Durgam Chinnaiah
-
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు
సాక్షి, మంచిర్యాల: బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో బెల్లంపల్లిలోని నెన్నెల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటు వేసేందుకు బీఆర్ఎస్ కండువాతో ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రానికి వచ్చారు. నెన్నెల మండలం జెండా వెంకటపూర్‌లో ఎమ్మెల్యే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే దుర్గం చిన్నయ్య గులాబీ కండువాతో పోలింగ్ కేంద్రానికి వచ్చినా ఎన్నికల సిబ్బంది అడ్డుచెప్పకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రిసైడింగ్ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
కామపిశాచికి ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తారు?: శేజల్ సంచలన ఆరోపణలు
సాక్షి, మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్‌ను మరోసారి దుర్గం చిన్నయ్యకు కేటాయించడంపై శేజల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కామా పిశాచికి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కామ పిశాచి, చీటర్‌కు లైసెన్స్ ఇచ్చి నీకు అడ్డులేదు రెచ్చిపో, ఇష్టమొచ్చిన అమ్మాయిని వేధించు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిందని మండిపడ్డారు. కాగా బీఆర్ఎస్ పార్టీ సోమవారం విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో దుర్గం చిన్నయ్య పేరు ఉండడంపై బాధితురాలు శేజల్ తీవ్రంగా స్పందించారు. .తాను ఏడు నెలలుగా పోరాటం చేస్తున్నా పోలీసులు, ప్రభుత్వం పట్టించుకోవలేదని వాపోయారు. దుర్గం చిన్నయ్య భవిష్యత్తులో మహిళలను వేధించకుండా ఉంటారని గ్యారంటీ ఎంటని ప్రశ్నించారు. ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఎమ్మెల్యే అరాచకాలకు బలికావాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు దోచుకోవాలని, అమ్మాయిలను వేధించాలని దుర్గం చిన్నయ్యకు టికెట్ ఇచ్చారంటూ శేజల్ మండిపడ్డారు. దీనిపై బీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదే విధంగా దుర్గం చిన్నయ్య చేసిన తప్పులపై న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే చేసిన లైంగిక వేధింపులు, అక్రమాలు, భూకబ్జాలపై బెల్లంపల్లిలో గడపగడపకు వెళ్లి ప్రచారం చేస్తానని.. దుర్గం చిన్నయ్య ఎలా గెలుస్తాడో చూస్తానని సవాల్ విసిరారు. చదవండి: సీఎం కేసీఆర్ మమ్మల్ని అవసరానికి వాడుకున్నారు: కూనంనేని -
BRS List: వివాదాలున్నా... వాళ్లకే టికెట్లు
సాక్షి, హైదరాబాద్: విజయంపై పూర్తి ధీమాతో ఉన్నామని, అందుకే ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులకు ప్రకటిస్తున్నామని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. అలాగే తమది క్రమశిక్షణ ఉన్న పార్టీ అని, పూర్తి స్థాయి వడపోత తర్వాత అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారాయన. అందుకే కేవలం.. ఏడు మార్పులు మాత్రమే చేసినట్లు హైలెట్ చేశారు. అయితే.. చెన్నమనేని లాంటి ఉత్తముడికి పౌరసత్వ వివాదం కారణంగా సీటు కేటాయించలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసిన కేసీఆర్.. వివాదాలతో వార్తల్లోకి ఎక్కిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యకు మాత్రం గట్టి షాకే ఇచ్చారు. ఒకవైపు మహిళా సర్పంచ్ ఆరోపణలు, మరోవైపు కడియంతో పొసగక పోవడం.. చివరకు పిలిపించుకుని అధిష్టానం మందలించినా ఆయన వైఖరిలో మార్పు రాలేదని బీఆర్ఎస్ అధిష్టానం భావించింది. దీంతో.. ఆయన స్థానంలో అంతే దూకుడుగా ప్రతివిమర్శలతో విరుచుకుపడుతున్న కడియం శ్రీహరికి అవకాశం ఇచ్చింది. అయితే.. ఏకంగా లైంగిక ఆరోపణలతో వార్తల్లో నిలిచారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. శేజల్ అనే బాధితురాలు వరుసగా చిన్నయ్యపై ఆరోపణలు చేయడం, ఏకంగా ఆత్మహత్యకు యత్నించడం, ఢిల్లీకి చేరి చిన్నయ్యపై వేటు వేయాలంటూ బీఆర్ఎస్ అధినేతకు సైతం విజ్ఞప్తి చేస్తూ రకరకాల రూపాల్లో నిరసనలు కొనసాగించింది. అయినా కూడా దుర్గయ్యకే మరో అవకాశం ఇచ్చారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా విషయంలోనూ అలాగే జరిగింది. పాల్వంచకు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య కేసులో.. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్ర రావు ఏకంగా అరెస్ట్ అయ్యాడు. ఈ వివాదం ఆధారంగా ప్రతిపక్షాలు ఎమ్మెల్యేపై పలు ఆరోపణలతో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి కూడా. మరోవైపు తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు ఏకంగా హైకోర్టు ఆయన ఎమ్మెల్యే ఎన్నికపై అనర్హత వేటు వేయడం సంచలనం సృష్టించింది కూడా. అయినప్పటికీ బీఆర్ఎస్ అధిష్టానం వనమాకే మళ్లీ టికెట్ కేటాయించడం గమనార్హం. వీళ్లతో పాటు చిన్న చిన్న వివాదల్లో నిలిచిన మరికొందరికి.. పెద్ద కంప్లయింట్లాగా పరిగణించకుండానే అసెంబ్లీ టికెట్ తిరిగి కేటాయించడం గమనార్హం. మరోవైపు జనగాంలో కిరికిరి జరుగుతున్న నేపథ్యంలో ఆ టికెట్‌ను జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఇవ్వకుండా.. పెండింగ్‌లో ఉంచినట్లు బీఆర్ఎస్ అధినేత స్పష్టం చేశారు. ముత్తిరెడ్డి చుట్టూ వివాదాలున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: కల్వకుంట్ల కవితకు టికెట్ అందుకే ఇవ్వలేదా? బీఆర్ఎస్ అభ్యర్థుల పూర్తి జాబితా.. 1. శ్రీ. కోనేరు కోనప్ప, సిర్పూర్ 2. శ్రీ బాల్క సుమన్, చెన్నూర్ (SC) 3. శ్రీ దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి (SC) 4. శ్రీ నడిపెల్లి దివాకర్ రావు, మంచిర్యాల 5. శ్రీమతి కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ (ఎస్టీ) 6. శ్రీ భూక్య జాన్సన్ రాథోడ్ నాయక్, ఖానాపూర్ (ST) 7. శ్రీ జోగు రామన్న, ఆదిలాబాద్ 8. శ్రీ అనిల్ జాదవ్, బోత్ (ST) 9. శ్రీ. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ 10. శ్రీ గడ్డిగారి విట్టల్ రెడ్డి, ముధోలే 11. శ్రీ ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఆర్మూర్ 12. శ్రీ మహమ్మద్ షకీల్ అమీర్, బోధన్ 13. శ్రీ హన్మంత్ షిండే, జుక్కల్ (SC) 14. శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ 15. శ్రీ జాజాల సురేందర్, ఎల్లారెడ్డి 16. శ్రీ కె. చంద్రశేఖర్ రావు (కెసిఆర్), కామారెడ్డి 17. శ్రీ బిగాల గణేష్ గుప్తా, నిజామాబాద్ అర్బన్ 18. శ్రీ గోవర్ధన్ బాజిరెడ్డి, నిజామాబాద్ రూరల్ 19. శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్కొండ 20. శ్రీ డా. సంజయ్ కల్వకుంట్ల, కోరుట్ల 21. శ్రీ డా. ఎం. సంజయ్ కుమార్, జగిత్యాల 22. శ్రీ కొప్పుల ఈశ్వర్, ధర్మపురి (SC) 23. శ్రీ కోరుకంటి చందర్, రామగుండం 24. శ్రీ పుట్ట మధు, మంథని 25. శ్రీ దాసరి మనోహర్ రెడ్డి, పెద్దపల్లి 26. శ్రీ గంగుల కమలాకర్, కరీంనగర్ 27. శ్రీ సుంకే రవిశంకర్, చొప్పదండి (SC) 28. శ్రీ చల్మెడ లక్ష్మీ నరసింహారావు, వేములవాడ 29. శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), సిరిసిల్ల 30. శ్రీ ఎరుపుల బాలకిషన్ (రసమయి), మానకొండూర్ (SC) 31. శ్రీ పాడి కౌశిక్ రెడ్డి, హుజూరాబాద్ 32. శ్రీ వొడితెల సతీష్ కుమార్, హుస్నాబాద్ 33. శ్రీ తన్నీరు హరీష్ రావు, సిద్దిపేట 34. శ్రీమతి ఎం. పద్మా దేవేందర్ రెడ్డి, మెదక్ 35. శ్రీ మహారెడ్డి భూపాల్ రెడ్డి, నారాయణఖేడ్ 36. శ్రీ చంటి క్రాంతి కిరణ్, ఆందోల్ (SC) 37. -------------------- నర్సాపూర్ (పెండింగ్) 38. శ్రీ కొణింటి మాణిక్ రావు, జహీరాబాద్ (SC) 39. శ్రీ చింతా ప్రభాకర్, సంగారెడ్డి 40. శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్చెరు 41. శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక 42. శ్రీ కె. చంద్రశేఖర్ రావు (కెసిఆర్), గజ్వేల్ 43. శ్రీ చామకూర మల్లా రెడ్డి, మేడ్చల్ 44. శ్రీ మైనంపల్లి హనుమంత రావు, మల్కాజిగిరి 45. శ్రీ కూన పాండు వివేకానంద్, కుత్బుల్లాపూర్ 46. శ్రీ మాధవరం కృష్ణారావు, కూకట్పల్లి 47. శ్రీ బండారు లక్ష్మా రెడ్డి, ఉప్పల్ 48. శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం 49. శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎల్.బి.నగర్ 50. శ్రీ పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, మహేశ్వరం 51. శ్రీ తొలకంటి ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్ 52. శ్రీ అరెకపూడి గాంధీ, శేరిలింగంపల్లి 53. శ్రీ కాలె యాదయ్య, చేవెళ్ల (SC) 54. శ్రీ కొప్పుల మహేష్ రెడ్డి, పరిగి 55. శ్రీ డా. మెతుకు ఆనంద్, వికారాబాద్ (SC) 56. శ్రీ పైలట్ రోహిత్ రెడ్డి, తాండూరు 57. శ్రీ ముటా గోపాల్, ముషీరాబాద్ 58. శ్రీ తీగల అజిత్ రెడ్డి, మలక్ పేట 59. శ్రీ కాలేరు వెంకటేష్, అంబర్పేట్ 60. శ్రీ దానం నాగేందర్, ఖైరతాబాద్ 61. శ్రీ మాగంటి గోపీనాథ్, జూబ్లీ హిల్స్ 62. శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్‌నగర్ 63. -------------నాంపల్లి (పెండింగ్) 64. శ్రీ ఐందాల కృష్ణయ్య, కార్వాన్ 65. ---------------- గోషామహల్(పెండింగ్) 66. శ్రీ ఇబ్రహీం లోడి, చార్మినార్ 67. శ్రీ ఎం. సీతారాం రెడ్డి, చాంద్రాయణగుట్ట 68. శ్రీ సామ సుందర్ రెడ్డి, యాకుత్‌పురా 69. శ్రీ అలీ బక్రి, బహదూర్‌పురా 70. శ్రీ టి పద్మారావు, సికింద్రాబాద్ 71. జి. లాస్య నందిత, సికింద్రాబాద్ కాంట్ (SC) 72. శ్రీ పట్నం నరేందర్ రెడ్డి, కొడంగల్ 73. శ్రీ ఎస్. రాజేందర్ రెడ్డి, నారాయణపేట 74. శ్రీ శ్రీనివాస్ గౌడ్ వీరసనోళ్ల, మహబూబ్ నగర్ 75. శ్రీ చర్లకోల లక్ష్మ ర్‌రెడ్డి, జడ్చర్ల 76. శ్రీ ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, దేవరకద్ర 77. శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మక్తల్ 78. శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వనపర్తి 79. శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల్ 80. శ్రీ వి.ఎం. అబ్రహం, అలంపూర్ (SC) 81. శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి, నాగర్ కర్నూల్ 82. శ్రీ గువ్వల బాలరాజు, అచ్చంపేట (SC) 83. శ్రీ గుర్కా జైపాల్ యాదవ్, కల్వకుర్తి 84. శ్రీ అంజయ్య యెలగానమోని, షాద్‌నగర్ 85. శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి, కొల్లాపూర్ 86. శ్రీ రవీంద్ర కుమార్ రమావత్, దేవరకొండ (ఎస్టీ) 87. శ్రీ నోముల భగత్, నాగార్జున సాగర్ 88. శ్రీ నల్లమోతు భాస్కర్ రావు, మిర్యాలగూడ 89. శ్రీ శానంపూడి సైదిరెడ్డి, హుజూర్నగర్ 90. శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్, కోదాడ 91. శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి, సూర్యాపేట 92. శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి, నల్గొండ 93. శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మునుగోడు 94. శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి, భోంగిరి 95. శ్రీ చిరుమర్తి లింగయ్య, నక్రేకల్ (SC) 96. శ్రీ గాదరి కిషోర్ కుమార్, తుంగతుర్తి (SC) 97. శ్రీమతి గొంగిడి సునీత, అలైర్ 98. ------------- జనగాం(పెండింగ్) 99. శ్రీ కడియం శ్రీహరి, ఘన్పూర్ స్టేషన్ (SC) 100. శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, పాలకుర్తి 101. శ్రీ D.S. రెడ్యా నాయక్, డోర్నకల్ 102. శ్రీ బానోత్ శంకర్ నాయక్, మహబూబాబాద్ (ST) 103. శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి, నర్సంపేట 104. శ్రీ చల్లా ధర్మారెడ్డి, పర్కల్ 105. శ్రీ దాస్యం వినయ భాస్కర్, వరంగల్ వెస్ట్ 106. శ్రీ నన్నపునేని నరేందర్, వరంగల్ తూర్పు 107. శ్రీ అరూరి రమేష్, వర్ధన్నపేట (SC) 108. శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి, భూపాలపల్లి 109. శ్రీమతి బడే నాగజ్యోతి, ములుగు (ఎస్టీ) 110. శ్రీ రేగా కాంత రావు, పినపాక (ఎస్టీ) 111. శ్రీమతి బానోత్ హరిప్రియ నాయక్, యెల్లందు (ఎస్టీ) 112. శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం 113. శ్రీ కందాల ఉపేందర్ రెడ్డి, పాలేరు 114. శ్రీ లింగాల కమల్ రాజు, మధిర (SC) 115. శ్రీ బానోత్ మదన్‌లాల్, వైరా (ST) 116. శ్రీ సండ్ర వెంకట వీరయ్య, సత్తుపల్లి (SC) 117. శ్రీ వనమా వెంకటేశ్వరరావు, కొత్తగూడెం 118. శ్రీ మెచ్చా నాగేశ్వర్ రావు, అశ్వారావుపేట (ఎస్టీ) 119. శ్రీ డా. తెల్లం వెంకట్ రావు, భద్రాచలం (ఎస్టీ) -
‘బీఆర్ఎస్కు మణిపూర్ ఘటనే కనిపిస్తోందా?’
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీద లైంగిక ఆరోపణలు చేస్తున్న శేజల్ మరోసారి ఢిల్లీలో హల్ చల్ చేసింది. తనకు న్యాయం చేయాలంటూ శుక్రవారం ఏకంగా పార్లమెంట్ ఎదుటే నిరసనకు దిగిందామె. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధించారని, మోసం చేసారని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆరిజన్ డైరీ ప్రతినిధి శేజల్ ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్, సీబీఐకి సైతం చిన్నయ్యపై ఫిర్యాదు చేసిందామె. అయినా స్పందన కొరవడడంతో తెలంగాణ భవన్ వద్ద ఆత్మహత్యయత్నానికి కూడా యత్నించింది. ఇక కేటీఆర్ ,బీఆర్ఎస్ ఎంపీల దృష్టికి తన సమస్యను తీసుకెళ్లినప్పటికీ లాభం లేకుండా పోయిందని వాపోతుందామె. ‘‘పేరుకు మాత్రమే చట్టాలు..ఆడపిల్లకి న్యాయం చేయలేని చట్టాలు ఎందుకు?. మణిపూర్ లో మహిళలపై జరిగిన ఘటన చాలా బాధాకరం. కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సొంత రాష్ట్రంలో మహిళ పై జరిగిన విషయం మీద స్పందించే సమయం దొరకడం లేదు. అదే పక్క రాష్ట్రాలలో జరిగిన ఘటనలు మీద మాత్రం క్షణాల్లో స్పందించి రాజకీయాలు చేసుకోవడం పరిపాటిగా మారింది’’ అని ఘాటుగా వ్యాఖ్యానించిందామె. మహిళల లైంగిక వేధింపులకు సంబంధించి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీద FIR ఇవ్వమని పోలీస్ స్టేషన్‌కి వెళ్తే.. ఇవ్వకపోగా తిరిగి తన మీదే తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆరోపిస్తోందామె. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అయిన స్పందించి ఎమ్మేల్యే దుర్గం చిన్నయ్యను పార్టీ నుండి సస్పెండ్ చేసి తక్షణమే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని.. చిన్నయ్య మీద కేసు నమోదు చేసే వరకు తన పోరాటం ఆగదని చెబుతోంది శేజల్. -
ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వమని చెప్పారు.. కథ మారలేదు.. శేజల్ మరో వీడియో
-
ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వమని చెప్పారు.. కథ మారలేదు.. శేజల్ మరో వీడియో
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలిగా చెప్పుకుంటున్న మంచిర్యాల ఆరిజిన్ పాల కంపెనీ ప్రతినిది శేజల్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎమ్మెల్యే చెంచాలు తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆమె బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై మంళవారం మరో వీడియో విడుదల చేశారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని వాపోయారు. పైగా పోలీసులకు ఫిర్యాదు అనంతరం వేదింపులు మరింతగా పెరిగాయన్నారు. బీఆర్ఎస్ నేతలు కూడా న్యాయం చేస్తామని మాట ఇచ్చి ఆ విషయమే మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో బిఅర్ఎస్ పెద్దలు తనతో చర్చలు జరిపినప్పుడు చర్యలు తీసుకుంటామని చెప్పినట్టు ఆమె వెల్లడించారు. ఈసారి టిక్కెట్ ఇవ్వడం లేదని బిఅర్ఎస్ నాయకులు స్పష్టంగా చెప్పారని శేజల్ గుర్తు చేశారు. (తాజ్‌మహల్ చూసేందుకు వచ్చిన టూరిస్ట్‌ను వెంబడించి.. ఇనుపరాడ్లతో దాడి) తనపై, అదేవిధంగా ఈ ప్రాంతంలో చాలా మందిపై ఎమ్మెల్యే చిన్నయ్య లైంగిక వేదింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. అలాంటి కామపిశాచికి ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని ఆమె వ్యాఖ్యానించారు. తనకు న్యాయం జరిగేంతవరకు ఈ పోరాటం ఆపేది లేదని శేజల్ హెచ్చరించారు. (వ్యభిచారం గుట్టు రట్టు.. యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని) -
Hyderabad: ఎమ్మెల్యే చిన్నయ్య బాధితురాలు శేజల్ హెల్త్ అప్డేట్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్ మరోసారి ఆత్మహత్యాయత్నం చేశారు. మాదాపూర్‌లో శేజల్ నిద్రమాత్రలు మింగి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. మాదాపూర్ పేస్ ఆసుపత్రిలో శేజల్ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు, ప్రాణాలకు ఏం ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఆమెకు ఎమర్జెన్సీ బ్లాక్‌లో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే శేజల్ ఆయుర్వేదిక్‌కు సంబంధించిన నిద్రమాత్రలు వేసుకున్నట్లు వైద్యులు వెల్లడించారు. మరోవైపు ఆమెకు మద్దతుగా పలువురు నేతలు హాస్పిటల్ వద్దకు చేరుకుంటున్నారు. సూసైడ్ లెటర్ స్వాధీనం శేజల్ బ్యాగ్‌లో నిద్రమాత్రలు, సూసైడ్ లెటర్‌ను గుర్తించారు. ఇందులో బాధితురాలు పలు విషయాలను ప్రస్తావించారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై గతంలో లైంగిక ఆరోపణలు చేసిన శేజల్.. తనకు న్యాయం జరగడం లేదంటూ సూసైడ్ లెటర్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలుగా ఎమ్మెల్యేపై న్యాయ పోరాటం చేస్తున్నానని, ప్రభుత్వ పెద్దలు న్యాయం చేస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం లేదని అన్నారు. ప్రభుత్వం ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతోందని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నానని ఆమె వాపోయారు. మధ్యాహ్నం 1.30 గంటలకు శేజల్‌ను పెద్దమ్మ టెంపుల్ దగ్గర వదిలి వెళ్లగా.. టెంపుల్ నుంచి కనిపించకుండా పోయారు. ఆ తరువాత మాదాపూర్‌లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. కాగా, కొన్ని రోజు క్రితం కూడా శేజల్ ఢిల్లీలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే చిన్నయ్యపై ఆమె జాతీయ మహిళా కమిషన్, సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసినా తెలంగాణ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో, జాతీయ మహిళా కమిషన్ స్పందిస్తూ తెలంగాణ డీజీపీకి లేఖ రాసింది. ఈ క్రమంలో శేజల్ ఫిర్యాదుపై విచారణ జరపాలని డీజీపీ ఆదేశించారు. చదవండి: హైదరాబాద్‌లో మరో భారీ ఐటీ కుంభకోణం -
శేజల్‌తో బీఆర్ఎస్ నేతల చర్చలు.. ఎమ్మెల్యే చిన్నయ్యకు షాక్!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగికంగా వేధించారని శేజల్ అనే యువతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాగా, తమపై కేసులు పెట్టించారని గత రెండు నెలలు నుంచి పలు రకాలుగా ఆందోళన చేస్తున్న ఆరిజన్ నిర్వాహకురాలు శేజల్‌తో బీఆర్ఎస్ ఎంపీలు శుక్రవారం చర్చలు జరిపారు. బీఆర్ఎస్ ఎంపీలు రంజిత్‌రెడ్డి, వెంకటేశ్ నేత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్‌లు శేజల్, ఆదినారాయణలతో సుదీర్ఘంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో ప్రభుత్వ భూమి కొనుగోలు చేసిన డబ్బులు వాపస్, తమపై ఉన్న కేసుల ఎత్తివేత, ఎమ్మెల్యే చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. ఇందుకు తప్పు చేసిన వారిపై పార్టీలో క్రమశిక్షణ చర్యలుంటాయని, అలాగే ఆమెకు న్యాయం చేస్తామని నాయకులు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇది కూడా చదవండి: దుర్గం చిన్నయ్యకు షాక్! -
సీఎం కేసీఆర్‌కు శేజల్ సూటి ప్రశ్న
సాక్షి, ఢిల్లీ: లైంగికంగా, మానసికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను వేధిస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కోరుతూ శేజల్ అనే యువతి చేస్తున్న న్యాయ పోరాటం వంద రోజులకు చేరింది. ఈ తరుణంలో హస్తినలోని బీఆర్ఎస్ కార్యాలయం ఎదుట ఆమె నిరసన దీక్ష చేపట్టింది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ బీఆర్ఎస్ ఆఫీస్ ఎదుట శేజల్ గురువారం దీక్ష చేపట్టంది. పార్టీ మీద.. పదవుల మీద ఉన్న వ్యామోహంతో ఆడపిల్లకి జరిగిన అన్యాయం గురించి కనీసం పట్టించుకోకుండా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నా విన్నపం. ఆడపిల్లల వైపు అసభ్యంగా చూస్తే గుడ్లు పీకుతా అన్నారు కదా. మరి మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నన్ను లైంగికంగా , మానసికంగా వేధిస్తున్నారు. ఈ విషయంపై గత 100 రోజులుగా నేను చేస్తున్న న్యాయ పోరాటం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమునకు కనబడడం లేదా?. నా బాధ మీకు వినబడుట లేదా? అంటూ కేసీఆర్‌ను నిలదీసింది శేజల్. రాష్ట్రంలో నాకు న్యాయం జరగడం లేదు అని నేను ఢిల్లీ వచ్చి గత 25 రోజులు గా నిరసన తెలియజేస్తున్నా. పక్కలోకి వెళ్లకపోతే వ్యాపారం చేసుకొనివ్వరు మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య!. మాకు తెలంగాణలో స్వేచ్ఛ హక్కు లేదా? మేము తెలంగాణలో వ్యాపారం చేయకూడదా? అని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించిందామె. అంతేకాదు.. ఆడపిల్ల అని కూడా ఆలోచించకుండా వేధించి, తప్పుడు కేసులు పెట్టించి.. రిమాండ్‌కి పంపి తన జీవితం ఎందుకు సర్వ నాశనం చేశారంటూ నిలదీశారామె. ఇప్పటికైనా బాధ్యత తీసుకుని.. చిన్నయ్యను పార్టీ నుండి సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాలని, తనకు న్యాయం చేయకపోతే గనుక ఇదే ఆఫీస్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించిందామె. ఇదిలా ఉంటే.. ఇవాళ కేసీఆర్ మహారాష్ట్ర నాగపూర్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే శేజల్ ఢిల్లీ కార్యాలయం వద్ద కళ్లకు గంతలు, మూతికి మాస్క్‌తో నిరసనకు దిగడం గమనార్హం. ఇదీ చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం! -
@100 రోజులు.. బీఆర్ఎస్ ఢిల్లీ ఆఫీస్ ఎదుట శెజల్ న్యాయ పోరాటం
-
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సీబీఐకి ఫిర్యాదు చేసిన శేజల్
-
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సీబీఐకి ఫిర్యాదు చేసిన శేజల్
ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసిన శేజల్ అనే యువతి.. ఈసారి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని ఆశ్రయించింది. దుర్గం చిన్నయ్యపై ఫిర్యాదు చేసినా తెలంగాణ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఇప్పటికైనా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు చేయాలని సీబీఐని కోరింది. ఇటీవల దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధించాడంలూ జాతీయ మహిళా కమిషన్‌కు సైతం శేజల్ ఫిర్యాదు చేసింది. అయితే రోజుల వ్యవధిలోనే సీబీఐని ఆశ్రయించిన ఆమె.. తెలంగాణ పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోవట్లేదని తెలిపింది. ఇటీవల జాతీయ మహిళా కమిషన్‌కు సైతం ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో, జాతీయ మహిళా కమిషన్ స్పందిస్తూ తెలంగాణ డీజీపీకి లేఖ రాసింది. ఈ క్రమంలో శేజల్ ఫిర్యాదుపై విచారణ జరపాలని ఆదేశించింది. లైంగిక ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేఖలో ఆదేశించింది. ఇక, 15 రోజుల్లో దీనిపై అప్డేట్ ఇవ్వాలని కమిషన్ లేఖలో పేర్కొంది. కాగా, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని శేజల్ అనే యువతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యే వేధింపులకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఇప్పటికే పేర్కొంది. అందుకు సంబంధించిన ఓ వీడియో, ఫొటోను శేజల్ విడుదల చేసింది. దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు.. వీడియో, ఫొటో రిలీజ్ చేసిన శేజల్ దుర్గం చిన్నయ్యకు షాక్!.. డీజీపీకి మహిళా కమిషన్ లేఖ -
శేజల్ ఫిర్యాదుపై విచారణ జరపాలని టీఎస్ డీజీపీకి లేఖ రాసిన కమిషన్
-
దుర్గం చిన్నయ్యకు షాక్!.. డీజీపీకి మహిళా కమిషన్ లేఖ
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై శేజల్ అనే యువతి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా శేజల్ ఫిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ క్రమంలో కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా, అంతకుముందు బాధితురాలు శేజల్ వేధింపుల అంశంపై బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో, జాతీయ మహిళా కమిషన్ స్పందిస్తూ తెలంగాణ డీజీపీకి లేఖ రాసింది. ఈ క్రమంలో శేజల్ ఫిర్యాదుపై విచారణ జరపాలని ఆదేశించింది. లైంగిక ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేఖలో ఆదేశించింది. ఇక, 15 రోజుల్లో దీనిపై అప్డేట్ ఇవ్వాలని కమిషన్ లేఖలో పేర్కొంది. ఇది కూడా చదవండి: దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు.. వీడియో, ఫొటో రిలీజ్ చేసిన శేజల్ -
దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు.. వీడియో, ఫొటో రిలీజ్ చేసిన శేజల్
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని శేజల్ అనే యువతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యే వేధింపులకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఇప్పటికే పేర్కొంది. తాజాగా అందుకు సంబంధించిన ఓ వీడియో, ఫొటోను శేజల్ విడుదల చేసింది. ఇక, ఈ వీడియోలో భాగంగా తాను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో ఉన్నట్టు తెలిపింది. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో(రూమ్ నెంబర్ 404) తనను మందు తాగమని ఎమ్మెల్యే వేధింపులకు గురిచేసినట్టు ఆవేదన వ్యక్తం చేసింది. బిజినెస్ మీటింగ్‌లో ఇలా మందు పార్టీ ఎందుకు పెట్టారు. బిజినెస్ మీటింగ్ అన్నప్పుడు దాని గురించే మాట్లాడాలి. మందు తాగుతూ నన్ను ఎందుకు వేధింపులకు గురిచేశారు. అది ఎమ్మెల్యే రూమ్ కాదని ఆయన మద్దతుదారులు అంటారు. కానీ, ఈ వీడియోలో ఎమ్మెల్యే తన భార్యతో కలిసి ఉన్న ఫొటో ఉంటుంది చూడండి అని అన్నారు. ఈ సందర్భంగా తమ వద్ద ఇంకా ఆధారాలు ఉన్నాయని శేజల్ చెప్పుకొచ్చింది. తాము అనవసరంగా ఆరోపణలు చేయడంలేదని స్పష్టం చేసింది. తమ వద్ద ఉన్న ఆధారాలను పోలీసులు డిలీజ్ చేశారని తెలిపింది బాధితురాలు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే వేధింపులకు గురి చేస్తుంటే నేనెలా వీడియోలు, ఫొటోలు తీయాలని ప్రశ్నించారు. అయితే, తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వెల్లడించింది. అప్పటి వరకు ఢిల్లీలోనే ఉంటామని పేర్కొంది. ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే చిన్నయ్యపై సంచలన ఆరోపణలు.. పనులు కావాలంటే అమ్మాయిలను పంపాల్సిందే.. -
దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు.. వీడియో, ఫొటో రిలీజ్ చేసిన శేజల్
-
ఎమ్మెల్యే చిన్నయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. చాటింగ్ చూడండి!
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని శేజల్ అనే యువతి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాలని కొద్ది రోజుల కిత్రం తెలంగాణ భవన్ ఎదుట ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. ఈ నేపథ్యంలో సదరు యువతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, శేజల్ సోమవారం మాట్లాడుతూ.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మూడు నెలలుగా లైంగికంగా వేధిస్తున్నారు. ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలి. నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి అయినా ఎవరూ కేసు తీసుకోవడం లేదు. ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎమ్మెల్యే అనుచరులు వేధింపులకు పాల్పడుతున్నారు. పనులు చేయించుకోవాలంటే అమ్మాయిలను పంపాలంటూ దుర్గం చిన్నయ్య డిమాండ్ చేసేవారు అని సంచలన కామెంట్స్ చేశారు. ఎంతపోరాటం చేసినా న్యాయం జరగకపోవడంతోనే ఆత్మహత్యయత్నం చేశా. వాళ్లే చేస్తున్న ప్రచారం చూస్తుంటే చనిపోయాక కూడా న్యాయం జరగదని అనిపిస్తోంది. ఎమ్మెల్యే చేసిన చాటింగ్‌ను బయటపెడితే అది ఆయన నంబర్ కాదని చెప్పారు. కానీ, అదే నంబర్ వాడుతున్నారు. మా వెనుక ఏ పార్టీవాళ్లూ లేరు. మేము ఎవరినీ మోసం చేయలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: ఖమ్మంలో మెడికో ఆత్మహత్య.. కారణం అదేనా? -
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు ఆత్మహత్యాయత్నం
న్యూఢిల్లీ: బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆరిజన్ పాల సంస్థ భాగస్వామి శైలజ విషం తాగారు. వెంటనే ఆమెను ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు సుసైడ్ లెటర్ రాశారు. అందులో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను వేధిస్తున్నారని ఆరోపించారు. ఆయన అనుచరులు భీమా గౌడ్, సంతోష్, పోచన్న, కార్తీక్ మానసికంగా హింసిస్తున్నారని తెలిపారు. ‘ఎమ్మెల్యే చిన్నయ్య నన్ను చంపుతానని అనుచరులతో బెదిరిస్తున్నారు. ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న నా ఫోటోలను సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేశారు. అసభ్యకరంగా చిత్రీకరిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో నేను తీవ్రమైన మనస్థాపానికి గురయ్యాను. ఈ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా సమస్య గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. అంతేగాక నాపైన తప్పుడు కేసులు పెడుతున్నారు. నేను చనిపోయిన తర్వాతనైనా న్యాయం జరుగుతుందని సూసైడ్ లెటర్ రాస్తున్న’ అని లేఖలో పేర్కొన్నారు. కాగా ఎమ్మెల్యే చిన్నయ్యకు, అరిజిన్ డెయిరీ పాల సంస్థ ప్రతినిధులకు మధ్య గతంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. లైంగిక వేధింపులతో పాటు ఎమ్మెల్యే తమపై అక్రమ కేసులు బనాయించారని సదరు యువతి ఆరోపిస్తోంది. దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇటీవలె జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. (వీడియో: ఆ బాధ తట్టుకోలేక ఎమ్మెల్యే దగ్గరకు అమ్మాయిలను పంపించాను) దుర్గం చిన్నయ్య వల్ల తమ కంపెనీలో ఉన్న వాళ్లంతా రోడ్డున పడ్డారని బాధితురాలు శైలజ ఆరోపించారు. ఇప్పటికే తమపై తప్పుడు కేసులు పెట్టారని.. బెయిల్‌పై బయటకు వచ్చినా.. బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. చదవండి: రేవంత్‌రెడ్డిపై బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ -
ఢిల్లీకి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదం.. జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
-
ఢిల్లీకి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదం..NWCకి ఫిర్యాదు
సాక్షి, మంచిర్యాల: బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అరిజిన్డెయిరీ నిర్వాహకుల మధ్య తలెత్తిన వివాదం దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు అరిజిన్ డెయిరీ భాగస్వామి తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే వల్ల ప్రాణ హానీ ఉందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్నయ్యపై చట్టరీత్యా చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ డెయిరీ సీఈవో ఆదినారాయణ, సీఏవో శేజల్ ఆదివారం ఢిల్లీలోని కొత్త పార్లమెంట్ భవనం వద్ద ఆందోళన చేశారు. దుర్గం చిన్నయ్య వల్ల తమ కంపెనీలో ఉన్న వాళ్లంతా రోడ్డున పడ్డారని బాధితురాలు శేజల్ ఆరోపించారు. ఎమ్మెల్యే తమను లైంగికంగా వేధిస్తున్నారని.. న్యాయం జరిగేంత వరకు పోరాడతామని పేర్కొన్నారు. ఇప్పటికే తమపై తప్పుడు కేసులు పెట్టారని.. బెయిల్‌పై బయటకు వచ్చినా.. బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ అడిగానని.. ఎందుకో ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. కాగా, ఎమ్మెల్యేకు, అరిజిన్ డెయిరీ పాల సంస్థ ప్రతినిధులకు మధ్య గతంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. లైంగిక వేధింపులతో పాటు ఎమ్మెల్యే తమపై అక్రమ కేసులు బనాయించారని సదరు యువతి ఆరోపించారు. చదవండి: జూబ్లీహిల్స్ పబ్‌లో పాములు, తొండలు.. కస్టమర్లను ఆకర్షించేందుకు -
నాపై కుట్రలు చేశారు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై వస్తున్న ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. అటు రాజకీయ వర్గాలు, ఇటు జిల్లా ప్రజల్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ వ్యవహారంపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీశాయి. కాగా, ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే మంగళవారం స్పందించారు. తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, బురద జల్లేందుకే కొందరు సోషల్ మీడియా వేదికగా కుట్రలు చేశారని ఆరోపించారు. వారి వివరాలను బయటపెడతానని స్పష్టం చేశారు. మూడు రోజులుగా సోషల్ మీడియా లో యువతుల కోసం చాటింగ్ పేరుతో వైరలైన ఫొటోలతో తనకు సంబంధంలేదని తెలిపారు. డెయిరీ విస్తరణ కోసం ఎమ్మెల్యేగా పిలిస్తే వెళ్లానని, అంతకుమించి తనకు ఏం తెలియదన్నారు. బాధిత రైతులు నిర్వాహకులపై కేసులు పెట్ట గా, కొందరు కావాలనే తనపై నిరాధార ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. డెయిరీ నిర్వాహకులపై ఆంధ్రప్రదేశ్‌లో గతంలోనే పలుచోట్ల కేసులు ఉన్నాయని చెప్పారు. మరోవైపు తమ వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశారని డెయిరీలో పనిచేసిన ఓ ఉద్యోగి, పలువురు రైతులు నిర్వాహకులపై ఆరోపణలు చేశా రు. కాగా, డెయిరీ భాగస్వామి షెజల్ మంగళవారం మరో వీడియోను విలేకరులకు విడుదల చేశారు. ‘మేం బ్లాక్మెయిల్ చేస్తున్నామంటున్నారు, ఇంతటి తో ఆపేస్తే ఆయనకు మంచిది, లేదంటే నిజాల్ని బయటపెడతా’ అని వీడియోలో పేర్కొన్నారు. -
ఆదిలాబాద్: ఎమ్మెల్యే మోసం చేశారు.. మరో వీడియో విడుదల చేసిన యువతి
-
ఎమ్మెల్యే మోసం చేశారు.. మరో వీడియో విడుదల చేసిన యువతి
-
ఎమ్మెల్యే మోసం చేశారు.. మరో వీడియో విడుదల చేసిన యువతి
ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా బెలంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను నమ్మించి మోసం చేశారని సంచలన ఆరోపణలు చేసిన యువతి మరొక వీడియోను విడుదల చేశారు. రకరకాలుగా తమను వేధించారని ఆమె అందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మోసాలను బట్ట బయలు చేస్తామన్నారు ఎమ్మెల్యేను తాము బ్లాక్ మెయిల్ చేస్తున్నాననేది అబద్దమన్నారు. ఎమ్మెల్యే తప్పుడు కేసులతో తనను అరెస్టు చేయించారన్నారు.. కానీ పోలీసులు తాము పట్టుకున్నామని చెబుతున్నారని పేర్కొన్నారు. తమపై తప్పుడు కేసుల సంగతి తేల్చాలంటే ఎమ్మెల్యే ఇంటి సీసీ పుటేజీ బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.. తనకు ప్రాణహని ఉందన్నారు. తమకు రక్షణ. కల్పించాలని పోలీసులను కోరారు. ఇందులో అనేకమంది ఉన్నారని వారిపై సమగ్రమైన విచారణ. జరిపించాలని కోరారు. సాయం చేస్తా.. సరదా తీర్చండి! -
సాయం చేస్తా... సరదా తీర్చండి!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రైవేటు డెయిరీ విస్తరణకు సాయం చేస్తానంటూ యాజమాన్యాన్ని వేధించారని, ఉద్యోగి అయిన ఓ అమ్మాయిని పంపాలంటూ ఇబ్బందిపెట్టారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై వచ్చిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే చెప్పినట్టుగా ఆయన బంధువుకు కొంత వాటా ఇచ్చామని.. ఆయన కోరినట్టు కాకున్నా బ్రోకర్ ద్వారా వేరే యువతిని పంపామని డెయిరీ భాగస్వామి పేరిట ఓ ఆడియో విడుదలైంది. డబ్బులతో పాటు అన్ని రకాలుగా తమను వాడుకుని కూడా.. తమపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఆధారాలతో సహా ఈ విషయాన్ని బయటపెడుతున్నామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి కొన్ని వాట్సాప్ స్క్రీన్ షాట్లను కూడా విడుదల చేశారు. అసైన్డ్ భూమి.. ఐదు శాతం వాటా! ఆర్జిన్ డెయిరీ సంస్థ మంచిర్యాల జిల్లాలో తమ బ్రాంచ్ ఏర్పాటు కోసం కొంతకాలం నుంచి ప్రయత్నిస్తోంది. అది తెలిసిన ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోనే ఆ డెయిరీ ఏర్పాటు చేయాలని, అవసరమైన సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ కంపెనీ కోసం జాతీయ రహదారి పక్కనే ఉన్న రెండెకరాల అసైన్డ్ భూమిని అప్పగించారు. అది లావణి పట్టా భూమి అయినా విక్రయించినట్టుగా పేర్కొని బేరం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఆ స్థలంలో డెయిరీ ప్లాంటు, పాల నిల్వ కోసం శీతల గిడ్డంగి, ప్యాకింగ్ కేంద్రం నిర్మించాలని ప్రణాళిక వేశారు. నిర్మాణం మొదలయ్యే ముందే ఆ ప్రజాప్రతినిధి తన సమీప బంధువు పేరుతో ఐదు శాతం వాటా సైతం తీసుకున్నారని.. తర్వాత డబ్బులు, ఇతర ‘సాయం’ కూడా తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే డబ్బుల విషయంలో గొడవ తలెత్తినట్టు తెలిసింది. గత జనవరిలో ఏకకాలంలో పదిచోట్ల ఈ డెయిరీ నిర్వాహకులపై మోసం కేసులు నమోదయ్యాయి. పోలీసులు పలుమార్లు కంపెనీ ప్రతినిధులను పిలిపించి విచారించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే కంపెనీలో భాగస్వామి అయిన షెజల్ అనే యువతి పేరిట ఆడియో, వీడియో, పలు వాట్సాప్ స్క్రీన్షాట్లు విడుదల అయ్యాయి. ‘ట్యాబ్లెట్లు’ అంటూ అమ్మాయి కోసం చాటింగ్! డెయిరీ పనుల నిమిత్తం పలుమార్లు హైదరాబాద్‌లో ఎమ్మెల్యేను కలిశామని, ఆయన కోరిన పనులు చేసిపెట్టామని సంస్థలో భాగస్వామి అయిన యువతి ఆడియోలో ఆరోపించారు. ‘‘ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్లినప్పుడు నా వెంట సంస్థలో పనిచేసే ఓ అమ్మాయి వచ్చేది. ఆమెపై ఎమ్మెల్యే కన్నేశాడు. ఓ రోజు ఫోన్ చేసి.. ఆ అమ్మాయిని రాత్రికి తన వద్దకు పంపించాలన్నారు. ఆమె అలాంటిది కాదని చెప్పినా వినలేదు. అమ్మాయిని పంపకుంటే ఏం చేయాలో అది చేస్తానని బెదిరించాడు. చివరికి ఎవరి ద్వారానో ఓ బ్రోకర్‌ను సంప్రదించి ఎమ్మెల్యే వద్దకు వేరే ఓ యువతిని పంపాల్సి వచ్చింది. నేరుగా హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కే ఆ యువతిని పిలిపించుకున్నారు. తర్వాత దళిత బంధు పథకం కోసం మాట్లాడుదామని మమ్మల్ని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు, మంచిర్యాలకు పిలిపించుకున్నాడు. అన్నింటిలో ఇన్వాల్వ్ చేయవద్దని, చెప్పినవన్నీ చేయలేమని మేం అనడంతో.. మాపై తప్పులు కేసులు పెట్టించారు. మేం తప్పు చేయలేదని చెప్పినా పోలీసులు పీఎస్‌కు తీసుకెళ్లి ఇబ్బందిపెట్టారు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ విషయంలో మాకు అండగా నిలవాలి..’’ అని పేర్కొన్నారు. తర్వాత షెజల్ పేరిట మరో వీడియో విడుదలైంది. ‘‘ఎమ్మెల్యే మనుషులు మాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఎమ్మెల్యే నుంచి మాకు ప్రాణహాని ఉంది. మాకు ఏం జరిగినా పూర్తి బాధ్యత ఎమ్మెల్యే, పోలీసులదే..’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు. – ఇక యువతిని పంపే అంశంలో ఎమ్మెల్యే, డెయిరీ నిర్వాహకుడి మధ్య జరిగినవిగా చెప్తున్న వాట్సాప్ చాటింగ్‌లలో.. ‘ట్యాబ్లెట్లు కావాలి. రిలాక్సేషన్ పొందాలి. ఆ అమ్మాయి వస్తుందా?’ అంటూ సాగిన సంభాషణలు, హైదరాబాద్‌లో చేసిన ‘ఎంజాయ్’పైనా మెస్సేజ్‌లు ఉండటం గమనార్హం. దళితబంధులో కోట్లు కొట్టేసేలా? దళితబంధులో 200 పాడి యూనిట్లు ఇప్పిస్తే రూ.2 కోట్లు ఇస్తామని మంచిర్యాల జిల్లాలోని ఓ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తన నియోజకవర్గ ప్రజాప్రతినిధికి ఆఫర్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. మరో నియోజకవర్గంలోని ఓ యువ నాయకుడితో కూడా యూనిట్లు ఇప్పించేలా చర్చలు జరిగినట్టు తెలిసింది. మరో ప్రజాప్రతినిధి గేదెలకు బదులు ట్రాక్టర్లు ఇవ్వాలని కోరగా.. ఆ మేరకు సంప్రదింపులు జరిగినట్టు సమాచారం. అయితే ప్రభుత్వం నుంచి రెండో విడత యూనిట్లు మంజూరు కాక ప్రణాళిక ముందుకు కదల్లేదని తెలిసింది. సదరు మార్కెట్ చైర్మన్ మాత్రం డబ్బులు తీసుకుని గేదెలు ఇవ్వలేదని, ఆయన ఇచ్చిన చెక్కులు బౌన్స్‌కావడంతో వివాదం మరింత ముదిరిందని సమాచారం. ఈ వ్యవహారంలోనే డెయిరీ వారిని కూడా ఇన్వాల్వ్ చేసేందుకు ప్రజాప్రతినిధి ప్రయత్నించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌తోపాటు వరంగల్ ప్రాంతంలో ఈ డెయిరీ నిర్వాహకులపై పలు కేసులు ఉన్నాయని.. రైతులకు పశువుల బీమా కింద ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయిన వివాదాలు, ఇతర కేసులు నమోదయ్యాయని సమాచారం. వ్యవహారంపై సీఎంవో నజర్? మంచిర్యాల జిల్లాలో ప్రలోభాల వ్యవహారంపై ఈ నెల 26న ‘సాక్షి’లో ‘పాల కోసం ప్రలోభాలు’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన రాష్ట్ర, జిల్లా స్థాయి నిఘా వర్గాలు పలు వివరాలు సేకరించినట్టు తెలిసింది. ఇందులో అధికార పార్టీ నేతలపై తీవ్ర స్థాయి ఆరోపణలు రావడంతో సీఎం ఆఫీసు కూడా దృష్టి పెట్టినట్టు సమాచారం. నాపై దుష్పప్రచారం చేస్తున్నారు నాపై కావాలనే ప్రైవేటు డైయిరీ నిర్వాహకులు దుష్పప్రచారం చేస్తున్నారు. ఇక్కడ జరిగిన మోసాలపై కేసులు నమోదు చేస్తే.. కోర్టు హాజరు నుంచి తప్పించుకునేందుకు ఇలా చేస్తున్నారు. నిర్వాహకులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. డెయిరీ సంస్థ రైతులను మోసం చేసింది. ఈ విషయాన్ని అన్ని ఆధారాలతో సహా బయటపెడతాను. – దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి ఎమ్మెల్యే -
టోల్గేట్ వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే హల్చల్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారి–363పై మంచిర్యాల జిల్లా మందమర్రి శివారులోని టోల్‌ప్లాజా వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మంగళవారం రాత్రి హల్చల్ చేశారు. చిన్నయ్య మంచిర్యాల నుంచి బెల్లంపల్లి వెళ్తుండగా టోల్‌ప్లాజా సిబ్బంది వాహ నం ఆపడంతో కారుదిగిన ఆయన ఆగ్రహంతో వా రి పై దాడికి యత్నించారు. కాగా, పక్కనున్న వారు ఆయనను సముదాయించినట్లు తెలుస్తోంది. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటనపై ఎమ్మెల్యే చిన్నయ్యను ‘సాక్షి’సంప్రదించగా.. ప్రమా దంలో గాయపడిన తమ బంధువుల అబ్బాయిని అంబులెన్స్‌లో తరలిస్తుండగా అక్కడి సిబ్బంది టో ల్ వసూలు చేయడంపై మేనేజర్‌ను కలిసే ప్రయత్నం చేశానని చెప్పారు. ఎవరిపైనా తాను దాడి చేయలేదని తెలిపారు. కాగా, సోషల్‌మీడియా, టీవీ చానళ్లలో సీసీ ఫుటేజీ వీడియో ప్రసారం కావడంతో ‘రోడ్డు పనులు పూర్తి కాకుండానే టోల్ వసూలు చేయడంపై స్థానిక ఎమ్మెల్యేగా అక్కడి అధికారులను అడిగా’అని వివరణ ఇచ్చారు. ఎన్హెచ్ఏఐ పీడీ రవీందర్రావును ‘సాక్షి’సంప్రదించగా, ఘటనపై విచారణ చేపట్టామని తెలిపారు. -
మంచిర్యాల: టోల్‌ప్లాజా ఘటనపై ఎమ్మెల్యే చిన్నయ్య కీలక వ్యాఖ్యలు
సాక్షి, మంచిర్యాల: మందమర్రి టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి చేసినట్లు వస్తున్న వార్తలపై స్పందించారు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. దాడి వార్తలను ఖండించారు. జాతీయ రహదారి పనులు పూర్తి కాకుండానే టోల్ వసూలు చేస్తున్నారని, అంబులెన్స్‌ను సైతం వదలటం లేదన్నారు. ఈవిషయంపైనే మేనేజర్‌తో మాట్లాడేందుకు వెళ్లినట్లు స్పష్టం చేశారు. ‘నేను దాడి చేసినట్లుగా టీవీలలో వార్తలు వస్తున్నాయి. జాతీయ రహదారి పనులు పూర్తి కాలేదు. సోమగూడేం ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయలేదు. కాని టోల్ ప్లాజాలో నూటయాభై టోల్ వసూలు చేస్తున్నారు. టోల్ ప్లాజా నుండి అంబులెన్స్ కూడ వదలడం లేదు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాలపై మేనేజర్‌తో మాట్లాడానికి వెళ్లాను. మేనేజర్ నుంచి ఎటువంటి స్పందింన లేదు. అంతే కానీ నేను దాడి చేయలేదు. కనీసం టోల్ ప్లాజా ప్రారంభానికి కూడా నన్ను పిలువలేదు’ అని దాడి వార్తలను ఖండించారు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఇదీ చదవండి: వీడియో: మందమర్రి టోల్‌ప్లాజా వద్ద ఎమ్మెల్యే చిన్నయ్య హల్చల్.. సిబ్బందిపై దాడి -
మంచిర్యాల: నా వాహనాన్నే ఆపుతారా? టోల్‌ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి!
సాక్షి, మంచిర్యాల: మందమర్రి టోల్‌ప్లాజా వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హల్చల్ చేశారు. తన వాహనానికి రూట్ క్లియర్ చేయలేదంటూ టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. దీంతో ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తి ఈ విధంగా దాడి చేయటం సరికాదంటూ విమర్శలు ఎదురవుతున్నాయి. టోల్‌ప్లాజా వద్దకు వచ్చిన క్రమంలో తనకు రూట్ క్లియర్ చేయలేదంటూ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దౌర్జన్యానికి దిగారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. తమకు న్యాయం చేయాలని, ఎమ్మెల్యేపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఉద్యమం కూడా చేస్తామని హెచ్చరించారు. ఇదీ చదవండి: అసైన్డ్ భూములపై కేసీఆర్ సర్కార్ స్పెషల్ ఫోకస్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు! -
Teachers' Day: ఉపాధ్యాయ వృత్తి నుంచి చట్టసభల్లోకి..
సాక్షి, ఆదిలాబాద్: వారంతా ఒకప్పటి గురువులు.. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించి వారి ఉన్నతికి తోడ్పడ్డారు. ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో రాణించి, ఎంతో మందిని ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. సమాజ మార్గనిర్దేశకులుగా సేవలందించి విద్యార్థుల అభ్యన్నతికి పాటుపడ్డారు. ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రజల ఆదరణను చూరగొని తరగతి నుంచి చట్టసభల్లోకి అడుగుపెట్టారు. ఉపాధ్యాయుడిగా విద్యార్థుల ఉన్నతికి ఏ విధంగా పాటుపడ్డారో ప్రజాప్రతినిధులుగానూ తమను గెలిపించిన ప్రజలకు అండగా నిలుస్తూ వారి మన్ననలు పొందుతున్నారు. ఉపాధ్యాయులుగా నాటి జ్ఞాపకాలు మరువలేనివని చెబుతున్న పూర్వపు గురువులపై ‘టీచర్స్‌డే’ సందర్భంగా ప్రత్యేక కథనం. ఉద్యోగాన్ని వదిలి ఎమ్మెల్యే, ఎంపీగా.. ఆదిలాబాద్ ఎంపీగా ఉన్న సోయం బాపూరావు సైతం ఉపాధ్యా య వృత్తి నుంచే రాజకీయాల్లోకి అడుగుపె ట్టారు. 1987లో బోథ్ మండలం మహద్గాంవ్లో తొలిసారి ఐ టీడీఏ ఉపాధ్యాయుడిగా నియామకమయ్యారు. అదే మండలం రాజుపల్లి, బజార్హత్నూర్ మండలం కొత్తగూడెం, ఆసిఫాబాద్ మండలం రాయిగూడ, ఆసిఫాబాద్ ఆశ్రమ పాఠశాల, ఉట్నూర్ స్పోర్ట్స్ స్కూల్లో 1994 వరకు విద్యార్థులకు పాఠాలు నేర్పారు. రాజకీయాలపై ఆసక్తితో 2004లో టీఆర్ఎస్లో చేరిన ఆయన ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014, 2018లో పోటీచేసి పరాజయం పాలై తిరిగి బీజేపీలో చేరి 2019లో ఎంపీగా గెలుపొందారు. ఉపాధ్యాయుడిగా పనిచేసిన నాటి జ్ఞాపకాలు మరిచిపోలేనివని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని దాన్ని బాధ్యతగా నిర్వహిస్తూ విద్యార్థుల ఉన్నతికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవలో.. ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆత్రం సక్కు 1993లో ఐటీడీఏ ఉపాధ్యాయుడిగా తిర్యాణి మండలం గొపెరాలో నియామకమయ్యారు. ఆరేళ్లపాటు అక్కడే పనిచేసిన ఆయన 1999లో నార్నూర్ మండలం చింతగూడ ఆశ్రమ పాఠశాలకు బదిలీ అయ్యారు. అక్కడ మూడేళ్లపాటు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన ఆయన 2004లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2009లో తొలిసారి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లోనూ అదె పార్టీ నుంచి పోటీచేసి పరాజయం పాలయ్యారు. తిరిగి 2018లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉపాధ్యాయుడి నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికై తన ప్రస్తానం కొనసాగిస్తున్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా .. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు సుదీర్ఘకాలం పాటు ఉపాధ్యాయుడిగా సేవలందించారు. 1986లో ఆదిలాబాద్ మండలం చింతగూడలో స్పెషల్ టీచర్‌గా నియామకమయ్యారు. 1987లో పదోన్నతి పొంది ముత్యన్పేట పాఠశాలకు బదిలీపై వెళ్లారు. ఆదిలాబాద్‌లోని కోలాం ఆశ్రమ పాఠశాలలో నాలుగేళ్లపాటు పనిచేశారు. 1993లో గ్రేడ్–1 హింది పండిట్‌గా పదోన్నతి పొంది తలమడుగు మండలం ఝరి ఆశ్రమ పాఠశాలకు వెళ్లారు. అక్కడ ఏడేళ్లపాటు పనిచేసిన ఆయన ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. 2000 సంవత్సరంలో తాంసి మండలం అందర్బంద్కు బదిలీ అయ్యారు. అక్కడ మూడేళ్లపాటు పనిచేసి, ఆదిలాబాద్ మండలం మామిడిగూడ బాలికల ఆశ్రమ పాఠశాలకు బదిలీ అయ్యారు. 2009 వరకు అక్కడే సేవలందించారు. ప్రత్యేక తెలంగాణ రాష్టాన్ని కాంక్షిస్తూ 2009లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. కేసీఆర్ పిలుపుతో టీఆర్ఎస్లో చేరిన ఆయన 2014, 2018లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గురువులు బావి తరాలకు ఆదర్శమని, బాధ్యతగా పనిచేస్తూ విద్యార్థుల ఉన్నతికి తోడ్పడాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ టీచర్ నుంచి ఎమ్మెల్యేగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు విద్యారంగంతో ఎంతో అనుబంధం ఉంది. ఈయన రాజకీయాల్లోకి రాక ముందు 1992నుంచి 1994 వరకు శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్‌లో ఉపాధ్యాయుడిగా సేవలందించారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన చదువునందించి మంచి ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందిన ఆయన రాజకీయాల్లోనూ అదే స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. 1996లో నెన్నెల మండల జెడ్పీటీసీగా, 2001లో ఎంపీపీగా పనిచేశారు. 2009, 2018లో టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రజా ప్రతినిధి అయినప్పటికీ విద్యారంగపై ఆయనకున్న మక్కువను చాటుతూనే ఉంటారు. పాఠశాలలను సందర్శించిన సమయంలో విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి ప్రతిభాపాఠవాలను తెలుసుకుంటారు. ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబడుతూ వారితో మమేకమవుతారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని, బాధ్యతగా నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయుడి నుంచి క్యాబినెట్ మంత్రిగా గోడం నగేశ్ 1986లో ఎస్జీబీటీగా బజార్హత్నూర్ మండలం విఠల్గూడ ఆశ్రమ పాఠశాలలో నియామకమయ్యారు. బోథ్ మండలం పార్డి–బి యూపీఎస్ హెచ్‌ఎంగాను సేవలందించారు. 1989లో స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది బజార్హత్నూర్ మండలం జాతర్ల ఉన్నత పాఠశాలలో నియామకమయ్యారు. 1993లో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. టీడీపీలో చేరిన ఆయన 1994 ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర గిరిజన సంక్షేమ, వికలాంగుల సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. 2009లోనూ అదే పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొంది పార్లమెంట్‌లోనూ అడుగుపెట్టారు. ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు పాఠాలు బోధించిన ఆయన జిల్లా రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. -
వెంటాడుతున్న కేసులు: కోర్టుకు ముగ్గురు ఎమ్మెల్యేలు
హైదరాబాద్: అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు మంగళవారం హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు వరుస కట్టారు. టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే హాజరయ్యారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై కోర్టు విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క (ములుగు)పై జారీ చేసిన నాన్ బెయిల్ వారెంట్‌ను కోర్టు ఉప సంహరించుకోగా.. అయితే రూ.10 వేల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. తొలుత ఎన్నికల నియమావళి కేసుపై విచారణ జరిగింది. ఈ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విచారణకు హాజరయ్యారు. వేర్వేరు కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్చెరు), దుర్గం చిన్నయ్య (బెల్లంపల్లి) కూడా కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ముందు విచారణ కోసం వచ్చారు. అయితే మరో కేసులో విచారణకు కావాలని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఇంకొక కేసులో సమన్లు జారీ చేసిన కూడా గైర్హాజరవడంతో నిజామాబాద్ రూరల్ పీఎస్ ఎస్హెచ్ఓపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌పై ఎన్బీడబ్ల్యూ అమలు చేయకపోవడంపై అతడిని కోర్టు పిలిచింది. అయితే ఎస్హెచ్ఓ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన ధర్మాసనం నిందితుడిగా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్‌కు సహకరించేలా అతడు వ్యవహరిస్తున్నారని డీజీపీకి సమాచారం అందించింది. నిజామాబాద్ రూరల్ ఎస్హెచ్ఓపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించింది. -
మా ఆవిడే నా బలం: ఎమ్మెల్యే చిన్నయ్య
ఆయనది సాధారణ వ్యవసాయ కుటుంబం. చదువుకునేందుకు కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లారు. వ్యవసాయం చేస్తూనే.. చదువుకున్నారు. విద్యార్థిదశలో విప్లవోద్యమాల వైపు నడిచినా.. ప్రస్తుతం దైవాన్ని తలుచుకోనిది ఏ పని కూడా మొదలుపెట్టరు. ఒకరికి సాయం చేయడంలోనే జీవితానికి తృప్తి ఉందని భావించే ఆయన.. తన భార్యే తన బలమని చెబుతారు. ఆయనే బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ‘సాక్షి పర్సనల్ టైం ఇంటర్వ్యూ’లో చిన్నయ్య చెప్పిన ముచ్చట్లు ఆయన మాటల్లోనే.. సాక్షి, మంచిర్యాల: ఆమే నా బలం నా ఎదుగుదలకు నా భార్య.. నా కుటుంబమే ప్రధాన కారణం. మాకు ఇద్దరు అమ్మాయిలు విహారిక, నిహారిక. మగ సంతానం లేదని ఎన్నడూ చింతించలేదు. ఆ ఇద్దరు బిడ్డలే మా సర్వస్వం. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంటి వ్యవహారాలన్నీ నా భార్య జయతారే చూసుకుంటోంది. ఇప్పటికి ఆమెనే ఇంటి బరువు బాధ్యతలు మోస్తుంది. నేను ఎన్నడూ ఇంటి వ్యవహారాలను పట్టించుకున్నది లేదు. పిల్లల చదువులు, ఇంటి అవసరాలన్నీ ఆమెనే చూస్తుంది. ఆమె మా వైవాహిక జీవితంలో ఎన్నడూ నాకు ఇది కావాలి.. అది కావాలి అడిగిన దాఖలాలు లేవు. రాజకీయాల్లో నేను బిజీగా ఉండడంతో.. ఏ సమస్య వచ్చినా నా ప్రమేయం లేకుండా పరిష్కరిస్తుంది. అందుకే జయతారనే నా బలంగా భావిస్తాను. నా రాజకీయ ఎదుగుదలకు నా భార్య తోడ్పాటు ఎంతగానో ఉంది. ఆరు కిలోమీటర్లు నడిచేవాళ్లం.. నెన్నెల మండలం జెండా వెంకటాపూర్ మా స్వగ్రామం. అమ్మానాన్న దుర్గం మల్లు, రాజం. అన్న బాలస్వామి, అక్కలు రాజుబాయి, చిన్నక్క. మాది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. మా ఊరిలో ఐదో తరగతి వరకు మాత్రమే చదువుకునే వీలుండే. అందుకనే ఊళ్లో ఐదో తరగతి చదివి పొరుగునున్న ఆవుడం గ్రామానికి రోజు ఆరు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి పదో తరగతి పూర్తి చేశాను. రోడ్డు సౌకర్యం సరిగా లేకపోయినా వాగులు, వంకలు దాటుకుంటా ఐదేండ్లు బడికి వెళ్లి ఫస్ట్ క్లాస్‌లో పాసైన. ఆ తర్వాత మంచిర్యాలలో ఓ రూమ్ కిరాయికి తీసుకుని అక్కడే ఉండి ఇంటర్మీడియెట్, డిగ్రీ పూర్తి చేసిన. నా విద్యాభ్యాసమంతా పూర్తిగా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే సాగింది. విద్యార్థి దశలో విప్లవోద్యమం వైపు... ఎనిమిదో తరగతి చదువుకునే రోజుల్లోనే విప్లవోద్యమాల వైపు ఆకర్షితుడినయ్యా. పీడీఎస్‌యూలో చేరి పదో తరగతి వరకు చురుగ్గా పనిచేసిన. అప్పట్లో జన్నారంలో నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతులకు హాజరైన. న్యూడెమోక్రసీ రాష్ట్ర నేత వేముపల్లి వెంకట్రామయ్యతో అప్పుడే పరిచయం ఏర్పడింది. ఆ శిక్షణ తరగతుల్లో దేవుడిపై చర్చ జరిగింది. ఆ రోజుల్లో దేవుడున్నాడని నేను, లేడని తరగతులకు హాజరైన ప్రముఖులు వాదించుకున్నాం. ప్రతి మనిషినీ నడిపించడంలో ఏదో శక్తి ఉందని నేను భావిస్తాను. సికాసలో కొంతకాలం పనిచేశాను. అప్పుడున్న పరిస్థితుల్లో రెండు సంవత్సరాల పాటు అజ్ఞాతవాసం కూడా గడిపిన. నాడు ఎన్టీఆర్.. నేడు మహేశ్‌బాబు కుటుంబంతో కలిసి సినిమాలు చూడటం చాలా అరుదు. పన్నేండేళ్ల క్రితం అంతఃపురం సినిమాను మా కుటుంబంతో కలిసి చూసిన. ఆ తర్వాత రాజకీయాల్లో బిజీగా ఉండటం, ప్రజాసేవకు అంకితం కావడంతో మరెన్నడూ కలిసి సినిమాలు చూసిన దాఖలాలు లేవు. అందరు అంటుంటే అంతఃపురం సినిమా తర్వాత మరో పుష్కరకాలానికి బాహుబలి సినిమాను ఫ్యామిలీతో కలిసి చూసిన. సినిమా నటుల్లో పూర్వం ఎన్టీ రామారావు, ప్రస్తుతం మహేష్‌బాబు అంటే ఇష్టం. హీరోయిన్లలో పూర్వం శ్రీదేవి నటన బాగా నచ్చేది. ప్రస్తుత హీరోయిన్లలో అభిమానించే స్థాయిలో ఎవరూ లేరు. దైవాన్ని తలుచుకున్నాకే పని మొదలు నేను నూటికి నూరు శాతం దేవుడిని నమ్ముతా. ప్రతిరోజూ స్నానాది కార్యక్రమాల తరువాత పూజ చేస్తా. పూజ చేయనిదే ఇంట్లో నుంచి బయటకు వెళ్లను. ఇప్పటికీ ఏ పని సంకల్పించుకున్నా దైవాన్ని తలుచుకున్నాకే మొదలు పెడుతా. విద్యార్థి దశలోనే దేవుడున్నాడనే అంశంపై ఇతర విద్యార్థులు, పెద్దలతో వాదించుకునేవాడిని. మనల్ని దైవశక్తి నడిపిస్తుందని కచ్చితంగా నమ్ముతా. వ్యవ‘సాయం’పై మక్కువ వ్యవసాయ కుటుంబం కావడంతో ఓ పక్క చదువుకుంటూనే మరోపక్క అమ్మానాన్నతో కలిసి పొలం పనులకు వెళ్లేవాన్ని. మా నాన్నకు ఐదెకరాల మామిడి తోట, రెండెకరాల పొలం ఉండే. రోజు ఉదయం నిద్ర లేవగానే పేడతీసేది. ఎడ్లను మేతకు తీసుకెళ్లి 8 గంటల వరకు ఇంటికి వచ్చేది. ముఖం కడుక్కొని, స్నానం చేసి పుస్తకాల సంచి పట్టుకుని బడికి వెళ్లేది. తిరిగి ఇంటికచ్చినంగా భోజనం చేసి మళ్లీ పొలం పనులకు వెళ్లేటోన్ని. నాకు దుక్కులు దున్నడం, జంబు కొట్టడం, నాట్లువేసే పనులు వచ్చు. నిజంగా ఆ రోజుల్లో జీవితం చాలా అందంగా ఉండేది. అరమరికలు లేకుండా అందరం కలిసి మెలిసి జీవించేటోళ్లం. చిన్నప్పుడు తీరొక్క ఆటలు ఆడేవాళ్లం. ఎండాకాలంలో మామిడి పిక్కల ఆట, గోళీలు, చిర్రగోనే, పైసలాట ఆడేవాళ్లం. మాకున్న వ్యవసాయ బావిలో దూకి ఈత కొట్టేవాళ్లం. మా ఊళ్లో ఇద్దరు బాల్య మిత్రులుండేవాళ్లు. వారిలో భూమయ్య అనే మిత్రుడు కాలం చేశాడు. ఇంకో మిత్రుడు ఏస్కూరి పోశం ఉన్నాడు. భూమయ్య, పోశంతో ఎప్పుడూ అన్యోన్యంగా ఉండేవాడిని. వాళ్లు నాకు పంచ ప్రాణాలుగా ఉండేవారు. ఇప్పటికి పోశంను కలుస్తూ ఉంటా. సాయం చేయడంలోనే తృప్తి పక్కవారికి సాయం చేయడంలో ఎంతో తృప్తి ఉంది. నా జీవితంలో అలాంటి రెండు సంఘటనలు చోటుచేసుకున్నాయి. నెన్నెల మండలం గుండ్లసోమారం గ్రామానికి చెందిన ఓ నిరుపేద విద్యార్థి నాలుగేళ్ల క్రితం నావద్దకు వచ్చాడు. ఆ విద్యార్థికి మహారాష్ట్రలో ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది. సీటు దక్కాలంటే రూ.18,500 ఫీజు కట్టాలని, ఫీజు చెల్లించడానికి అదేరోజు ఆఖరు అని, ఆర్థిక సాయం చేస్తారా..? అంటూ ప్రాధేయపడ్డాడు. అప్పటికప్పుడే నా వద్ద, నా వద్దకు వచ్చిన వ్యక్తుల వద్ద నుంచి డబ్బులు జమచేసి ఆ మొత్తం అందజేశాం. ఆ తర్వాత కొన్ని నెలలకు ఆ విద్యార్థి వచ్చి నేను చేసిన సాయంతో ట్రిపుల్ ఐటీ సీటు రావడంతోపాటు, జాతీయ స్థాయిలో స్కాలర్షిప్కు కూడా ఎంపికయ్యానని చెప్పడం జీవితంలో మరిచిపోలేని తొలి ఘటన. అలాగే మంచిర్యాలకు చెందిన ఓ బీటెక్ విద్యార్థి రెండు కిడ్నీలు చెడిపోయి ప్రాణాపాయ స్థితిలో నా వద్దకు వచ్చాడు. ఓ కిడ్నీ దానం చేయడానికి ఆయన తండ్రి ముందుకు వచ్చాడని, కానీ ఆ కిడ్నీని అమర్చడానికి రూ.12.40 లక్షలు వ్యయం అవుతుందని, ఎలాగోలా కాపాడాలని ప్రాధేయపడ్డాడు. నేను సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి పరిస్థితి వివరించి విద్యార్థికి రూ.12 లక్షలు సీఎం రిలీఫ్‌ఫండ్ కింద మంజూరు చేయించి ప్రాణాలు నిలిపాను. ఆ విద్యార్థి ఆపరేషన్ సక్సెస్ అయి మా ఇంటికి వచ్చి చెమర్చిన కళ్లతో చెప్పిన కృతజ్ఞతలు నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. -
ఆదాయ పన్ను మాఫీ కోసం కొట్లాడుతా
సాక్షి, శ్రీరాంపూర్ (మంచిర్యాల): కార్మికులు తనను ఆదరించి గెలిపిస్తే ఆదాయ పన్ను మాఫీ కోసం పార్లమెంట్లో కొట్లాడుతానని టీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్ నేత అన్నారు. గురువారం ఆయన శ్రీరాంపూర్ డివిజన్లోని ఎస్సార్పీ 1 గని వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్మికులను గేటుబయట కలిసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్‌నేత మాట్లాడుతూ కేంద్రం తెలంగాణ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని వివరించారు. విభజన హామీలు నెరవేర్చలేదన్నారు. ఎంపీల బలం ఉంటేనే కేంద్రంలో ఏ ప్రభుత్వమైనా దిగివస్తుందన్నారు. అందుకే ఈసారి అంతటా టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను అఖండా మెజారిటీతో గెలిపించాలని కోరారు. బొగ్గుగని కార్మికులు ఎన్నో ఏళ్లుగా ఆదాయ పన్ను కోసం ఎదురుచూస్తున్నారని కాని ఏనాడు కేంద్రంలోని ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. కార్మికుల సమస్యలు ఏవి ఉన్న వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం దివాకర్‌రావు మాట్లాడుతూ వెంకటేశ్ నేత ప్రజాసేవా చేయాలనే ఉద్ధేశంతో ఉన్నత ఉద్యోగం వదిలి వచ్చానని తెలిపారు. ఆయన వెంట మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు ఉన్నారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ బ్రాంచీ ఉ పాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, కేంద్ర డెప్యూటీ ప్రధాన కార్యదర్శి అన్నయ్య, నాయకులు వీరభద్రయ్య, మల్లారెడ్డి, వెంగళ కుమారస్వామి, మోతె రాఘవరెడ్డి, రాజనాల రమేశ్, ఫిట్ సెక్రెటరీ కొలిపాక సమ్మయ్య, గోపాల్ పాల్గొన్నారు. టీబీజీకేఎస్ ఎన్నికల ప్రచారం శ్రీరాంపూర్ (మంచిర్యాల): గుర్తింపు సంఘం టీ బీజీకేఎస్ నాయకులు గురువారం కార్మిక కాలనీ ల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్ నేతకు మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. టీబీజీకేఎ స్ బ్రాంచీ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, సెంట్రల్ డెప్యూటీ జనరల్ సెక్రెటరీ అన్నయ్య ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల సమస్యలను తీర్చారన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయనన్నీ సంక్షేమ కార్యక్రమాలను, కొత్త హక్కులను కార్మికుల కోసం కల్పించారని వివరించారు. మరోసారి టీఆర్ఎస్ ఎంపీలను గెలిపించి కానుకగా ఇస్తే మరింత మేలు జరుగనుందని తెలిపారు. పార్లమెంట్లో బొగ్గు గని కార్మికుల ఆదాయ పన్ను కోసం పోరాడాలంటే పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ ఎంపీలు ఉండాలన్నారు. అందుకే 16 స్థానాల్లో టీఆర్ఎస్ గెలువాలన్నారు. బోర్లకుంట వెంకటేశ్ నేతను అధిక మెజారిటీతో గెలిపిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంద మల్లారెడ్డి, వీరబధ్రయ్య, వెంగళ కుమారస్వామి, కాశీరావు, పానుగంటి సత్తయ్య, చిలుముల రాయమల్లు, మహేందర్‌రెడ్డి, నర్సయ్య, మెండె వెంకటి, కొలిపాక సమ్మయ్య పాల్గొన్నారు. టీఆర్ఎస్దే ఘన విజయం బెల్లంపల్లి: పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్దే ఘనవిజయమని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. గురువారం సింగరేణి ఎక్స్‌ఫ్లోరేషన్ విభాగంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముం దస్తుగా కార్మికులను కలిసి టీఆర్ఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలకు కార్మికులలో ఆదరణ ఏమాత్రంలేదన్నారు. పెద్దపల్లి ఎంపీగా టీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేష్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కొమ్మెర లక్ష్మణ్, ఫిట్ సెక్రెటరీ వీరస్వామి, రాజలింగు పాల్గొన్నారు. -
ఎంపీ, ఎమ్మెల్యేను బహిష్కరించాలి
బెల్లంపల్లి: నీతిమాలిన పనికి పాల్పడిన పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, మున్సిపల్ కౌన్సిలర్లు, కుటుంబ సభ్యులను బెదిరించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను టీఆర్ఎస్ నుంచి బహిష్కరించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ డిమాండ్ చేశారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇరువురు ప్రజాప్రతినిధుల వ్యవహార శైలి హేయంగా ఉందన్నారు. ఇద్దరి నిర్వాకం వల్ల జిల్లా పరువు, ప్రతిష్ట రాష్ట్రంలో దిగజారిపోయిందని విమర్శించారు. మున్సిపల్ కౌన్సిలర్ కొప్పుల సత్యవతి కూతురితో ఎమ్మెల్యే చిన్నయ్య ఫోన్లో బెదిరింపులకు పాల్పడడం, అసమ్మతి కౌన్సిలర్లను ఇబ్బందులకు గురి చేస్తామని హెచ్చరించడం దారుణమన్నారు. ఎమ్మెల్యే వ్యవహార శైలి పూర్తిగా ఆక్షేపనీయమన్నారు.ఎమ్మెల్యే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎంపీ బాల్క సుమన్ ఇద్దరు మహిళలతో శారీరక సంబంధం పెట్టుకుని మోసం చేయడం సరైంది కాదన్నారు. బాధిత మహిళలపై జనవరిలో ఎంపీని బ్లాక్ మెయిల్ చేసినట్లు కేసు పెట్టామని మంచిర్యాల పోలీసులు ప్రకటించడం ఎంపీకి కొమ్ముకాయడమే అవుతుందన్నారు. అప్పట్లో సదరు మహిళలపై కేసులు పెట్టినట్లు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ఎంపీ, ఎమ్మెల్యేలపై జ్యూడీషియల్ విచారణ జరిపించాలన్నారు. కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు సైతం ఓ ఎన్ఎస్యూఐ నాయకుడిని పరుష పదజాలంతో దూషించడం, బెదిరించడం సరైంది కాదన్నారు. ప్రేమ్‌సాగర్ రావుపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ, అనుబంధ సంఘాల నాయకులు డి.ప్రకాష్, కుసుమ భాస్కర్, కె.గోవర్ధన్, గట్టురాజం, అరుణ్‌కుమార్, సత్యనారాయణ రెడ్డి, రాజేశం తదితరులు పాల్గొన్నారు. -
మేం తలచుకుంటే.. ఏముందమ్మా!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘మేం తలచుకున్నంక ఏముంటదమ్మా.. డీజీపీకి చెప్పి ఎక్కడున్నదో క్యాంపు చూడుమంటే ఏంచేస్తడు. బస్సును తీసుకపోయి పోలీస్‌స్టేషన్ లోపల పెడతడు’ ‘యూసఫ్ది లాండ్ ఇష్యూ ఉంది. దాన్ల ప్రాబ్లం క్రియేటవుతది. గవర్నమెంట్ కబ్జా చేస్తది. రమేష్ లాండ్ గుడ గవర్నమెంట్ హాండోవర్ అవుతది. ఆడ బోర్డు బెడతరు’ ‘సుధ వాళ్ల భర్త బెల్లంపల్లి ఓసీల జాబ్ చేస్తుండు. ఆయన్ను రెండు రోజు లల్ల తీసుకుపోయి మణుగూరుల పడేస్తం. కేటీఆర్ తలచుకున్నంక ఎంతసేపమ్మ. ఒక్క మాట చెప్తే రేప్పొద్దున ట్రాన్స్ఫర్ చేసేస్తడు’ ‘కలెక్టర్ ఏం జేస్తడు. గవర్నమెంట్‌కు ఫేవర్గ చేస్తడు కద. అఫీషియల్‌గ ప్రొలాంగ్ చేపించుడో, పోస్ట్‌పోన్ చేయించుడా ఏదో చేస్తం’ బెల్లంపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ కొప్పుల సత్యవతి కూతురుతో స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడిన మాటలు ఇవి. బెల్లంపల్లి మున్సి పల్ చైర్పర్సన్ సునీతారాణిపై అవిశ్వాసం పెట్టేందుకు పార్టీలకు అతీతంగా పాలకమండలిలోని 29 మంది కౌన్సిలర్లు కొద్దిరోజులుగా అజ్ఞాతంగా క్యాంపులో ఉన్నారు. అవిశ్వాసాన్ని వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యే చిన్నయ్య క్యాంప్‌ను విచ్ఛిన్నం చేయడానికి రంగంలోకి దిగారు. కౌన్సిలర్ల ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ ఉండటంతో వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి క్యాంపు నుంచి తిరిగి వచ్చేలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా 34వ వార్డు కౌన్సిలర్ సత్యవతి కూతురుతో తొలుత మాట్లాడిన ఎమ్మెల్యే క్యాంపు నుంచి తిరిగి వచ్చేలా ఒప్పిం చమని చెప్పారు. తల్లితో మాట్లాడిన కూతురు ఆ విషయాన్ని ఎమ్మెల్యేకు చెప్పేందుకు ఫోన్ చేయగా మంత్రి కేటీఆర్ పేరును ఉపయోగిస్తూ భయ పెట్టేలా సంభాషణ జరిపారు. కేటీఆర్ తలచుకుం టే ఏమైనా జరుగుతుందని, కౌన్సిలర్లకు ఇబ్బం దులు కలుగుతాయని స్పష్టం చేశారు. మాట వినకపోతే కౌన్సిలర్ల అధీనంలో ఉన్న వివాదాస్పద భూములను సర్కార్ కబ్జా చేసుకుంటుందని, బెల్లంపల్లి ఓపెన్‌కాస్ట్‌లో పనిచేస్తున్న సుధ అనే కౌన్సిలర్ భర్తను మణుగూరుకు రెండు రోజుల్లో బదిలీ చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ ఫోన్ కాల్ లీక్ అయి గురువారం ఉదయాన్నే వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో వైరల్‌గా మారింది. అవిశ్వాస తీర్మానం వీగిపోయేందుకు ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫోన్ సంభాషణ ద్వారా వెల్లడి కావడంతో అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. బెల్లంపల్లి ప్రిస్టేజ్ ఇష్యూ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తన సంభాషణలో మంత్రి కేటీఆర్ పేరును పలుమార్లు వాడుకున్నారు. ‘గవర్నమెంట్ తలచుకుంటే ఏమన్న అయితది. కేటీఆర్ ప్రిస్టేజ్ ఇష్యూ బెల్లంపల్లి క్యాంప్ అయింది’ అని ఎమ్మెల్యే సంభాషణ సాగించారు. ‘క్యాంపు నుంచి రాకుంటే ఎవరెవరికి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ టైట్ చేసేసి తీసు కొస్తం’ అని మాట్లాడటం చర్చనీయాంశమైంది. అవిశ్వాసానికి ఏడుగురు సభ్యుల నోటీసు బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవి శ్వాసం ప్రకటిస్తూ పాలక మండలిలోని ఏడు గురు సభ్యులు జాయింట్ కలెక్టర్ సురేందర్‌రావు కు నోటీసు అందజేశారు. గురువారం కలెక్ట ర్ కార్యాలయంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ నూనే టి సత్యనారాయణ (టీఆర్ఎస్) నేతృత్వంలోని సభ్యులు సతీష్, ఆర్.శారద (కాంగ్రెస్), బి.రాజేశ్, డి.సుజాత (టీఆర్ఎస్), టి.వంశీకృష్ణారెడ్డి, పి.రాజ్‌కుమార్ (ఇండిపెండెంట్లు) జేసీని కలసి అవిశ్వాసం నోటీసు అందజేశారు. చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం కోసం పాలకమండలిని సమావేశపర్చాలని వారు కోరారు. 29 మంది సభ్యులు అవిశ్వాసం నోటీస్‌పై సంతకాలు చేశారు. -
ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన విద్యార్థులు
ఆదిలాబాద్: జూనియర్ కాలేజీ కొత్త భవనాన్ని ప్రస్తుత కాలేజీ స్థలంలోనే నిర్మించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నివాసాన్ని విద్యార్థులు ముట్టడించి... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెల్లంపల్లిలో జూనియర్ కాలేజీ కొత్త భవనానికి ప్రభుత్వం రూ. 2.5 కోట్లు మంజూరు చేసింది. అయితే సదరు భవనాన్ని మరో చోట నిర్మించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆ విషయం తెలిసి విద్యార్థులు ప్రస్తుత కాలేజీ స్థలంలోనే నిర్మించాలని లేకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో విద్యార్థులు శుక్రవారం ఎమ్మెల్యే నివాసం ఎదుట ఆందోళనకు దిగారు.