
ఫైల్ ఫోటో
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు అయన కుటుంబ సభ్యులకు కరోనా నెగెటివ్‌గా నిర్దారణ అయినట్లు వైద్యులు తెలిపారు. తన కారు డ్రైవర్‌కు కరోనా సోకడంతో శుక్రవారం మేయర్ మరోసారి కరోనా పరీక్షలు చేయించుకున్న విషయం తెలిసిందే. పరీక్షల్లో నెగెటివ్‌గా రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా ఆయనకు కరోనా పరీక్షలు చేయగా నెగెటివ్‌గా తేలింది. (మరోసారి మేయర్‌కు పరీక్షలు)
గురువారం మేయర్ పేషీలోని మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో వైద్యులు బొంతు రామ్మోహన్‌కు మరోసారి పరీక్షలు చేశారు. మేయర్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులంతా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. కాగా, మేయర్ పేషీ సహ బల్దియా ప్రధాన కార్యాలయంలో వారంలో మొత్తం 3 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో అధికారుల నుంచి దిగువస్థాయి సిబ్బంది వరకు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహించే వారిలో దాదాపు సగం మంది మాత్రమే హాజరవుతున్నారు. (పది కోట్ల మందికి కరోనా ముప్పు!)
Comments
Please login to add a commentAdd a comment