
సాక్షి, అనంతపురం: దాడులు.. దౌర్జన్యాలు.. చెయ్యడంలో టీడీపీ నేతలు ఆరితేరిపోయారు. టీడీపీ నాయకుల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది.రామగిరిలో ఆదివారం ఎన్నికల కోడ్ అమలు చేస్తున్న ఎన్నికల అధికారులపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ దాడికి పాల్పడ్డారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా రాజకీయ నేతల చిత్ర పటాలపై అధికారులు ముసుగు వేశారు. దీంతో ఎన్నికల అధికారులపై పరిటాల శ్రీరామ్ దుర్బాషలాడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఎన్నికల అధికారి కాలర్ పట్టుకుని శ్రీరామ్ బెదిరింపులకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment