సగంచెరువులో 2 సెంట్లు స్థలం కేటాయిస్తూ ఇచ్చిన పట్టాలను చూపిస్తున్న లబ్ధిదారులు
సాక్షి, పాలకొల్లు అర్బన్: నిరుపేదలకు ఇంటి స్థలాలిస్తామన్నారు. దీని కోసం గ్రామంలో భూమి సేకరించారు. రెండు సెంట్లు వంతున పట్టాలిచ్చారు. అయితే భూమి కేటాయించే సమయంలో అనర్హులను కూడా లబ్ధిదారుల జాబితాలో చేర్చి అందరికీ సెంటు భూమి వంతున కేటాయించారు. దీంతో లబ్ధిదారులు తమకు సెంటు భూమి పట్టా వద్దంటూ ఆదివారం ఆందోళన చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.
పాలకొల్లు మండలం సగం చెరువులో దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి నిరుపేదలకు ఇంటిస్థలాలివ్వాలనే లక్ష్యంతో ఆర్‌ఎస్ నెం.121/4డీ, 4ఎఫ్, 5బీ సర్వే నంబర్లలో 0.67 ఎకరాల భూమిసేకరించారు. అప్పట్లో 18మంది లబ్ధిదారులను గుర్తించి ఒక్కొక్కరికి 2 సెంట్లు చొప్పున పట్టాలిచ్చారు. 2007లో లబ్ధిదారులకు ఇంటి స్థలం పట్టాలిచ్చినా స్థలం కేటాయించ లేదు. అప్పటి నుంచి లబ్ధిదారులు తమకు ఇంటి స్థలాలు కేటాయించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకపోయింది.
సగంచెరువులో సేకరించిన 67 సెంట్ల భూమి
గతేడాది ఆగస్టులో అనర్హులను కొంత మందిని చేర్చి 42 మందికి ఒక సెంటు చొప్పున స్థలం కేటాయిస్తూ పట్టాలిచ్చారు. సెంటు స్థలం ఎటూ సరిపోదని, సెంటున్నర కేటాయించాలని లబ్ధిదారులు ఇటీవల సగంచెరువులో వైఎస్సార్ సీపీ కన్వీనర్ గుణ్ణం నాగబాబుకి లబ్ధిదారులంతా ఫిర్యాదు చేశారు. లబ్ధిదారుల ఫిర్యాదు మేరకు కన్వీనర్ గుణ్ణం నాగబాబు తహసీల్దార్‌కి ఫోన్‌లో మాట్లాడి దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో భూమి సేకరించామని, అర్హులందరికీ న్యాయం చేయాలని కోరడంతో అప్పటి తహసీల్దార్ దాసి రాజు వీఆర్వోతో గ్రామంలో సర్వే చేసి గ్రామంలో 14 మంది అనర్హులను గుర్తించారు. ఈ 14 మంది పట్టాలు రద్దు చేసి వారికి కేటాయించిన స్థలాన్ని పాత లబ్ధిదారులకు అర సెంటు చొప్పున పెంచి సెంటున్నర పట్టా కేటాయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
స్థలాల వద్ద ఆందోళన
ఇందిరమ్మ పట్టాలు ఇచ్చిన స్థలాల్లో ఆదివారం లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. స్థలాల్లో ఆందో ళన శిబిరం ఏర్పాటు చేశారు. 14 మంది అనర్హుల్లో ఎవరైనా వచ్చి ఇళ్లు కట్టే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు. అలాగే అనర్హుల జాబితా పంచాయతీవద్ద ప్రదర్శించి నిజౖ మెన లబ్ధిదారులకు న్యాయంచేయాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment