Election Code of Conduct
-
పవన్ ‘న్యూట్రల్’ గేర్!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు.. సూపర్ సిక్స్ హామీల అమలులో విఫలం కావడం.. వరుసగా చిన్నారులపై అఘాయిత్యాలు, మహిళలపై హత్యాచారాల ఘటనల సమయంలో ఉలకని పలకని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీడీపీ పెద్దలు ఇరకాటంలో పడ్డప్పుడల్లా రంగంలోకి దిగుతున్నారు. కూటమి సర్కారు వైఫల్యాలకు బాధ్యత వహించకుండా.. తాను ప్రభుత్వంలో భాగం కాదనే రీతిలో తమపై విమర్శలకు దిగడంపై అధికార యంత్రాంగం విస్తుపోతోంది. శాంతి భద్రతల అంశం నేరుగా ముఖ్యమంత్రి చేతిలోనే ఉందన్న విషయం పవన్‌కు తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా పవన్ తాను తటస్థుడినని చిత్రీకరించుకుంటూ ప్రత్యేకత చాటుకునే యత్నాల్లో భాగమని పేర్కొంటున్నారు. బియ్యాన్ని చూపించకుండా తనను ఓడ చుట్టూ తిప్పారని.. అధికారుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోందని.. కాకినాడ పోర్టు కార్యకలాపాల వెనుక పెద్ద స్మగ్లింగ్, మాఫియానే నడుస్తోందని పవన్ వ్యాఖ్యలు చేయడం పవన్ ‘న్యూట్రల్ గేర్’లో భాగమేనని పేర్కొంటున్నారు. తాజాగా కాకినాడ పోర్టులో పర్యటన సందర్భంగా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు అక్కడ లేకపోవడంపై పవన్ మండిపడ్డారు. ఏదైనా సమస్య ఉంటే తన పార్టీకే చెందిన మంత్రి మనోహర్‌తో చర్చించకుండా.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అక్కడకు వెళ్లి హడావిడి చేయాల్సిన అవసరం ఏముందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ ఆయన పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారని గుర్తు చేస్తున్నారు.ఇటీవల హోంమంత్రి అనితను లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు చేయటాన్ని గుర్తు చేస్తున్నారు. తాను తటస్థుడిననే ముద్ర కోసం తాపత్రయపడుతున్నట్టు కలరింగ్ ఇవ్వడంతో పాటు.. రాష్ట్రంలో జరిగే సంఘటనల్లో తన పాత్ర లేదని చెప్పుకోవడానికి ఇలా హైడ్రామాలకు తెరలేపారనే చర్చ జరుగుతోంది.సీజ్ చేసి విడుదల చేసిన పీడీఎస్ బియ్యమే!కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి రెండు రోజుల క్రితం కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి విదేశాలకు స్టెల్లా ఎల్ పనామా నౌకలో ఎగుమతికి సిద్ధం చేసిన 640 టన్నుల బియ్యాన్ని పీడీఎస్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. నౌకలోని ఐదు హేచర్లకు 52 వేల టన్నుల బియ్యం లోడింగ్ సామర్థ్యం ఉండగా 38 వేల టన్నులు లోడింగ్ చేశారు. ఇందులో బాయిల్ రైస్‌తో పాటు 640 టన్నులు పీడీఎస్ ఉన్నట్లు కలెక్టర్ ప్రకటించారు. పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ రెండు నెలల క్రితం సీజ్ చేసిన పీడీఎస్ బియ్యాన్ని బ్యాంక్ గ్యారెంటీ తీసుకుని కొంత విడుదల చేశారు. అలా విడుదల చేసిన పీడీఎస్ బియ్యమే కలెక్టర్ నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో స్టెల్లా ఎల్ పనామా నౌకలో ఉండటం గమనార్హం. పౌరసరఫరాల అధికారి సరెండర్ ఉత్తర్వులుకాకినాడ జిల్లా పౌరసరఫరాల అధికారి ఎంవీ ప్రసాద్‌ను సరెండర్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. పీడీఎస్ బియ్యం వ్యవహారాన్ని సక్రమంగా నిర్వహించనందున ఆయన పౌరసరఫరాలశాఖ కమిషనరేట్‌లో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాక్షి కథనంతో కలకలం..కలెక్టర్ స్వయంగా పోర్టుకు వెళ్లి పరిశీలించాక అదే బియ్యాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కూడా తాజాగా కాకినాడ పోర్టుకు వెళ్లి పరిశీలించారు. తన వెంట ఉన్న కాకినాడ సిటీ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)పై పవన్ అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) చేసిన మిల్లర్లకు ప్రభుత్వం ఇటీవల రూ.200 కోట్లు బకాయిలు విడుదల చేసింది. ఈ బకాయిలు విడుదల చేసినందుకు కూటమికి చెందిన ఒక నేతకు 8 శాతం కమీషన్లు ముట్టినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ‘కమీషన్ల కోసం కపట నాటకం’ శీర్షికన ఈ నెల 27న ‘సాక్షి’ ప్రధాన సంచికలో కథనం వెలువడటం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. -
అబ్బా.. సర్కారు డబ్బా!
2,736 కొత్త బస్సుల కొనుగోలుకు నిర్ణయంరాబోయే మూడేళ్లలో ఆర్టీసీకి 2,736 కొత్త బస్సులు కొనుగోలు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇప్పటికే గత మూడేళ్లుగా ఆర్టీసీ కొత్త బస్సు లను కొనుగోలు చేస్తోంది. ఇప్పుడు కొత్తగా కొనాలని నిర్ణయించిన 2,736 బస్సుల్లో మొదటి దశ కింద 1,500 బస్సుల టెండర్ ప్రక్రియ చేపట్టాం. డిసెంబర్ లేదా జనవరి నుంచి వీటిని.. మిగిలిన వాటిని ఆ తర్వాత దశలవారీగా ప్రవేశపెడతాం. – 2023, మార్చి 7న అప్పటి ఆర్టీసీ ఎండీ హోదాలో ద్వారకా తిరుమలరావు మీడియాకు వెల్లడించిన విషయం సాక్షి, అమరావతి : 2023లో నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం 1,500 కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ చేపట్టింది. టెండర్లు పూర్తిచేసి ఆర్డర్లు కూడా జారీచేసేసింది. బస్సులు కూడా వచ్చేశాయి. వాటిని ప్రారంభించడమే తరువాయి.. ఇంతలో ఎన్నికల కోడ్ వచ్చి బ్రేక్ పడింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. ఇప్పుడా బస్సులను ప్రస్తుత ప్రభుత్వం కేవలం జెండా ఊపి ప్రారంభిస్తోందంతే. కానీ, అంతా తామే చేశామన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం యమా బిల్డప్ ఇస్తోంది. ఈ బస్సుల కొనుగోళ్లలో వీరి పాత్ర పిసరంత కూడా లేకపోయినా తెగ డబ్బా కొట్టుకుంటున్నారు. సొమ్మొకరిది.. సోకొకరిది అన్నట్లుగా ఉంది టీడీపీ కూటమి ప్రభుత్వ తీరు. విషయం ఏమిటంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రస్తుత సర్కారు ప్రారంభిస్తూ అంతా తామే చేశామని గప్పాలు కొట్టుకుంటున్న జాబితాలో ఆర్టీసీ కొత్త బస్సుల ప్రారంభం కూడా చేరింది. టీడీపీ ప్రభుత్వం 1,400 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిందని ఆయన గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ, వాస్తవం ఏమిటంటే.. ఆ బస్సుల కొనుగోళ్లకు సంబంధించి కర్త, కర్మ, క్రియ అంతా వైఎస్సార్సీపీ సర్కారే. ఇప్పుడు వాటిని ప్రస్తుత ప్రభుత్వం కేవలం ప్రారంభిస్తోందంతే. కానీ, ఆ వాస్తవాన్ని మరుగునపెట్టి వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉంది. మూడు దశల్లో 2,906 బస్సుల కొనుగోలు నిజానికి.. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీకి కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ చేపట్టింది. ముందుగా 2019–20లో కొత్త బస్సులు కొనుగోలు చేసింది. పాత బస్సుల స్థానంలో 900 సరికొత్త డీజిల్ బస్సులను ప్రవేశపెట్టింది. తిరుమల–తిరుపతి ఘాట్‌రోడ్డుతో పాటు తిరుపతి సమీప పట్టణాల్లో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టిన ఘనత కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదే. రెండేళ్లపాటు కోవిడ్ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ 2019 నుంచి 2023 మధ్య ఆర్టీసీ మొత్తం 1,406 కొత్త బస్సులను కొనుగోలు చేసింది. ఇక 2023 చివరిలో మరో 1,500 కొత్త డీజిల్ బస్సుల కొనుగోలు ప్రక్రియను చేపట్టింది. టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి ఆర్డర్లు కూడా జారీచేసింది. కాంట్రాక్టు దక్కించుకున్న కంపెనీలు ఎన్నికల ముందు సరఫరా చేశాయి. ఎన్నికల నియమావళి ఉండటంతో గత ప్రభుత్వం ప్రారంభించలేదు. వాటినే ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ప్రారంభిస్తోంది.. అంతే! టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీకి కొత్త బస్సుల కొనుగోలు కోసం ఇప్పటివరకు టెండర్లు పిలవనే లేదు. మరి టెండర్లు పిలవకుండానే కొత్త బస్సులను రెండు నెలల్లో ఎలా కొనుగోలు చేస్తారో ప్రభుత్వం చెప్పాలి. వాస్తవానికి ఈ బస్సులన్నింటికీ టెండర్లు పిలిచి డబ్బులు చెల్లించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ఈ బస్సులకు మహా అయితే ఈ రెండు నెలల కాలంలో తుది మెరుగులుదిద్ది ఉంటారు. ఇప్పుడు వీటికి జెండా ఊపుతూ అదేదో మొత్తం తమ ప్రభుత్వ ఘనతగా చెప్పుకుంటూ టీడీపీ లేబుల్ వేసుకుంటున్న తీరుని చూసి జనం నవ్వుకుంటున్నారు. -
డీజీపీ, పలువురు కమిషనర్ల మార్పు?
సాక్షి, హైదరాబాద్: వరుస ఎన్నికల హడావుడి, కోడ్ ముగియడంతో పాలనపై దృష్టి సారించిన ప్రభుత్వం.. అత్యంత కీలకమైన పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళనకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తనదైన టీంను సెట్ చేసుకోవడంపై సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారని, పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. డీజీపీ, పలువురు పోలీస్ కమిషనర్లు సహా పలు కీలక పోస్టుల్లో ఉన్న అధికారులకు స్థాన చలనం తప్పదనే చర్చ జోరుగా నడుస్తోంది. కీలక బాధ్యతల్లో కొత్త అధికారులను నియమించడంతో పాటు ఇప్పటికే ఒకటికి మించి అదనపు పోస్టులతో పని భారం ఉన్న అధికారులకు ఉపశమనం కలిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఒకట్రెండురోజుల్లోనే ఉత్తర్వులు వెలువడే చాన్స్ ఉందని సమాచారం. శివధర్‌రెడ్డి వైపు సర్కారు మొగ్గు ప్రస్తుతం డీజీపీ (హెచ్ఓపీఎఫ్–హెడ్ఆఫ్ పోలీస్ ఫోర్స్)గా ఉన్న రవిగుప్తా స్థానంలో కొత్త డీజీపీ (హెచ్ఓపీఎఫ్)గా సీనియర్ ఐపీఎస్ అధికారులు సీవీ ఆనంద్, శివధర్‌రెడ్డి, జితేందర్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం డీజీ ర్యాంకులో ఉన్న సీవీ ఆనంద్ అత్యంత కీలకమైన ఏసీబీ డీజీ పోస్టులో ఉన్నారు. డీజీ ర్యాంకులో ఉన్న మరో అధికారి జితేందర్ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం సీనియర్ ఐపీఎస్ శివధర్‌రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అడిషనల్ డీజీ ర్యాంకులో ఇంటిలిజెన్స్ చీఫ్‌గా ఉన్న శివధర్‌రెడ్డిని ఇటీవల ఏర్పడిన రెండు డీజీపీ ర్యాంకు ఖాళీల భర్తీలో భాగంగా పదోన్నతి ఇచ్చి పోలీస్ బాస్‌గా నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరికి డీజీపీలుగా పదోన్నతి ప్రస్తుతం డీజీపీ ర్యాంకులో నలుగురు సీనియర్ ఐపీఎస్‌లు కొనసాగుతున్నారు. వీరిలో రవిగుప్తాతో పాటు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలో అనూహ్యంగా రోడ్డు సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా బదిలీ అయిన అంజనీకుమార్, సీవీ ఆనంద్, జితేందర్ ఉన్నారు. డీజీపీ ర్యాంకులోనే విజిలెన్స్ డీజీగా ఉన్న రాజీవ్‌రతన్ గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యారు.అదేవిధంగా టీఎస్ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్‌గా పనిచేసిన సందీప్ శాండిల్య కొద్దిరోజుల క్రితం పదవీ విరమణ పొందారు. ఇలా రెండు డీజీపీ ర్యాంకులు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా ఉన్న కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, ఇంటిలిజెన్స్ అడిషనల్ డీజీగా ఉన్న శివధర్‌రెడ్డిలకు డీజీపీలుగా పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఆ ముగ్గురు కమిషనర్లు కూడా.. కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిõÙక్ మొహంతి, వరంగల్ కమిషనర్ అంబర్ కిషోర్జా, రామగుండం సీపీ శ్రీనివాసులుకు స్థాన చలనం కలిగే అవకాశం ఉన్నట్టు ప్రచారం ఉంది. ఇంటిలిజెన్స్ ఏడీజీ పోస్టులో ఉన్న శివధర్‌రెడ్డికి డీజీపీగా బాధ్యతలు అప్పగిస్తే ఆ స్థానంలోకి మరో సీనియర్ ఐపీఎస్ అధికారి రమేశ్‌రెడ్డి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అడిషనల్ డీజీగా ఉన్న శిఖా గోయల్ వద్ద కీలక పోస్టులైన సీఐడీ, మహిళా భద్రత విభాగం, టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని ఇతర ఐపీఎస్‌లకు అప్పగించే అవకాశం ఉంది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో అత్యంత కీలకమైన ట్రాఫిక్ అడిషనల్ సీపీ, స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ సీపీ, క్రైమ్స్ అడిషనల్ సీపీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న అధికారులకే అదనపు బాధ్యతలు అప్పగించి కొనసాగిస్తున్నారు. ఆర్గనైజేషన్ ఐజీగా ఉన్న విశ్వప్రసాద్కే మళ్లీ ట్రాఫిక్ అడిషనల్ సీపీ పోస్టును ఇచ్చే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా చాలా జిల్లాల ఎస్పీలు, డీసీపీలు ఎన్నికల బదిలీల్లో భాగంగా పోస్టింగ్‌లు పొందారు. వారిలో కొందరిని ప్రభుత్వం తమ ప్రాధాన్యాల మేరకు బదిలీ చేసి, ఆ స్థానాల్లో కొత్తవారికి బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం.హైదరాబాద్‌కూ కొత్త సీపీ?రాష్ట్రంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సహా మొత్తం 9 పోలీస్ కమిషనరేట్లు ఉన్నాయి. కాగా త్వరలో జరగనున్న బదిలీల్లో ఎక్కువ మంది పోలీస్ కమిషనర్లకు స్థాన చలనం తప్పదనే వార్తలు వస్తున్నాయి. కమిషనర్ల తీరుపై రాజకీయ నాయకులు, సొంత శాఖలోని అధికారులు, సామాన్యుల నుంచి వచ్చిన ప్రతి స్పందనలు ప్రాతిపదికగా తీసుకుని బదిలీలు చేసే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా కొనసాగుతున్న కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో హైదరాబాద్ సీపీ పోస్టుకు టీఎస్ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్న వీసీ సజ్జనార్, రైల్వే, రోడ్డు భద్రత అడిషనల్ డీజీగా ఉన్న మహేశ్ భగవత్, అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న నాగిరెడ్డి పోటీలో ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ కారణంగా రాచకొండ సీపీగా ఉన్న సు«దీర్‌బాబు అనూహ్యంగా బదిలీ కావడంతో ఐజీ తరుణ్ జోషీకి రాచకొండ సీపీగా బాధ్యతలు అప్పగించారు. అయితే సు«దీర్‌బాబు తిరిగి సీపీగా వెళ్లే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మరోవైపు గతంలో ఈ పోస్టులో పనిచేసి, పౌరసరఫరాల కమిషనర్‌గా బదిలీ అయిన డీఎస్ చౌహాన్ పేరు సైతం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. -
రాష్ట్రంలో రూ.483.15 కోట్ల నగదు, సొత్తు స్వాధీనం: ముఖేష్‌కుమార్ మీనా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈనెల 2 వరకు రూ.483.15 కోట్ల విలువైన నగదు ఇతర సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లతోపాటు ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా చేపట్టిన చర్యలను సోమవారం సచివాలయంలో ఆయన మీడియాకు వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా రూ.170 కోట్ల నగదు, రూ.61.66 కోట్ల విలువైన లిక్కర్, రూ.35.97 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.186.17 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.29.34 కోట్ల విలువైన ఉచితాల వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. వీటన్నింటికీ సంబంధించి 11,249 కేసులను, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి 1,270 కేసులను నమోదు చేసినట్లు మీనా తెలిపారు. ఇక ఎన్నికల హింసలో ఇద్దరు మృతిచెందగా 912 మందికి గాయాలయ్యాయన్నారు. ఈ హింస సందర్భంగా రూ.1,19,13,650 కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగిందన్నారు. 1,03,461 మందిని బైండోవర్ చేశామని.. అలాగే, సమస్యలు, అల్లర్లు సృష్టించే 551 మందిని గుర్తించి చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.తొలిసారిగా 1,985 ప్రాంతాల్లో కార్టన్ సెర్చ్..ఇదిలా ఉంటే.. సి–విజిల్ ద్వారా 24,557 ఫిర్యాదులు రాగా అందులో 95 శాతం ఫిర్యాదులను 100 నిమిషాల్లోనే పరిష్కరించినట్లు ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. పోలింగ్ అనంతరం హింసను నివారించేందుకు రాష్ట్రంలో తొలిసారిగా కార్టన్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించామని.. సమస్యాత్మకమైన 1,985 ప్రాంతాలను గుర్తించి అక్కడ సోదాలు నిర్వహించారని ఆయన తెలిపారు. ఇప్పటివరకు 1,200 సోదాలు నిర్వహించడం ద్వారా 4,595 వాహనాలను, 1,269 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు 153 మందిపై కేసులు నమోదుచేశామని ఆయన వివరించారు. పోలింగ్ అనంతరం సమస్యలను, అల్లర్లను సృష్టించే 12,639 మందిని గుర్తించి సీఆర్పీసి కింద బైండోవర్ చేసినట్లు మీనా తెలిపారు. -
ఇప్పట్లో ‘స్థానిక’ ఎన్నికలు లేనట్టేనా?
సాక్షి, హైదరాబాద్: ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణపై సందిగ్థత నెలకొంది. లోక్‌సభ ఎన్నికలు ముగిశాక.. జూన్‌లో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినా ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వపరంగా అడుగులు ముందుకు పడడం లేదనే చెప్పాలి. బీసీ కమిషన్ ఆధ్వర్యంలో జనగణన చేపట్టినా.. స్థానికంగా (క్షేత్రస్థాయిలో) ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో ఇప్పట్లో ఈ ఎన్నికలు జరిగే అవకాశాలు లేవనే ఊహాగానాలు సాగుతున్నాయి. జూన్ 6వ తేదీ వరకు పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉండడంతో ప్రభుత్వం లేదా బీసీ కమిషన్ పరంగా... స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ముందస్తు కార్యాచరణ చేపట్టేందుకు వీలు లేదు. గ్రామపంచాయతీ పాలకమండళ్ల పదవీకాలం ముగిసి ఈ నెలాఖరుకు నాలుగు నెలలు పూర్తికానుండగా... జూలై 4 నాటికి జిల్లా, మండల ప్రజా పరిషత్ పాలకమండళ్ల కాలపరిమితి కూడా ముగియనుంది. అదేవిధంగా వచ్చే ఏడాది మొదట్లో వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకమండళ్ల పదవీకాలం పూర్తికానుంది. ఈ నేపథ్యంలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం చర్చనీయాంశమవుతోంది. బీసీలకు 42% స్థానిక రిజర్వేషన్లపై హామీఅసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని చెప్పడంతో పాటు ఉపకులాల వారీగా కూడా రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచి్చంది. ఈ మేరకు బీసీ కమిషన్ నుంచి నివేదిక తెప్పించుకుంటామని ప్రకటించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు, ఇతర గ్రూపులకు రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు గతంలోనే ‘ట్రిపుల్ టెస్ట్’ పేరిట మార్గదర్శకాలు నిర్దేశించింది. మొత్తంగా రిజర్వేషన్లు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కలిపి) 50 శాతానికి మించకుండా ఉండాలని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల పరిధిలో ఆయా గ్రూపుల వెనుకబాటుపై బీసీ కమిషన్ ద్వారా విచారణ జరపాలని, ఏయే నిష్పత్తిలో రిజర్వేషన్లు ఇవ్వాలనే దానిపై తేల్చాలని సుప్రీం పేర్కొంది. ఈ నేపథ్యంలో బీసీ కమిషన్ విచారణ జరిపి తుది నివేదిక ఇస్తే దాని ఆధారంగానే పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కొత్తగా రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశముంది. బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ఆధ్వర్యంలో ట్రిపుల్ టెస్ట్ మేరకు క్షేత్రస్థాయి పరిశీలనలు ఇప్పటికే పూర్తిచేసినట్టు తెలుస్తోంది. కొత్త ఓటర్ల జాబితా (లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వెలువరించిన జాబితా) ప్రాతిపదికన పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలను నోడల్ ఏజెన్సీలుగా నియమించి.. ఓటర్ల జాబితా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఓటర్ల వివరాలను సేకరించాలని బీసీ కమిషన్ భావిస్తున్నట్టు కమిషన్ వర్గాల సమాచారం. అయితే ఇప్పుడు ఓటర్ల లిస్ట్‌కు అనుగుణంగానా? లేక క్షేత్రస్ధాయిలో చేపట్టే సామాజిక, ఆర్థిక, కుల సర్వే ఆధారంగా ముందుకెళ్లాలా అనే దానిపై స్పష్టత కొరవడినట్టు సమాచారం. ఈ కసరత్తు జరిగితే...ఆగస్ట్, సెప్టెంబర్‌లో ఎన్నికలు? ఓటర్ల జాబితాకు అనుగుణంగా అయితే పెద్దగా శ్రమ లేకుండా త్వరగానే క్షేత్రస్థాయిలో ఆయా సామాజికవర్గాల జనాభా వివరాలు తేల్చవచ్చునని, సామాజిక, ఆర్థిక కుల సర్వే అయితే ఇంకా సమయం ఎక్కువ పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటర్ల జాబితా ప్రకారం కసరత్తు పూర్తిచేసి ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించుకోవచ్చుననే సూచనలను రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ కమిషన్ ద్వారా వెళ్లినట్టుగా తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అంటున్నారు. ఒకవేళ ఈ ఆలోచనకు ప్రభుత్వపెద్దలు ఓకే చెబితే రిజర్వేషన్ల ఖరారు పూర్తిచేసి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)కు పంపిస్తే ఆగస్ చివర్లో లేదా సెప్టెంబర్‌లో ముందుగా గ్రామపంచాయతీ ఆ తర్వాత జిల్లా, మండలపరిషత్ ఎన్నికల నిర్వహణకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది మొదట్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహించుకోవచ్చుపనని అభిప్రాయపడుతున్నారు. కొత్త కమిషన్ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారా? ఈ ఆగస్టుతో బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీకాలం కూడా ముగియనుంది. ఈ పరిస్థితుల్లో పాత కమిషన్ ఆధ్వర్యంలోనే బీసీ జనగణన కసరత్తును పూర్తిచేసి ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు వెళుతుందా ? లేక కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసుకునే బీసీ కమిషన్ ద్వారానే ఈ కార్యాచరణను నిర్వహిస్తారా అన్నది కూడా అధికారవర్గాల్లో చర్చకు వస్తోంది. ఆగస్ట్‌లో కొత్తగా బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించాక... బీసీ జనగణనకు సంబంధించిన కార్యక్రమం చేపట్టాలని భావిస్తే మాత్రం ఈ ఎన్నికల నిర్వహణ ఇంకా ఆలస్యం కావొచ్చునని భావిస్తున్నారు. దీనిని బట్టి ఈ ఎన్నికలు ఏడాది చివరి వరకు వెళ్లొచ్చుననే ఊహాగానాలు సాగుతున్నాయి. దీంతో ఏ ఎన్నికలు ముందు జరుగుతాయి ? ముందుగా జీపీ ఎన్నికలుంటాయా లేక జడ్పీటీసీ, ఎంపీటసీ ఎలక్షన్లు మొదట నిర్వహిస్తారా? లేక ఈ ఏడాది చివర్లో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకటి తర్వాత మరొకటి వరుసగా నిర్వహిస్తారా అన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే... తొలుత జీపీ ఆ తర్వాత 10, 15 రోజులకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. -
ధ్యానం చేస్తూ ఎవరైనా కెమెరా తీసుకెళ్తారా?: మమత
బారూయ్‌పూర్(పశి్చమబెంగాల్): వివేకానంద శిలాస్మారకం వద్ద ప్రధాని మోదీ చేయబోయే ధ్యానంపై టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ అనుమానం వ్యక్తంచేశారు. మంగళవారం పశి్చమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్ నియోజకవర్గంలో టీఎంసీ ఎన్నికల ప్రచార ర్యాలీలో మమత ప్రసంగించారు. ‘‘ మేం ఖచి్చతంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేస్తాం. ఆయన ధ్యానం చేసుకోవాలనుకుంటే చేసుకోమనండి. కానీ ఆయన మెడిటేషన్ చేస్తున్నపుడు టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారాలు చేస్తే ఒప్పుకోం. ధ్యానం చేసేందుకు వెళ్తూ ఎవరైనా కెమెరా వెంట తీసుకెళ్తారా?’’ అని అన్నారు. -
కోడ్ ఉల్లంఘనే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన 48 గంటల ధ్యానంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ఏడో విడత పోలింగ్ ముందు ప్రధానమంత్రి ధ్యానం చేయడం ముమ్మాటికీ ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ ధ్యాన మండపంలో గురువారం నుంచి రెండు రోజులపాటు మోదీ ధ్యానం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని టీవీ మీడియాలో ప్రసారం చేయకుండా, ప్రింట్ మీడియాలో ప్రచురించకుండా చర్యలు తీసుకోవాలని బుధవారం ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేతలు రణదీప్ సూర్జేవాలా, అభిõÙక్ సింఘ్వీ, సయీద్ నజీర్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. -
ప్రపంచంతో పోటీపడేలా కొత్త పారిశ్రామిక పాలసీలు
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామికాభివృద్ధికి సంబంధించిన ఆరు కొత్త పాలసీలకు ఎన్నికల కోడ్ ముగిసేలోగా తుదిరూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) కార్యకలాపాలపై మంగళవారం పరిశ్రమల శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సూక్ష్మ, లఘు పరిశ్రమల కోసం ఎంఎస్ఎంఈ విధానం, ఎగుమతుల విధానం, నూతన లైఫ్‌సైన్సెస్, మెడికల్ టూరిజం, ఈవీ, గ్రీన్ ఎనర్జీ పాలసీలను కొత్తగా రూపొందిస్తున్నట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. గత సమీక్షా సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, పనుల్లో పురోగతికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. కొత్త పాలసీల రూపకల్పన క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉత్తమ పాలసీలపై అధ్యయనం చేయాలని చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేలా ఈ నూతన విధానాలు ఉండాలన్నారు. నేత, వస్త్ర పరిశ్రమకు సంబంధించి రాష్ట్రంలోని పవర్లూమ్, చేనేత కారి్మకులకు ఉపయోగపడేలా విధానాలను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. -
‘కోడ్’ పోగానే పందేరం!
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ మరోమారు నామినేటెడ్ పదవుల పందేరానికి సిద్ధమవుతోంది. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ముందు 37 మంది పార్టీ నేతలను పలు కార్పొరేషన్ చైర్మన్ పదవులకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధిష్టానం అనుమతితో రెండో జాబితాను కూడా సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇందులో 17 మందికి చాన్స్ ఇవ్వనున్నట్టు గాంధీభవన్ వర్గాల సమాచారం. తొలిదఫాలో అవకాశం దక్కిన 37 మంది, ఈ 17 మంది కలిపి.. ఒకేసారి పదవీబాధ్యతలు తీసుకునేలా ఏర్పాట్లు చేసే యోచనలో సీఎం రేవంత్ ఉన్నారని తెలిసింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మలి దఫా జాబితాను ప్రకటిస్తారని సమాచారం. ఎవరెవరికన్న దానిపై కాస్త స్పష్టత తొలిదఫా నామినేటెడ్ పదవుల్లో పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో క్రియాశీలకంగా పనిచేసిన నాయకులు, టికెట్లు ఆశించి దక్కని వారికి అవకాశం ఇచ్చారు. రెండో దఫాలో కూడా ఇదే తరహాలో పదవులు ఇవ్వనున్నట్టు తెలిసింది. తొలి దఫాలో పీసీసీ అనుబంధ విభాగాల్లో.. చేనేత, ఎక్స్ సరీ్వస్‌మన్, సేవాదళ్‌లకు అవకాశం రాలేదు. దీంతో రెండో జాబితాలో ఈ విభాగాలకు చెందిన నేతలకు నామినేటెడ్ పదవులు దక్కుతాయని సమాచారం. వారితోపాటు ఆరేడుగురు పార్టీ జిల్లా అధ్యక్షులు, మరో ఇద్దరు యూత్ కాంగ్రెస్ నేతల పేర్లను ఖరారు చేసినట్టు సమాచారం. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి దక్కని కొందరికి ఈ జాబితాలో చాన్స్ ఇవ్వనున్నట్టు తెలిసింది. రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన మైనార్టీ నేతల్లో కీలకమైనవారికి ఇప్పటికే నామినేటెడ్ పదవులు రాగా.. రెండో దఫాలో బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు గాం«దీభవన్ వర్గాలు చెప్తున్నాయి. జూన్ 6వ తేదీన లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగియనుంది. తర్వాత కొన్నిరోజుల్లోనే గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసిన నాలుగైదు రోజుల్లోనే రెండో దఫా నామినేటెడ్ జాబితా విడుదల, అందరి పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమాలు ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. రైతు, విద్యా కమిషన్లు కూడా.. వ్యవసాయం, విద్యా రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని.. ఈ క్రమంలో రాష్ట్రంలో రైతు, విద్యా కమిషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తోందని గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. ఈ కమిషన్ల ఏర్పాటు విషయంలో కూడా సీఎం రేవంత్ ఓ అభిప్రాయానికి వచ్చారని అంటున్నాయి. రెండో దఫా నామినేటెడ్ జాబితాతోపాటు ఆ రెండు కమిషన్ల నియామకం కూడా చేపట్టాలని భావిస్తున్నారని పేర్కొంటున్నాయి. రైతు కమిషన్ చైర్మన్‌గా ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు ఎం. కోదండరెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిలను నియమించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాయి. వ్యవసాయ, విద్యా శాఖలకు అనుబంధంగా పనిచేస్తూ.. కీలక అంశాల్లో సలహాలు, సూచనలు ఇచ్చే దిశగా ఆ కమిషన్లు పనిచేస్తాయని నేతలు అంటున్నారు. ముఖ్యంగా నకిలీ విత్తనాల నిర్మూలన, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ వంటి కీలక అంశాల్లో అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తాయని చెప్తున్నారు. పోటీ చేసి ఓడినవారికి లేనట్టే! గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిన వారికి మలి దఫా నామినేటెడ్ పదవుల్లో కూడా స్థానం దక్కదని తెలుస్తోంది. ఈ విషయంలో స్పష్టమైన అభిప్రాయంతో ఉన్న రేవంత్‌రెడ్డి.. ఎన్ని విజ్ఞప్తులు, ఒత్తిళ్లు వచ్చినా తొలిదఫాలో అలాంటి వారికి అవకాశం కల్పించలేదు. ఇటీవల తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సందర్భంగా కూడా ఆయన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన నాయకులు ఆయా నియోజకవర్గాలకు ఇన్చార్జులుగా మాత్రమే కొనసాగుతారని, ఎలాంటి నామినేటెడ్ పదవుల్లో వారికి అవకాశం ఉండదని గాం«దీభవన్ వర్గాలు చెప్తున్నాయి. -
కేబినెట్ భేటీ వాయిదా
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ, తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణ, మేడిగడ్డ బ్యారేజీకి అత్యవసర మరమ్మతుల నిర్వహణ వంటి పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవడా నికి వీలుగా శనివారం ప్రభుత్వం నిర్వహించతల పెట్టిన మంత్రివర్గ సమావేశం అనివార్య పరిస్థి తుల్లో వాయిదా పడింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కేబినెట్ భేటీ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిని రాష్ట్ర సర్కారు కోరింది. కానీ ఈసీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమావేశాన్ని వేయిదా వేసినట్టు శనివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పాలనపై దృష్టి పెడతామన్న సీఎంరాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ ముగియగా, వచ్చే నెల 4న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. మార్చి 15న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన మరుక్షణమే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇది జూన్ 6తో ముగియనుంది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్రంలో రెండు నెలలుగా పాలన వ్యవహారాలు స్తంభించిపోయాయి. సీఎం, మంత్రుల రోజువారీ అధికారిక సమీక్షలు, సమావేశాలు బంద్ అయ్యా యి. ఈ నేపథ్యంలో 13న పోలింగ్ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పాలన వ్యవహారాలపై మళ్లీ పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే కేబినెట్ భేటీ నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్లిన రాష్ట్ర మంత్రులు కేబినెట్ భేటీ కోసం హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశారు. ఒడిశా నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ముంబై నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాయ్‌బరేలి నుంచి సీతక్క నగరానికి చేరుకున్నారు. ఏక్షణంలోనైనా ఈసీ అనుమతి లభించవచ్చనే ఉద్దేశంతో శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సచివాలయంలో వేచిచూశారు. రాత్రి 7 గంటల వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేసింది. ఒకపక్క ఈసీ అనుమతి కోసం నిరీక్షిస్తూనే సీఎం రేవంత్‌రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత సీఎం, మంత్రులు సచివాలయం నుంచి వెళ్లిపోయారు. ఎజెండాలో కీలక అంశాలుజూన్ 2తో రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తికా నున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణల మధ్య అపరిష్కృతంగా ఉండి పోయిన విభజన వివాదాలు, ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీకి అవసరమైన నిధుల సమీకరణ, ధాన్యం కొను గోళ్లు, రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి గాను మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అలాగే కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీతో పాటు అన్నారం బ్యారేజీల మరమ్మ తులు, ఈ విషయమై నిపుణుల కమిటీ సమర్పించిన మధ్యంతర నివేదికలోని సిఫారసుల అమలుపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోవాలని అనుకుంది. స్కూళ్లు, కాలేజీల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కానీ ఈసీ అనుమతించకపోవడంతో ఇందుకు అవకాశం లేకుండా పోయింది. అవసరమైతే ఈసీని కలుస్తాం: సీఎం రేవంత్ఎన్నికల సంఘం నుంచి ఎప్పుడు అనుమతి వస్తే అప్పుడు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. సోమవారం వరకు ఈసీ నుంచి అనుమతి రానిపక్షంలో, అవసరమైతే మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని ఆయన తెలిపారు. అప్పటికీ ఈసీ సానుకూలంగా స్పందించని పక్షంలో జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే కేబినెట్ భేటీ నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. ఈసీ నుంచి స్పందన లేకపోవటంతో రైతుల సంక్షేమం, ఇతర అత్యవసర అంశాలపై చర్చించలేకపోయామని సీఎం పేర్కొన్నారు. -
వీడిన గందరగోళం.. సాయంత్రం కేబినెట్ భేటీ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మంత్రిమండలి సమావేశ నిర్వహణపై గందరగోళం వీడింది. ఇవాళ భేటీ ఉంటుందని రెండ్రోజుల కిందటి సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించగా.. సీఎం కార్యాలయం నుంచి మంత్రులకు ఇప్పటిదాకా అధికారిక సమాచారం వెళ్లకపోవడంతో ఉంటుందా? ఉండదా? అనే చర్చ నడిచింది. చివరకు సాయంత్రం భేటీ ఉంటుందని తెలుస్తోంది. కీలకమైన అంశాలపై తెలంగాణ మంత్రి మండలిలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని సీఎం రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగానే తెలంగాణ కేబినేట్ సమావేశం పై తర్జనభర్జన కొనసాగింది. మరోవైపు ఇప్పటికే కేబినేట్ భేటీలో చర్చించే అంశాలు ఇవేనంటూ సీఎంవో కొన్ని అంశాలను మీడియాకు విడుదల చేసింది. తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలురుణమాఫీ నిధుల సమీకరణ పై నిర్ణయంధాన్యం కొనుగోళ్లు , ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చరాష్ట్ర ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై చర్చమేడిగడ్డ, అన్నారం బ్యారేజీల కు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక ఆధారంగా చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చకొత్త విద్యా సంవత్సరం లో చేపట్టవలసిన చర్యలపై చర్చకేబినెట్ భేటీ నిర్వహణ కోసం ఎన్నికల సంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం అనుమతి కోరినట్లు సమాచారం. అయితే అనుమతి దొరికిందా? లేదా? అనే స్పష్టత రాలేదు. ఈలోపే సాయంత్రం 4గం. కేబినెట్ భేటీ ఉంటుందని మీడియాకు సీఎంవో సమాచారం అందించింది. -
మాఫీకి మార్గం చూడండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్ ముగిసేలోపు రుణమాఫీకి అవసరమైన నిధులను సమీకరించేందుకు ఉన్న మార్గాలపై చర్చించారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీకి సంబంధించిన విధి విధానా లతో ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. బుధవారం సచివాలయంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, తన సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయండి‘రైతుల సంక్షేమానికి అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీకి సరిపడా నిధులను సర్దుబాటు చేయాలి. రైతులను రుణ విముక్తులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున, నిర్ణీత గడువులోగా నిధులను సమీకరించే ప్రయత్నాలు పూర్తి చేయాలి. భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలి. రైతు రుణమాఫీకి సంబంధించి మహారాష్ట్ర, రాజస్తాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలి..’ అని రేవంత్ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి‘ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి. దళారుల జోక్యం లేకుండా చూడాలి. రైతు నుంచి పంటను కొని మిల్లింగ్ చేసి రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలి. వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలి. కల్లాల వద్ద రైతులు ఇబ్బంది పడకుండా త్వరగా ధాన్యం కొనాలి. తడిసిన ధాన్యం, తేమ విషయంలో రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలి. అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై ఉక్కు పాదం మోపాలి..’ అని సీఎం ఆదేశించారు. -
ఓటు వేయకపోతే ఆ దేశాల్లో ఎలాంటి శిక్షలు విధిస్తారో తెలుసా!
ఓటరా..! ఓటు వేయడం మీ బాధ్యత! అంటూ ఎలక్షన్ కమిషన్ ప్రజలను చైతన్యపరుస్తుంది. పైగా మొబైల్ ఫోన్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే యత్నం కూడా చేస్తోంది.. అంతేగాక టీవీ, సామాజిక మాధ్యమాలతో సహా ప్రజలను ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నారు. అలాగే "దేవుడు హుండీలో డబ్బులు వేయడం కాదు! దేశం కోసం ఓటు వేయడం నేర్చుకో!, ప్రజాస్వామ్య వేడుకలో పాలుపంచుకోవడం మన కర్తవ్యం వంటి మాటలతో ఓటర్లను చైతన్యపరుస్తున్నారు. ఇంతలా చేసినా చాలా వరకు ముఖ్యంగా విద్యావంతులే ఈ ఓటు హక్కు వినియోగించుకోవడం లేదని పలు సర్వేల్లో వెల్లడయ్యింది కూడా. అయితే ఇలా ఓటు హక్కుని వినియోగించకపోతే కొన్ని దేశాల్లో అధికారులు అస్సలు ఊరుకోరట. చాలా దారుణమైన శిక్షలు విధిస్తారట. అవేంటో తెలుసుకుందామా.!బెల్జియంఇక్కడ వరుసగా నాలుగుసార్లు ఓటు వేయకపోతే పదేళ్ల వరకు ఓటు హక్కుండదు. మొదటిసారి వేయకపోతే రూ.4 వేలు, రెండోసారికి రూ.10వేలు జరిమానా వేస్తారు. ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కోల్పోతారు. దీంతో 96 శాతం ఓటింగ్ నమోదవుతుంది. ఆస్ట్రేలియాఇక్కడ జరిమానా విధానాన్ని అనుసరిస్తున్నారు. ఓటు వేయకపోతే వారం రోజుల్లో జరిమానా చెల్లించాలనే నిబంధన ఉంది. దీంతో ఇక్కడ 98 శాతం పోలింగ్ నమోదవుతోంది.సింగపూర్ఈ దేశంలో ఓటు వేయకపోతే ఓటరు జాబితా నుంచి పేరు తీసేస్తారు. కారణాలను పూర్తి ఆధారాలతో, పెద్దల సంతకంతో అందిస్తేనే ఆ వ్యక్తుల ఓటుహక్కు పునరుద్ధరిస్తారు. దీంతో 92 శాతం నమోదవుతుందిగ్రీస్ఇక్కడ ఏకంగా ఓటు వేయని వారికి డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు ఇవ్వరు. బలమైన కారణాలు చూపితే తప్ప వాటిని పునరుద్ధరించరు. ఇతర సౌకర్యాలపైనా ఆంక్షలు విధిస్తారు. ఇక్కడ 94శాతం ఓటింగ్ నమోదవుతుంది..(చదవండి: పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!) -
అప్పుడూ ఇప్పుడూ 'అంతే'
సాక్షి, అమరావతి: పేదలంటే ఏమాత్రం పట్టని టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పదం వింటేనే అగ్గిమీద గుగ్గిలమవుతారు. ఇక వారికి ఏదైనా మేలు జరిగితే.. గుండెలు బాదుకోవడం.. గగ్గోలు పెట్టడం.. పెడబొబ్బలు.. ఆర్తనాదాలే. పుట్టుకతో సహజసిద్ధంగా ఆయనకు అబ్బిన ఈ లక్షణాలు ఇప్పుడు మరీ వికృతరూపం దాల్చి కరాళ నృత్యం చేస్తున్నాయి. పేదలకు అందాల్సిన పథకాలను ఎన్నికల కోడ్ ముసుగులో ఎన్నికల సంఘం ద్వారా అడ్డుకోవడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అసలు ఎన్నికల కోడ్ లేని సమయంలోనే పేదల చదువుల కోసం సీఎం వైఎస్ జగన్ సర్కారు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెడితే దానిపై ‘పచ్చ’ముఠా పెట్టిన గగ్గోలు అంతాఇంతా కాదు. ఆ విధానాన్ని అమలుచేయకుండా చేయని కుట్రలులేవు. అలాగే, అప్పట్లో పేదలకు ఇళ్ల స్థలాల కోసం భూములను సేకరిస్తే వాటిపైనా న్యాయస్థానాలకు వెళ్లి అడ్డుకుంది. ఆఖరికి అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందంటూ తమ పెత్తందారీ ధోరణిని ప్రదర్శించింది. ఇలా రాష్ట్రంలో అనేక జిల్లాల్లో పేదలకు ఇళ్ల స్థలాలివ్వకుండా కోర్టుల్లో కేసులు వేసింది. కానీ, సీఎం జగన్ సర్కారు వీటన్నింటినీ ఛేదించుకుని తన యజ్ఞాన్ని నిర్వఘ్నంగా కొనసాగించింది. ఇందుకు సుప్రీంకోర్టుకూ వెళ్లి పచ్చ మాఫియాపై విజయం సాధించింది. కానీ, ఎల్లో గ్యాంగ్ ఇప్పుడు ఎన్నికల కోడ్‌ను అడ్డుపెట్టుకుని వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు వలంటీర్లు ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయకుండా అడ్డుకుంది. దీంతో మండుటెండల్లో వృద్ధులు, వికలాంగులు సచివాలయాల చుట్టూ, బ్యాంకులు చుట్టూ తిరిగేలా చేసి అనేకమంది మృతికి ఈ పెత్తందార్లు కారణమయ్యారు. తమ రాజకీయాల కోసం వృద్ధులు, వికలాంగుల ప్రాణాలుపోయినా పర్వాలేదనే ధోరణిలో చంద్రబాబు బ్యాచ్ వ్యవహరించింది.ఎప్పటినుంచో కొనసాగుతున్న పథకాలకూ బ్రేకులు..నిజానికి.. ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ అన్నది కొత్త కార్యక్రమమేమీ కాదు. ఎప్పటి నుంచో వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి సూర్యోదయంలోపే వైఎస్సార్ పెన్షన్ కానుకను అందిస్తున్నారు. ఇలా కొనసాగుతున్న విధానానికి ఎన్నికల కోడ్ వర్తించకపోయినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘానికి బాబు బృందం ఫిర్యాదు చేసి వృద్ధులు, వికలాంగులు, వితంతవులును రోడ్డుపాల్జేసింది. అలాగే.. పేద విద్యార్థుల చివరి త్రైమాసికం విద్యాదీవెన, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందకుండా చేసింది. అసలివి ఎప్పటినుంచో కొనసాగుతున్న డీబీటీ పథకాలే. లబ్ధిదారులు సైతం పాత వారే తప్ప కొత్తగా ఎవ్వరినీ ఎంపిక చేయలేదు. అయినాసరే, చంద్రసేన ఒత్తిడితో పోలింగ్ పూర్తయ్యే వరకు ఇవి చెల్లించవద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. వాస్తవానికి.. 2023లో కరువు కారణంగా పంటలు కోల్పోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడమనేది ఇప్పటికే కొనసాగుతున్న ప్రక్రియే. చంద్రబాబు కుట్రల కారణంగా.. కరువుతో పంటలు కోల్పోయిన రైతులు ఇప్పుడు ఖరీఫ్‌లో విత్తనాల కొనుగోళ్లకు, ఇతర ఖర్చులకు డబ్బుల్లేక అప్పులు పాలవుతారనే కనీస ఆలోచన కూడా లేకుండా రైతులపట్ల కర్కశంగా, నిర్దయగా వ్యవహరించింది. ఇలా బాబు నిర్వాకంతో రాష్ట్రంలో 6,95,897 కరువు బాధిత రైతులకు చెల్లించాల్సిన రూ.847.22 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులు నిలిచిపోయాయి.తెలంగాణలో ఓకే.. ఏపీలో మాత్రం నో..కానీ, తెలంగాణలో వర్షాలతో పంటలు కోల్పోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించేందుకు అనుమతించిన కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో మాత్రం ‘నో’ చెప్పింది. ఈ విషయంలో ఏపీపట్ల ఎన్నికల సంఘం వివక్ష చూపిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే, పేద విద్యార్థుల పెద్ద చదువులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ గత ఐదేళ్ల నుంచి విద్యాదీవెన పథకం కింద డీబీటీ రూపంలో బటన్‌నొక్కి ప్రభుత్వం చెల్లిస్తూ వస్తోంది. విద్యాదీవెన కింద చివరి విడత కిస్తీని ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే ప్రభుత్వం ప్రారంభించింది. ఇది కూడా ఇప్పటికే కొనసాగుతున్న పథకం అయినప్పటకి చంద్రబాబు బృందం ఒత్తిడితో ఎన్నికల సంఘం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.610.79 కోట్ల విద్యాదీవెన చెల్లింపులను నిలుపుదల చేసింది. విద్యార్థులు కాలేజీలకు ఫీజులు చెల్లించకపోతే సర్టిఫికెట్లు ఇవ్వరనే కనీస జ్ఞానం కూడా లేకుండా రాజకీయానికే బాబు బ్యాచ్ ప్రాధాన్యతనిచ్చింది. దీంతో అప్పులుచేసి పేద విద్యార్థులు ఫీజులు చెల్లించే స్థితికి బాబు తీసుకొచ్చారు.‘చేయూత’ నిధులకూ చెక్..ఇక మరోపక్క.. పేద అక్కచెల్లమ్మలకు ‘చేయూత’ కింద ఆఖరి విడత నిధులను ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే ప్రారంభించినప్పటికీ బాబు బృందం ఒత్తిడితో ఆ నిధుల చెల్లింపులకూ ఎన్నికల సంఘం మొకాలడ్డింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు పేద మహిళల జీవనోపాధికి సాయం అందించే ‘చేయూత’ పథకం అమలు కూడా ఎప్పుడో ప్రారంభమైంది. ఇప్పటికే మూడు విడతల్లో ప్రభుత్వం అమలుచేసింది కూడా. ఇప్పుడు చివరి విడత కింద 29 లక్షల మంది పేద మహిళలకు సాయం అందాలి. దీనికి కూడా బాబు బృందం ఒత్తిడితో కేంద్ర ఎన్నికల సంఘం బ్రేకులు వేసింది. గత ఐదేళ్ల నుంచి కొనసాగుతున్న పథకాలను ఎన్నికల కోడ్ సాకుతో చంద్రబాబు కోటరీ పెత్తందారీ పోకడలతో అడ్డుకోవడం ద్వారా పేద విద్యార్థులు, రైతులు, మహిళల పొట్టకొట్టి తమ వికృతరూపాన్ని ఆ ముఠా చాటుకుంది. -
వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
సాక్షి, అమరావతి: అధికారం, అవినీతి మరిగిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ రెండూ లేక, ఇక దొరకవని తేలిపోవడంతో మతి చెడింది. ఈసారీ అధికారం దక్కదన్న అక్కసు, తీవ్ర అసహనం ఈ వృద్ధ నాయకుడిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మైకు దొరికితే చాలు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కారు కూతలు కూస్తున్నారు. తిట్లే ప్రధానాంశంగా మాట్లాడుతున్నారు. అనకూడని నిందలేస్తూ తనలోని ఓటమి భయాన్ని బయటపెట్టుకుంటున్నారు.రోజురోజుకు నీచ స్థాయికి దిగజారిపోతున్నారు. మతి పూర్తిగా చెడిపోయి, గతి తప్పి బజారు భాషకు దిగిపోయారు. నోరు తెరిస్తే తిట్ల పురాణం, బూతుల దండకమే. సీఎం వైఎస్ జగన్‌ను కొట్టండి.. తిట్టండి అంటూ మొదలైన ఆయన ప్రచారం.. ఇప్పుడు చంపండి.. నరకండి అనే స్థాయికి దిగజారిపోయింది. సీఎం వైఎస్ జగన్నే కాకుండా, ఆయన కుటుంబాన్ని, చివరకు అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలను కూడా విచక్షణ మరిచి దూషిస్తున్నారు.ఎన్నికల నిబంధలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తూ పదే పదే అనకూడని మాటలు అంటున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్ల సీఎంనని చెప్పుకొంటూనే, ఆ హుందాతనమేదీ తనలో లేదని, ఉన్నదల్లా నీచ మనస్తత్వమేనని వేదికల మీదే బహిరంగ ప్రదర్శన చేస్తున్నారు. ఇలా గతి తప్పి మాట్లాడటం ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధం. అయినా చంద్రబాబు కారు కూతలను ఎన్నికల సంఘం (ఈసీ) వినీ విననట్టు ఊరుకోవడమూ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.అన్ని ప్రయత్నాలూ విఫలమై..ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్లు, విభజిత ఏపీకి ఐదేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు చేసిన మేలు చెప్పుకోవడానికి ఒక్కటీ లేదు. వెన్నుపోట్లు, మోసాలు, అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు తప్ప. దీంతో ఎన్నికలు మొదలైనప్పటి నుంచి సీఎం వైఎస్ జగన్ పైన, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంపై బురద చల్లడానికి, ప్రజలను పక్కదారి పట్టించి, ఓట్లు దండుకోవడానికి బాబు పన్నిన కుట్రలన్నీ విఫలమయ్యాయి. పింఛన్లు, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై పన్నిన కుట్రలు పారలేదు.అవి బూమరాంగై తిరిగి ఆయనకే గట్టిగా తగిలాయి. టీడీపీ ఓటమిని నిర్ధారించాయి. అంతకు ముందు కూడా ప్రభుత్వంపై అనేక అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మలేదు. రోజురోజుకూ ఆయనే దోషిగా ప్రజల ముందు నిలబడాల్సిన పరిస్థితి వస్తోంది. మరోపక్క ఓటమి భయం ఆయనలో అణువణువునా వ్యాపించింది. కంటి ముందు అవినీతి కేసులు దయ్యాల్లా కనిపిస్తున్నాయి. దీంతో వణికిపోతున్న ఈ వయసు మళ్లిన వెన్నుపోటు వీరుడు నోటికి పని చెప్పారు. ఇలా ఉంటుంది.. చంద్రబాబు తీరుచంద్రబాబు నక్క వినయం, తోడేలు దాడి ఎలా ఉంటాయో సోమవారం అనకాపల్లిలో జరిగిన ప్రధాని మోదీ సభే చెబుతోంది. ఈ సభలో ప్రధాని ఉన్నంతవరకు చంద్రబాబు అత్యంత జాగ్రత్తగా మెలిగారు. ఆయన వెళ్లీ వెళ్లగానే మైకందుకున్న చంద్రబాబు పూనకం వచ్చిన వాడిలా ఊగిపోయారు. సీఎం వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులను తూలనాడుతూ, బూతులు తిడుతూ రెచ్చిపోయారు. ‘జగనన్న భూహక్కు అంట.. నీ తల్లి మొగుడిచ్చాడా.. మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా.. మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా.. జేజే తాత ఇచ్చాడా.. ఎవడిచ్చాడు’ అంటూ వినే వారికి రోత పుట్టించారు. మహిళలు చెవులు మూసుకునేలా చేశారు. ఆదివారం జరిగిన సభల్లోనూ ఇలాగే తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. అంతకు ముందూ ఆయన ముఖ్యమంత్రిపై దాడులు చేయాలని, ఆయన్ని కొట్టాలంటూ మాట్లాడారు. తాడికొండ సభలో సీఎంను రాయితో కొట్టాలని కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. సీఎంను దున్నపోతు అంటూ తన అక్కసు వెళ్లగక్కారు. ఈ వ్యాఖ్యల తర్వాతే సీఎం జగన్‌పై విజయవాడలో రాయి దాడి జరిగింది. ఆ తర్వాత ఆయన మాటలు దాడుల నుంచి చంపండి అనే వరకు సాగాయి. సీఎంను గాజు గ్లాసు తీసుకుని పొడవమంటూ ఓ సభలో విచక్షణ మరిచి అనడంతో పక్కనున్న నేతలే ఆశ్చర్యపోయారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాళెం సభలో సీఎంను చంపితే ఏమవుతుంది అని మాట్లాడి దిగజారడంలో తనకు ఎవరూ సాటి రారని నిరూపించుకున్నారు. సీఎం జగన్‌పై కట్టలు తెగే స్థాయిలో అసూయ, ద్వేషాలను చంద్రబాబు వెళ్లగక్కుతుండడం చర్చనీయాంశంగా మారింది.ఇదేమి తీరు ఈసీ?చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ఇష్టానుసారం నోరు పారేసుకుంటున్నా ఎన్నికల సంఘం మౌనం వహిస్తుండటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. బహిరంగ వేదికలపై సీఎంను కొట్టండి, గాజు గ్లాసుతో పొడవండి, చంపితే ఏమవుతుంది అంటూ పిలుపునిస్తూ కార్యకర్తలను రెచ్చగొడుతున్నా ఈసీకి వినపడటంలేదా? ఈసీ ఎందుకు మౌనం వహిస్తోంది? తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకొని, 48 గంటల పాటు ఆయన ప్రచారంపై నిషేధం విధించింది.ఏపీలో చంద్రబాబు సభా వేదికలపై ఎంతలా వీరంగం వేస్తున్నా, సీఎం జగన్ కుటుంబ సభ్యులను, మహిళలను కూడా దూషిస్తున్నా, చంపాలని బహిరంగంగానే కార్యకర్తలను రెచ్చగొడుతున్నా పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరమే. తెలంగాణలో అయితే ఒకలా, ఏపీలో అయితే మరోలా ఈసీ తీరు ఉంటుందా? తెలుగుదేశం పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో పొత్తు పెట్టుకొన్నంత మాత్రాన చంద్రబాబు వ్యాఖ్యల విషయంలో ఈసీ జోక్యం చేసుకోకూడదని ఏమీ లేదు. అయినా ఈసీ మౌనం వెనుక మర్మమేమిటన్నది ప్రజలకు అర్థంకావడంలేదు.జగన్‌ది హుందాతనం..బాబుది దిగజారుడుతనంఒకవైపు జగన్ తన పాలనలో మంచి జరిగిందనుకుంటేనే తనకు ఓటేయాలని హుందాగా ప్రజలను కోరుతుంటే.. చంద్రబాబు మాత్రం దిగజారిపోయి తిట్ల పురాణంతో సభలు నడిపిస్తున్నారు. సీఎం జగన్ తన మేనిఫెస్టోను, టీడీపీ మేనిఫెస్టోను పోల్చి చూపడం, అందులోని అంశాలను వివరించి చెప్పే విధానం ప్రజల్లోకి బాగా వెళుతుండడంతో చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. దానికి కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో చంద్రబాబు చవకబారు దూషణలకు దిగుతున్నారు. జగన్ ఒక పద్ధతిలో మాట్లాడుతూ ముందుకెళుతున్న వైనాన్ని, చంద్రబాబు బజారుస్థాయి మాటలను ప్రజలు గమనిసూ్తనే ఉన్నారు. -
ఎన్నికల కమిషనా.. ఎన్డీఏ కమిషనా?
సాక్షి, అమరావతి: ఐదేళ్లుగా కొనసాగుతున్న పథకాలను ఎన్నికల కోడ్ ఉందన్న కారణంతో ఆపేస్తే ఆ లబ్ధిదారుల పరిస్థితేంటి? కొనసాగుతున్న పథకాలను ఆపాల్సిన పనిలేదని ఎన్నికల నిబంధనల్లో స్పష్టంగా ఉన్నా కూడా... ఎన్నికల కమిషన్ ఎందుకిలా చేస్తోంది? ఎన్డీఏ కూటమితో చంద్రబాబు నాయుడు జతకట్టినంత మాత్రాన ఎన్నికల కమిషన్ ఈ రాష్ట్రాన్ని ‘టార్గెట్’ చేయాల్సిన అవసరం లేదు కదా? ఏ రాష్ట్రానికీ వర్తించని నిబంధన ఇక్కడే ఎందుకట? పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటమనేది వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ క్రమం తప్పకుండా చేస్తున్నారు. ఇప్పటిదాకా ఎలాంటి ఇబ్బందీ లేదు కూడా. కానీ ఎన్నికల కోడ్ సాకుగా చూపించి ఇపుడు ఏకంగా 6,95,857 మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లకుండా నిలిపేయటం దుర్మార్గం కాదా? పంట వేసుకునే సమయంలో రైతుకు అవసరమనే కదా ప్రభుత్వం రూ.847.22 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేసింది!!. మరి ఆ సబ్సిడీని నిలిపేస్తే రైతులు ఇబ్బందులు పడరా? రైతుల ఇబ్బందులు ఈ ఎన్డీఏ కూటమికి గానీ..ఎన్నికల కమిషన్‌కు గానీ పట్టవా? ఎవరేమైపోయినా మాకు రాజకీయాలే ముఖ్యమనుకుంటే ఎలా చంద్రబాబూ? విత్తన సబ్సిడీ అందకపోతే ఎలా? నిజానికి రబీ కోతలు పూర్తి కావడంతో ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతలు విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి విత్తన సబ్సిడీపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించటం వారికి మింగుడుపడటం లేదు. నిజానికి గతంలో మాదిరే సీజన్‌కు ముందే సబ్సిడీపై పంపిణీ కోసం 6.19 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సిద్ధం చేసి... కోడ్ నేపథ్యంలో పంపిణీకి అనుమతినివ్వాల్సిందిగా ఈసీకి అధికారులు లేఖ రాశారు. ఐదేళ్లుగా ఏ విత్తనాలు ఏయే తేదీల్లో పంపిణీ చేసారో ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఏటా కోతలు పూర్తయిన వెంటనే పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నామని, అదును దాటి పోయాక పంపిణీ చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని అధికారులు లేఖలో పేర్కొన్నా... ఈసీ తిరస్కరించింది. రబీ కరువు పంట నష్టం అంచనాలకూ బ్రేకు వర్షాభావ పరిస్థితుల కారణంగా రబీ సీజన్లో 84 మండలాలను కరువు మండలాలను ప్రకటిస్తూ మార్చి రెండోవారంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పంట నష్టం అంచనా వేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఈసీకి అధికారులు లేఖ రాశారు. ఇన్నాళ్లూ మిన్నకున్న ఈసీ... నష్టం అంచనాపై ఆంక్షలు విధించింది. అనుమతి ఇవ్వలేమని తేచ్చిచెప్పేసింది. దీంతో రబీ కరువు సాయం అందుతుందో లేదో అనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ‘విద్యా దీవెన’ నిధులపైనా విషమే! పేద విద్యార్ధులకు చెల్లించే ‘విద్యా దీవెన’ నిధులనూ చంద్రబాబు కూటమి నిలుపు చేయించింది. ఈసీకి పదేపదే ఫిర్యాదులు చేయటంతో... ఎన్డీఏ భాగస్వామి కనక బాబుకు అనుకూలంగానే ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ నిధుల చెల్లింపునూ నిలిపేసింది. నిజానికి విద్యార్థులు ఇప్పుడు కాలేజీలు మారాల్సి ఉంటుంది. విద్యా దీవెన నిధులు చెల్లిస్తే గానీ కాలేజీలు వారికి సర్టిఫికెట్లు ఇవ్వలేమని చెబుతున్నాయి.ప్రభుత్వం ఇప్పటికే రూ.610.79 కోట్లు విడుదల చేసినా... కూటమి కుట్ర కారణంగా పేద విద్యార్దులు బయట అప్పులు చేసి కాలేజీలకు చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. లేదంటే వారి భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ఇన్ని దారుణాలు జరుగుతున్నా... చంద్రబాబు, పవన్ కల్యాణ్ నీరో చక్రవర్తుల మాదిరి తమాషా చూస్తున్నారు తప్ప రైతుల గురించి గానీ, విద్యార్థుల గురించి గానీ ఆలోచిస్తే ఒట్టు. ఇప్పుడు రైతులు, విద్యార్థులు అప్పుల పాలైతే నీ కళ్లు చల్లబడతాయా చంద్రబాబూ? ఈసీపై ఒత్తిళ్లు... ఎన్డీఏ భాగస్వామి కనక ఓకే నిజానికి ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన చెల్లింపులు గత ఐదేళ్ల నుంచీ అమలవుతున్నాయి. ఇవేమీ కొత్తవి కావు. లబ్దిదారుల ఎంపిక కూడా ఎప్పుడో చేశారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక చేసిందేమీ లేదు. కొనసాగుతున్న పథకాలకు ఎన్నికల కోడ్ వర్తించదని నియమావళిలో స్పష్టంగా ఉంది. కాబట్టి వీటికి కేంద్ర ఎన్నికల సంఘం సహజంగానే అనుమతివ్వాలి. మరో చిత్రమేంటంటే మిగతా రాష్ట్రాల్లో ఇలా ఏ పథకాన్నీ అడ్డుకోవటం లేదు కూడా. ఉదాహరణకు తెలంగాణలో పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు గత నెల 23వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 4న ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేస్తూ జీవో ఇచ్చింది. అంతేకాదు. రైతు బంధు నిధులను విడుదల చేస్తూ సోమవారమే జీవో ఇచ్చింది. మంగళ, బుధ వారాల్లో ఇవి రైతుల ఖాతాల్లోకి పడతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు కూడా. నిజానికి 2019 ఎన్నికల్లో చూసుకున్నా... అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్నికలకు కేవలం మూడు రోజుల ముందు ‘పసుపు కుంకుమ’ పేరిట మూడో విడత నిధులను మహిళల ఖాతాల్లో వేశారు. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి గానీ, ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి గానీ లేని నిబంధన ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే ఎందుకు వర్తింపజేస్తున్నారు? దీన్నిబట్టి చంద్రబాబు తనకు అలవాటైన కుట్రను ఎంత లోతుగా కొనసాగిస్తున్నారో... ఈసీపై తన ‘బీజేపీ మిత్రుల’ ద్వారా ఎంత ఒత్తిడి చేయిస్తున్నారో ఈజీగానే అర్థం చేసుకోవచ్చు. పింఛన్లపైనా ఇలాంటి దారుణాలే... కేంద్ర ఎన్నికల కమిషన్‌పై అటు చంద్రబాబు, బీజేపీలోని ఆయన మిత్రులు, ఎల్లో మీడియా, నిమ్మగడ్డ రమేశ్... ఇలా పచ్చ మంద మొత్తం కలిసి దారుణంగా ఒత్తిడి తెచ్చి సామాజిక పింఛన్లు తీసుకునే అవ్వా తాతలను, దివ్యాంగులను రాచిరంపాన పెట్టారు. వృద్ధులు, వికలాంగులు, వితంతవుల ఇంటికి పింఛను రాకుండా అడ్డుకుని... వాల్లను మండుటెండల్లో సచివాలయాల చుట్టూ, బ్యాంకులు చుట్టూ తిప్పుతూ కొంత మంది వృద్దులు మరణానికి కూడా కారణమయ్యిందీ ముఠా. మొదటి నెల సచివాలయాల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేయగా.. ప్రతి ఊరికీ సచివాలయం ఉండటంతో వృద్ధులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. కానీ అది కూడా నచ్చని పచ్చ ముఠా... నిధుల్ని నేరుగా వారి ఖాతాల్లో వెయ్యాలని ఈసీపై ఒత్తిడి తెచ్చాయి. ఈసీ అలాగే చేయటంతో... బ్యాంకులకు వెళ్లలేక, ఏటీఎంల వద్ద ఎండల్లో నిల్చోలేక వృద్ధులు నరకయాతన అనుభవించారు. చంద్రబాబును ప్రతి ఒక్కరూ నోరారా తిట్టుకున్నారు. జనం ఆగ్రహం తమ మీదకు మళ్లుతోందని భయపడ్డ బాబు... అదంతా వైఎస్ జగన్ వల్లే అయిందంటూ తన రామోజీరావు చేత దుర్మార్గపు కథనాలు రాయించాడు. ఈ కుట్రలన్నిటికీ ప్రజలే జబాబు చెబుతారు బాబూ!!. -
అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
అనంతపురం, సాక్షి: జిల్లాలో భారీగా డబ్బుతో కంటెయినర్లు వెళ్తుండడం ఒక్కసారిగా కలకలం రేపింది. హైదరాబాద్ - బెంగళూరు హైవేపై నాలుగు కంటెయినర్లలో వెళ్తున్న భారీ డబ్బును పోలీసులు గుర్తించారు. అయితే ఆ నగదు సస్పెన్స్ కాసేపటికే వీడింది.పామిడి మండలం గజరాంపల్లి దగ్గర హైవేపై నాలుగు కంటెయినర్లను పోలీసులు తనిఖీల్లో భాగంగా అడ్డుకున్నారు. ఆ కంటెయినర్లలో ఒక్కోదాంట్లో రూ.500 కోట్ల చొప్పున రూ.2 వేల కోట్ల దాకా నగదు కనిపించింది. ఎన్నికల కోడ్ అమల దృష్ట్యా కలెక్టర్, సంబంధిత అధికారులతో పాటు ఐటీ అధికారులకు పోలీసులు సమాచారం అందించారు.చివరకు పత్రాల పరిశీలన తర్వాత కొచ్చి(కేరళ) నుంచి హైదరాబాద్‌కు ఆ కంటెయినర్లు వెళ్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ ఆర్బీఐ బ్రాంచ్‌లో ఆ నగదును డిపాజిట్ చేసేందుకు ఆ కంటెయినర్లు అధికారికంగానే వెళ్తున్నాయని, క్షుణ్ణంగా పరిశీలించాక ఆ కంటెయినర్లను ముందుకు వెళ్లేందుకు అనుమతించినట్లు పామిడి సీఐ రాజశేఖర్‌రెడ్డి మీడియాకు వివరించారు. -
పెళ్లికార్డులో 'మోదీ' పేరు.. చిక్కుల్లో వరుడు
బెంగళూరు: పెళ్ళి కార్డులో ప్రధాని నరేంద్ర మోదీ పేరు ఉండటం.. వరుణ్ణి చిక్కుల్లో పడేసింది. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పుడు నియమాలను అతిక్రమించాడనే కారణంగా అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..దక్షిణ కన్నడలోని పుత్తూరు తాలూకాలోని వరుడు తన వెడ్డింగ్ కార్డులో 'మోదీని మరోసారి ప్రధానిగా ఎన్నుకోవడమే ఆ దంపతులకు మీరు ఇచ్చే అత్యుత్తమ బహుమతి' అని పేర్కొన్నారు. ఈ ట్యాగ్‌లైన్‌పై వరుడి బంధువుల్లో ఒకరు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.ఫిర్యాదు అందుకున్న తరువాత ఏప్రిల్ 14న పుత్తూరు తాలూకాలోని వరుడి నివాసానికి ఎన్నికల సంఘం అధికారులు వెళ్లారు. ఎన్నికల తేదీలు ప్రకటించకముందే మార్చి 1న ఆహ్వాన పత్రికలు ముద్రించారని వరుడు వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీపై అభిమానం, దేశం పట్ల ఉన్న శ్రద్ధ కారణంగా వరుడు ఇలా చేసినట్లు స్పష్టం చేశారు. -
పచ్చపార్టీ ప్రలోభాలు
సాక్షి, చిత్తూరు/చిత్తూరు అర్బన్/చిత్తూరు కార్పొరేషన్/గిద్దలూరు రూరల్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అభ్యర్థులకు ఓటమి భయం వెంటాడుతోంది. దీంతో ఓటర్లకు ప్రలోభాల వల విసురుతున్నారు. ఓవైపు మనీ.. ఇంకోవైపు మద్యం పంపిణీ చేస్తూ యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారు. ముందుగానే ఓటమి ఖాయం కావడంతో కాస్తయినా పరువు నిలుపుకోవాలనే ఉద్దేశంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విచ్చలవిడిగా కర్ణాటక మద్యం, నగదు, గిఫ్ట్ బాక్సులు పంపిణీ చేస్తున్నారు.చిత్తూరు జిల్లాలో ఎక్కువ నియోజకవర్గాలు కర్ణాటకతో సరిహద్దును కలిగి ఉన్నాయి. దీంతో టీడీపీ అభ్యర్థులు చాలా సులువుగా అక్కడి మద్యాన్ని సరిహద్దులు దాటిస్తూ డంప్ చేస్తున్నారు. బుధవారం చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా గురజాల జగన్మోహన్, ప్రసాదరావు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ర్యాలీకు వచ్చినవాళ్లకు ఒక్కొక్కరికి రూ.200 చొప్పున నగదు, పెద్ద ఎత్తున మద్యం అందజేశారు. పలమనేరు నీటిపారుదల శాఖలో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కుమారస్వామి అనే వ్యక్తి ‘పచ్చ’ జెండాలు మోస్తూ ఇప్పటికే సస్పెండ్ అయ్యాడు. అయితే మళ్లీ తాజాగా చిత్తూరు రూరల్ మండలంలో జనసమీకరణ చేసి టీడీపీ ర్యాలీలో పాల్గొనడం గమనార్హం.ఓటర్లను ప్రభావితం చేసే నేతలకు ద్విచక్ర వాహనాలుప్రధాన నియోజకవర్గాల్లో ఓటర్లను ప్రభావితం చేసే నేతలకు రూ.లక్షలు విలువ చేసే బుల్లెట్లు, ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీకి టీడీపీ అభ్యర్థులు శ్రీకారం చుట్టారు. చిత్తూరు నియోజకవర్గ పరిధిలో పాల వ్యాపారం చేసే వారికి ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు ఉచితంగా ఇచ్చారు. వాటికి టీడీపీ స్టిక్కర్లు అంటించి ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఖర్చులు కూడా అభ్యర్థులే భరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవిగో ప్రలోభాలు..♦ చిత్తూరులో టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ లక్ష్మీపురం, ముత్తుకూరుల్లో ప్రచారం సందర్భంగా టీడీపీ నేతలు కర్ణాటక మద్యాన్ని పంపిణీ చేశారు. ఈ రెండు చోట్ల దాదాపు రూ.80 వేలు విలువ చేసే మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.♦ ఇటీవల చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా చిత్తూరు రూరల్ మండలంలో పిల్లలకు పెద్ద ఎత్తున పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ♦ పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండల కేంద్రంలో షాదీమహల్ వద్ద రంజాన్ పర్వదినం ముందు రోజు టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ తరఫున ముస్లింలకు టీడీపీ గుర్తులతో బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ♦ గంగాధర నెల్లూరులో టీడీపీ అభ్యర్థి థామస్ తాయిలాల పంపిణీలో స్పీడ్ పెంచారు. రెండు రోజుల ముందు శ్రీరంగరాజపురం మండలం కటికపల్లిలో నిత్యావసర వస్తువులతోపాటు చీర, జాకెట్, ప్యాంటు, చొక్కా, మద్యం బాటిల్, రూ.500 నగదు కిట్‌గా పంపిణీ చేశారు. ♦నగరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ క్వారీల రాజకీయానికి తెరతీశారు. తమ పార్టీలోకి వస్తే క్వారీలు ఇస్తామని నమ్మబలుకుతున్నారు. మరికొందరికి డీకేటీ భూములు కూడా ఇస్తామని అలవికాని హామీలు ఇస్తున్నారు. ఇక పుంగనూరు టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి ప్రలోభాలు తారాస్థాయికి చేరాయి. ♦టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ తాయిలాలు ఊపందుకున్నాయి. ఇటీవల చంద్రబాబు తరపున ఆయన భార్య భువనేశ్వరి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కుప్పంలోని 243 పోలింగ్‌బూత్‌ల్లో ఒక్కో చోట రూ.30 వేల చొప్పున పంపిణీ చేశారు. అలాగే జనసమీ కరణ కోసం ఒక్కొక్కరికి రూ.300 నగదు, మద్యం సీసా, బిర్యానీ అందజేశారు.♦ ప్రకాశం జిల్లా గిద్దలూరులో టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి నామినేషన్ పర్వంలో ఓటులేని వారి చేతికి టీడీపీ జెండా ఇచ్చి మరీ ప్రచారం చేయించారు. ఒక్కొక్కరికి రూ.300 ఇచ్చి నామినేషన్‌కు నియోజకవర్గంలోని గ్రామాల్లో నుంచి జనాన్ని తరలించారు. నామినేషన్ సందర్భంగా మద్యం ఏరులై పారింది. -
ఆ ఉద్యోగ సంఘాలనేతలపై చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కొందరు ఉద్యోగ సంఘాల నేతలపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకట్రామిరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు ఉద్యోగ సంఘాల నేతలు చేస్తున్న వ్యాఖ్యలను నిత్యం కొన్ని పత్రికలు ప్రచురిస్తున్నాయని తెలిపారు. ఆయా పత్రికల క్లిప్పింగులను కూడా మీనాకు అందజేశారు. ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడటం ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని తనను సస్పెండ్ చేశారని.. మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కొన్ని ఉద్యోగ సంఘాల నేతల వ్యాఖ్యలు కూడా ఎన్నికల ప్రవర్తనా నియామవళి ఉల్లంఘన కిందకే వస్తాయని వెంకట్రామిరెడ్డి వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈనాడు తప్పుడు కథనాల వల్లే.. మార్చి 31న ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ హోదాలో తాను వైఎస్సార్ జిల్లాలో ఏపీపీటీడీ ఉద్యోగులను కలిసి వారి సమస్యలపై చర్చించానని వెంకట్రామిరెడ్డి తెలిపారు. అయితే అదే రోజు ఈనాడు పత్రిక ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్లే ఉద్యోగులు మునిగిపోయారంటూ ఒక తప్పుడు కథనం ప్రచురించిందన్నారు. ఈ కథనాన్ని తాను ఖండిస్తూ విలీనం వల్ల ఉద్యోగులకు మేలే జరిగిందని.. ఉద్యోగుల గురించి తప్పుడు కథనాలు రాయొద్దని పత్రికా ప్రకటన విడుదల చేశానని తెలిపారు. దీంతో తనపై కక్ష కట్టిన ఈనాడు ఏప్రిల్ 2న తాను ఉద్యోగులతో మాట్లాడుతున్న ఫొటోను ప్రచురించి.. ఒక పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నానని తప్పుడు కథనం రాసిందన్నారు. ఈ కథనం ఆధారంగా తమపైన నాలుగు కేసులు పెట్టడంతోపాటు 11 మందిని సస్పెండ్ చేశారని వెంకట్రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పత్రికలు విష పురుగులు కొన్ని పత్రికలు రోజూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని సంఘాల నాయకులతో మాట్లాడిస్తున్నాయని, అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా? అని వెంకట్రామిరెడ్డి నిలదీశారు. ప్రభుత్వం ఉద్యోగులకు మంచి చేసింది అంటే తప్పు.. ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెడుతోంది అంటే అది కరెక్టా? అది కోడ్ ఉల్లంఘన కాదా? అని ప్రశ్నించారు. నిష్పక్షపాతంగా వార్తలు రాయడమంటే ఇదేనా అని ధ్వజమెత్తారు. కొంతకాలంగా ఆ పత్రికలు తమకు నచ్చిన వారికి మేలు చేయడమే లక్ష్యంగా కథనాలు రాస్తున్నాయని మండిపడ్డారు. ఈ పత్రికలు విష పురుగులతో సమానమన్నారు. ఎయిడ్స్, కరోనా లాంటివే ఈ పత్రికలు కూడా అని పేర్కొన్నారు. ఆ వ్యాధులకు మందు కనుక్కున్నారు కానీ ఈ పత్రికలకు మాత్రం మందు కనుక్కోలేకపోతున్నారన్నారు. ఉద్యోగుల సమాఖ్య తరఫున ఈనాడును బహిష్కరిస్తున్నామని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. -
మోదీపై ఫిర్యాదు: సీతారాం ఏచూరి
కోజికోడ్: ప్రధాని మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా ప్రకటనలు చేస్తున్నారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. శ్రీరాముడి అంశంపై ప్రజలను మతపరంగా సంఘటితం చేసేలా పలు ప్రకటనలు చేశారని, దీనిపై తాను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని తెలిపారు. కోడ్‌ను ఉల్లంఘించేలా మోదీ మాట్లాడిన మాటలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఏచూరి గురువారం కేరళలోని కోజికోడ్‌లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఎం అలుపెరుగని పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. -
కోడ్ ఉల్లంఘిస్తే చర్యలే
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకుంటోందని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఇప్పటికే పలువురు నేతలపై నిషేధాన్ని విధించిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ చెప్పారు. రాష్ట్రంలో సైతం కోడ్ ఉల్లంఘనకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ పట్ల అన్ని పార్టీలకు అవగాహన కల్పించామని, ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోడ్ ఉల్లంఘన ఆరోపణలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఈసీ జారీ చేసిన నోటీసులకు వివరణ ఇచ్చే గడువు గురువారంతో ముగిసిందని, ఆయన మరో వారంపాటు గడువు పొడిగించాలని కోరారన్నారు. కేసీఆర్ విజ్ఞప్తిని ఈసీకి పంపించామని చెప్పారు. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఊరేగింపులో ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా బీజేపీ ఎమ్మెల్యే టి.రాజాసింగ్, ఆ పార్టీ హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత చేసిన విద్వేషకర ప్రసంగాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. కోడ్ ఉల్లంఘనకి సంబంధించి ఇప్పటి వరకు వివిధ పార్టీల నుంచి 28 ఫిర్యాదులు వచ్చాయని, ఇప్పటివరకు 4099 ఎఫ్ఐఆర్లను నమోదు చేశామన్నారు. ఓ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడానికి అనుమతించే విషయమై చట్టాలను పరిశీలించాల్సిన అవసరముందని తెలిపారు. సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీకి దిగుతున్న విషయం తెలిసిందే. ఆన్లైన్లో నామినేషన్ వేయొచ్చు ఆన్లైన్లో సైతం నామినేషన్ దాఖలు చేయొ చ్చని, అయితే ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటల్లోపు అభ్యర్థులు సంతకం చేసిన నామినేషన్ పత్రాల ప్రింట్ కాపీని సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుందని వికాస్‌రాజ్ తెలిపారు. నామినేషన్ ఫారంతోపాటు అఫిడవిట్‌లోని అన్ని ఖా ళీలను పూరించాలని, తమకు వర్తించని విష యాలను సైతం ‘నాట్ అప్లికేబుల్’అని రా యాల్సి ఉంటుందన్నారు. ఒక్క ఖాళీ పూరించకపోయినా పరిశీలనలో నామినేషన్లు తిరస్కరిస్తారని చెప్పారు. ఎన్నికల ఖర్చుల కోసం అభ్యర్థులు కొత్త బ్యాంక్ ఖాతాను తెరవాల్సి ఉంటుందని, రాష్ట్రంలోని ఏ బ్యాంక్ నుంచైనా ఖాతా తెరవచ్చన్నారు. తొలి రోజు రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో మొత్తం 42 మంది అభ్యర్థులు మొత్తం 48 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారని వికాస్‌రాజ్ వెల్లడించారు. 23లోగా పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు చేసుకోవాలి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం వికలాంగు లు, 85 ఏళ్లుపైబడిన వయోజనులు, అత్యవసర సేవల ఉద్యోగులు/జర్నలిస్టులు ఈ నెల 23లోగా ఫారం–12డీ దరఖాస్తులను సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని సీఈఓ వికాస్‌రాజ్ సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందిలో ఇంకా 40వేల మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదని, తక్షణమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. మే 3 నుంచి 6 వరకు తొలి విడత పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 26 నుంచి ఓటర్లకు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ చేస్తామన్నారు. పాత ఓటరు గుర్తింపుకార్డులు కలిగిన 46 లక్షల మంది ఓటర్లకు వారి కొత్త ఓటరు గుర్తింపుకార్డు నంబర్లను తెలియజేస్తూ లేఖలు పంపినట్టు తెలిపారు. పాత నంబర్లతో ఓటు ఉండదని, కొత్త నెంబర్లతోనే ఉంటుందన్నారు. మహిళా ఓటర్లే అధికం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,31,48,527కి చేరిందని వికాస్‌రాజ్ తెలిపారు. 1000 మంది పురుషులకు రాష్ట్రంలో 1010 మంది మహిళా ఓటర్లు ఉన్నారన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు మొత్తం 1,00,178 దరఖాస్తులొచ్చాయని, వీటిని ఈనెల 25లోగా పరిష్కరిస్తామని చెప్పారు. 2022–24 మధ్యకాలంలో రాష్ట్రంలో 60.6 లక్షల కొత్త ఓటర్ల నమోదు, 32.84 లక్షల ఓటర్ల తొలగింపు, 30.68 లక్షల ఓటర్ల వివరాల సవరణ జరిగిందన్నారు. -
నేటి నుంచి నామినేషన్ల పర్వం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 లోక్‌సభ స్థానాలకు గురువారం నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. నాల్గవ దశ ఎన్నికల్లో భాగంగా మే 13న రాష్ట్రంలో జరిగే ఈ ఎన్నికలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీచేయనుంది. దీంతో అప్పటి నుంచే అంటే ఈనెల 18 నుంచి ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. అతి కీలకమైన ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా కలెక్టరేట్లలో.. అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో ఎన్నికల కోడ్‌ను పాటిస్తూ నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు నామినేషన్లు స్వీకరించే గదిలో అభ్యర్థులు ప్రవేశించే ద్వారాల వద్ద సీసీ కెమేరాలను ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులను, నామినేషన్ల దాఖలు ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తామన్నారు. ఈ క్రతువులో అభ్యర్థుల భవితవ్యాన్ని 4.10 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో తొలిరోజు నుంచే నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలుకానుంది. వీటిని ఏప్రిల్ 26 వరకు పరిశీలించి, 29 వరకు ఉపసంహరణకు సమయమిస్తారు. మే 13న పోలింగ్ కాగా.. జూన్ 4 ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఉ.11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ.. ఎన్నికల నోటిఫికేషన్ గురువారం జారీకాగానే నామినేషన్ల దాఖలు ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది. సంబంధిత అసెంబ్లీ లేదా లోక్‌సభ స్థానం రిటర్నింగ్ ఆఫీసు కార్యాలయంలో ఉ.11 గంటల నుంచి మ.3 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ప్రభుత్వం ప్రకటించిన సెలవు రోజుల్లో స్వీకరించరు. ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు వెయ్యొచ్చు. ఒక అభ్యర్థి ఏదైనా రెండు స్థానాల్లో మాత్రమే పోటీచేసే అవకాశముంది. ఎంపీ అభ్యర్థి అయితే ఫారం–2ఏ, ఎమ్మెల్యే అభ్యర్థయితే ఫారం–2బీ ఉపయోగించాల్సి ఉంటుంది. అభ్యర్థులు సువిధ యాప్ ద్వారా ఆన్లైన్లో నామినేషన్లు, అఫిడవిట్లను దాఖలు చేయవచ్చు. అయితే, వాటి కాపీలను భౌతికంగా ఆర్వోలకు అందజేయాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం గుర్తించిన రాజకీయ పార్టీల అభ్యర్థి కి స్థానికంగా ఉండే ఒక ఓటరు ప్రతిపాదన (ప్రపోజర్‌గా) సంతకం చేయాల్సి ఉంటుంది. అదే ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు 10 మంది ప్రతిపాదించాలి. ఒక ఓటరు ఎంతమంది అభ్యర్థుల కైన ప్రపోజ్ చేయడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. నామినేషన్ దాఖలు సందర్భంగా ప్రతీ అభ్యర్థి కొన్ని కచ్చితమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. నామినేషన్ వేయడానికి వెళ్లే సమయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలోనికి కేవలం మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. నామినేషన్ దాఖలు చేసేటప్పుడు రిటర్నింగ్ అధికారి గదిలోకి అభ్యర్థి తో కలిపి కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది. నామినేషన్లు దాఖలు చేసినప్పుడు ఫారం–ఏ, ఫారం–బీలు కూడా సమర్పించవచ్చు. లేకపోతే నామినేషన్ల చివరి రోజున 3 గంటలలోపు వీటిని సమర్పించాల్సి ఉంటుంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల స్వీకరణకు సంబంధించి హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటుచేశారు. ఫారం–26 తప్పనిసరి.. ఇక నామినేషన్ దాఖలుతోపాటు ఫారం–26 (అఫిడవిట్) కూడా అభ్యర్థులు విధిగా సమర్పించాలి. ఇది నామినేషన్ల చివరి తేదీ ఏప్రిల్ 25, మ.3 గంటల లోపు ఇవ్వొచ్చు. ఫారం–26 స్టాంప్ పేపర్ విలువ రూ.10 కంటే ఎక్కువ ఉండాలి. భౌతిక స్టాంప్ పేపర్ అందుబాటులో లేకపోతే ఈ–స్టాంప్ పేపర్ ఉపయోగించవచ్చు. ఫారం–26 అంటే.. పోటీచేసే అభ్యర్థులు తన కుటుంబసభ్యుల ఆస్తులు, అప్పులతోపాటు క్రిమినల్ కేసులు, న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న అన్ని కేసుల వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి అయితే ఆ పార్టీకి కేటాయించిన గుర్తును నామినేషన్ ఫారంలో రాయాలి. అదే ఇతర అభ్యర్థులైతే ఫ్రీ సింబల్స్ నుండి తనకు నచ్చిన మూడు గుర్తులను కోరుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రిజిస్టర్ అయివుండి, గుర్తింపు పొందని పార్టీలు ఎన్నికల సంఘం నుండి కామన్ సింబల్ కేటాయించినట్లయితే ఆ గుర్తును నామినేషన్ ఫారంలో రాయాలి. నామినేషన్ రుసుం ఇలా.. పార్లమెంటు అభ్యర్థి అయితే రూ.25,000లు, అసెంబ్లీ అభ్యర్థి అయితే రూ. 10,000లు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ రుసుంలో 50 శాతం రాయితీ కల్పించారు. వీరు సామాజిక ధ్రువపత్రాన్ని విధిగా సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ వేసిన తర్వాత ప్రతి అభ్యర్థి రిటర్నింగ్ అధికారి ముందు ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ప్రతి అభ్యర్థి నామినేషన్‌తో పాటు లేటెస్ట్ పాస్‌పోర్టు సైజ్ ఫొటో (2 ్ఠ2.5 సెం.మీ) ఇవ్వాల్సి ఉంటుంది. నామినేషన్ వేసిన తరువాత అభ్యర్థి రశీదుతోపాటు స్కూృట్నీ తేదీ, సమయం.. నామినేషన్ ఉపసంహరణ తేదీ, సమయం.. గుర్తులు కేటాయించే తేదీ, సమయం తెలిపే నోటీసులను అధికారుల నుంచి తీసుకోవాలి. నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు 13 రకాల పత్రాలను తీసుకురావల్సి ఉంటుంది. నేటి నుంచి అభ్యర్థుల ఖర్చు కౌంట్ నామినేషన్ల పర్వం ప్రారంభైన నాటి నుంచి అంటే గురువారం నుంచే అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల ఖర్చును ఆయా అభ్యర్థుల ఖాతాలో నమోదు చేస్తారు. పత్రికల్లో వచ్చే పెయిడ్ న్యూస్, ప్రకటనలు, వార్తలను సైతం అభ్యర్థి ఖాతా కింద లెక్కిస్తారు. అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థి రూ.40 లక్షల వరకు ఖర్చు పెట్టొచ్చు. అలాగే, ఎంపీ అభ్యర్థి రూ.95 లక్షల వరకు వ్యయం చెయ్యొచ్చు. అభ్యర్థుల ఖర్చును ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన నోడల్ అధికారులు పర్యవేక్షిస్తారు. అభ్యర్థులు ఎన్నికల వ్యయానికి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను తెరవాలి. ముఖ్యమైన తేదీలు నామినేషన్ల దాఖలు చివరి తేదీఏప్రిల్ 25 గురువారం ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ జారీ ఏప్రిల్ 18 గురువారం నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26 శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ ఏప్రిల్ 29 సోమవారం పోలింగ్ తేదీ మే 13 సోమవారం ఓట్ల లెక్కింపు జూన్ 4 మంగళవారం ఎన్నికల ప్రక్రియ ముగింపు తేదీజూన్ 6 గురువారం -
స్వయం సహాయక సంఘాలను ప్రభావితం చేసే కార్యక్రమాలొద్దు
సాక్షి, అమరావతి : ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో స్వయం సహాయక బృందాల సభ్యులను ప్రభావితం చేసేలా ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించకూడదంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలిచ్చారు. రాష్ట్ర పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి, రాష్ట్ర పురపాలక– పట్టణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో పనిచేసే సంబంధిత అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది ఎవరూ స్వయం సహాయక బృందాల సభ్యులను ప్రభావితం చేసేలా ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించకూడదన్నారు. కోడ్ అమల్లో ఉన్నంత వరకూ స్వయం సహాయక బృందాల సభ్యులను వ్యక్తిగతంగా, సమష్టిగా రాజకీయ కోణంలో అభిప్రాయానికి అనుకూలంగా, వ్యతిరేకంగా ప్రభావితం చేసే ఏ విధమైన సమీకరణ, అవగాహన, సర్వే వంటి ఇతర కార్యకలాపాలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. నిబంధనల అమల్లో సెర్ప్ సీఈవో, మెప్మా మిషన్ డైరెక్టర్ ప్రత్యేక శ్రద్ధ, చొరవ చూపాలని ఆదేశించారు. మహిళల గౌరవానికి పెద్దపీట ఎన్నికల ప్రచారంలో మహిళల గౌరవం విషయంలో కఠిన వైఖరిని అమలుచేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మహిళలను కించపరిచేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన పార్టీల నాయకులకు తక్షణం నోటీసులివ్వడం ద్వారా మహిళల గౌరవం విషయంలో గట్టి వైఖరిని అమలు చేస్తున్నట్లు తెలిపింది. పార్టీ నేతలు, ప్రచారకర్తలు ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలను ఆశ్రయించకుండా చూసుకోవడానికి పార్టీ ముఖ్యులు/అధ్యక్షులు జవాబుదారీతనం వ్యవహరించాలని కోరింది. రేపటి నుంచి ఎన్నికల ప్రక్రియకు సిద్ధంకండి ఈ నెల 18న (రేపు) నోటిఫికేషన్ జారీతో ప్రారంభమయ్యే అసలైన ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారులు సిద్ధం కావాలని మీనా ఆదేశించారు. ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా నిర్వహించడంతోపాటు రోజూ క్రమం తప్పకుండా నివేదికలను పంపేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. 18న నోటిఫికేషన్ జారీ నుంచి రోజూ ఈసీఐకి నివేదికలు పంపాలని చెప్పారు. ఈ విషయంలో అలసత్వం వహించరాదన్నారు. ఓటర్ల గుర్తింపు కార్డుల పంపిణీపై దృష్టి పెట్టాలన్నారు. ఎపిక్ కార్డుల పంపిణీపై మే 4న ఈసీఐ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుందని తెలిపారు. ఈ లోపు కార్డుల పంపిణీ పూర్తిచేయాలని ఆదేశించారు. సీ–విజిల్ ఫిర్యాదులను అధికారులు సంతృప్తకరస్థాయిలో పరిష్కరిస్తున్నారని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాలకు పరిశీలకులను నియమించే విషయంలో ఈసీఐ మార్గదర్శకాలను పాటించాలని, అదనంగా కావాల్సిన పరిశీలకులు, ఏఆర్వోల ప్రతిపాదనలను సాధ్యమైనంత త్వరగా పంపాలని ఆదేశించారు. పోలింగ్ పక్రియ, కేంద్రాలు వెబ్‌కాస్టింగ్ ద్వారా గరిష్టస్థాయిలో కవర్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. -
Crime: రూ. 900 కోట్ల బంగారం స్వాధీనం
చెన్నై: ఎన్నికల వేళ తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది. కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్ పరిధిలో కుండ్రత్తూర్ రహదారిలో ఫ్లయింగ్ స్క్వాడ్ శనివారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టింది. అటుగా వచ్చిన ప్రైవేటు సెక్యూరిటీ సంస్థకు చెందిన మినీ లారీ, మినీ కంటెయినర్ లారీలను సోదా చేశారు. ఓ లారీలో 1,025 కిలోలు, మరో వాహనంలో 400 కిలోల బంగారం గుర్తించారు. స్వాధీనం చేసుకుని వివరాలు ఆరా తీశారు. బంగారాన్ని చెన్నై విమానాశ్రయం నుంచి శ్రీపెరుంబుదూర్ సమీప మన్నూర్‌లోని ఓ గోదాముకు తరలిస్తున్నట్లు తెలిసింది. 400 కిలోలకు ఆధారాలు ఉన్నాయని మిగిలినదానికి లేనట్లు తెలిసింది. అధికారులు చెన్నై విమానాశ్రయ కస్టమ్స్ అధికారులను సంప్రదించారు. వీటి మొత్తం విలువ రూ.900 కోట్లు ఉంటుందని అంచనా. ఇదిలా ఉంటే.. ఎలక్షన్ ప్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఓ పంచాయితీ ప్రెసిడెంట్ ఇంటి నుంచి కోటి రూపాయాల్ని స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఎట్టారై గ్రామం పంచాయితీ ప్రెసిడెంట్ దివ్య అన్బరసన్ నుంచి ఈ సొమ్మును రికవరీ చేశారు. ఆమె అన్నాడీఎంకేకు చెందిన నేత.