సాక్షి, మంచిర్యాల: బెల్లంపల్లి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అరిజిన్డెయిరీ నిర్వాహకుల మధ్య తలెత్తిన వివాదం దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు అరిజిన్ డెయిరీ భాగస్వామి తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే వల్ల ప్రాణ హానీ ఉందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
చిన్నయ్యపై చట్టరీత్యా చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ డెయిరీ సీఈవో ఆదినారాయణ, సీఏవో శేజల్ ఆదివారం ఢిల్లీలోని కొత్త పార్లమెంట్ భవనం వద్ద ఆందోళన చేశారు. దుర్గం చిన్నయ్య వల్ల తమ కంపెనీలో ఉన్న వాళ్లంతా రోడ్డున పడ్డారని బాధితురాలు శేజల్ ఆరోపించారు. ఎమ్మెల్యే తమను లైంగికంగా వేధిస్తున్నారని.. న్యాయం జరిగేంత వరకు పోరాడతామని పేర్కొన్నారు. ఇప్పటికే తమపై తప్పుడు కేసులు పెట్టారని.. బెయిల్‌పై బయటకు వచ్చినా.. బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ అడిగానని.. ఎందుకో ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. కాగా, ఎమ్మెల్యేకు, అరిజిన్ డెయిరీ పాల సంస్థ ప్రతినిధులకు మధ్య గతంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. లైంగిక వేధింపులతో పాటు ఎమ్మెల్యే తమపై అక్రమ కేసులు బనాయించారని సదరు యువతి ఆరోపించారు.
చదవండి: జూబ్లీహిల్స్ పబ్‌లో పాములు, తొండలు.. కస్టమర్లను ఆకర్షించేందుకు
Comments
Please login to add a commentAdd a comment