దోమల నియంత్రణకు వినియోగించే చేపలు? | The fish used for mosquito control? | Sakshi
Sakshi News home page

దోమల నియంత్రణకు వినియోగించే చేపలు?

Published Sat, Apr 5 2014 10:35 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

The fish used for mosquito control?

1.    జంతువుల నుంచి మానవులకు సోకే వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
     జూనూసిస్ (Zoonosis)
 
 2.    మానవునిలో సాధారణ ఫ్లూ చికిత్సలో వాడే ఔషధాలు?
     అమాంటడిన్, రిమాంటడిన్
 
 3.    మానవునికి సోకే బర్‌‌డ ఫ్లూ, స్వైన్ ఫ్లూ చికిత్సలో వాడే ప్రత్యేక ఔషధాలు?
     టమీఫ్లూ (ఒసెల్టామవిర్), రెలెంజ (జనామవిర్)
 
 4.   ప్రపంచ మధుమేహ దినోత్సవం?
     నవంబరు 14
 
 5.    ‘ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్’ ఎక్కడ ఉంది?
     బ్రసెల్స్, బెల్జియం
 
 6.    నేషనల్ సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ ఎక్కడ ఉంది?
     న్యూఢిల్లీ
 
 7.    ప్రపంచ క్షయ దినోత్సవం?
     మార్చి 24
 
 8.    {పపంచవ్యాప్తంగా మధుమేహ రోగులు అత్యధికంగా ఉన్న దేశం?
     చైనా (భారత్, అమెరికా వరుసగా రెండు,  మూడు స్థానాల్లో ఉన్నాయి)
 
 9.    గర్భాశయ ముఖ క్యాన్సర్ (ఇ్ఛటఠిజీఛ్చి ఇ్చఛ్ఛిట) కారక వైరస్?
     హ్యూమన్ పాపిల్లోమ వైరస్
 
 10.    దేశంలో తొలిసారిగా ఏ్ఛఞ్చ్టజ్టీజీట ఆ గ్చఛిఛిజ్ఛీను ఎప్పుడు ప్రారంభించారు?
     1997
 
 11.    భారత్‌లో తొలిసారిగా ఎయిడ్‌‌సను ఎప్పుడు, ఎక్కడ కనుగొన్నారు?
     1986, చెన్నై
 
 12.    క్షయ రోగులపై సమగ్ర సమాచారాన్ని అందించే డేటాబేస్?
     నిక్షయ్
 
 13.    ప్రపంచ పార్కిన్‌సన్‌‌స దినోత్సవం?
     ఏప్రిల్ 11
 
 14.    ఈ ఏడాది చైనాలో మానవునికి సంక్రమించిన కొత్త బర్‌‌డ ఫ్లూ వైరస్‌గా దేన్ని గుర్తించారు?
     H10N8
 
 15.    నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ వైరాలజీ ఎక్కడుంది?
     పుణే
 
 16.    చికున్ గున్యా వ్యాధి కారకం?
     చిక్‌వి (Chikv) (ఇది ఒక టోగా వైరస్ ఆల్ఫావైరస్, ఆర్బోవైరస్)
 
 17.    మలేరియా వ్యాధి దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందని తొలిసారిగా కనుగొన్నవారు?
     సర్ రొనాల్డ్ రాస్
 
 18.    {r-Mోమా వ్యాధి కారకం?
     క్లామిడియ ట్రకోమ్యాటిస్
 
 19.    సిఫిలిస్ అనే లైంగికంగా సంక్రమించే వ్యాధి కారకం?
     ట్రిపొనిమా ప్యాలిడం
 
 20.    ప్రపంచ ఆరోగ్య సంస్థ డెరైక్టర్ జనరల్?
     మార్గరెట్ చాన్
 
 21.    హెచ్‌ఐవీని తొలిసారిగా కనుగొన్నవారు?
     ల్యూక్ మారిటనీర్, ఫ్రాంకోమస్ బార్‌సినోస్సీ (1983లో)
 
 22.    శరీరంలో ఏ కీలక తెల్ల రక్తకణాలపై HIV ప్రత్యేకంగా దాడి చేస్తుంది?
     ఖీ4 లింఫోసైట్స్
 
 23.    పరాగ రేణువుల అలర్జీ ద్వారా వచ్చే జ్వరం?
     హే జ్వరం
 
 24.    అలర్జీ కారక వయ్యారిభామ (మాచర్లకంప) శాస్త్రీయ నామం?
     పార్థీనియం హిస్టిరోఫోరస్
 
 25.    నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కడుంది?
     న్యూఢిల్లీ
 
 26. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంటెరిక్ డిసీజెస్ ఎక్కడుంది?
     కోల్‌కతా
 
 27. క్షయ బ్యాక్టీరియా ఏ ఆకారంలో ఉంటుంది?
     దండాకారం (బాసిల్లస్)
 
 28.    నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఎక్కడుంది?
     పుణే
 
 29.    'Typbar' పేరుతో ఒక సరికొత్త 'Typho id Conjugate Vaccine' ను దేశంలో ఏ ఫార్మా కంపెనీ విడుదల చేసింది?
     భారత్ బయోటెక్
 
 30. అమ్మవారు వ్యాధి నివారణకు ఇచ్చే టీకా?
     వారిసెల్లా టీకా
 
 31. తామర, కాండిడియాసిస్, మైసిటిస్మస్, అథ్లెట్స్‌ఫుట్ అనే వ్యాధులు ఏ కారకాల ద్వారా వ్యాపిస్తాయి?
     శిలీంధ్రాలు
 
 32. ప్రముఖ ఆస్ట్రోఫిజిస్ట్ స్టీఫన్ హాకింగ్‌‌సకు ఉన్న వ్యాధి?
     అమయాట్రాపిక్ లాటిరల్ స్ల్కిరోసిస్/ లవ్‌గ్రెఫిగ్ వ్యాధి
 
 33.    {r-Mోమా వ్యాధి వల్ల ఏ అవయవం ప్రభావితమవుతుంది?
     కన్ను
 
 34.    క్షయను సమగ్రంగా నియంత్రించి, నివారించే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈైఖీ (Directly Observed Treatment Shortcourse) కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టింది?
     1995
 
 35.  ప్రపంచ మలేరియా దినోత్సవం?
     ఏప్రిల్ 25
 
 36.    మలేరియా వ్యాధి చికిత్స కోసం 2012లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సరికొత్త ఔషధం?
     సిన్‌రియం (పైపరాక్విన్)
 
 37.    ఎయిడ్‌‌స ప్రబలత చాలా తక్కువ ఉన్న ప్రాంతాల్లో అధిక ప్రాధాన్యతతో అవగాహన కల్పించే ఉద్దేశంతో Red Ribbon Express (RRE) తొలిసారిగా ఎప్పుడు ప్రారంభమైంది?
     డిసెంబరు 1 , 2007
 
 38.    హషిమొటో వ్యాధి ఏ అవయవానికి చెందింది?
     అవటు గ్రంథి
 
 39.    గనేరియా వ్యాధి కారకం?
     నిస్సేరియా గనేరియా
 
 40.    టైఫాయిడ్ వ్యాధి నిర్ధారణ కోసం చేసే పరీక్ష?
     వైడల్ టెస్ట్
 
 41.    సిఫిలిస్ వ్యాధి నిర్ధారణ కోసం నిర్వహించే పరీక్ష?
     VDRL (వెనెరల్ డిసీజ్ రీసెర్‌‌చ ల్యాబొరేటరీ టెస్ట్)
 
 42.    వేరుశనగ, ఇతర పప్పుదినుసుల్లో ఉండే హానికారక శిలీంధ్ర విష పదార్థాలు?
     అఫ్లటాక్సిన్‌‌స
 
 43.    గర్భాశయ ముఖ క్యాన్సర్ కారక వైరస్‌ను తొలిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త?
     హరాల్డ్ జర్ హాసన్
 
 44.    బొట్యులిజం/ఫుడ్ పాయిజనింగ్ వ్యాధి కారకం?
     క్లాస్ట్రీడియం బొట్యులినం
 
 45.    కోరింత దగ్గు (Whoopling Cough) వ్యాధి కారకం?
     బోర్తుటెల్లా పెర్తుసిస్
 
 46.    గర్భిణుల ఆహారంలో ఫోలిక్ ఆమ్లం (ఆ9 విటమిన్ లోపం ద్వారా శిశువులో వచ్చే వ్యాధి?
     స్పైన్ బెఫైడ్
 
 47.    పార్కిన్‌సన్‌‌స వ్యాధిలో నాడీ క్షీణత ద్వారా ఏర్పడని కీలక న్యూరోట్రాన్‌‌సమీటర్?
     డోపమైన్
 
 48.    పోలియో కారక వైరస్?
     పికోర్న వైరస్
 
 49.    భారత్‌లో 'Expanded Programme on Immunization' అనే టీకా కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
     1978
 
 50.    అతి పెద్ద బ్యాక్టీరియం ఏది?
     ఎపులోపిసియం ఫిషల్ సోని (50 Microns పరిమాణం)
 
 51.    క్షయ నివారణకు నవజాత శిశువునకు అందించే టీకా?
     BCG (బాసిల్లస్ కాల్మేట్ గ్వెరిన్)
 
 52.    ధమనుల్లో కొవ్వు పేరుకుని, అవి గట్టిబడి ఇరుకుగా మారడం వల్ల వచ్చే వ్యాధి?
     అథెరో స్ల్కిరోసిస్
 
 53.    మ్యాడ్  కౌ వ్యాధి కారకం?
  ప్రయాన్
 
 54.    నిలకడ నీటిలో దోమలు పెట్టిన గుడ్ల నుంచి ఏర్పడే డింభకాలను నియంత్రించడానికి వినియోగించే డింభకాహార చేపలు?
     గాంబూసియా అఫినిసిస్, మెనో అండ్ ట్రౌట్
 
 55.    ఆహారంలో ప్రోటీన్ల లోపం ద్వారా చిన్నారుల్లో ఏర్పడే శారీరక మాంద్యత?
     క్వాషియోర్‌కార్
 56.    గవద బిళ్లల కారక వైరస్?
     మార్బిల్లి వైరస్
 
 57.    జపనీస్ ఎన్సిఫలైటిస్ వ్యాధి వల్ల ఏ అవయవం వాపు చెందుతుంది?
     మెదడు
 
 58.    క్షయ చికిత్సలో వాడే ఔషధాలు?
     ఐసోనియాజిడ్, పైరాజినమైడ్, ఇథాంబ్యుటాల్
 
 59.    షిజెల్లోసిస్ అనే బ్యాక్టీరియా వ్యాధి ప్రధాన లక్షణం?
     జిగట విరేచనాలు
 
 60.    కలరా వ్యాధి చికిత్సలో వాడే ఔషధం?
     టెట్రాసైక్లిన్
 
 61.    తొలిసారిగా చికున్‌గున్యా వ్యాధిని ఏ దేశంలో గుర్తించారు?
     టాంజానియా (1953)
 
 62.    పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ఏ భాగానికి అత్యధికంగా క్యాన్సర్ సోకుతుంది?
     పురుష గ్రంథి (Prostate gland)
 
 63.    కలరా బ్యాక్టీరియా సాధారణంగా జీర్ణ నాళంలోని ఏ భాగంలో అభివృద్ధి చెందుతుంది?
     చిన్నపేగు
 
 64.    లేని దృశ్యాలను, శబ్దాలను అనుభూతి పొందే మానసిక వ్యాధి?
     స్కిజోఫ్రీనియ
 
 65.    నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ ఎక్కడుంది?
        బెంగళూరు
 
 66.    గవద బిళ్లలు ఏ అవయవానికి సోకుతాయి?
         పెరోటిడ్ రకపు లాలాజల గ్రంథులు
 
 67.    ప్లేగు వ్యాధి కారకం?
          ఎర్సీనియపైస్టిస్
 
 68.    కుష్టు వ్యాధి కారకం?
         మైకోబ్యాక్టీరియం లెప్రే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement