
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ నగరాన్ని 17 జోన్లుగా విభజించామని మంత్రి తలసాని పేర్కొన్నారు. మంగళవారం కరోనాపై మంత్రి తలసాని, నగర మేయర్ బొంతురామ్మోహన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. లాక్‌డౌన్ అమలు, ప్రజలకు నిత్యావసర వస్తువులకు ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్షా 80 వేల మంది వలస కార్మికులు ఉన్నారన్నారు.
36 వేల మంది వలస కార్మికులకు బియ్యం, నగదు అందించామన్నారు. వేరు వేరు మార్గాల ద్వారా వలస కార్మికులకు సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. సోడియం హైపోక్లోరైడ్ స్ప్రె చేస్తున్నామని, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు కోఆర్డినేట్ చేస్తున్నారని తెలిపారు. కరెంట్, పారిశుద్ధ్యం ఇబ్బంది లేకుండా చూస్తున్నామని, రోడ్లు, ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. వలస కార్మికులను ఆదుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment