
సాక్షి, మంచిర్యాల: బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో బెల్లంపల్లిలోని నెన్నెల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు.
కాగా గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటు వేసేందుకు బీఆర్ఎస్ కండువాతో ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రానికి వచ్చారు. నెన్నెల మండలం జెండా వెంకటపూర్లో ఎమ్మెల్యే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే దుర్గం చిన్నయ్య గులాబీ కండువాతో పోలింగ్ కేంద్రానికి వచ్చినా ఎన్నికల సిబ్బంది అడ్డుచెప్పకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రిసైడింగ్ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment