
సాక్షి, న్యూఢిల్లీ : కోర్టు ప్రాంగణంలోని తన గదిలోనే మహిళా న్యాయవాదిపై సీనియర్ న్యాయవాది లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది. దక్షిణ ఢిల్లీకి చెందిన సాకేత్ కోర్టులోని తన చాంబర్‌లో శనివారం రాత్రి సీనియర్ న్యాయవాది అదే కోర్టులో మహిళా న్యాయవాదిపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారని డీసీపీ రొమిల్ బనియా తెలిపారు.
లైంగిక దాడి జరిగిందనే ఆరోపణలు వచ్చిన న్యాయవాది చాంబర్‌ను సీల్ చేశామని, ఫోరెన్సిక్ లేబొరేటరీ, క్రైమ్ టీమ్ దాన్ని పరిశీలించారని చెప్పారు. బాధితురాలి స్టేట్‌మెంట్‌ను నమోదు చేసుకుని ఆమెను వైద్యపరీక్షలకు తరలించామని తెలిపారు. బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి సాకేత్ కోర్టులో హాజరుపర్చామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment