thasildar
-
తహసీల్దారును నిర్బంధించిన వీఆర్వో
ఘంటసాల: కృష్ణాజిల్లా ఘంటసాల తహసీల్దారును మంగళవారం వీఆర్వో నాగమల్లేశ్వరి నిర్బంధించారు. తోటి వీఆర్వోను చెప్పుతో కొట్టబోయారు. తనకు న్యాయం చేయకపోతే కొడుకుతో సహా చనిపోతానంటూ ధర్నాకు దిగారు. ఈ వ్యవహారం సంచలనం కలిగించింది. ఘంటసాల మండలం ఘంటసాలపాలెం సచివాలయ వీఆర్వోగా బి.నాగమల్లేశ్వరి పనిచేస్తున్నారు. సచివాలయం పరిధిలోని ఘంటసాలపాలెం, కొత్తపల్లి, తాడేపల్లి గ్రామాల వీఆర్వోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ మూడు గ్రామాలకు సంబంధించిన పాస్‌బుక్ ఫైల్స్, ప్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, ఇతర రెవెన్యూ పనులను అధికారులు తన ప్రమేయం లేకుండానే కొడాలి, ఘంటసాల, లంకపల్లి వీఆర్వోలు తదితరులతో చేయిస్తున్నారని, తన సంతకాలు లేకుండా ఫైల్స్ ఆన్లైన్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఆమె మంగళవారం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. కొడాలి వీఆర్వోను చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించారు. కార్యాలయంలో తహసీల్దారు ఎన్.బి.విజయలక్షి్మని నిర్బంధించారు. తనకు న్యాయం చేసేంతవరకు తలుపులు తీయనని భీషి్మంచారు. బయట నుంచి సిబ్బంది కేకలు వేయడంతో ఆమె తలుపులు తీశారు. ఆమె కుమారుడు కార్యాలయం బయట గోడలపై పెట్రోల్ పోశాడు. కలెక్టర్, జేసీ, ఆర్డీవో వచ్చి తనకు న్యాయం చేయాలని, లేదా తన కుమారుడితో కలసి చనిపోతానంటూ కుమారుడితో కలసి తహసీల్దార్ చాంబర్ ముందు ధర్నాకు దిగారు. తన పరిధిలో పనులు తన ప్రమేయం లేకుండా జరగడంపై ఆర్డీవో విచారించాలని, తనకు న్యాయం చేయాలని తొమ్మిది నెలలుగా ఆర్డీవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ విషయమై తహసీల్దార్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో చల్లపల్లి సీఐ సీహెచ్.నాగప్రసాద్, ఎస్ఐ చినబాబు అక్కడికి వచ్చి వీఆర్వో నాగమల్లేశ్వరితో మాట్లాడారు. ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూద్దామని సర్దిచెప్పారు. అయినా నాగమల్లేశ్వరి ఆందోళన విరమించకపోవడంతో కలెక్టర్‌తో మాట్లాడిస్తామని సంబంధిత అధికారులతో చెప్పించి ధర్నా విరమింపజేశారు. ఈ విషయమై తహసీల్దార్ విజయలక్ష్మి మాట్లాడుతూ తాను ఎన్నికల విధుల్లో భాగంగా ఐదునెలలు కిందట ఘంటసాల వచ్చినట్లు చెప్పారు. తాను పనుల్ని ప్రాపర్ చానల్ ద్వారానే చేస్తున్నానని, ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. తన గదిలోకి వచ్చిన వీఆర్వో నాగమల్లేశ్వరి అక్కడే ఉన్న కొడాలి వీఆర్వోను చెప్పుతో కొట్టబోయిందని, ఏమైందని అడుగుతుండగానే అసభ్య పదజాలంతో తిట్టడమేగాక తలుపులు మూసేసిందని, అనంతరం తన చాంబర్ ముందు బైఠాయించిందని చెప్పారు. గత తహసీల్దార్ హయాంలో వీఆర్వోకు సంబంధం లేకుండా ఫైల్స్ చేశారని వీఆర్వో ఆరోపిస్తున్నట్లు తెలిపారు. ఆర్డీవో నుంచి వీఆర్వోపై వచ్చిన రిపోర్టు చూసి ఆగ్రహంతో ఆందోళన చేసి ఉంటుందని భావిస్తున్నట్లు తహసీల్దార్ పేర్కొన్నారు. -
తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం
నర్సింహులపేట: తన పేరున భూమి పట్టా మార్పిడి కావడం లేదని, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని మహ బూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం హజ తండాకు చెందిన భూక్య బాలు అనే రైతు గురువారం పురుగు మందు డబ్బాతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. తండాలోని 498 సర్వేనంబర్‌లో తనకు 6 ఎకరాల భూమి ఉందని, అయితే ఆ భూమి భూక్య బాలు, భూక్య భద్రు పేరిట ఉన్నట్లు రికా ర్డులో చూపిస్తోందని, దానిని తన పేరిట పట్టాచేయాలని 6 నెలల నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని బాలు అవేదన వ్యక్తం చేశాడు. తన కూతురు పెళ్లి కోసం ఆ భూమి ని అమ్మానని, అయితే తన పేర పట్టాకాక పోవడంతో ఇబ్బందులు పడుతున్నానని తెలిపాడు. ఇదిలా ఉండగా బాలుకు సంబంధించిన వ్యక్తులు కార్యాలయంలో మా ట్లాడుతుండగానే ఆయన పురుగుమందు డబ్బాతో చెట్టు ఎక్కాడు. సమస్య పరిష్కరి స్తామని తహసీల్దార్ నాగరాజు హమీ ఇవ్వడంతో కిందికి దిగాడు. ›ఈ అంశంపై తహసీల్దార్ నాగరాజు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
భూ బదలాయింపు బాధ్యత తహసీల్దార్లకే..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదలకు ఆ భూములను క్రమబద్ధీకరించే ప్రక్రియ మొదలైంది. దీనికి సంబంధించి గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన జీవో 59 అమలు ఓ కొలిక్కి వస్తోంది. క్రమబద్ధీకరణకు ఆమోదం పొంది, ఫీజు పూర్తిగా చెల్లించిన దరఖాస్తుదారుల పేరిట సదరు భూములను బదలాయించేందుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిత్తల్ మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ భూములను బదలాయించే బాధ్యత తహసీల్దార్లకు అప్పగించారు. తహసీల్దార్ల లాగిన్లలో ఈ డీడ్లను అందుబాటులో ఉంచాలని, వాటిపై తహసీల్దార్ల సంతకం తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల మేరకు.. జీవో 59 కింద ఆమోదం పొందిన భూములకు సంబంధించిన కన్వేయన్స్ డీడ్లను సబ్ రిజిస్ట్రార్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. తద్వారా ఇప్పటివరకు కేవలం ఆక్రమణదారులుగా ఉన్న వేలాది మందికి ఆ స్థలాలపై పూర్తి హక్కులు సంక్రమిస్తాయి. ఆ భూములను అవసరమైతే విక్రయించుకోవడానికి కూడా హక్కు లభించనుంది. సీసీఎల్ఏగా బాధ్యతలు స్వీకరించాక నవీన్ మిత్తల్ తొలిసారి జారీచేసిన అధికారిక ఉత్తర్వులు జీవో 59కి సంబంధించినవే కావడం, ఈ ప్రక్రియ పూర్తి బాధ్యతలను తహసీల్దార్లకే అప్పగించడం గమనార్హం. తక్కువ ధర ఉన్న ప్రాంతాల్లో.. రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఇళ్లుకట్టుకున్న పేదలకు వాటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం జీవో 58, 59లను జారీ చేసింది. వీటికింద గత ఏడాది ఫిబ్రవరిలో దరఖాస్తులను స్వీకరించారు. జీవో 58 కింద ఉచితంగా, 59 కింద ప్రభుత్వం నిర్ధారించిన ఫీజును కట్టించుకుని.. సదరు స్థలాలను క్రమబద్ధీకరించేలా చర్యలు చేపట్టారు. జీవో 59 కింద క్రమబద్ధీకరణ కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ప్రభుత్వ విలువ చదరపు గజానికి రూ.7 వేల కంటే తక్కువగా ఉన్న ప్రాంతాల్లోని దరఖాస్తులను పరిశీలించి ఆమోదం తెలిపారు. ఇవి 25వేల వరకు ఉంటాయని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ఈ దరఖాస్తులకు సంబంధించి కన్వేయన్స్ డీడ్లను జారీ చేసేందుకు సీసీఎల్ఏ తాజాగా మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రభుత్వ విలువ రూ.7 వేల కంటే అధికంగా ఉన్న స్థలాల విషయంలో ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం ఉన్నతస్థాయిలో కసరత్తు చేస్తోందని, ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. సీసీఎల్ఏ జారీ చేసిన మార్గదర్శకాలివీ.. ►జీవో 59 కింద ఆమోదం పొంది, నిబంధనల మేరకు ప్రభుత్వానికి ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకు సంబంధించిన కన్వేయన్స్ డీడ్ (భూబదలాయింపు డాక్యుమెంట్æ) తహసీల్దార్ లాగిన్లోకి వస్తుంది. ►తహసీల్దార్లు మీసేవ వెబ్ పోర్టల్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. అందులో జీవో 59 కింద కన్వేయన్స్ డీడ్లను ప్రాసెస్ చేసే ఆప్షన్ ఉంటుంది. ►తహసీల్దార్ బయోమెట్రిక్ నమోదు చేసి ఈ ప్రాసెస్‌ను పూర్తి చేయవచ్చు. లాగిన్‌లో దరఖాస్తు నంబర్, గ్రామాల వారీగా కన్వేయన్స్ డీడ్లు అందుబాటులో ఉంటాయి. ఈ కన్వేయన్స్ డీడ్లలో లబ్ధిదారుల పూర్తి వివరాలను నమోదు చేయడంతోపాటు పాటు జారీచేసే పూర్తి బాధ్యతలను తహసీల్దార్ నిర్వర్తించాల్సి ఉంటుంది. ►సదరు దరఖాస్తును ఆమోదించడంతో కన్వేయన్స్ డీడ్ డౌన్లోడ్ అవుతుంది. ఇలా డౌన్లోడ్ చేసుకునే ముందే అన్ని వివరాలను సరిచూసుకోవాల్సి ఉంటుంది. ►డౌన్లోడ్ అయిన డీడ్ (మూడు పేజీలు) ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రింట్‌పై తహసీల్దార్ సంతకం చేయడంతోపాటు ఆఫీస్ స్టాంప్ వేయాల్సి ఉంటుంది. ►ఇలా తహసీల్దార్ సంతకం చేసిన కన్వేయన్స్ డీడ్లను సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, ట్రాన్స్ఫర్ డ్యూటీ వంటివేవీ వసూలు చేయకూడదు. ►ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసిన ఈ డాక్యుమెంట్‌ను ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయాల్సి ఉంటుంది. ఇలా అందజేసే సమయంలో తహసీల్దార్ జారీచేసిన కన్వేయన్స్ డీడ్‌ను, సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్‌ను లబ్ధిదారుడికి ఇవ్వాలి. ►కన్వేయన్స్ డీడ్ కాపీని మీసేవ పోర్టల్‌లో కూడా అప్లోడ్ చేయడంతో జీవో 59 కింద సదరు భూమిని లబ్ధిదారుడికి బదలాయించే ప్రక్రియ ముగుస్తుంది. -
ఏసీబీకి చిక్కిన కాటారం తహసీల్దార్
-
ఇటు నుంచి ఇటే జైలుకు పంపేవాళ్లం
సాక్షి, హైదరాబాద్: ఓ భూ వివాదానికి సంబంధించి సింగిల్ జడ్జి ఉత్తర్వులను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో ఎస్.శ్రీను, తహసీల్దార్ యు.ఉమాదేవిలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ పిటిషన్లపై అప్పీల్ దాఖలు చేసిన కేసుల్లో సదరు అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. ఈ రోజు విచారణకు హాజరై ఉంటే.. ఇటు నుంచి ఇటే ఈ ముగ్గురిని జైలుకు పంపేవాళ్లమని హెచ్చరించింది. ఓ భూ వివాదం వ్యవహారంలో ఈ ముగ్గురు అధికారులకు 2 నెలల జైలు, రూ.2 వేలు జరిమానా విధిస్తూ 2020 డిసెంబర్ 15న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన అప్పీళ్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా సదరు అధికారులు హాజరయ్యారా అని ధర్మాసనం ప్రశ్నించగా.. లేదని ప్రభుత్వ న్యాయవాది చెప్ప డంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘సింగిల్ జడ్జి ఆదేశాల్లో లోపం ఎక్కడ ఉందో చెప్పకుండా ఆదేశాలను అమలు చేయలే దు. పైగా కోర్టు ఆదేశాలను తమకు అనుకూలంగా మల్చుకు నే ప్రయత్నం చేశారు. పిటిషనర్లకు పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఇవ్వాలని ఆదేశించినా.. ఇవ్వకపోగా రుజువు చేయకుండా పిటిషనర్ ఆక్రమణదారుడు అని ఎలా అంటారు? సింగిల్ జడ్జి ఉత్తర్వులపై అభ్యంతరముంటే ఆ ఉత్తర్వులను ఎత్తేయా లని కోరాలి. ఇవేమీ చేయకుండా నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ చేయాల్సిందంతా చేసి బేషరతు క్షమాపణలు కోరితే అంగీకరించం’అని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణకు ఈ ముగ్గురు అధికారులు హాజరుకావాలని స్పష్టం చేస్తూ విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేసింది. సింగిల్ జడ్జి ఏమన్నారంటే.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఈజె డేవిడ్.. ఎనిమిదేళ్ల క్రితం సంగారెడ్డి రెడ్డి జిల్లా కంది సమీపంలోని చిమ్నాపూర్‌లో ఐదెకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమికి పట్టాదార్ పాస్‌బుక్ ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా.. అది ప్రభుత్వ భూమి అని రెవెన్యూ అధికారులు అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో డేవిడ్ హైకోర్టును ఆశ్రయించగా.. రెవెన్యూ అధికారులు పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జి ఆదేశించారు. అయితే.. ఈ భూమికి సంబంధించి విలేజ్ మ్యాప్, టిప్పన్, వసూల్ బక్వాయి, సేత్వా ర్ తదితర రికార్డులు లేవని, ఇవి ‘ఖిల్లాదాఖ్లా’భూములంటూ డేవిడ్ దరఖాస్తును తహసీల్దార్ తిరస్కరించారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ఆర్డీవో, తర్వాత అదనపు కలెక్టర్ ముందు అప్పీల్ దాఖలు చేయగా.. తహసీల్దార్ ఆదేశాలను సమర్థిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ కింద డేవిడ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు.. అధికారులు ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ ముగ్గురికి రెండు నెలల జైలు, రూ.2 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. -
తహశీల్దార్ హత్యపై కేసీఆర్ విచారం
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే సీఎం కేసీఆర్ పోలీసు అధికారులతో మాట్లాడారు. నేరస్తులను పట్టుకుని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
తహశీల్దార్ సజీవ దహనం : నిందితులపై కఠిన చర్యలు..
-
దారుణం; తహశీల్దార్ సజీవ దహనం
-
దారుణం; తహశీల్దార్ సజీవ దహనం
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తహశీల్దార్ విజయరెడ్డి తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు. ఆమెకు కాపాడాటానికి ప్రయత్నించిన పలువురు కూడా గాయాల పాలయ్యారు. కార్యాలయంలో ఆమె విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే ఈ దారుణమైన ఘటన చోటుచేసుకోవడం సంచలనం రేపింది. తొలుత తహశీల్దార్‌తో మాట్లాడటానికి లోపలికి వెళ్లిన దుండుగుడు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. విషయం తెలుసుకున్న పోలీసు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడిని గౌరెల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితులపై కఠిన చర్యలు.. తహశీల్దార్ దారుణ హత్య విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. నిందితులు ఎవరైనా చట్టపరమైన కఠిన శిక్షలు అమలు చేయాలి అధికారులను ఆదేశించారు. ఏదైనా సమస్య ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వచ్చి సమస్య పరిష్కరించేందుకు కృషి చేయాలే తప్ప అధికారులపై ఇలాంటి చర్యలు చేయడం దారుణమని అన్నారు. అనంతరం ఘటనాస్థలికి చేరుకుని అక్కడి అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. -
బరి తెగించిన కబ్జాదారులు
కుత్బుల్లాపూర్: కబ్జాదారులు మరోసారి రెచ్చిపోయారు.. తహసిల్దార్ గౌతమ్‌కుమార్, ఆర్ఐ నరేందర్‌రెడ్డిలపై కిరోసిన్ చల్లి, రాళ్లతో దాడి చేసిన ఘటన మరువక ముందే మరో ఘటన కలకలం రేపింది. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు వెళ్లిన వీఆర్వో, వీఆర్ఏ,గిర్దావర్‌పై మూకుమ్మడి దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో వారు భయంతో పరుగుతీశారు. ఏకంగా కబ్జాదారులు రాడ్లు, కట్టెలు, రాళ్లతో కొడుతూ పరుగులు పెట్టించారు. దీంతో కుత్బుల్లాపూర్ మండల తహసిల్దార్ గౌతమ్‌కుమార్ జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆరుగురు భూకబ్జాదారులపై ల్యాండ్ గ్రాబింగ్, నాన్ బెయిలబుల్ కింద కేసులు నమోదు చేశారు. వాట్సప్‌లో కబ్జాపై ఫిర్యాదు.. కుత్బుల్లాపూర్ తహసిల్దార్ గౌతమ్‌కుమార్‌కు గురువారం రాత్రి ఓ వ్యక్తి సెల్ ఫోన్ నుంచి వాట్సప్‌లో కబ్జా విషయంపై ఫిర్యాదు చేస్తూ మెసెజ్ పంపాడు. గాజులరామారం సర్వే నెంబరు 221 పరిధిలోని సుభాష్‌చంద్రబోస్ నగర్ లో స్థలం కబ్జా విషయం పై శుక్రవారం విచారణ చేపట్టేందుకు వీఆర్వో శ్యామ్‌కుమార్, వీఆర్ఏ, గిర్దావర్ ఉమామహేశ్వర గౌడ్ లు ఘటన స్థలానికి వెళ్లగా అప్పటికే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వెంటనే వెళ్లిన సిబ్బంది నిర్మాణాన్ని కూల్చి వేస్తుండగా భూక్జాదారులు షేక్ మౌలానా, సయ్యద్ జలీల్, మేస్త్రీ పాషా, షాదూల్, చాంద్‌పాషా, నఫీజ్‌బేగం ఒక్కసారిగా కూల్చివేతలు చేపడుతున్న సిబ్బందిపై రాళ్లు, కట్టెలతో దాడి చేయడంతో ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో సిబ్బందిపై బండరాళ్లు ఎత్తి హత్యాయత్నం కూడా చేశారు. సంఘటనా స్థలానికి తహసిల్దార్.. అక్రమ నిర్మాణం చేపట్టడమే కాకుండా సిబ్బందిపై దాడి చేసిన విషయాన్ని తెలుసుకున్న మండల తహసిల్దార్ గౌతమ్ కుమార్ హుటాహుటిన అక్కడికి జగద్గిరిగుట్ట పోలీసులతో కలిసి వెళ్లారు. అక్రమ నిర్మాణాన్ని క్షణాల్లో కూల్చివేయించి సదరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐపీసీ సెక్షన్ కింద ఆరుగురు కబ్జాదారులపై 557/2019, 332, 341, 34 ఐపీసీ, సెక్షన్(3), పీడీపీఎస్యాక్ట్ కింద నాన్‌బెయిలబుల్ కేసులునమోదు చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. -
ఇంటి స్థలం కోసం పట్టు
సాక్షి, పాలకొల్లు అర్బన్: నిరుపేదలకు ఇంటి స్థలాలిస్తామన్నారు. దీని కోసం గ్రామంలో భూమి సేకరించారు. రెండు సెంట్లు వంతున పట్టాలిచ్చారు. అయితే భూమి కేటాయించే సమయంలో అనర్హులను కూడా లబ్ధిదారుల జాబితాలో చేర్చి అందరికీ సెంటు భూమి వంతున కేటాయించారు. దీంతో లబ్ధిదారులు తమకు సెంటు భూమి పట్టా వద్దంటూ ఆదివారం ఆందోళన చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. పాలకొల్లు మండలం సగం చెరువులో దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి నిరుపేదలకు ఇంటిస్థలాలివ్వాలనే లక్ష్యంతో ఆర్ఎస్ నెం.121/4డీ, 4ఎఫ్, 5బీ సర్వే నంబర్లలో 0.67 ఎకరాల భూమిసేకరించారు. అప్పట్లో 18మంది లబ్ధిదారులను గుర్తించి ఒక్కొక్కరికి 2 సెంట్లు చొప్పున పట్టాలిచ్చారు. 2007లో లబ్ధిదారులకు ఇంటి స్థలం పట్టాలిచ్చినా స్థలం కేటాయించ లేదు. అప్పటి నుంచి లబ్ధిదారులు తమకు ఇంటి స్థలాలు కేటాయించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకపోయింది. సగంచెరువులో సేకరించిన 67 సెంట్ల భూమి గతేడాది ఆగస్టులో అనర్హులను కొంత మందిని చేర్చి 42 మందికి ఒక సెంటు చొప్పున స్థలం కేటాయిస్తూ పట్టాలిచ్చారు. సెంటు స్థలం ఎటూ సరిపోదని, సెంటున్నర కేటాయించాలని లబ్ధిదారులు ఇటీవల సగంచెరువులో వైఎస్సార్ సీపీ కన్వీనర్ గుణ్ణం నాగబాబుకి లబ్ధిదారులంతా ఫిర్యాదు చేశారు. లబ్ధిదారుల ఫిర్యాదు మేరకు కన్వీనర్ గుణ్ణం నాగబాబు తహసీల్దార్‌కి ఫోన్లో మాట్లాడి దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో భూమి సేకరించామని, అర్హులందరికీ న్యాయం చేయాలని కోరడంతో అప్పటి తహసీల్దార్ దాసి రాజు వీఆర్వోతో గ్రామంలో సర్వే చేసి గ్రామంలో 14 మంది అనర్హులను గుర్తించారు. ఈ 14 మంది పట్టాలు రద్దు చేసి వారికి కేటాయించిన స్థలాన్ని పాత లబ్ధిదారులకు అర సెంటు చొప్పున పెంచి సెంటున్నర పట్టా కేటాయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. స్థలాల వద్ద ఆందోళన ఇందిరమ్మ పట్టాలు ఇచ్చిన స్థలాల్లో ఆదివారం లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. స్థలాల్లో ఆందో ళన శిబిరం ఏర్పాటు చేశారు. 14 మంది అనర్హుల్లో ఎవరైనా వచ్చి ఇళ్లు కట్టే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు. అలాగే అనర్హుల జాబితా పంచాయతీవద్ద ప్రదర్శించి నిజౖ మెన లబ్ధిదారులకు న్యాయంచేయాలని కోరుతున్నారు. -
తహసీల్దార్ సుధను అరెస్టు చేశాం
సాక్షి, సిటీబ్యూరో: చిట్టీల పేరుతో చీటింగ్ చేసి చిక్కిన తహసీల్దార్ లింగాల సుధ అరెస్టు విషయాన్ని హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు యాదాద్రి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న ఏసీపీ జి.వెంకటేశ్వర్లు గురువారం లేఖ రాశారు. ఈమె తన సమీప బంధువులతో పాటు మరికొందరితో కలిసి సనత్‌నగర్ కేంద్రంగా అక్రమంగా చిట్టీల దందా నిర్వహించడంతో పాటు రూ.2 కోట్లు స్వాహా చేసిన కేసులో అరెస్టైన విషయం విదితమే. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి అరెస్టై, 48 గంటలకు మించి రిమాండ్‌లో ఉంటే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రాథమికంగా సంబంధిత శాఖాధిపతి సదరు ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు వేస్తారు. ఇందుకుగాను పోలీసులు అరెస్టుకు సంబంధించి అధికారిక సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. యాదాద్రి జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగంలో తహశీల్దార్‌గా పని చేస్తున్న సుధను సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్గూడలోని మహిళా జైలుకు పంపారు. శుక్రవారంతో సుధ 48 గంటల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న నేపథ్యంలో సీసీఎస్ పోలీసులు యాదాద్రి కలెక్టర్‌కు ఈ విషయం తెలియపరుస్తూ లేఖ రాశారు. మరోపక్క ఈ స్కామ్‌లో నిందితుల చేతిలో మోసపోయిన వారిలో అత్యధికులు ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వారే ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది సుధ ప్రోద్బలంతోనే చిట్టీలో సభ్యులుగా చేరినట్లు పోలీసులు చెబుతున్నారు. మరోపక్క చిట్టీలు పాడుకున్న వారిలో కొందరికి డబ్బు చెల్లించడానికి ముఠా సభ్యులు చెక్కులు జారీ చేశారు. ఈ ఖాతా సైతం సుధతో పాటు మరో నిందితుడి పేరుతో ఉన్న జాయింట్ ఖాతా కావడం గమనార్హం. వీరు చిట్టీ పాడుకున్న వారిలో కొందరికి నగదు ఇవ్వకుండా నెలకు నూటికి రూ.2 వడ్డీ ఇస్తామంటూ తమ వద్దే డిపాజిట్‌గా ఉంచుకున్నారు. దీంతో ఈ కేసులో సీసీఎస్ పోలీసులు డిపాజిట్‌దారుల పరిరక్షణ చట్టంలోని సెక్షన్లను సైతం పొందుపరిచారు. వీటి ప్రకారం నమోదైన కేసుల్లో నిందితుల ఆస్తుల్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే సుధతో పాటు ఇతరుల పేర్లతో సిటీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కొన్ని స్థిరాస్తులను గుర్తించిన సీసీఎస్ పోలీసులు వాటి జాబితా రూపొందించారు. వీటిని సీజ్ చేయడానికి అను మతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. సర్కారు అనుమతితో సీజ్ చేసిన తర్వాత ఆ జాబితాలను కోర్టుకు సమర్పిస్తామని, ఇతర చర్యల తర్వాత న్యాయస్థానం వాటిని వేలం లో విక్రయించడం ద్వారా వచ్చిన మొత్తాన్ని బా«ధితులకు పంచుతుందని అధికారులు తెలిపారు. -
తొండంగి తహసీల్దార్‌పై ఏసీబీ విచారణ
తొండంగి (తుని) : తాము కొనుగోలు చేసిన జిరాయితీ భూమికి సంబంధించి ఆన్లైన్ అండగళ్‌లో వివరాలు నమోదు చేసేందుకు తహసీల్దార్ సొమ్ములు డిమాండ్ చేశారని బాధితుడు ఫిర్యాదుపై శనివారం రాజమండ్రి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) సీఐ పి.వి.సూర్యమోహన్ తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేశారు. బాధితుడు, రిటైర్డ్ జిల్లా అగ్నిమాపక శాఖాధికారి సంకు వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి... కోన ఫారెస్టు పరిధిలో తన భార్య సంకు గిరిజ పేరున సర్వే నెంబర్ 47/18, 47/19లలో 2.05 ఎకరాల భూమిని 2006లో కొనుగోలు చేసి తుని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ భూమికి సంబంధించిన వివరాలు జిరాయితీ భూమిగా ఆన్లైన్లోని 1బీ ఫారంలో కూడా నమోదైంది. అంతేకాకుండా అప్పటి రెవెన్యూ అధికారులు గిరిజ యజమానిగా పేర్కొంటూ పట్టాదారు పాసుపుస్తకం, భూ యాజమాన్యం హక్కుపత్రాలను మంజూరు చేశారు. అయితే ఆన్లైన్ అడంగళ్ వివరాలలో సంకు గిరిజ నమోదైనట్టు రాకపోవడంతో ఆన్లైన్ చేయాలని 2016లో దరఖాస్తు చేసుకున్నారు. దీని కోసం పలు దఫాలుగా తిరిగినప్పటికీ తహసీల్దార్ టి.వి.సూర్యనారాయణ, కంప్యూటర్ సిబ్బంది కూడా పట్టించుకోలేదని, ఆన్లైన్ అడంగళ్ నమోదు చేసేందుకు తహసీల్దార్ రూ.రెండు లక్షలు సొమ్ము డిమాండ్ చేశారంటూ 2016 ఆగస్టులో ముఖ్యమంత్రికి, ఏసీబీ డీజీపీకి, ఇతర అధికారులకు భార్య సంకు గిరిజ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈనేపథ్యంలో రాజమండ్రి ఏసీబీ సీఐ పి.వి.సూర్యమోహన్ తహసీల్దార్ టి.వి.సూర్యనారాయణను విచారణ చేశారు. ఈవిచారణకు సంకు వెంకటేశ్వరరావు కూడా హాజరయ్యారు. అయితే కోనఫారెస్టు భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులో అసైన్డ్ భూమిగా ఉందని, ఈవిధంగా చాలా మంది భూముల పెండింగ్‌లో ఉన్నాయంటూ తహసీల్దార్ సూర్యనారాయణ ఏసీబీ అధికారి సూర్యమోహన్‌కు వివరణ ఇచ్చారు. 1975 తర్వాత కోనఫారెస్టు అసైన్డ్ భూములను రైతులకు ప్రభుత్వం పట్టాలిచ్చిందన్నారు. ఈ భూములనే ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల కల్పన సంస్థ) సేకరించిందన్నారు. ఆన్లైన్ అడంగళ్ చేసేందుకు తాను ఎటువంటి సొమ్ములు డిమాండ్ చేయలేదని, వాస్తవంగా ప్రస్తుతం ఉన్న రికార్డుల్లో ఉన్న విషయాన్నే తెలిపానన్నారు. కలెక్టర్, ఆర్డీవో, డీఆర్వో అధికారులతో చర్చించి ఆన్లైన్ ప్రక్రియపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. విచారణ పూర్తయిన అనంతరం సూర్యమోహన్ మాట్లాడుతూ తహసీల్దార్‌పై వచ్చిన ఫిర్యాదుతో ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ విచారణ చేపట్టామన్నారు. విచారణ పూర్తిస్థాయిలో జరిగిన అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. వాస్తవంగా క్షేత్రస్థాయిలో కూడా భూమి రికార్డుల ప్రకారం సంబం«ధిత భూమి అమ్మిన రైతులను కూడా విచారణ చేస్తామని వివరించారు. కాగా ఇలాంటి సంఘటనపై గతంలో కూడా ఏసీబీ అధికారులు రెవెన్యూ కార్యాలయంలో విచారణ చేపట్టినట్టు సమాచారం. వరుస ఏసీబీ అధికారుల విచారణలతో రెవెన్యూ అధికారుల్లో గుబులు మొదలైంది. -
మా భూములు అప్పగించండి
మర్రిపాడు : మండలంలోని పొంగూరు గ్రామానికి చెందిన దళితులు తమ భూములు తమకు అప్పగించాలని శుక్రవారం తహసీల్దారు సులోచనకు ఫిర్యాదుచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో భూపంపిణీ 6, 7 విడతల్లో ప్రభుత్వం తమకు భూములు మంజూరుచేసిందన్నారు. ఆ సమయంలో కొంతమందికి మాత్రమే పాసుపుస్తకాలు ఇచ్చారని చెప్పారు. పాసుపుస్తకాలు ఇచ్చినప్పటికీ పేదవారం కావడంతో భూములు సాగుచేసుకోలేకపోయామన్నారు. దీంతో బీడుగా వాటిని ఆక్రమించారని ఆవేదన వ్యక్తంచేశారు. భూములకు సంబంధించిన పాసుపుస్తకాలు, రికార్డులను చూపించారు. ప్రస్తుతం సోమశిల హైలెవల్ కెనాల్ నిర్మాణ పనుల్లో భాగంగా భూములన్నీ మునకకు గురవుతున్నాయన్నారు. దీంతో వాటికి గిరాకీ ఏర్పడిందన్నారు. మరికొంతమంది భూములను రికార్డుల్లో అక్రమంగా మారుస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారాన్ని స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. విచారణ జరిపి న్యాయం చేయకపోతే నిరాహారదీక్ష చేపడుతామన్నారు. దీనిపై తహసీల్దార్ మాట్లాడుతూ భూముల విషయమై ఇప్పటికే ఆర్ఐ, వీఆర్వో ద్వారా విచారణ జరిపిస్తున్నామన్నారు. మిగిలిన భూములపై కూడా పూర్తిస్థాయిలో విచారణ జరిపి అర్హులైన వారికి భూములను అందచేస్తామని చెప్పారు. -
రైతుపై రాయితీ
సాక్షి, కర్నూలు : సూక్ష్మ సేద్యంపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. రాయితీల్లో కోత విధిస్తూ తీసుకున్న నిర్ణయం రైతులకు శాపంగా మారుతోంది. సాగునీటి సమస్యతో అల్లాడిపోతున్న రైతులు ఈ మార్పును జీర్ణించుకోలేకపోతున్నారు. సూక్ష్మ సేద్యం విస్తీర్ణాన్ని పెంచుతూ భూగర్భ జలాలను పరిరక్షించాల్సిన ప్రభుత్వం.. కరువు మండలాలు, కరువు లేని మండలాలకు వేర్వేరుగా రాయితీ ఇవ్వాలని నిర్ణయించడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ప్రతి సంవత్సరం దాదాపు 35 వేల హెక్టార్లలో సాగవుతున్న సూక్ష్మ సేద్యంపై ఆ ప్రభావం చూపనుంది. అయితే కేంద్రం తగ్గించిన రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే ఊరట లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యవసాయ రంగంలో సూక్ష్మ సేద్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యధిక రాయితీ కల్పిస్తున్నాయి. సన్న, చిన్న కారు రైతులైన ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పూర్తిగా వంద శాతం రాయితీపై బిందు సేద్యం పరికరాలు అందజేస్తున్నారు. బీసీలకు 90 శాతం రాయితీ లభిస్తోంది. 5 నుంచి 10 ఎకరాల భూమి కలిగిన రైతులకు 75 శాతం రాయితీ.. 15 నుంచి 20 ఎకరాల భూమి కలిగిన రైతులకు 60 శాతం రాయితీ కల్పించారు. అయితే ఇకపై కొత్త రాయితీ అమల్లోకి రానుంది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు.. కరువు పీడిత మండలాల్లో సన్న, చిన్నకారు రైతులకు 50 శాతం రాయితీ.. పెద్ద రైతులకు 35 శాతం రాయితీ మాత్రమే లభించనుంది. ఈ రెండింట్లో 10 శాతం రాయితీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలనే నిబంధన విధించారు. కరువులేని సాధారణ మండలాల్లో చిన్న రైతులకు 35 శాతం రాయితీ.. పెద్ద రైతులకు 25 శాతం రాయితీ అమలు చేయనున్నారు. ఈ రెండింట్లోనూ రాష్ట్ర వాటాగా 10 శాతం భరించాల్సి ఉంది. తాజా మార్గదర్శకాల నేపథ్యంలో బిందు సేద్యంపై రైతుల్లో సందిగ్ధం నెలకొంది. ఇందుకు సంబంధించి యూనిట్ల మంజూరుకు యేటా నిబంధనల్లో మార్పు చోటు చేసుకుంటోంది. గత ఏడాది 17 రకాల నిబంధనలు అమలు చేశారు. గతంలో బిందు, తుంపర సేద్యం యూనిట్లను పొలంలో అమర్చిన తర్వాత భూసార పరీక్షల నివేదిక కోరేవారు. గత ఏడాది దరఖాస్తుతో పాటే భూసార పరీక్ష నివేదిక, తహశీల్దార్, ఉప తహశీల్దార్, ఉద్యానవన శాఖ అధికారుల్లో ఎవరిదో ఒకరి ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేశారు. పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్‌డీడ్.. ఒకవేళ టైటిల్‌డీడ్ బ్యాంకులో ఉంటే ఫాం-1(బీ)పై తహశీల్దార్ సంతకం ఉండాలనే నిబంధన విధించారు. అదేవిధంగా బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు తప్పకుండా తీసుకురావాలనే మెలిక పెట్టడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. తాజాగా రాయితీల్లోనూ కోత విధించడం రైతులను ఈ సేద్యం పట్ల విముఖతకు కారణమవుతోంది. ఉత్తర్వులు అందలేదు కేంద్ర ప్రభుత్వం రాయితీల్లో కోత విధించడం వాస్తవమే. జిల్లా స్థాయిలో అందుకు సంబంధించిన ఉత్తర్వులు అందాల్సి ఉంది. మంత్రివర్గం రెండు రోజుల క్రితమే ఏర్పాటైంది. ఈ విభాగానికి మంత్రి ఎవరో ఇంకా ఖరారు కాలేదు. మంత్రి తీసుకునే నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యలు చేపడతాం. ఈ ఏడాది యాక్షన్ ప్లాన్ ఇంకా పూర్తి కానందున బిందు సేద్యం పరికరాలు ఎవరికీ అందజేయలేదు. - పుల్లారెడ్డి, పీడీ, ఏపీఎంఐపీ