
సాక్షి, హైద్రాబాద్ : నగరంలో ఆధునాతన టెక్నాలజీ ఉపయోగించి చెరువులు, నాలాల సుందరీకరణ పనులు చేపడుతున్నామని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. శుక్రవారం మియాపూర్ గుర్నాధం చెరువులో దోమల నివారణకు డ్రోన్ టెక్నాలజీతో యాంటీ లార్వా మందు పిచికారీ పనులను జీహెచ్‌ఎంసీ చేపట్టింది. ఈ కార్యక్రమానికి మేయర్‌తోపాటు ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు మేక రమేష్, నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. మేయర్ మాట్లాడుతూ సిబ్బందికి వీలుకాని చోట డ్రోన్‌లతో మందుల పిచికారీ, గుర్రపు డెక్క తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నామని, రానున్న రోజుల్లో నగరమంతా ఇదే టెక్నాలజీ ఉపయోగిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment