తాటికొండ సుధాకర్ రెడ్డి
సీనియర్ ఫ్యాకల్టీ,
హైదరాబాద్
జంతు ప్రపంచం
మొక్కల తర్వాత జంతుజాలం ఆవిర్భవించింది. భూగోళం ఏర్పడి సుమారు 4.5 బిలియన్ ఏళ్లు అయింది. సుమారు 3.5 బిలియన్ ఏళ్ల క్రితం జీవజాలం ఏర్పడింది. జంతువులు విభిన్న మార్పులకు గురై వివిధ రకాలుగా, వర్గాలుగా విభజితమై విస్తరించాయి. జంతువులను ముఖ్యంగా వాటిలో ఉండే వెన్నెముక ఉనికి ఆధారంగా వర్గీకరించారు. వెన్నెముక లేని వాటి ని అకశేరుకాలు (నాన్ కార్డేటా) అని, వెన్నెము క ఉన్న వాటిని సకశేరుకాలు (కార్డేటా) అని వర్గీకరించారు. అకశేరుకాలను 9 వర్గాలుగా, సకశేరుకాలను ఐదు వర్గాలుగా విభజించారు.ఙఞ్చటఐ అకశేరుకాలు (నాన్ కార్డేటా)
1) ప్రోటోజోవా 2) పొరిఫెరా
3) సీలింటరేటా (నిపేరియా)
4) ప్లాటి హెల్మింథిస్
5) నిమాటి హెల్మింథిస్
6) అనిలిడా 7) ఆర్థ్రోపొడా
8) మొలస్కా 9) ఇఖైనోడర్మేటాఙఞ్చటఐఐ. సకశేరుకాలు (కార్డేటా)
1) చేపలు 2) ఉభయచరాలు
3) సరీసృపాలు 4) పక్షులు
5) క్షీరదాలు
ఐ. అకశేరుకాలుఙఞ్చట1. {పోటోజోవా: ఇవి సాధారణంగా ఏక కణజీవులు. కొన్ని సమూహాలుగా నివసిస్తా యి. వీటిలో చలనాంగాలు మిద్యాపాదా లు, కశాబాలు, శైలికలు మొదలైనవి. ఉదా: అమీబా- మిద్యాపాదం, యూస్లీనా - కశాబాలు, పారమీసియం, వర్టిసెల్లా - శైలికలు.
ప్లాస్మోడియం మానవునిలో మలేరియా వ్యాధిని కలిగిస్తుంది. ఈ వ్యాధి ఆడ అనాఫిలిస్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఎంటామిబా హిస్టాలిటికా అనే మరొక జీవి మానవునిలో అమీబియాసిస్ (జిగట విరోచనాలు)కు కారణమవుతుంది.
ప్రోటోజోవాలు మానవునిలో కలిగించే వ్యాధులుఙఞ్చట2. పోరిఫెరా: వీటి దేహంపైన ఒకే రకమైన అనేక సూక్ష్మ రంధ్రాలుంటాయి. కణజాలం ఏర్పడదు.
ఉదా:యూస్పాంజియా(ఆ్చ్టజి ఞౌజ్ఛ), స్పాంజిల్లా (ఊట్ఛటజి గ్చ్ట్ఛిట ఞౌజ్ఛ)ఙఞ్చట3. సీలింటరేటా: ఇవి బహుకణ, కణజాల, జీర్ణ వ్యవస్థ మొదలైన అంశాలను కలిగిన జీవులు. ఇవి ద్విస్తరిత జీవులు.
ఉదా: హైడ్రా, ఆరేలియా (ఒ్ఛడ ఊజీటజి), మెట్రీడియం (్ఛ్చ ్చ్ఛఝ్ఛౌ).ఙఞ్చట4. ప్లాటీహెల్మింథ్‌స: వీటిని సాధారణంగా బద్దె పురుగులు అంటారు. ఇవి రిబ్బన్ మాదిరిగా లేదా టేప్ మాదిరిగా కనిపిస్తాయి.
ఉదా: టీనియాసోలియం, ఫేసియోలా, షిస్టోసోమా మొదలైనవి. పూర్తిగా ఉడికించని పంది, ఎద్దు, చేప మొదలైన వాటి మాంసాన్ని తిన్నప్పుడు మానవునిలో టీనియాసిస్ వస్తుంది. ఇది కండరాలపై ప్రభావాన్ని చూపుతుంది.ఙఞ్చట5. నిమాటి హెల్మింథిస్: వీటిని సాధారణంగా నులిపాములు, ఏలికపాములు, రౌండ్ వార్‌మ్స మొదలైన పేర్లతో పిలుస్తారు. ఇవి ముఖ్యంగా చిన్నపిల్లలు, పశువుల (దూడల) జీర్ణమండలంలో ఉంటూ జీర్ణమైన ఆహారాన్ని తీసుకుంటాయి. ఫలితంగా వచ్చే వ్యాధి ఆస్కారియాసిస్.
ఉదా: ఆస్కారిస్ (ఖౌఠఛీ గిౌటఝ), ఎంభైలోస్టోమా (ఏౌౌజు గిౌటఝ). ఉచరేరియా బ్రాంభాప్టి అనేది కూడా ఈ వర్గానికి చెందినదే. ఇది మానవుడిలో బోదకాలు/ఫైలేరియాసిస్‌ను కలిగిస్తుంది. దీన్నే ఎలిఫెంటియాసిస్ అని కూడా అంటారు. ఇది క్యూలెక్స్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఫైలేరియా అనేది ఉచరేరియా డింభకం కాబట్టి ఈ వ్యాధిని ఫైలేరియాసిస్ అంటారు.ఙఞ్చట6. అనిలిడా: వీటి దేహం గుండ్రటి ఉంగరాల వంటి నిర్మాణాలతో నిర్మితమై ఉంటుంది. వీటి చలనం కోసం తోడ్పడే నిర్మాణాలు - సీటాలు.
ఉదా: వానపాము, జలగ. సాధారణంగా భారతదేశంలో కనిపించే వానపాములు.. పెరిటిమా పోస్తుమా, మెగాస్కోలెక్స్.
వానపాములో ఉభయ లైంగికత్వం ఉం టుంది. వీటిలో పునరుత్పత్తి జరుగుతుంది. చర్మం ద్వారా శ్వాసించుకుంటుం ది. దీని గుండె గదుల సంఖ్య 8 జతలు. వానపాములో ఎర్ర రక్తకణాలు ఉండవు. వీటి రక్తంలో హిమోగ్లోబిన్ ప్లాస్మాలో ఉంటుంది. ఆధునిక క్యాన్సర్ చికిత్సలో జలగలను ఉపయోగిస్తున్నారు.ఙఞ్చట7ఆర్థ్రోపొడా: జంతురాజ్యంలో అతి పెద్ద వర్గం. వీటిలో కీటకాలు ఉంటాయి. కీటకాల అధ్యయనాన్ని ఎంటమాలజీ అంటా రు. వీటిలో మూడు జతల కాళ్లు ఉంటా యి. ఒకటి లేదా రెండు జతల రెక్కలు ఉంటాయి. వీటిలో బాహ్య అస్థిపంజరం ఉంటుంది. శ్వాసక్రియ వాయునాళాల ద్వారా జరుగుతుంది. కీటకాల్లో 10 జతల వాయునాళాలు ఉంటాయి. సాలీడులో 4 జతల కాళ్లు ఉంటాయి. కీటకాల్లో రూపవిక్రియ ఉంటుంది.
కొన్ని ముఖ్యమైన కీటకాలు..ఙఞ్చటఎ) పట్టు కీటకం (బాంబిక్స్‌మోరి): వీటి సాగు (పెంపకం)ను సెరికల్చర్ అంటారు. పట్టు ను మొదట కనుగొన్న దేశం చైనా. ఇండియాలో పట్టు ఉత్పత్తిలో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. పట్టు కీటకం ఆహారం మల్బరీ, ఆముదం ఆకులు. కీటకం ప్యూపా (కోశస్థదశ) దశ నుంచీ పట్టు లభిస్తుంది. పట్టులో ఉండే ప్రోటీన్ - సిరిన్. టస్సార్, ఈరి, ముంగా అనే పట్టు కీటకాలు నాసిరకం పట్టును ఉత్పత్తి చేస్తాయి.
బి) తేనెటీగలు: తేనెటీగల పెంపకాన్ని ఎపికల్చర్ అంటారు. ఎపిస్ మిల్లిఫెరా, ఎపిస్ ఇండికా అనే తేనెటీగలను ఎక్కువగా పెంచుతారు. తేనెటీగలు మూడు రకాలు 1) రాణి 2) డ్రోన్‌స 3) కూలి ఈగలు. డ్రోన్‌స తేనెటీగలు అనిషేక జననం ద్వారా ఏర్పడి ఏకస్థితికంలో ఉంటాయి. రాణి ఈగ చనిపోయినప్పుడు కూలి ఈగల్లో ఒకటి రాణి ఈగగా మారుతుంది.
సి) లక్క కీటకం (లాక్సీఫర్‌లాక్): ఇది రేగు, తుమ్మ, మోదుగ మొదలైన చెట్లపైన పెరుగుతుంది. లక్క ఉత్పత్తిలో ఇండియాది మొదట స్థానం. ప్రపంచంలో సుమారు 70 శాతం లక్క ఇండియాలోనే ఉత్పత్తి అవుతుంది. లక్కను ఎక్కువగా అద్దకం పరిశ్రమ, సీళ్లు వేసేందుకు, కొన్ని అలంకరణ వస్తువులు తయారు చేసేందుకు ఉపయోగిస్తారు.
రూప విక్రియలో ఉండే దశలు
1) గుడ్డు 2) లార్వా (డింభకం)
3) ప్యూపా (కోశస్థదశ)
4) ఇమానో (ప్రౌఢదశ)
వేగంగా నడిచే కీటకం - బొద్దింక. గుడ్ల పెట్టెను కలిగిన కీటకం - బొద్దింక. జీవితాంతం విసర్జన చేయని జీవి సిల్వర్ ఫిష్. ఈగ లార్వా-మాగటి, దోమలార్వా-రిగ్లర్.ఙఞ్చట8. మొలస్కా: మొలస్కా అంటే మాంసపు ముద్ద అని అర్థం. జంతు రాజ్యంలో రెండో అతిపెద్ద వర్గం. వీటి దేహంపైన కర్పరం (జ్ఛి) అనే ఇ్చఇౌ3తో నిర్మితమైన రక్షక కవచం ఉంటుంది. కర్పరాల అధ్యయనాన్ని కాంకాలజీ అంటారు. వీటిలో రక్తం నీలం రంగులో ఉంటుంది. ఉదా: నత్తలు, ఆల్చిప్పలు. నత్తల అధ్యయనాన్ని మెలకాలజీ అంటారు. ఆల్చిప్పల్లో ముత్యాలు తయారవుతాయి. ముత్యాల రసాయనిక రూపం ఇ్చఇౌ3. కటిల్‌ఫిష్, డెవిల్ ఫిష్ అ నేవి కూడా మొలస్కా వర్గానికి చెందినవే.ఙఞ్చట9.
ఇఖైనో డర్మేటా: ఇవి సముద్రజీవులు. వీటి చర్మంపైన దృఢమైన కంఠకాలు ఉంటా యి. వీటిలో కుల్యావ్యవస్థ ఉంటుంది. ఉదా: సముద్ర నక్షత్రం, సీఅర్చిన్‌స, సీ లిల్లీ, సీ కుకుంబర్‌స మొదలైనవి.
వ్యాధి వ్యాధి జనకం వ్యాప్తి చేసే జీవి/కారకంఙఞ్చట1. అతినిద్రా జాడ్యం {sిపానోసోమా - గాంబియెన్సి సీ- సీ ఈగ
(్ఛ్ఛఞజీజ జీఛిజ్ఛుటట/ లేదా ట్రిబ్రూసిఙఞ్చటఖీటడఞ్చౌటౌఝజ్చీటజీట)ఙఞ్చట2. ఓరియెంటల్ సోర లీష్మానియా - ట్రాపికా సాండ్ ఫై్ల
(డిల్లీ బోయిల్)ఙఞ్చట3. కాలా అజార్ లీష్మానియా డోనో - వాని సాండ్ ఫై్ల
(బ్లాక్ సిక్‌నెస్)ఙఞ్చట4. డయేరియా జియార్డియా -ఇంటెస్టినాలిస్ తాగునీరు, ఆహారం
(జియార్డియాసిస్)
ఐఐ.సకశేరుకాలు:
వీటిలో నిర్థిష్టమైన వెన్నెముక ఉంటుంది.ఙఞ్చట1)చేపలు: చేపల అధ్యయనాన్ని ఇక్తియాలజీ అంటారు. చేపల స్వర్ణయుగం డివోనియన్ కాలం. చేపల చలనాంగాలు వాజాలు. చేపలు శీతల రక్త జంతువులు. చేప గుండె గదుల సంఖ్య రెండు. చేపలు మొప్పల ద్వారా శాసిస్తాయి. చేపల్లో మృదులాస్థి చేపలు, ఎముక చేపలు అనే రెండు రకాలుంటాయి. చేపల్లో లభించే విటమిన్‌స అ, ఈ. చేపల ఉత్పత్తిని పెంచడానికి ప్రవేశపె ట్టిందే నీలి విప్లవం.
కొన్ని ముఖ్యమైన చేపలు..
అతి పెద్ద చేప - సొర చేప
అతి చిన్న చేప - మిస్టిక్ థిస్
వేగంగా ఈదే చేప - సెయిల్‌ఫిష్
ఎగిరే చేప - ఎక్సోలోటస్
మురికి గుంటల్లో పెరిగే చేప - గంబూసియా (కౌట్ఞఠజీౌ్ట ఊజీటజి)
నీటి గుర్రం - హిప్పోకాంపస్
ఎలక్ట్రిక్‌రే - టార్పిడోఙఞ్చట2. ఉభయ చరాలు: ఇవి నీటిలో, నేలపైన జీవించే జంతు సముదాయం.
ఉదా: కప్ప(రాణా), గోదురు కప్ప(టోడ్). కప్ప అధ్యయనాన్ని బాట్రకాలజీ అంటా రు. ఇవి కూడా శీతల రక్త జంతువులు. వీటిలో గుండె గదుల సంఖ్య మూడు. వీటిలో మలిన రక్తం ఉంటుంది. వీటిలో రెండు పూర్వాంగాలు, రెండు చరమాంగాలు ఉంటాయి. స్వరకోశాలు, ఆంప్లిక్సరి మెత్తలు మగ కప్పల్లో మాత్రమే ఉంటా యి. కప్పల్లో ఎండాకాలం గ్రీష్మకాల సుప్తావస్థ, శీతాకాలంలో శీతాకాల సుప్తావస్థ ఉంటుంది. కప్పల్లో చర్మ, పుపుస శ్వాసక్రియ ఉంటుంది. కప్పలో రూప విక్రియ థైమస్ గ్రంథి (థైరాక్సిన్) ద్వారా జరుగుతుంది. అండ కణాల సముదాయాన్ని స్పాన్ అని, శుక్రకణాల సముదాయాన్ని మిల్ట్ అని అంటారు.ఙఞ్చట3. సరీసృపాలు: వీటిలో బల్లులు, తొండలు, ఉడుము, మొసలి, పాములు మొదలైన జంతువులుంటాయి.
సరీసృపాల అధ్యయనాన్ని హెర్పటాలజీ అని, బల్లుల అధ్యయనాన్ని సారాలజీ అని అంటారు. పాముల అధ్యయనాన్ని సర్పెంటాలజీ లేదా ఓఫిడాలజీ అంటారు. సరీసృపాలు శీతల రక్త జంతువులు. సరీసృపాల గుండె గదుల సంఖ్య 4. ఇవి అవిభక్తంగా ఉంటాయి. మొసలిలో 4 గుండె గదులుంటాయి. సరీసృపాల్లో డైనోసారులు వేగంగా వృద్ధి చెంది అదేవిధంగా అంతరించిపోయాయి. డైనోసారులు జురాసిక్ యుగానికి చెందినవి. డైనోసారులు అంటే టెర్రిబుల్ లజార్‌డ అని అర్థం. పాముల చలనాంగాలు వాటి కింది భాగంలోని అడ్డు పొలుసులు. విషసర్పం కాటు వేస్తే ఒకటి లేదా రెండు గాట్లు, విష రహిత సర్పం కాటు వేస్తే అనేక గాట్లు పడతాయి. విషసర్పం కాటు వేస్తే పాలివీనం, ఆంటివీనం ఇంజక్షన్‌స చేస్తారు.
నాగుపాము విషం (కోబ్రాడిన్) నాడీ వ్యవస్థపైన, రక్తపింజర విషం (వైపరిడిన్, రక్త ప్రసరణ వ్యవస్థపైన ప్రభావాన్ని చూపుతాయి. అత్యంత విషపూరితమైన సర్పం.. సముద్ర సర్పం. సరీసృపాలు అండోత్పాదకాలు.కానీ రక్త పింజర, కొండ చిలువ శిశోద్పాదకాలు. తాబేలు ఎక్కువ జీవిత కాలాన్ని కలిగి ఉంటుంది.ఙఞ్చట4. పక్షులు: పక్షుల అధ్యయనాన్ని ఆర్నిథాలజీ అంటారు. పక్షులు ఎగరడానికి వాయుపూరిత ఎముకలు, ఉడ్డయక కండరాలు తోడ్పడతాయి. ఇవి ఉష్ణరక్త జంతువులు. ఇవి మిగతా జంతువుల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. పక్షులకు దంతాలుండవు. వీటి గుండె గదుల సంఖ్య నాలుగు. పక్షులు అండోత్పాదకాలు. వీటిలో పొదుగు కాలం ఉంటుంది.
కొన్ని ముఖ్యమైన పక్షులు
అతిపెద్ద పక్షి - ఆస్ట్రిచ్ (నిప్పుకోడి)
అతి చిన్నపక్షి - హమ్మింగ్ బర్‌డ
వేగంగా నడిచే పక్షి - ఆస్ట్రిచ్
వేగంగా ఎగిరే పక్షి - స్విఫ్ట్
వెనుకకు ఎగిరే పక్షి - హమ్మింగ్ బర్‌డ
భారతదేశ జాతీయ పక్షి - నెమలి (పావో క్రిస్పేటస్)
రాష్ర్ట పక్షి -పాలపిట్ట
యూఎస్‌ఏ జాతీయ పక్షి - ఈగల్
న్యూజిలాండ్ జాతీయ పక్షి - కివిఙఞ్చట5. క్షీరదాలు: వీటి అధ్యయనాన్ని మామాలజీ అంటారు. వీటి దేహంపైన వెంట్రుకలు ఉంటాయి. వీటి రొమ్ము, పొట్ట భాగాలను వేరుచేస్తూ ఉదారవితానం అనే పొర ఉంటుంది. ఇవి ఉష్ణరక్త జంతువులు. వీటి గుండె గదుల సంఖ్య నాలుగు. క్షీరదాల్లో గర్భావధికాలం ఉంటుంది. గర్భావధి కాలం సుమారుగా..
ఏనుగు-660 రోజులు (అత్యధిక గర్భావధి కాలం)
గుర్రం - 330 రోజులు
ఆవు, మనిషి- 270 రోజులు
గొర్రెలు, మేకలు - 150 రోజులు
పిల్లి, కుక్క - 60 నుంచి 70 రోజులు
కుందేలు - 30 రోజులు
ఎలుక - 21 రోజులు
అపోసం-12 రోజులు (అత్యల్ప గర్భావధి కాలం)
కొన్ని క్షీరదాలు గుడ్లు పెట్టి పాలిచ్చేవి ఉన్నాయి.
ఎభిడ్నా: దీన్ని ముళ్ల పంది లేదా సై్పనీ అంట్ ఈటర్ అంటారు. ఇది ఎక్కువగా న్యూజిలాండ్, టాస్మేనియా దేశాల్లో కనిపిస్తుంది.
ప్లాటిపస్: దీన్ని బాతుముక్కు ప్లాటిపస్ అంటారు. ఇది కూడా న్యూజిలాండ్, టాస్మేనియా దేశాల్లో సంచరిస్తుంది. వీటిలో గైనకోమాస్టిజం (ఆడ, మగ జీవులు పాలిచ్చుట) కనిపిస్తుంది.
కంగారూలు ఆస్ట్రేలియాలో విరివిగా ఉంటాయి. దీని పొట్టపైన శిశుకోశం ఉం టుంది. దీనిలో అపరిపక్వ శిశువు వృద్ధి చెందుతుంది. ఆస్ట్రేలియాను లాండ్ ఆఫ్ మార్సూపియేల్స్ అంటారు.
జంతురాజ్యంలో అతిపెద్ద జంతువు - నీలితిమింగలం
నేలపైన అతిపెద్ద జంతువు - ఏనుగు
అతి వేగంగా పరుగెత్తే జంతువు - చిరుత
నెమ్మదిగా నడిచే జంతువు - స్లాట్
జాతీయ జంతువు - పులి
ఎతై్తన జంతువు - జిరాిఫీ
తెలివైన జంతువు - మనిషి
వేగంగా నడిచే కీటకం..
Published Thu, Nov 20 2014 10:20 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement