
వైఎస్సార్ జిల్లా, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తన నియోజకవర్గం పులివెందులలో రెండోరోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్ రాజారెడ్డి కంటి ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు. అనంతరం.. ఆయన ఆస్పత్రి అంతా తిరిగి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు.

పులివెందులలో గత కొన్ని దశాబ్దాలుగా రాజారెడ్డి ఆస్పత్రి సేవలు అందిస్తోంది. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ఆస్పత్రిలో లోనే పని చేసి రూపాయి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే.. ఈ ఆస్పత్రిని ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు.

ప్రముఖ ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్, వైయస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ ఆస్పత్రిని అధునీకరించడం విశేషం. రాజారెడ్డి ఐ సెంటర్‌గా ఇవాళ జగన్ చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. తక్కువ ఖర్చుతో అత్యాధునిక సౌకర్యాలతో ఇక నుంచి ఈ రాజారెడ్డి ఆస్పత్రి కంటి వైద్య సేవలు అందించనుంది.

Comments
Please login to add a commentAdd a comment