atack
-
మీ స్వార్థానికి జర్నలిస్టులను బలి చేస్తారా?
అనంతపురం ఎడ్యుకేషన్: చంద్రబాబు, లోకేశ్, ఈనాడు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ–5 సాంబ స్వార్థాలకు జర్నలిస్టులను బలి చేస్తున్నారని రాప్తాడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని, విలేకరులపై దాడులకు తెగబడుతోందంటూ ఈనాడులో వచ్చిన కథనాన్ని ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఖండించారు. అనంతపురంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనాడు, ఏబీఎన్, టీవీ–5 మీడియాను వైఎస్సార్సీపీ బ్యాన్‌చేసి ప్రెస్మీట్లు, మీటింగ్‌లకు రావద్దని స్పష్టంచేసినప్పటికీ ఏకంగా 10 లక్షల మంది వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు వచ్చిన రాప్తాడు ‘సిద్ధం’ సభకు ఏబీఎన్ లోగో పట్టుకుని శ్రీకృష్ణ అనే ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ ఎందుకొచ్చారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఆయనను ఎవరు పంపించారు? దాడి జరుగుతుంటే మరో ఏబీఎన్ ఉద్యోగి అక్కడి నుంచి జారుకోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. అలాగే, ఓవైపు దాడి జరుగుతుంటే రక్షించే ప్రయత్నం చేయకుండా వీడియోలు తీయడం వెనుక ఉద్దేశమేమిటో కూడా పోలీసులు వెలికితీయాలన్నారు. నిజానికి.. ప్రభుత్వంపై ఎంత దుర్మార్గంగా, వాస్తవాలను వక్రీకరించి కథనాలు రాస్తున్నా రాష్ట్రంలో ఎక్కడా దాడులు జరగలేదని.. ఈ సభకు ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ లోగో పట్టుకుని వెళ్లడం చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. దాడులకు వారే బాధ్యత వహించాలి.. ఇక రాప్తాడులో ఏబీఎన్ ఫొటోగ్రాఫర్‌పై, కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడి జరిగినా అందుకు పూర్తిబాధ్యత వహించాల్సింది చంద్రబాబు, లోకేశ్, ఏబీఎన్ రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు, టీవీ–5 సాంబ మాత్రమేనని తోపుదుర్తి స్పష్టంచేశారు. గతంలో పవన్‌కళ్యాణ్, మోదీని కూడా చాలా దుర్మార్గంగా మాట్లాడారని ప్రకాష్‌రెడ్డి గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రజాస్వామ్యవాదులని, చాలా సహనం, ఓర్పు కల్గిన వాళ్లని ఆయనన్నారు. తప్పుడు కథనాలు రాస్తూ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని భావిస్తే అది వారి అమాయకత్వమే అవుతుందన్నారు. -
ఎన్నికల అధికారులపై పరిటాల శ్రీరామ్ దౌర్జన్యం
సాక్షి, అనంతపురం: దాడులు.. దౌర్జన్యాలు.. చెయ్యడంలో టీడీపీ నేతలు ఆరితేరిపోయారు. టీడీపీ నాయకుల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది.రామగిరిలో ఆదివారం ఎన్నికల కోడ్ అమలు చేస్తున్న ఎన్నికల అధికారులపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ దాడికి పాల్పడ్డారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా రాజకీయ నేతల చిత్ర పటాలపై అధికారులు ముసుగు వేశారు. దీంతో ఎన్నికల అధికారులపై పరిటాల శ్రీరామ్ దుర్బాషలాడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఎన్నికల అధికారి కాలర్ పట్టుకుని శ్రీరామ్ బెదిరింపులకు దిగారు. (మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి దౌర్జన్యం) -
బరి తెగించిన కబ్జాదారులు
కుత్బుల్లాపూర్: కబ్జాదారులు మరోసారి రెచ్చిపోయారు.. తహసిల్దార్ గౌతమ్‌కుమార్, ఆర్ఐ నరేందర్‌రెడ్డిలపై కిరోసిన్ చల్లి, రాళ్లతో దాడి చేసిన ఘటన మరువక ముందే మరో ఘటన కలకలం రేపింది. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు వెళ్లిన వీఆర్వో, వీఆర్ఏ,గిర్దావర్‌పై మూకుమ్మడి దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో వారు భయంతో పరుగుతీశారు. ఏకంగా కబ్జాదారులు రాడ్లు, కట్టెలు, రాళ్లతో కొడుతూ పరుగులు పెట్టించారు. దీంతో కుత్బుల్లాపూర్ మండల తహసిల్దార్ గౌతమ్‌కుమార్ జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆరుగురు భూకబ్జాదారులపై ల్యాండ్ గ్రాబింగ్, నాన్ బెయిలబుల్ కింద కేసులు నమోదు చేశారు. వాట్సప్‌లో కబ్జాపై ఫిర్యాదు.. కుత్బుల్లాపూర్ తహసిల్దార్ గౌతమ్‌కుమార్‌కు గురువారం రాత్రి ఓ వ్యక్తి సెల్ ఫోన్ నుంచి వాట్సప్‌లో కబ్జా విషయంపై ఫిర్యాదు చేస్తూ మెసెజ్ పంపాడు. గాజులరామారం సర్వే నెంబరు 221 పరిధిలోని సుభాష్‌చంద్రబోస్ నగర్ లో స్థలం కబ్జా విషయం పై శుక్రవారం విచారణ చేపట్టేందుకు వీఆర్వో శ్యామ్‌కుమార్, వీఆర్ఏ, గిర్దావర్ ఉమామహేశ్వర గౌడ్ లు ఘటన స్థలానికి వెళ్లగా అప్పటికే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వెంటనే వెళ్లిన సిబ్బంది నిర్మాణాన్ని కూల్చి వేస్తుండగా భూక్జాదారులు షేక్ మౌలానా, సయ్యద్ జలీల్, మేస్త్రీ పాషా, షాదూల్, చాంద్‌పాషా, నఫీజ్‌బేగం ఒక్కసారిగా కూల్చివేతలు చేపడుతున్న సిబ్బందిపై రాళ్లు, కట్టెలతో దాడి చేయడంతో ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో సిబ్బందిపై బండరాళ్లు ఎత్తి హత్యాయత్నం కూడా చేశారు. సంఘటనా స్థలానికి తహసిల్దార్.. అక్రమ నిర్మాణం చేపట్టడమే కాకుండా సిబ్బందిపై దాడి చేసిన విషయాన్ని తెలుసుకున్న మండల తహసిల్దార్ గౌతమ్ కుమార్ హుటాహుటిన అక్కడికి జగద్గిరిగుట్ట పోలీసులతో కలిసి వెళ్లారు. అక్రమ నిర్మాణాన్ని క్షణాల్లో కూల్చివేయించి సదరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐపీసీ సెక్షన్ కింద ఆరుగురు కబ్జాదారులపై 557/2019, 332, 341, 34 ఐపీసీ, సెక్షన్(3), పీడీపీఎస్యాక్ట్ కింద నాన్‌బెయిలబుల్ కేసులునమోదు చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. -
జన్మభూమిలో ‘తమ్ముళ్ల’ దందా!
► జనం రాలేదని ఆక్రోశం ► వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి సాక్షి ప్రతినిధి, విజయవాడ : జిల్లాలో శనివారం జరిగిన జన్మభూమి సభల్లో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగింది. కొన్నిచోట్ల వైఎస్ఆర్సీపీ నాయకులపై టీడీపీ వారు దౌర్జన్యం చేశారు. సభలకు జనం రాలేదు. దీంతో టీడీపీ జనాన్ని ఇండ్లవద్దకు వెళ్లి తీసుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడి... నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం కృష్ణారావుపాలెంలో జరిగిన జన్మభూమి సభ రసాభసాగా సాగింది. సభ ప్రారంభంలో గతంలో జరిగిన సభల్లో తీసుకున్న నిర్ణయాలు, అమలు జరిగిన తీరు గురించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రశ్నించారు. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ కొందరు టీడీపీ కార్యకర్తలు ఎదురు తిరిగారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త తాళ్లూరి ప్రసాద్‌ను టీడీపీ కార్యకర్త వల్లభ రాజు కాలితో తన్నాడు. వేదిక వద్ద టీడీపీ నియోజవర్గ ఇన్ఛార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరావు ఉన్నారు. వేదికకు కొద్ది దూరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు పోలీసులు మాత్రమే ఉన్నారు. సభనుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యే కల్పన పామర్రు హైస్కూలు ఆవరణంలో జరిగిన జన్మభూమి సభ వివాదాస్పదంగా మారింది. తెలుగుదేశం పార్టీ పామర్రు టౌన్ అధ్యక్షుడు పామర్తి విజయశేఖర్ సభలో వేదికపై కూర్చున్నాడు. వైఎస్ఆర్సీపీ నాయకుడు పట్టణ ఉప సర్పంచ్ ఆరేపల్లి శ్రీనివాసరావు వేదికపై కూర్చున్నాడు. తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు శ్రీనివాసరావును వేదికపై నుంచి కిందకు దించాల్సిందిగా పోలీసులను పట్టుబట్టడంతో ఆయనను పోలీసులు కిందకు తీసుకొచ్చారు. సభా మర్యాదలు పాటించపోవడం, కనీసం ప్రొటోకాల్ పాటించకపోవడంతో సభకు హాజరైన ఎమ్మెల్యే ఉప్పలేటి కల్పన జన్మభూమి సభ నుంచి వెళ్లిపోయారు. వేదికలపై టీడీపీ నేతలు పెడనలో జరిగిన జన్మభూమి సభల్లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు నేరుగా వేదికపై కూర్చున్నాడు. పలు సభల్లో టీడీపీ నాయకులు ప్రజా ప్రతినిధుల్లా వ్యవహరించారు. పనిచేయని అధికారులొద్దు : మంత్రులు కెకలూరు: తాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. అధికారులు పట్టించు కోవడం లేదు.. వేసవిలో నీటిఎద్దడి నివారణకు అసలు ప్రణాళికే అధికారుల వద్ద లేదు.. జన్మభూమి కార్యక్రమానికి ఇంతమంది వస్తే అధికారులు రాకపోతే ఏలా.. అంటూ ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సీరియస్ అయ్యారు. అలాగే ఏఈ సూర్యరావు సరైన సమాధానం చెప్పకపోవడంతో మంత్రి అయ్యన్న పాత్రుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి ఆర్ డబ్ల్యూఎస్ డీఈని పంపించేయండని చెప్పారు. అదే విధంగా అటవీశాఖ డీఆర్వో రాకుండా గార్డును మాత్రమే పంపారు. దీనిపై అటవీశాఖ పీసీసీఎఫ్‌తో మంత్రి మాట్లాడి మరో పర్వాయం ఇలా జరగకుండా చూడాలని సూచించారు. అర్హులందరికి సంక్షేమ పథకాలు : మంత్రికొల్లు మచిలీపట్నం సబర్బన్ : అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఒకటవ వార్డులో శనివారం ఆయన పర్యటించారు. బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ పేదలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలను అందించేందుకే ప్రభుత్వం జన్మభూమి- మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వార్డులో నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. -
జోరుగా... హుషారుగా...
మంచు మనోజ్ మంచి జోరుగా.. హుషారుగా ఉన్నారనే చెప్పాలి. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో మనోజ్ నటించిన ‘ఎటాక్’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం దశరథ్ దర్శకత్వంలో ‘శౌర్య’లో హీరోగా నటిస్తున్నారు. తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘మిరపకాయ్’, ‘శ్రీమన్నారాయణ’, ‘పైసా’ చిత్రాల నిర్మాత రమేష్ పుప్పాల నిర్మించనున్న చిత్రంలో మనోజ్ హీరోగా నటించనున్నారు. ఈ చిత్రానికి సాగర్ పసల దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘కమర్షియల్ పంథాలో సాగే ఎంటర్టైనర్ ఇది. మనోజ్‌ను సరికొత్తగా చూపించనున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, రచన-స్క్రీన్‌ప్లే: కిశోర్.