ys rajareddy
-
పులివెందుల చరిత్రలో పెద్దాయనది ఒక ప్రత్యేకత.. జనం గుండెల్లో చెరగని ముద్ర
పులివెందుల : పులివెందుల చరిత్రలో పెద్దాయనది ఒక ప్రత్యేకత. పేద ప్రజలకు.. తమ కుటుంబాన్ని నమ్ముకున్నవారికి అండగా నిలిచేవారు. కరువు లాంటి విపత్కర పరిస్థితులలోనూ ప్రజలకు అండగా నిలిచిన నాయకుడు దివంగత వైఎస్ రాజారెడ్డి. వైఎస్ రాజారెడ్డి 1925 సంవత్సరంలో వెంకటరెడ్డి, మంగమ్మ దంపతులకు జన్మించారు. ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ అందరినీ ఏకతాటిపై నడిపించిన వైఎస్ రాజారెడ్డికి పులివెందుల పెద్దాయనగా పేరు వచ్చింది. పులివెందుల అభివృద్ధికి సంబంధించి గ్రామ సర్పంచ్‌గా ఆయన ఎనలేని సేవలు అందించారు. క్రమశిక్షణ గల కార్యకర్తలను తీర్చిదిద్దడంలోనూ కుమారులు, కుమార్తెలు ఉన్నతస్థానంలో నిలపడంలోనూ కుటుంబ పెద్దగా పెద్దాయన పాత్ర ఎనలేనిది. పులివెందుల గ్రామ సర్పంచ్‌గా.. రాజకీయాల్లోకి రాకమునుపు నుంచి పులివెందుల్లో వై.ఎస్.రాజారెడ్డికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎలాంటి సమస్య అయినా ఆయన దగ్గరికి వెళితే పరిష్కారమవుతుందని ప్రజల నమ్మకం. ఈ నాటికీ ఆయన వెంట ఉన్న అభిమానులు రాజారెడ్డిని దేవునిగా కొలుస్తున్నారంటే ఎంత ఆరాధిస్తున్నారో అర్థమవుతోంది. ► ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన రాజారెడ్డి పులివెందుల గ్రామ సర్పంచుగా ఎన్నికై ప్రజాప్రస్థానం ప్రారంభించారు. ఆయన పులివెందుల సర్పంచ్‌గా 1988 నుండి 1995 వరకు పనిచేశారు. ఆయన సర్పంచ్‌గా ఉన్న సమయంలోనే పులివెందులలో వీధిలైట్లు, రోడ్లు, విద్యా సంస్థలను ఏర్పాటు చేయడంతోపాటు చెరువులను తవ్వించారు. పులివెందుల్లో అభివృద్ధి పనులు చేపడుతూనే ఈ ప్రాంత ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేవారు. అలనాడు సర్పంచ్‌గా పనిచేస్తున్న సమయంలో పులివెందుల్లో మంచినీటి సమస్య తీవ్రరూపం దాల్చినప్పుడు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి నీటిసమస్య తీర్చడమే కాదు.. రాష్ట్రంలోనే ఇలాంటి సమస్య ఎప్పుడూ రాకూడదని పుత్రులకు హితబోధ చేసిన మహా మనిషి ఆయన. గ్రామ ప్రజలకు సమస్యలు రాకుండా పోరాడుతూనే మరోవైపు తన ఆశయాల సాధనకు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తన సుపుత్రులలో ఇద్దరిని ప్రజల కోసం అంకితం చేశారు. ► తన కుమారుడు వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ ఉన్నతికి ఆయన ఎంతో కృషి, తోడ్పాటు అందించారు. పులివెందుల ప్రాంతంలో ప్రత్యేకంగా వైఎస్ రాజారెడ్డి పేరుతో కాలనీలు కూడా వెలిశాయి. పులివెందుల ప్రజల మనసులో ప్రత్యేక స్థానం పులివెందుల పరిధిలో దివంగత వైఎస్ రాజారెడ్డి, దివంగత జయమ్మ దంపతులు ప్రజల మనసులో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. వైఎస్ రాజారెడ్డి బతికున్న కాలంలో ఈ ప్రాంత ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండేవారు. వైఎస్ఆర్ రాష్ట్ర రాజకీయాల్లో తలమునకలై ఉండగా.. వైఎస్ రాజారెడ్డి పులివెందుల ప్రాంతంలో ప్రజల సమస్యలపట్ల, రాజకీయాలపట్ల అన్నీ తానై చూసుకొనేవారు. దీంతో వైఎస్ఆర్ రాష్ట్ర రాజకీయాల్లో చురుకై న పాత్ర పోషించగలిగారు. వైఎస్ రాజారెడ్డి తనయుడు వైఎస్ఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలని తపించేవారు. విద్యా ప్రదాతగా.. వైఎస్ రాజారెడ్డి పులివెందుల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తూనే పులివెందులలో పేద విద్యార్థుల కోసం డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలలు నెలకొల్పారు. ప్రజలకు సేవ చేయడంలో ఆయన ఎంతో తృప్తి పొందేవారు. వైఎస్ రాజారెడ్డి, వైఎస్సార్ చూపిన బాటలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జనరంజక పాలన అందిస్తున్నారని ప్రజలు కొనియాడుతున్నారు. ప్రజలు ఈ నాటికీ పులివెందుల పెద్దాయన వైఎస్ రాజారెడ్డిని గుర్తుచేసుకుంటూనే ఉన్నారు. ఘన నివాళులర్పించిన వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతమ్మ దివంగత వైఎస్ రాజారెడ్డి 25వ వర్ధంతి సందర్భంగా మంగళవారం పులివెందులలోని డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైఎస్సార్ సమాధుల తోటలో గల వైఎస్ జయమ్మ, వైఎస్ రాజారెడ్డి సమాధుల వద్ద వైఎస్సార్ కుటుంబీకులు, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతమ్మలతోపాటు ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం వైఎస్ రాజారెడ్డి పార్కులోని వైఎస్ రాజారెడ్డి విగ్రహం వద్ద నివాళులర్పించారు. జీసెస్ చారిటీస్‌లో గల చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. -
గన్ షాట్ : అలయ్ బలయ్ లో చిరు ఇమేజ్ ని చూసి అసూయపడ్డారా ..?
-
కడప జిల్లా నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంది
-
వైఎస్ రాజారెడ్డి ఆదర్శప్రాయుడు
పులివెందుల: దివంగత వైఎస్ రాజారెడ్డి ఆదర్శప్రాయుడని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. ఆదివారం వైఎస్ రాజారెడ్డి 23వ వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్ కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైఎస్సార్ సమాధుల తోటలో వైఎస్ రాజారెడ్డి, వైఎస్ జయమ్మల సమాధుల వద్ద వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్సార్ సోదరుడు వైఎస్ సుదీకర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ సింహాద్రిపురం, లింగాల మండలాల ఇన్‌ఛార్జి ఎన్.శివప్రకాష్‌రెడ్డి, వైఎస్సార్ సమీప బంధువు క్రిష్టఫర్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడే ఉన్న వైఎస్ జార్జిరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, డాక్టర్ ఇసీ గంగిరెడ్డిల సమాధులతోపాటు ఇతర బంధువుల సమాధుల వద్ద పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప, వైఎస్సార్సీపీ నాయకులు రసూల్, జగదీశ్వరరెడ్డి, పార్నపల్లె నాయుడు, కృష్ణమ నాయుడు, తదితరులు పాల్గొన్నారు. నివాళులర్పించిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే స్థానిక వైఎస్సార్ సమాధుల తోటలోని వైఎస్ రాజారెడ్డి సమాధి వద్ద ఆదివారం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజారెడ్డి పేద ప్రజలపట్ల ఎంతో ప్రేమతో మెలిగేవారన్నారు. ప్రతి ఒక్కరు పేద ప్రజలకు సేవ చేయాలని ఆయన చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. చదవండి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి అరెస్ట్ ‘పచ్చ’పేకలో ఖాకీ: ఎస్పీ జోక్యంతో బట్టబయలు -
వైఎస్ రాజారెడ్డికి ఘన నివాళి
పులివెందుల: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి దివంగత వైఎస్ రాజారెడ్డి 22వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. శనివారం ఉదయం పులివెందులలోని వైఎస్ సమాధుల తోటలో ఉన్న వైఎస్ జయమ్మ, వైఎస్ రాజారెడ్డిల ఘాట్ వద్ద వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, దివంగత వైఎస్ వివేకా సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ, వైఎస్ వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి, పులివెందుల వైఎస్సార్సీపీ నేత వైఎస్ మనోహర్‌రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తదితరులు నివాళులర్పించారు. రాజారెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అక్కడే ఉన్న వైఎస్ వివేకా సమాధి వద్ద, ఇతర కుటుంబీకుల సమాధులకు వైఎస్ విజయమ్మ పూలమాలలు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. కాగా, కర్నూలు జిల్లా పత్తికొండలో వైఎస్సార్సీపీ నేత పోచిమిరెడ్డి మురళీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో దివంగత వైఎస్ రాజారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. -
వైఎస్ రాజారెడ్డికి కుటుంబసభ్యుల నివాళి
-
వైఎస్ రాజారెడ్డికి ఘన నివాళి
సాక్షి, పులివెందుల: వైఎస్ రాజారెడ్డి 22వ వర్ధంతి సందర్భంగా ఆయనకు కుటుంబసభ్యులు శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. పులివెందుల రాజారెడ్డి ఘాట్‌లోని వైఎస్ జయమ్మ, రాజారెడ్డి సమాధుల వద్ద వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో పాటు కుటుంబసభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజారెడ్డి మెమోరియల్ పార్కులోని ఆయన విగ్రహం వద్ద అంజలి ఘటించారు. జీసెస్ చారిటీస్‌లోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ సౌభాగ్యమ్మ, వైఎస్ మనోహర్ రెడ్డి, దివంగత వివేకానందరెడ్డి కుమార్తె సునీత,అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అందరికీ అమ్మ.. జయమ్మ
వైఎస్ఆర్ జిల్లా, పులివెందుల : అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదంటారు.. కానీ అడగకుండానే అందరికి అన్నీ పెట్టిన అమ్మ వైఎస్ జయమ్మ. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాతృమూర్తి ఆమె. పులివెందుల ప్రజల కష్టసుఖాలలో పాలు పంచుకుంటూ దాతృత్వం ప్రదర్శించేవారు. తన బిడ్డ రాజశేఖరరెడ్డి సీఎం కావాలన్న చిరకాల వాంఛ నెరవేరిన తర్వాత 2006 జనవరి 25వ తేదీన జయమ్మ కన్నుమూశారు. 2003లో వైఎస్ఆర్ ప్రజల కష్టసుఖాలను తెలుసుకొనేందుకు పాదయాత్ర చేసిన సందర్భంలో తల్లిగా తల్లడిల్లిపోతూనే బిడ్డకు మంచి జరగాలని కోరుకునేవారు.1999లో కరువు కరాళ నృత్యం చేస్తున్న సమయంలో పది మందికీ పట్టెడు అన్నం పెట్టి జన్మ సార్థకత చేసుకున్నారు. అప్పటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రోజూ ఐదారు వందల మందికి ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించి మన్ననలందుకున్నారు. 1995నుంచి 2000వరకు పులివెందుల సర్పంచ్‌గా పనిచేశారు. అప్పటి ప్రభుత్వం నుంచి ఉత్తమ సర్పంచ్ అవార్డు పొందారు. పంచాయతీని ఆదర్శంగా నిలిపి ఉత్తమ పంచాయతీ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇలా .. పులివెందుల అమ్మగా జయమ్మ గుర్తింపు పొందారు. నేడు వైఎస్ జయమ్మ వర్ధంతి దివంగత వైఎస్ రాజారెడ్డి సతీమణి వైఎస్ జయమ్మ 14వ వర్ధంతి శుక్రవారం పులివెందులలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ కుటుంబ సభ్యులు పాలు పంచుకోనున్నారు. వైఎస్ జయమ్మ సమాధి వద్ద ప్రార్థనలు చేయనున్నారు. జయమ్మ పార్క్‌లో ఆమె విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మలతోపాటు ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. వైఎస్ కుటుంబ సభ్యులతోపాటు పలువురు వైఎస్ఆర్ అభిమానులు కూడా పాల్గొంటారు. -
పోడు కత్తి
పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో దశాబ్దాల కాలం నుంచి పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న పలువురు సన్న, చిన్నకారు గిరిజన రైతులకు పెద్ద సమస్య వచ్చిపడింది. భూములకు పట్టాలివ్వాలని రైతులు ఆందోళన చేస్తుంటే.. ‘అసలు వారు ఆ భూములకు హక్కుదారులుకారు.. వారిని భూముల నుంచి తొలగించాలి’ అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం ఆదివాసీలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సాక్షి, బుట్టాయగూడెం(పశ్చిమ గోదావరి) : 2005లో అటవీ హక్కుల చట్టం వచ్చింది. ఆ సమయంలో సుమారు 15 వేల మందికిపైగా నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భూములు పంచి పట్టాలిచ్చారు. ఆయన మరణం తర్వాత దరఖాస్తు చేసుకున్న వారికి పట్టాలు రాలేదు. గ్రామ సభలు సక్రమంగా జరగకపోవడం వల్ల దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండా పోయిందని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల రిటైర్డ్ ఫారెస్ట్ ఉద్యోగి, వన్యప్రాణి సంరక్షణకు చెందిన కొందరు ప్రతినిధులు సుప్రీంకోర్టులో అటవీ సంరక్షణపై కేసు వేశారు. దీంతో 2005 అటవీ హక్కుల చట్టం తర్వాత వచ్చిన క్లెయిమ్స్‌ను తిరస్కరించడంతోపాటు ఆ భూముల నుంచి గిరిజనులను ఖాళీ చేయించేందుకు 2019 జులై 27వ తేదీని గడువుగా సుప్రీం కోర్టు ప్రకటించింది. పట్టాలివ్వాలని ఆందోళన పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులను తరిమేయడం సరికాదని, వారికి పట్టాలిచ్చి న్యాయం చేయాలని గిరిజన, ప్రజా సంఘాల నాయకులు, గిరిజనులు కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు చేస్తూ వస్తున్నారు. అయితే సమయం దగ్గర పడుతున్నందున తమ పరిస్థితి ఏంటని గిరిజనులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోడు భూమే తమకు జీవన ఆధారమని, అదికాస్తా పోతే తమ బతుకులు ఛిద్రమవుతాయని ఆదివాసీలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోడు భూముల పట్టాల వ్యవహారాలకు సంబంధించి గ్రామసభలు నిర్వహించి వాటిని సాగు చేస్తున్న రైతులు అటవీ హక్కుల చట్టానికి అర్హులాకాదా అని తేల్చాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి అధికారులు గ్రామ సభలను తూతూమంత్రంగా నిర్వహించారని గిరిజన సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల్లో వేలాది మంది పోడు భూములు సాగు చేసుకునేవారు ఉన్నప్పటికీ అధికారులు శ్రద్ధచూపకపోవడం వల్ల తీవ్రమైన నష్టాలు కలిగే అవకాశం ఉందని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సాగులో ఉన్న హక్కుదారులకు పట్టాలకు కల్పించకపోతే అనేక గిరిజన కుటుంబాలు వీధిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన తర్వాత వచ్చిన తీర్పు ప్రకారం జులై 27వ తేదీ నాటికి గ్రామ సభలను నిర్వహించి అర్హత ఉన్నవారికి తప్పనిసరిగా పట్టాలు ఇవ్వాలి. లేకుంటే భూముల నుంచి గిరిజనులను గెంటేసే అవకాశం ఉంది. అధికారులు చొరవ తీసుకొని గడువు దగ్గర పడుతున్నందున గిరిజనులకు న్యాయం చేయాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. జిల్లాలో 15 వేల ఎకరాల్లో పోడు భూమిసాగు జిల్లాలోని ఏజెన్సీ మండలాలతోపాటు టి. నర్సాపురం, చింతలపూడి, నల్లజర్ల, ద్వారకా తిరుమల మండలాల్లో సుమారు 15 వేల ఎకరాల్లో 5,738 మంది రైతులు పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్నట్లు సమాచారం. అయితే అటవీ హక్కుల చట్టంలో వీరంతా దరఖాస్తు చేసుకున్నా.. ప్రస్తుతం తిరస్కరణకు గురైనట్లు గిరిజన సంఘాల నాయకులు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రా>మసభలు నిర్వహించి రైతులు పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలిస్తే పట్టాలిచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు గ్రామసభలు నిర్వహించకపోవడం వల్ల పోడు భూముల సాగుదారులు రోడ్డున పడే అవకాశం ఉందని చెప్పారు. -
పుడమి పులకించగా.. రైతు పరవశించగా..
అది 1995–2003 మధ్య కాలం.. ఎన్టీఆర్ నుంచి పదవి లాగేసుకుని చంద్రబాబు తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన సమయం. చినుకు రాలక.. పాతాళగంగపైకి పొంగక కరువు రక్కసి కరాళనృత్యం చేసిన సందర్భం. వర్షాలు లేవు, పంటలు పండవు. చేతిలో పైసా లేదు. అప్పుల కుప్పలు.. అన్నమో రామచంద్రా.. అంటూ అన్నదాత దిక్కులు చూశారు. రైతులే కాదు.. కూలీలు, పేదలు... అన్ని వర్గాల ప్రజలు పొట్ట చేతపట్టుకుని ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేసి పొరుగు రాష్ట్రాలకు వలసలు వెళ్లారు. పచ్చని పల్లెసీమలు కళ తప్పాయి. అలాంటి సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ‘అనంత’ ఆశాకిరణంగా కనిపించారు. 2004లో ముఖ్యమంత్రి కాగానే జనరంజక పాలనను అందించారు. జిల్లాకు ఆత్మబంధువుగా, ఆపద్బాంధవుడయ్యారు. రైతులకు పెద్దపీట వేస్తూనే మిగతా అన్ని వర్గాలకు వెన్నుదన్నుగా నిలిచారు. సాక్షి, అనంతపురం అగ్రికల్చర్ :: తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు రైతులను దారుణంగా అవమానించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా సువర్ణపాలనను అందించారు. ‘అనంత’పై ప్రత్యేక దృష్టి సారించారు. 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణాస్వీకారం చేసిన తక్షణం రైతుల విద్యుత్ బిల్లులను మాఫీ చేస్తూ తొలిసంతకం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,259 కోట్లు కరెంటు బిల్లులు మాఫీ కాగా.. అందులో అనంతపురం జిల్లా రైతులకు సంబంధించిన రైతులవి రూ.70.65 కోట్లు మాఫీ అయ్యాయి. అలాగే అప్పట్లో ఉన్న 1.75 లక్షల మోటార్లకు ఉచితంగా కరెంటు ఇచ్చారు. ఆయన ఆరేళ్ల హయాంలో రూ.150 కోట్లు విలువైన ఉచిత కరెంటు రైతులకు అందించారు. పెంచిన పంట రుణాలు వైఎస్సార్ హయాంలో పంట రుణాల కింద 27.37 లక్షల మంది రైతులకు రూ.6,594 కోట్లు అందజేశారు. అంతకు మునుపు 1995 నుంచి 2003 వరకు చంద్రబాబు తొమ్మిదేళ్ల హయాంలో 15.76 లక్షల మందికి కేవలం రూ.2,175 కోట్లు మాత్రమే పంట రుణాలు ఇచ్చారు. వైఎస్సార్ హయాంలో ఏటా పంట రుణాలు పెంచుతూ, అందులోనూ కొత్త రైతులకు ప్రాధాన్యత ఇవ్వడంతో వ్యవసాయం సాఫీగా సాగింది. సకాలంలో పంట రుణాలు చెల్లించిన రైతులకు పావలా వడ్డీ కింద ఐదేళ్లలో 12 లక్షల అకౌంట్లకు రూ.44 కోట్లు ఇచ్చారు. బీమాతో ధీమా చంద్రబాబు హయాంలో మండలం యూనిట్‌గా తీసుకుని వేరుశనగ పంటల బీమాను అమలు చేయగా...చాలా మంది రైతులకు అది అందలేదు. దీంతో వైఎస్సార్ అధికారంలోకి రాగానే గ్రామం యూనిట్‌గా అమలు చేసి నష్టపోయిన ప్రతి రైతుకు పారదర్శకంగా బీమా పరిహారం ఇచ్చారు. 2004 నుంచి 2009 వరకు వైఎస్ ప్రభుత్వం దెబ్బతిన్న వేరుశనగ పంటకు సంబంధించి అర్హులైన రైతులకు పంటల బీమా కింద ఏకంగా రూ.1116 కోట్లు పరిహారం ఇచ్చారు. పంట కోత ప్రయోగాల ఆధారంగా పంట నష్టం లెక్కకట్టి పారదర్శకంగా పరిహారం అందజేశారు. 2008లో తీవ్ర వర్షాభావంతో 80 శాతం మేర పంటలు దెబ్బతినగా... అప్పట్లో జిల్లా వ్యాప్తంగా 4.64 లక్షల మంది రైతులు తమ వాటా కింద రూ.32 కోట్లు ప్రీమియం కట్టారు. గ్రామం యూనిట్‌గా బీమా పథకం కింద అమలు చేయగా 4.59 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.620 కోట్లు పరిహారం అందింది. అదే చంద్రబాబు 1995–2003 మధ్య తొమ్మిదేళ్లలో పంటల బీమా పథకం కింద కేవలం రూ.323 కోట్లు పరిహారం ఇచ్చారు. ఇక 2011 నుంచి కొత్తగా అమలులోకి వచ్చిన వాతావరణ బీమా రైతులను ఆదుకునే పరిస్థితి లేదు. లోపభూయిష్ట నిబంధనల కారణంగా ఏటా రైతులకు తీరని అన్యాయం జరుగుతోంది. ఏకకాలంలో రుణమాఫీ, ప్రోత్సాహం ఖరీఫ్–2008లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనడంతో 9 లక్షల హెక్టార్లలో పంటలన్నీ దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రుణమాఫీ చేశారు. 2008–09లో 3,03,937 మంది రైతులకు సంబంధించి రూ.554.92 కోట్లు రుణాలు ఒకేసారి మాఫీ అయ్యాయి. అలాగే పంట రుణాలు చెల్లించిన 3,61,269 మంది రైతులకు ప్రోత్సాహకాల కింద రూ.5 వేల చొప్పున రూ.174.04 కోట్లు అందజేశారు. మొత్తమ్మీద 6,65,206 మంది రైతులకు రూ.625 కోట్లు లబ్ధిచేకూరింది. విత్తనానికి బాసట 2004 నుంచి 2009 వరకు వైఎస్సార్ తన ఆరేళ్ల పాలనలో 28,05,901 మంది రైతులకు 26,02,717 క్వింటాళ్లు విత్తనకాయ పంపిణీ చేశారు. దానికోసం ఏకంగా రూ.280.88 కోట్లు సబ్సిడీ వర్తింపజేశారు. ఇతర విత్తనాల కోసం రూ.80 కోట్లు ఖర్చు చేశారు. మొత్తంగా రూ.360 కోట్లు విత్తన రాయితీ అందించారు. అదే చంద్రబాబు తన తొమ్మిదేళ్లలో విత్తన వేరుశనగకు రూ.49 కోట్లు మాత్రమే కేటాయించారు. తొమ్మిదేళ్లలో కలిపి 12,73,829 మంది రైతులకు కేవలం 9,58,800 క్వింటాళ్లు విత్తన వేరుశనగ పంపిణీ చేశారు. వ్యవసాయమే కాకుండా అనుబంధ రంగాలైన పాడి, పశుసంవర్ధక, పట్టు, ఏపీఎంఐపీ, ఉద్యానశాఖలకు వైఎస్సార్ పెద్దపీట వేశారు. దీంతో ప్రత్యామ్నాయ వ్యవసాయంపై ఆధారపడిన రైతులు, పేదలు కూడా సమస్యల నుంచి గట్టెక్కారు. ఉద్యాన విప్లవం 2004కు ముందు కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పండ్లతోటలను జిల్లా నలుమూలలా విస్తరించేలా పెద్ద ఎత్తున రాయితీలు ప్రకటించారు. వైఎస్సార్ తన పాలనా కాలంలో రూ.80 కోట్లు మేర సబ్సిడీ ఇవ్వడంతో కొత్తగా 40 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పండ్లతోటలు విస్తరించాయి. వైఎస్సార్ ఇచ్చిన ప్రోత్సాహంతో అనంతపురం జిల్లా ‘ప్రూట్ బౌల్ ఆఫ్ ఏపీ’గా పేరుగాంచింది. సూక్ష్మసాగుకు ప్రోత్సాహం జిల్లా రైతులకు సూక్ష్మసాగు సేద్యం అత్యవసరమని గుర్తించిన వైఎస్సార్... రైతులకు బిందు, తుంపర పరికరాలను ప్రోత్సహించారు. ఎస్సీ ఎస్టీలకు వంద శాతం, ఇతర రైతులకు 90 శాతం రాయితీతో సూక్ష్మసేద్యాన్ని భారీగా విస్తరించారు. ఆరేళ్ల పాలనకాలంలో రూ.280 కోట్లు బడ్జెట్ ఇవ్వడంతో కొత్తగా 1.13 లక్షల హెక్టార్లకు డ్రిప్, స్ప్రింక్లర్లు అందజేశారు. రూ.12,500 కోట్లు ఖర్చు చంద్రబాబు తన తొమ్మిదేళ్ల కాలంలో జిల్లా వ్యవసాయం, అనుబంధ రంగాలన్నింటికీ రూ.2,938 కోట్లు ఖర్చు చేయగా... అదే వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరేళ్లలోనే ఏకంగా రూ.12,500 కోట్లు వెచ్చింది రైతులకు వివిధ రూపాల్లో ప్రయోజనం చేకూర్చారు. అన్నదాత ఆత్మబంధువు.. వైఎస్సార్.. చంద్రబాబు హయాంలో కబళించిన కరువు 2004లో వైఎస్సార్ సీఎం కాగానే మారిన రైతుల తలరాత ‘అనంత’ సంక్షేమానికే అధిక ప్రాధాన్యమిచ్చిన రాజన్న పంటల బీమా కింద రూ.1,116 కోట్లు పరిహారం రూ.100 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ విద్యుత్ బకాయిలు మాఫీ.. రూ.150 కోట్లతో ఉచిత విద్యుత్ రూ.555 కోట్ల రుణమాఫీ.. ప్రోత్సాహకాలకు రూ.170 కోట్లు -
రాత్రికి రాత్రే శిలాఫలకం మాయం
సాక్షి, ఒంగోలు సిటీ : మీ ఊరికి ఎంత దూరమో .. మా ఊరికి అంతే దూరం అన్న లోకోక్తిని మరో మారు జనం ముందుకు తెస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఎప్పుడో శంకుస్థాపన చేసిన షాదీఖానా నిర్మాణం పనులను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం అందరూ హర్షించదగ్గదే. అయితే శంకుస్థాపన చేసిన పూర్వ నాయకుల పేర్లను మారడమే విమర్శలకు తావిచ్చింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అభిమానుల్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఒంగోలు నగరంలోని కొత్త మార్కెట్ వద్ద షాదీఖానా ప్రారంభం సందర్భంగా వేసిన శిలాఫలకం వైఎస్సార్ అభిమానులు కలత చెందేలా చేసింది. అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా పాత శిలాఫలకాన్ని మాయం చేసి, కొత్తగా దామచర్ల జనార్దన్ ప్రారంభకులుగా వేసిన శిలాఫలకం చర్చలకు దారి తీసింది. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లుగా ఈ వ్యవహారంలో సంబంధిత అధికారులు విమర్శలను మూట గట్టుకున్నారు. పాత ఫలకాన్ని తొలగించి రాత్రికి రాత్రే కొత్త ఫలకం ఏర్పాటు అసలు జరిగింది ఇది ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ వద్ద షాదీఖానా, ఉర్ధూఘర్ నిర్మించాలని ఆ సామాజికవర్గానికి చెందిన వారి నుంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే అప్పటి ప్రభుత్వంలో రాష్ట్ర గనుల శాఖ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి వద్దకు షాదీఖానా కోసం వినతులు వచ్చాయి. ఆయనకు వైఎస్సార్ వద్ద ఉన్న పలుకుబడిని ఉపయోగించి ఒంగోలు పర్యటన సందర్భంగా శంకుస్థాపన చేయించి పనులు వెంటనే మొదలు పెట్టించడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. బాలినేని చొరవతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ. కోటి నిధులను మంజూరు చేశారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులకు ఈ పని అప్పగించారు. వెంటనే ఉత్తర్వులను జారీ చేశారు. ఎండబ్ల్యూడీ గ్రాంటు నుంచి షాదీఖానాకు నిధులు కేటాయించారు. సీఎం హోదాలో రాజశేఖర్‌రెడ్డి ఒంగోలు పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఒంగోలుకు మంజూరైన షాదీఖానా, ఉర్ధూఘర్ నిర్మాణాలకు ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి పురందేశ్వరి, మంత్రి మోపిదేవి వెంకటరమణ, కలెక్టర్ దేవానంద్ ప్రముఖులు హాజరయ్యారు. ఎంతో అట్టహాసంగా ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అయితే అనంతరం జరిగిన ప్రభుత్వం మార్పు, రాష్ట్ర విభజన ఇతర అంశాలు తోడై షాదీఖానా నిర్మాణంలో జాప్యం జరిగింది. ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సాధించిన దివంగత వైఎస్సార్ వేసిన పేరు లేకుండా కొత్త శిలాఫలకం వేయడంతో అభిమానుల విమర్శలకు దారి తీసింది. టీడీపీ ఇదో తరహా రాజకీయం? నగరంలోని కొత్త మార్కెట్ వద్ద అధికార పార్టీ నేతలు బుధవారం నియోజకవర్గం పరిధిలో పూర్తయిన పలు పనులను ప్రారంభించే క్రమంలోనే షాదీఖానాను కూడా ప్రారంభించే కార్యక్రమం చేపట్టారు. ఇక్కడే అసలు రాజకీయం చోటు చేసుకుందని వైఎస్సార్ అభిమానులు వాపోతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరుతో ఉన్న శిలాఫలకాన్ని మాయం చేశారన్న అపవాదును అధికార పార్టీ నేతలతో పాటు జిల్లా అధికారులు మూటగట్టుకున్నారు. షాదీఖానా ప్రారంభోత్సవాన్ని వ్యతిరేకించడం లేదు. తమ నాయకుని పేరును శాశ్వతంగా భవనంపై లేకుండా చేశారని బాధపడుతున్నారు. త్వరలో రానున్న ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ఈ తరహా రాజకీయం చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత అన్యాయమా? అధికారికంగా వేసిన ఆహ్వానం పత్రికల్లోనూ ‘తాత శంకుస్థాపన–మనవడి ప్రారంభోత్సవం’ అంటూ ముద్రించిన పత్రికలోని వివరాలు చూసిన అభిమానులు ఇంత అన్యాయమా అంటూ ముక్కున వేలేసుకున్నారు. పత్రికలో, కొత్త శిలాఫలకంలో కలెక్టర్ వినయ్‌చంద్, ఇతర అధికారులు, మంత్రులు, ప్రజా ప్రతినిధుల పేర్లను వేయడం గమనార్హం. షాదీఖానా ప్రారంభం సందర్భంగా వేసిన కొత్త శిలాఫలకం న్యాయం కోరతామంటున్న వైఎస్సార్ సీపీ నేతలు వైఎస్సార్ శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని తొలగించి, రాత్రికి రాత్రే మాయం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు అధికారులను కలిసి వినతి పత్రం ఇవ్వనున్నామని తెలిపారు. అధికారుల దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లి న్యాయం కోరతామని, పాత శిలాఫలకాన్ని సంబంధిత అధికారులు ఏం చేశారో సమాచారం ఇవ్వమని కోరతామన్నారు. ఇక్కడ తగిన స్పందన రాని పక్షంలో న్యాయం కోసం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
మదినిండా పెద్దాయనే..
సాక్షి, చంద్రశేఖర్‌కాలనీ: ఆయన మదినిండా వైఎస్సారే కొలువయ్యారు.. వైఎస్సార్‌పై ఉన్న అభిమానం తో తన స్కూటర్ రిపేరింగ్ దుకాణానికి వైస్సార్ స్కూటర్ రిపేరింగ్ వర్క్స్ అని పెట్టుకున్నారు. ఆయనే నగరంలోని బడాబజార్‌కు చెందిన భిక్షపతి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆయన చేసిన సేవలను ముగ్ధుడైన భిక్షపతి ఆయననే దేవుడిగా ఇప్పటికీ కొలుస్తున్నారు. వైఎస్‌పై ఉన్న అభిమానం.. ఆయన చేసిన సేవలను నలుగురికీ చెబుతూ అందరినోటా ‘వైఎస్సార్ భిక్షపతి’గా నిలిచిపోయారు. నగరరంలోని బడాబజార్‌లో వైఎస్సార్ స్కూటర్ రిపేరింగ్ వర్క్స్ పేరుతో షాప్ నిర్వహిస్తున్న నూరి భిక్షపతికి వైఎస్సార్ అంటే ఎనలేని అభిమానం. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్, ఆరోగ్యశ్రీ, విద్యార్థులక ఫీజు రీయింబర్స్మెంట్, పింఛన్లు ఇలా అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించగా వాటిని ముగ్ధుడైన భిక్షపతి అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన ప్రవేశపెట్టిన పథకాలను పదిమందికీ వివరిస్తూ ఉంటారు. వైఎస్ పేరునే స్కూటర్ రిపేరింగ్ షాప్‌ను పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. సుమారు 25ఏళ్లుగా స్కూటర్ మెకానిక్‌గా పనిచేస్తున్న భిక్షపతి తన షాప్‌లో ప్రతిఏటా వైఎస్ జయంతి, వర్ధంతులను సొంత ఖర్చుతో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. గాంధీ జయంతి, రిపబ్లిక్ దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తాడు. స్థోమత లేకున్నప్పటికీ తనకు ఉన్నదాంట్లోనే కార్యక్రమాలు నిర్వహిస్తూ వైఎస్‌పై తన అభిమానాన్ని చూపుతున్నాడు. ఇప్పటికే పులివెందుల, హైదరాబాద్‌లో వైఎస్ కుటుంబసభ్యులతో, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన కలిశారు. -
రూ.10 వేలు కూడా ఖర్చుకాలే..! : కమతం
‘నాడు విలువలతో కూడిన రాజకీయం చేసే వారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ అలాగే ఉండేవారు. 1980 వరకు ఆ పరిస్థితి ఉంది. ఆ తర్వాత రాజకీయాలు మారుతూ వచ్చాయి. నేడు విలువల గురించి చెప్పే వారు లేరు.. చెప్పినా వినేవారు లేరు.. పాటించే వారు అంతకన్నా లేరు’ అని మాజీ మంత్రి కమతం రాంరెడ్డి అన్నారు. డబ్బులు లేకుండా రాజకీయమంటే నేడు వింతగా చూసే పరిస్థితి వచ్చిందని, డబ్బుతోనే అంతా ముడిపడి ఉందని అన్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ‘సాక్షి’ ఆయనను పలకరించగా.. రాజకీయాల్లో, ప్రజల్లో వచ్చిన మార్పులను.. తన అనుభవాలను వివరించారు. సాక్షి, పరిగి: నేడు రాజకీయాలను, డబ్బును వేర్వేరుగా చూడలేము. ఇప్పుడు డబ్బు లేకుండా రాజకీయాల్లోకి రావటాన్ని కనీసం ఊహించలేం. ఎమ్మెల్యేగా గెలవాలంటే కనీసం రూ.10 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ చెబుతున్న రూ.28 లక్షలు కొన్ని చోట్ల సర్పంచ్ ఎన్నికల్లో కూడా వెచ్చిస్తున్నారు. ఇలా ఎన్నికల్లో ఓట్ల కోసం వెచ్చిస్తున్న డబ్బులు మళ్లీ వారి నుంచే సంపాదించాలిగా.. నేడు నేతలెవరైనా ఆస్తులు అమ్ముకుని ప్రజా సేవ చేస్తున్నారా.. అప్పట్లో రాజకీయాలన్నీ కాస్ట్ లెస్.. కరప్షన్ లెస్ అన్న తరహాలో ఉండేవి. ఇప్పుడు కనీసం అది ఊహల్లోనైనా జరుగుతుందా. నేను మొదటి సారిగా 1967లో ఎమ్మెల్యేగా పోటీచేశాను. అప్పట్లో కేవలం రూ.10 వేల లోపే ఖర్చు చేశాను. అవి కూడా డబ్బుల రూపంలో నయా పైసా కూడా ఎవరికీ ఇవ్వలేదు. గోడల మీద రాతలు, బ్యానర్లు, గుర్తు చూపించేందుకు బ్యాలెట్ పేపర్లు తదితర వాటికి ఖర్చు చేశాం. 1980 సంవత్సరం వరకు టీ తాపటం వరకే ఖర్చులుండేవి. నేడు వ్యక్తిగత కోర్కెలే.. ఆ రోజుల్లో ప్రచారానికి గ్రామంలోకి వెళ్లగానే ఎంతో ఆప్యాయతతో ప్రజలు పలకరించేవారు. గ్రామ నాయకులు ఎదురు వచ్చి స్వాగతం పలికేవారు. ఒక్కరు కూడా వ్యక్తిగతంగా నాకిది కావాలని అడిగేవారు కాదు. గ్రామంలో స్కూల్, కరంటు, మంచి నీల్లు, రోడ్డు కావాలని ఇలా సామాజిక సమస్యలే అడిగేవారు. ఒకరిద్దరికి కలిసి వచ్చేవాళ్లం. వారే గ్రామంలో అందరికి చెప్పి ఓట్లు వేయించే వారు. ఇప్పుడు నేతలు, కార్యకర్తలు ఇలా ఎవరు చూసినా వ్యక్తిగత కోర్కెలతో ఓ పార్టీని విడిచి మరో పార్టీలో చేరుతున్నారు. రాయితీ ట్రాక్టర్ కోసం ఒకరు.. నామినేటెడ్ పదవి కోసం మరొకరు..ఆర్థిక లాభాల కోసం ఒకరు చర్చలు జరిపి పార్టీలు మారుతున్నారు. భోజనాలు గ్రామ నాయకులే ఏర్పాటు చేసేవారు.. మా రోజుల్లో ఏ గ్రామానికి ప్రచారానికి వెళ్లినా.. గెలిచాక గ్రామానికి అభివద్ధి పనుల పర్యవేక్షణకు వెళ్లినా ఆ గ్రామంలో ఉండే నాయకులే భోజనాలు ప్రేమతో ఇళ్లలో వండి పెట్టేవారు. నేడు వెంట తిరిగే కార్యకర్తల కోసం నాయకులు రోజూ లక్షలు ఖర్చు చేస్తున్నారు. బీరు.. బిర్యాని అంటూ మద్యం ఏరులై పారిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రచారంలో పాల్గొనే వారికి రోజు కూలీ కూడా ఇస్తున్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు నా హయాంలోనే ఇచ్చాం.. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రైతులకు భూమి హ క్కులకు సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలను నేను రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు అందజేశాం. 1992లోనే పాసుపుస్తకాలు ముద్రించటం పూర్తయిన ప్పటికీ ఎన్నికల కోడ్ అంటూ చంద్రబాబు ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకుని ఇవ్వకుండా అడ్డుకున్నా డు. మళ్లీ ఎన్నికలయ్యాక 1994లో మేమే ఇచ్చాం. ఆ తరువాత చాలా రాష్ట్రాలు మనల్ని ఆదర్శంగా తీసుకుని పట్టాదారు పాసుపుస్తకాలు ముద్రించి ఇచ్చాయి. ఒక్కటి తప్ప అన్నీ చేశాను.. రాష్ట్రంలోనే అట్టడుగున ఉన్న పరిగి నియోజకవర్గా న్ని ముందువరుసలో నిలబెట్టాను. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా ని యోజకర్గానికి చేసినంత.. ఆయన సొంత నియోజకవర్గానికి కూడా చేసుకోలేదు. లఖ్నాపూర్, సాలార్‌నగర్ సాగు నీటి ప్రాజెక్టులు.. అంతారం, ఇప్పాయిపల్లి చెరవులు నా హయాంలోనే నిర్మించాం. పరిగిలో బస్‌డిపో, వ్యవసాయ మార్కెట్, పాలశీతలీకరణ కేంద్రం, కుల్కచర్లలో డిగ్రీ కళాశాల, ఇలా పెద్ద పెద్ద పనులన్నీ నేనే చేయించాను. నియోజకవర్గంలో ప్రతి తండాకు కరంటు, ప్రతి గ్రామానికి రోడ్లు వే యించాను. కోయిల్‌సాగర్ నుంచి గానీ కృష్ణా నది నుంచి నేరుగా గానీ సాగు నీరు తేవాలని అనుకున్నాను. కానీ, అదొక్కటి చేయలేకపోయాను. వైఎస్ డైనమిక్ లీడర్.. వాజ్‌పేయి ఇష్టమైన నాయకుడు ఇప్పుడు అనుకోని పరిస్థితిలో బీజేపీలో ఉన్నాను. కానీ, నేను మొదట్నుంచి కాంగ్రెస్ వాదినే. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మంచి మనసున్న డైనమిక్ లీడర్. పీవీ నర్సింహారావు, కోట్ల విజయభాస్కర్‌రెడ్డిలు మంచి నాయకులు. కాంగ్రెస్ వాదినైనప్పటికీ జాతీయ రాజకీయాల్లో నాకు వ్యక్తిగతంగా వాజ్‌పేయి అంటే బాగా నచ్చుతుంది. కేసీఆర్ తెచ్చిన రైతు బంధు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రైతు బీమా పథకాలు బాగున్నాయి. -
యాత్ర పూర్తి
దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంపై తెరకెక్కుతోన్న చిత్రం ‘యాత్ర’. వైఎస్ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటించారు. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహీ వి. రాఘవ్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు రోజులు ప్యాచ్‌వర్క్ మినహా పూర్తయింది. డిసెంబర్ 21న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘తన పాలనతో ప్రజల హృదయాల్లో చెర గని ముద్ర వేసుకున్నారు రాజశేఖర రెడ్డిగారు. 60 రోజుల్లో 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ప్రజల కష్టాలు.. అక్కచెల్లెళ్ల బాధలు.. రైతుల ఆవేదన తెలుసుకున్నారు వైఎస్‌గారు. ఈ సినిమా ఆయన ఇమేజ్‌కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. వైఎస్‌గారి తండ్రి రాజారెడ్డిగారి పాత్రలో జగపతిబాబు నటించారు’’ అన్నారు. -
యాత్రలో జగపతిబాబు
వైఎస్ రాజారెడ్డి.. ఈ పేరు చెప్పగానే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి అని గుర్తుకొస్తారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో రాజారెడ్డి అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఆయన ప్రస్తావన ఎందుకంటే.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘యాత్ర’. వైఎస్ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహీ వి. రాఘవ్ దర్శకత్వంలో 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో వైఎస్ తండ్రి రాజారెడ్డి పాత్రలో విలక్షణ నటుడు జగపతిబాబు కనిపించనున్నారు. రాజారెడ్డి అంటే రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా పులివెందుల ప్రాంత ప్రజలకు ఎనలేని అభిమానం. అటువంటి రాజారెడ్డి పాత్రకు జగపతిబాబు అయితే కరెక్టుగా సరిపోతారని భావించిన చిత్రబృందం ఆయన్ను సంప్రదించడం, ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. ఆదివారం రాత్రి దర్శక–నిర్మాతలతో మాట్లాడాక జగపతిబాబు ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే లుక్ టెస్ట్ చేయనున్నారు. కాగా ఈ చిత్రంలో మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని నటిస్తోన్న విషయం తెలిసిందే. -
వైఎస్ రాజారెడ్డి హంతకుడి విడుదల
సాక్షి, నెట్వర్క్/సాక్షి, అమరావతి : దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న రాగిపిండి సుధాకర్‌రెడ్డిని క్షమాభిక్ష పేరిట రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తీసుకున్న నిర్ణయాన్ని ఆదివారం అమలు చేసింది. రాష్ట్రంలోని పలు జైళ్ల నుంచి మొత్తం 47 మంది ఖైదీలు విడుదలయ్యారు. రాజమహేంద్రవరం జైలు నుంచి 18 మందికి, విశాఖ నుంచి 13 మందికి, అనంతపురం నుంచి ఆరుగురు, వైఎస్సార్ జిల్లాలో ఏడుగురు, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు ఖైదీలకు క్షమాభిక్ష లభించింది. వీరిలో కొందరు ఆదివారం విడుదల కాగా.. మరికొందరు సోమవారం విడుదల కానున్నారు. రాజకీయ ఒత్తిళ్లే కారణమా? రాజకీయ ఒత్తిళ్ల వల్లే వైఎస్ రాజారెడ్డి హత్యకేసులో నిందితుడైన రాగిపిండి సుధాకర్‌రెడ్డిని విడుదల చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం వేల్పుల గ్రామానికి చెందిన సుధాకర్‌రెడ్డి 1998లో జరిగిన వైఎస్ రాజారెడ్డి హత్యకేసులో నిందితుడు. ఈ హత్యకేసులోని నిందితులందరికీ న్యాయస్థానం 2006లో జీవిత ఖైదు విధించింది. అప్పట్నుంచి నెల్లూరు జిల్లాలోని కారాగారంలో జైలు జీవితం గడుపుతున్న సుధాకర్‌రెడ్డిని విడుదల చేయాలంటూ టీడీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏపీ కేబినెట్ వివాదాస్పద నిర్ణయం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో శిక్షను అనుభవిస్తున్న సుధాకర్ రెడ్డిని సత్ప్రవర్తన పేరుతో విడుదల చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు వైఎస్సార్ జిల్లాకు చెందిన ప్రముఖ టీడీపీ నేతను కలిసినట్లు సమాచారం. సత్ప్రవర్తన కింద విడుదల కోసం జైళ్లశాఖ 149మంది జాబితా ఎంపిక చేసింది. వారిలో 100 మందిని తిరస్కరించిన కేబినెట్, 49 మంది విడుదలకు ఆమోదం తెలిపింది. ఇందులో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తండ్రి రాజారెడ్డి హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న సుధాకర్ రెడ్డి పేరు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సుధాకర్ రెడ్డి నెల్లూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. నెల్లూరు జైలు నుంచి ముగ్గురు విడుదలయ్యే అవకాశం ఉంది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాల్సిన ప్రభుత్వం.. రాజకీయ కోణంలో ఖైదీల విడుదలకు సిద్ధపడిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేబినెట్ నిర్ణయం చూసి జైళ్ల శాఖ అధికారులు విస్తుపోతున్నారు. -
ఏపీ కేబినెట్ వివాదస్పద నిర్ణయం
-
ఘనంగా వైఎస్ రాజారెడ్డి వర్ధంతి
- నివాళులర్పించిన జగన్, కుటుంబ సభ్యులు కడప: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి వర్ధంతిని వైఎస్సార్ జిల్లా పులివెందులలో శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక లయోలా డిగ్రీ కళాశాల రోడ్డులో ఉన్న వైఎస్ రాజారెడ్డి ఘాట్ వద్ద వైఎస్సార్ సీపీ అధినేత, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. వైఎస్ వివేకానందరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, డాక్టర్ ఎస్.పురుషోత్తమరెడ్డి తదితరులు జగన్‌తో కలిసి కొవ్వొత్తులు వెలిగించి కొద్దిసేపు మౌనం పాటించారు. వైఎస్ జయమ్మ, వైఎస్ జార్జిరెడ్డి సమాధుల వద్ద కూడా నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, కుమార్తె షర్మిల, కోడలు వైఎస్ భారతిరెడ్డి, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ, వైఎస్ సోదరుడు వైఎస్ సుధీకర్‌రెడ్డి, సోదరి విమలమ్మ, వైఎస్ మేనత్తలు కమలమ్మ, రాజమ్మ, వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ, ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు ఇసీ గంగిరెడ్డి, ఆయన సతీమణి డాక్టర్ సుగుణమ్మ, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లి లక్షుమ్మ, సతీమణి సమత, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి తదితరులు రాజారెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు : పులివెందులలోని బాకరాపురంలో ఉన్న వైఎస్సార్ ఆడిటోరియంలో వైఎస్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తొలుత వైఎస్ రాజారెడ్డి చిత్రపటం వద్ద జగన్డ్, విజయమ్మ నివాళులర్పించారు. -
వైఎస్‌రాజారెడ్డి వర్దంతి కార్యక్రమం
-
వైఎస్ రాజారెడ్డికి కుటుంబ సభ్యుల నివాళి
-
వైఎస్ రాజారెడ్డికి కుటుంబ సభ్యుల నివాళి
పులివెందుల : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి దివంగత వైఎస్ రాజారెడ్డి 16వ వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. రాజారెడ్డి సమాధి వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ఆర్ సీపీ సీఎల్పీ నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి శుక్రవారం పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. ప్రతి ఏడాది రాజారెడ్డి వర్థంతిని వైఎస్ఆర్ సీపీ అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహస్తున్న విషయం తెలిసిందే.