సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో శిక్షను అనుభవిస్తున్న సుధాకర్ రెడ్డిని సత్ప్రవర్తన పేరుతో విడుదల చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు వైఎస్సార్ జిల్లాకు చెందిన ప్రముఖ టీడీపీ నేతను కలిసినట్లు సమాచారం. సత్ప్రవర్తన కింద విడుదల కోసం జైళ్లశాఖ 149మంది జాబితా ఎంపిక చేసింది. వారిలో 100 మందిని తిరస్కరించిన కేబినెట్, 49 మంది విడుదలకు ఆమోదం తెలిపింది.
ఇందులో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తండ్రి రాజారెడ్డి హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న సుధాకర్ రెడ్డి పేరు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సుధాకర్ రెడ్డి నెల్లూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. నెల్లూరు జైలు నుంచి ముగ్గురు విడుదలయ్యే అవకాశం ఉంది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాల్సిన ప్రభుత్వం.. రాజకీయ కోణంలో ఖైదీల విడుదలకు సిద్ధపడిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేబినెట్ నిర్ణయం చూసి జైళ్ల శాఖ అధికారులు విస్తుపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment