నిర్వహించిన పాత్ర ఎనలేనిదన్నారు. పీపీ రావు కుటుంబ సభ్యులకు జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
ఉదయ్ కిరణ్ మృతిపై మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు