Mosquito control
-
ఈ టోపీ ఉంటే దోమలు దగ్గరికి కూడా రావు!
ఇక్కడ ఫొటోలో టోపీ మీద వాలిన తూనీగ కనిపిస్తోంది కదూ! అచ్చంగా తూనీగలాగానే కనిపిస్తున్నా, ఇది తూనీగ కాదు. తూనీగ ఆకారంలో రూపొందించిన పెండెంట్. ముమ్మూర్తులా తూనీగలనే పోలి ఉండే ఇలాంటి పెండెంట్లను జపానీస్ కంపెనీ ‘మికి లోకోస్’ ఇటీవల మార్కెట్లోకి తెచ్చింది. పీవీసీ మెటీరియల్‌తో తయారు చేసిన ఈ తూనీగ పెండెంట్లు జపాన్‌లోని ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు, ఈ తూనీగ పెండెంట్లతో మరో లాభం కూడా ఉంది. అదేంటంటారా? ఈ పెండెంట్లను వేసుకున్న వారికి దోమల బెడద తప్పుతోందట! వీటిని చూస్తేనే చాలు, దోమలు పరారవుతున్నట్లు జనాలు గుర్తించడంతో, వీటికి మరింతగా గిరాకీ పెరిగింది. (క్లిక్: ఈ ఇల్లుకు కరెంటు అక్కర్లేదు.. ఎందుకంటే..) -
కాఫీ పొడితో ఇలా చేస్తే దోమలు పరార్..!
దోమ కాటు వల్ల చాలా మంది అనేక అనారోగ్య సమస్యలకు గురవుతుంటారు. అసలే ఇది వర్షాకాలం. ఈ సీజన్లో మురికిగా ఉన్న ప్రదేశాల్లో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల దోమల కాటుS వల్ల ప్రాణాంతక వ్యాధులైన డెంగ్యూ, మలేరియా వచ్చే ప్రమాదం అధికంగా ఉంది. దోమల బెడద నుంచి విముక్తి పొందడానికి అనేక రకాల మందులు, రసాయనాలు నేడు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ, అవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేక పోతున్నాయి. అంతే కాకుండా ఈ రసాయనాలు మన ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి. అందువల్ల కొన్ని చిట్కాల ద్వారా దోమలను తరిమి కొట్టేయవచ్చు సులువుగా... ఇంట్లోని దోమలను తరిమికొట్టడంలో కాఫీ పొడి చాలా సమర్థంగా పని చేస్తుంది. ఇందుకోసం ముందుగా ఒక బౌల్లో నిప్పులు తీసుకుని.. అందులో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్‌ను కొంచెం కొంచెంగా వేస్తే పొగ వస్తుంది. ఆ పొగ ఇల్లు మొత్తం వ్యాపించేలా చేయాలి. దాంతో ఇంట్లో దోమలు ఎక్కడున్నా బయటకు పారిపోతాయి. ఎందుకంటే, కాఫీ పొడి వాసన దోమలకు పడదు. ఒక్క దోమలనేæకాదు... ఇంకా ఏవైనా కీటకాలు ఉన్నా కూడా ఈ వాసనకు పరార్ అవుతాయి. నిన్న మొన్నటి వరకు పెద్దవాళ్లు సాయంత్రం వేళల్లోనూ, తలంటి పోసుకున్న తర్వాత కురులను ఆరబెట్టుకోవడం కోసమూ సాంబ్రాణి ధూపం వేయడం మనకు తెలిసిందే. నిప్పుల మీద వెల్లుల్లి పొట్టు వేసినా... ఎండబెట్టిన వేపాకులు వేసినా కూడా ఆ వాసనకు దోమలతోపాటు ఇతర కీటకాలు కూడా పారిపోతాయి. తులసి మొక్క.. ప్రతి భారతీయుని ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. ఈ తులసి మొక్క ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. ఇది దోమల లార్వా, ఇతర కీటకాలను చంపడానికి చాలా సహాయపడుతుంది. తులసి వాసన కీటకాలు, దోమలను దరి చేరనివ్వకుండా చేస్తుంది. గుల్ మెహందీ మొక్క.. గుల్ మెహందీని మనం రోజ్మేరీ అని కూడా పిలుస్తారు. ఈ మొక్క దోమలు, ఇతర కీటకాలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ మొక్క పువ్వులు చాలా ఘాటైన వాసన కలిగి ఉంటాయి కాబట్టి దోమలను, కీటకాలను దూరంగా ఉంచేందుకు సహాయపడుతుంది. పుదీనా.. వేసవిలో ఇంట్లో తయారు చేసే దాదాపు ప్రతి వస్తువులో పుదీనాను వాడతారు. పుదీనాలోంచి వచ్చే వాసన కీటకాలను, దోమలను తరిమికొట్టడానికి పనిచేస్తుంది కాబట్టి ఇంటి పెరటిలో లేదా కనీసం కుండీలలో అయినా పుదీనాను పెంచుకోవడం మంచిది. వాటినుంచి వచ్చే వాసన మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. బంతి మొక్క.. బంతి పువ్వును ప్రతి శుభకార్యంలో అలంకరణకు వాడతారు. దీనిని ఇంగ్లీష్‌లో మేరిగోల్డ్ అంటారు. దీనిని వివిధ దేశాలలో వివిధ రకాలుగా పిలుస్తారు. ఈ మొక్క ఆకులు, పువ్వుల నుంచి వెలువడే వాసన ఈగలు, దోమలు, ఇతర కీటకాలను దూరం చేస్తుంది. నిమ్మ గడ్డి మొక్క.. నిమ్మ గడ్డి మొక్క గురించి చాలా మందికి తెలుసు. ఈ మొక్క ఘాటైన వాసనతో ఉంటుంది. దీనిని పెంచుకోవడం వల్ల ఇంటి నుంచి దోమలను తరిమికొట్టడానికి సహాయపడుతుంది. అసలు దోమలు చేరకుండా ఉండాలంటే ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో చెత్త డబ్బాలో ఉన్న చెత్తను క్రమం తప్పకుండా పారేస్తుండాలి. తులసి, బంతి, లావెండర్.. వంటి మొక్కలను ఇంటి చుట్టూ కుండీల్లో పెంచుకోవాలి. ఈ మొక్కలు ఉంటే దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇక వేప నూనె, కొబ్బరి నూనె కలిపి.. రోజూ సాయంత్రం శరీరానికి రాసుకోవాలి. దాంతో ఆయా నూనెల వాసనకు దోమలు దగ్గరకు రాకుండా ఉంటాయి. -
తెల్లదోమ నియంత్రణకు జాతీయ స్థాయి పరిశోధనలు అవసరం
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కొబ్బరి, ఆయిల్‌పామ్, మామిడి, అరటి, బొప్పాయి, సీతాఫలం, కోకో పంటలను దెబ్బతీస్తున్న సర్పలాకార తెల్లదోమ (రుగోస్ స్పైరల్లింగ్ వైట్ఫ్లై) నియంత్రణకు విస్తృత పరిశోధనలు నిర్వహించేలా బాధిత రాష్ట్రాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. తెల్లదోమ ప్రభావంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్న తమిళనాడు రాష్ట్రంలో తీసుకుంటున్న నియంత్రణ చర్యలను పరిశీలించేందుకు నాగిరెడ్డి నేతృత్వంలోని బృందం కోయంబత్తూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆ రాష్ట్ర శాస్త్రవేత్తలతో బుధవారం భేటీ అయింది. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ.. తెల్లదోమ ప్రభావంతో మన రాష్ట్రంలో 2019–20లో 21,966 హెక్టార్లు, 2020–21లో 35,875 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొబ్బరి, ఆయిల్‌పామ్, నెల్లూరు జిల్లాలో అరటిపై ఈ దోమ ఎక్కువగా ఆశించినట్టు గుర్తించామన్నారు. ఇది జూన్, జూలై, ఆగస్టు నెలల్లో తగ్గిపోతున్నప్పటికీ.. తిరిగి సెప్టెంబర్‌లో మొదలై డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా విస్తృత పరిశోధనలు చేయాలని ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌ను ఆదేశించారన్నారు. ఉద్యాన వర్సిటీ అభివృద్ధి చేసిన జీవ నియంత్రణ చర్యల వల్ల 20 శాతానికి మించి నియంత్రించలేకపోతున్నారన్నారు. బయో కంట్రోలింగ్, ఆముదం రాసిన ఎల్లోపాడ్స్ ఎక్కువగా సిఫార్సు చేస్తున్నామని, పురుగుల మందులను అజాడిరక్టిన్‌తో కలిపి వాడొద్దని సూచిస్తున్నారని చెప్పారు. పెద్దఎత్తున బదనికలను సరఫరా చేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాన్ని ప్రకటించి ఆర్థిక చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉందని నాగిరెడ్డి స్పష్టం చేశారు. -
ఇక మస్కిటోలు.. మస్కా ‘కుట్ట’లేవు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరవాసుల్ని దోమలు ఎడాపెడా కుట్టి పారేశాయి. డెంగీ కేసులు పెరిగిపోయాయి. దీంతో ఏకంగా హైకోర్టు జోక్యం చేసుకుని రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు సహా పలువురిని తన ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. దోమల నివారణ చర్యలు తీసుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికారులు చర్యలకు దిగారు. ఏ ప్రాంతంలో డెంగీ కారక దోమలు ఎక్కువున్నాయో గుర్తించేందుకు ప్రయోగాత్మకంగా ‘మస్కీట్’అనే ఉపకరణాలను శేరిలింగంపల్లి జోన్ మినహా మిగతా ఐదు జోన్లలోని ఐదు ప్రాంతాల్లో అమర్చారు. వీటి ద్వారా వెల్లడయ్యే లెక్కలతో ఆయా ప్రాంతాల్లోని దోమల రకాల్ని గుర్తిస్తారు.ఆపై నివారణ చర్యలు చేపడతారు. ‘మస్కీట్’లు ఎక్కడెక్కడ? సికింద్రాబాద్ జోన్– బేగంపేట కూకట్పల్లి జోన్– బోరబండ ఎల్బీనగర్ జోన్– నాచారం చార్మినార్ జోన్– మలక్‌పేట ఖైరతాబాద్ జోన్– జీహెచ్ఎంసీప్రధాన కార్యాలయం 902: గ్రేటర్లో సెపె్టంబర్ 5 – అక్టోబర్ 30 మధ్య ప్రభుత్వాస్పత్రుల్లో నమోదైన డెంగీ కేసులు 1,415: ప్రైవేట్ ఆస్పత్రుల్లోధ్రువీకరించిన డెంగీ అనుమానిత కేసులు బేగంపేటలో దోమల బెడద ఎక్కువ.. మస్కీట్ ఉపకరణాల్లోకి చేరిన దోమలను లెక్కించడం ద్వారా డెంగీని వ్యాపించే దోమలు బేగంపేట, నాచారం ప్రాంతాల్లో ఎక్కువున్నట్టు గుర్తించారు. బోరబండ, మలక్‌పేట తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. డెంగీ, చికున్‌గున్యా కు కారణమైన ఈడిస్ ఈజిప్టి, ఈడిస్ అల్బోపిక్టస్ తెగలకు చెందిన దోమలు, మలేరియా కారకాలైన అనాఫిలిస్ సబ్పిక్టస్, అనాఫిలిస్ క్యూలిసిఫేసీస్ కూడా బేగంపేట లోనే ఎక్కువ. మెదడువాపు, బోదకాలు వ్యాధులకు కారణమైన క్యూలెక్స్ క్వింక్లకు సైతం బేగంపేటనే అడ్డా.. తరువాత స్థానంలో బోరబండ ఉంది. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో మాత్రం అన్ని రకాల దోమలూ స్వల్ప సంఖ్యలోనే ఉన్నాయి. ఐదుచోట్ల లెక్కలతో అంచనా కష్టం వివిధ రకాల దోమలు సికింద్రాబాద్ జోన్ పరిధిలోనే ‘మస్కీట్’కు ఎక్కువగా చిక్కాయి. ఇంత పెద్ద మహానగరంలో ఐదు ప్రాంతాల్లోని లెక్కల ఆధారంగా దోమల రకాలను అంచనా వేయడం కష్టమని జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ రాంబాబు తెలిపారు. దాదాపు వంద ప్రాంతాల్లో ఇటువంటివి ఏర్పాటైతే ఏ వ్యాధికారక దోమలు ఎక్కువున్నాయో స్పష్టత వస్తుందన్నారు. ప్రస్తుతం ఉపకరణాలు బిగించిన ప్రాంతాల్లో ఏ రకం దోమలు ఎక్కువున్నాయో గుర్తించి, నివారణ చర్యలు తీసుకుంటామన్నారు. నెల పాటు అధ్యయనం తరువాత ‘మస్కీట్’లెక్కలపై స్పష్టత వస్తుందన్నారు. ‘మస్కీట్’ఇలా పని చేస్తుంది.. మస్కీట్ ఉపకరణాల్లో లిక్విడ్, సెన్సర్లతో పాటు ఉండే ప్రత్యేక వాసనలు వదులుతారు. వీటికి దోమలు ఆకర్షితమై ఉపకరణాల్లోకి చేరతాయి. మస్కీట్‌కు అనుసంధానించిన కంప్యూటర్ డ్యాష్‌బోర్డు ఆధారంగా ఇలా చేరిన దోమల్లో రకానివెన్నో విశ్లేషిస్తారు. ఆయా ప్రాంతాల్లో ఏయే వేళల్లో దోమల తీవ్రత ఎక్కువ ఉంటుందో కూడా అంచనా వేయవచ్చు. ఒక్కో మస్కీట్ ఉపకరణానికి జీహెచ్ఎంసీ రూ.70 వేల చొప్పున వెచ్చించింది. ఈ యంత్రాలం వినియోగం ద్వారా మొదట ఆయా ప్రాంతాల్లోని దోమల రకాలను గుర్తిస్తారు. తద్వారా ఆయా దోమకారక వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటారు. -
దోమల నివారణకు డ్రోన్ టెక్నాలజీ
సాక్షి, హైద్రాబాద్ : నగరంలో ఆధునాతన టెక్నాలజీ ఉపయోగించి చెరువులు, నాలాల సుందరీకరణ పనులు చేపడుతున్నామని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. శుక్రవారం మియాపూర్ గుర్నాధం చెరువులో దోమల నివారణకు డ్రోన్ టెక్నాలజీతో యాంటీ లార్వా మందు పిచికారీ పనులను జీహెచ్ఎంసీ చేపట్టింది. ఈ కార్యక్రమానికి మేయర్‌తోపాటు ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు మేక రమేష్, నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. మేయర్ మాట్లాడుతూ సిబ్బందికి వీలుకాని చోట డ్రోన్లతో మందుల పిచికారీ, గుర్రపు డెక్క తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నామని, రానున్న రోజుల్లో నగరమంతా ఇదే టెక్నాలజీ ఉపయోగిస్తామని తెలిపారు. -
రక్త పిశాచాలు వచ్చేశాయ్..!
సాక్షి, దర్శి టౌన్: వర్షాకాలం.. వ్యాధుల వ్వాప్తికి అనువైనది. ఎక్కడికక్కడ వర్షం నీరు, మురుగు నిల్వ ఉండటంతో దోమలు వ్వాప్తి చెందుతాయి. జనంపై దాడి చేస్తాయి. వ్యాధుల వ్వాప్తికి కారణం అవుతాయి. దోమల నివారణలో ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్ శాఖలు ఏమాత్రం అలక్ష్యం చేసినా అతిసారా, డయేరియా, చికున్ గున్యా, విషజ్వరాలు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. పారిశుధ్యం మెరుగుపరచని కారణంగా 2017లో జిల్లాలో 1.10 లక్షల మంది విషజ్వరాల బారిన పడ్డారు. మొత్తం 71 మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులను నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. దోమల సంతానోత్పత్తి ఇలా.. ► నిల్వ ఉన్న మురుగు నీటిలో దోమలు జీవిస్తాయి. ► వర్షాకాలంలో గుడ్లు పెట్టి సంతానోత్పత్తితో వృద్ధి చెందుతాయి. ► దోమ జీవిత కాలం 40 నుంచి 60 రోజులు ఉంటుంది. ► ఒక దోమ జీవిత కాలంలో సుమారు పది వేల గుడ్లు పెడుతుంది. ► గుడ్ల దశ నుంచి దోమగా మారడానికి కేవలం 10 నుంచి 12 రోజలు పడుతుంది. ► ఆడ దోమలే మనుషులను కుడతాయి. వ్యాధుల వ్వాప్తికి ఆడ దోమలే కారణం. దోమల వల్ల వచ్చే వ్యాధులు దోమలు కుట్టడం వల్ల మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, ఫైలేరియా, మెదడు వాపు వ్యాధులు సోకుతాయి. ప్లాస్మోడియం, ఫాల్లిఫారం అనే పరాన్న జీవి కలిగి ఉన్న ఆడ ఎనాఫిలిస్ దోమ కుట్టడం వల్ల మలేరియా వస్తుంది. చలితో కూడిన జ్వరం దీని లక్షణం. సకాలంలో స్పందించి వైద్య సేవలు పొందకపోతే మరణించే అవకాశాలూ లేకపోలేదు. చికున్ గున్యా ఈ వ్యాధి కూడా నీటి నిల్వలో పెరిగే ఈజిప్ట్, టైగర్ దోమల వల్ల వస్తుంది. తీవ్రమైన జ్వరాలు, కీళ్లనొప్పులు, ఒళ్లు నొప్పులు వస్తాయి. మందులు వాడితే తగ్గినట్టుండి మళ్లీ వస్తుంది. వైద్యుని పర్యవేక్షణలో చికిత్స పొందాలి. డెంగీ మంచినీరు, మురుగు నీటిలో పెరిగిన ఏడిస్ ఈజిప్ట్ అనే దోమ లేదా టైగర్ దోమ కుట్టడం వల్ల డెంగీ సోకుతుంది. డెంగీ హేమరేజస్ ఫీవర్, డెంగీ షాక్ సిండ్రోమ్‌కు గురైతే మరణాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాధి సోకితే తీవ్రమైన జ్వరం, శరీరం ఎర్రగా కందిపోయి దద్దుర్లు రావడం, కళ్లు కదిలించలేక పోవడం, ఒళ్లు, కండరాల నొప్పులు, సాధారణ వాంతులు, రక్తం వాంతులు అవుతాయి. రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోతుంది. వ్యాధిగ్రస్తుడు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వస్తుంది. వ్యాధి నయం అయ్యే వరకు మందులు వాడాలి. మెదడు వాపు క్యూలెక్స్ దోమ కుట్టడం వల్ల వస్తుంది. ఈ వ్యాధి చిన్నపిల్లలకు ఎక్కువగా సంక్రమిస్తుంది. ఈ వ్యాధి వల్ల కళ్లు తిరగడం, రోగి అపస్మారక స్థితిలోకి వెళ్లడం జరుగుతుంది. కదల్లేని నిస్సహాయ స్థితికి చేరుకుంటారు. పందులకు కుట్టిన వ్యాధికారక వైరస్ దోమలు మనుషులకు కుట్టడం వల్ల వ్యాధి సంక్రమిస్తుంది. నివారణ ఇలా.. పరిశుభ్రమైన వాతావరణం కలిగి ఉండాలి. మురుగు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. పరిసరాల్లో చెత్తాచెదారం, పేడదిబ్బలు దూరంగా వేయాలి. కొబ్బరి బొండాలు, పాత టైర్లు, వినియోగించని మట్టి పాత్రలు, పూల కుండీలు, దోమలు అభివృద్ధి చెందే పనికిరాని పరికరాలు ఇళ్లకు దూరంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఫ్రిజ్, కూలర్లు ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించి వస్తువులను ఎండబెట్టడం ద్వారా దోమలను నివారించుకోవచ్చు. దోమలు నివాసాల్లోకి రాకుండా కిటికీలు, తలుపులు సాయంత్రం మూసివేయాలి. దోమల నిర్మూలనకు కాయిల్స్ వాడాలి. అప్రమత్తం చేశాం ఇప్పడిప్పుడే వర్షాలు కురుస్తున్నాయి. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఎటువంటి అనారోగ్యానికి గురైనా సమాచారం అందించి వైద్యసేవలు పొందాలని సూచిస్తున్నాం. – బి.రత్నం, పీహెచ్సీ వైద్యాధికారి, తూర్పుగంగవరం -
దోమలు పెంచితే జైలే
-
దోమలు పెంచితే జైలే
ముసాయిదాలో ఏముంది? ⇒ అధికారులు నోటీసు ఇచ్చిన 24 గంటల్లోగా తమ పరిసరాల్లో దోమలను నివారించాలి ⇒ లేదంటే సంబంధిత అథారిటీ చర్యలు తీసుకుంటుంది ⇒ ఇళ్లు, తోపుడు బళ్లు, ఇతర స్థలాల్లో దోమలు పెరిగే పరిస్థితులు కల్పిస్తే రూ. 5 వేల వరకూ జరిమానా ⇒ భవన నిర్మాణం, హోటళ్లు తదితర చోట్ల రూ. 50 వేల ఫైన్, నెల రోజులు జైలుశిక్ష ⇒ త్వరలో కొత్త చట్టాన్ని అమలులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది సాక్షి, అమరావతి: దోమల పెంపకం ఏంటి.. జైలు ఏంటి, జరిమానా ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అసలు దోమలను ఎవరైనా పెంచుతారా అనుకుంటున్నారా? ఇటీవల దోమలపై దండయాత్ర చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు దోమల నియంత్రణకు కొత్త చట్టం తీసుకురాబోతోంది. తమ పరిసర ప్రాంతాల్లో దోమలు పెరిగే పరిస్థితులు కల్పిస్తే ఆయా ప్రాంతాల యజమానులపై జరిమానా విధించనున్నారు. అంతేకాదు జైలుకు కూడా పంపించనున్నారు. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లుకు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. త్వరలోనే బిల్లు చట్టరూపం దాల్చనుంది. ఈ చట్టం ప్రకారం.. నివాస గృహాలు, రహదారుల పక్కన తోపుడు బళ్లు పరిసర ప్రాంతాల్లో దోమలు పెరిగే వాతావరణం సృష్టిస్తే తొలిసారి రూ. వెయ్యి జరిమానా విధిస్తారు. అయినా కూడా రెండోసారీ అలాంటి వాతావరణాన్ని సరిదిద్దకపోతే రూ. ఐదు వేలు ఫైన్ వేస్తారు. అంతే కాకుండా దోమ గుడ్ల నివారణకు ఇచ్చిన గడువులోగా చర్యలు తీసుకోకపోతే రోజుకు రూ. వంద చొప్పున ఫైన్ కట్టాల్సి ఉంటుంది. దోమల గుడ్ల పెరుగుదలకు కారణమయ్యే ఖాళీ స్థలాలు, భవన నిర్మాణ స్థలాలు, హోటళ్లు, ఆహార నిల్వ సంస్థలు, కల్యాణ మండపాలు, మైనింగ్ ప్రాంతాలు, ప్రైవేట్, ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లకు తొలిసారి రూ. 25 వేలు.. రెండోసారి రూ. 50 వేలు జరిమానా విధిస్తారు. దీంతో పాటు నెల రోజుల పాటు జైలు శిక్ష కూడా వేసే అవకాశం ఉంది. కేంద్ర సంస్థలకు ఫైన్ తప్పదు.. రైల్వే స్టేషన్లు, పోస్టాఫీసులు, ఓడరేవులు తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో దోమల గుడ్ల పెరుగుదలకు కారణమైతే తొలిసారి రూ. 25 వేలు జరిమానా విధిస్తారు. రెండో సారైతే రూ. 50 వేలు జరిమానా విధించడంతో పాటు బాధ్యులైన వారికి నెల రోజులు జైలు శిక్ష కూడా విధిస్తారు. అలాగే దోమల గుడ్లు పెరగడానికి కారణమైన ఇళ్లు, ఇతర భవనాలు, స్థలాలను తనిఖీ చేసే అధికారాన్ని సంబంధిత అథారిటీకి చట్టంలో కల్పించనున్నారు. దోమల నియంత్రణ చర్యల్లో ఉన్న అధికారులను ఆయా స్థలాల యజమానులు అడ్డుకుంటే.. జరిమానాతో పాటు మూడు నెలల పాటు జైలు శిక్ష కూడా విధించనున్నారు. స్థానిక సంస్థల పరిధిలోని డ్రైయిన్లు, కాల్వలు, ఇతర నీటి సంస్థలు దోమలు పెరగకుండా చర్యలు తీసుకోవాలి. దోమల నివారణ చర్యలు చేపట్టంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత స్థానిక సంస్థల చైర్మన్లు లేదా అథారిటీపై కూడా కేసు నమోదు చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు తమ పరిసరాల్లో దోమల నివారణను ఒక విధిగా పరిగణించాలని చట్టంలో స్పష్టం చేయనున్నారు. స్థల యజమాని లేదా ఆ పరిసరాల్లో నివాసం ఉంటున్న వారు తప్పనిసరిగా చేయాల్సిన పనులు. ► నీటితో ఉన్న ఖాళీ డబ్బాలు, బాటిళ్లు, కొబ్బరి బొండాలు, టైర్లు తదితర వాటిల్లో దోమలు గుడ్లు పెడతాయి కాబట్టి.. పరిసరాల్లో అలాంటి వాటిని తొలగించాలి. ► నీరు సాఫీగా పోయేందుకు డ్రైనేజీ పైపుల్లో ఆటంకాలు లేకుండా చూడాలి. బావులు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలి. ► నివాస ప్రాంతాల్లో దోమల పెరగడానికి దోహదపడే కుళ్లిన కూరగాయలు, ఇతర చెత్త చెదారాలను తొలగించాలి. ► దోమల గుడ్లు పెరుగుదలకు ఎటువంటి పరిస్థితులున్నా అలాంటి వాటిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలి. ► యజమానులకు నోటీసులిచ్చినా పట్టించుకోని సమయంలో.. అథారిటీ దోమల నివారణ చర్యలు చేపట్టి అందకయ్యే వ్యయాన్ని ఆయా వ్యక్తుల నుంచి వసూలు చేస్తుంది. ► డెంగీ వ్యాధి నివారణకు ఎటువంటి వ్యాక్సిన్ గానీ ప్రత్యేకంగా చికిత్స గానీ లేదని, ఈ నేపథ్యంలో వ్యాధి సోకకుండా ముందస్తు నివారణ చర్యలను చేపట్టడం ఒకటే మార్గమని ప్రభుత్వం అభిప్రాయపడింది. డెంగీతో పాటు మలేరియా, ఫైలేరియా, చికున్‌గున్యా, మెదడువాపు తదితర వ్యాధుల నివారణకు దోమలను గుడ్లు దశలోనే నిర్మూలించాల్సి ఉందని ప్రభుత్వం పేర్కొంది. -
గ్రేటర్‌పై డెంగీ పంజా..!
ఈ ఏడాది వందకుపైగా కేసులు నమోదు బాధితుల్లో ఏసీపీ సహా.. బాలింత, ఏడాది బాలిక సిటీబ్యూరో : గ్రేటర్‌పై డెంగీ, మలేరియా జ్వరాలు మళ్లీ పంజా విసురుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆరోగ్య రాజధాని తాజాగా ఈ జ్వరాల పేరు వింటే చాలు ఉలిక్కిపడుతోంది. మురుగు నీరు పొంగి వీధుల్లో రోజుల తరబడి నిల్వ ఉండటం, దోమల నియంత్రణ కోసం ఫాగింగ్ చేయక పోవడం వల్ల బస్తీవాసులపై విజృంభిస్తున్నాయి. బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీ శ్యామ్‌సుందర్‌రెడ్డి వారం రోజుల నుంచి తీవ్రడెంగీ జ్వరంతో బాధపడుతుండగా, చికిత్స కోసం ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అలాగే ఉప్పల్ పరిధిలోని స్వరూప్‌నగర్‌కు చెందిన వెంకటేష్ కుమార్తె ప్రణతి(1) జ్వరంతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు తార్నాకలోని సురక్ష ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గడంతో వైద్యులు అనుమానిత డెంగీ కేసుగా చేర్చుకుని చికిత్స చేస్తున్నారు. వ రంగల్‌కు చెందిన బాలింత మమత (20) తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఇటీవల ఉప్పల్ ఆధిత్య ఆస్పత్రిలో చేరగా పరీక్షించిన వైద్యులు డెంగీగా నిర్ధారించారు. ప్లేట్లెట్ కౌంట్ 13 వేలకు పడిపోవడంతో ప్రసవ సమయంలో ఆమెకు 36 యూనిట్ల రక్తం ఎక్కించాల్సి వచ్చింది. ఫీవర్ ఆస్పత్రిలో ప్రస్తుతం మరో ఐదుగురు డెంగీ అనుమానిత బాధితులు చికిత్స పొ ందుతున్నారు. బాధితుల్లో ఎక్కువ శాతం శివారు ప్రాంత వాసులే. మూడో స్థానంలో గ్రేటర్.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,512 డెంగీ కేసులు నమోదు కాగా, వీరిలో ఇప్పటికే 12 మంది మృతి చెందారు. కాగా అత్యధిక కేసులు ఖమ్మం, వరంగల్,ఆదిలాబాద్ ఏజెన్సీ జిల్లాల్లో నమోదు కాగా, ఆ తర్వాతి స్థానంలో హైదరాబాద్ ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్‌లో 76 మలేరియా కేసులు నమోదు కాగా, వందకుపైగా డెంగీ కేసులు నమోదు అయ్యాయి. మరో లక్ష మందికిపైగా విష జ్వరాల బారిన పడినట్లు స్వయంగా అధికారిక లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య వేలల్లో ఉంటుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డెంగీని బూచిగా చూపి.. జీహెచ్ఎంసీ పరిధిలో అధికారికంగా 1,470 పైగా మురికి వాడలు ఉన్నాయి. సంపన్నులు నివసించే బంజారాహిల్స్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, ఫిలింనగర్‌లతో పాటు సామాన్యులుండే లంగర్‌హౌస్, మాణికేశ్వరినగర్, గుడిమల్కాపూర్, మూసారంబాగ్, గోల్నాక, భోలక్‌పూర్, చిలకలగూడ, వారసిగూడ, పార్శీగుట్ట, గాంధీనగర్, ఉప్పల్, తదితర బస్తీల్లో డెంగీ, మలేరియా దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. వ్యాధుల నివారణ కోసం జిల్లా వైద్యాధికారులు ముందస్తుగా ఓ యాక్షన్ ప్లాన్ రూపొందించాల్సి ఉంది. ఆయా బస్తీల్లో పర్యటించి, వ్యాధులపై ముందే ఓ అంచనాకు రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నమే చేయలేదంటే ఆశ్చర్య పోనవసరం లేదు. ఇదిలా ఉంటే పలు కార్పొరేట్ ఆస్పత్రులు సాధారణ జ్వరాలతో బాధపడుతున్న వారికి డెంగీని బూచిగా చూపి నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి.వ్యాధి నిర్ధారణ కోసం ఐపీఎంకు రెండో శాంపిల్ పంపాలనే నిబంధన ఉన్నా..పట్టించుకోవడం లేదు. -
దోమలపై సమరం
సాక్షి, చెన్నై:రాష్ట్ర వ్యాప్తంగా దోమలపై సమరానికి ప్రభుత్వం సిద్ధమైంది. దోమల నియంత్రణ, సీజన్ వ్యాధుల నివారణ లక్ష్యంగా చర్యలు చేపట్టింది. ఈ మేరకు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సచివాలయంలో మంగళవారం సీనియర్ మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోకి మరికొద్ది రోజుల్లో ఈశాన్య రుతు పవనాలు ప్రవేశించనున్నాయి. ఈ ఏడాది ఆ పవనాల రూపంలో వర్షాలు ఆశాజనకంగా ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి పెట్టింది. వర్షం తీవ్రంగా ఉన్న పక్షంలో ప్రజలకు సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా ఇప్పటికే కార్యాచరణను సిద్ధం చేసింది. ఇక, ఈ వర్షాలకు తోడుగా ప్రతి ఏటా డెంగీ, చికున్గునియూ, విషజ్వరాలు ప్రబలుతున్నారుు. దీన్ని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం ముందు జాగ్రత్తలకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం సచివాలయంలో సీనియర్ మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో మంత్రులు నత్తం విశ్వనాథన్, వైద్య లింగం, ఎడపాడి పళనిస్వామి, ఎస్పీ వేలుమణి, విజయభాస్కర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ వర్గీస్, సలహాదారు షీలా బాలకృష్ణన్, గ్రామీణ, నగరాభివృద్ధి, ఆరోగ్య, ప్రజాపనులు, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా శాఖల నేతృత్వంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా దోమలపై సమరానికి సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా దోమల నియంత్రణే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని తీర్మానించారు. డెంగీ, మలేరియా, చికున్గునియూ జ్వరాలు ప్రబలకుండా, ప్రజల్ని అప్రమత్తం చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. అవగాహన కార్యక్రమాలతో పాటు ఆరోగ్య శాఖ నేతృత్వంలో కల్పించనున్న వైద్య సేవల గురించి ప్రజలకు వివరించనున్నారు. దోమల్ని నియంత్రించేందుకు ఫాగింగ్ యంత్రాలను ప్రతి గ్రామానికీ అందజేయూలని తీర్మానించారు. దోమలు వృద్ధి ఎక్కడెక్కడ అధికంగా ఉందో గుర్తించి, వాటిని సమూలంగా నాశనం చేసేలా మందులను ప్రయోగించనున్నారు. సమాచారమివ్వండి జ్వరాలు ప్రబలకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే విధంగా అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేయూలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. ప్రకటనలు, ర్యాలీలు, లఘు చిత్రాల రూపంలో ఈ కార్యక్రమాలు సాగనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా జ్వరాల తీవ్రత అధికంగా ఉన్న పక్షంలో తక్షణం సమాచారం అందించేందుకు వీలుగా ప్రత్యేక ఫోన్ నంబర్లను ప్రకటించారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో పూర్తి స్థాయిలో మందులు నిల్వ ఉండేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అత్యవసర వైద్య సేవలకు 104 నెంబర్ లేదా, 9444340496, 9361482898, 044- 24350496, 24334810 నంబర్లను సంప్రదించాలని ప్రభుత్వం ప్రకటించింది. -
దోమల నుంచి చిన్నారుల రక్షణకు....
చిన్నారులను దోమల బారి నుంచి రక్షించడానికి ఇప్పుడు కొత్తపద్ధతి అందుబాటులోకి వచ్చింది. మార్కెట్లో ‘మస్కిటో టాటూస్’ దొరుకుతాయి. వీటిని తీసుకొచ్చి చిన్నారుల చెంత ఉంచితే చాలు.. దోమలు ఇట్టే పారిపోతాయి. ఇవి మస్కిటో రిపెల్లర్లుగా పనిచేస్తాయి. చిన్నారుల దుస్తుల్లో, సాక్సుల్లో, ఊయల్లో.. ఎక్కడైనా వీటిని పెట్టవచ్చు. ఇవి ప్రత్యేకంగా సిట్రోనెల్లా ఆయిల్‌తో కోట్ చేయబడి ఉంటాయి. ఫలితంగా పిల్లలకు దగ్గరగా ఉంచినా దుష్ర్పభావాలు చూపవు. మస్కిటో రిపెల్లర్ల కన్నా ఈ టాటూస్ వాడకం చాలా మంచిది. -
పంజా విసురుతున్న డెంగీ
బాన్సువాడ : డెంగీ మళ్లీ విజృంభిస్తోంది. పారిశు ధ్య లోపం, విచ్చలవిడిగా పందుల సంచా రం, దోమలపై నియంత్రణ కరువవడంతోనే డెంగీ ప్రబలుతోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పందులను అదుపు చేయాలని నెల రోజుల క్రితం మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పంచాయతీ అధికారులకు ఆదేశించినా వారు పెడచెవిన పెడుతున్నారు. గత ఏడాది వర్ని మండలం రుద్రూర్లో డెంగీతో సౌమ్య (19) అనే యువతి మృతి చెందగా, ఆ సంఘటన జరిగిన 15 రోజులకే బాన్సువాడలోని మిస్రీ గల్లీలో నివసించే మొ హియొద్దీన్ పటేల్ (65) అనే రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి మృతి చెందారు. బాన్సువాడకే చెందిన మరో ఇద్దరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కనిపించని పారిశుధ్యం కలుషిత నీరు సేవించడంతో డయేరియా కూ డా పంజా విసురుతోంది. ఇటీవల కురిసిన వానలు, ఎప్పటికప్పుడు తొలగించని చెత్తా చెదారంతో వీధులు దుర్గంధభరితమయ్యా యి. పారిశుధ్య బాధ్యతను నిర్వహించడం లో పంచాయతీలు విఫలమవుతున్నాయి. అ రకొర నిధులు, తగినంత సిబ్బంది లేకపోవ డం, సర్పంచుల పర్యవేక్షణ లోపించడంతో పరిపాలన గాడి తప్పుతోంది. అంటురోగా లు ప్రబలుతాయన్న ముందు చూపు అధికారులకు లేపోవడంతో పట్టణాలు, గ్రామాలు దుర్గంధానికి నిలయాలుగా మారుతున్నా యి. దీంతో దోమలు, ఈగలు స్వైర విహారం చేస్తున్నాయి. వీటికి పందులు కూడా తోడవడంతో జనావాసాలు మురికి కూపాలను తల పిస్తున్నాయి. ఏ గ్రామంలో చూసినా మురికి నీరు కాలువలా ప్రవహిస్తోంది. సమస్యల పరిష్కారమేదీ? గ్రామాలలో తాగునీరు, వీధి దీపాలు, పారి శుధ్యం వంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సి ఉంది. వీధి దీపాలు, పారి శుధ్యం పనుల మాట దేవుడెరుగు కనీసం తాగునీటి సౌకర్యం కల్పించడంలో కూడా పంచాయతీ అధికారులు విఫలమవుతున్నారని ప్రజలు వాపోతున్నారు. బాన్సువాడ, బీ ర్కూర్, కోటగిరి, వర్ని మండలాల మారుమూల గ్రామాల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. కోనాపూర్, హన్మాజీపేట, ఇబ్రాహీంపేట, బరంగెడ్గి, హంగర్గ తదితర గ్రా మాలలో పారిశుధ్యం గురించి పట్టించుకొనేవారు కరువయ్యారు. వైద్యశాఖ అధికారులెక్కడ? ర్యాపిడ్ రెస్పాన్స్ టీం లను ఏర్పాటు చేసుకుని వ్యాధులు ప్రబలిన ప్రాంతాల్లో వేగంగా చర్యలు తీసుకోవాల్సిన వైద్యశాఖ అధికారులు సైతం పట్టించుకోవ డం లేదు. గ్రామస్థాయి అధికారుల మధ్య స మన్వయం లోపిస్తోంది. 13వ ఆర్థిక సంఘం నిధులు, జనరల్ ఫండ్ నిధులను పారిశుధ్య పనులకు వినియోగించాల్సి ఉంది. కానీ, ఎవ్వరూ ఆ వైపున దృష్టి సారించలేదు. గ్రామాలలో రోజూ ప్రజలకు సరఫరా చేసే నీటిని ఏఎన్ఎంలు పరీక్షలు చేయాల్సి ఉండగా వారూ నిర్లక్ష్యం చేస్తున్నారు. బాన్సువాడ పట్టణంలో పారిశుధ్యం మరింత అధ్వానంగా మారింది. -
దోమల నియంత్రణకు వినియోగించే చేపలు?
1. జంతువుల నుంచి మానవులకు సోకే వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? జూనూసిస్ (Zoonosis) 2. మానవునిలో సాధారణ ఫ్లూ చికిత్సలో వాడే ఔషధాలు? అమాంటడిన్, రిమాంటడిన్ 3. మానవునికి సోకే బర్డ ఫ్లూ, స్వైన్ ఫ్లూ చికిత్సలో వాడే ప్రత్యేక ఔషధాలు? టమీఫ్లూ (ఒసెల్టామవిర్), రెలెంజ (జనామవిర్) 4. ప్రపంచ మధుమేహ దినోత్సవం? నవంబరు 14 5. ‘ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్’ ఎక్కడ ఉంది? బ్రసెల్స్, బెల్జియం 6. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ 7. ప్రపంచ క్షయ దినోత్సవం? మార్చి 24 8. {పపంచవ్యాప్తంగా మధుమేహ రోగులు అత్యధికంగా ఉన్న దేశం? చైనా (భారత్, అమెరికా వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి) 9. గర్భాశయ ముఖ క్యాన్సర్ (ఇ్ఛటఠిజీఛ్చి ఇ్చఛ్ఛిట) కారక వైరస్? హ్యూమన్ పాపిల్లోమ వైరస్ 10. దేశంలో తొలిసారిగా ఏ్ఛఞ్చ్టజ్టీజీట ఆ గ్చఛిఛిజ్ఛీను ఎప్పుడు ప్రారంభించారు? 1997 11. భారత్‌లో తొలిసారిగా ఎయిడ్సను ఎప్పుడు, ఎక్కడ కనుగొన్నారు? 1986, చెన్నై 12. క్షయ రోగులపై సమగ్ర సమాచారాన్ని అందించే డేటాబేస్? నిక్షయ్ 13. ప్రపంచ పార్కిన్‌సన్‌స దినోత్సవం? ఏప్రిల్ 11 14. ఈ ఏడాది చైనాలో మానవునికి సంక్రమించిన కొత్త బర్డ ఫ్లూ వైరస్‌గా దేన్ని గుర్తించారు? H10N8 15. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆప్ వైరాలజీ ఎక్కడుంది? పుణే 16. చికున్ గున్యా వ్యాధి కారకం? చిక్‌వి (Chikv) (ఇది ఒక టోగా వైరస్ ఆల్ఫావైరస్, ఆర్బోవైరస్) 17. మలేరియా వ్యాధి దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందని తొలిసారిగా కనుగొన్నవారు? సర్ రొనాల్డ్ రాస్ 18. {r-Mోమా వ్యాధి కారకం? క్లామిడియ ట్రకోమ్యాటిస్ 19. సిఫిలిస్ అనే లైంగికంగా సంక్రమించే వ్యాధి కారకం? ట్రిపొనిమా ప్యాలిడం 20. ప్రపంచ ఆరోగ్య సంస్థ డెరైక్టర్ జనరల్? మార్గరెట్ చాన్ 21. హెచ్ఐవీని తొలిసారిగా కనుగొన్నవారు? ల్యూక్ మారిటనీర్, ఫ్రాంకోమస్ బార్సినోస్సీ (1983లో) 22. శరీరంలో ఏ కీలక తెల్ల రక్తకణాలపై HIV ప్రత్యేకంగా దాడి చేస్తుంది? ఖీ4 లింఫోసైట్స్ 23. పరాగ రేణువుల అలర్జీ ద్వారా వచ్చే జ్వరం? హే జ్వరం 24. అలర్జీ కారక వయ్యారిభామ (మాచర్లకంప) శాస్త్రీయ నామం? పార్థీనియం హిస్టిరోఫోరస్ 25. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కడుంది? న్యూఢిల్లీ 26. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంటెరిక్ డిసీజెస్ ఎక్కడుంది? కోల్‌కతా 27. క్షయ బ్యాక్టీరియా ఏ ఆకారంలో ఉంటుంది? దండాకారం (బాసిల్లస్) 28. నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది? పుణే 29. 'Typbar' పేరుతో ఒక సరికొత్త 'Typho id Conjugate Vaccine' ను దేశంలో ఏ ఫార్మా కంపెనీ విడుదల చేసింది? భారత్ బయోటెక్ 30. అమ్మవారు వ్యాధి నివారణకు ఇచ్చే టీకా? వారిసెల్లా టీకా 31. తామర, కాండిడియాసిస్, మైసిటిస్మస్, అథ్లెట్స్ఫుట్ అనే వ్యాధులు ఏ కారకాల ద్వారా వ్యాపిస్తాయి? శిలీంధ్రాలు 32. ప్రముఖ ఆస్ట్రోఫిజిస్ట్ స్టీఫన్ హాకింగ్సకు ఉన్న వ్యాధి? అమయాట్రాపిక్ లాటిరల్ స్ల్కిరోసిస్/ లవ్గ్రెఫిగ్ వ్యాధి 33. {r-Mోమా వ్యాధి వల్ల ఏ అవయవం ప్రభావితమవుతుంది? కన్ను 34. క్షయను సమగ్రంగా నియంత్రించి, నివారించే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈైఖీ (Directly Observed Treatment Shortcourse) కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టింది? 1995 35. ప్రపంచ మలేరియా దినోత్సవం? ఏప్రిల్ 25 36. మలేరియా వ్యాధి చికిత్స కోసం 2012లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సరికొత్త ఔషధం? సిన్రియం (పైపరాక్విన్) 37. ఎయిడ్స ప్రబలత చాలా తక్కువ ఉన్న ప్రాంతాల్లో అధిక ప్రాధాన్యతతో అవగాహన కల్పించే ఉద్దేశంతో Red Ribbon Express (RRE) తొలిసారిగా ఎప్పుడు ప్రారంభమైంది? డిసెంబరు 1 , 2007 38. హషిమొటో వ్యాధి ఏ అవయవానికి చెందింది? అవటు గ్రంథి 39. గనేరియా వ్యాధి కారకం? నిస్సేరియా గనేరియా 40. టైఫాయిడ్ వ్యాధి నిర్ధారణ కోసం చేసే పరీక్ష? వైడల్ టెస్ట్ 41. సిఫిలిస్ వ్యాధి నిర్ధారణ కోసం నిర్వహించే పరీక్ష? VDRL (వెనెరల్ డిసీజ్ రీసెర్చ ల్యాబొరేటరీ టెస్ట్) 42. వేరుశనగ, ఇతర పప్పుదినుసుల్లో ఉండే హానికారక శిలీంధ్ర విష పదార్థాలు? అఫ్లటాక్సిన్స 43. గర్భాశయ ముఖ క్యాన్సర్ కారక వైరస్‌ను తొలిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త? హరాల్డ్ జర్ హాసన్ 44. బొట్యులిజం/ఫుడ్ పాయిజనింగ్ వ్యాధి కారకం? క్లాస్ట్రీడియం బొట్యులినం 45. కోరింత దగ్గు (Whoopling Cough) వ్యాధి కారకం? బోర్తుటెల్లా పెర్తుసిస్ 46. గర్భిణుల ఆహారంలో ఫోలిక్ ఆమ్లం (ఆ9 విటమిన్ లోపం ద్వారా శిశువులో వచ్చే వ్యాధి? స్పైన్ బెఫైడ్ 47. పార్కిన్‌సన్‌స వ్యాధిలో నాడీ క్షీణత ద్వారా ఏర్పడని కీలక న్యూరోట్రాన్సమీటర్? డోపమైన్ 48. పోలియో కారక వైరస్? పికోర్న వైరస్ 49. భారత్‌లో 'Expanded Programme on Immunization' అనే టీకా కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1978 50. అతి పెద్ద బ్యాక్టీరియం ఏది? ఎపులోపిసియం ఫిషల్ సోని (50 Microns పరిమాణం) 51. క్షయ నివారణకు నవజాత శిశువునకు అందించే టీకా? BCG (బాసిల్లస్ కాల్మేట్ గ్వెరిన్) 52. ధమనుల్లో కొవ్వు పేరుకుని, అవి గట్టిబడి ఇరుకుగా మారడం వల్ల వచ్చే వ్యాధి? అథెరో స్ల్కిరోసిస్ 53. మ్యాడ్ కౌ వ్యాధి కారకం? ప్రయాన్ 54. నిలకడ నీటిలో దోమలు పెట్టిన గుడ్ల నుంచి ఏర్పడే డింభకాలను నియంత్రించడానికి వినియోగించే డింభకాహార చేపలు? గాంబూసియా అఫినిసిస్, మెనో అండ్ ట్రౌట్ 55. ఆహారంలో ప్రోటీన్ల లోపం ద్వారా చిన్నారుల్లో ఏర్పడే శారీరక మాంద్యత? క్వాషియోర్కార్ 56. గవద బిళ్లల కారక వైరస్? మార్బిల్లి వైరస్ 57. జపనీస్ ఎన్సిఫలైటిస్ వ్యాధి వల్ల ఏ అవయవం వాపు చెందుతుంది? మెదడు 58. క్షయ చికిత్సలో వాడే ఔషధాలు? ఐసోనియాజిడ్, పైరాజినమైడ్, ఇథాంబ్యుటాల్ 59. షిజెల్లోసిస్ అనే బ్యాక్టీరియా వ్యాధి ప్రధాన లక్షణం? జిగట విరేచనాలు 60. కలరా వ్యాధి చికిత్సలో వాడే ఔషధం? టెట్రాసైక్లిన్ 61. తొలిసారిగా చికున్‌గున్యా వ్యాధిని ఏ దేశంలో గుర్తించారు? టాంజానియా (1953) 62. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ఏ భాగానికి అత్యధికంగా క్యాన్సర్ సోకుతుంది? పురుష గ్రంథి (Prostate gland) 63. కలరా బ్యాక్టీరియా సాధారణంగా జీర్ణ నాళంలోని ఏ భాగంలో అభివృద్ధి చెందుతుంది? చిన్నపేగు 64. లేని దృశ్యాలను, శబ్దాలను అనుభూతి పొందే మానసిక వ్యాధి? స్కిజోఫ్రీనియ 65. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ ఎక్కడుంది? బెంగళూరు 66. గవద బిళ్లలు ఏ అవయవానికి సోకుతాయి? పెరోటిడ్ రకపు లాలాజల గ్రంథులు 67. ప్లేగు వ్యాధి కారకం? ఎర్సీనియపైస్టిస్ 68. కుష్టు వ్యాధి కారకం? మైకోబ్యాక్టీరియం లెప్రే