Sudhakar Reddy
-
ఫిర్యాదు చేసేందుకు వస్తే.. గర్భవతిని చేశాడు
మేడ్చల్ రూరల్: సమస్య చెప్పుకునేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన యువతిని.. న్యాయం చేస్తానని లోబర్చుకుని గర్భవతిని చేశాడో కానిస్టేబుల్. ఆపై బెదిరింపులకు దిగాడు. బాధితురాలు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా కేసు నమోదు చేసిన పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా సదరు కానిస్టేబుల్‌ను రిమాండ్ చేశారు.పోలీసుల కథనం ప్రకారం.. మేడ్చల్ ఇందిరానగర్ కాలనీలో ఉండే యువతి (31) డబ్బుల విషయమై తనను కొందరు ఇబ్బంది పెడుతున్నారంటూ ఫిర్యాదు చేసేందుకు గతేడాది మార్చి 21న తన తల్లితో కలిసి మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. క్రైమ్ విభాగం కానిస్టేబుల్ సుధాకర్‌రెడ్డి వారి సమస్య పరిష్కరిస్తానంటూ హామీఇచ్చి తన సెల్‌ఫోన్ నంబర్‌ను యువతికి ఇచ్చాడు. ఇంటికి పిలిచి అఘాయిత్యం మర్నాడు తన కేసు విషయమై యువతి కానిస్టేబుల్‌కు ఫోన్ చేసింది. లాయర్‌తో మాట్లాడదామంటూ ఆమెను తన ఇంటికి రప్పించి ఆమెను మాటల్లో పెట్టి, తనకు పెళ్లి కాలేదని మాయమాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడ్డాడు. మరోసారి కూడా ఇంటికి రప్పించుకుని ఇలాగే చేశాడు. యువతి గతేడాది జూలైలో గర్భం దాల్చడంతో ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించాడు. ఈ క్రమంలో ఆగస్టు 15న యువతి సుధాకర్‌రెడ్డికి ఫోన్ చేయగా అతని భార్య ఫోన్ లిఫ్ట్ చేసింది. దీంతో అతడికి పెళ్లయిన విషయం తెలియడంతో యువతి కానిస్టేబుల్‌ను నిలదీసింది. ఆమె కారణంగా తన కుటుంబంలో గొడవలు తలెత్తాయని భావించిన సుధాకర్‌రెడ్డి యువతి అడ్డు తొలగించుకునేందుకు మేడ్చల్‌లోని ఆమె ఇంటికి వెళ్లి బలవంతంగా ఫినాయిల్ తాగించాడు. అనంతరం సుధాకర్‌రెడ్డి దంపతులు సదరు యువతిని ఇంటికి పిలిపించుకుని దాడి చేశారు. అలాగే, తన మిత్రుడైన మరో కానిస్టేబుల్ ద్వారా సుధాకర్‌రెడ్డి యువతిని బెదిరింపులకు గురిచేశాడు. డిసెంబర్ 16న సుధాకర్‌రెడ్డి తన బండిపై యువతిని తీసుకెళ్లి గిర్మాపూర్ సమీపంలో కిందికి తోసేయడంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు కానిస్టేబుల్ వ్యవహారం గురించి తెలిసి మేడ్చల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ.. అతడిని సైబరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ చేయించారు. అయినా బెదిరింపులు ఆగకపోవడంతో ఆ యువతి ఈ నెల 3న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేసింది. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి సుధాకర్‌రెడ్డిని రిమాండ్‌కు తరలించారు. -
జడ్పీ వైస్ ఛైర్మన్ సుధాకర్ రెడ్డి హత్యకు కుట్ర
-
మేడిగడ్డకు కొత్త టెయిల్‌పాండ్!
సాక్షి, హైదరాబాద్: పీడన శక్తి విడుదల(ఎనర్జీ డిస్సిపేషన్)కు సరైన ఏర్పాట్లు లేకపోవడంతోనే మేడిగడ్డ బరాజ్ కుంగిందని నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’జరిపించిన ఓ మోడల్ స్టడీలో తేలింది. దీంతో తాత్కాలిక రక్షణ చర్యల్లో భాగంగా ఆ మేరకు ఏర్పాట్లు చేసేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్ఏ) నుంచి అనుమతులను ఇప్పించాలని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రామగుండం చీఫ్ ఇంజనీర్ కె.సుధాకర్‌రెడ్డి తాజాగా నీటిపారుదల శాఖ ఈఎన్సీ(జనరల్)కు లేఖ రాశారు. మళ్లీ వర్షాకాలం రాకకు ముందు మిగిలి ఉండే సమయంలో ఈ పనులు చేయాల్సి ఉందని తెలియజేశారు.జలాశయాల గేట్లు ఎత్తినప్పుడు విడుదలయ్యే వరద దిగువన తాకే సమయంలో నేల కోతకు గురై గుంతలు ఏర్పడతాయి. ఎందుకంటే గేట్ల నుంచి నీళ్లతో నిండే ఉండే జలాశయాల నుంచి విడుదలయ్యే వరదలో తీవ్రమైన పీడన శక్తి ఉంటుంది. వరద నేలను తాకే చోట తగిన పరిమాణంలో నీటి నిల్వలతో టెయిల్ ఉండేలా ఏర్పాట్లు చేయాలి. దీంతో టెయిల్‌పాండ్ నిల్వలో గేట్ల నుంచి వరద వచ్చి పడినా పీడన శక్తి నిర్వీర్యమై దిగువ ప్రాంతంలో ఎలాంటి నష్టాన్ని కలిగించదు.మేడిగడ్డ బరాజ్ దిగువన తగిన నీటినిల్వలతో టెయిల్‌పాండ్ నిర్మించకపోవడంతోనే అక్కడ నేల కోతకు గురై భారీ గుంతలు ఏర్పడ్డాయని, క్రమానుగుణంగా గుంతలు పెద్దగా మారి బరాజ్ పునాదుల కింద ఇసుక జారిపోవ డానికి కారణమైందని ఎల్అండ్టీ నిర్వహించిన మోడల్ స్టడీస్‌లో తేలింది. ఈ నేపథ్యంలో మేడిగడ్డ బరాజ్ దిగువన ఎనర్జీ డిస్సిపేషన్ కోసం టెయిల్‌పాండ్ సామర్థ్యం పెంపు చర్యలను తీసుకోవాలని భావిస్తున్నారు.ఐఐటీ రూర్కీకి డిజైన్ల తయారీ అప్పగింతటెయిల్పాండ్ పనులకు సంబంధించిన మోడ ల్ స్టడీస్‌ను ఐఐటీ రూర్కీతో నీటిపారుదల శాఖ చేయించింది. ఈ పనులకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్స్‌ను సైతం అదే సంస్థ ఇవ్వనుంది. నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీఓ) సీఈతో ఈ డిజైన్లకు ఆమోదం తీసుకొని పనులు ప్రారంభించేందుకు ఎన్డీఎస్ఏ నుంచి అనుమతి పొందాలని రామగుండం చీఫ్ ఇంజనీర్ ఈఎన్సీకి విజ్ఞప్తి చేశారు. మేడిగడ్డ బరాజ్‌కు శాశ్వత పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎన్డీఎస్ఏ తుది నివేదిక సమర్పించే వరకు వేచిచూడకుండా ఈ మేరకు పనులు చేసేందుకు ఆయన అనుమతి కోరారు. -
‘కాఫర్ డ్యామ్’ నిర్లక్ష్యం పాక్షికంగా నిజమే!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బరాజ్ నిర్మాణం పూర్తయ్యాక కాఫర్ డ్యామ్, షీట్‌పైల్స్‌ను పూర్తిగా తొలగించకపోవడంతో వరద ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి బరాజ్ దెబ్బతిందని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ వ్యాఖ్యానించింది. ఇందుకు నీటిపారుదల శాఖ, నిర్మాణ సంస్థల నిర్లక్ష్యం కారణం కాదా? అని అధికారులను ప్రశ్నించగా ‘పాక్షికంగా నిజమే’నని కాళేశ్వరం ప్రాజెక్టు రామగుండం సీఈ కె.సుధాకర్‌రెడ్డి అంగీకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భాగంగా శనివారం ఆయన్ను కమిషన్ సుదీర్ఘంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఒప్పందం ప్రకారం బరాజ్ కట్టాక నిర్మాణ సంస్థ కాఫర్ డ్యామ్‌ను ఎందుకు పూర్తిగా తొలగించలేదని నిలదీసింది. ఈ పనుల వ్యయాన్ని తొలి సవరణ అంచనాల్లో రూ. 61.21 కోట్లకు పెంచారని.. ఆ డబ్బును మిగుల్చుకోవాలని ఉద్దేశపూర్వకంగానే ఒప్పందాన్ని ఉల్లంఘించారని తప్పుబట్టింది. 2019లో వచ్చిన వరదలతో దెబ్బతిన్న మేడిగడ్డ బరాజ్‌ను నిర్మాణ సంస్థ నిర్వహించలేదని సుధాకర్‌రెడ్డి బదులిచ్చారు. 2020 వరదల్లో బరాజ్ దిగువన కాంక్రీట్ దిమ్మెలు కొట్టుకుపోగా పునరుద్ధరించాలని నిర్మాణ సంస్థను కోరారా? అని కమిషన్ ప్రశ్నించగా అప్పట్లో తానక్కడ లేనని బదులిచ్చారు. బరాజ్‌ల నిర్మాణం జరిగి అవి వినియోగంలోకి వచ్చినట్లు ధ్రువీకరించుకున్నాకే వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లపై కౌంటర్ సంతకం చేశానని సమర్థించుకున్నారు. ఈ సర్టిఫికెట్ల జారీకి విధివిధానాలేవి లేవని ఆయన తెలపగా, కమిషన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. విధివిధానాలు లేకున్నా రబ్బర్ స్టాంపులాగా సర్టిఫికెట్ల జారీకి మీ అంతరాత్మ ఎలా ఒప్పుకుందంటూ నిలదీసింది. మిమ్మల్ని మీరు ఇరకాటంలో పడేసుకుంటున్నారని మండిపడింది. సికెంట్ పైల్స్‌పైనే కమిషన్ గురి.. దేశంలో జలాశయాల నిర్మాణంలో సికెంట్ పైల్స్ వినియోగించరని, అలాంటిది మేడిగడ్డ బరాజ్‌కు ఎందుకు వాడారని కమిషన్ ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలియదని, వాటి డిజైన్లను సీఈ సీడీఓ ఇచ్చారని సుధాకర్‌రెడ్డి తెలియజేశారు. బరాజ్ కుంగిపోవడానికి మరో కారణంగా పునాదుల కింద సికెంట్ పైల్స్‌ను నిట్టనిలువుగా, క్రమబద్ధంగా నిర్మించలేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ పేర్కొన్న విషయాన్ని కమిషన్ గుర్తుచేయగా ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన బదులిచ్చారు. సీఈ సీడీఓ డయాఫ్రమ్ వాల్ డిజైన్లు ఇచ్చినా దానికంటే తక్కువ వ్యవధి, వ్యయంతో నిర్మించవచ్చనే సికెంట్ పైల్స్‌కు మొగ్గు చూపినట్టు తెలిపారు. డీవాటరింగ్‌కు అంచనాల కంటే 49.6 శాతం అధిక చెల్లింపులను నిబంధనల ప్రకారమే చేశామని సుధాకర్ రెడ్డి తెలియజేశారు. టెండర్లు లేకుండానే డీపీఆర్ తయారీనా? టెండర్లు లేకుండానే నామినేషన్‌పై కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ తయారీ బాధ్యతను వ్యాప్కోస్‌కు అప్పగించినట్టు సుదాకర్‌రెడ్డి తెలిపారు. టెండర్లు పిలవొద్దని ఎవరు ఆదేశించారని కమిషన్ ప్రశ్నించగా క్షేత్రస్థాయి పరీక్షల రికార్డులను వ్యాప్కోస్‌కు ఇవ్వాలని నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారని సుధాకర్‌రెడ్డి వివరించారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినట్లు మరో ప్రశ్నకు బదులిచ్చారు. -
కాళేశ్వరం కమిషన్ విచారణ.. మూడుసార్లు హరీష్ రావు పేరు ప్రస్తావన
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి శనివారం హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల టెండర్లపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఆయన్ను విచారించింది. విచారణలో భాగంగా మాజీ జలవనరులశాఖ మంత్రి హరీష్ రావు పేరును సుధాకర్ రెడ్డి మూడుసార్లు ప్రస్తావించారు. ప్రాజెక్టు కోసం చేసిన టెస్టుల రిపోర్టులను వ్యాప్కోస్ సంస్థకు ఇవ్వనని ఎవరు ఆదేశించారని కమిషన్ ప్రశ్నించగా.. ఆ సమయంలో హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారని, ఆయనే ఆదేశించారని తెలిపారు. కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టింది అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలోనేనని పేర్కొన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో 40 వేల కోట్ల నుంచి 127 వేల కోట్లకు పెంచారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కేవలం అదనంగా రెండు లక్షల ఎకరాల కోసమా?: కమిషన్డీపీఆర్ ప్రకారం కాఫర్ డ్యామ్‌కు డబ్బులు ఇచ్చాం-సుధాకర్ రెడ్డికాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ టెండర్ల ప్రాసెస్ జరిగిందా? కమిషన్టెండరింగ్ ప్రాసెస్ జరగలేదు. నామినేషన్ ప్రాసెస్ ద్వారా వ్యాప్కొస్ సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు- సుధాకర్ రెడ్డికాళేశ్వరం ప్రాజెక్టు టెండర్ ప్రాసెస్ ఎందుకు చేయలేదు చెయ్యొద్దు అని ఎవరు ఆదేశించారు?- కమిషన్బ్యారేజీ పనులు పూర్తయినట్లు సర్టిఫికెట్ ఏ సమయంలో ఇస్తారు?- కమిషన్దాదాపు 90 శాతం పనులు పూర్తయితే సబ్ స్టాన్షల్ సర్టిఫికేట్ విడుదల చేస్తారు?- సుధాకర్ రెడ్డిపనులు పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇచ్చేముందు ఫీల్డ్ విజిట్ లేదా డాక్యుమెంట్స్ చెక్ చేశారా?- కమిషన్ఫీల్డ్ విసిట్, డాక్యుమెంట్స్ చెక్ చేయకుండా పనులు పూర్తయినట్లు సర్టిఫికెట్ ఎలా ఇస్తారు?- కమిషన్42.2b క్లాజ్ ఉపయోగించి సర్టిఫికెట్‌ను రిజెక్ట్ చేసే అర్హత ఉన్నప్పటికీ ఎందుకు ఆపలేదు?- కమిషన్సర్టిఫికెట్ ఇచ్చేముందు అసలు నిజాలు చూడకుండా ఎలా గుడ్డిగా సంతకాలు పెడుతారు?- కమిషన్కాపర్ డ్యాం నిర్మాణం తొలగింపు కోసం అదనంగా ఖర్చు చేసే నిధులు ప్రభుత్వానికి నష్టమే కదా?- కమిషన్మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ఫైనల్ బిల్లులు ఆలస్యం ఎందుకు అయ్యాయి? - కమిషన్అన్నారం సుందిళ్ల ఫైనల్ బిల్లులను నిర్మాణ సంస్థలు ఇచ్చాయి,.మేడిగడ్డ బ్యారేజీ ఫైనల్ బిల్లులు ఇంకా సబ్మిట్ చేయలేదు.- సుధాకర్ రెడ్డిబిల్లుల చెల్లింపుల అంశంలో కాళేశ్వరం కార్పొరేషన్ ప్రస్తావన..కాళేశ్వరం కార్పొరేషన్ ఎవరు పెట్టారు? పెట్టమని ఎవరు ఆదేశించారు;- కమిషన్కాళేశ్వరం కార్పొరేషన్ ప్రభుత్వం పెట్టింది. అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో జరిగింది. సుధాకర్ రెడ్డిమేడిగడ్డ బ్యారేజీ కింద బొగ్గు గనుల ఆనవాళ్లు ఉన్నట్లు జోధాపూర్ యూనివర్సిటీ సర్దార్ కన్సల్టెన్సీ నివేదిక ఇచ్చింది. సుధాకర్ రెడ్డిబ్యారేజీలలో నీళ్లు స్టోరేజ్ చేయొచ్చా చేస్తే ఎంత చేయొచ్చు?- కమిషన్మేడిగడ్డ బ్యారేజీలో 100 మీటర్ల లెవెల్ వరకు స్టోర్ చేయొచ్చు.- సుధాకర్ రెడ్డిచేసుకున్న అగ్రిమెంట్ కంటే ఎక్కువ నిధులు ఏజెన్సీకి పే చేస్తే అది ప్రభుత్వానికి నష్టమే కదా- కమిషన్డిజైన్లలో లోపాల వల్ల బ్యారేజీల వద్ద డ్యామేజ్ జరిగింది నిజమేనా? - కమిషన్మేడిగడ్డ బ్యారేజీ లోని బ్లాక్ లలో లెన్త్ అండ్ విడ్త్ డిజైన్ సరిగ్గా లేకపోవడం వల్లే డ్యామేజి జరిగింది- సుధాకర్ రెడ్డి వరద వేగాన్ని అంచనా వేయకపోవడం వల్లే బ్లాకులు దెబ్బతిన్నాయి-సుధాకర్ రెడ్డి. -
ఈగోని పక్కన పెడితే ఆడియన్స్‌కి దగ్గరవుతాం
‘‘గ్లోబల్ స్థాయికి వెళ్లాలని ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ సినిమాలను చేయలేదు. కథాబలం ఉండటంతో ఆ సినిమాలను జపాన్ వంటి ఇతర దేశాల ప్రేక్షకులూ ఆదరించారు. గ్లోబల్ అప్పీల్ ఉన్న కథ కోసం ఎదురు చూస్తూ ఉంటే టైమ్ వృథా అవుతుంది. నాకు వచ్చిన కథలు చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ క్రమంలో పాన్ ఇండియా కథ ఏదైనా సెట్ అయితే ఓకే. అయినా నాకలాంటి పెద్ద పెద్ద ఆశలు లేవు. తెలుగులోనే సినిమాలు చేయాలని ఉంది’’ అని హీరో నితిన్ అన్నారు. నితిన్, శ్రీ లీల జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్’ రేపు రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో నితిన్ చెప్పిన విశేషాలు. ► ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్’లో నా పాత్రలో త్రీ షేడ్స్ ఉన్నాయి. కథ రీత్యా జూనియర్ ఆర్టిస్ట్‌గా కనిపిస్తాను. అలా అని ఈ సినిమాలో జూనియర్ ఆర్టిస్టుల కష్టాల గురించి చెప్పడం లేదు. ఆ పాత్ర నుంచి కామెడీ పండించాం. ‘ఎక్స్ట్రా’ చిత్రంలో ఇంట్రవెల్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. కథ కొత్తది కాక΄ోవచ్చు కానీ పాయింట్ చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా కథ విన్నప్పుడల్లా హాయిగా నవ్వుకున్నాను. కథ స్క్రీన్ మీదకు వచ్చినప్పుడు కూడా సేమ్ ఫీలింగ్. ►వక్కంతం వంశీగారి కథలతో వచ్చిన ‘కిక్’, ‘రేసు గుర్రం’, ‘ఊసరవెల్లి’, ‘టెంపర్’ చిత్రాలను గమనిస్తే హీరో క్యారెక్టరైజేషన్ కొత్తగా, విభిన్నంగా ఉంటుంది. ‘ఎక్స్ట్రా’ చిత్రంలోనూ ఇలానే ఉంటుంది. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. ►సినిమాలో రావు రమేశ్‌గారు నాకు తండ్రిగా నటించారు. ఆయనకు, నాకు మధ్య వచ్చే సీన్స్ వినోదాత్మకంగా ఉంటాయి. కొంత సెంటిమెంట్ కూడా ఉంటుంది. రాజశేఖర్‌గారు సెకండాఫ్‌లో వస్తారు. సందర్భానుసారంగా కామెడీ వస్తుంటుంది. ►సినిమాలో నేను జూనియర్ ఆర్టిస్టు్టను కాబట్టి ‘శ్రీమంతుడు’, ‘బాహుబలి’ వంటి సినిమాల ప్రస్తావనతో కాస్త కామెడీ ఉంటుంది. వినోదం కోసమే ఇలా చేశాం. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి సినిమాల్లో వెంకటేశ్‌గారి పాత్రపై ఇతర పాత్రధారులు జోక్స్ వేస్తుంటారు. ఇమేజ్, ఈగోల గురించి ఆలోచించకుండా పాత్ర కోసం నటిస్తే ఆడియన్స్‌కు మరింత దగ్గర కావొచ్చు. ఈ విషయంలో నాకు వెంకటేశ్‌గారు స్ఫూర్తి. ►ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. ఈ చిత్రంలో శ్రీ లీల హీరోయిన్. అలాగే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘తమ్ముడు’ సినిమా చేస్తున్నాను. కథ నచ్చితే గ్రే షేడ్ (కాస్త నెగటివ్ టచ్ ఉన్న పాత్రలు) ఉన్న పాత్రలు చేయడానికి రెడీగా ఉన్నాను. -
సలార్‌తో పోటీ పడలేం.. అందుకే డేట్ మార్చాం: టాలీవుడ్ నిర్మాత
నితిన్, శ్రీలీల జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎక్స్ట్రా'. ఆర్డినరీ మ్యాన్’ అనేది ఉపశీర్షిక. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ తేదీని మొదట డిసెంబర్ 23న ప్రకటించారు. కానీ ఆ తర్వాత విడుదల తేదీ మార్చారు. దీనిపై నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడారు. సలార్ రావడం వల్లే రిలీజ్ డేట్స్ మార్చాల్సి వచ్చిందని తెలిపారు. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ..'నాని హాయ్ నాన్న సినిమా మొదట డిసెంబర్ 22న రిలీజ్ డేట్ ఉంది. మా సినిమా కూడా 23న అనుకున్నాం.. కానీ అదే సమయంలో ప్రభాస్ సలార్ వచ్చింది. అందుకే మేం రిలీజ్ డేట్స్ సర్దుబాటు చేసుకున్నాం. ఎందుకంటే పెద్ద సినిమా రావడంతోనే మేం తప్పుకున్నాం. భారీ బడ్జెట్ చిత్రం కాబట్టి.. అందుకు అనుగుణంగానే సర్దుకున్నాం. ఒక రోజు ముందు నాని 7వ తేదీన వచ్చేస్తున్నాడు. మేం 8న వస్తున్నాం. అంతే కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. పండగ తర్వాత డేట్స్ కుదరవని ముందే రిలీజ్ చేస్తున్నాం' అని అన్నారు. -
సల్మాన్ 'టైగర్-3'ని ఢీ కొడుతున్న తెలుగు డైరెక్టర్
బాలీవుడ్లో టాప్ హీరోలలో ఒకరైన సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'టైగర్-3' విడుదలకు రెడీగా ఉంది. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సినిమాలకు ఇది సీక్వెల్‌గా రానుంది. ఇందులో సల్మాన్ ఖాన్‌కు ఏమాత్రం తగ్గకుండా కత్రీనా కైఫ్ కూడా భారీ యాక్షన్స్ సీన్స్‌లలో మెప్పించింది. దీపావళి కానుకగా భారీ అంచనాల మధ్య టైగర్-3 నవంబర్ 12న విడుదల కానుంది. టైగర్-3కి పోటీగా ఈ సారి తమిళ సినిమాలు జపాన్, జిగర్ తండా డబుల్ ఎక్స్ చిత్రాలు మాత్రమే పోటీలో ఉన్నాయి. నేడు (నవంబర్ 10)న ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ మరాఠీలో మన తెలుగు డైరెక్టర్ తీసిన 'నాళ్- భాగ్ 2' సినిమా కూడా నేడు రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద సల్మాన్ టైగర్-3 ను ఢీ కొట్టేందుకు రెడీ అయింది. మరాఠీలో 2018లో వచ్చిన 'నాళ్' అనే బ్లాక్ బస్టర్ సినిమాకి ఇది సీక్వెల్‌గా వస్తుంది. ఈ సినిమాతో సుధాకర్ రెడ్డి జాతీయ అవార్డు అందుకున్నాడు. అప్పట్లో అక్కడ ఈ సినిమా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో పార్ట్-2 మీద అంచనాలు పెరిగాయి. నాళ్-2 చిత్రాన్ని జీ -స్టూడియోస్ నిర్మించింది. ఈ సినిమా మొదటి పార్ట్‌కు జాతీయ అవార్డు దక్కడంతో మహారాష్ట్ర డిస్ట్రిబ్యూటర్లు కూడా నాళ్-2 మూవీకి సపోర్ట్‌గా ఉంటూ కావాల్సిన మల్టీప్లెక్సులు, థియేటర్లను ఏర్పాటు చేస్తున్నారట. అక్కడ సల్మాన్ ఖాన్ టైగర్-3 చిత్రానికి పోటీగా మన తెలుగోడు డైరెక్ట్ చేసిన చిత్రం బరిలో ఉంది. సుధాకర్ రెడ్డి ఎవరు..? ఎక్కంటి సుధాకర్ రెడ్డిది అంధ్రప్రదేశ్‌లోని గుంటురు జిల్లా.. హైదరాబాదులోని జేఎన్టీయూలో థియేటర్ ఆర్ట్స్ లో డిగ్రీ చేశాడు. తెలుగులో పౌరుడు, మనసారా, మధుమాసం, దళం, జార్జ్ రెడ్డి వంటి సినిమాలతో పాటు పలు ఉత్తరాది చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. అమితాబ్ బచ్చన్ 'ఝుండ్' సినిమాకు కెమెరామెన్‌గా పనిచేశాడు. 2018లో 'నాళ్' (మరాఠి) సినిమాతో డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కింది. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమాకే జాతీయ అవార్డు దక్కడంతో మహారాష్ట్రలో ఆయన పేరు మారు మ్రోగిపోయింది. నాల్ సినిమా కథకు మూలం ఎంటి? నాల్.. మారాఠీలో 2018లో విడుదలైన ఈ చిన్న సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. నాల్ అంటే బొడ్డుతాడు అని అర్థం. తల్లీబిడ్డల పేగు బంధం ఇతివృత్తంతో దర్శకుడు సుధాకర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఓ మనిషికి తల్లితో, బాల్యంతో, గ్రామంతో ఉండే అనుభూతులను ఇందులో చిత్రీకరించారు. -
స్కామ్ కారకులనే నాడు అప్రమత్తం చేశారు
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కాంను చాలా స్కిల్ ఫుల్‌గా జరిపించి.. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి లూటీ చేశారని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు. గురువారం స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి సీఐడీ నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన కూడా పాల్గొని మాట్లాడారు. సీమెన్స్ ఏజీ అనే జర్మన్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమతో.. స్కిల్ డెవలప్మెంట్ కోసం రూ. 3,300 కోట్లు ఫ్రీగా ఇస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రాజెక్టులో 90 శాతం సీమెన్స్ కంపెనీ ఇస్తుందని.. ప్రభుత్వం కేవలం 10 శాతం ఇస్తే సరిపోతుందన్నారు. రూల్స్ ప్రకారం అది వీలుకాదని అధికారులు అప్పటి టీడీపీ ప్రభుత్వానికి అధికారులు చెప్పారు. అయితే పైలట్ ప్రాజెక్ట్ అమలు చేయాలన్న అధికారుల వాదనను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు. పైగా ఏపీ ఖజానా నుంచి రూ.371 కోట్లు డిజైన్‌టెక్‌కు చెల్లించారు. చాలా నైపుణ్యంగా జరిగిన స్కామ్ ఇది. ప్రభుత్వ సంపదను చాలా సులభంగా దోచేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఏర్పాటైన.. స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అవకతవకల గురించి పుణే నుంచి జీఎస్టీ అధికారులు అప్పటి ఏపీ ప్రభుత్వానికి లేఖ ద్వారా అప్రమత్తం చేశారు. 2018, మే 14వ తేదీన ఏపీ ఏసీబీ డీజీకి లేఖ రాశారు. అంటే.. పుణే నుంచి ఈ స్కామ్ బయటపడింది. చూస్కోండి బాబూ.. రూ. 371 కోట్లు హాంఫట్ అయ్యాయని లేఖ ద్వారా అలర్ట్ చేశారు. అప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఈ స్కాంకు కర్తనో.. ఆ ప్రభుత్వానికే ఆ లేఖ అందింది. అంటే.. కారకులనే పుణే జీఎస్టీ విభాగం అప్రమత్తం చేసిందన్నమాట. అందుకే వ్యవహారం ముందుకు సాగలేదు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది అని ఏఏజీ సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో మీడియా ప్రశ్నలు అడగబోతుండగా.. తానేం దర్యాప్తు అధికారిని కానని.. కేవలం ప్రభుత్వ ప్రతినిధిగా వాదనలు మాత్రమే వినిపిస్తున్నానని.. అందుకే తనకు చేరిన పత్రాలు, వివరాల ఆధారంగా మీడియాకు సమాచారం ఇస్తున్నానని ఆయన తెలిపారు. -
Sakshi TV-Big Question: ‘‘దెబ్బకు ఠా.. దొంగల ముఠా
సాక్షి, హైదరాబాద్: జేబుకు తెలియకుండానే పర్సు కొట్టేసే రకం ఆయనది. స్కీమ్ పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసిన స్కామ్ వల్లే ఇప్పుడు కటకటాల పాలయ్యారు. సీమెన్స్ అనే కంపెనీకి తెలియకుండానే వాళ్ల పేరుతో ఒప్పందం చేసుకోవడం ఒక వింత. అయితే అది 100 శాతం ఫ్రాడ్ అని తేల్చేసి బాబు బండారాన్ని బయటపెట్టింది సదరు సీమెన్స్ కంపెనీ. డిజైన్ టెక్ నుంచే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెందిన షెల్ కంపెనీలకు ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు మళ్లాయి. ఆ కంపెనీ ఎండీ వికాస్ ఖన్వేల్కర్ని ఈడీ గతంలోనే అరెస్ట్ చేసింది. రూ. 371 కోట్ల దోపిడీలో స్కిల్ చూపించిన చంద్ర బాబు, వికాస్ ఖన్వేల్కర్. స్కిల్ స్కామ్‌లో పక్కా ఆధారాలతో పట్టుబడ్డ బాబు అండ్ గ్యాంగ్.. ‘‘దెబ్బకు ఠా...దొంగల ముఠా’’ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో దర్యాప్తు సంస్థ ఏపీ సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో బిగ్ క్వశ్చన్ రాత్రి 7 గంటలకు.. మీ సాక్షి టీవీలో.. -
చట్టం ముందు అందరూ సమానమే : ఏఏజీ పొన్నవోలు
-
అందుకే బాబును జైల్లోనే ఉంచాలనేది: ఏఏజీ
సాక్షి, విజయవాడ: రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు పూర్తి భద్రత ఉందని.. ఇంటి భోజనం, మందులు అందిస్తూ ప్రభుత్వం అన్ని విధాల సదుపాయాన్ని కల్పిస్తున్న విషయాన్ని అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మరోసారి ప్రస్తావిస్తున్నారు. ఈ కేసులో చంద్రబాబు అన్ని ఆధారాలతో దొరికిపోయారని.. ఇప్పుడు న్యాయవ్యస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఏఏజీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో చంద్రబాబు అన్ని ఆధారాలతో దొరికిపోయారు. జైల్లో ఆయనకు పూర్తి భద్రత ఉంది. జైల్లో ఖైదీలు కాక.. స్వామిలు ఉంటారా?. చంద్రబాబుకి ఇంటి భోజనం, మందులు కూడా అందిస్తున్నారు. ఆయనకు అక్కడే అన్ని విధాల భద్రత ఉంటుందని మరోసారి ఉద్ఘాటించారు. అలాగే బెయిల్, హౌజ్ అరెస్ట్.. ఇలా పిటిషన్లు వేసుకునే హక్కులు అందరికీ ఉంటాయని తెలిపారాయన. అందుకే జైల్లో ఉండాలనేది ఇక కేవలం తన స్టేట్మెంట్ ఆధారంగానే కేసు నడవడాన్ని మాజీ అధికారి పీవీ రమేష్ ఆక్షేపించడాన్ని ఏఏజీ సుధాకర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. జడ్జి ముందు పీవీ రమేష్ ఇచ్చిన స్టేట్మెంట్ ఉందని, అందులో వాస్తవాలు ఉన్నాయని, ఈ పరిణామాలు చూస్తుంటే అప్పుడే ఓ వికెట్ పడిపోయిందనే అనుమానాలు కలుగుతున్నాయని ఏఏజీ అంటున్నారు. పీవీ రమేష్‌ను అప్పుడే ప్రలోభ పెట్టినట్లు కనిపిస్తోందని.. ప్రలోభాలు, లోబర్చుకోవడం, మేనేజ్ చేయడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య అని ఏఏజీ విమర్శించారు. కాబట్టే చంద్రబాబు జైల్లోనే ఉండాలని బలంగా చెబుతున్నామని ఏఏజీ అంటున్నారు. . దురదృష్టకరం తప్పు అని నిరూపిస్తే.. ఏ వ్యవస్థనైనా భ్రష్టు పట్టించగల సమర్థత వాళ్లకు ఉందని ఏఏజీ సుధాకర్‌రెడ్డి అంటున్నారు. అనుకూలంగా ఆర్డర్ రాకపోయేసరికి ఇప్పుడు న్యాయవ్యవస్థను సైతం నిందిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థపై దాడి దురదృష్టకరమని.. న్యాయ వ్యవస్థను కూలదోయాలని ప్రయత్నిస్తే వాళ్లే కూలిపోతారని హితవు పలికారాయన. భయం నా బ్లడ్‌లోనే లేదు స్కిల్ స్కాం కేసులో సీఐడీ తరపున తాను తన వృత్తిపరంగానే పని చేస్తున్నానని, తనపై ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలు లేవని స్పష్టం చేశారు ఏఏజీ పొన్నవోలు. అలాగే.. వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేసేవాళ్లను తాను పట్టించుకోబోనని అంటున్నారాయన. వాళ్లు చెబుతున్న డైలాగులే తాను చెబుతున్నానని, బెదిరింపులకు తాను భయపడే రకం కాదని.. భయం తన బ్లడ్‌లోనే లేదని ఆయన అన్నారు. లోకేష్ అలా ఎలా అంటారు? షెల్ కంపెనీల ద్వారా డబ్బులు క్రెడిట్ అయ్యాయని కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో తేలిందని, ఆధారాలు లేవని నారా లోకేష్ ఎలా అంటారని ఏఏజీ సుధాకర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని వ్యవస్థలకు పట్టిన చంద్ర గ్రహణం ఇప్పుడిప్పుడే వీడుతోందంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారాయన. ఇదీ చదవండి: ఆ రెడ్ డెయిరీ ఏందో.. లోకేష్ ఏందో..! -
టీడీపీ విధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించాలి
సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఇతర నేతల ప్రోద్బలంతో జరిగిన విధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. సమాజానికే ప్రమాదం కలిగించే ఇలాంటి ఘటనలను అడ్డుకోకుంటే విధ్వంసాన్ని ప్రోత్సహించినట్లవుతుందని అన్నారు. ఇలాంటి వ్యక్తులు, ఘటనల వల్ల సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని తెలిపారు. అంతిమంగా ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకం అవుతుందన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దౌర్జన్యం చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. అంగళ్లులో విధ్వంసం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ టీడీపీ సీనియర్ నేతలు నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, పులివర్తి నాని దాఖలు చేసిన వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి గురువారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఏఏజీ వాదనలు వినిపిస్తూ.. చట్ట ప్రకారం ఓ వ్యక్తిపై హత్యాయత్నం (ఐపీసీ సెక్షన్ 307) కేసు నమోదు చేయాలంటే అతను మరొకరిని గాయపరచాల్సిన అవసరం లేదని, చంపాలన్న ఉద్దేశం ఉంటే సరిపోతుందని వివరించారు. అంగళ్లులో చంద్రబాబు తరమండిరా.. చంపండిరా.. అంటూ తన పార్టీ కార్యకర్తలను అధికార పార్టీ నేతలపై, సామాన్యులపై ఉసిగొల్పారన్నారు. టీడీపీ కార్యకర్తల దాడిలో అధికార పార్టీకి చెందిన వారే కాక సామాన్యులు కూడా గాయపడ్డారన్నారు. అందుకే చంద్రబాబు, ఇతర నేతలపై పెట్టిన హత్యాయత్నం కేసు చెల్లుబాటవుతుందని వివరించారు. అన్నమయ్య జిల్లాలోని ప్రజలకు ఎంతో ముఖ్యమైన పిచ్చివాండ్లపల్లి ప్రాజెక్టుపై టీడీపీ నేతలు కొందరు స్టే తెచ్చారని, దీంతో ప్రాజెక్టును అడ్డుకోవద్దంటూ చంద్రబాబును అభ్యర్థించేందుకే అధికార పార్టీ నేతలు ప్రయత్నించారన్నారు. టీడీపీ నేతల విధ్వంసానికి స్పష్టమైన ఆధారాలున్నాయని చెప్పారు. విధ్వంస ఘటనల వీడియో ఉన్న పెన్‌డ్రైవ్‌ను ఆయన కోర్టుకు సమర్పించారు. పులివర్తి నానిపై 16 కేసులు ఉన్నాయన్నారు. ముందస్తు వ్యూహంలో భాగంగా యుద్ధభేరిలో పాల్గొన్న నేతలందరూ వారి నియోజకవర్గాల నుంచి మనుషులను తెచ్చుకుని, విధ్వంసం సృష్టించారన్నారు. అంగళ్లు నుంచి పుంగనూరు వరకు అప్రతిహతంగా విధ్వంసం కొనసాగించారని వివరించారు. ఈ సందర్భంగా పలువురు సాక్షుల వాంగ్మూలాలను చదివి వినిపించారు. పిటిషనర్లకు బెయిల్ ఇస్తే ఏదైనా చేసి బెయిల్ తెచ్చుకోవచ్చన్న భావన ప్రజల్లో ఏర్పడుతుందన్నారు. అందువల్ల బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. అనంతరం టీడీపీ నేత ఉమామహేశ్వరరావు తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్‌రెడ్డి తరఫున న్యాయవాది ఎన్వీ సుమంత్ వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని, విచారణ నుంచి పారిపోబోమని, ఏ షరతులు విధించినా లోబడి ఉంటామని తెలిపారు. ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరారు. అంగళ్లు, పుంగనూరులో జరిగిన ఘటనలు వేర్వేరని, రెండింటినీ కలిపి పెద్దదిగా చిత్రీకరిస్తున్నారని వివరించారు. అధికార పార్టీ నేతలే చంద్రబాబు తదితరులపై రాళ్లు రువ్వారని చెప్పారు. వారి దాడిలో టీడీపీ నేతలు, కార్యకర్తలే గాయపడ్డారని తెలిపారు. పిచ్చివాండ్లపల్లి ప్రాజెక్టుపై హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సురేష్‌రెడ్డి తీర్పును వాయిదా వేశారు. తీర్పు వెలువరించేంత వరకు పిటిషనర్లను అరెస్ట్ చేయకుండా పోలీసులకు తగిన సూచనలు ఇవ్వాలని ఏఏజీకి స్పష్టం చేశారు. ఆయుధ చట్టం కింద నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలో కూడా న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు. -
పేదల భూములు కొల్లగొట్టి.. హైకోర్టుకొచ్చి స్టే తెచ్చుకున్నారు
సాక్షి, అమరావతి : రాజధానిలో నిరుపేదల నుంచి కారుచౌకగా అసైన్డ్ భూములను కొల్లగొట్టిన వ్యవహారంలో సీఐడీ కేసు నమోదు చే సిన వెంటనే చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ హైకోర్టు నుంచి స్టే తె చ్చుకున్నారని సీఐడీ గురువారం హైకోర్టుకు నివేదించింది. వారి అక్రమాలు బ యటకు వస్తాయన్న ఉద్దేశంతోనే దర్యాప్తును ఎఫ్ఐఆర్ దశలోనే అడ్డుకున్నారని సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు వివరించారు. వారు అక్రమాలకు పాల్పడకపోతే స్టే పొందాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సచ్చీలురని భావిస్తే స్టే ఎత్తివేయాలని కోరి దర్యాప్తునకు సహకరించాలన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా రాజధాని అసైన్డ్ భూముల బదలాయింపులో భారీ అక్ర మాలపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు, నారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు.. దర్యాప్తుతో పాటు తదుపరి చర్యలపై స్టే విధించింది. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ తుది విచారణ జరుపుతున్నారు. దర్యాప్తు జరపకపోతే ఆధారాలెలా వస్తాయి? అసైన్డ్ భూముల కొనుగోళ్లపై ఫిర్యాదు అందిన తర్వాత సీఐడీ ప్రాథమిక విచా రణ జరిపి, అందులో లభించిన ఆధారాలకు అనుగుణంగా బాబు, నారా యణ పై కేసు నమోదు చేసిందని ఏఏజీ చెప్పారు. ఆ విచారణ గురించి వారికి తెలి యదని, లేదంటే దానిపైనా స్టే తెచ్చుకునే వారని అన్నారు. అత్యంత శక్తివంతు లు, పలుకుబడి కలిగిన వారైనందునే ఆఘమేఘాలపై హైకోర్టుకొచ్చి స్టే తెచ్చు కోగలిగారన్నారు. ఒకవైపు దర్యాప్తు జరగకుండా స్టే తెచ్చుకుని, మరోవైపు అక్ర మాలకు ఎలాంటి ఆధారాల్లేవని చెబుతున్నారన్నారు. దర్యాప్తు జరగకపోతే ఆ ధారాలెలా వస్తాయని ప్రశ్నించారు. స్టే ఎత్తేసి దర్యాప్తునకు అనుమతివ్వా లన్నారు. అప్పుడు ఎలాంటి ఆధారాలు సమర్పిస్తామో వారు చూడవచ్చన్నారు. ఆరేళ్ల తరువాత కేసు నమోదు చేశారు.. నారాయణ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు స్టే ఇచ్చినా సీఐడీ దర్యాప్తు కొనసాగించిందన్నారు. రాజ కీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జీవో 41 జారీ చేసిన ఆరేళ్ల తరువాత కేసు నమోదు చేశారన్నారు. ఆ తరువాత జీవో 41ని సవరించారని చెప్పారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, సవరణ సమయంలో కూడా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయా అని ప్రశ్నించగా పోసాని సమాధానం చెప్పలేదు. అనంతరం విచారణను న్యాయమూర్తి బుధవారానికి వాయిదా వేశారు. -
‘మట్టి కథ’కు మూడు అంతర్జాతీయ అవార్డులు
ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(2023) లో మట్టికథ సినిమా మూడు అవార్డులకు ఎంపికైంది. అజయ్ వేద్ హీరోగా కనకవ్వ, బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో పవన్ కడియాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మట్టి కథ’. అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. పల్లెటూరి కుర్రోడి ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉంటాయి? మట్టిలోని మధురానుభూతి ఎలా ఉంటుంది? అనే నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి దరఖాస్తు చేయగా మూడు అవార్డులకు ఎంపికైంది. బెస్ట్ ఇండియన్ ఫ్యూచర్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్ ఫ్యూచర్ ఫిల్మ్ కేటగిరీల్లో విజేతగా నిలిచింది. (చదవండి: లియో సినిమాలో ముగ్గురు హీరోయిన్లు!) ఇదే ఇండో ఫ్రెండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇటీవల బలగం సినిమాకు అవార్డులు వచ్చాయి. బెస్ట్ యాక్డర్ ఫ్యూచర్ ఫిల్మ్ కేటగిరీలో నటుడు ప్రియదర్శి ఎంపికయ్యాడు. ఇప్పుడు అదే కేటగిరీలో మట్టి కథ సినిమా హీరో అజయ్ వేద్.. ఉత్తమ నటుడిగా ఎంపిక కావటం మూవీపై అంచనాలను పెంచేసింది. అంతే కాదు.. ఇదే ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో.. మమ్మనీతమ్ అనే తమిళ సినిమాకు హీరో విజయ్ సేతుపతి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఈ సినిమాల సరసన ఇప్పుడు మట్టి కథ నిలవడంపై చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. -
అమరావతి R-5 జోన్..ఇది పేదల విజయం
-
‘బలగం’కి మరో రెండు అవార్డులు
ఓ కుటుంబ పెద్ద చనిపోయిన నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులు, అతని సన్నిహితుల భావోద్వేగం, అనుబంధాలతో సాగే ‘బలగం’కి విశేష ఆదరణ లభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డులు దక్కాయి. తాజాగా ‘స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023’లో ‘బలగం’ చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా ప్రియదర్శి, ఉత్తమ సహాయ నటుడుగా కేతిరి సుధాకర్ రెడ్డి (కొమురయ్య పాత్రధారి) అవార్డులను గెలుచుకున్నారు. వేణు ఎల్దండి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. -
ఫ్రెంచ్ వెబ్ సిరీస్‌లో తెలుగు జర్నలిస్ట్
ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి గురించి కానీ, ఆయన రచించిన 'బ్లడ్ సాండర్స్ - ది గ్రేట్ ఫారెస్ట్ హీస్ట్' గురించి కానీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే తెలుగు పాఠకులకు సుపరిచయమైన సుధాకర్ రెడ్డి ఎర్ర చందనం స్మగ్లింగ్‌పై రచించిన ఈ పరిశోధనాత్మక రచనను గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆవిష్కరించారు. ఇన్విస్టిగేషన్ జర్నలిజంలో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న హైదరాబాద్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఇప్పుడు అరుదైన ఘనతను సాధించారు. ఈయన ఫ్రెంచ్ భాషలో త్వరలో విడుదల కానున్న డాక్యుమెంటరీలో లీడ్ క్యారెక్టర్ చేశారు. తిరుమల అడవుల నుంచి చైనాకు ఎగుమతి అవుతున్న ఎర్రచందనం గురించి ఈయన పుస్తక రూపంలో బయటపెట్టారు. ఎంతో మంది పోలీస్ అధికారులు, అటవీ శాఖ అధికారుల అభిప్రాయాలతో ఈ పుస్తకాన్ని సమగ్రంగా మలిచారు. సుధాకర్ రెడ్డి త్వరలో ప్లానెట్ కిల్లర్స్ వెబ్ సిరీస్‌లో కనిపించనున్నారు. ప్రపంచంలో ప్రకృతిని నాశనం చేస్తున్న అంతర్జాతీయ క్రిమినల్స్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఆధారంగా ఈ డాక్యుమెంటరీ రూపుదిద్దుకుంటోంది. ఇందులో ప్రధానంగా అడవులను నరికివేయడం, ఏనుగులను చంపి దంతాలను దొంగిలించడం, ఎర్రచందనం వంటి వాటిపై ప్రత్యేకంగా డాక్యుమెంటరీలను రూపొందించారు. 2023 ఏప్రిల్ 3వ తేదీన ఈ డాక్యుమెంటరీ ఫ్రెంచ్ టీవీలో విడుదలకానున్నట్లు సమాచారం. ఇందులో సుధాకర్ రెడ్డి పాత్ర కూడా ఉంది. ఇది నిజంగా తెలుగు జర్నలిస్టులకు దొరికిన అరుదైన, అద్భుతమైన అవకాశం అనే చెప్పాలి. ఈ డాక్యుమెంటరీలో ఎర్రచందనం స్మగ్లర్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సాహుల్ హమీద్‌పై ప్రత్యేకంగా కథనాన్ని రూపొందించారు. సాహుల్ హమీద్ ప్రస్తుతం దుబాయ్‌లో ఆంధ్రప్రదేశ్ అడవుల్లో ఉన్న ఎర్రచందనం కాజేస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ హైదరాబాద్, తిరుపతి, శేషాచలం అడవులు, చెన్నై, తమిళనాడులోని జావాదు మలై, సింగపూర్, దుబాయ్‌లలో చేశారు. అంతే కాకుండా చెన్నైలో సాహుల్ హమీద పుట్టిన ప్రాంతంలో కూడా షూటింగ్ జరిపారు. సాహుల్ హమీద్ విషయానికి వస్తే, యితడు అనేక నేరాలకు పాల్పడి దాదాపు 120 మిలియన్ డాలర్ల ఆస్తులను సంపాదించినట్లు ఇతనిపై అనేక వార్తలు కూడా ఉన్నాయి. అయితే పోలీసులు గతంలో ఇతన్ని అరెస్టు చేశారు. ఆ తరువాత సాహుల్ దుబాయ్‌కి పారిపోయాడు. అక్కడి నుంచే అన్ని కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. సాహుల్ హమీద్ ఎర్రచందనం ఎలా దొంగిలిస్తాడు? అతని ముఠా ఎంతవరకు విస్తరించి ఉంది? అనే వివరాలు ఏప్రిల్ 3న ఎపిసోడ్లో ప్రసారమవుతాయి. ఫ్రాన్స్ డైరెక్టర్లు ఉడుముల సుధాకర్ రెడ్డి సహకారంతో ఈ డాక్యుమెంటరీ రూపొందించారు. త్వరలో ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్‌లో పర్యావరణాన్ని నాశనం చేయడానికి నేరగాళ్లు ఎలా పాల్పడుతున్నారు? పర్యావరణం వారి వల్ల ఎలా నాశనమవుతోంది? అరుదైన జంతువులను, అటవీ సంపదను ఎలా నాశనం చేస్తున్నారు? పోలీసులకు దొరకకుండా ఎలా తప్పినందుకుంటున్నారు? పోలీసులు వారిని ఎలా వెతుకుతున్నారనే విషయాలన్నీ సమగ్రంగా వివరించారు. ఈ డాక్యుమెంటరీలో మన తెలుగు తేజం సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి లీడ్ క్యారెక్టర్ చేయడం తెలుగువారందరూ గర్వించదగ్గ విషయం. ఇది తెలుగు జర్నలిస్టుకు దొరికిన గొప్ప అవకాశం. ఇది అదృష్టం అనటం కంటే కూడా, శ్రమ, పట్టుదల, లోతైన విశ్లేషణ వంటి వాటితోనే ఉడుముల సుధాకర్ రెడ్డి ఈ ఘనత సాధించారని చెప్పాలి. భవిష్యత్తులో ఈయన మరింత గొప్ప స్థాయికి చేరాలను మనస్ఫూర్తిగా ఆశిద్దాం.. -
గత ప్రభుత్వం పేదలను గాలికొదిలేసింది
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలోని మొత్తం విస్తీర్ణంలో ఐదు శాతం భూమిని పేదల నివాసాల నిమిత్తం కేటాయించాలని సీఆర్డీఏ చట్టం స్పష్టంగా చెబుతోందని, అయితే గత ప్రభుత్వం మాత్రం పేదలను గాలికొదిలేసిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. పేదల కోసం రాజధాని ప్రాంతంలో సెంటు భూమి కూడా కేటాయించలేదని, ఆ తప్పును తాము ఇప్పుడు సరిచేసి, చట్టానికి అనుగుణంగా 5 శాతం భూమిని పేదల నివాసకల్పన కోసం కేటాయించామని చెప్పారు. చట్ట ప్రకారం వ్యవహరించడం కూడా తప్పు అంటూ పిటిషన్ దాఖలు చేశారని ఆయన వివరించారు. పేదలులేని ప్రపంచస్థాయి రాజదాని కావాలని రాజధాని రైతులు కోరుకుంటున్నారని, తాము మాత్రం పేదలు సైతం రాజధానిలో ఇళ్లు కట్టుకుని ఉండాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే పేదల కోసం ఆర్ 5 జోన్‌ను ఏర్పాటుచేసి, వందల ఎకరాల భూమిని కేటాయించామన్నారు. రాజధాని రైతుల వాదనను పరిగణనలోకి తీసుకోవద్దని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ అంటరానితనం ఆలోచనలు ఉండటం దురదృష్టకరమని సుధాకర్‌రెడ్డి తెలిపారు. సీఆర్డీఏ తరఫు న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్–57 ప్రకారం పూలింగ్ ద్వారా సమీకరించిన భూమిపై సర్వహక్కులు సీఆర్డీఏకే ఉంటాయన్నారు. ఆ భూమి సీఆర్డీఏ ఆస్తి అవుతుందే తప్ప, రైతులది కాదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, ఇప్పటికే ఇదే అంశంపై దాఖలైన వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోందని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పడంతో ఈ వ్యాజ్యాన్ని సైతం త్రిసభ్య ధర్మాసనానికి నివేదిస్తున్నట్లు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వుల నిమిత్తం ఈ వ్యాజ్యాన్ని ఆయన ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇళ్లు కావాలని ఎవరూ అడగలేదు.. రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా ఆర్ 5 జోన్‌ను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ గుంటూరు జిల్లా, కృష్ణాయపాళెం గ్రామానికి చెందిన రైతు అవల నందకిషోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం జస్టిస్ కృష్ణమోహన్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ వాదనలు వినిపిస్తూ, రాజధాని ప్రాంతంలో తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రజలెవ్వరూ కోరలేదన్నారు. గ్రామసభల్లో రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. పేదల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చట్ట ప్రకారం చేయాల్సిన పనిని గత ప్రభుత్వం విస్మరించిందని, ఆ తప్పును సరిదిద్ది మాస్టర్ ప్లాన్‌కు ఓ విలువను తీసుకొచ్చామని, దాన్ని కూడా పిటిషనర్ తప్పుపడుతున్నారని తెలిపారు. పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే రాజధాని ప్రాంతంలో 900 ఎకరాలను పేదల కోసం కేటాయించామని చెప్పారు. ప్రజలు తమకు ఫలానాది కావాలని అడిగేంత వరకు ప్రభుత్వాలు ఎదురుచూడవని.. వారి అవసరాలను గుర్తించడమే ప్రభుత్వ విధి అన్నారు. ఇదే అంశంపై త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది.. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని, తరువాత పూర్తిస్తాయిలో విచారణ జరుపుతామన్నారు. ఈ సమయంలో ఇంద్రనీల్.. ఇదే అంశంపై దాఖలైన వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోందని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. తమకు ఏ ధర్మాసనమైనా ఒక్కటేనని, తాము చట్ట ప్రకారమే ఆర్ 5 జోన్‌ను ఏర్పాటుచేశామని సుధాకర్‌రెడ్డి చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ వ్యాజ్యాన్ని త్రిసభ్య ధర్మాసనానికి నివేదించారు. దీనిపై తగిన ఉత్తర్వులు జారీచేసేందుకు ఈ వ్యాజ్యాన్ని సీజే ముందుంచాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు. -
మంచి సినిమా చేశాం : దిల్ రాజు
ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం ‘బలగం’. వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు. ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ , శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ చిత్రం మార్చి 3న రిలీజ్ కానుంది. ఈ మూవీలోని ‘బలరామ నర్సయ్యో..’ అనే పాటను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ రిలీజ్ చేసి, మాట్లాడుతూ–‘‘చావు అనే అశుభ అంశాన్ని తీసుకుని శుభాలవైపు తీసుకువెళ్లే గొప్ప ప్రయోగమే ‘బలగం’’ అన్నారు. ‘‘బలగం’ చాలా మంచి సినిమా’’ అన్నారు ‘దిల్’ రాజు.‘‘మరిన్ని ప్రయోగాత్మక సినిమాలు రావాలంటే ఈ సినిమాను థియేటర్స్‌లో చూడండి’’ అన్నారు ప్రియదర్శి. -
మాగుంట కుటుంబంలో విషాదం
సాక్షి, చెన్నై: ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రజానేత దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి సోదరుడు సుధాకరరెడ్డి(73) శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు. శుక్రవారం చెన్నైలో ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. స్వర్గీయ మాగుంట రాఘవరెడ్డి, కౌసల్యమ్మ దంపతులకు 1949 సెప్టెంబర్ 9వ తేదీన సుధాకరరెడ్డి జన్మించారు. సినీ నిర్మాతగా, పంపిణీ దారుడిగా సుధాకరరెడ్డి పేరు గడించారు. విషాదంలో కుటుంబం కొద్ది రోజులుగా అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన సుధాకరరెడ్డి శుక్రవారం మధ్యాహ్నం 1.41 గంటలకు తుది శ్వాస విడిచారు. దీంతో మాగుంట కుటుంబంలో విషాదం నెలకొంది. దివంగత సుబ్బరామిరెడ్డికి సుధాకరరెడ్డి తోడు నీడగా ఉండే వారని ఆయన సోదరుడు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. తనకు సైతం నిత్యం తోడు నీడగా ఉన్న సుధాకరరెడ్డి ఇక లేరన్న సమాచారం జీర్ణించుకోలేకపోతున్నానని పేర్కొన్నారు. అన్నయ్య సుబ్బరామిరెడ్డి దివంగతులైన తర్వాత కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారని, మంచితనానికి, మానవత్వానికి నిలువెత్తు రూపమైన సోదరుడు సుధాకర్ మరణం తమ కుటుంబానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సుధాకరరెడ్డి భౌతిక కాయాన్ని నుంగంబా క్కం కాలేజ్ రోడ్డులోని సుబ్బారావు అవెన్యూలోని స్వగృహంలో ఉంచారు. శనివారం సాయంత్రం 3 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. నివాళులు సుధాకర్‌రెడ్డి మృతికి కెన్సస్ అధినేత నర్సారెడ్డి, తెలుగు మహాజన సమాజం అధ్యక్షుడు, అమర జీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ చైర్మన్ అనిల్‌కుమార్‌రెడ్డి, ఆస్కా అధ్యక్షుడు సుబ్బారెడ్డి, అపోలో ప్రీతారెడ్డి, సత్యం థియేటర్స్ మునికన్నయ్య, నడిగర్ తిలకం శివాజీ గణేషన్ పెద్ద కుమారుడు రామ్‌కుమార్ తదితరులు నివాళులర్పించారు. తమిళనాడు తెలుగు యువ శక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి సంతాపం తెలిపారు. నివాళులర్పిస్తున్న కుటుంబ సభ్యులు (ఇన్సెట్) సుధాకరరెడ్డి -
కరీంనగర్ పరిసరాల ప్రాంతాల్లో భీమదేవర పల్లి బ్రాంచ్ మూవీ షూటింగ్
సుధాకర్ రెడ్డి, కీర్తీ లత, అభిరామ్, రూప, అంజి బాబు, రాజవ్వ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’. రమేశ్ చెప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. ఏబీ సినిమాస్, నిహల్ ప్రొడక్షన్స్‌పై బత్తిని కీర్తీలత గౌడ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కరీంనగర్ జిల్లాలోని మల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. రమేశ్ చెప్పాల మాట్లాడుతూ.. ‘‘నవ్వించడమే లక్ష్యంగా తీస్తున్న చిత్రమిది. ఒక మారుమూల గ్రామంలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సెన్సేషనల్ అయ్యింది. ఆ హాట్ టాపిక్ ఆధారంగా కథ సిద్ధం చేశా. కథలోని నేటివిటీ పోకూడదని పూర్తిగా ఆర్గానిక్ (స్థానికులు) నటీనటులతో రియాలిటీగా నిర్మిస్తున్నాం’’ అన్నారు. బత్తిని కీర్తిలతో రాజా నరేందర్ చెట్లపెల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు. -
నాకు ఎలాంటి సంబంధం లేదు.. కానీ నాకు అతనితో పరిచయం ఉంది
-
టికెట్ ధరలు పెంచడం అర్థం లేనిది: నిర్మాత
తెలుగు సినీరంగంలో పంపిణీదారుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు శ్రేష్ట్ మూవీస్ అధినేత, హీరో నితిన్ తండ్రి ఎన్.సుధాకర్ రెడ్డి. కమల్‌హాసన్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విక్రమ్’ చిత్రాన్ని సుధాకర్‌రెడ్డి తెలుగులో విడుదల చేసి పెద్ద విజయాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో ముచ్చటించారు. ఈ మేరకు సధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘విక్రమ్’ సినిమాకి 20 శాతం రిస్క్ ఉంటుందనిపించినా విడుదల హక్కులు తీసుకున్నామని, సినిమా రిలీజ్ తర్వాత మంచి నిర్ణయం తీసుకున్నామనిపించిందన్నారు. ‘విక్రమ్ మూవీకి మంచి ఫలితమే దక్కింది. ఇప్పటివరకు తెలుగులో 80 కోట్ల గ్రాస్ వచ్చింంది. వసూళ్లతో కమల్‌గారు, నేను, ఎగ్జిబిటర్లు.. ఇలా అందరూ హ్యాపీ’ అని నిర్మాత సుధాకర్ రెడ్డి అన్నారు. ‘‘నేను ‘విక్రమ్’ ప్రివ్యూ చూడలేదు. లోకేశ్‌పై నమ్మకంతో, కమల్‌గారు, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య ఉన్నారని సినిమా తీసుకున్నాం. ‘విక్రమ్’ ట్రైలర్ చూశాక మా అబ్బాయి (హీరో నితిన్) కూడా తీసుకోమన్నాడు. సినిమా అనేది ఓటీటీలో చిన్న స్క్రీన్‌లో చూస్తే అంత ఎఫెక్ట్ ఉండదు.. థియేటర్ అనుభవం వేరు. పెద్ద సినిమాలు రిలీజైన 50 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని రూల్ పెట్టుకుంటే పరిశ్రమకు మంచిది’’ అన్నారు. టికెట్ ధరలు పెంచడం అర్థం లేనిది ‘‘ప్రభుత్వం దగ్గరికి వెళ్లి టికెట్ రేట్లు అడిగాం. 200 నుండి 350 పెట్టుకోమన్నారు. అలగాని 350పెట్టకూడదు కదా. సినిమాని బట్టి పెట్టుకోవాలి. మేము మల్టీ ఫ్లెక్స్ లో 200 మాత్రమే పెట్టాం. డబ్బు వచ్చింది కదా. టికెట్ ధరలు పెంచక ముందే ‘బాహుబలి 2’ నైజాంలో 55 కోట్లు వసూలు చేసింది. మరి.. ఇప్పుడు ఎందుకు పెంచుతున్నారో అర్థం కావడం లేదు. పెరిగిన ధరల వల్ల రిపీట్ ఆడియన్స్, ఫ్యామిలీస్ థియేటర్స్‌కి రాకపోవడంతో నష్టం తప్పడంలేదు. ముంబై, బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ సిటీల్లో వారాంతంలో రూ. 1000 నుంచి 1500 వరకు రేట్లు పెడతారు. మిగిలిన రోజుల్లో మామూలే. చెన్నైలో టికెట్ ధరలు మనకంటే తక్కువగానే ఉన్నాయి’’ అన్నారు సుధాకర్ రెడ్డి. ఇక విక్రమ్ సీక్వెల్‌పై స్పందిస్తూ.. ఈ మూవీకి సీక్వెల్ ఉందని స్పష్టం చేశారు. కానీ సీక్వెల్‌ఇంకా స్టార్ట్ కాలేదని, దర్శకుడు ఫ్రీ కావాలి కదన్నారు. సీక్వెల్ చేసినప్పుడు మనకే ఇస్తారని, మనమే చేస్తామని ఆయన అన్నారు. ఇక ప్రస్తుతం వారి బ్యానర్లో వస్తున్న మాచర్ల నియోజికవర్గం 80శాతం షూటింగ్ పూర్తయిందని చెప్పారు. ఈ సినిమాను ఆగస్ట్ 11న రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. అలాగే వక్కంత వంశీ సినిమా షూటింగ్ ఆగష్టు నుంచి ప్రారంభమవుతుందని, ఇప్పటికే ఒక పాట షూట్ చేశామన్నారు. ఇది కిక్, రేసు గుర్రం తరహలో ఉంటుందని, సురేందర్ రెడ్డితో సినిమా కూడా ఉందని ఆయన అన్నారు. -
శేఖర్ మూవీ కోసం రూ.15 కోట్లు పెట్టాను, ఎవరిస్తారు?: నిర్మాత
జీవిత దర్శకత్వంలో ప్రముఖ నటుడు రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రం శేఖర్. వంకాయల పాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న రిలీజైంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తున్న సమయంలో ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వేసిన కేసు కారణంగా ప్రదర్శన నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ‘శేఖర్’ చిత్రాన్ని నిలిపివేయాలని కోరుతూ ఆయన సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించాడు. అయితే శేఖర్ మూవీ ప్రదర్శన నిలిపివేయాలని తాము చెప్పలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. దీంతో నిర్మాత సుధాకర్ రెడ్డి మంగళవారం నాడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆవేదన వ్యక్తం చేశాడు. 'నేను శేఖర్ సినిమా నిర్మించాను. నా సినిమాను ఆపేసి అన్యాయం చేశారు. డిజిటల్ ప్రొవైడర్స్‌కు నేను డబ్బు కట్టి ఒప్పందం చేసుకున్నాను, కానీ వాళ్లు శేఖర్ సినిమాను చంపేశారు. ఏడెనిమిది సినిమాలకు నిర్మాతగా పని చేశాను, ఫైనాన్స్ కూడా ఇచ్చాను. ఏ సినిమాకు ఇలాంటి పరిస్థితి లేదు. లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. సినిమాలో శివానీ, శివాత్మికల పేపర్లు మాత్రమే ఉన్నాయి. అంతే తప్ప వాళ్లు నిర్మాతలు కారు. డిజిటల్ ప్రొవైడర్స్ ఆపేయడం వల్లే మా సినిమా ఆగిపోయింది. అసలు శేఖర్ సినిమాను ఆపేయమని కోర్టు ఎక్కడా చెప్పలేదు. డిజిటల్ ప్రొవైడర్స్ క్యూబ్, యూఎఫ్ఓలపై న్యాయపోరాటం చేస్తాం. రేపు కోర్టులో తుది తీర్పు వచ్చాక పరందామరెడ్డిపై పరువునష్టం దావా వేస్తాం. నిజానికి నాకు ఆ పరందామరెడ్డి అనే వ్యక్తి ఎవరో కూడా తెలియదు. నాకు కలిగిన నష్టాన్ని పరందామరెడ్డి ఇస్తారా? డిజిటల్ ప్రొవైడర్స్ ఇస్తారా? ఇది రాజశేఖర్ సినిమా కాదు, రాజశేఖర్ నటించిన సినిమా మాత్రమే! అలాగే జీవిత సినిమా కూడా కాదు, కేవలం జీవిత దర్శకత్వం చేసిన మూవీ. సినిమా సెన్సార్ సర్టిఫికెట్ నా పేరు మీదే ఉంది. శేఖర్ సినిమాకు నేను రూ.15 కోట్లు పెట్టుబడి పెట్టాను. జీవిత వల్ల నాకు ఎలాంటి నష్టం కలగలేదు' అని చెప్పుకొచ్చాడు. చదవండి 👇 విజయ్, సమంతకు ఎలాంటి గాయాలు కాలేదు.. నీ బాంచన్, జర ఆదిపురుష్ అప్డేట్ ఇవ్వరాదే.. -
స్వాతిరెడ్డి అరెస్ట్, జైలుకు తరలింపు
సాక్షి, నాగర్‌కర్నూలు : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భర్త సుధాకర్‌రెడ్డి హత్యకేసులో నిందితురాలైన స్వాతి రెడ్డిని పోలీసులు నిన్న (మంగళవారం) అరెస్ట్ చేశారు. కొంతకాలంగా కోర్టు కేసు వాయిదాలకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి ఇటీవల స్వాతికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. కాగా, నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన స్వాతిరెడ్డి ...కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి 2017 నవంబర్‌లో దారుణంగా హతమార్చింది. ఈ కేసులో ఆమెను పోలీసులు అరెస్ట్ చేయగా కొంతకాలం జైలులో ఉంది. (స్వాతికి జామీను ఉపసంహరణ) 2018 జూలైలో బెయిల్‌పై వచ్చిన స్వాతి మహబూబ్‌నగర్ స్టేట్ హోంకు తరలించారు. కేసు విచారణలో భాగంగా నాగర్‌కర్నూల్‌జిల్లా కోర్టులో వాయిదాలకు ఆమె హాజరు కాకపోవడంతో జిల్లా నాలుగో తరగతి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తి రవికుమార్ నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో స్టేట్ హోంలో ఉన్న ఆమెను అరెస్ట్ చేసి నిన్న కోర్టులో హాజరు పరిచారు. అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా జైలుకు తరలించారు. -
నితిన్ బర్త్ డే గిఫ్ట్.. లైన్లోకి మరో ప్రాజెక్ట్
ఇప్పటికే రెండు సినిమాలను లైన్లో పెట్టిన యంగ్ హీరో నితిన్, తన పుట్టిన రోజు సందర్భంగా మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. శ్రీనివాస కల్యాణం సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మా సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో పాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో మరో సినిమాను కూడా త్వరలో ప్రారంభించనున్నాడు. ఈ రెండు సినిమాలు ఇంకా సెట్స్ మీదకు రాకముందే ఈ రోజు మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు. తనతో ఛల్ మోహన్ రంగ సినిమాను తెరకెక్కించిన కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్టుగా తెలిపాడు నితిన్. ఈ సినిమాను సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ మూవీ బ్యానర్ నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మించనున్నాడు. 2020 సమ్మర్లో ప్రారభం కానున్న ఈ ప్రాజెక్ట్ తన కెరీర్లో ప్రతిష్టాత్మకమైన సినిమా అని ట్వీట్ చేశాడు నితిన్. Announcement 3 My most ambitious and challenging film of my career!!super duper kicked about it..✊ Dir krishna Chaitanya Prod sreshth movies Shoot starts frm year end and summer 2020 release!! pic.twitter.com/F5cf6yKDsb — nithiin (@actor_nithiin) 29 March 2019 -
వైఎస్ జగన్‌పై దాడి.. చంద్రబాబు పనేనా?
సాక్షి, హైదరాబాద్ : ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందా? ప్రభుత్వ పెద్దల సహకారంతోనే ఈ దాడి జరిగిందా? ఎంత పెద్ద క్రిమినల్ అయినా క్రైమ్‌ని చేసేటప్పుడు ఎక్కడో ఒకచోట తప్పు చేసి దొరికి పోతారు. అలానే వైఎస్ జగన్‌పై హత్యాప్రయత్నానికి ముందు.. తర్వాత జరిగిన పరిణామాలు చూస్తుంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందని స్పష్టంగా అర్థమవుతుందని ప్రముఖ సీనియర్ న్యాయవాది సుధాకర్ రెడ్డి తెలిపారు. సాక్షి ఫోర్త్ ఎస్టేట్ కార్యక్రమంలో పాల్గొన్న సుధాకర్ రెడ్డి ఏమన్నారో కింది వీడియోలో చూడండి. -
వైఎస్ జగన్‌పై దాడి.. చంద్రబాబు పనేనా?
-
వైఎస్సార్సీపీలోకి డీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు
రేణిగుంట: రేణిగుంట మండలం గాజులమండ్యంకు చెందిన డీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు సిద్దాగుంట సుధాకర్‌రెడ్డి బుధవారం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్రలో ఉన్న జగన్మోహన్రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజంపేట మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఆయనతో పాటు రేణిగుంట మాజీ సర్పంచ్ జ్యోతినారాయణ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రేణిగుంట మండలంలో ఇప్పటికే పార్టీ పటిష్టంగా ఉన్న నేపథ్యంలో ఆయన చేరికతో మరింత బలం చేకూరింది. మండలంలో నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని జగన్మోహన్రెడ్డి ఆయనకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ తిరుపతి నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పన్నీరుకాల్వ శ్రీధర్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర నాయకులు కన్నలి మోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
నైతిక విలువలు పాటించని సీఎం : పొన్నవొలు
సాక్షి, అనంతపురం : ఏపీలో పోలీసు వ్యవస్థ రోజురోజుకి దిగజారిపోతోందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆరోపించారు. అనంతపురంలో వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం లీగల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. న్యాయపోరాటంతో టీడీపీ నేతలకు బుద్ది చేపుతామని అన్నారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడినా.. ఆయనపై ఎలాంటి కేసులు లేవని.. చంద్రబాబు నాయుడు నైతిక విలువలు పాటించట్లేదని ఆయన విమర్శించారు. పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించినా పోలీసులు పట్టించుకోకపోవడంపై హైకోర్టులో ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వెన్నపూసగోపాల్ రెడ్డి, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు శంకర్‌నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బెయిల్‌పై విడుదలైన స్వాతి
మహబూబ్‌నగర్ క్రైం: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో గత ఏడాది నవంబర్ 26న ప్రియుడు రాజేశ్‌తో కలసి భర్త సుధాకర్‌రెడ్డిని హత్య చేసిన కేసులో నిందితురాలు స్వాతి శుక్రవారం బెయిల్‌పై విడుదలైంది. మహబూబ్‌నగర్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈనెల 16నే ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఇద్దరు వ్యక్తుల జామీను (పూచీకత్తు) అవసరం ఉండగా.. ఎవరూ ముందుకు రాక ఆమె జైలులోనే ఉండాల్సి వచ్చింది. కాగా, బుధ వారం నాగర్‌కర్నూల్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు జామీను ఇవ్వగా శుక్రవారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్ జిల్లా జైలుకు, కోర్టు నుంచి ఉత్తర్వులు అందాయి. దీంతో ఆమెను సాయంత్రం జైలు నుంచి విడుదల చేశారు. అయితే స్వాతిని తీసుకువెళ్లడానికి కుటుంబ సభ్యులు, బంధువులెవరూ జైలు దగ్గరకు రాలేదు. ఈ నేపథ్యంలో స్వాతి, ముందుగానే కలెక్టర్ రొనాల్డ్‌రోస్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థకు జైలు నుంచి విడుదలయిన తర్వాత ఆశ్రయం కల్పించాలని లేఖ రాశారు. దీంతో కలెక్టర్, న్యాయసేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా జైలు అధికారులు స్వాతిని నేరుగా జిల్లా కేంద్రంలోని రాష్ట్ర సదనానికి తరలించారు. ఈ కేసులో మరో నిందితుడు రాజేశ్‌కు ఇంకా బెయిల్ లభించలేదు. భర్తను హత్య చేసిన తర్వాత స్వాతి, అతని స్థానంలో ప్రియుడు రాజేశ్‌ను ప్రవేశపెట్టేందుకు ఆయన ముఖంపై యాసిడ్ పోసి భర్తగా నమ్మించాలని చూసిన సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. -
వైఎస్ రాజారెడ్డి హంతకుడి విడుదల
సాక్షి, నెట్వర్క్/సాక్షి, అమరావతి : దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న రాగిపిండి సుధాకర్‌రెడ్డిని క్షమాభిక్ష పేరిట రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తీసుకున్న నిర్ణయాన్ని ఆదివారం అమలు చేసింది. రాష్ట్రంలోని పలు జైళ్ల నుంచి మొత్తం 47 మంది ఖైదీలు విడుదలయ్యారు. రాజమహేంద్రవరం జైలు నుంచి 18 మందికి, విశాఖ నుంచి 13 మందికి, అనంతపురం నుంచి ఆరుగురు, వైఎస్సార్ జిల్లాలో ఏడుగురు, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు ఖైదీలకు క్షమాభిక్ష లభించింది. వీరిలో కొందరు ఆదివారం విడుదల కాగా.. మరికొందరు సోమవారం విడుదల కానున్నారు. రాజకీయ ఒత్తిళ్లే కారణమా? రాజకీయ ఒత్తిళ్ల వల్లే వైఎస్ రాజారెడ్డి హత్యకేసులో నిందితుడైన రాగిపిండి సుధాకర్‌రెడ్డిని విడుదల చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం వేల్పుల గ్రామానికి చెందిన సుధాకర్‌రెడ్డి 1998లో జరిగిన వైఎస్ రాజారెడ్డి హత్యకేసులో నిందితుడు. ఈ హత్యకేసులోని నిందితులందరికీ న్యాయస్థానం 2006లో జీవిత ఖైదు విధించింది. అప్పట్నుంచి నెల్లూరు జిల్లాలోని కారాగారంలో జైలు జీవితం గడుపుతున్న సుధాకర్‌రెడ్డిని విడుదల చేయాలంటూ టీడీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
వ్యూహం ఛేదించిన 'అభీ'మన్యుడు
‘‘బిట్స్ పిలానీలో నువ్వు తప్పకుండా సీట్ తెచ్చుకుంటావనుకున్నా’’.. తండ్రి నిరాశ. తనూ నమ్మాడు ఎలాగైనా పిలానీలో సీట్ కొడ్తానని. ఓన్లీ టూ పర్సెంట్ మార్క్స్‌తో మిస్ అయింది. బాధపడ్డాడు. ఏడ్చాడు. తర్వాత నిర్ణయించుకున్నాడు.. టీ సెట్ రాసి చెన్నైలో ఇంజనీరింగ్ చదవాలని. టెస్ట్ రాశాడు. ర్యాంక్ కొట్టాడు. మంచి మంచి కాలేజ్‌లలో సీట్ వచ్చింది. అలాంటి వాటిల్లో ఒకటే ఆర్.ఎం.కె. ఇంజనీరింగ్ కాలేజ్. అత్యంత క్రమశిక్షణ గల కళాశాల. అబ్బాయి అందులో చేరాడు. తండ్రీ సంతోషించాడు. కాలేజ్ వార్నింగ్ ఇచ్చింది.. జీఈ ఉద్యోగం ఇచ్చింది! రోజూ కాలేజ్‌కి నీట్‌గా షేవ్ చేసుకొని వెళ్లాలి. ఫార్మల్స్ మాత్రమే ధరించాలి. కోఎడ్యుకేషన్ కాలేజ్ అయినా అబ్బాయిలు అమ్మాయిలతో అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడకూడదు! ఇన్ని నియమాలా? బాబోయ్.. అనుకున్నాడు. మూడు నియమాలనూ తప్పాడు. మూడుసార్లు వాళ్ల నాన్నను పిలిపించింది మేనేజ్మెంట్! ‘‘మీ అబ్బాయి చదువులో జెమ్. డిసిప్లినే కొంచెం తక్కువ.. ’’ అంటూ లెక్చరర్స్ సముదాయించారు. ఈసారి చదువు గురించీ కంప్లయింట్ వెళ్లింది. ఇంటర్నల్స్ రాయలేదని. కొన్నాళ్లకు.. క్యాంపస్ సెలెక్షన్స్ జరిగాయి.. ఆ కాలేజ్‌లో ఫస్ట్ ప్లేస్మెంట్ వచ్చింది ఆ అబ్బాయికే! జీఈ (జనరల్ ఎలక్ట్రానిక్స్) సంస్థలో ఉద్యోగం. గుంటూరు దగ్గర్లోని అంకిరెడ్డిపాలెంలో ఆ తండ్రి ఓ రైతు. తన తోబుట్టువుల పిల్లల్లాగే తన కొడుకులూ ఇంజనీరింగ్ చదివి పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేయాలని కోరుకున్నాడు. ఆశ.. నిరాశ.. తర్వాత కొడుకు సాధించిన ఉద్యోగమనే విజయం ఆ తండ్రి ఉప్పొంగిపోయేలా చేసింది. ఆ అబ్బాయి పేరు సుధాకర్ రెడ్డి. తండ్రి పేరు చిర్రా రామలింగారెడ్డి. ఇష్టం లేని ఉద్యోగం... ఇష్టపడ్డ అమ్మాయి! అయితే అప్పుడే ఉద్యోగంలో చేరకూడదనుకున్నాడు సుధాకర్. నలుగురితోపాటు కాకుండా ప్రత్యేకంగా ఉండాలనైతే అనుకున్నాడు. నైన్ టు ఫైవ్ జాబ్స్ కాదు. సమ్‌థింగ్ డిఫరెంట్. క్రియేటివ్‌గా. ఏదో చేయాలనే తపన. అయితే తన కుటుంబ ఆర్థిక పరిస్థితి సుధాకర్‌పై ఉద్యోగం చేయాల్సిన ఒత్తిడిని పెట్టింది. తప్పలేదు. జాబ్‌లో చేరాడు. ఇంకోవైపు అమెరికాలో జాబ్స్ వేట ప్రారంభించాడు. హెచ్1బీ కోసం ప్రయత్నించాడు. వచ్చింది. వెళ్లలేదు. కారణం.. డిఫరెంట్‌గా ఉండాలనే తపనే. అదీగాక కాలేజ్‌లో సస్య అనే క్లాస్‌మేట్‌తో ఉన్న స్నేహం ఫైనలియర్లో ప్రేమగా మారింది. యేడాది గడిచే సరికి ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టారు. అప్పుడు తమ విషయం ఇరువైపు పెద్దలకు చెప్పక తప్పలేదు. సహజంగానే ‘నో’ అన్నారు. పిల్లలు ఒప్పించారు. కన్విన్స్ అయిన పెద్దలు వెంటనే వెడ్డింగ్ బెల్స్ మోగించారు. అతను జాబ్... ఆమె ఏంబీఏ చదువు కంటిన్యూ అవుతోంది. భార్య థమ్సప్!! ... నాన్న హ్యాండ్సప్ సుధాకర్ జాబ్ చేస్తున్నాడు కాని.. నచ్చట్లేదు. ఇంకేదో చేయాలి. ఈ క్రమంలో అతను తరచుగా చెన్నై టు గుంటూరు.. తిరుపతి వెళ్లాల్సి వచ్చింది. ట్రైన్లో వెళ్లాలంటే కనీసం పదిహేను రోజుల ముందు టికెట్ రిజర్వ్ చేయించుకుంటే కానీ ప్రయాణం సాఫీగా సాగేది కాదు. ప్రైవేట్ ట్రావెల్స్‌లో ఎప్పుడంటే అప్పుడు టికెట్స్ దొరికేవే కానీ ధరకు డిమాండ్ ఉండేది. ఒక్కోసారి అసలు టికెట్ ధరకన్నా డబుల్ వసూలు చేసేవారు. వీటితో విసిగి పోయాడు సుధాకర్. ఆన్లైన్ టికెట్ బుకింగ్ పోర్టల్ పెడితే జనాలకు టైమ్ సేవవడమే కాక.. సౌకర్యం కూడా అనుకున్నాడు. భార్య సస్యతో చెప్పాడు. థంబ్ అప్ చూపింది. నాన్నకు చెప్పాడు. నాన్న కంగారు పడ్డాడు. ఎలాగో ఒప్పించి ఆయన దగ్గరే పది లక్షల రూపాయలను అప్పుగా తీసుకొని.. ఉద్యోగానికి రాజీనామా చేసి భార్యా సమేతంగా హైదరాబాద్‌కు మకాం మార్చాడు. పోర్టల్ స్టార్ట్ అయింది... ఘోరంగా ఫెయిలైంది ఇంకో ఫ్రెండ్ దగ్గరా అయిదు లక్షల రూపాయలు తీసుకొని మొత్తం పదిహేను లక్షల రూపాయలతో ‘అభిబస్’ పోర్టల్‌ను స్టార్ట్ చేశాడు.. చిన్న గదిని అద్దెకు తీసుకొని. అందులో టాయ్‌లెట్ కూడా లేదు. తను టికెట్లు అమ్మాలంటే ట్రావెల్ ఆపరేటర్స్ తనకు ఎన్నో కొన్ని టికెట్స్ ఇవ్వాలి కదా. ఎంతో మంది ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్స్‌ని కలిశాడు. ఒక ట్రావెల్స్ ఆఫీస్ ముందు రెండు నెలలు ఉదయం ఎనిమిది నుంచి రాత్రి తొమ్మిది వరకు పడిగాపులు కాస్తే నాలుగు టికెట్లు ఇచ్చాడు. అంత కష్టపడి తెచ్చుకుంటే ఒక్క సీటు కూడా అమ్మలేకపోయాడు. ఫెయిల్యూర్.. ఘోరమైన ఫెయిల్యూర్! కానీ వెనక్కు తగ్గలేదు. గుడ్డిగా వేసిన ఆ అడుగు తప్పు. అంతేకాని వ్యాపారం అనే ఆలోచన తప్పు కాదు. సరిదిద్దుకోవాలి అనుకున్నాడు. అప్పటికే ఓ బస్... అయినా అభీబస్ తన దగ్గర సాఫ్ట్వేర్ ఉంది సరే.. ఆపరేటర్స్ దగ్గర కూడా ఉండాలి కదా. ఏ పూచీ మీద టికెట్లు ఇస్తాడు తనకు ఏ ఆపరేటరైనా? రెండు విషయాలు తెలిశాయి. ట్రావెల్స్ ఆపరేటర్స్ కోసం సాఫ్ట్వేర్ తయారు చేయించాడు. వాటి గురించి ఆపరేటర్స్‌కు చెప్పి.. వాళ్లను కన్విన్స్ చేయగలిగాడు. ఆ సాఫ్ట్‌వేర్‌ను లీజ్‌గా ఇచ్చాడు. ఈసారి ఈజీగా టికెట్లు అమ్మడయ్యాయి. ఈ విషయం ఇంకో నలుగురు.. ఆ నలుగురు ఇంకో పది మంది ట్రావెల్స్ ఆపరేటర్‌కు తెలిసి డిమాండ్ పెరిగింది. అన్ని ట్రావెల్స్‌ను ఎకామిడేట్ చేసే శక్తి సరిపోక సర్వర్క్రాష్ అయింది. సంతోషించాలో ఏడ్వాలో తెలియని స్థితి. సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడానికి మూడుకోట్లు కావాల్సి వచ్చాయి. ఎవరిస్తారు? సుధాకర్ రెడ్డి సామర్థ్యం మీద ఉన్న నమ్మకంతో ఆపరేటర్సే ముందుకు వచ్చారు. అభీబస్ డాట్ కామ్ అప్టేడ్ అయింది. ప్రైవేట్ ట్రావెల్సే కాదు ఏపీఎస్ఆర్టీసీ, యూపీ, హిమాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, టీఎస్ఆర్టీసీ మొదలు దేశం నలుమూలల 350 ట్రావెల్స్ అభిబస్ డాట్ కామ్‌లో చేరాయి. ఈ పదేళ్లలో అభిబస్ ప్రయాణం ఇది. సుధాకర్ రెడ్డి విజయం అది. అతను తన అభిబస్‌ను మొదలుపెట్టేటప్పటికే ఇంకో బస్ ఉంది. అయినా సొంత సాఫ్ట్వేర్ ఫార్మూలా ఉన్నది అభిబస్కే. అంతేకాదు అతిపెద్ద ట్రావెల్ పోర్టల్ కూడా ఇదే. కొట్టేద్దాం అని రావద్దు ఈ జర్నీ అంత సులువుగా సాగలేదు. సాగదు కూడా. తొలిరోజుల్లో రోజుకు పదహారు గంటలు పనిచేసేవాడిని. నెలలో 25 రోజులు ప్రయాణాల్లోనే గడిచిపోయేవి. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఈ బిజినెస్‌లోకి గొప్ప విజన్‌తో ఏమీ రాలేదు. నేను జర్నీ చేస్తున్నప్పుడు టికెట్స్, రిజర్వేషన్ విషయంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. వాటిని సాల్వ్ చేయాలనే ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను అంతే. నా ప్రోగ్రెస్ అంతా ప్రాబ్లమ్స్.. సొల్యూషన్స్.. ఈ లెర్నింగ్‌తోనే సాగింది.. సాగుతోంది కూడా. అంతకుముందు మా ఊళ్లో నా గురించి.. ఏదో ఇంటర్నెట్ కొట్టు పెట్టుకున్నాడట అనుకున్నవాళ్లు ఈ రోజు నన్ను చాలా గౌరవంగా చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ మా నాన్న కంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఈ మధ్య చాలామంది యూత్ అంట్రప్రెన్యూర్స్ కావాలనుకుంటున్నారు. మంచిదే. కాని మొదలుపెట్టగానే సక్సెస్ వస్తుంది అనే ఆలోచనతో రావద్దు. అపజయాల రహదారిలో గమ్యాన్ని చేరుకోవాల్సి ఉంటుందనే సంసిద్ధతతో రావాలి. సగటు రోజువారీ దిన చర్య గమనిస్తే.. అతని అవసరాలు ఏముంటాయో తెలుస్తుంది. వాటిని తీర్చగలిగే.. లేదంటే పరిష్కారాలు ఇవ్వగలిగే బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలు.. విజయం ఖాయం. స్విగ్గీ, బుక్ మై షో.. లాంటివన్నీ అవే’’ అంటాడు సుధాకర్‌రెడ్డి చిర్రా, అభిబస్ డాట్ కామ్ సీఈవో. – సరస్వతి రమ -
ఏపీ కేబినెట్ వివాదాస్పద నిర్ణయం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో శిక్షను అనుభవిస్తున్న సుధాకర్ రెడ్డిని సత్ప్రవర్తన పేరుతో విడుదల చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు వైఎస్సార్ జిల్లాకు చెందిన ప్రముఖ టీడీపీ నేతను కలిసినట్లు సమాచారం. సత్ప్రవర్తన కింద విడుదల కోసం జైళ్లశాఖ 149మంది జాబితా ఎంపిక చేసింది. వారిలో 100 మందిని తిరస్కరించిన కేబినెట్, 49 మంది విడుదలకు ఆమోదం తెలిపింది. ఇందులో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తండ్రి రాజారెడ్డి హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న సుధాకర్ రెడ్డి పేరు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సుధాకర్ రెడ్డి నెల్లూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. నెల్లూరు జైలు నుంచి ముగ్గురు విడుదలయ్యే అవకాశం ఉంది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాల్సిన ప్రభుత్వం.. రాజకీయ కోణంలో ఖైదీల విడుదలకు సిద్ధపడిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేబినెట్ నిర్ణయం చూసి జైళ్ల శాఖ అధికారులు విస్తుపోతున్నారు. -
స్వాతి నుంచి ప్రాణహాని ఉంది..!
నాగర్‌కర్నూల్ క్రైం: నాగర్‌కర్నూల్‌లో భార్య, ఆమె ప్రియుడి చేతిలో హత్యకు గురైన కాంట్రాక్టర్ సుధాకర్‌రెడ్డి తల్లిదండ్రులు, బంధువులు బుధవారం జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్‌ను కలిశారు. స్వాతి నుంచి వారి పిల్లలు వర్షిణి, దర్శిత్‌రెడ్డిలకు కూడా ప్రాణహాని ఉందన్నారు. సుధాకర్‌రెడ్డి హత్యతో తాము వీధినపడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజేశ్ వైద్య ఖర్చులు పెట్టించడంతో ఆర్థికంగా చితికిపోయామని తెలిపారు. నిందితులకు చట్ట ప్రకారం శిక్ష పడుతుందని ఎస్పీ స్పష్టం చేశారు. -
స్వాతిరెడ్డిని విచారించిన పోలీసులు
నాగర్‌కర్నూల్ క్రైం: ఇటీవల ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన ఘటనలో నిందితురాలిగా ఉన్న స్వాతిరెడ్డిని శనివారం పోలీసులు విచా రించారు. ఆమె విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకునేలా అనుమతి ఇవ్వాలని నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు రెండు రోజుల క్రితం అక్కడి కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు శుక్రవారం అను మతి లభించడంతో.. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా జైలు నుంచి ఆమెను నాగర్ కర్నూల్ తీసుకొచ్చారు. తొలుత ఆమెను పోలీస్‌స్టేషన్ కు తీసుకెళ్లిన పోలీసులు కొంత సమాచారం సేకరించేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత సుధాకర్‌రెడ్డి హత్య జరిగిన ఇంటికి తీసుకువెళ్లారు. ఇంట్లో పడిన రక్తపు మరకలను తుడి చిన బట్టలు, సుధాకర్‌రెడ్డి ధరించిన దుస్తులు, హత్య సమయంలో స్వాతి, రాజేష్ ధరించిన బట్టల విషయమై వారిని పోలీసులు గతంలో ప్రశ్నిస్తే.. తనకేమీ తెలియదని, స్వాతిరెడ్డికే తెలుసని చెప్పిన విషయం విదితమే. దీంతో ఇంటికి స్వాతిరెడ్డిని తీసుకు వెళ్లగా బీరువా కింద దాచి ఉం చిన బట్టలను స్వాతి పోలీసులకు అందజేసింది. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీ సులు.. స్వాతిని తిరిగి కోర్టులో హాజరుపర్చారు. ఆమెను రిమాండ్‌కు తరలించాలన్న న్యాయమూర్తి ఆదేశాలతో తిరిగి మహబూబ్‌నగర్ జైలుకు తీసుకువెళ్లారు. -
బెయిల్‌కు ప్రయత్నించం
సాక్షి, నాగర్‌కర్నూల్: సంచలనం సృష్టించిన కాంట్రాక్టర్ సుధాకర్‌రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు రాజేశ్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి నాగర్‌కర్నూల్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి రిమాండ్ విధించగా.. రాజేశ్‌ను జైలుకు తరలించారు. కాగా, స్వాతి, రాజేశ్‌లకు బెయిల్ కోసం తాము ప్రయత్నించబోమని ఇరు కుటుం బాలు ప్రకటించాయి. కట్టుకున్నోడిని హతమార్చి.. అటు కన్నవారికి తలవంపులు తెచ్చిన స్వాతికి మరణశిక్ష పడాలని సుధాకర్‌రెడ్డి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. స్వాతి తల్లిదండ్రులు కూడా బెయిల్ కోసం తాము ప్రయత్నించమని తేల్చి చెప్పారు. ఇదిలాఉండగా.. సుధాకర్‌రెడ్డి తల్లికి స్వాతి తండ్రి సొంత సోదరుడు. మేనమామ కూతురినే సుధాకర్‌రెడ్డి పెళ్లి చేసుకోవడంతో ఇరు కుటుంబాల మధ్య మొన్నటి వరకు సత్సంబంధాలు ఉండేవి. ప్రస్తుతం అవి పటాపంచలయ్యాయి. సుధాకర్, స్వాతి పిల్లలు అమ్మమ్మ ఇంట్లోనే ఉన్నారు. వారిని తీసుకుపోయేందుకు సుధాకర్‌రెడ్డి తల్లిదండ్రులు అంగీకరించకపోగా.. తమ కుమారుడి వయసు వచ్చాక మనవడిని తీసుకువెళ్తామని వారు చెప్పినట్లు సమాచారం. అంతకు ముందు రాజేశ్‌ను పోలీసులు మీడియా ఎదుట హాజరుపరిచారు. స్వాతి ప్రోద్బలంతోనే సుధాకర్‌రెడ్డిని హత్య చేశారని చెప్పారు. మూడు నెలల క్రితమే సుధాకర్ రెడ్డిపై స్వాతి హత్యాయత్నానికి పాల్పడిందని చెప్పాడు. స్వాతి కోసమే కాల్చుకున్నా.. స్వాతితో కలసి బతికేందుకే తన ముఖంపై పెట్రోల్ వేసుకుని కాల్చుకున్నానని, ఇది ఎంతో కష్టమైనా ఆమె కోసం భరించానని రాజేశ్ చెప్పుకొచ్చాడు. సుధాకర్‌తో శత్రుత్వం లేదని.. స్వాతి కోసమే అతడిని హత్య చేసేందుకు అంగీకరించినట్లు చెప్పాడు. ఎంత ఖర్చయినా తనకు బాగుచేయిస్తానని స్వాతి చెప్పిందని, పిల్లలను తమతోనే ఉంచుకుని మిగతా జీవితాన్ని ఎక్కడికైనా దూరంగా వెళ్లి గడపాలని భావించినట్లు వివరించాడు. -
పథకం ప్రకారమే సుధాకర్ రెడ్డిని హతమార్చారు
-
ముఖం సరిగా కాలలేదని స్టౌపై పెట్టాడు..
నాగర్ కర్నూల్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సివిల్ కాంట్రాక్టర్ సుధాకర్ రెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడు రాజేశ్‌ను శుక్రవారం పోలీసులు మీడియా ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ పోలీసులు.. ఈ కేసు వివరాలను మీడియాకు వివరించారు. డీఎస్పీ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ... పథకం ప్రకారమే సుధాకర్ రెడ్డిని హత్య చేసినట్లు తెలిపారు. ఈ కేసులో రాజేశ్ ఏ1, స్వాతిని ఏ2గా చేర్చినట్లు తెలిపారు. ‘నలుగురు వ్యక్తులు వచ్చి సుధాకర్ రెడ్డిపై యాసిడ్ దాడి చేశారని కుటుంబ సభ్యులకు స్వాతి చెప్పింది. ఆ వెంటనే మహబూబ్‌నగర్‌కు అక్కడ నుంచి హైదరాబాద్ డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తీసుకువెళ్లింది. ముందే వేసుకున్న పథకం ప్రకారం ఇద్దరు కలిసి సుధాకర్‌రెడ్డి ఇంట్లో హత్య చేసి అటవీ ప్రాంతంలో కాల్చేశారు. తన తండ్రి చనిపోవడంతో కొద్దిరోజులుగా నిద్ర పట్టడం లేదని రాజేశ్ తన స్నేహితుడు నరేష్‌ను కోరాడు. ఆ తర్వాత సుధాకర్ రెడ్డి పడుకున్న సమయంలో మత్తు ఇంజెక్షన్ ఇచ్చితలపై మోది ఇద్దరు కలిసి హతమార్చారు. ఆ తర్వాత ఇంటికొచ్చాక రాజేశ్ ముఖాన్ని కాల్చుకున్నాడు. కానీ ...అనుకున్న మేరకు కాలకపోవడంతో ముఖాన్ని స్టౌపై పెట్టాడు. హైదరాబాద్ ఆస్పత్రిలో రాజేశ్‌ను చేర్చించిన వెంటనే ప్లాస్టిక్ సర్జరీ చేయాలని డాక్టర్లను స్వాతి కోరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది సుధాకర్ రెడ్డి కాదని కుటుంబసభ్యులకు అనుమానం రావడంతో ఆ విషయాన్ని వారు మా దృష్టికి తెచ్చారు. మేం స్వాతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే హత్య విషయం తేలింది. స్వాతికి, రాజేశ్‌కు రెండేళ్లుగా సంబంధం ఉంది. కానీ ఈ విషయం కుటుంబసభ్యులకు తెలియదు. అయితే ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్లిపోదామని స్వాతిని రాజేశ్ అడిగాడు. కానీ పిల్లలు, తల్లిదండ్రులను వదిలి రానని స్వాతి చెప్పింది. ఇద్దరం కలిసి ఉండాలంటే సుధాకర్ రెడ్డిని హత్య చేసి ఆ స్థానంలో నువ్వు రావాలని స్వాతి ఈ సందర్భంగా రాజేశ్‌కు చెప్పింది. దాంతో ఇద్దరు ఆలోచించి ప్లాన్ చేశారు’ అని తెలిపారు. అలాగే సుధాకర్ రెడ్డి శవాన్ని కాల్చిన సంఘటనా స్థలం నుంచి సిరెంజ్, ఐరన్ రాడ్, చున్నీని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో విచారణ జరపాల్సిన అంశాలు చాలానే ఉన్నాయన్నారు. ప్రధాన నిందితుడు రాజేశ్ మాట్లాడుతూ...‘మేమిద్దం కలిసే సుధాకర్ రెడ్డిని హత్య చేశాం. సుధాకర్ రెడ్డి తనను కొడుతున్నాడని, పట్టించుకోవడం లేదని స్వాతి తరచు నాకు చెప్పేది. హత్యకు పథకం పన్నాక ఒకసారి ఆలోచించమని స్వాతిని కోరా. హ్యాపీగా ఉండాలంటే ప్లాన్‌ను అమలు చేయాల్సిందేనని స్వాతి చెప్పింది.’ అని తెలిపాడు. కాగా ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను దారుణంగా హతమార్చిన నిందితురాలు స్వాతిని శుక్రవారం పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం ఆమెకు ఈ నెల 29వ వరకూ రిమాండ్ పొడిగించింది. నాగర్ కర్నూల్లో సివిల్ కాంట్రాక్టర్సుధాకర్ రెడ్డిని భార్య స్వాతి హత్య చేసిన విషయం తెలిసిందే. -
స్వాతి చెప్పినట్లే చేశా...: రాజేశ్
సాక్షి, హైదరాబాద్ : నాగర్ కర్నూల్ సివిల్ కాంట్రాక్టర్ సుధాకర్ రెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజేశ్ గురువారం పోలీసుల విచారణలో పలు విషయాలను వెల్లడించాడు. సుధాకర్ రెడ్డి భార్య స్వాతి తనకు అన్నవిధాలా ఆర్థిక సాయం చేసిందని అతడు తెలిపాడు. స్వాతి ఇచ్చిన డబ్బులతోనే డ్రెస్‌లను కొనుక్కునేవాడినని చెప్పాడు. అంతేకాకుండా స్వాతి టీవీ సీరియల్స్ బాగా చూస్తుందని, చాలాసార్లు తనకు ఆ స్టోరీలు చెప్పేదని వివరించాడు. ఇక సుధాకర్ రెడ్డి హత్య విషయంలో స్వాతి చెప్పినట్లే చేశానని రాజేశ్ పోలీసుల విచారణలో తెలిపారు. కాగా హైదరాబాద్‌లోని డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేశ్‌ను గురువారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. స్వాతి .. ఖైదీ నెంబర్ 678 పథకం ప్రకారమే కట్టుకున్న భర్తను దారుణంగా హతమార్చిన నిందితురాలు స్వాతి ప్రస్తుతం పాలమూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంది. అయితే ఆమె ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించకపోగా, తోటి ఖైదీలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్వాతికి జైలు అధికారులు 678 ఖైదీ నెంబర్‌ను కేటాయించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం పూర్తి చేసిన ఆమె... తోటి ఖైదీలతో పాటు జైలులో గడ్డి కోసింది. కాగా స్వాతి వ్యవహారం మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉన్నదని పోలీసుల విచారణలో బయటపడింది. నర్సింగ్ శిక్షణ పొందిన స్వాతి ఆ సమయంలో పలువురితో చనువుగా మెలిగేదని తెలుస్తోంది. జల్సాలకు ఎక్కువగా అలవాటు పడ్డ స్వాతిని తన పద్ధతి మార్చుకోవాలని భర్త తరచు చెబుతూ వచ్చేవాడని సమాచారం. అయితే మూడు నెలల నుంచే సుధాకర్ రెడ్డిని అడ్డు తొలగించుకునేందుకు స్వాతి, ఆమె ప్రియుడు రాజేశ్ పథకం రచిస్తూ వచ్చారని, గతనెల 27న అందుకు మంచి అవకాశం దొరకడంతో పని ముగించినట్లు పోలీసులు తెలిపారు. కట్టుకున్న భర్త, కన్నబిడ్డలను కాదనుకుని ప్రియుడితో గడపాలన్న తపనతో స్వాతి ...సుధాకర్‌రెడ్డిని అత్యంత కిరాతకంగా హతమార్చడంపై నాగర్ కర్నూల్లో ఆగ్రహ జ్వాలలు కొనసాగుతున్నాయి. -
స్వాతి కుట్రతో రెండు కుటుంబాల క్షోభ
-
గుట్టు విప్పిన మటన్‌సూప్!
సాక్షి, నాగర్‌కర్నూల్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగర్ కర్నూల్‌కు చెందిన కాంట్రాక్టర్ సుధాకర్‌రెడ్డి హత్య కేసులో రోజుకో కోణం వెలు గు చూస్తోంది. భర్త సుధాకర్ రెడ్డిని హత్య చేసి ప్రియుడు రాజేశ్‌ను ఆ స్థానంలో పెట్టాలని స్వాతి పన్నిన పథకం ఎలా బయట పడిందన్న విష యం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. మటన్‌సూప్ వల్లే ఈ కేసు గుట్టు రట్టయిందని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని డీఆర్డీఏ అపోలో ఆస్పత్రిలో స్వాతి ప్రియుడు రాజేశ్ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. సాధారణంగా కాలిన గాయాలతో చికిత్స పొం దుతున్న వారికి ఆస్పత్రిలో మటన్ సూప్ ఇస్తుంటారు. చికిత్స పొందుతున్న రాజేశ్‌కు వైద్యులు మటన్‌సూప్ తాగించేందుకు యత్నించారు. కానీ తాను శాఖాహారినని మటన్ సూప్ తాగేందుకు నిరాకరించడంతో అక్కడే ఉన్న సుధాకర్ రెడ్డి తల్లిదండ్రులు కంగుతిన్నారు. వాస్తవంగా సుధాకర్‌రెడ్డికి మాంసాహారం ఇష్టం కాగా.. ఇప్పుడు వద్దన డం ఏమిటని వారు ఆలోచనలో పడ్డారు. అప్పుడే వారికి అనుమానమొచ్చింది. చికిత్స పొందుతోంది సుధాకర్‌రెడ్డి కాదని, మరొకరన్న సంగతి క్రమంగా వారిలో బలపడుతూ వచ్చింది. రాజేశ్ ముఖానికి ఉన్న ముసుగు తొలగించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే స్వాతి వారిని అడ్డుకునేదని, ‘ఆయన మాట్లాడలేకపోతున్నారని..ఏదైనా ఉంటే రాసి చూపిస్తాడం టూ’ పెన్ను, పేపర్ ఇచ్చి రాజేశ్‌తో సమాధానం ఇప్పించేది. ఇలా పదిరోజుల పాటు స్వాతి, రాజేశ్ తమ బండారం బయట పడకుండా జాగ్రత్త పడ్డారు. చివరికి సుధాకర్‌రెడ్డి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడం.. రంగప్రవేశం చేసిన పోలీసులు గోప్యంగా ఆరా తీశారు. సుధాకర్ రెడ్డి ఆధార్ కార్డుకు రాజేశ్ వేలిముద్రలకు సరిపోలక పోవడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. ఎంతైనా భరిస్తానన్న స్వాతి ముఖం కాలిన రాజేశ్‌కు ప్లాస్టిక్ సర్జరీ చేసి ఎవరూ గుర్తుపట్టకుండా తయారు చేసేందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడనని ఆస్పత్రి వర్గాలతో స్వాతి అన్నట్లుగా తెలుస్తోంది. ప్లాస్టిక్ సర్జరీ అవసరం లేదని ఆస్పత్రి వర్గాలు చెప్పినా.. సర్జరీ చేసేందుకు డబ్బు ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదని అన్నట్లుగా చెబుతున్నారు. రాజేశ్ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేసి భర్తను చంపిన కేసు నుంచి బయటపడటంతోపాటు ప్రియుడితో కాపురం చేసేందుకు స్వాతి తీవ్ర ప్రయత్నాలు చేసింది. కొడుకు పుట్టిన రోజునే.. సుధాకర్‌రెడ్డి ఆరేళ్ల కుమారుడు దర్శిత్రెడ్డి ఏడో పుట్టిన రోజు నవంబర్ 27న జరగాల్సి ఉంది. అంతకు ముందురోజు సుధాకర్‌రెడ్డి కొడుకు పుట్టిన రోజు ఏర్పాట్లలో భాగంగా కొత్త బట్టలు కొన్నాడని స్నేహితులకు తెలిపారు. 27న ఉదయాన్నే సుధాకర్ రెడ్డిని హత్య చేశారు. పోలీసుల అదుపులో రాజేశ్! ప్రధాన నిందితుడైన రాజేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను సోమ వారం అర్ధరాత్రే పోలీసులు అదుపులోకి తీసుకు న్నట్లు సమాచారం. ఈ కేసులో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ప్రత్యేక పోలీసుల బృందం రాజేశ్‌ను విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. బకాయి బిల్లు చెల్లించేదెవరు? హైదరాబాద్: హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఏ అపోలో ఆస్పత్రిలో 18 రోజుల పాటు రాజేశ్‌కు జరిగిన చికిత్సకు యాజమాన్యం రూ.4 లక్షలు బిల్లు వేయగా.. ఇందులో సుధాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులు (తమ కుమారుడే అనుకొని) రూ.2.10 లక్షలు చెల్లించారు. ఇంకా రూ.1.90 లక్షల బిల్లు బకాయి చెల్లించాల్సి ఉంది. ఈ బకా యి ఎవరు చెలిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నా యి. ఓ వైపు హత్య, కుట్ర కేసుల్లో స్వాతి అరెస్టయి రిమాండ్‌కు వెళ్లగా... మరోవైపు రాజేశ్ కుటుంబసభ్యులెవరూ ఇప్పటి వరకు ముందుకు రాకపోవడంతో బిల్లు ఎవరు చెల్లిస్తారో తెలియక పరిస్థితి అయోమయంగా మారింది. -
సుధాకర్ రెడ్డి హత్య కోణంలో కొత్త ట్విస్ట్
-
సీరియల్ ప్రభావంతో.. స్వాతి స్కెచ్
సాక్షి, నాగర్‌కర్నూల్: ఆమె.. భర్తతో ఏడు అడుగులు నడిచింది. వేదమంత్రాల సాక్షిగా తాళి కట్టించుకుంది. సమాజం ఎగ‘తాళి’ చేసేలా ప్రియుడితో కలిసి పథకం ప్రకారం కట్టుకున్నోడిని హతమార్చింది. భార్యాభర్తల ఆత్మీయబంధాన్ని మంటగలిపింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగిన ఈ హత్యోదంతం నిజంగానే ‘సీరియల్’ను తలపించింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో కలకలం సృష్టించిన యాసిడ్ దాడి కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. వివరాలను నాగర్‌కర్నూల్ జిల్లా ఏఎస్పీ జోగుల చెన్నయ్య, డీఎస్పీ లక్ష్మీనారాయణ, కొల్లాపూర్ సీఐ శ్రీనివాసరావు ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆరోజు ఏం జరిగిందంటే..! గతనెల 27న నాగర్‌కర్నూల్ పట్టణానికి చెందిన సుధాకర్‌రెడ్డి అనే కాంట్రాక్టర్‌పై యాసిడ్ దాడి జరిగిందని అతని సోదరుడు సురేందర్‌రెడ్డి 28న ఉదయం 11గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన అన్న, వదిన స్వాతి పట్టణంలోని రవితేజ కళాశాల పక్కన ఓ అద్దెఇంట్లో నివాసం ఉంటున్నారని అందులో పేర్కొన్నాడు. స్వతహాగా కాంట్రాక్టర్ అయిన సుధాకర్‌రెడ్డి భార్యను ఇంట్లో ఉంచి కాంట్రాక్ట్ పనుల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లేవాడు. ఆ సమయంలో ఆమె టీవీ సీరియళ్లు ఎక్కువగా చూసేది. దీనికితోడు ఒంటరిగా ఉండే స్వాతికి రాజేష్ పరిచయమయ్యాడు. ఈ క్రమంలో సుధాకర్‌రెడ్డికి వీరి వ్యవహారం తెలియడంతో భార్య స్వాతిని 26న నిలదీయడమే కాకుండా ఆమెపై చేయిచేసుకున్నాడు. ఇరువురూ తోసుకోవడంతో సుధాకర్‌రెడ్డి తలకు గాయమైంది. అదేరోజు రాత్రి 12గంటల ప్రాంతంలో సుధాకర్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి వెళ్లి తలకు కుట్లు వేయించుకుని ఇంటికివచ్చాడు. అప్పటికే రాజేష్‌తో కలిసి సుధాకర్‌రెడ్డిని హత్య చేసేందుకు స్వాతి పథకం రచించింది. ఆరోజు రాత్రే పని ముగించాలని అనుకున్నప్పటికీ ఇంట్లో మరో వ్యక్తి ఉండటంతో కుదరలేదు. తెల్లవారుజామున అతను బయటకు వెళ్లిన వెంటనే రాజేష్‌ను ఇంటికి పిలిపించుకున్న స్వాతి నిద్రిస్తున్న సుధాకర్‌రెడ్డి మెడకు మత్తు ఇంజక్షన్ ఇచ్చే సమయంలో అతను అరవకుండా నోట్లో బట్టలు కుక్కింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఇనుప రాడ్‌తో సుధాకర్‌రెడ్డి తలపై బాదడంతో అతను అక్కడే మరణించాడు. వెంటనే దుప్పట్లో సుధాకర్‌రెడ్డి శవాన్ని మూటగట్టి కారు డిక్కీలో వేసుకుని ఇంట్లో నుంచి స్వాతి, రాజేష్ బయలుదేరారు. ఉదయం ఏడు గంటలకల్లా నవాబ్‌పేట వద్దనున్న అటవీ ప్రాంతానికి చేరుకుని రోడ్డుకు వంద మీటర్ల దూరంలో శవాన్ని విసిరేశారు. వెంట తీసుకెళ్లిన పెట్రోల్‌తో సుధాకర్‌రెడ్డి శవాన్ని తగులబెట్టి అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌కు చేరుకున్నారు. అక్కడ అప్పటి వరకు వాడిన కారును మెకానిక్ షెడ్డులో సర్వీసింగ్ చేయాలంటూ ఇచ్చేశారు. వెలుగులోకి ఇలా.. 27వ తేదీ నలుగురు వ్యక్తులు ముసుగులు ధరించి సుధాకర్‌రెడ్డిపై యాసిడ్ దాడికి పాల్పడ్డారని, దీంతో తమ వదిన స్వాతి సుధాకర్‌రెడ్డిని చికిత్స కోసం హైదరాబాద్‌కు హుటాహుటిన తీసుకెళ్తున్నట్లు తనకు తెలిపిందని సురేందర్‌రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సంఘటనపై ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవర్ సంఘటన స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. జిల్లా కేంద్రంలోని అన్ని సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. తమ దర్యాప్తు కొనసాగుతుండగానే ఈనెల 9న ఫిర్యాదుదారు మంద సురేందర్‌రెడ్డి, అతని తల్లి సుమతమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి సుధాకర్‌రెడ్డి కాదని, స్వాతి ప్రియుడని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. స్వాతితో పాటు ముఖం కాలి చికిత్స పొందుతున్న స్వాతి ప్రియుడు రాజేష్‌ను విచారించడంతో వారు పథకం ప్రకారమే సుధాకర్‌రెడ్డిని హత్య చేసినట్లు అంగీకరించారు. దీంతో స్వాతిని అదుపులోకి తీసుకుని సుధాకర్‌రెడ్డి శవాన్ని తగలబెట్టిన నవాబ్‌పేట మండలం ఫతేపూర్ మైసమ్మ అడవి ప్రాంతానికి చేరుకున్నారు. సంఘటన స్థలంలో గుర్తుపట్టకుండా కాలిన శవం, ఎముకలు, పుర్రె మాత్రమే లభించింది. వీటిని నిర్ధారణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని పోలీసులు తెలిపారు. టీవీ సీరియల్ ప్రభావమే.. తరచూ టీవీ సీరియళ్లు చూసే స్వాతికి ప్రియుడిని భర్త స్థానంలోకి తెచ్చుకోవాలన్న ఆలోచనతో అతనికి సుధాకర్‌రెడ్డిలా ప్లాస్టిక్ సర్జరీ చేయించాలన్న ఆలోచన వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలో ఓ నిర్జలప్రదేశంలో రాజేష్ తన ముఖానికి ఓ టవల్ కట్టుకుని దానిపై పెట్రోల్ పోసుకుని పెద్దగా గాయాలు కాకూడదని నిప్పంటించుకున్నాడు. ఆ తర్వాత ముఖం నల్లగా మారడంతో ఇక ఎవరూ గుర్తుపట్టరని, ప్లాస్టిక్ సర్జరీ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని భావించాడు. ఆ తర్వాత స్వాతి అతను ఉన్న ప్రదేశానికి ఓ ప్రైవేట్ ట్యాక్సీ మాట్లాడుకుని వెళ్లి హైదరాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆ తర్వాత బంధువులు, పోలీసులకు చికిత్స పొందుతున్నది సుధాకర్‌రెడ్డే అని వారంరోజులకు పైగా స్వాతి అందరిని నమ్మిస్తూ వచ్చింది. వైద్యులు కాలిన గాయాలు నయం అయ్యాయని, డిశ్చార్జి చేస్తామని చెప్పడంతో సుధాకర్‌రెడ్డి సోదరుడు, తల్లి ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటి వరకు ముఖం చూపించకుండా జాగ్రత్తపడ్డ రాజేష్ తప్పనిసరి పరిస్థితుల్లో ముఖానికి ఉన్న ముసుగు తీయాల్సి వచ్చింది. దీంతో అతను సుధాకర్‌రెడ్డి కాదని మంద సురేందర్‌రెడ్డి, తల్లి సుమతమ్మ గుర్తుపట్టి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బండారం బయటపడింది. -
భర్త..ప్రియుడు..క్రైమ్ థ్రిల్లర్
-
సీరియల్ చూసే స్కెచ్ వేశా!
సాక్షి, నాగర్‌కర్నూల్: సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కలసి భర్తను హతమార్చిన భార్య స్వాతిని అరెస్టు చేశారు. ‘మనసు మమత’టీవీ సీరియల్ ప్రభావంతో ఈ హత్యకు పథక రచన చేసినట్లు నిందితురాలు స్వాతి వెల్లడించినట్లు నాగర్‌కర్నూల్ ఏఎస్పీ జోగుల చెన్నయ్య చెప్పారు. ఆదివారం డీఎస్పీ లక్ష్మీనారాయణ, కొల్లాపూర్ సీఐ శ్రీనివాసరావుతో కలసి ఆయన కేసు వివరాలను మీడియాకు వివరించారు. ప్రియుడితో కలసి హత్య ప్రియుడు రాజేశ్‌తో ఉన్న వివాహేతర సంబంధంపై గత నెల 26న భర్త సుధాకర్‌రెడ్డి నిలదీశాడు. ఆమెపై చేయి చేసుకున్నాడు. ఇద్దరూ తోసుకోవడంతో సుధాకర్‌రెడ్డి తలకు గాయమైంది. అదేరోజు అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో సుధాకర్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి వెళ్లి తలకు కుట్లు వేయించుకుని ఇంటికి వచ్చాడు. అప్పటికే రాజేశ్‌తో కలసి సుధాకర్‌రెడ్డిని హత్య చేసేందుకు స్వాతి పథకం రచించింది. ఆ రోజు రాత్రే పని ముగించాలని అనుకున్నప్పటికీ ఇంట్లో మరో వ్యక్తి ఉండటంతో కుదరలేదు. తెల్లవారుజామున అతను బయటకు వెళ్లిన వెంటనే రాజేశ్‌ను ఇంటికి పిలిపించుకున్న స్వాతి.. నిద్రిస్తున్న సుధాకర్‌రెడ్డి మెడకు మత్తు ఇంజక్షన్ ఇచ్చింది. నోట్లో అతను అరవకుండా బట్టలు కుక్కింది. ఆ తర్వాత ప్రియుడితో కలసి ఇనుప రాడ్‌తో సుధాకర్‌రెడ్డి తలపై బాదడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే శవాన్ని దుప్పట్లో మూటగట్టి కారు డిక్కీలో వేసుకుని నవాబ్‌పేట మండలం ఫతేపూర్ మైసమ్మ అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. రోడ్డుకు వంద మీటర్ల దూరం అడవిలో శవాన్ని పడేసి.. వెంట తీసుకెళ్లిన పెట్రోల్‌తో తగులబెట్టారు. అనంతరం అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌కు చేరుకున్నారు. తాము తీసుకెళ్లిన వాహనాన్ని మెకానిక్ షెడ్లో సర్వీసింగ్ చేయాలంటూ ఇచ్చేశారు. ప్రియుడు రాజేశ్, స్వాతిలను అదుపులోకి తీసుకొని విచారించగా.. పథకం ప్రకారమే తాము సుధాకర్‌రెడ్డిని హత్య చేసినట్లు అంగీకరించినట్లు ఏఎస్పీ తెలిపారు. ఘటన స్థలంలో కాలిన శవం, ఎముకలు, పుర్రె మాత్రమే లభించిందని, వీటిని నిర్ధారణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని తెలిపారు. ఈ కేసులో ఏ1 నిందితుడిగా రాజేశ్, ఏ2 నిందితురాలిగా స్వాతిని చేర్చినట్లు వివరించారు. -
ఏచూరీ, సుధాకర్‌రెడ్డిలకు చైనా ఆహ్వానం
న్యూఢిల్లీ: చైనా రాజధాని బీజింగ్‌లో జరిగే సమావేశాలకు సమావేశానికి సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరీ, సురవరం సుధాకర్‌రెడ్డిలను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) ఆహ్వానించింది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు ‘ప్రపంచ రాజకీయ పార్టీలతో సీపీసీ చర్చలు’ పేరిట ఈ సమావేశాలు జరగనున్నాయి. గురువారం చైనాకు బయలుదేరి వెళ్లనున్న ఏచూరీ, సుధాకర్‌రెడ్డిలు ఇందులో భాగంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీలోని పలువురు సీనియర్ నేతలతో భేటీ అవుతారు. ఈ సమావేశాలకు 120 దేశాలనుంచి దాదాపు 200 రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరుకానున్నారు. -
కాంట్రాక్టర్‌పై యాసిడ్ దాడి
నాగర్‌కర్నూల్ క్రైం: ఓ సివిల్ కాంట్రాక్టర్‌పై కొందరు దుండగులు యాసిడ్‌తో దాడికి పాల్పడ్డారు. కాంట్రాక్టర్ సుధాకర్‌రెడ్డి నాగర్ కర్నూల్లో నివాసముంటున్నాడు. సోమవారం నలుగురు దుండగులు ఇంట్లో ప్రవేశించి ఆయన భార్య స్వాతిరెడ్డి చేతులను వెనక్కి కట్టేశారు. సుధాకర్‌రెడ్డి నోటికి బట్ట కట్టి ముఖంపై యాసిడ్ చల్లి పరారయ్యారు. సుధాకర్‌రెడ్డిని పొరుగువారు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మంగళవారం ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వ్యాపారంలో సుధాకర్‌రెడ్డి భాగస్వామి అయిన స్నేహితుడు ఘటన జరిగిన సోమవారం ఉదయమే ఇంటికి వచ్చి వెళ్లడంతో అతడిపై అనుమానంతో పోలీసులు విచారణ చేపట్టారు. -
‘స్వచ్ఛ’ కాసులపల్లి...
► ఇంటింటికో ఇంకుడుగుంత ► గ్రామంలో పర్యటించిన కేంద్ర బృందం పెద్దపల్లిరూరల్ : సంపూర్ణ పారిశుధ్య లక్ష్యాల సాధనలో ముందున్న పెద్దపల్లి నియోజకవర్గంలోని పెద్దపల్లి మండలం కాసులపల్లి, సుల్తానాబాద్ మండలం సుద్దాలలో బుధవారం కేంద్ర అధికారుల బృందం పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించింది. కేంద్ర ఆర్థిక సలహాదారు తన్నీరుకుమార్, యునిసెఫ్ ప్రతినిధి సుధాకర్‌రెడ్డి బృందం ఆయా గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పారిశుధ్యం, హరితహారం తదితర పథకాల అమలుతీరుపై ఆరా తీసింది. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సొంత గ్రామమైన కాసులపల్లిలో వ్యక్తిగత మరుగుదొడ్లతోపాటు స్నానపుగదిని నిర్మించుకోవడాన్ని చూసిన అధికారులు సంతృప్తి వ్యక్తంచేశారు. సర్పంచ్ ఇనుగాల తిరుపతిరెడ్డి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటి ఆవరణలో కూరగాయల చెట్లు, రోడ్ల కిరువైపులా పండ్లు, నీడనిచ్చే మొక్కలను నాటి సంరక్షించడాన్ని అభినందించారు. ప్రతీఇంటి ఆవరణలో ఇంకుడుగుంతను నిర్మించుకోవడంతో మురుగునీటి కాలువల్లోకి నీరు ఎక్కువగా రాక గ్రామంలో దోమల వృద్ధి ఉండదని గ్రామస్తులు వివరించారు. తమ గ్రామంలో నూరుశాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలను నిర్మించుకున్నామని పేర్కొన్నారు. తమ గ్రామంలో వర్మికంపోస్టు తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సహకారమందించాలని సర్పంచ్ తిరుపతిరెడ్డి, వైస్‌ఎంపీపీ చంద్రారెడ్డి కోరారు. అంతర్గత రహదారులు దాదాపుగా అభివృద్ధికి నోచాయని, మిగిలిన కొన్ని రోడ్లను సీసీ రోడ్లుగా నిర్మించుకునేందుకు ఇతర అభివృద్ధి పనులకోసం నిధులను ఇప్పించాలని కోరారు. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత సుల్తానాబాద్ రూరల్: మండలంలోని సుద్దాల గ్రామాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. గ్రామంలో చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పారిశుధ్య పనుల గురించి పరిశీలించింది. గ్రామస్తులతో సభ్యులు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛభారత్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇండియన్ ఎకనామిక్ అడ్వైజర్ సమీర్‌కుమార్ మాట్లాడుతూ అందరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. రాష్ట్ర యుని సెఫ్ కోఆర్డినేటర్ సుధాకర్‌రెడ్డి, ఎస్‌బీఎంలు రమేశ్, లింగస్వామి, రాఘవులు, ఎంపీడీవో వినోద్, తహసీల్దార్ రజిత, సర్పంచ్ అంజలి, గ్రామస్తు లు పాల్గొన్నారు. -
అభిమాని కోసం ఆత్మీయ మిత్రుడితో...
పవన్‌కల్యాణ్ నిర్మాతగా మారారనేది కొత్త విషయం కాదు. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ నిర్మాతల్లో ఆయనొకరు. పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఆ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అనేది అందరికీ తెలిసిందే. తాజాగా ఆత్మీయ మిత్రుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలసి ఓ చిత్రం నిర్మిస్తున్నారు. అయితే.. ఇందులో పవన్ హీరోగా నటించడం లేదు. ఆయన అభిమాని నితిన్ హీరో. పాటల రచయిత కృష్ణచైతన్య ఈ చిత్రానికి దర్శకుడు. ‘రౌడీ ఫెలో’ తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న రెండో చిత్రమిది. నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం బుధవారం ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి త్రివిక్రమ్ కెమేరా స్విచ్చాన్ చేయగా, పవన్‌కల్యాణ్ క్లాప్ ఇచ్చారు. తొలిసారి వేరే హీరోతో పవన్ సినిమా నిర్మిస్తుండడం ఓ విశేషమైతే... త్రివిక్రమ్ ఓ నిర్మాతగానే కాకుండా మూల కథను కూడా అందించడం మరో విశేషం. ఈ చిత్రానికి కళ: రామకృష్ణ, కెమేరా: ఎన్. నటరాజ సుబ్రహ్మణ్యన్. -
కాచిగూడలో వ్యక్తి అదృశ్యం
ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఏఎస్ఐ మజార్ మహ్మద్‌ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.... తిలక్‌నగర్ ప్రాంతానికి చెందిన బి.సుధాకర్‌రెడ్డి (30) ఈ నెల 22వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తెలిసిన వారి ఇండ్లలో, వివిధ ప్రాంతాల్లో ఎంత వెదికినా ఆచూకీ లభించలేదు. సుధాకర్‌రెడ్డి తమ్ముడు బి.వేణుగోపాల్ రెడ్డి కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు. -
శభాష్.. ఇబ్రహీంపూర్
- ఒకేరోజు 1.05 లక్షల మొక్కలు నాటిన గ్రామస్తులు సిద్దిపేట రూరల్: ‘శభాష్.. ఇబ్రహీంపూర్. లక్ష మొక్కలు నాటి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారు. వాన దేవుడు కూడా ఆశీర్వదించాలని కోరుతున్నాను’ అని భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్లో ఒకేరోజు లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డితో కలసి మంత్రి ప్రారంభించారు. ‘‘హరితహారంలో భాగంగా గ్రామంలో 2.10 లక్షలు మొక్కలు నాటనున్నారు. వాటిలో 1.05 లక్షల మొక్కలను ఒక్క రోజే నాటాం. దీంతో ఇబ్రహీంపూర్ చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది’’ అని తెలిపారు. ‘‘ఇబ్రహీంపూర్లో ఇంటింటి మరుగుదొడ్ల నిర్మించుకున్నారు. ఇంకుడు గుంతలు కూడా నిర్మించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకే ఆదర్శంగా నిలిచారు. ఇదే స్ఫూర్తి అంతటా కొనసాగాలి’’ అని మంత్రి కోరారు. -
తెలంగాణ అమరవీరుడి తల్లి ఆత్మహత్యాయత్నం
తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యక్తి మాతృమూర్తి అధికారుల తీరుతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసింది. గురువారం ఖమ్మం పట్టణంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్ వద్ద జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా మునగాల మండలం రేపాల గ్రామానికి చెందిన రావు సుధాకర్‌రెడ్డి తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఖమ్మం జిల్లా ముదిగొండలో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడ్ని అమరవీరుడిగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించడంతోపాటు, అతడి భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలైనప్పటికీ రూ.10 లక్షల పరిహారాన్ని అందజేసింది. కాగా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో సుధాకర్‌రెడ్డి తల్లి సుగుణమ్మ తన చిన్న కుమారుడు సురేందర్‌రెడ్డికి ఉద్యోగం ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో గురువారం రాష్ట్రావతణ వేడుకల నేపథ్యంలో ఖమ్మం పట్టణంలోని పోలీసు పరేడు గ్రౌండ్స్ వద్దకు చేరుకుంది. అధికారులను కలసి తన చిన్న కుమారుడికి ఉద్యోగం విషయమై వాకబు చేసింది. జాబితాలో పేరు లేదని వారు చెప్పడంతో అధికారులు పట్టించుకోలేదంటూ మనస్తాపం చెందిన అక్కడే చెట్టు కింద కూర్చుని పరుగుల మందు సేవించింది. ఆమెను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి... మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
పొలీస్ వాహనం ఢీకొని ఇద్దరు మృతి
పోలీసు వాహనం ఢీకొని ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో మృతుల శవాలతో వారి బంధువులు మంగళవారం సాయంత్రం వైఎస్సార్ జిల్లా రాయచోటిలో ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గాలివీడు మండలం పేరంపల్లి వద్ద మంగళవారం సాయంత్రం పోలీసు వాహనం ఓ బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న సుధాకర్‌రెడ్డి (38), బయ్యారెడ్డి (70) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. వీరనాగమ్మకు తీవ్ర గాయాలు కాగా ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న మృతుల బంధువులు రాయచోటిలో ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, తమకు న్యాయం చేయాలని మృతదేహాలతో ధర్నా చేస్తుండడంతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. -
పెళ్లి కూతురి నగల చోరీ
హిందూపురం పట్టణంలోని బెంగుళూరు రోడ్డులో ఉన్న ఇంటర్నేషన్ ఫంక్షన్ హాల్లో బుధవారం రాత్రి చోరీ జరిగింది. పెళ్లి కూతురికి సంబంధించిన నగలు చోరీకి గురయ్యాయి. హిందూపురం మండలం నీలగుంటపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి కుమారై అపర్ణ వివాహం, బెంగుళూరుకు చెందిన ఓ వ్యక్తితో గురువారం జరగనుంది. బుధవారం రాత్రి రిసెస్షన్ కార్యక్రమం జరిగింది. భోజనాలకు వెళ్లిన సమయంలో బ్యాగులో దాచిన 75 గ్రాముల బంగారు నగలను గుర్తుతెలియని దుండగులు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వినాయక్ డైరెక్షన్లో నితిన్
దిల్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సాధించారు నితిన్, వినాయక్. ఈ సినిమా హీరోగా నితిన్‌కు మాస్ ఇమేజ్ తీసుకువస్తే, దర్శకుడిగా వినాయక్‌కు స్టార్ స్టేటస్ అందించింది. ఆ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందంటూ వార్తలు వినిపించినా అది కార్యరూపం దాల్చలేదు. అయితే అఖిల్ సినిమాతో మరోసారి వినాయక్, నితిన్‌లు కలిసి పనిచేశారు. నితిన్ నిర్మాతగా వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అఖిల్ సినిమాతో అక్కినేని నటవారసుడు వెండితెరకు పరిచయం అయ్యాడు. హీరోగా నితిన్‌కు మంచి బ్రేక్ ఇచ్చిన వినాయక్, నిర్మాతగా మారి చేసిన సినిమాకు మాత్రం నిరాశపరిచాడు. దీంతో నిర్మాతగా నితిన్ తొలి ప్రయత్నమే నష్టాలు మిగిల్చింది. ఇప్పుడు ఆ నష్టాలను పూడ్చేందుకు రెడీ అవుతున్నాడు వినాయక్. ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమా పనుల్లో బిజీగా ఉన్న వినాయక్, ఆ సినిమా తరువాత నితిన్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. అఖిల్ సినిమా తరువాత, నితిన్ ఫ్యామిలీతో కలిసి కనిపించని వినాయక్ తాజాగా స్పీడున్నోడు సెట్‌కు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డితో కలిసి వచ్చాడు. దీంతో నితిన్, వినాయక్‌ల సినిమా కన్ఫామ్ అన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను కూడా నితిన్ తన సొంత బ్యానర్‌పై నిర్మించాడనికి రెడీ అవుతున్నాడు. -
అందుబాటులో ఉండే నేతలు కావాలి
కామన్ మ్యాన్ Voice ఉన్న ఊరును వదిలి ఉపాధి కోసం నగరానికి వచ్చారు. పదేళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. ఇదే ఇప్పుడు సొంతూరైంది. ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడే ఓటేస్తున్నారు. కానీ బతుకు బండికి భరోసా మాత్రం దొరకలేదంటున్నాడు విద్యానగర్‌కు చెందిన సుధాకర్‌రెడ్డి. ఏ నాయకుడూ ఇతవరకు సాయం అందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ‘బతుకు బండి లాగించడానికి చేసిన ప్రయత్నాలు కొన్ని విఫలమయ్యాయి. కుటుంబమంతా కష్టపడి పని చేస్తేనే ఫలితం ఉంటుందని నిర్ణయించుకుని మీర్చి బజ్జి బండి పెట్టా. నాతో పాటు భార్య, ఇద్దరు పిల్లలు కష్టపడతారు. రోడ్డుపై కాస్త ఇబ్బంది కలిగితే అంతా చిర్రుబుర్రులాడుతుంటారు. పదే ళ్లుగా ఈ వ్యాపారాన్నే నమ్ముకొని బతుకున్నాం. మాకు నేతలు, ప్రభుత్వాలు తోడ్పాటు దొరకలేదు. ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తున్నామే తప్ప తమలాంటి వారికి ఏవిధంగా అండగా నిలవాలనే ఆలోచన నాయకులకూ లేదు’ అని పేర్కొన్నాడు. ‘మాలాంటి చిరు బతుకులకు అండగా ఉండే నేతలు కావాలి. పొదుపు సంఘాలకు ఇచ్చే ప్రోత్సాహకాలు మాకూ ఇస్తే బాగుపడతాం. నాయకులు ఎన్నికలప్పుడే కాకుండా గెలిచాక కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుతున్నాడు. - అంబర్‌పేట -
ఏడాదిలో ఏమి సాధించాం?
8న గుంటూరులో సీపీఐ జాతీయ సమితి సమావేశాలు సాక్షి, హైదరాబాద్: పుదుచ్చేరిలో జరిగిన జాతీయ మహాసభలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించేందుకు సీపీఐ జాతీయ సమితి వచ్చేనెల 8న గుంటూరులో భేటీ కానుంది. మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో పార్టీ నిర్మాణంపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. పార్టీని ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని గత మార్చిలో జరిగిన జాతీయ మహాసభల్లో నిర్ణయించారు. తదనుగుణంగా ఏయే రాష్ట్రంలో ఎంతెంత ప్రగతిని సాధించిందీ చర్చించి భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తారు. పార్టీ పునాదులు కదిలిపోయి జాతీయ హోదాను కోల్పోయిన నేపథ్యంలో గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పూర్తిగా సంస్కరించాలని నాయకత్వం నడుంకట్టింది. అయినప్పటికీ ఏమాత్రం పురోగతి కనిపించకపోగా నానాటికీ తీసికట్టు.. అన్నట్టుగానే మిగిలింది. ఈ తరుణంలో జరుగుతున్న ఈ సమావేశాలకు ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి సుధాకర్‌రెడ్డి మొదలు జాతీయ నాయకత్వమంతా 7వ తేదీకే గుంటూరు చేరుకుంటుంది. సమావేశాల ఎజెండాను ఖరారు చేసేందుకు కేంద్ర కార్యదర్శివర్గం అదే రోజు సాయంత్రం భేటీ అవుతుంది. 8న ఉదయం కేంద్ర కార్యవర్గం సమావేశం అనంతరం ర్యాలీ, గుంటూరు లాడ్జి సెంటర్లోని మహిమా గార్డెన్స్‌లో బహిరంగ సభ ఉంటుంది. తర్వాత జాతీయ సమితి భేటీ అయి మర్నాడు సాయంత్రం వరకు కొనసాగుతుందని పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు వివరించారు. -
వెబ్సైట్ తెచ్చిన తంటా!
కూచిపూడి కళాకారుడికి ఫోన్ ద్వారా టోకరా నగలు పంపిస్తామని ఎరవేసిన గ్యాంగ్ వివిధ పన్నుల పేరుతో రూ.7.5 లక్షలు స్వాహా కేసు పెడతామనడంతో భయపడిన వైనం సిటీబ్యూరో: ఆయనో కూచిపూడి నృత్య కళాకారుడు. అనేక ప్రదర్శనలు ఇచ్చి బహుమతులు పొందాడు. ఇంటర్నెట్లో సొంతంగా ఏర్పాటు చేసుకున్న వెబ్సైట్ ఆయనకు తిప్పలు తెచ్చిపెట్టింది. దాని ఆధారంగా సంప్రదించిన ఓ ముఠా నగలంటూ ఎరవేసి... కేసులని భయపెట్టి.. పన్నుల పేరుతో రూ.7.5 లక్షలు కాజేసింది. దీనిపై శుక్రవారం కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివరాలివీ... నగరంలోని ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన సుధాకర్‌రెడ్డి కూచిపూడి నృత్య కళాకారుడు. యువతిగా అలంకరించుకుని అనేక చోట్ల ప్రదర్శనలు ఇచ్చిన ఆయన ఎన్నో బహుమతులు పొందా రు. వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలతో ఇంటర్నెట్లో సొంతంగా ఓ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. అందులో తన కాంటాక్ట్ నెంబర్ కూడా పొందుపరిచారు. పొగడ్తలతో ముంచారు సుధాకర్ రెడ్డికి దాదాపు నెల రోజుల క్రితం ఓ ఫోన్ వచ్చింది. తాము లండన్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పిన అవతలి వ్యక్తులు వెబ్సైట్లో ఫొటోలు, వీడియోలు చూశామని పొగడ్తలతో ముంచెత్తారు. మీతో యూకేలో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని... అలంకరించుకోవడానికి కొన్ని నగలు పంపిస్తామని ఎరవేశారు. దీంతో కాస్త కంగుతిన్న సుధాకర్ రెడ్డి... తాను పురుషుడినని, నగలు ఎందుకని ఎదురు ప్రశ్నించారు. ఈ మాట వినడంతోనే సర్దుకున్న అవతలి వ్యక్తులు... తాము కళాకారులకు పంపుతున్నామని... ఇందులో స్త్రీ, పురుష భేదం లేద ని సరిచేసుకున్నారు. యూకేలో ఈవెంట్ పేరుతో కొన్ని రోజుల పాటు ఫోన్లు, వాట్సాప్ ద్వారా సంప్రదింపులు జరిగాయి. యూకేలో జరిగే ఈవెంట్లో తాము ఇచ్చిన నగలనే ధరించి నృత్యం చేయాలంటూ నమ్మబలికారు. ఓ రోజు హఠాత్తుగా నగలతో పాటు ఆ బాక్సులో 35 వేల పౌండ్లు పెట్టి పంపిం చామంటూ సుధాకర్‌రెడ్డికి వర్తమానం పంపారు. ఇది జరిగిన మరుసటి రోజే కస్టమ్ అధికారిణి అంటూ ఓ యువతి ఫోన్ చేసింది. మీకు లండన్ నుంచి నగలతో పాటు కొన్ని పౌండ్లతో కూడిన పార్శిల్ వచ్చిందని చెప్పింది. పన్నుల పేరుతో దోపిడీ ఈ రకంగా విదేశాల నుంచి అక్రమంగా రావడం కస్టమ్స్ నిబంధనలకు విరుద్ధమని... ఈ నేపథ్యంలోనే మీపై కేసు నమోదు చేయనున్నామంటూ భయపెట్టింది. అలా కాకుండా ఉండాలంటే దాదాపు రూ.కోటి విలువైన నగదు, పౌండ్లకు సంబంధించి రూ.4.5 లక్షల పన్ను కట్టాలంటూ ఓ బ్యాంకు ఖాతా నెంబర్ చెప్పింది. ఆందోళనకు లోనైన సుధాకర్‌రెడ్డి ఆ మహిళ చెప్పినట్లు నగదు డిపాజిట్ చేశారు. ఆ తరవాత మళ్లీ సంప్రదించిన యువతి ఎఫ్‌బీఐ, ఆర్బీఐ క్లియరెన్స్‌ల పేరుతో మరో రూ.3 లక్షల వరకు దఫదఫాలుగా డిపాజిట్ చేయించుకుంది. చివరకు సమాధానం లేకపోవడంతో తాను మోసపోయినని గుర్తించిన బాధితుడు శుక్రవారం సైబర్ క్రైమ్ ఏసీపీ ఇస్మాయిల్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు కేసు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది ఉత్తరాదికి చెందిన నైజీరియన్ల పనిగా అధికారులు భావిస్తున్నారు. ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య
అప్పుల భారం మరో అన్నదాతను బలితీసుకుంది. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం పాతపాడులో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సాగు కోసం అప్పుల పాలైన సుధాకర్‌రెడ్డి (42) శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఉరేసుకుని మృతి చెందాడు. శనివారం ఉదయం ఇది గమనించిన కుటుంబ సభ్యులు భోరున విలపించారు. స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. -
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
భగవంతుడి సేవలో అందరం సమానమే ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆదిబట్ల : స్వరాష్ట్రంలో గురు పౌర్ణమి పండగను మతాలకతీతంగా జరుపుకోవాలని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో రెండు రోజులుగా జరుగుతున్న చతుర్థ వార్షికోత్సవాల్లో భాగంగా గురువారం డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డితో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే ఇక్కడి సాయిబాబా మందిరం ఎంతో ప్రసిద్ధిగాంచుతుందని ఆశాభవం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతురి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేవాలయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన అన్ని సౌకర్యాల ఏర్పాటుకు ప్రయత్నిస్తామని తెలిపారు. అంతకుముందు సాయిబాబా ఆలయంలో మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మలక్‌పేట్ మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రాంరెడ్డి సాయిబాబాను దర్శించుకున్నారు. దేవాలయ కమిటి ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ శేఖర్, మాజీ సర్పంచ్‌లు కొత్త యాదగిరి గౌడ్, కొత్త ప్రమీల, కాకి భూపాల్, దేవాలయ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకోల్ చంద్రకళా రవీందర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
నవదంపతులకు అంత్యక్రియలు
‘అనంత’లో భార్య, బెంగళూరులో భర్త మృతదేహాలు ఖననం అనంతపురం క్రైం:బెంగళూరు నగరంలో ఈ నెల 1న ఆత్మహత్యకు పాల్పడిన నవదంపతుల్లో భర్త మృతదేహాన్ని అనంతపురం జిల్లాలో, భార్య మృతదేహాన్ని బెంగ ళూరులో ఖననం చేశారు. యువ దంపతులు ఈ అఘాయిత్యానికి పాల్పడడంతో ఇరు కుటుంబాల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. అనంతపురం రూరల్ నారాయణపురం పంచాయతీ పాపంపేటకు చెందిన సుబ్బారెడ్డి, వెంకటలక్ష్మి దంపతుల కుమారుడు సుధాకర్‌రెడ్డి (31), కోడలు గజనీశ్రీ (26) బెంగళూరు శివారులో హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. సెయింట్‌జాన్స్ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం గజనీశ్రీ మృతదేహాన్ని బెంగళూరులో నివాసం ఉంటున్న ఆమె తల్లిదండ్రులు స్వాధీనం చేసుకుని అ క్కడే ఖననం చేశారు. సుధాకర్‌రెడ్డి మృతదేహాన్ని ఆయన తల్లిదండ్రులు, బంధువులు శనివారం రాత్రి అనంతపురంలోని తన ఇంటికి తీసుకొచ్చా రు. ఆదివారం ఉదయం సొంతూరు శింగనమల మండలం ఉల్లికల్లుకు తీ సుకెళ్లి ఖననం చేశారు. కాగా...గజనీశ్రీ నాలుగు నెలల గర్భవతి. కొత్తగా పెళ్లైంది. కలకాలం సుఖ సంతోషాలతో ఉండాల్సిన దంపతులు ఇలా అర్ధంతరంగా తనువు చాలించడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమకు తలకొరివి పెట్టాల్సిన వాడు తమ కళ్లెదుటే మృత్యువాత పడడాన్ని సుధాకర్‌రెడ్డి తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. -
ఎన్కౌంటర్లపై సమగ్ర విచారణ జరిపించాలి
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో 20 మంది ఎర్రచందనం కూలీలను కాల్చి చంపడం, తెలంగాణలో ఉగ్రవాద కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న ఐదుగురు ఖైదీల ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. ఇంతవరకు కీలకమైన ఎర్రచందనం స్మగ్లర్‌ను అరెస్ట్ చేయకపోగా 20 మంది కూలీలను మాత్రం కాల్చి చంపారన్నారు. ఈ స్మగ్లర్లకు సహాయపడడంలో అధికార పార్టీ నాయకులకు సంబంధాలున్నాయనే ఆరోపణలున్నాయన్నారు. అలాగే, సూర్యాపేటలో ఉగ్రవాదుల చేతుల్లో పోలీసులు హతమైనందున.. ప్రతీకార హత్యలుగానే ఐఎస్ఐ ఉగ్రవాదులను చంపినట్లు కనిపిస్తోందన్నారు. -
‘మహా’ మోసంపై కదిలిన యంత్రాంగం
విచారణకు ఆదేశించిన కలెక్టర్ రికార్డులను పరిశీలించిన ఆర్డీవో సుధాకర్‌రెడ్డి సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కరువు జిల్లాగా ప్రభుత్వ ప్రకటనకు అవరోధంగా తయారవుతున్న అక్ర మ పత్తి కొనుగోళ్లపై ‘సాక్షి’ దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన ‘మహా మోసం’ కథనం జిల్లా అధికార యంత్రాంగంలో కదలిక తెచ్చింది. దళారుల అక్రమ దందాపై కలెక్టర్ ఎం.జగన్మోహన్ సీరియస్ అయ్యా రు. ఈ అక్రమంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదిలాబాద్ ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ టి.శ్రీనివాస్ శుక్రవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డులోని సీసీఐ పత్తి రికార్డులను పరిశీలించారు. రైతుల పేరుతో దళారులు ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాల జిరాక్స్‌లను పరిశీలించారు. రైతుల పేరుతో ఎక్కువ మొత్తంలో పత్తిని సీసీఐకి విక్రయించిన దళారులను వెలికితీసేందుకు మార్కెట్ తక్‌పట్టీలను క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీఐకి విక్రయించిన రైతులు జిల్లాకు చెందిన వారేనా..? కాదా..? అనే కోణంలో వివరాలను సేకరించారు. ఈ మేరకు వారి పేర్లను జైనథ్, తాంసి, తలమడుగు తదితర మండలాల తహశీల్దార్లకు వివరించి విచారణ చేపట్టాలని ఆర్డీవో సుధాకర్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత వ్యక్తుల వద్ద స్టేట్మెంట్లను రికార్డు చేయాలని సంబంధిత తహశీల్దార్లకు ఆర్డీవో ఆదేశించారు. అధికారుల ప్రాథమిక పరిశీలనలో ఆసక్తికరమైన అక్రమాలు వెలుగు చూశాయి. తాంసికి చెందిన ఓ దళారి రైతు పేరుతో సుమారు రూ.3.40 లక్షల విలువ చేసే 86 క్వింటాళ్ల పత్తిని విక్రయించినట్లు ప్రాథమికంగా తేలింది. అలాగే 12 క్వింటాళ్ల కెపాసిటీ ఉండే ఆటో 28 క్వింటాళ్ల పత్తిని తెచ్చిన దళారుల లీలలు వెలుగులోకి వచ్చాయి. రైతుల పత్తికి కనీస మద్దతు ధర అందించేందుకు సీసీఐ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇది దళారులకు వరంగా మారింది. సీసీఐ ఇప్పటి వరకు కొనుగోలు చేసిన 43 లక్షల క్వింటాళ్ల పత్తిలో సుమారు ఐదు లక్షల క్వింటాళ్ల వరకు దళారులే విక్రయించారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల రైతుల నుంచి క్వింటాల్‌కు రూ.3,500 చొప్పున కొనుగోలు చేసి, సీసీఐకి రూ.4,050 చొప్పున సీసీఐకి అంటగట్టి సొమ్ము చేసుకున్నారు. మహారాష్ట్రతోపాటు, ఇతర జిల్లాలకు చెందిన పత్తి కూడా పెద్ద మొత్తంలో ఈ కేంద్రాలకు అక్రమంగా దిగుమతి అయ్యింది. ఈ వ్యవహారంలో సంబంధిత అధికారులు కూడా దళారులకు సహకరించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఎక్కడెక్కడో పండిన పత్తి అంతా ఆదిలాబాద్ జిల్లాలోనే పండినట్లు అధికారిక రికార్డులలో ఎక్కుతోంది. దీంతో కరువు జిల్లా ప్రకటనకు తీవ్ర అవరోధంగా మారనుంది. పత్తి విక్రయించిన రైతులకు సీసీఐ చెక్కుల ద్వారా పత్తి డబ్బులు చెల్లిస్తోంది. ఇలా చెక్కుల ద్వారా కాకుండానే నేరుగా రైతుల ఖాతాలో సొమ్మును జమచేసే విధానాన్ని అమలు చేస్తే 99 శాతం వరకు అక్రమాలకు అడ్డుకట్ట పడేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ అధికారులు కొన్ని సాకులు చూపి ఈ విధానాన్ని అమలు చేయలేదు. దీంతో ఇది అక్రమార్కులకు కలిసొచ్చింది. ‘జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పత్తి కొనుగోళ్లలో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపట్టాము. ఈ విచారణ పూర్తయిన తర్వాత నివేదికను కలెక్టర్‌కు అందజేస్తాము..’ అని ఆర్డీవో సుధాకర్‌రెడ్డి ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు. -
నిజాంను కీర్తించడమా?
కేసీఆర్ వ్యాఖ్యలు ఆక్షేపణీయం: సురవరం సాక్షి,హైదరాబాద్: నిజాం రాజును కీర్తిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మాట్లాడడం ఆక్షేపణీయమని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అన్నారు. కాటన్-నిజాంల మధ్య సామ్యం తేవడం ఏమాత్రం సరికాదని, నిజాంను పొగడడం ద్వారా ముస్లింలకు దగ్గర కావాలనుకోవడం పొరబాటు భావన అని అన్నారు. శుక్రవారం మఖ్దూంభవన్‌లో పార్టీ నేతలు చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కొమురం భీమ్‌ను, కమ్యూనిస్టు కార్యకర్తలను చంపిన నిజాంను ఎలా పొగుడుతారని ప్రశ్నించారు. ప్రణాళికా సంఘం స్థానంలో ‘నీతి ఆయోగ్’’ మోదీ తిరోగమన చర్య ప్రణాళిక సంఘం స్థానంలో ‘నీతిఆయోగ్’ను తీసుకురావడం ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న తిరోగమన చర్య అని సురవరం సుధాకరరెడ్డి విమర్శించారు. కార్పొరేట్రంగానికి సానుకూలంగా , దేశ ఆర్థికవ్యవస్థను వారికి అనుకూలంగా మార్చే దుస్సాహసానికి కేంద్రం పాల్పడుతోందని ధ్వజమెత్తారు. -
అంతర్వేదిలో...అఖిల్ స్క్రిప్ట్
అక్కినేని అఖిల్‌ను కథానాయకునిగా పరిచయం చేసే బాధ్యతను తనపై ఉంచిన హీరో నాగార్జున నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. శ్రీ శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు మంగళవారం తూర్పు గోదావరి జిల్లా మలికిపురంలో విలేకరులకు వినాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో సినిమా స్క్రిప్టును పూజలో ఉంచాం. ఫ్యాంటసీ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. వెలిగొండ శ్రీనివాస్ అద్భుతమైన స్క్రిప్ట్ ఇచ్చారు. కోన వెంకట్ సంభాషణలు రాస్తున్నారు. అమోల్ రాథోడ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ప్రస్తుతం కథానాయిక ఎంపిక జరుగుతోంది. త్వరలోనే చిత్రీకరణ మొదలుపెడతాం. అభిమానులు కోరుకునే మాస్, మసాలా అంశాలన్నీ ఇందులో ఉంటాయి. అఖిల్‌లో మంచి నటుడు ఉన్నాడు’’ అని చెప్పారు. -
పింఛన్ల కోసం కలెక్టరేట్ ముట్టడి
సాక్షి నెట్వర్క్: పింఛన్ల కోసం లబ్ధిదారుల ఆందోళనలు గురువారం కూడా కొనసాగాయి. ఉన్న ‘ఆసరా’ కోల్పోతున్నామనే ఆందోళనతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఆదిలాబాద్ కలెక్టరేట్‌ను ముట్టడించారు. బీజేపీ ఆధ్వర్యంలో సుమారు వందమంది కలెక్టరేట్లో నిరసన తెలిపారు. ఆ సమయంలో కలెక్టరేట్లో అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఆర్డీవో చాంబర్ ఎదుట బైఠాయించారు. ఈ నెలాఖరులోగా సమస్య పరిష్కరించి అర్హులైన లబ్దిదారులకు తప్పకుండా న్యాయం చేస్తామని ఆర్డీవో సుధాకర్‌రెడ్డి సర్దిచెప్పారు. అనంతరం ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. అలాగే, ఉట్నూర్ ఎంపీడీవో కార్యాలయం ఎదుట, మందమర్రిలో ఆందోళనలు జరిగాయి. రంగారెడ్డి జిల్లాలో... పలు పార్టీల ఆధ్వర్యంలో గురువారం రంగారెడ్డి జిల్లా కందుకూరులో వికలాంగులు, వితంతువులు, వృద్ధులు భారీగా తరలివచ్చి, శ్రీశైలం రహదారిపై బైఠాయించారు. పోలీసులు ఆందోళనకారులను పంపించి వేశారు. పింఛన్ రాదేమోనని.. ఏడుగురి మృతి పింఛన్ జాబితాలో తమ పేరులేదని, పింఛన్ రాదేమోననే మనస్తాపంతో గురువారం ఏడుగురు మృత్యువాత పడ్డారు. కరీంనగర్ జిల్లా బోర్నపల్లికి చెందిన గుగ్గిళ్ల రాజమల్లు(74), జగన్నాథపూర్‌కు చెందిన నగరబోయిన గట్టయ్య(71), వేగురుపల్లికి చెందిన అమరగోని భూమమ్మ(75), మహబూబ్‌నగర్ జిల్లా రాజనగరం గ్రామానికి చెందిన రంగం అబ్దులమ్మ (68), ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండకు చెందిన చౌహాన్ లాలసింగ్ (70), నల్లగొండ జిల్లా మరిపడిగ గ్రామానికి చెందిన తాటి సాయిలు (72), నిజామాబాద్ జిల్లా సుద్దపల్లి గ్రామానికి చెందిన మేకల లక్ష్మి (68) పింఛన్ రాదేమోనని ఆందోళనతో మృతి చెందారు. -
వేగంగా నడిచే కీటకం..
తాటికొండ సుధాకర్ రెడ్డి సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్ జంతు ప్రపంచం మొక్కల తర్వాత జంతుజాలం ఆవిర్భవించింది. భూగోళం ఏర్పడి సుమారు 4.5 బిలియన్ ఏళ్లు అయింది. సుమారు 3.5 బిలియన్ ఏళ్ల క్రితం జీవజాలం ఏర్పడింది. జంతువులు విభిన్న మార్పులకు గురై వివిధ రకాలుగా, వర్గాలుగా విభజితమై విస్తరించాయి. జంతువులను ముఖ్యంగా వాటిలో ఉండే వెన్నెముక ఉనికి ఆధారంగా వర్గీకరించారు. వెన్నెముక లేని వాటి ని అకశేరుకాలు (నాన్ కార్డేటా) అని, వెన్నెము క ఉన్న వాటిని సకశేరుకాలు (కార్డేటా) అని వర్గీకరించారు. అకశేరుకాలను 9 వర్గాలుగా, సకశేరుకాలను ఐదు వర్గాలుగా విభజించారు.ఙఞ్చటఐ అకశేరుకాలు (నాన్ కార్డేటా) 1) ప్రోటోజోవా 2) పొరిఫెరా 3) సీలింటరేటా (నిపేరియా) 4) ప్లాటి హెల్మింథిస్ 5) నిమాటి హెల్మింథిస్ 6) అనిలిడా 7) ఆర్థ్రోపొడా 8) మొలస్కా 9) ఇఖైనోడర్మేటాఙఞ్చటఐఐ. సకశేరుకాలు (కార్డేటా) 1) చేపలు 2) ఉభయచరాలు 3) సరీసృపాలు 4) పక్షులు 5) క్షీరదాలు ఐ. అకశేరుకాలుఙఞ్చట1. {పోటోజోవా: ఇవి సాధారణంగా ఏక కణజీవులు. కొన్ని సమూహాలుగా నివసిస్తా యి. వీటిలో చలనాంగాలు మిద్యాపాదా లు, కశాబాలు, శైలికలు మొదలైనవి. ఉదా: అమీబా- మిద్యాపాదం, యూస్లీనా - కశాబాలు, పారమీసియం, వర్టిసెల్లా - శైలికలు. ప్లాస్మోడియం మానవునిలో మలేరియా వ్యాధిని కలిగిస్తుంది. ఈ వ్యాధి ఆడ అనాఫిలిస్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఎంటామిబా హిస్టాలిటికా అనే మరొక జీవి మానవునిలో అమీబియాసిస్ (జిగట విరోచనాలు)కు కారణమవుతుంది. ప్రోటోజోవాలు మానవునిలో కలిగించే వ్యాధులుఙఞ్చట2. పోరిఫెరా: వీటి దేహంపైన ఒకే రకమైన అనేక సూక్ష్మ రంధ్రాలుంటాయి. కణజాలం ఏర్పడదు. ఉదా:యూస్పాంజియా(ఆ్చ్టజి ఞౌజ్ఛ), స్పాంజిల్లా (ఊట్ఛటజి గ్చ్ట్ఛిట ఞౌజ్ఛ)ఙఞ్చట3. సీలింటరేటా: ఇవి బహుకణ, కణజాల, జీర్ణ వ్యవస్థ మొదలైన అంశాలను కలిగిన జీవులు. ఇవి ద్విస్తరిత జీవులు. ఉదా: హైడ్రా, ఆరేలియా (ఒ్ఛడ ఊజీటజి), మెట్రీడియం (్ఛ్చ ్చ్ఛఝ్ఛౌ).ఙఞ్చట4. ప్లాటీహెల్మింథ్స: వీటిని సాధారణంగా బద్దె పురుగులు అంటారు. ఇవి రిబ్బన్ మాదిరిగా లేదా టేప్ మాదిరిగా కనిపిస్తాయి. ఉదా: టీనియాసోలియం, ఫేసియోలా, షిస్టోసోమా మొదలైనవి. పూర్తిగా ఉడికించని పంది, ఎద్దు, చేప మొదలైన వాటి మాంసాన్ని తిన్నప్పుడు మానవునిలో టీనియాసిస్ వస్తుంది. ఇది కండరాలపై ప్రభావాన్ని చూపుతుంది.ఙఞ్చట5. నిమాటి హెల్మింథిస్: వీటిని సాధారణంగా నులిపాములు, ఏలికపాములు, రౌండ్ వార్మ్స మొదలైన పేర్లతో పిలుస్తారు. ఇవి ముఖ్యంగా చిన్నపిల్లలు, పశువుల (దూడల) జీర్ణమండలంలో ఉంటూ జీర్ణమైన ఆహారాన్ని తీసుకుంటాయి. ఫలితంగా వచ్చే వ్యాధి ఆస్కారియాసిస్. ఉదా: ఆస్కారిస్ (ఖౌఠఛీ గిౌటఝ), ఎంభైలోస్టోమా (ఏౌౌజు గిౌటఝ). ఉచరేరియా బ్రాంభాప్టి అనేది కూడా ఈ వర్గానికి చెందినదే. ఇది మానవుడిలో బోదకాలు/ఫైలేరియాసిస్ను కలిగిస్తుంది. దీన్నే ఎలిఫెంటియాసిస్ అని కూడా అంటారు. ఇది క్యూలెక్స్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఫైలేరియా అనేది ఉచరేరియా డింభకం కాబట్టి ఈ వ్యాధిని ఫైలేరియాసిస్ అంటారు.ఙఞ్చట6. అనిలిడా: వీటి దేహం గుండ్రటి ఉంగరాల వంటి నిర్మాణాలతో నిర్మితమై ఉంటుంది. వీటి చలనం కోసం తోడ్పడే నిర్మాణాలు - సీటాలు. ఉదా: వానపాము, జలగ. సాధారణంగా భారతదేశంలో కనిపించే వానపాములు.. పెరిటిమా పోస్తుమా, మెగాస్కోలెక్స్. వానపాములో ఉభయ లైంగికత్వం ఉం టుంది. వీటిలో పునరుత్పత్తి జరుగుతుంది. చర్మం ద్వారా శ్వాసించుకుంటుం ది. దీని గుండె గదుల సంఖ్య 8 జతలు. వానపాములో ఎర్ర రక్తకణాలు ఉండవు. వీటి రక్తంలో హిమోగ్లోబిన్ ప్లాస్మాలో ఉంటుంది. ఆధునిక క్యాన్సర్ చికిత్సలో జలగలను ఉపయోగిస్తున్నారు.ఙఞ్చట7ఆర్థ్రోపొడా: జంతురాజ్యంలో అతి పెద్ద వర్గం. వీటిలో కీటకాలు ఉంటాయి. కీటకాల అధ్యయనాన్ని ఎంటమాలజీ అంటా రు. వీటిలో మూడు జతల కాళ్లు ఉంటా యి. ఒకటి లేదా రెండు జతల రెక్కలు ఉంటాయి. వీటిలో బాహ్య అస్థిపంజరం ఉంటుంది. శ్వాసక్రియ వాయునాళాల ద్వారా జరుగుతుంది. కీటకాల్లో 10 జతల వాయునాళాలు ఉంటాయి. సాలీడులో 4 జతల కాళ్లు ఉంటాయి. కీటకాల్లో రూపవిక్రియ ఉంటుంది. కొన్ని ముఖ్యమైన కీటకాలు..ఙఞ్చటఎ) పట్టు కీటకం (బాంబిక్స్మోరి): వీటి సాగు (పెంపకం)ను సెరికల్చర్ అంటారు. పట్టు ను మొదట కనుగొన్న దేశం చైనా. ఇండియాలో పట్టు ఉత్పత్తిలో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. పట్టు కీటకం ఆహారం మల్బరీ, ఆముదం ఆకులు. కీటకం ప్యూపా (కోశస్థదశ) దశ నుంచీ పట్టు లభిస్తుంది. పట్టులో ఉండే ప్రోటీన్ - సిరిన్. టస్సార్, ఈరి, ముంగా అనే పట్టు కీటకాలు నాసిరకం పట్టును ఉత్పత్తి చేస్తాయి. బి) తేనెటీగలు: తేనెటీగల పెంపకాన్ని ఎపికల్చర్ అంటారు. ఎపిస్ మిల్లిఫెరా, ఎపిస్ ఇండికా అనే తేనెటీగలను ఎక్కువగా పెంచుతారు. తేనెటీగలు మూడు రకాలు 1) రాణి 2) డ్రోన్స 3) కూలి ఈగలు. డ్రోన్స తేనెటీగలు అనిషేక జననం ద్వారా ఏర్పడి ఏకస్థితికంలో ఉంటాయి. రాణి ఈగ చనిపోయినప్పుడు కూలి ఈగల్లో ఒకటి రాణి ఈగగా మారుతుంది. సి) లక్క కీటకం (లాక్సీఫర్లాక్): ఇది రేగు, తుమ్మ, మోదుగ మొదలైన చెట్లపైన పెరుగుతుంది. లక్క ఉత్పత్తిలో ఇండియాది మొదట స్థానం. ప్రపంచంలో సుమారు 70 శాతం లక్క ఇండియాలోనే ఉత్పత్తి అవుతుంది. లక్కను ఎక్కువగా అద్దకం పరిశ్రమ, సీళ్లు వేసేందుకు, కొన్ని అలంకరణ వస్తువులు తయారు చేసేందుకు ఉపయోగిస్తారు. రూప విక్రియలో ఉండే దశలు 1) గుడ్డు 2) లార్వా (డింభకం) 3) ప్యూపా (కోశస్థదశ) 4) ఇమానో (ప్రౌఢదశ) వేగంగా నడిచే కీటకం - బొద్దింక. గుడ్ల పెట్టెను కలిగిన కీటకం - బొద్దింక. జీవితాంతం విసర్జన చేయని జీవి సిల్వర్ ఫిష్. ఈగ లార్వా-మాగటి, దోమలార్వా-రిగ్లర్.ఙఞ్చట8. మొలస్కా: మొలస్కా అంటే మాంసపు ముద్ద అని అర్థం. జంతు రాజ్యంలో రెండో అతిపెద్ద వర్గం. వీటి దేహంపైన కర్పరం (జ్ఛి) అనే ఇ్చఇౌ3తో నిర్మితమైన రక్షక కవచం ఉంటుంది. కర్పరాల అధ్యయనాన్ని కాంకాలజీ అంటారు. వీటిలో రక్తం నీలం రంగులో ఉంటుంది. ఉదా: నత్తలు, ఆల్చిప్పలు. నత్తల అధ్యయనాన్ని మెలకాలజీ అంటారు. ఆల్చిప్పల్లో ముత్యాలు తయారవుతాయి. ముత్యాల రసాయనిక రూపం ఇ్చఇౌ3. కటిల్‌ఫిష్, డెవిల్ ఫిష్ అ నేవి కూడా మొలస్కా వర్గానికి చెందినవే.ఙఞ్చట9. ఇఖైనో డర్మేటా: ఇవి సముద్రజీవులు. వీటి చర్మంపైన దృఢమైన కంఠకాలు ఉంటా యి. వీటిలో కుల్యావ్యవస్థ ఉంటుంది. ఉదా: సముద్ర నక్షత్రం, సీఅర్చిన్స, సీ లిల్లీ, సీ కుకుంబర్స మొదలైనవి. వ్యాధి వ్యాధి జనకం వ్యాప్తి చేసే జీవి/కారకంఙఞ్చట1. అతినిద్రా జాడ్యం {sిపానోసోమా - గాంబియెన్సి సీ- సీ ఈగ (్ఛ్ఛఞజీజ జీఛిజ్ఛుటట/ లేదా ట్రిబ్రూసిఙఞ్చటఖీటడఞ్చౌటౌఝజ్చీటజీట)ఙఞ్చట2. ఓరియెంటల్ సోర లీష్మానియా - ట్రాపికా సాండ్ ఫై్ల (డిల్లీ బోయిల్)ఙఞ్చట3. కాలా అజార్ లీష్మానియా డోనో - వాని సాండ్ ఫై్ల (బ్లాక్ సిక్నెస్)ఙఞ్చట4. డయేరియా జియార్డియా -ఇంటెస్టినాలిస్ తాగునీరు, ఆహారం (జియార్డియాసిస్) ఐఐ.సకశేరుకాలు: వీటిలో నిర్థిష్టమైన వెన్నెముక ఉంటుంది.ఙఞ్చట1)చేపలు: చేపల అధ్యయనాన్ని ఇక్తియాలజీ అంటారు. చేపల స్వర్ణయుగం డివోనియన్ కాలం. చేపల చలనాంగాలు వాజాలు. చేపలు శీతల రక్త జంతువులు. చేప గుండె గదుల సంఖ్య రెండు. చేపలు మొప్పల ద్వారా శాసిస్తాయి. చేపల్లో మృదులాస్థి చేపలు, ఎముక చేపలు అనే రెండు రకాలుంటాయి. చేపల్లో లభించే విటమిన్స అ, ఈ. చేపల ఉత్పత్తిని పెంచడానికి ప్రవేశపె ట్టిందే నీలి విప్లవం. కొన్ని ముఖ్యమైన చేపలు.. అతి పెద్ద చేప - సొర చేప అతి చిన్న చేప - మిస్టిక్ థిస్ వేగంగా ఈదే చేప - సెయిల్ఫిష్ ఎగిరే చేప - ఎక్సోలోటస్ మురికి గుంటల్లో పెరిగే చేప - గంబూసియా (కౌట్ఞఠజీౌ్ట ఊజీటజి) నీటి గుర్రం - హిప్పోకాంపస్ ఎలక్ట్రిక్రే - టార్పిడోఙఞ్చట2. ఉభయ చరాలు: ఇవి నీటిలో, నేలపైన జీవించే జంతు సముదాయం. ఉదా: కప్ప(రాణా), గోదురు కప్ప(టోడ్). కప్ప అధ్యయనాన్ని బాట్రకాలజీ అంటా రు. ఇవి కూడా శీతల రక్త జంతువులు. వీటిలో గుండె గదుల సంఖ్య మూడు. వీటిలో మలిన రక్తం ఉంటుంది. వీటిలో రెండు పూర్వాంగాలు, రెండు చరమాంగాలు ఉంటాయి. స్వరకోశాలు, ఆంప్లిక్సరి మెత్తలు మగ కప్పల్లో మాత్రమే ఉంటా యి. కప్పల్లో ఎండాకాలం గ్రీష్మకాల సుప్తావస్థ, శీతాకాలంలో శీతాకాల సుప్తావస్థ ఉంటుంది. కప్పల్లో చర్మ, పుపుస శ్వాసక్రియ ఉంటుంది. కప్పలో రూప విక్రియ థైమస్ గ్రంథి (థైరాక్సిన్) ద్వారా జరుగుతుంది. అండ కణాల సముదాయాన్ని స్పాన్ అని, శుక్రకణాల సముదాయాన్ని మిల్ట్ అని అంటారు.ఙఞ్చట3. సరీసృపాలు: వీటిలో బల్లులు, తొండలు, ఉడుము, మొసలి, పాములు మొదలైన జంతువులుంటాయి. సరీసృపాల అధ్యయనాన్ని హెర్పటాలజీ అని, బల్లుల అధ్యయనాన్ని సారాలజీ అని అంటారు. పాముల అధ్యయనాన్ని సర్పెంటాలజీ లేదా ఓఫిడాలజీ అంటారు. సరీసృపాలు శీతల రక్త జంతువులు. సరీసృపాల గుండె గదుల సంఖ్య 4. ఇవి అవిభక్తంగా ఉంటాయి. మొసలిలో 4 గుండె గదులుంటాయి. సరీసృపాల్లో డైనోసారులు వేగంగా వృద్ధి చెంది అదేవిధంగా అంతరించిపోయాయి. డైనోసారులు జురాసిక్ యుగానికి చెందినవి. డైనోసారులు అంటే టెర్రిబుల్ లజార్డ అని అర్థం. పాముల చలనాంగాలు వాటి కింది భాగంలోని అడ్డు పొలుసులు. విషసర్పం కాటు వేస్తే ఒకటి లేదా రెండు గాట్లు, విష రహిత సర్పం కాటు వేస్తే అనేక గాట్లు పడతాయి. విషసర్పం కాటు వేస్తే పాలివీనం, ఆంటివీనం ఇంజక్షన్స చేస్తారు. నాగుపాము విషం (కోబ్రాడిన్) నాడీ వ్యవస్థపైన, రక్తపింజర విషం (వైపరిడిన్, రక్త ప్రసరణ వ్యవస్థపైన ప్రభావాన్ని చూపుతాయి. అత్యంత విషపూరితమైన సర్పం.. సముద్ర సర్పం. సరీసృపాలు అండోత్పాదకాలు.కానీ రక్త పింజర, కొండ చిలువ శిశోద్పాదకాలు. తాబేలు ఎక్కువ జీవిత కాలాన్ని కలిగి ఉంటుంది.ఙఞ్చట4. పక్షులు: పక్షుల అధ్యయనాన్ని ఆర్నిథాలజీ అంటారు. పక్షులు ఎగరడానికి వాయుపూరిత ఎముకలు, ఉడ్డయక కండరాలు తోడ్పడతాయి. ఇవి ఉష్ణరక్త జంతువులు. ఇవి మిగతా జంతువుల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. పక్షులకు దంతాలుండవు. వీటి గుండె గదుల సంఖ్య నాలుగు. పక్షులు అండోత్పాదకాలు. వీటిలో పొదుగు కాలం ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పక్షులు అతిపెద్ద పక్షి - ఆస్ట్రిచ్ (నిప్పుకోడి) అతి చిన్నపక్షి - హమ్మింగ్ బర్డ వేగంగా నడిచే పక్షి - ఆస్ట్రిచ్ వేగంగా ఎగిరే పక్షి - స్విఫ్ట్ వెనుకకు ఎగిరే పక్షి - హమ్మింగ్ బర్డ భారతదేశ జాతీయ పక్షి - నెమలి (పావో క్రిస్పేటస్) రాష్ర్ట పక్షి -పాలపిట్ట యూఎస్ఏ జాతీయ పక్షి - ఈగల్ న్యూజిలాండ్ జాతీయ పక్షి - కివిఙఞ్చట5. క్షీరదాలు: వీటి అధ్యయనాన్ని మామాలజీ అంటారు. వీటి దేహంపైన వెంట్రుకలు ఉంటాయి. వీటి రొమ్ము, పొట్ట భాగాలను వేరుచేస్తూ ఉదారవితానం అనే పొర ఉంటుంది. ఇవి ఉష్ణరక్త జంతువులు. వీటి గుండె గదుల సంఖ్య నాలుగు. క్షీరదాల్లో గర్భావధికాలం ఉంటుంది. గర్భావధి కాలం సుమారుగా.. ఏనుగు-660 రోజులు (అత్యధిక గర్భావధి కాలం) గుర్రం - 330 రోజులు ఆవు, మనిషి- 270 రోజులు గొర్రెలు, మేకలు - 150 రోజులు పిల్లి, కుక్క - 60 నుంచి 70 రోజులు కుందేలు - 30 రోజులు ఎలుక - 21 రోజులు అపోసం-12 రోజులు (అత్యల్ప గర్భావధి కాలం) కొన్ని క్షీరదాలు గుడ్లు పెట్టి పాలిచ్చేవి ఉన్నాయి. ఎభిడ్నా: దీన్ని ముళ్ల పంది లేదా సై్పనీ అంట్ ఈటర్ అంటారు. ఇది ఎక్కువగా న్యూజిలాండ్, టాస్మేనియా దేశాల్లో కనిపిస్తుంది. ప్లాటిపస్: దీన్ని బాతుముక్కు ప్లాటిపస్ అంటారు. ఇది కూడా న్యూజిలాండ్, టాస్మేనియా దేశాల్లో సంచరిస్తుంది. వీటిలో గైనకోమాస్టిజం (ఆడ, మగ జీవులు పాలిచ్చుట) కనిపిస్తుంది. కంగారూలు ఆస్ట్రేలియాలో విరివిగా ఉంటాయి. దీని పొట్టపైన శిశుకోశం ఉం టుంది. దీనిలో అపరిపక్వ శిశువు వృద్ధి చెందుతుంది. ఆస్ట్రేలియాను లాండ్ ఆఫ్ మార్సూపియేల్స్ అంటారు. జంతురాజ్యంలో అతిపెద్ద జంతువు - నీలితిమింగలం నేలపైన అతిపెద్ద జంతువు - ఏనుగు అతి వేగంగా పరుగెత్తే జంతువు - చిరుత నెమ్మదిగా నడిచే జంతువు - స్లాట్ జాతీయ జంతువు - పులి ఎతై్తన జంతువు - జిరాిఫీ తెలివైన జంతువు - మనిషి -
వామపక్ష ఐక్యత కోసం కృషి చేయాలి
తెలంగాణ సీపీఐ సమావేశంలో నిర్ణయం హైదరాబాద్ : రాష్ట్రంలో వామపక్ష, అభ్యుదయశక్తులు, మేధావులు, ఆయా సంఘాలను కలుపుకొని రాజకీయ ప్రత్యామ్నాయాన్ని సాధించే క్రమంలో ముందుకు సాగాలని, వామపక్ష ఐక్యత కోసం కృషిచేయాలని సీపీఐ నిర్ణయించింది. రాబోయే రోజుల్లో బూర్జువా పార్టీలతో రాజకీయ పొత్తు, అవగాహన ఉండబోదని, గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తును గుణపాఠంగా తీసుకుని ముందుకు సాగాలని సీపీఐ తీర్మానించింది. వచ్చే మార్చి 7-10 తేదీల మధ్య జరగనున్న తెలంగాణ తొలి రాష్ట్ర మహాసభల ఏర్పాట్లు, గ్రామశాఖల నుంచి రాష్ర్టస్థాయి వరకు నిర్వహించాల్సిన మహాసభల ఏర్పాట్లపై చర్చించేందుకు తెలంగాణ సీపీఐ విస్తృత కార్యవర్గసమావేశం మంగళవారం మఖ్దూంభవన్‌లో జరిగింది. ఆదిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ముఖ్యఅతిథిగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కె.నారాయణ, అజీజ్‌పాషా, కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, గుండా మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వామపక్షాలు నిర్వహించాల్సిన పాత్రపై ఇటీవల వామపక్ష మేధావులు, ఇతర ప్రముఖులతో నిర్వహించిన భేటీలో వెల్లడైన అభిప్రాయాలను గురించి చాడ వెంకటరెడ్డి వివరించారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు వామపక్షాల మధ్య ఐక్యతను సాధించడం, వివిధ సమస్యలపై పోరాడుతున్న కులసంఘాలు, మేధావులు, కలిసొచ్చే వామపక్ష అభిమానులను వెంట తీసుకెళ్లడంపై పార్టీ విధానాన్ని ఆయన ఈ భేటీలో వివరించినట్లు సమాచారం. ఈ నెలలో గ్రామశాఖ మహాసభలు, వచ్చేనెలలో మండలశాఖ మహాసభలు, జనవరిలో జిల్లా శాఖ మహాసభలను పూర్తిచేసుకుని రాష్ట్రమహాసభలకు సిద్ధం కావాలని సమావేశంలో నిర్ణయించారు. -
ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు
కరీంనగర్ : సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే ముఖ్య భూమిక అని, ప్రభుత్వ విద్య పరిరక్షణకు ఉపాధ్యాయులు నడుం బిగించాలని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో 45 మందికి జ్ఞాపికలు అందించి సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, నాణ్యమైన విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిసారించారని స్పష్టం చేశారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్భంద విద్య ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు ఉపాధ్యాయులు సహకరించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయండి - ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి ఉపాధ్యాయులను కోరారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సర్వీసు రూల్స్ విషయం త్వరలో తేలిపోతుందన్నారు. దీపావళిలోగా పీఆర్సీ వస్తుందని స్పష్టం చేశారు. నవ తెలంగాణ నిర్మాణానికి బాటలు వేయండి - జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ విద్యార్థులకు ఉత్తములుగా తీర్చిదిద్దుతూ నవ తెలంగాణ నిర్మాణం కోసం ఉపాధ్యాయులు బాటలు వేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ సూచించారు. పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పిస్తామని, బోధన, బోధనేతర సిబ్బందిని నియమిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిది - రసమయి బాలకిషన్, మానకొండూర్ ఎమ్మెల్యే తెలంగాణ సాధనలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని, విద్యాబోధనలోనూ అదే స్ఫూర్తి ప్రదర్శించాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అన్ని సమస్యలు తెలుసున్నారు. ఉపాధ్యాయుడిగా తాను పనిచేశానని, వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థుల సంఖ్య తగ్గడం విచారకరం - కలెక్టర్ వీరబ్రహ్మయ్య ప్రభుత్వ పాఠశాలల్లో భోజనవసతి, యూనిఫామ్, స్కాలర్షిప్స్, పుస్తకాలు మెరుగైన వసతులు కల్పిస్తున్నా విద్యార్థుల సంఖ్య తగ్గడం విచారకరమని కలెక్టర్ వీరబ్రహ్మయ్య అన్నారు. గత సంవత్సరం కన్న ఈ విద్యా సంవత్సరం 20 వేల మంది విద్యార్థుల సంఖ్య తగ్గడం బోధపడటం లేదని అన్నారు. గురువును మించిన దైవం లేదు - సర్దార్ రవీందర్‌సింగ్, కరీంనగర్ మేయర్ ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనదని కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ అన్నారు. డీఈవో లింగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీవో చంద్రశేఖర్, డీఎస్పీ రవీందర్, ఎస్ఏ పీవో రాజమౌళి, డెప్యూటీ ఈవోలు బి.భిక్షపతి, బి.జయవీర్రావు, ఉపాధ్యాయ సంఘాల నేతలు లక్ష్మారెడ్డి, మహేందర్‌రెడ్డి, నూలి మురళీధర్‌రావు, కొమ్ము రమేశ్, పోరెడ్డి దామోదర్‌రెడ్డి, కిషన్‌నాయక్ ఉన్నారు. -
తిరుపతి ఎంపీపీపై అనర్హతవేటు
మరో ఇద్దరు ఎంపీటీసీ సభ్యులపై కూడా.. విప్‌ను ధిక్కరించినందుకే! జెడ్పీ మీటింగ్‌కు రానీయకుండా అడ్డుకునేందుకే జెడ్పీకి సమాచారం చిత్తూరు(టౌన్): తిరుపతి మండలాధ్యక్షునిపై అనర్హ త వేటు పడింది. విప్‌ను ధిక్కరించిన నేరానికి ఎంపీపీతో పాటు మరో ఇద్దరు ఎంపీటీసీ సభ్యులపై అనర్హత వేటు వేసినట్టు ఆ మండల ఎన్నికల ప్రిసైండిం గ్ అధికారి, ఎంపీడీవో సుశీలాదేవి జిల్లా పరిషత్‌కు సమాచారాన్ని అందజేశారు. జిల్లాలోని అన్ని మం డల పరిషత్‌లకు జరిగిన ఎన్నికల్లో భాగంగా తిరుప తి రూరల్ మండలంలో మొత్తం 40 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వాటిలో 21 ఎంపీటీసీ స్థా నాలను అధికారపార్టీ దక్కించుకోగా, 14 స్థానాలను వైఎస్ఆర్ సీపీ, ఒకదాన్ని సీపీఎం, నాలుగింటిని ఇం డిపెండెంట్లు గెలుచుకున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ సభ్యులతో పాటు ఇండిపెండెంట్ల మద్దతుతో టీడీపీ కి చెందిన మునికృష్ణయ్య ఎంపీపీగా ఎన్నికయ్యారు. అతనికి టీడీపీకి చెందిన ఉష, సుధాకర్‌రెడ్డి మద్దతు లభించింది. దీంతో మునికృష్ణయ్య ఎంపీపీగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమమయ్యింది. అయితే దీ న్ని అవమానంగా భావించిన అధికారపార్టీ నాయకులు తమ పార్టీ తిరుగుబాటు అభ్యర్థులుగా తయారైన వారిపై చర్యలు తీసుకుని వారిని తొలగించేందుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యం లో తమ పార్టీ సభ్యుల ద్వారా విప్ జారీ చేయించా రు. ఆ తర్వాత పైస్థాయిలో నుంచి జిల్లా, మండల ప్రిసైడింగ్ అధికారులపై ఒత్తిళ్లు తెప్పించారు. ఎట్టకేలకు వారి ప్రయత్నాలు ఫలించడంతో ఎంపీపీగా ఎ న్నికైన మునికృష్ణయ్య, అతనికి మద్దతిచ్చిన ఎంపీటీ సీ సభ్యులు ఉష, సుధాకర్‌రెడ్డిపై అనర్హత వేటు ప డింది. వారిని ఎంపీటీసీ సభ్యత్వాల నుంచి కూడా తొలగిస్తున్నట్టు ఈ నెల 28న ఆదేశాలు జారీ చేసిన ట్టు జెడ్పీకి అందిన సమాచారం బట్టి తెలుస్తోంది. వి ప్ ధిక్కరించినట్టు తమకు అందిన ఫిర్యాదు మేరకు వారిపై అనర్హత వేటువేస్తూ చర్యలు తీసుకున్నట్టు తిరుపతి రూరల్ మండల ప్రిసైండింగ్ అధికారి, ఎంపీడీవో సుశీలాదేవి ఫోన్లో వివరించారు. వీరిని ఎంపీటీసీ సభ్యత్వాల నుంచి కూడా తొలగిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. జెడ్పీ మీటింగ్‌కు రాకుండా అడ్డుకునేందుకే.. ఆదివారం జరగనున్న జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్యసమావేశంలో తిరుపతి ఎంపీపీ హాజరు కాకుండా చూడాలని అధికారపార్టీ నాయకులు తీవ్రంగా ప్ర యత్నించి సఫలమయ్యారని తెలిసింది. పార్టీ అధికారంలో వుండికూడా అవకాశమున్న ఎంపీపీని చేజిక్కించుకోలేకపోయామనే ఆవేదన చంద్రగిరి నియోజకవర్గ అధికారపార్టీ నేతలను ఎంతో కలవరపెట్టింది. అందులో భాగంగానే వీలైనంత త్వరగా అతనిపై వేటుపడేటట్లు చేసి జెడ్పీ మీటింగ్హాలులోకి అడుగుపెట్టకుండా చేయాలని భీష్మించుకుని కూర్చున్నట్టు తెలిసింది. దీంతో విప్ జారీచేయడం, వెనువెంటనే జిల్లా అధికారులపై ఒత్తిడితెచ్చి అనర్హత వేటుపడేటట్లు చర్యలు తీసుకుని తద్వారా ప్రతీకారం తీర్చుకున్నారని తెలిసింది. అయితే దీనివెనక మాజీమంత్రి గల్లా అరుణకుమారి హస్తమున్నట్లు స్పష్టమవుతోంది. -
అవినీతి సొమ్ముతో రాజకీయాల్లోకి రాలేదు
- బ్లాక్మెయిల్ చేసే మనస్తత్వం ఎమ్మెల్యే సంజీవయ్యకు లేదు - వైఎస్సార్సీపీ నాయకుల ధ్వజం సూళ్లూరుపేట: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధికారులను బ్లాక్ మొయిల్ చేశారని, అవినీతి సొమ్ముతో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యారని టీడీపీ మండల అధ్యక్షుడు, న్యాయకోవిదులు తిరుమూరు సుధాకర్‌రెడ్డి విమర్శించడం గురువింద సామెతను తలపింపజేస్తుందని వైఎస్సార్సీపీ నేత దబ్బల రాజారెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ నాయకులు కిలివేటిపై చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. ప్రజావిశ్వాసం కోల్పోయి ఎన్నికల్లో ఓడిపోయిన పరసా వెంకటరత్నయ్య జన్మదిన వేడుకలకు నియోజకవర్గంలోని ఆరు మండలాల అధికారులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా విధులకు డుమ్మాకొట్టి పాల్గొనడం ఏ రాజ్యాంగంలో ఉందో? న్యాయకోవిదులైన సుధాకర్‌రెడ్డి చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. అధికారం ఉందని టీడీపీ నాయకులు ఎమ్మెల్యేను నిర్లక్ష్యం చేయడమే కాకుండా ప్రొటోకాల్ పాటించకుండా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం తప్పుకాదా అని ప్రశ్నించారు. తడ మండల కన్వీనర్ మారంరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, ఎంపీపీ షేక్ షమీమ్, నలుబోయిన రాజసులోచనమ్మ, గండవరం సురేష్‌రెడ్డి, సుల్తాన్‌బాషా, రఘు, మురుగన్, గోగుల తిరుపాలు, వార్డు కౌన్సిలర్లు నలుబోయిన చిట్టిబాబు, ఉమ్మిటి జానకీరామ్, ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. దళిత వ్యతిరేకి పరసానే: సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా 15ఏళ్ల పాటు పని చేసిన పరసా ఏనాడైనా దళితులకు మేలు చేశారా అని వైఎస్సార్సీపీ దళిత నాయకుడు, మండల ఉపాధ్యక్షు డు శ్రీహరికోట చెంగయ్య, కౌన్సిలర్ పాలా మురళి ప్రశ్నించారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఎమ్మెల్యే కిలివేటి దళితులందరినీ కలుపుకుని పోతుంటే ఆయనను దళిత వ్యతిరేకి అని ఎలా అంటారని ప్రశ్నించారు. సుధాకర్‌రెడ్డి లాంటి వ్యక్తులు లేనిపోని ఆరోపణలతో విమర్శలు చేస్తే తగిన రీతిలో ఆయనకు సమాధానం చెబుతామని హెచ్చరించారు. కౌన్సిలర్లు ముత్తుకూరు లక్ష్మమ్మ, పేర్నాటి దశయ్య, తొప్పాని మధు, గునిశెట్టి చిరంజీవి, వాటంబేటి నాగయ్య, ముత్తుకూరు రవి పాల్గొన్నారు. -
నీరు ఇవ్వలేం
‘శ్రీరాంసాగర్’ ఆయకట్టులో వరికి సెలవే రైతులకు అవగాహన కల్పిస్తున్నాం చిన్న కాల్వలను ఆధునికీకరిస్తాం ఎస్సారెస్పీ ఎస్ఈ సుధాకర్‌రెడ్డి ‘ఈ ఖరీఫ్‌లో శ్రీరాంసాగర్ ఆయకట్టుకు కాల్వల ద్వారా నీటి విడుదల సాధ్యం కాదు. ప్రాజెక్టులోకి ఇప్పుడు చుక్క ఇన్‌ఫ్లో లేదు. ఆగస్టు నెలపై చాలా ఆశలు పెట్టుకున్నాం. కానీ.. వరుణుడు కరుణించడం లేదు. ఈ నేపథ్యంలో జిల్లాకు సాగునీరు ఇవ్వలేం. ఆయకట్టు రైతులు ఈ ఖరీఫ్‌లో క్రాప్‌హాలిడే ఇవ్వాల్సిందే.’ అని ఎస్సారెస్పీ ఎస్ఈ సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం కూడా ఖరీఫ్ ప్రణాళిక అడగలేదని, ఖరీఫ్‌లో కాల్వ నీటిపై రైతులు ఆశలు పెట్టుకోవద్దని తేల్చిచెప్పారు. హన్మకొండ : ‘శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 23.3 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రాజెక్టులో కనీసం 70 టీఎంసీలు ఉంటేనే సాగునీరు విడుదల చేస్తాం. మహారాష్ట్ర ఎగువన వర్షాలు లేకపోవడంతో ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి నీరు రావడం లేదు. ఈ పరిస్థితిలో జిల్లాకు సాగునీరు ఇవ్వలేం’ అని ఎస్సారెస్పీ ఎస్ఈ సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎస్సారెస్పీ ఆయకట్టు సాగుపై ‘సాక్షి’ మంగళవారం నిర్వహించిన ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే... జిల్లాలో ఎస్సారెస్పీ కాల్వల కింద 4.24 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కాల్వలు కొంత అధ్వానంగా ఉండడంతో ప్రతి సీజన్లో 3 లక్షల ఎకరాల వరకు నీటిని సరఫరా చేయగలుగుతున్నాం. గత రబీ సీజన్లో తొమ్మిది విడతలుగా వారబందీ ప్రకారం నీటిని ఇచ్చాం. కానీ, ఇప్పుడు ప్రాజెక్టులో నీటి సామర్థ్యం లేదు. ఎల్ఎండీలో 9.1 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. జిల్లాలోని కాల్వల కింద ఆయకట్టుకు నీటిని అందించాలంటే సరాసరి 35 టీఎంసీల నీరు అవసరం పడుతోంది. ఇప్పుడున్న వర్షాభావ పరిస్థితుల్లో నీటిని అందించడం సాధ్యం కాదు. తాగునీటి అవసరాల దృష్ట్యా ఎల్ఎండీ నుంచి మరో 2 టీఎంసీలు ఇస్తామని ప్రాజెక్టు అధికారులు ఇప్పటికే సూచించారు. గోదావరి ప్రవహిస్తుండటంతో ఇప్పటికిప్పుడు ఎస్సారెస్పీ నీటిని నిల్వ చేసి, దేవాదుల ద్వారా ధర్మసాగర్ రిజర్వాయర్, వడ్డేపల్లి చెరువులలో నీటిని నింపుతున్నాం. వీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తాం. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో లేకపోవడంతో ఖరీఫ్‌లో ఆయకట్టుకు సాగునీటిని అందించలేం. అయితే ఇప్పటికే చాలా మంది ఆయకట్టుదారులు నాట్లు వేశారు. కానీ, ముందు నుంచీ రైతులకు చెబుతూనే ఉన్నాం. ప్రత్యేక నోటీసులిచ్చాం. వరి పంటలు వేస్తే నష్టపోతారని. ఆగస్టులో వర్షాలు కురుస్తాయని చూశాం. మహారాష్ట్రలో ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు వరద వచ్చే దిగువ ప్రాంతాల్లో వర్షపాతం లేదు. దీంతో ప్రస్తుతం ఒక్క చుక్క ఇన్‌ఫ్లో కూడా లేదు. దీంతో ఈసారి ఖరీఫ్‌కు కాల్వల ఆయకట్టుకు నీరివ్వలేం. 4.24 లక్షల ఎకరాల్లో క్రాప్‌హాలిడే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీరందించే 4.24 లక్షల ఎకరాలు ఈసారి క్రాప్‌హాలిడే పాటించాల్సిందే. లేకుంటే ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేం. ఆగస్టు దాటి ఎంతో కొంత వర్షాలు కురిస్తే.. ఆరుతడి పంటలకు రెండు, మూడో తడుల నీరిచ్చే అవకాశం ఉంది. వాటిపై కూడా ఆశలు పెట్టుకోవద్దు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూ స్తూ ఆయకట్టులో పంటలు వేయొద్దు. నీరిచ్చే అవకాశం లేనందువల్ల రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ప్రస్తుతం కాల్వ నీరు విడుదల చేసే అవకాశం లేకపోవడంతో కాల్వల ఆధునీకరణ పనులు చేస్తున్నాం. ప్రధాన కాల్వ, ఉప కాల్వల మరమ్మతు పనులు చేయాలని ఆదేశాలిచ్చాం. ప్రస్తుతం డీబీఎం-48లో పనులు జరుగుతున్నాయి. స్టేజ్-1లోని ఆయా ప్రధాన కాల్వలతోపాటు చిన్న కాల్వలు, ఉప కాల్వలను ఆధునీకరిస్తాం. కొన్నిచోట్ల చాలా మట్టి పేరుకుపోయింది. వాటిని మరమ్మతులు చేస్తాం. -
తప్పిన ముప్పు
* మద్యం మత్తులో స్కూల్ బస్సు నడిపిన డ్రైవర్ * రెండు కార్లు, ఓ ట్రాక్టర్‌ను ఢీకొన్న వాహనం కీసర: డ్రైవర్ తప్పతాగి స్కూల్ బస్సును నడిపి రెండు కార్లు, ఓ ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. రంగారెడ్డి జిల్లా కీసర మండలంలోని నాగారం సమీపంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. రాంపల్లి గ్రామంలోని రికిల్పోర్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సులో 15 మంది విద్యార్థులను ఎక్కించుకొని డ్రైవర్ సుధాకర్‌రెడ్డి బయలుదేరాడు. అప్పటికే అతిగా మద్యం తాగిన డ్రైవర్ బస్సును నాగారం, దమ్మాయిగూడల్లో 11 మంది విద్యార్థులను దింపాడు. మరో నలుగురిని కీసర, గోధుమకుంట, ప్రజయ్‌సాయి గార్డెన్లో దింపేందుకు బయలుదేరాడు. ఈ క్రమంలో నాగారం ఐకాం కంపెనీ వద్ద ఎదురుగా వస్తున్న రెండు కార్లను ఢీకొట్టాడు. అనంతరం పక్కనే ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని బస్సు ఆగిపోయింది. బస్సులో కీసరకు చెందిన రిత్రిక, నేత్రికతో పాటు మరో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ప్రమాదంతో వీరు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రెండు కార్లలో ఉన్న కృష్ణగౌడ్, శ్రీకాంత్‌గౌడ్, మహేందర్‌గౌడ్, శైలజ, లావణ్యలకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చిన్నారులను కిందికి దించి, మత్తులో ఉన్న డ్రైవర్ సుధాకర్‌రెడ్డిని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు కీసర సీఐ కృష్ణకిషోర్ తెలిపారు. -
న్యాయవాది సుధాకర్ రెడ్డి కిడ్నాప్ యత్నం
-
న్యాయవాది సుధాకర్‌రెడ్డి కిడ్నాప్ యత్నం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : జిల్లా పరిషత్ ఎన్నికల్లో జరిగిన అరాచకాలను హైకోర్టుకు విన్నవించిన న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని కిడ్నాప్‌యత్నం జరిగింది. ఈ నెల 5న జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ గొడవలు సృష్టించి, ఎన్నికలను వాయి దా వేయించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఎన్నిక నిర్వహణకు కోర్టు ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని, ఎన్నికలు సజావుగా జరపాలని ఆదేశాలు పొందారు. ఈ కేసును ప్రజాహిత వ్యాజ్యంగా దాఖలు చేసిన న్యాయవాది సుధాకర్‌రెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లో కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. జెడ్పీ ఎన్నికలు ఈ నెల 13న జరగాల్సి ఉండగా, ఆ రోజు కూడా టీడీపీ సభ్యులు సభలో గందరగోళాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన బుధవారం కోర్టులో తన వాదనను వినిపించాల్సిఉంది. సాక్షాత్తు పోలీసులే సుధాకర్‌రెడ్డి ని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసినట్లు సమాచారం. తాను హైకో ర్టు నుంచి వెళుతుండగా, ఒక ఇన్నోవా కారు వెంటాడినట్లు సుధాకర్‌రెడ్డి తెలిపారు. దీంతో ఆయన తన కారు దిగి విచారించగా నెల్లూరు డీఎస్పీ రాంబాబుకు చెందిన వారమని పేర్కొన్నట్టు తెలిపారు. తనను ఇన్నోవా కారులో తీసుకుని వెళ్లే ప్రయత్నం చేశారని ఆయన పేర్కొన్నారు. తాను ప్రతిఘటించడంతో పాటు ఆ ప్రాంత వాసులు గుమికూడటంతో ఇన్నోవా కారులోని వ్యక్తులు పారిపోయినట్లు సుధాకర్‌రె డ్డి వివరించారు. దీంతో సుధాకర్ రెడ్డి బంజారా హిల్స్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. సుధాకర్‌రెడ్డిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించడంపై జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా గర్హించారు. టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా, అధికారులను కూడా ఉపయోగించుకుని నేరాలకు పాల్పడుతోందన్నారు. జెడ్పీ కోసం ఇన్ని దారుణాలా..? జెడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి టీడీపీ అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వైఎస్సార్సీపీ సభ్యుల్లో కొందరిని తమ వైపునకు తిప్పుకున్నారు. ఇప్పటి వరకు భయపెట్టి, ప్రలోభాలకు గురి చేశారు. ఇప్పుడు న్యాయవాదిని కిడ్నాప్ చేయడానికి సాహసించారు. టీడీపీ అరాచకాలు ఎంతో కాలం సాగవు. -మేరిగ మురళీధర్, వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ -
టీడీపీ జెడ్పీటీసీల్లో అసంతృప్తులు
లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచినా తమను పట్టించుకోకుండా పక్క పార్టీ వారికి కోట్ల రూపాయలు ఆఫర్ చేయడంపై తెలుగుదేశం జెడ్పీటీసీ సభ్యులు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌పై గెలిచిన జెడ్పీటీసీలు మా సంగతేంటని పార్టీ నేతలను నిలదీసినట్లు సమాచారం. తమకు కూడా రూ.30 లక్షలు చొప్పున ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. పశ్చిమ ప్రకాశానికి చెందిన ఓ జెడ్పీటీసీ, తూర్పు ప్రకాశానికి చెందిన మరో జెడ్పీటీసీ వైఎస్సార్ సీపీతో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ జెడ్పీ చైర్మన్ అభ్యర్థ్ధిగా మన్నె రవీంద్ర పేరును ప్రతిపాదించడంతో ఈ పదవిని ఆశించిన ఈదర వర్గం అసంతృప్తిగా ఉంది. ఆ వర్గం దెబ్బ తీస్తుందా.. అన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. బలాబలాలు సమానంగా ఉండటంతో లాటరీ తప్పదన్న సంశయం వారిని పట్టిపీడిస్తోంది. ఎన్నికల సంఘం కూడా సీరియస్‌గా స్పందించడంతో టీడీపీకి గొంతులో వెలక్కాయపడ్డట్లయింది. ఎన్నిక వాయిదా వేస్తే వైఎస్సార్ సీపీ నుంచి ఒకరిని తమ వైపు తిప్పుకోవచ్చన్న పాచిక పారకపోవడం... సొంత పార్టీ నుంచే అసంతృప్తులు తలెత్తడంతో వారిలో ఆదివారం జరిగే ఎన్నికపై నీలినీడలు అలుముకున్నాయి. మెజార్టీ వైఎస్సార్ సీపీకి ఉన్నా... ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి 31 జెడ్పీటీసీ స్థానాలు రాగా తెలుగుదేశం పార్టీకి 25 స్థానాలు మాత్రమే వచ్చిన సంగతి తెలి సిందే. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అధికారం దక్కడంతో ఎలాగైనా జెడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా నాయకత్వం ఆ దిశగా అడుగులు వేసింది. వైఎస్సార్ సీపీ తరఫున గెలిచిన జెడ్పీటీసీలను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేసింది. బీసీ సంఘాల ఆగ్రహం బీసీ వ్యక్తి జెడ్పీ చైర్మన్ కాకుండా అడ్డుకోవడంపై జిల్లా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఓసీ జనరల్‌కు కేటాయించిన సీటును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ కులాలకు చెందిన విద్యావంతుడైన డాక్టర్ నూకసాని బాలాజీకి ఇవ్వాలని నిర్ణయించింది. బీసీలకు పదవి దక్కడాన్ని జీర్ణించుకోలేని టీడీపీ.. బీసీ నేతను ఓడిం చేందుకు చేస్తున్న కుయుక్తులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బేరసారాలు ఇలా... రూ.60 లక్షల నుంచి కోటీ 20 లక్షల రూపాయల వరకూ బేరసారాలు జరిపారు. కొత్తపట్నం జెడ్పీటీసీకి రూ.60 లక్షలు, కంభం జెడ్పీటీసీకి కోటి 20 లక్షల రూపాయల వరకూ ఇచ్చారంటూ తెలుగుదేశం పార్టీ నేతలే ప్రచారం చేస్తున్నారు. చివరకు డబ్బుకు కక్కుర్తి పడిన ఆ ముగ్గురిని తమ వైపునకు తిప్పుకున్నారు. తొలుత ఏడుగురికిపైగా తమ వైపు వస్తారంటూ తెలుగదేశం నాయకులు ప్రచారం చేసుకున్నారు. అటు వైపు ముగ్గురు మాత్రమే అడుగులు వేయడంతో కథ అడ్డం తిరిగింది. కలెక్టర్ సమక్షంలోనే అరాచకం సృష్టించారు. అర్ధవీడు జెడ్పీటీసీ సభ్యురాలికి కోటి రూపాయలు ఇస్తామంటూ ఆఫర్ చేసినా తనకు బీఫాం ఇచ్చిన పార్టీకే కట్టుబడి ఉంటానని ఆమె స్పష్టం చేయడంతో ఈ నెల 5న జరిగిన జెడ్పీ సమావేశంలో హైడ్రామా సృష్టించి ఎన్నిక వాయిదా పడేలా చేశారు. ఆ తర్వాత కూడా వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ కుటుంబ సభ్యులను ప్రలోభపెట్టారు. ప్రత్యేక పరిశీలకుడి రాక... జెడ్పీ చైర్మన్ ఎంపిక కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకుడిని పంపించనున్నట్లు సమాచారం. నెల్లూరు జిల్లాపరిషత్ ఎన్నికల ప్రక్రియపై సుధాకర్‌రెడ్డి అనే న్యాయవాది వేసిన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించి ప్రత్యేక పరిశీలకునితో పాటు ఎన్నిక ప్రక్రియను వీడియో తీయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. జిల్లాలో మీడియాను సైతం దూరంగా ఉంచాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. -
టీటీడీ వైఖరిపై నిరసన వెల్లువ
చక్రాయపేట: టీటీడీ వైఖరి తీరుకు నిరసనగా నిరసన వెల్లువెత్తుతోంది. గండి పుణ్యక్షేత్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు, భక్తుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీజేపీ ఎన్జీవో సెల్ రాష్ట్ర కార్యదర్శి అంజన్‌కుమార్ యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టగా.. వారికి వైఎస్సార్ సీపీ నేతలు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా అంజన్‌కుమార్ ,బీజేపీజిల్లా ఉపాధ్యక్షుడు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఏడేళ్లుగా గండిలో పనిచేస్తున్న ఉద్యోగులకు చాలీచాలని జీతాలిస్తూ వారిని, వారి కుటుంబ సభ్యులను ఆకలి మంటలకు గురి చేస్తున్న టీటీడీ అధికారులకు అసలు మానవత్వం అనేదే లేదని ధ్వజమెత్తారు. న్యాయం చేయాలని రెండుమార్లు పరకామని (హుండీ లెక్కింపు) అడ్డుకున్నారని కక్ష గట్టి వారిలో ఆరుమంది ఉద్యోగులను బదిలీ చేయడం ఏమిటని వారు ఏఈఓను నిలదీశారు. దీక్షలో పాల్గొన్న గండి ఉద్యోగులు మాట్లాడుతూ తమ సమస్య తీర్చమని వేడుకున్నందుకు టీటీడీ వారు ఇచ్చిన బహుమానం ఈ బదిలీ ఉత్తర్వులని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన అన్ని రకాల అలవెన్సులు ఇస్తే వారు ఎక్కడికి బదిలీ చేసినా అక్కడికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రేమ,దయ లేవు.. టీటీడీ అధికారులకు కింది స్థాయి ఉద్యోగుల పట్ల జాలి,ప్రేమ,దయ అనేవి ఏమాత్రం లేవని వైఎస్సార్ సీపీ నేతలు సుధాకరరెడ్డి, బాబు, ప్రతాప్,మండల కో-ఆప్షన్ సభ్యుడు మహబుబ్వల్లి తెలిపారు. గండి ఉద్యోగులు చేట్టిన దీక్షకు వారు సంఘీ భావం తెలి పారు. ఉద్యోగులకు న్యాయం చేయక పోతే తాముకూడా దీక్షలకు దిగాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. విఫలమైన అధికారుల చర్చలు బీజేపీ నేతలు అంజన్‌కుమార్, రామచంద్రారెడ్డిలతో టీటీడీ అధికారులు చేసిన చర్చలు విఫలమయ్యాయి.టీటీ డీ ఏఈవో సబ్రమణ్యం,ఆర్కే వ్యాలీ ఎ స్సై ప్రదీప్‌నాయుడు దీక్షను విరమిం చాలని కోరారు. టీటీడీ ఈవో, జేఈవో లు వచ్చి సమస్యలపై హామీ ఇస్తేనే దీక్ష విరమిస్తామని వారు తేల్చి చెప్పారు. -
రోజుకు 50 వేల బస్ టికెట్లు
అభిబస్ ఫౌండర్ సీఈవో సుధాకర్ రెడ్డి చిర్రా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కేవలం రూ.10 లక్షల పెట్టుబడితో 2007లో ప్రారంభమై రూ.200 కోట్ల కంపెనీగా ఎదగడమే కాకండా దేశీయ ఆన్లైన్ బస్‌టికెట్ వ్యాపారంలో రెడ్‌బస్ తర్వాత రెండో అతిపెద్ద సంస్థగా అభిబస్ ఎదిగింది. ఏటా 50 శాతం వృద్ధితో వేగంగా విస్తరిస్తున్న ఆన్లైన్ టికెట్ల వ్యాపారంపై ప్రైవేటు ఈక్విటీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. రెండేళ్లలో రోజుకు 50,000 టికెట్లు విక్రయిస్తామంటున్న అభిబస్ ఫౌండర్ సీఈవో సుధాకర్ రెడ్డి చిర్రాతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. ఏపీఎస్ఆర్టీసీ టికెట్లను విక్రయించే విధంగా ఈ మధ్యనే కుదుర్చుకున్న ఒప్పందం మీ ఆదాయంపై ఏ విధంగా ప్రభావం చూపనుంది? ఆన్లైన్లో టికెట్ల రిజర్వేషన్లకు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ తొలిసారిగా బయట సంస్థకు అవకాశం ఇచ్చింది. రోజుకు ఏడువేలకు పైగా సర్వీసులు, రోజుకు 2.5 లక్షల టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఈ ఏడాది నుంచి వ్యాపారం బాగా పెరుగుతుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతం రోజుకు 10,000 టికెట్లను విక్రయిస్తుండగా ఈ ఒప్పందం వలన వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్య 50,000 దాటుతుందని అంచనా వేస్తున్నాం. ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ టికెట్లకు సంబంధించి సాఫ్ట్‌వేర్‌ను నిర్వహిస్తున్న మీకు రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల ఆర్టీసీని మీరే నిర్వహిస్తారా? నిర్వహణా వ్యయం ఏమైనా పెరిగే అవకాశం ఉందా? ఇంకా కార్పొరేషన్‌ను చట్ట ప్రకారం విడదీయాల్సి ఉంది. విడిపోయిన తర్వాత కూడా రెండు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలకు ఆన్లైన్ టికెటింగ్ సాఫ్ట్‌వేర్‌ను అభిబసే అందిస్తుంది. పదేళ్ల పాటు సర్వీసు అందించే విధంగా ఒప్పందం కుదిరింది. కాని ఇలా రెండు రాష్ట్రాలకు ప్రత్యేక వైబ్సైట్లను నిర్వహించడం వల్ల 40 శాతం వ్యయం పెరుగుతుంది. ఈ ఖర్చును కూడా కార్పొరేషనే భరిస్తుంది. ఏపీఎస్ఆర్టీసీ, తమిళనాడు ఆర్టీసీలతో పాటు 150కిపైగా ప్రైవేటు ఆపరేటర్లకు అభిబస్ సాఫ్ట్‌వేర్‌ను అందిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత పట్టణాల మధ్య తిరిగే ప్రయాణికుల్లో ఏమైనా హెచ్చు తగ్గులను గమనించారా? ఒక్క విజయవాడ, గుంటూరు తప్ప మిగిలిన పట్టణాల మధ్య రోజువారి ప్రయాణికుల సంఖ్యలో చెప్పుకోదగ్గ సంఖ్యలో మార్పులు లేవు. కాని హైదరాబాద్ నుంచి ఈ రెండు పట్టణాలకు ప్రయాణించే రోజు వారి సంఖ్యలో మాత్రం గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. ఈ డిమాండ్ మరో మూడు నాలుగేళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నాం. దీనికి తోడు రైల్వే టిక్కెట్ల ధరలు పెరగడం కూడా బస్సు ప్రయాణికుల సంఖ్యను పెంచుతుందని భావిస్తున్నాం. పాలెం బస్సు దుర్ఘటన తర్వాత ప్రయాణికుల ఆలోచనల్లో ఏమైనా మార్పులు కనిపించాయా? ప్రైవేటు ఆపరేటర్ల ఆన్లైన్ రిజర్వేషన్ల మార్గదర్శకాలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఆ సంఘటన జరిగిన తర్వాత ప్రైవేటు ఆపరేటర్లపై ప్రభావం బాగా కనిపించినప్పటికీ, ఇప్పుడు పరిస్థితులు సద్దుమణిగాయి. దీని తర్వాత ప్రయాణికులు బాగా పేరొందిన ప్రైవేటు ఆపరేటర్ల బస్సుల్లో ప్రయాణించడానికే ఇష్టపడుతున్నారు. ప్రైవేటు ఆపరేటర్ల ఆన్లైన్ రిజర్వేషన్లకు సంబంధించి చట్టంలో సరైన నిబంధనలు లేవు. దీనిపై ఇప్పటికే గత ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. త్వరలోనే కొత్త ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లే ప్రయత్నంలో ఆపరేటర్లను ఉన్నారు. దేశీయంగా బస్సు టిక్కెట్ల వ్యాపార పరిమాణం, వృద్ధి ఏ విధంగా ఉంది? దేశ వ్యాప్తంగా ఏటా రూ.40,000 కోట్ల టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఇందులో ప్రైవేటు బస్సుల వ్యాపార పరిమాణం రూ.15,000 కోట్లుగా ఉంటే, ఆర్టీసీల వాటా రూ.25,000 కోట్లుగా ఉంది. గత కొంతకాలంగా ప్రైవేటు బస్సు టికెట్ల వ్యాపారం స్థిరంగా ఉంది. కాని ఇదే సమయంలో ఆన్లైన్ ద్వారా టికెట్ల బుకింగ్‌లో మాత్రం ఏటా 50 శాతం వృద్ధి నమోదవుతోంది. మొత్తం టికెట్ల విక్రయాల్లో ప్రస్తుతం 15 శాతంగా ఉన్న ఆన్లైన్ టికెట్ల వ్యాపారం ఈ ఏడాది 25 శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నాం. ప్రస్తుతం అభిబస్ వ్యాపార పరిమాణం, వృద్ధి గురించి వివరిస్తారా? గతేడాది వరకు ప్రధానంగా ఆన్లైన్ టికెటింగ్ సాఫ్ట్వేర్ వ్యాపారంపైనే దృష్టిపెట్టాం. ఇప్పుడు నేరుగా ఆన్లైన్ టికెట్లను కూడా విక్రయిస్తున్నాం. గతేడాది రూ.165 కోట్ల వ్యాపారం నమోదు చేశాం. ఈ ఏడాది రూ.280 కోట్లకు వచ్చే ఐదేళ్లలో రూ.2,000 కోట్లకు చేర్చాలన్నది లక్ష్యం. అభిబస్ అనగానే ఇప్పటికే చౌక టికెట్లను ఇచ్చే డీల్స్ సైట్‌గా పేరొచ్చింది. ఏటా 150 రోజులు తక్కువ కాకుండా చౌక రేట్లను ఆఫర్లు చేసే విధంగా రూపొందించుకుంటున్నాం. ఆన్లైన్ పోర్టల్స్, ఈ-కామర్స్ రంగాల్లో పెట్టుబడులు చేయడానికి పీఈ, వీసీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నట్లే అభిబస్‌లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఎవరైనా ముందుకొస్తున్నారా? వచ్చే రెండేళ్ల వ్యాపార విస్తరణకు రూ.50 కోట్ల నిధులను సమీకరిస్తున్నాము. ఇందుకోసం కొటక్ బ్యాంక్‌ను ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌గా నియమించుకున్నాం. నాలుగు ప్రైవేటు ఈక్విటీ సంస్థలతో చర్చలు జరుపుతున్నాం. ఏ సంస్థ నుంచి పెట్టుబడి వస్తుందన్నది ఆగస్టు నెలాఖరుకు స్పష్టత వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కంపెనీ విలువను రూ200 కోట్లుగా మదింపు చేసింది.