బరి తెగించిన కబ్జాదారులు | Land Grabs Attack on Tahasildar | Sakshi
Sakshi News home page

బరి తెగించిన కబ్జాదారులు

Published Sat, Aug 10 2019 9:20 AM | Last Updated on Sat, Aug 10 2019 9:20 AM

Land Grabs Attack on Tahasildar - Sakshi

అధికారులపై దాడి చేస్తున్న కబ్జాదారులు

కుత్బుల్లాపూర్‌: కబ్జాదారులు మరోసారి రెచ్చిపోయారు.. తహసిల్దార్‌ గౌతమ్‌కుమార్, ఆర్‌ఐ నరేందర్‌రెడ్డిలపై కిరోసిన్‌ చల్లి, రాళ్లతో దాడి చేసిన ఘటన మరువక ముందే మరో ఘటన కలకలం రేపింది. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు వెళ్లిన వీఆర్వో, వీఆర్‌ఏ,గిర్దావర్‌పై మూకుమ్మడి దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో వారు భయంతో పరుగుతీశారు.  ఏకంగా కబ్జాదారులు రాడ్లు, కట్టెలు, రాళ్లతో కొడుతూ పరుగులు పెట్టించారు.  దీంతో కుత్బుల్లాపూర్‌ మండల తహసిల్దార్‌ గౌతమ్‌కుమార్‌ జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆరుగురు భూకబ్జాదారులపై ల్యాండ్‌ గ్రాబింగ్, నాన్‌ బెయిలబుల్‌ కింద కేసులు నమోదు చేశారు.

వాట్సప్‌లో కబ్జాపై ఫిర్యాదు..
కుత్బుల్లాపూర్‌ తహసిల్దార్‌ గౌతమ్‌కుమార్‌కు గురువారం రాత్రి ఓ వ్యక్తి సెల్‌ ఫోన్‌ నుంచి వాట్సప్‌లో కబ్జా విషయంపై ఫిర్యాదు చేస్తూ మెసెజ్‌ పంపాడు. గాజులరామారం సర్వే నెంబరు 221 పరిధిలోని సుభాష్‌చంద్రబోస్‌ నగర్‌ లో స్థలం కబ్జా విషయం పై శుక్రవారం విచారణ చేపట్టేందుకు వీఆర్వో శ్యామ్‌కుమార్, వీఆర్‌ఏ, గిర్దావర్‌ ఉమామహేశ్వర గౌడ్‌ లు ఘటన స్థలానికి వెళ్లగా అప్పటికే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వెంటనే వెళ్లిన సిబ్బంది నిర్మాణాన్ని కూల్చి వేస్తుండగా భూక్జాదారులు షేక్‌ మౌలానా, సయ్యద్‌ జలీల్, మేస్త్రీ పాషా, షాదూల్, చాంద్‌పాషా, నఫీజ్‌బేగం ఒక్కసారిగా కూల్చివేతలు చేపడుతున్న సిబ్బందిపై రాళ్లు, కట్టెలతో దాడి చేయడంతో ప్రాణ భయంతో పరుగులు తీశారు.  ఈ  క్రమంలో సిబ్బందిపై బండరాళ్లు ఎత్తి హత్యాయత్నం కూడా చేశారు. 

సంఘటనా స్థలానికి తహసిల్దార్‌..
అక్రమ నిర్మాణం చేపట్టడమే కాకుండా సిబ్బందిపై దాడి చేసిన విషయాన్ని తెలుసుకున్న మండల తహసిల్దార్‌ గౌతమ్‌ కుమార్‌ హుటాహుటిన అక్కడికి జగద్గిరిగుట్ట పోలీసులతో కలిసి వెళ్లారు. అక్రమ నిర్మాణాన్ని క్షణాల్లో కూల్చివేయించి సదరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐపీసీ సెక్షన్‌  కింద ఆరుగురు కబ్జాదారులపై 557/2019, 332, 341, 34 ఐపీసీ, సెక్షన్‌(3), పీడీపీఎస్‌యాక్ట్‌ కింద నాన్‌బెయిలబుల్‌ కేసులునమోదు చేసినట్లు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement