Drone service
-
వైద్య రంగంలో డ్రోన్ సేవలు
-
ఈమె.. డ్రోనాచార్యులే
‘నేను బాగుండాలి’ అని ఎంతోమంది అనుకుంటారు. కొందరు మాత్రం ‘అందరూ బాగుండాలి... అందులో నేనుండాలి’ అనుకుంటారు. ప్రీత్ సంధూ రెండో కోవకు చెందిన మహిళ.అగ్రీ–డ్రోన్ స్టార్టప్ ‘ఏవీపీఎల్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన కలను నెరవేర్చుకోవడమే కాదు వందలాదిమందికి ఉద్యోగావకాశాలను కల్పించింది. ఎంతో మందికి మైక్రో–ఎంటర్ప్రెన్యూర్లుగా కొత్త జీవితాన్ని ఇచ్చింది. హరియాణాలోని హిస్సార్‌కు చెందిన జ్యోతి మాలిక్ ఆదర్శవాద భావాలతో పెరిగింది. స్వతంత్రంగా ఉన్నతస్థాయికి ఎదగాలనేది ఆమె కల. ముంబైలో చదువుకోవడంతో ఆమె కలలకు రెక్కలు వచ్చాయి. ఉద్యోగంలో చేరింది. అయితే తన సంతోషం ఎంతోకాలం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రెండేళ్ల తరువాత ఉద్యోగం కోసం వస్తే నిరాశే ఎదురైంది. ‘ఈ జీవితం ఇంతేనా!’ అనే నిరాశామయ కాలంలో ‘ఏవీపీఎల్’ జ్యోతి మాలిక్‌కు మైక్రో–ఎంటర్‌ప్రెన్యూర్‌గా కొత్త జీవితాన్ని ఇచ్చింది.‘ఇప్పుడు నేను ఇండిపెండెంట్. ఎవరైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే తమ కలను నిజం చేసుకోవచ్చు’ అంటుంది ఆత్మవిశ్వాసం నిండిన గొంతుతో జ్యోతిమాలిక్.అమృత్‌సర్‌లోని ఖాల్సా కాలేజిలో చదువుకున్న ప్రీత్ సంధూకు కల్పనా చావ్ల రోల్ మోడల్. రాకెట్లు అంటే ఆసక్తి. కాలేజీ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అగ్రి–డ్రోన్ స్టార్టప్ ‘ఏవీపీఎల్’ను మొదలుపెట్టింది.వ్యాపార, వ్యవసాయ రంగాలకు అవసరమైన డ్రోన్ ఆపరేషన్లలో నైపుణ్యం కోసం గ్రామీణ ప్రాంతాలలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించింది ఏవీపీఎల్. ది రిమోట్ పైలట్ సర్టిఫికెట్(ఆర్పీసీ), అగ్రికల్చర్ స్ప్రే కోర్సులు గ్రామీణ ప్రాంతాలలో ఎంతోమందికి ఉపకరించాయి. ఈ కోర్సులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడానికే పరిమితం కాలేదు. విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేలా చేశాయి. మైక్రో–ఎంటర్‌ప్రెన్యూర్‌గా అడుగు వేయడానికి ఉపకరించాయి. ‘ఫీట్ ఆన్ ది స్ట్రీట్’ నినాదంతో ‘ఏవీపీఎల్’ 12 రాష్ట్రాల్లో ఎన్నో ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాలు ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపాయి. ప్రీత్ సంధూ నాయకత్వంలో ‘ఏవీపీఎల్’ అగ్రికల్చరల్ ఇన్నోవేషన్, స్కిల్ డెవలప్మెంట్లో కొత్త ప్రమాణాలు నెలకొల్పింది. ‘ఏవీపీఎల్’ శిక్షణా కార్యక్రమాల వల్ల ఒక్క హరియాణాలోనే 800 మంది డ్రోన్ ఎంటర్ప్రెన్యూర్లుగా మారారు.‘ఆశావాదమే కాదు అవసరమైన సమయంలో ఆత్మవిశ్లేషణ కూడా అవసరం’ అంటుంది ప్రీత్.ప్రయాణం మొదలుపెట్టిన కొత్తలో తమ స్కిల్లింగ్ వెంచర్‌లోని లోపాలను విశ్లేషించింది.‘మా కంపెనీ తరఫున ఎంతోమందికి శిక్షణ ఇచ్చాం. ఇక అంతకుమించి ఆలోచించలేదు. అయితే చాలామందికి గ్రామీణ నేపథ్యం ఉండడం వల్ల పట్టణాల్లో ఉండలేక తిరిగి సొంత ఊళ్లకు వెళ్లి΄ోయేవారు. ఈ నేపథ్యంలో అసలు వారు పట్టణం ఎందుకు రావాలి? గ్రామాల్లోనే ఉద్యోగావకాశాలు సృష్టించవచ్చు కదా అనే ఆలోచన వచ్చింది’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది ప్రీత్.‘మన దేశంలో పట్టణాల్లోనే కాదు ఎక్కడైనా సరే ఉద్యోగావకాశాలు సృష్టించవచ్చు’ అనే ఆమె నమ్మకం నిజమైంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన నవీన సాంకేతిక పరిజ్ఞానంతో రూ΄÷ందించిన శిక్షణ కార్యక్రమాలు, రిమోట్ పైలట్ సర్టిఫికెట్, అగ్రికల్చర్ స్ప్రే కోర్సుల ద్వారా యువతరం ఊరు దాటి పట్టణం వెళ్లాల్సిన అవసరం లేకుండాపోయింది.‘1.5 లక్షల విలేజ్ ఎంటర్ప్రెన్యూర్లను తయారు చేయాలనేది మా లక్ష్యం. డ్రోన్లు వారి జీవితాలను మార్చివేస్తాయి అనే నమ్మకం నాకు ఉంది’ అంటుంది ‘ఏవీపీఎల్’ కో–ఫౌండర్, సీయీవో ప్రీత్ సంధూ. -
డ్రోన్ దీదీ.. పల్లెటూరి పైలట్!
మహిళా సాధికారతకు ఉత్తమ సాధనాలలో ఒకటిగా నిలిచింది డ్రోన్ శిక్షణ. ఢిల్లీకి ఉత్తరాన ఉన్న సింఘోలా, నైరుతి జిల్లాల్లోని 200 మంది మహిళలు శిక్షణ తీసుకొని డ్రోన్ లైసెన్స్ పొందేందుకు సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా గ్రామీణ మహిళలకు సాధికారిత కల్పించే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం ‘నమో డ్రోన్ దీదీ’ పథకాన్ని కిందటేడాది చేపట్టింది. ఇందులో భాగంగా శిక్షణ పొందిన మహిళలు దేశ రాజధానిలో ఇటీవల కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ పొందిన డ్రోన్ దీదీలు పైలెట్ లైసెన్స్ సర్టిఫికెట్స్ పొంది, స్వయం ఉపాధి అవకాశాలను పొందుతారు. శిక్షణ పొందిన వారికి డ్రోన్లను ప్రభుత్వమే అందజేస్తుంది.స్వయం ఉపాధికి..డ్రోన్లను స్వయంగా ఉపయోగించడానికి, అద్దెకు ఇవ్వడానికి అనుమతిస్తారు. సర్వేలు, ఈవెంట్ షూట్లు, ఫొటోగ్రఫీ, వ్యవసాయంలో సీడింగ్, పురుగుమందులు చల్లడం వంటి వాటి కోసం డ్రోన్లను ఉపయోగించడమే లక్ష్యంగా ఉద్యోగావకాశాలు పొందుతారు.ఆర్థికాభివృద్ధికి..మూడేళ్ల కాలంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు 15 వేల డ్రోన్లను అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వ్యవసాయంతో పాటు అదనంగా మహిళలు డ్రోన్ సంబంధిత వ్యాపారాలను చేసుకునే అనుమతి లభిస్తుంది. దీనివల్ల ఆర్థిక వృద్ధి, అభివృద్ధికి మరింతగా దోహదపడుతుంది. ఎరువులను చేతితో పిచికారీ చేసే సాంప్రదాయ పద్ధతులను డ్రోన్లతో భర్తీ చేయడం ద్వారా పురుగు మందుల వల్ల కలిగే ప్రమాదం తగ్గుతుంది. పంట దిగుబడి పెరుగుతుంది.అంతేకాదు, డ్రోన్ల వాడకంలో ఖర్చులు తగ్గి, రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. టెక్నాలజీలో ఆధునాతన శిక్షణ, నైపుణ్యాభివృద్ధికి కృషి జరపడం అంటే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను మరింత శక్తిమంతులుగా తయారు చేయడమే.ఇవి చదవండి: Health: ఆ ఆలోచన నుంచి.. బయటపడేదెలా? -
టీబీ రోగులకు డ్రోన్ సేవలు
బీబీనగర్ : టీబీ రోగుల కోసం బీబీనగర్ ఎయిమ్స్ ప్రయోగాత్మకంగా చేపట్టిన డ్రోన్ సేవలు విజయవంతమయ్యాయి. టీబీ రోగులు, అనుమానితుల నుంచి రక్త పరీక్షలకు నమునాలు సేకరించి వెనువెంటనే ల్యాబ్‌లకు పంపించడం, తిరిగి అవసరమైన మందులను రోగులకు పంపేందుకు డ్రోన్ సాయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాలు, తండాలపరిధిలో 150 మంది నమునాలను సేకరించి డ్రోన్ ద్వారా ల్యాబ్‌లకు పంపి.. తిరిగి మందులు చేరవేశారు. ఆదివారం ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్‌భాటియా డ్రోన్ సేవల గురించి వెల్లడించారు.రెండు నెలలుగా డ్రోన్ సేవలపై చేపట్టిన ప్రయోగాలు ఫలించడంతో టీబీ రోగులకు చాలా సులువుగా సేవలు అందుతున్నాయి. పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన డ్రోన్ సేవలను ఇటీవల ఎయిమ్స్‌కు వచ్చిన కేంద్రమంత్రి ఆర్కే.సింగ్ పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లకు అనుసంధానం భువనగిరి, రామన్నపేట, బీబీనగర్ బొమ్మల రామారం మండలాల పరిధిలోని పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లకు డ్రోన్లను అనుసంధానం చేశారు. ఇక్కడి నుంచి రోగుల నమునాలను సేకరించి రిమోట్ ద్వారా జిల్లా కేంద్రంలోని క్షయవ్యాధి యూనిట్లకు డ్రోన్ ద్వారా పంపుతారు. తిరిగి అక్కడి నుంచి రోగులకు అవసరమయ్యే టీబీ మందులు, ట్యూబ్‌లు, రియాజెంట్లను డ్రోన్‌లో అమర్చి రోగులకు పంపుతారు. దీని కోసం ప్రస్తుతం ఎయిమ్స్‌లోని 3 డ్రోన్ పైలెట్లు, 2 డ్రోన్లు అందుబాటులో ఉంచారు. రోగుల ఖర్చు తగ్గించేందుకు సహాయపడుతుంది డ్రోన్ సేవల ద్వారా టీబీ నిర్థారణలో ట్యూమరౌండ్ సమయం తగ్గించడం, దూర ప్రాంతాల్లో, రవాణా సరిగ్గా లేని చోట నివసించే వ్యక్తులకు రవాణా ఖర్చులు తగ్గించేలా డ్రోన్ సేవలు సహాయపడతాయి, జిల్లా టీబీ కార్యాలయం నుంచి డ్రోన్ కార్యకలాపాలను పీహెచ్‌సీలతో పాటు సబ్‌సెంటర్లకు సైతం విస్తరిస్తున్నాం. – వికాస్‌భాటియా, డైరెక్టర్, ఎయిమ్స్ -
ఏకధాటిగా 40 గంటలు ఎగిరే డ్రోన్.. ఇంకెన్నో ప్రత్యేకతలు
అమెరికా, భారత్ మధ్య ‘ఎంక్యూ-9బీ ప్రిడేటర్ డ్రోన్ల’పై ఒప్పందం చివరి దశకు చేరుకుంది. దాదాపు 4 బిలియన్ల డాలర్ల(రూ.33 వేలకోట్లు) విలువైన ఒప్పందంలో భారత్‌కు ఎంక్యూ-9బీ సాయుధ డ్రోన్ల అమ్మకానికి అమెరికా ఆమోదం తెలిపింది. ఈ డీల్ అమెరికా-భారత వ్యూహాత్మక సంబంధాన్ని బలోపేతం చేయనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎంక్యూ-9బీ ప్రిడేటర్ డ్రోన్ల ప్రత్యేకతలు ఇవే.. సముద్రపు నిఘా కోసం సీ గార్డియన్ డ్రోన్లు, భూసరిహద్దు పరిరక్షణ నిఘా కోసం స్కై గార్డియన్ డ్రోన్లను ప్రత్యేకంగా వినియోగించుకోవచ్చు. ఈ సాయుధ డ్రోన్లకు ప్రత్యేక సామర్థ్యాలు ఉంటాయి. ఫైటర్జెట్లు చేయగలిగే పనులు సైతం ఇవి చేస్తాయి. వీటికి హెల్ఫైర్ క్షిపణులు అమర్చి ఉంటాయి. శత్రువులను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, మందుగుండు సామగ్రితో విధ్యంసం సృష్టిస్తాయి. ఈ డ్రోన్లను నిఘా సామర్థ్యం ఉంటుంది. మానవతా సహాయం, విపత్తుల సమయంలో రక్షణ చర్యలు, గాలింపు చర్యలు, గాలో ముందస్తు హెచ్చరికలు, ఎలక్ట్రానిక్ వార్‌పేర్, యాంటీ సర్ఫేస్ వార్ఫేర్, యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్ల్లో ఈ డ్రోన్లను ఉపయోగించవచ్చు. మాదకద్రవ్యాల అక్రమరవాణా, పైరసీ వంటి పరిస్థితులను ఎదుర్కొవడానికి కూడా ఈ డ్రోన్లను మోహరించవచ్చు. ఇదీ చదవండి: జనవరిలో ‘తయారీ’కి కొత్త ఆర్డర్ల బూస్ట్ అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ఏకధాటిగా 30 నుంచి 40 గంటలపాటు ఈ డ్రోన్లు గాల్లో ఎగరగలవు. 40,000 అడుగుల ఎత్తు వరకు ఎగిరే సామర్థ్యం వీటికి ఉంటుంది. -
డ్రోన్లు నడపాలనుకుంటున్నారా? ఉచిత శిక్షణ ఇదిగో!
అభివృద్ధి చెందిన దేశాలు చాలా పంటల్లో వందశాతం యాంత్రీకరణను సాధించాయి. సాగును సరళతరం చేస్తూ ‘స్మార్ట్ వ్యవసాయం’ దిశగా పరుగులు తీస్తున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద వ్యవసాయ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి. ఇండియా అభివృద్ధికి వ్యవసాయరంగ పురోగతి అత్యంత కీలకం. ప్రపంచ ఆహార భద్రత నానాటికీ సంక్లిష్టంగా మారుతోంది. వాతావరణ మార్పులవల్ల వ్యవసాయ దిగుబడులు తగ్గుతున్నాయి. ఇందుకోసం సాగులో యంత్రీకరణను పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఉత్పత్తుల పెంపే లక్ష్యంగా అనేక దేశాలు, సంస్థలు కృషి చేస్తున్నాయి. డేటా అనలిటిక్స్, రోబోటిక్స్, కృత్రిమ మేధ (ఏఐ) వంటి ఆధునిక సాంకేతికతల ద్వారా పనిచేసే వ్యవసాయ పరికరాలు అందుబాటులోకి తెస్తున్నాయి. ఖర్చులను తగ్గించుకుని, ఉత్పాదకతను పెంచుకోవడంలో ఇవి కీలకంగా మారుతున్నాయి. ఇండియా కన్నా చైనాలో వ్యవసాయ యోగ్యమైన భూమి తక్కువ. దిగుబడి మాత్రం అధికం. అభివృద్ధి చెందిన దేశాలు సాగు రంగంలో పరిశోధనలు, అభివృద్ధిపై అధికంగా దృష్టి సారిస్తున్నాయి. వ్యవసాయంలో పూర్తి యంత్రాలను అమలు చేస్తున్నాయి. భారత్‌లోనూ ఇటీవలి కాలంలో సాగులో డ్రోన్లు, రోబోల వాడకం ప్రారంభమైంది. అందుకుతోడుగా హైదరాబాద్‌కు చెందిన మారుత్ డ్రోన్స్ అనే అంకురసంస్థ వ్యవసాయంలో వినియోగించే డ్రోన్లను తయారుచేసేందుకు డీజీసీఏ అనుమతులు పొందింది. డ్రోన్స్ ద్వారా ఉపాధి పొందాలనుకునే సర్వీస్ ప్రొవైడర్లకు, నూతన సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయంలో దిగుబడి పెంచుకోవాలనుకునే రైతులతోపాటు స్వయంగా ఉపాధి పొందాలనుకునే మహిళలకు రెండు వారాల్లోనే డ్రోన్ లైసెన్సులు అందజేస్తోంది. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు 500 మందికి పైగా.. ఇతర రాష్ట్రాల్లో 300 మందికి ఉచితంగా శిక్షణ ఇచ్చినట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి. కంపెనీ తయారుచేసిన ‘ఏజీ 365ఎస్ కిసాన్డ్రోన్’ (మల్టీయుటిలిటీ అగ్రికల్చర్ స్మాల్ కేటగిరీ డ్రోన్) ద్వారా మరింత మందికి శిక్షణ అందించేందుకు సిద్ధమైంది. 25 కేజీల కంటే తక్కువ బరువు ఉండే ఈ డ్రోన్ ఫ్లైయింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు తాజాగా డీజీసీఏ అనుమతి పొందింది. పదేళ్ల గడువుతో లైసెన్సు.. తాజా డీజీసీఏ నిబంధనల ప్రకారం డ్రోన్ ఫ్లయింగ్ చేయాలంటే 18 ఏళ్ల వయసు, పాస్‌పోర్టు తప్పనిసరిగా ఉండాలి. దాదాపు రెండు వారాల్లో ఫ్లైయింగ్‌లో మెలకువలు పొందిన తర్వాత ఇన్స్ట్రక్టర్లు, అధికారుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించిన అనంతరం పదేళ్ల వ్యవధి ఉన్న లైసెన్సులు జారీ చేస్తారు. దేశంలోనే ప్రథమం ‘ఏజీ 365 కిసాన్డ్రోన్’...చిన్న, మధ్యస్థ విభాగంలో బ్యాటరీతో పనిచేస్తోందని సంస్థ వ్యవస్థాపకుడు ప్రేమ్ కుమార్ అన్నారు. ఏజీ 365 డ్రోన్‌ను 1.5లక్షల ఎకరాల్లో విస్తృతంగా పరీక్షించినట్లు చెప్పారు. దీన్ని వ్యవసాయంలో, డ్రోన్ శిక్షణ కోసం వినియోగించేందుకు ‘రిమోట్ పైలెట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (ఆర్పీటీఓ)’ అనుమతి లభించిందన్నారు. ఇలా రెండు ధ్రువీకరణలు అందుకున్న దేశంలోని తొలి డ్రోన్ ఇదేనని చెప్పారు. ఈ డ్రోన్‌కు 22 నిముషాల పాటు ఎగిరే సామర్థ్యం ఉంది. దీంతో పంట పొలాల్లో మందు పిచికారీ సులభం అవుతుంది. రైతులకు పొలాల వద్దే శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: చివరకు ఏఐలోనూ లింగవివక్ష! కేంద్రప్రభుత్వ నిర్ణయం ప్రకారం స్వయంఉపాది పొందాలనుకునే మహిళలు, మహిళా రైతులకు రెండువారాలపాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తయిన మహిళలు రోజూ డ్రోన్లను నడుపుతూ రూ.1500 వరకు సంపాదించే అవకాశం ఉన్నట్లు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌తో డ్రోన్ కొనుగోలు చేయాలనుకునే రైతులకు తక్కువ వడ్డీకే రూ.10లక్షల వరకు, సర్వీస్ ప్రొవైడర్లకు రూ.2కోట్ల వరకు రుణాలు అందిస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 50-100 శాతం సబ్సిడీ కూడా లభించే అవకాశం ఉందన్నారు. అయితే ఆ రుణాలు ఎలా పొందాలనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. -
డ్రోన్లతో చొరబాట్లు!
న్యూఢిల్లీ: డ్రోన్లతో ఉగ్రవాదులు ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, డబ్బులు చేరవేయడం గురించి విన్నాం. చొరబాట్లకు కూడా డ్రోన్లను ఉపయోగించుకుంటున్నట్లు తేలడం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్తాన్ చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కొన్ని నెలల క్రితం డ్రోన్‌తో పంజాబ్‌లో ఓ ఉగ్రవాదిని జార విడిచిందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ డ్రోన్‌కు 70 కిలోల వరకు బరువును మోసుకెళ్లగల సామర్థ్యం ఉందని తెలియజేశాయి. పాకిస్తాన్ భూభాగంలోని షాకర్‌గఢ్‌లో లష్కతే తోయిబా శిక్షణా కేంద్రంలో ఇలాంటి డ్రోన్ల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్న వీడియోను నిఘా వర్గాలు సేకరించాయి. డ్రోన్లు మనుషులను సునాయాసంగా మోసుకెళ్లి, నీటిలో భద్రంగా వదిలిపెడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. పంజాబ్‌లో డ్రోన్ సాయంతో అక్రమంగా చొరబడిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించామని అధికారులు చెప్పారు. లష్కరే తోయిబా నాయకులే డబ్బులు ఇచ్చి పంపించినట్లు అతడు అంగీకరించాడని తెలిపారు. డ్రోన్ సాయంతో పంజాబ్ వెళ్లి, అక్కడే స్థిరపడి, ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించాలంటూ లష్కరే తోయిబా నాయకత్వం నుంచి అతడికి ఆదేశాలు అందాయని వెల్లడించారు. పంజాబ్‌లో ఇప్పటికే మకాం వేసిన ముష్కరుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి తీసుకోవాలంటూ అతడికి సూచనలిచ్చారని పేర్కొన్నారు. లష్కరే తోయిబాపై భారత్ గతంలోనే నిషేధం విధించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి ఆయుధాలను, డ్రగ్స్‌ను పంపించడానికి పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు డ్రోన్లను వాడుకుంటున్నట్లు ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. ప్రధానంగా జమ్మూకశీ్మర్, పంజాబ్‌కు ఈ డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ వచ్చి పడుతున్నాయి. ఈ వ్యవహారం వెనుక పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతోపాటు ఖలిస్తాన్ అనుకూల శక్తుల హస్తం కూడా ఉండొచ్చని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం శ్రీనగర్: వాస్తవా«దీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చొరబాటు యత్నాన్ని భారత భద్రతా దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో చోటుచేసుకున్న ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లా జిల్లాలోని యూరీ సెక్టార్ హథ్లాంగ్ ఫార్వర్డ్ ఏరియాలో శనివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సైన్యం, కశ్మీర్ పోలీసులు, నిఘా ఏజెన్సీలు ఉమ్మడి ఆపరేషన్ చేపట్టాయని, చొరబాటు యత్నాన్ని భగ్నం చేశాయన్నారు. పొరుగు దేశం నుంచి మన భూభాగంలోకి ప్రవేశిస్తున్న ఉగ్రవాదులను అడ్డుకొనేందుకు ప్రయతి్నంచగా, కాల్పులు జరిపారని, దాంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయని తెలిపారు. కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు మరణించారని, ఇద్దరి మృతదేహాలను స్వా«దీనం చేసుకున్నామన్నారు. పాకిస్తాన్ వైపు నుంచి కాల్పులు కొనసాగుతున్నాయన్నారు. హతమైన ముగ్గురు ముష్కరుల వివరాలు తెలియాల్సి ఉందన్నారు. మరోవైపు, అనంత్‌నాగ్ జిల్లాలో ముగ్గురు భారత ఉన్నతాధికారులను బలి తీసుకున్న ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోందని వెల్లడించారు. ఈ ఆపరేషన్ శనివారం నాలుగో రోజుకు చేరింది. -
మారుత్ ఏజీ–365ఎస్ డ్రోన్‌కు డీజీసీఏ సర్టిఫికేషన్
హైదరాబాద్: బహుళ ప్రయోజనకారి అయిన ఏజీ–365ఎస్ వ్యవసాయ డ్రోన్‌కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి టైప్ సర్టిఫికేషన్ లభించినట్లు మారుత్ డ్రోన్స్ తెలిపింది. చిన్న, మధ్య తరహా బ్యాటరీ ఆధారిత డ్రోన్లకు డీజీసీఏ నుంచి టైప్ సర్టిఫికేషన్ పొందిన తొలి సంస్థ తమదేనని పేర్కొంది. ఈ డ్రోన్‌ను ఇటు పురుగు మందుల పిచికారీ కోసం వ్యవసాయ రంగంతో పాటు అటు రిమోట్ పైలట్ ట్రెయినింగ్ (ఆర్పీటీవో)లో కూడా ఉపయోగించవచ్చని తెలిపింది. దీనితో డ్రోన్ ఎంట్రప్రెన్యూర్ రూ. 40,000 నుంచి రూ. 90,000 వరకు సంపాదించుకునే అవకాశం ఉందని మారుత్ డ్రోన్స్ వ్యవస్థాపకుడు ప్రేమ్ కుమార్ విస్లావత్ తెలిపారు. అలాగే అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి నామమాత్రంగా 5–6శాతం వడ్డీ రేటుతో రూ. 10 లక్షల వరకు తనఖా లేని రుణాన్ని పొందేందుకు కూడా ఈ డ్రోన్‌కు అర్హత ఉంటుందని వివరించారు. -
సాగులో సాంకేతికత...వ్యవసాయంలో ఆధునిక యంత్రాలు డ్రోన్ ల వినియోగం
-
మరింత వేగంగా రీ సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం భూముల రీ సర్వేను మరింత వేగవంతం చేయనుంది. ఇందు కోసం కొత్తగా మరో 10 డ్రోన్లు కొనుగోలు చేసింది. విటాల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి టెండర్ల ద్వారా సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ ఈ డ్రోన్లు కొనుగోలు చేసింది. ప్రభుత్వం సర్వే ఆఫ్ ఇండియా, కొన్ని ప్రైవేటు డ్రోన్ ఏజెన్సీలను నియమించుకుని సర్వే చేయిస్తోంది. సర్వేను వేగంగా జరిపేందుకు గతంలో సర్వే శాఖ సొంతంగా 20 డ్రోన్లు కొనుగోలు చేసింది. ఇప్పుడు మరో 10 డ్రోన్లు సమకూర్చుకుంది. వీటి కోసం 20 మంది సర్వేయర్లకు డ్రోన్ పైలట్ శిక్షణ ఇచ్చింది. ప్రభుత్వ సర్వేయర్లనే సర్టిఫైడ్ డ్రోన్ పైలట్లుగా తయారు చేసింది. ఇలా ప్రభుత్వ డ్రోన్లను ప్రభుత్వ సర్వేయర్లే నిర్వహించడం దేశంలో ఇదే మొదటిసారి. సర్వే ఆఫ్ ఇండియా, ప్రైవేటు ఏజెన్సీల డ్రోన్లతో సమానంగా రాష్ట్ర సర్వే శాఖ డ్రోన్లు కూడా ఇప్పుడు కీలకంగా పని చేస్తున్నాయి. రోజుకు 100 నుంచి 150 చదరపు కిలోమీటర్లలో డ్రోన్ ఫ్లై చేస్తూ సర్వే చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. శీతాకాలం కావడంతో వాతావరణం అనుకూలంగా ఉంటుందని, సర్వే వేగంగా చేయవచ్చని సర్వే సెటిల్మెంట్ శాఖ అధికారులు చెబుతున్నారు. -
విశాఖలో డ్రోన్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వ్యవసాయంతోపాటు అనేక రంగాల్లో డ్రోన్ పరిజ్ఞానం వినియోగం పెరుగుతున్న దృష్ట్యా డ్రోన్ టెక్నాలజీపై మరింత విస్తృత పరిశోధనలు జరిపేందుకు విశాఖపట్నంలో జాతీయస్థాయి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన సోమవారం రాజ్యసభలో జీరో అవర్‌లో మాట్లాడారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో ఆవిష్కృతమైన అత్యంత కీలక సాంకేతిక పరిజ్ఞానాల్లో డ్రోన్ టెక్నాలజీ ఒకటని చెప్పారు. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత వ్యవసాయం, రక్షణ, రవాణా తదితర రంగాల్లో డ్రోన్ల వినియోగం బాగా పెరిగిందన్నారు. డ్రోన్ టెక్నాలజీ సాయంతో రైతులు తక్కువ శ్రమతో పంట దిగుబడులను 15 శాతం వరకు పెంచే అవకాశం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 65 శాతం జనాభా వ్యవసాయంపైనే ఆధారపడ్డారని, వ్యవసాయ రంగంలో కొత్త పరిశోధనలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి సాగులో ప్రయోగాలకు రాష్ట్ర రైతులు ఎప్పుడూ ముందుంటారని తెలిపారు. ఆహార ధాన్యాలతోపాటు పండ్లు, కూరగాయల సాగులో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని, రైతులు క్రమేణ ఆయిల్‌పామ్ సాగువైపునకు కూడా మళ్లుతున్నారని చెప్పారు. పోలవరం చెల్లింపుల్లో జాప్యం లేదు పోలవరం ప్రాజెక్టు పనుల నిమిత్తం ఖర్చుచేసిన సొమ్మును కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తోందని కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు చెప్పారు. 2014 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.15,970.53 కోట్లు ఖర్చు చేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు జవాబిచ్చారు. ఈ మొత్తంలో ఆమోదయోగ్యమైనవిగా గుర్తించిన బిల్లులకు రూ.13,226 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనుల బిల్లుల్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తనిఖీ చేసి వాటి చెల్లింపులకు సిఫార్సు చేసిన అనంతరం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని చెప్పారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఆర్థికశాఖ ద్వారా నిధులు మంజూరు చేయాలని 2016 సెప్టెంబర్ 30న ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. అయితే ఆఫీసు మెమొరాండం ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2014 ఏప్రిల్ 1 నుంచి కేవలం ఇరిగేషన్ కాంపొనెంట్ కింద అయిన ఖర్చు మాత్రమే భర్తీచేయాల్సి ఉందన్నారు. ఇథనాల్ స్టాకు పెంపు నిరంతర ప్రక్రియ పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాల్సిన అవసరం దృష్ట్యా దేశవ్యాప్తంగా ఇథనాల్ నిల్వల సామర్థ్యం పెంపు అనేది నిరంతర ప్రక్రియ అని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలి చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. 2020–21లో దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ కలిపినట్లు తెలిపారు. 2024 మార్చికల్లా కుళాయి కనెక్షన్లు ఏపీలోని 95.69 లక్షల గ్రామీణ కుటుంబాల్లో 64.07 లక్షల (66.96 శాతం) కుటుంబాలకు ఈ నెల 13వ తేదీనాటికి కుళాయి కనెక్షన్ల ద్వారా తాగునీరు అందించినట్లు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ తెలిపారు.వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ ప్రశ్నకు సమాధానమిచ్చారు. మూడు ప్రాంతాల నుంచి ఉడాన్ సేవలు ఉడాన్ విమానాల సేవల నిమిత్తం ఏపీలోని కడప, కర్నూలుతోపాటు ప్రకాశం బ్యారేజీలోని వాటర్ఏరోడ్రోమ్ గుర్తించామని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి వి.కె.సింగ్ తెలిపారు. కడప, కర్నూలు విమానాశ్రయాల నుంచి ఇప్పటికే సేవలు ప్రారంభమయ్యాయని వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు ప్రశ్నకు జవాబిచ్చారు. ప్రకాశం బ్యారేజీ నుంచి నిర్వహణపై సాధ్యాసాధ్యాల అధ్యయనం పూర్తయిందని తెలిపారు. ఐదేళ్లలో 2,943.53 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా రైల్వే ఐదేళ్లలో 2,943.53 మిలియన్ టన్నుల బొగ్గును రవాణా చేసిందని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ప్రశ్నకు జవాబిచ్చారు. పట్టణాలను స్మార్ట్‌సిటీ మిషన్‌లో చేర్చే ప్రతిపాదన లేదు ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలుసహా వేటినీ స్మార్ట్‌సిటీ మిషన్‌లో చేర్చే ప్రతిపాదన లేదని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ సహాయమంత్రి కౌశల్ కిషోర్ తెలిపారు. వైస్సార్సీపీ ఎంపీ బీద మస్తానరావు ప్రశ్నకు సమాధానమిచ్చారు. పైపులైను పనుల గడువు పొడిగించాలని కోరిన ఐఎంసీ కాకినాడ–విజయవాడ–నెల్లూరు పైపులైను పనులు 2021 మార్చికల్లా పూర్తిచేయాల్సి ఉందని, కానీ గడువును 2024 మార్చి వరకు పొడిగించాలని ఇండియన్ మొలాసెస్ సంస్థ (ఐఎంసీ) కోరిందని కేంద్ర పెట్రోలియం సహజవనరులశాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలి.. వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు జవాబిచ్చారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు 2,160.47 ఎకరాలు సేకరించిన ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ పద్ధతిలో భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం అభివృద్ధిని చేపట్టిందని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి జనరల్ వి.కె.సింగ్ తెలిపారు. విమానాశ్రయ అభివృద్ధికి సుమారు 2,203 ఎకరాల భూమి అవసరమని తెలిపారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 2,160.47 ఎకరాల భూమి సేకరించిందని చెప్పారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్స్ పాలసీ–2008 ప్రకారం.. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ అమలు బాధ్యత సంబంధిత విమానాశ్రయ డెవలపర్ లేదా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని తెలిపారు. విమానాశ్రయ ప్రాజెక్ట్‌ల పూర్తి అనేది భూసేకరణ, తప్పనిసరి అనుమతుల లభ్యత వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని టీడీపీ సభ్యుడు రవీంద్రకుమార్ ప్రశ్నకు జవాబిచ్చారు. -
చక్కని సాగుకు.. చిన్న డ్రోన్లు
వ్యవసాయ రంగంలో 45 కిలోల వరకు బరువు గల ప్రైవేట్ డ్రోన్లు గతంలో సేవలందించేవి. ఆయిల్ ఇంజన్ సహాయంతో నడిచే ఈ డ్రోన్ల వల్ల ఎక్కువ శబ్దంతో పాటు దాని బరువు కారణంగా వినియోగించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ పరిస్థితుల్లో వాటి బరువును 25 కేజీలకు కుదించిన ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఆధునిక సాంకేతికతను వినియోగించటం ద్వారా తాజాగా ఆ బరువును 250 గ్రాములకు తగ్గించగలిగింది. రానున్న రోజుల్లో అరచేతిలో ఇమిడిపోయేలా కేవలం 10 గ్రాముల బరువుతో డ్రోన్లను తయారు చేయడంపై దృష్టి సారించింది. ఈ తరహా డ్రోన్ అందుబాటులోకి వస్తే షేడ్ నెట్, గ్రీన్ మ్యాట్ తరహా సాగు విధానంలో సమస్యగా మారిన పరపరాగ సంపర్యాన్ని విజయవంతంగా జరిపించవచ్చు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: డ్రోన్ అంటే ఒకప్పుడు పెళ్లిళ్లు, బహిరంగ సభలు, పాదయాత్రల వీడియో, ఫొటోలు తీయడానికి మాత్రమే పరిమితం. అదే డ్రోన్ టెక్నాలజీ ఇప్పుడు అన్ని రంగాల్లో అడుగుపెట్టింది. సైనిక అవసరాలతో పాటు ఫుడ్ డెలివరీకి కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ సర్వేకి కూడా డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. రానున్న రోజుల్లో అరచేతిలో ఇమిడిపోయే బుల్లి డ్రోన్లు రంగ ప్రవేశం చేయనున్నాయి. ఈ తరహా డ్రోన్లను అభివృద్ధి చేసి వ్యవసాయ రంగంలో వినియోగించేలా ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం కృషి చేస్తోంది. ఇప్పటికే డ్రోన్ టెక్నాలజీని వ్యవసాయ రంగంలో వినియోగించడంతోపాటు రైతులనే డ్రోన్ పైలట్లుగా తీర్చిదిద్దే బాధ్యతను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం భుజాన వేసుకుంది. ప్రస్తుతం డ్రోన్ టెక్నాలజీని ఎరువులు, విత్తనాలను వెదజల్లేందుకు మాత్రమే వ్యవసాయ రంగంలో వినియోగిస్తున్నారు. రానున్న కాలంలో రోజుల్లో ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసి రైతులకు అన్ని దశల్లోనూ వ్యవసాయ పనులు చేసి పెట్టేలా డ్రోన్లను రూపొందించేందుకు ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎరువులు, పురుగు మందులు చల్లేందుకే.. వ్యవసాయంలో డ్రోన్లను ప్రస్తుతం పురుగు మందులు పిచికారీ చేసేందుకు వాడుతున్నారు. దీనివల్ల 25 శాతం వరకూ పురుగు మందులు ఆదా కావడంతోపాటు పొలం మొత్తం సమానంగా పిచికారీ చేసే అవకాశం కలిగింది. మరోవైపు ఎరువుల్ని చల్లడం, వెద పద్ధతిలో విత్తనాలు వేయడానికి వినియోగిస్తున్నారు. దీనివల్ల కూలీల ఖర్చు తగ్గుతోంది. మరోవైపు డ్రోన్లను వినియోగించి నేల స్వభావం తెలుసుకోవడం ద్వారా నేలలో ఏయే పోషకాలు అవసరం, ఏ పోషకాలు అధికంగా ఉన్నాయి, ఉప్పు నేలలు, చౌడు, ఉరకెత్తు ప్రాంతాలను గుర్తించి వాటికి అనుగుణంగా యాజమాన్య పద్ధతులు చేపట్టేందుకు ఉపయోగపడుతున్నాయి. ఇదే సందర్భంలో డ్రోన్లను ఉపయోగించి అడవుల్లో మొక్కల సాంద్రత తెలుసుకుని అవసరమైన ప్రాంతాల్లో విత్తనాలు చల్లుకునే అవకాశం ఉంది. చెరువులు, కుంటలు, నదులు, జలపాతాల్లో నీటి పరిమాణం అంచనా వేయడానికి, నీటిని నిల్వచేయడానికి వాటర్‌షెడ్స్, చెక్‌డ్యామ్‌లు ఎక్కడ ఎలా కట్టుకోవాలనే అంశాన్ని డ్రోన్ టెక్నాలజీతో తెలుసుకోవచ్చు. విప్లవాత్మక మార్పులకు శ్రీకారం డ్రోన్ టెక్నాలజీ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. విత్తనాలు చల్లుకోవడం నుంచి ఎరువులు, పురుగు మందులు వేయడం, పంటల అంచనా, పంటలకు అందించాల్సిన పోషకాలు అందించడంతో పాటు పలు అంశాల్లో ఈ టెక్నాలజీ ప్రయోజనకారిగా ఉంటుంది. అంగ్రూ తరపున డ్రోన్ వినియోగంపై శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నాం. రానున్న రోజుల్లో చిన్నపాటి డ్రోన్లను రైతులకు అందుబాటులోకి తెచ్చేలా కృషి జరుగుతోంది. – ఎ.సాంబయ్య, సీనియర్ శాస్త్రవేత్త, అంగ్రూ ఫోన్ కంటే స్మార్ట్‌గా.. కూలీల కొరత తీవ్రమవటం, ఎరువులు, పురుగు మందు ధరలు పెరిగిపోవటం వల్ల నష్టపోతున్న రైతులకు ఊరట కల్పించడమే కాకుండా యువతరాన్ని రాబోయే కాలంలో వ్యవసాయం వైపు మరల్చడానికి డ్రోన్ టెక్నాలజీ దోహదం చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్జీ రంగా యూనివర్సిటీ డ్రోన్ బరువును 45 కిలోల నుంచి 25 కిలోలకు తగ్గించింది. తాజాగా కేవలం 250 గ్రాముల బరువైన డ్రోన్లను సైతం రూపొందించింది. కాగా, కొన్ని ప్రైవేటు కంపెనీలు 45 కిలోల బరువున్న డ్రోన్లను ఆయిల్ ఇంజన్ సహాయంతో నడుపుతున్నాయి. వీటి నుంచి ఎక్కువ శబ్దం చేయడంతోపాటు దాని బరువు కారణంగా వినియోగించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. షేడ్‌నెట్స్, గ్రీన్‌మ్యాట్ వంటి పద్ధతుల్లో పంటలు పండించే చోట గాలి ఎక్కువగా తగలకపోవడం వల్ల పుప్పొడి ఒక పుష్పం నుంచి మరో పుష్పంపైకి చేరటం లేదు. ఈ కారణంగా మొక్కల్లో పరపరాగ సంపర్కం జరగక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అరచేతిలో ఇమిడిపోయేంత డ్రోన్లను ఆ మొక్కలపై తిప్పితే పరపరాగ సంపర్కం అవుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకోసం అతి చిన్న డ్రోన్లను తయారు చేయడానికి ఎన్జీ రంగా శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ తరహా డ్రోన్లు విదేశాల్లో అందుబాటులో ఉన్నాయి. వీటి బరువు కేవలం 10 గ్రాముల వరకూ ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిని అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా షేడ్ నెట్స్, గ్రీన్ మ్యాట్ సాగులో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. -
సాగులో బ్రాండింగ్ తీసుకురండి
సాక్షి, అమరావతి/మధురానగర్ (విజయవాడ సెంట్రల్): పనిచేసే సంస్థలు, కంపెనీలకు బ్రాండింగ్ తీసుకొచ్చేందుకు ఎంతలా తపన పడతామో.. అదేస్థాయిలో సాగులో కూడా బ్రాండింగ్ తీసుకొచ్చేందుకు కృషిచేయాలని వ్యవసాయ, మార్కెటింగ్, సహకారశాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి పిలుపునిచ్చారు. సాగుబాట పట్టిన ఏ ఒక్కరూ వెనక్కితిరిగి చూడకుండా ముందుకుదూసుకుపోవాలని సూచించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా తోడుగా నిలుస్తుందని చెప్పారు. విజయవాడలో గురువారం జరిగిన విద్యావంతులైన వ్యవసాయదారుల సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షల జీతాలను వదులుకుని వ్యవసాయం పట్ల మక్కువతో సాగుబాట పట్టిన యువ రైతులంతా ఒకే వేదికపైకి రావడం శుభపరిణామమన్నారు. పండించే పంటలకు అదనపు విలువను జోడించేలా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం 30 నుంచి 50 శాతం వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందన్నారు. రాష్ట్రస్థాయిలో సమాఖ్యగా ఏర్పడి మీరు పండించే ఉత్పత్తులకు బ్రాండింగ్ తీసుకురావాలని సూచించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నేటి తరానికి ఆదర్శంగా సాగును లాభసాటిగా మార్చాలని కోరారు. స్త్రీనిధి బ్యాంక్ తరహాలో వ్యవసాయదారులంతా కలిసి ఓ బ్యాంకు ఏర్పాటు చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. డ్రోన్ టెక్నాలజీతో ఖర్చులు తగ్గించుకోవాలి నాబార్డు మాజీ చైర్మన్ సీహెచ్.గోవిందరాజులు మాట్లాడుతూ రానున్న ఐదేళ్లు డ్రోన్ టెక్నాలజీదేనని చెప్పారు. డ్రోన్ల ద్వారా సాగుచేసి పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. సంప్రదాయ నాట్లు వేసే విధానాన్ని వదిలి డ్రోన్ల ద్వారా విత్తనాలు నాటుకుంటే నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చన్నారు. సదస్సులో పలు తీర్మానాలు ఆమోదించారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు భూపతిరాజు రామకృష్ణంరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భరత్‌వర్మ, అఖిల భారత రైతు ఉత్పత్తిదారుల సంఘాల కన్వీనర్ జలగం కుమారస్వామి, భారతీయ కిసాన్‌సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు పి.రాఘవులు, డైరెక్టర్లు క్రాంతికుమార్‌రెడ్డి, నరసింహరాజు, రైతునేస్తం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సదస్సులో చేసిన తీర్మానాలు.. దేశంలో మరే రాష్ట్రంలోను లేనిరీతిలో ప్రత్యేకంగా ఆర్గానిక్ పాలసీ తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్గానిక్ విశ్వవిద్యాలయం ఏర్పాటు దిశగా కృషిచేయాలి. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయాలి. ఆర్గానిక్ ఉత్పత్తుల విక్రయం కోసం జాతీయ రహదారుల్లో ప్రతి వంద కిలోమీటర్లకు కనీసం 10 షాపులు నిర్మించి ఇవ్వాలి. రైతుబజార్లలో ప్రత్యేక స్టాల్ కేటాయించాలి. ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీని సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలి. జనవరి 5వ తేదీన విజయవాడలో కనీసం 10 వేలమందితో ఆర్గానిక్ వ్యవసాయదారుల రాష్ట్రస్థాయి సమ్మేళనం నిర్వహించాలి. -
రైతులకు ఎరువులు అందించడంలో ఎలాంటి లోపాలు ఉండొద్దు: సీఎం వైఎస్ జగన్
-
వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచుదాం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలోని రైతులకు గరిష్ఠ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయంపై సమీక్షా సమావేశం నిర్వహించారాయన. ఈ సందర్భంగా.. రైతులకు ఎరువులు అందించడంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సంబంధిత మంత్రిత్వశాఖను, అధికారులను ఆయన ఆదేశించారు. అంతేకాదు ఎక్కడ నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్బీకేల్లో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ నుంచి ప్రతి రోజూ నిరంతరం సమాచారం తెప్పించుకోవాలన్న సీఎం జగన్.. విత్తనాల సరఫరా, ఎరువుల పంపిణీ, వ్యవసాయ ఉత్పత్తులకు అందుతున్న ధరలు తదితర అంశాలపై పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. ఈ-క్రాప్ వందశాతం పూర్తిచేయాలని, వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకంతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన భాగస్వామ్యం కానుందని తెలిపారు. రైతులకు గరిష్ట లబ్ధి చేకూర్చేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం జగన్.. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపైనా ప్రధానంగా చర్చించారు. డ్రోన్ల వినియోగంపై మాస్టర్ ట్రైనర్లను తయారు చేయాలన్న ఆయన.. డ్రోన్ల నిర్వహణ, మరమ్మతుపై శిక్షణ ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులతో చెప్పారు. అంతేకాదు.. నియోజకవర్గానికి ఒక ఐటీఐ లేదంటే ఒక పాలిటెక్నిక్ కాలేజీలోని విద్యార్థులకు డ్రోన్ల వినియోగం, నిర్వహణ, మరమ్మతులపై సంపూర్ణ శిక్షణ ఇప్పించాలని సూచించారు. ఇంకా ఈ సమీక్షలో.. ఖరీప్ సీజన్ పై సీఎంకు అధికారులు వివరాలు అందించారు ► రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదు. ► ఆగస్టు 3 నాటికి 16.2 శాతం అధిక వర్షపాతం నమోదు. ► ఈ ఖరీఫ్ సీజన్లో 36.82 లక్షల హెక్టార్ల మేర సాగు విస్తీర్ణం ఉంటుందని అంచనా కాగా, ఇప్పటికే 18.8 లక్షల హెక్టార్లలో పంటలసాగు. ఈ సందర్భంగా రైతులకు అందుతున్న విత్తనాల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు జరిపించాలని సీఎం జగన్, అధికారుల్ని ఆదేశించారు. ► సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని తెలిపిన అధికారులు. ► ఆర్బీకేల ద్వారా వీటిని పంపిణీచేస్తున్నామన్న అధికారులు. నూటికి నూరు శాతం ఈ- క్రాప్ ► ఈ– క్రాప్ వందశాతం పూర్తిచేయాలి. ► సెప్టెంబరు మొదటివారంలోగా ఈ– క్రాపింగ్ పూర్తిచేయాలి. ► ఆర్బీకేల్లోని అగ్రికల్చర్ అసిస్టెంట్, రెవిన్యూ అసిస్టెంట్లు ఈ ప్రక్రియను పూర్తిచేసేలా చూడాలి. ► రోజువారీగా ఈ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలి. ► ఈ–క్రాపింగ్ చేసిన తర్వాత భౌతిక రశీదు, డిజిటల్ రశీదు ఇవ్వాలని సీఎం జగన్ తెలిపారు. ► ఈ– క్రాపింగ్ చేసినప్పుడు జియో ట్యాగింగ్ కూడా చేస్తున్నామని, వెబ్ ల్యాండ్‌తో కూడా అనుసంధానం చేస్తున్నామని అధికారులు వివరించారు. ► వెబ్ ల్యాండ్‌లో ఎక్కడైనా పొరపాట్లు ఉంటే.. వాటిని వెంటనే సరిదిద్దుకుంటూ పోవాలని సీఎం జగన్ సూచించారు. ► వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకంతో భాగస్వామ్యం కానున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. రైతులకు గరిష్ట లబ్ధి చేకూర్చేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ► ఆర్బీకేల్లో ప్రతి కియోస్క్ పనిచేసేలా చూడాలన్న సీఎం జగన్.. వాటికి సవ్యంగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా? లేదా? అన్నదానిపై నిరంతరం పరిశీలన చేయాలని అధికారులకు ఆదేశించారు. ► వైయస్సార్ యంత్రసేవ కింద రైతులకు మరిన్ని పరికరాలు ఇవ్వాలన్న సీఎం జగన్.. దీనికోసం అన్నిరకాలుగా సిద్ధంకావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఏపీ అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు (వ్యవసాయశాఖ) అంబటి కృష్ణారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి సాయి ప్రసాద్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, వ్యవసాయశాఖ కమిషనర్ సి హరికిరణ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: మానవత్వమై నిలిచి.. -
డ్రోన్ పైలట్ల శిక్షణకు 150 స్కూల్స్!
న్యూఢిల్లీ: దేశీయంగా డ్రోన్ పైలట్లకు శిక్షణనిచ్చేందుకు 2025 నాటికి సుమారు 150 స్కూల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు డ్రోన్ డెస్టినేషన్ సీఈవో చిరాగ్ శర్మ తెలిపారు. ఇందుకోసం యూనివర్సిటీలు, వ్యవసాయ రంగ సంస్థలు, పోలీస్ అకాడమీలతో చేతులు కలపనున్నట్లు వివరించారు. దేశీయంగా తొలి రిమోట్ పైలట్ ట్రైనింగ్ సంస్థగా డ్రోన్ డెస్టినేషన్ .. అనుమతులు పొందింది. ప్రస్తుతం ఆరు స్కూల్స్‌ను నిర్వహిస్తోంది. త్వరలో కోయంబత్తూర్, మదురైలో మరో రెండు ప్రారంభించనున్నట్లు శర్మ పేర్కొన్నారు. గడిచిన కొన్ని నెలలుగా తాము 500 మంది పైలట్లకు శిక్షణ కల్పించినట్లు వివరించారు. రాబోయే ఏడాది కాలంలో గురుగ్రామ్ కేంద్రంలో 1,500 – 2,000 మంది పైలట్లకు, మిగతా కేంద్రాల నుంచి తలో 500 మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శర్మ తెలిపారు. -
డ్రోన్ సర్వీసుల్లోకి రిలయన్స్.. స్కైడెక్ ద్వారా సేవలు
డ్రోన్ల తయారీలో ఉన్న ఏస్టోరియా ఏయిరోస్పేస్ సంస్థ ఎండ్ టూ ఎండ్ డ్రోన్ ఆపరేషన్ సర్వీసులు అందించేందుకు స్కైడెక్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. క్లౌడ్ బేస్డ్ ప్లాట్‌ఫామ్‌గా ఉంటూ డ్రోన్ యాజ్ ఏ సర్వీస్ (డీఏఏఎస్, దాస్)గా స్కైడెక్ సంస్థ సేవలు అందివ్వనుంది. సర్వేయింగ్, అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ ఇన్స్పెక్షన్స్, సర్వేయలెన్స్, సెక్యూరిటీ రంగాల్లో స్కైడెక్ సేవలు అందివ్వనుంది. డ్రోన్ ఫ్లైట్స్ షెడ్యూలింగ్, డేటా ప్రాసెస్, విజువలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అనాలిసిస్ తదితర సమాచారాన్ని స్కైడెక్ అందిస్తుంది. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన విధానపరమైన నిర్ణయాలతో దేశంలో డ్రోన్ సర్వీసులకు డిమాండ్ పెరగనుందన్నారు ఏస్టోరియా కో ఫౌండర్ నీల్ మెహతా. డ్రోన్లకు సంబంధించి హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, ఆపరేషన్ సొల్యూషన్స్ వంటి సేవలు అందిస్తామన్నారు. ఏస్టోరియా సంస్థ జియోప్లాట్ఫామ్ లిమిటెడ్‌కి సబ్సిడరీగా ఉంది. కాగా జియో రిలయన్స్ గ్రూపులో మేజర్ సబ్సిడరీ కంపెనీగా అందరికి సుపరిచితమే. -
డ్రోన్ రంగంలో అవకాశాలెన్నో: మోదీ
న్యూఢిల్లీ: డ్రోన్ రంగం భారత్‌లో వేగంగా విస్తరిస్తోందని, ప్రపంచ డ్రోన్ విపణిలో కొత్త నాయకత్వ స్థాయికి ఎదుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తంచేశారు. పంట భూముల్లో క్రిమిసంహారకాలు, వ్యవసాయ ఉత్పత్తులను చల్లేందుకు వాడే ‘కిసాన్ డ్రోన్’లను ప్రధాని ప్రారంభించారు. దేశంలోని 100 ప్రాంతాల్లో ఒకేసారి వర్చువల్ పద్ధతిలో శుక్రవారం ఈ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ‘‘రానున్న రోజుల్లో రైతులు తమ పంటను తక్కువ సమయంలోనే డ్రోన్ల సాయంతో మార్కెట్లకు తరలించవచ్చు. పూలు, పండ్లు, కూరగాయలను త్వరగా రవాణా చేయొచ్చు. ఆదాయం పెరుగుతుంది. 21వ శతాబ్దిలో అధునాతన సాగు విధానాల్లో డ్రోన్ అనే కొత్త అధ్యాయం మొదలైంది. డ్రోన్ రంగంలో స్టార్టప్ కంపెనీల సంస్కృతి దేశంలో షురూ అయింది. ప్రస్తుతం 200గా ఉన్న స్టార్టప్‌ల సంఖ్య త్వరలో వేలు దాటనుంది. ఈ రంగం భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు తేనుంది. ఈ రంగం ఎదుగుదలకు ఎలాంటి విధానపర అడ్డంకులూ లేవు. డ్రోన్ సెక్టార్ విస్తరించేందుకు తగిన సంస్కరణలను గతంలోనే తెచ్చాం. కొన్నేళ్ల క్రితం రక్షణ రంగానికే పరిమితమైన డ్రోన్లు ఇప్పుడు వేర్వేరు విభాగాలకూ విస్తరించాయి. సరైన సంస్కరణలు తెస్తే వృద్ధి ఎంత బాగుంటుందనేందుకు డ్రోన్ రంగమే ఉదాహరణ. ఈ రంగం విస్తరణకు బీజేపీ సర్కార్ పచ్చజెండా ఊపడమే కాదు, యువ ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తోంది’’ అని మోదీ అన్నారు. -
డ్రోన్లతో వ్యవసాయం.. హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా మొదలు
Bayer conducts drone trial in agriculture: వ్యవసాయ రంగంలో ప్రసిద్ధి చెందిన బేయర్ క్రాప్ సైన్స్ లిమిటెడ్ సంస్థ అధునాత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చేలా మరో ప్రయోగానికి తెరలేపింది. తొలిసారిగా వ్యవసాయంలో డ్రోన్లను ఉపయోగించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌కి సమీపంలో చాందీపా దగ్గర బేయర్ సంస్థకి సంబంధించిన మల్టీ క్రాప్ బ్రీడింగ్ సెంటర్లో వ్యవసాయంలో డ్రోన్లను పూర్తి స్థాయిలో వినియోగించాలని నిర్ణయించింది. వ్యవసాయ మంత్రి హర్షం సాయంలో డ్రోన్ల వినియోగానికి సంబంధించి గత ఐదేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా బేయర్ సంస్థ సైతం ఇప్పటికే పలు దశల్లో ప్రయోగాలు చేపట్టింది. వాటన్నింటీని క్రోడీకరించి ఉత్తమమైప పద్దతిలో వ్యవసాయంలో డ్రోన్ల వినియోగానికి తెరలేపింది. అందులో భాగంగా పరిశోధనల పరంగా కాకుండా నేరుగా వ్యవసాయంలో డ్రోన్లను ఉపయోగించనుంది. బేయర్ సంస్థ చేపట్టిన ఈ పైలెట్ ప్రాజెక్టు పట్ల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ హర్షం వ్యక్తం చేశారు. రైతులకు ప్రయోజనం జనరల్ ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి చెందిన డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. వరి, మొక్కజోన్న, చెరుకు, గోధుమ, కూరగాయల సాగుకు సంబంధించి డ్రోన్లను ఉపయోగించడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి పొందవచ్చని బేయర్ సంస్థ చెబుతోంది. తక్కువ కమతాలు ఉన్న ఏసియాలోని ఇతర దేశాల్లోని రైతులు ఇప్పటికే డడ్రోన్లు ఉపయోగించి మంచి ఫలితాలు పొందుతున్నారని, అదే పద్దతిలో ఇండియాలోని చిన్న, సన్నకారు రైతులకు సైతం డ్రోన్లతో ఉపయోగం ఉంటుందని బేయర్స్ క్రాప్ సైన్స్ లిమిటెడ్ పీఈవో నరేన్ అన్నారు. -
వినువీధి వి‘చిత్రం’.. సాంకేతిక సేవల్లో సరికొత్త అధ్యాయం
పలు రంగాలకు వినూత్న పాఠాలు నేర్పుతూ సాంకేతిక సేవల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్న వినువీధి వి‘చిత్రం’ డ్రోన్ సేవల్ని సిక్కోలు వాసులు వినియోగించేందుకు మొగ్గు చూపుతున్నారు. పదుల సంఖ్యలో మనుషులు చేయాల్సిన పనిని విహంగ నేత్రం చేసేస్తోంది. శుభకార్యాల్లో ఫొటోలు, వీడియోలు తీయడం దగ్గర్నుంచి పొలాల్లో పురుగుమందుల పిచికారీ వరకు.. పోలీస్ నిఘా నుంచి వరద ప్రాంతాల్లో పరిస్థితుల సమీక్ష వరకూ.. డ్రోన్ల వినియోగం పెరిగింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో డ్రోన్లను వినియోగిస్తున్న రంగాలు ఏమిటి.. సేవలు.. ప్రత్యేకతలపై ‘సాక్షి’ కథనం. – పాలకొండ రూరల్/ఆమదాలవలస వినువీధి వి‘చిత్రం’ వివాహమైనా.. వేడుకైనా..రాజకీయ పార్టీల మీటింగైనా.. ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ కోసం డ్రోన్ కెమెరా వాడకం సాధారణమైపోయింది. చిత్రీకరించాల్సిన ప్రదేశాన్ని బట్టీ వేర్వేరు రకాల డ్రోన్లను ఫొటోగ్రాఫర్లు వినియోగిస్తున్నారు. జిల్లాలో ఫొటోగ్రాఫర్లు వినియోగిస్తున్న డ్రోన్ల ఖరీదు రూ.రెండు లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. వీటి బరువు 350 గ్రాముల నుంచి 450 గ్రాముల వరకు ఉంటుంది. 250 అడుగుల ఎత్తు వరకు వీటిని ఎగురవేస్తున్నారు. ఒక సారి బ్యాటరీ చార్జ్ చేస్తే 20 నిమిషాల పాటు పనిచేస్తుంది. డ్రోన్లతో పెట్రోలింగ్.. ఎక్కడెక్కడ.. ఎవరెవరున్నారు.. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారెవరు.. ర్యాలీలు, ధర్నాలు జరిగేటప్పుడు సంఘ విద్రోహక శక్తులు ఏమైనా పాల్గొంటున్నాయా వంటి విషయాల్ని తెలుసుకునేందుకు పోలీస్ విభాగం నిఘా కోసం డ్రోన్లను వినియోగిస్తోంది. లాక్డౌన్లో ఎస్పీ అమిత్‌బర్దార్ స్వయంగా డ్రోన్‌ను వినియోగించి నగరంలో పరిస్థితుల్ని పర్యవేక్షించారు. ఎస్ఈబీ అధికారులు కూడా డ్రోన్ వినియోగాన్ని పెంచారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాను నిరోధించడంలో భాగంగా అనుమానం ఉన్న ప్రాంతాల్లో వీటి సేవల్ని వినియోగించుకుంటున్నారు. సారా అమ్మకాలు సాగించే స్థావరాలను గుర్తించడంలో సత్ఫలితాలు సాధిస్తున్నారు. ప్రకృతి విపత్తుల అంచనాలో.. ప్రకృతి విపత్తులు సంభవించే వేళ వాటి తీవ్రత ఇతర అంశాలను అంచనా వేసేందుకు అధికారులు డ్రోన్లపై ఆధారపడుతున్నారు. తాజాగా గులాబ్ తుఫాన్ ప్రభావంతో వంగర మండలంలోని మూడు గ్రామాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. గ్రామాల్లో ప్రజల పరిస్థితులు, వరదనీటి ఉద్ధృతి ఇతర విషయాల్ని పర్యవేక్షించేందుకు జిల్లా ఉన్నతాధికారులు ఈ డ్రోన్లపైనే ఆధారపడ్డారు. గుర్తించిన ప్రాంతాల్లో సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. మీ పొలంలో పిచికారీ కోసం.. వ్యవసాయ పనుల్లో రైతన్నకు చేదోడు వాదోడుగా నిలిచేందుకు కూడా సిద్ధమంటోంది డ్రోన్. ఇటీవలే ఆమదాలవలసలోని కృషి విజ్ఞాన కేంద్రంలో పొలానికి పురుగు మందులు పిచికారీ చేసే అంశంపై డెమో జరిగింది. ఈ డ్రోన్ సాయంతో ఎకరా పొలానికి 10నుంచి 15 లీటర్ల మందు ద్రావణాన్ని సులభంగా పిచికారీ చేయవచ్చని ప్రయోగాత్మకంగా చూపించారు. ఇలాంటి సేవల్ని రైతులకు అందించేందుకు కొన్ని సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. సమగ్ర భూ సర్వేలో కీలకంగా.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష’ పథకంలో భాగంగా నిర్వహిస్తున్న సమగ్ర భూ సర్వేలో కూడా డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సర్వే కోసం ప్రభుత్వం ఆధునిక డ్రోన్‌ను వినియోగిస్తోంది. సగటున రోజుకు 700 ఎకరాల వరకు సర్వే చేయొచ్చని రెవెన్యూ ఉన్నతాధికారులు చెబుతున్నారు. జిల్లాలోని మూడు సబ్ డివిజన్లలో సర్వే కోసం ఒక డ్రోన్‌ను వినియోగిస్తున్నారు. ప్రత్యేకతలివే.. బరువు: 5 కిలోలు కెమెరా బరువు: 6.5 గ్రాములు 120 మీటర్ల ఎత్తుకు ఎగురవేస్తారు. చార్జింగ్ ఒక గంట వరకు ఉంటుంది. ధర: రూ.25 లక్షలు విహంగ నేత్రం విశేషాలివే.. డ్రోన్ బరువును బట్టి వాటిని విభజించారు. నెనో డ్రోన్ (250 గ్రాములు బరువు) మ్యాకో (250 గ్రాముల నుంచి 2.5 కిలోలు) మినీ (2.5 కిలోల నుంచి 25 కేజీల వరకు) స్మాల్(25 కిలోల నుంచి 250 కిలోలు) లార్జ్ (250 కిలోలకు పైబడి) రకాలున్నాయ్... ప్రొపెల్లర్స్(ఫ్యాన్లు లాంటి రెక్కల) సాయంతో డ్రోన్లు పైకి ఎగురుతాయి. మూడు రెక్కలుంటే ట్రైకాప్టర్, నాలుగుంటే క్వాడ్ కాప్టర్, ఆరుంటే హెక్స్ కాప్టర్, ఎనిమిది ఉంటే ఆక్టో కాప్టర్ అని పిలుస్తారు. అనుమతి తప్పనిసరి.. డ్రోన్లను వినియోగించాలంటే యూఏవోపీ అనుమతితో పాటు స్థానిక పోలీస్ ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి. n అధికారులు నిర్దేశించిన నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. వాడకం పెరిగింది.. వివాహ, రాజకీయ, ఇతర శుభకార్యాల చిత్రీకరణలో డ్రోన్ల వినియోగం పెరిగింది. జిల్లాలో దాదాపు 50 మంది వరకు ఫొటోగ్రాఫర్లు డ్రోన్ వాడకానికి సంబంధించి లైసెన్స్ కలిగి ఉన్నారు. వీటిని వాడాలంటే పోలీసు అనుమతి తప్పనిసరి. – మండపాక శ్రీధర్,సీనియర్ ఫొటోగ్రాఫర్, పాలకొండ శాఖాపరంగా ఎన్నో సేవలు.. డ్రోన్ కెమెరాలతో శాఖాపరంగా చాలా ఉపయోగాలున్నాయి. జిల్లా కేంద్రంలో డ్రోన్ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. అవసరమైనప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించి వాటి సేవలు పొందుతున్నాం. ముఖ్యంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగినప్పుడు, వీఐపీల పర్యటన సమయంలో వీటిని వినియోగిస్తున్నాం. లాక్డౌన్ సమయంలో అద్భుతంగా ఉపయోగపడ్డాయి. – మల్లంపాటి శ్రావణి, డీఎస్పీ, పాలకొండ పనితీరు అద్భుతం.. సమగ్ర భూ సర్వేలో ఈ డ్రోన్ పనితీరు అద్భుతం. కచ్చితత్వం ఉంది. ప్రకృతి విపత్తులు అంచనా వేయటంలో మా సిబ్బంది డ్రోన్పైనే ఆధారపడుతున్నారు. – టీవీఎస్‌జీ కుమార్, ఆర్డీవో, పాలకొండ -
మరో సంచలనానికి సిద్ధమైన ఓలా....!
మొబిలిటీ కంపెనీ ఓలా మరో సంచలనానికి తెర తీయనుంది. ఉపగ్రహచిత్రాలు, విజువల్ ఫీడ్స్, సహాయంతో ‘లివింగ్ మ్యాప్స్’ను అభివృద్ధి చేయడానికి ఓలా సన్నద్దమైంది. అందుకు సంబంధించిన ప్రయత్నాలను ఓలా ముమ్మరం చేసింది. తాజాగా జియోస్పేషియల్ సర్వీసుల ప్రొవైడర్ జియోస్పోక్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం నెక్ట్స్ జనరేషన్ లోకేషన్ సాంకేతికతను ఓలా రూపొందించనుంది. ఈ సాంకేతికతతో రియల్ టైం, త్రీ డైమన్షనల్, వెక్టర్ మ్యాప్స్‌ను రూపొందించనుంది. చదవండి: ఫేస్బుక్ యూజర్లకు మరో భారీ షాక్..! మరింత వేగవంతం..! వ్యక్తిగత వాహనాలలో మొబిలిటీని యాక్సెస్ చేయగల, స్థిరమైన, వ్యక్తిగతీకరించిన , సౌకర్యవంతంగా ఉండే లోకేషన్ టెక్నాలజీలను మరింత వేగవంతంగా అభివృద్ధి చేయడం కోసం జియోస్పోక్ ఓలాలో చేరినట్లు తెలుస్తోంది. ఓలా, జియోస్పోక్ కంపెనీలు సంయుక్తంగా తెచ్చే లోకేషన్ టెక్నాలజీ సహాయంతో ప్రజల రవాణాకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తోంది. లొకేషన్, జియోస్పేషియల్ టెక్నాలజీలు, అలాగే శాటిలైట్ ఇమేజరీలో రియల్ టైమ్ మ్యాప్స్‌గా 3 డి, హెచ్డి, వెక్టర్ మ్యాప్‌ల సహాయంతో రవాణా రంగంలో భారీ మార్పులను తేనుంది. డ్రోన్ మొబిలిటీకి ఎంతో ఉపయోగం..! బహుళ-మోడల్ రవాణా కోసం జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ కచ్చితంగా అవసరమని ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ఈ లొకేషన్ టెక్నాలజీ సహాయంతో త్రీ డైమెన్షనల్ మ్యాప్స్‌ను రూపొందించడంతో డ్రోన్ వంటి ఏరియల్ మొబిలిటీ మోడల్స్‌కు ఎంతగానో ఉపయోగపడనుంది. చదవండి: ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు టీవీఎస్, టాటా పవర్ శుభవార్త! -
‘డ్రోన్’ స్టార్టప్స్‌లో పెట్టుబడులు రయ్
డ్రోన్ల వినియోగానికి సంబంధించి కేంద్ర సర్కారు ఇటీవలే నిబంధనలను సరళతరం చేసింది. దేశంలో తయారీ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వేగవంతమైన డెలివరీకి డ్రోన్లు వీలు కల్పిస్తాయని తెలిసిందే. వివిధ రంగాల్లో డ్రోన్ల వినియోగాన్ని పెంచడం వల్ల తగిన ఫలితాలు ఉంటాయన్న అంచనాలతో కేంద్ర ప్రభుత్వం నియంత్రణలను సడలిస్తూ, పెట్టుబడులను ఆకర్షించే విధానాలను ప్రకటించింది. దీంతో డ్రోన్లను తయారు చేసే స్టార్టప్‌లలో పెట్టుబడులకు వెంచర్ క్యాపిటల్ కంపెనీల్లో ఆసక్తి ఏర్పడింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద (పీఎల్ఐ) డ్రోన్ల తయారీ కంపెనీలకు రూ.120 కోట్ల ప్రోత్సాహకాలను సైతం కేంద్రం ప్రకటించడం పెట్టుబడిదారుల్లో ఆసక్తిని పెంచినట్టు చెప్పుకోవాలి. డ్రోన్ల తయారీలో వచ్చే మూడేళ్ల కాలంలో రూ.5,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఒక సీనియర్ అధికారి తెలిపారు. పీఎల్ఐ పథకం డ్రోన్ల తయారీకి ఊతమిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంచి స్పందన వస్తోంది.. డ్రోన్ స్టార్టప్‌లకు మద్దతుగా ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన వస్తున్నట్టు పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి అంబర్‌దూబే మీడియాకు తెలిపారు. ‘‘వెంచర్ క్యాపిటలిస్ట్‌ల నుంచి వివరాలు కోరుతూ విచారణలు కూడా వస్తున్నాయి. పెట్టుబడుల సలహాల విషయంలో ప్రభుత్వ జోక్యం చేసుకోదు. కానీ, మా విధానపరమైన మార్గదర్శకాలు తెలియజేయడం వల్ల వారిలో ఎంతో విశ్వాసం ఏర్పడుతుంది’’అని దూబే వివరించారు. 2023–24 ఆర్థిక సంవత్సరం నాటికి డ్రోన్ తయారీ రంగం రూ.900 కోట్లను చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. తద్వారా 10,000 ప్రత్యక్ష ఉద్యోగాలు రావచ్చని భావిస్తోంది. 2021 మార్చి నాటికి ఈ రంగంలో రూ.60 కోట్ల మేర వ్యాపారం నమోదు కావడం గమనార్హం. డ్రోన్ల వల్ల విస్తరించే సేవల విలువ రూ.30,000 కోట్లకు చేరుకుంటుందని.. డ్రోన్ల నిర్వహణ, డ్రోన్ లాజిస్టిక్స్, డేటా ప్రాసెసింగ్, ట్రాఫిక్ నిర్వహణ తదితర విభాగాల్లో వచ్చే మూడేళ్ల కాలంలో 5 లక్షల ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తోంది. ఇన్వెస్టర్లలో మార్పు.. ఇప్పటివరకు వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్లు డ్రోన్ స్టార్టప్‌ల పట్ల పెద్దగా ఆసక్తి చూపించలేదు. పౌర అవసరాలకు సంబంధించి డ్రోన్ల వినియోగాన్ని చట్టవిరుద్ధంగా 2018లో ప్రభుత్వం ప్రకటించడం, నియంత్రణల పరంగా స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణంగా ఉంది. 2011–2021 మధ్య డ్రోన్ స్టార్టప్‌లలో వచ్చిన పెట్టుబడులు రూ.310 కోట్లకు మించలేదని ట్రాక్సెన్ అనే ఇంటెలిజెన్స్ సంస్థ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే కాలంలో అమెరికాలో 4 బిలియన్ డాలర్లు (రూ.29,600 కోట్లు), అంతర్జాతీయంగా 6.2 బిలియన్ డాలర్లు (రూ.46,000 కోట్లు) డ్రోన్ కంపెనీల్లోకి రావడం గమనార్హం. భారత్‌లో డ్రోన్ల స్టార్టప్‌లు 158 ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా 2,772 సంస్థలు ఈ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ‘‘ప్రస్తుతం పలు ఇండియన్ డ్రోన్ స్టార్టప్‌లు సిరీస్ ఏ నిధుల సమీకరణకు చర్చలు నిర్వహిస్తున్నాయి’’ అని డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ఇండియా డైరెక్టర్ (పార్టనర్షిప్స్) అమిత్‌షా తెలిపారు. ఈ అసోసియేషన్‌లో 200 డ్రోన్ల కంపెనీలు, వాటికి సంబంధించి సేవల కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి. ►158. 2021 మార్చినాటికి దేశీ డ్రోన్ల తయారీ పరిశ్రమలో పనిచేస్తున్న మొత్తం కంపెనీల సంఖ్య. ►30,000 డ్రోన్ల వినియోగానికి సంబంధించి విస్తరించనున్న సేవల విలువ. తద్వారా ఈ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా ►310. 2011–2021 మధ్య దేశీ డ్రోన్ల స్టార్టప్‌లలోకి వచ్చిన పెట్టుబడులు ►10,000 ప్రత్యక్షంగా రానున్న ఉపాధి అవకాశాలు ►900. 2024 మార్చి నాటికి ఈ పరిశ్రమ విస్తరిస్తుందని అంచనా వేస్తున్న విలువ -
2030 నాటికి ప్రపంచ డ్రోన్ హబ్‌గా భారత్
సాక్షి, న్యూఢిల్లీ: 2026 నాటికి డ్రోన్ పరిశ్రమ వ్యాపారం సుమారు రూ.13 వేల కోట్లకు చేరుకుంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆటో, డ్రోన్ రంగాలకు చేయూతనిచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీమ్‌పై సింధియా గురువారం మాట్లాడారు. డ్రోన్లను ప్రపంచానికి ఎగుమతి చేసే దేశంగా భారతదేశం ఉండాలని తాము కోరుకుంటున్నామని వివరించారు. 2030 నాటికి భారత్ ప్రపంచ డ్రోన్ హబ్‌గా మారుతుందనే ధీమాను వ్యక్తం చేశారు. డ్రోన్ల తయారీ రంగానికి రాబోయే మూడేళ్లలో సుమారు రూ.5 వేల కోట్ల పెట్టుబడి వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. పీఎల్ఐ కారణంగా డ్రోన్ తయారీ రంగంలో ప్రత్యక్షంగా దాదాపు 10,000 మందికి, పరోక్షంగా డ్రోన్ సంబంధిత అన్ని రంగాల్లో కలిపి సుమారు 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలను సృష్టించగలుగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు డ్రోన్ రంగానికి చేయూతనిచ్చే ఈ నిర్ణయ పరోక్ష ప్రభావం దేశంలో డ్రోన్ సేవలపై కూడా ఉంటుందని సింధియా అన్నారు. దీంతో రాబోయే మూడేళ్లలో మొత్తం డ్రోన్ సేవల టర్నోవర్ దాదాపు రూ.3 0వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. ప్రోత్సాహక పథకం కవరేజీని విస్తృతం చేసేందుకు.. డ్రోన్ సంబంధిత ఐటి ఉత్పత్తుల డెవలపర్లను చేర్చడానికి ప్రభుత్వం అంగీకరించిందని కేంద్రమంత్రి వివరించారు. అంతేగాక ఎస్ఎస్ఎంఈ, స్టార్టప్‌లు పీఎల్ఐ పథకంలో భాగం అయ్యేందుకు డ్రోన్ల తయారీదారులకు రూ.2 కోట్లు, డ్రోన్ల విడిభాగాలు తయారుచేసే సంస్థలకు రూ. 50 లక్షలుగా వాటి వార్షిక టర్నోవర్‌ను అర్హతగా నిర్ధారించారు. దీనివల్ల లబి్ధదారుల సంఖ్య పెరుగుతుందని అధికారవర్గాలు తెలిపాయి. పీఎల్ఐ పథకంలో భాగంగా కేంద్రప్రభుత్వం వచ్చే 3 సంవత్సరాలలో రూ.120 కోట్ల ప్రోత్సాహకాన్ని ఇవ్వబోతున్నామని తెలిపారు. వ్యవసాయం, మైనింగ్, మౌలిక సదుపాయాలు, నిఘా, ఎమర్జెన్సీ రెస్పాన్స్, రవాణా, జియో మ్యాపింగ్, రక్షణ వంటి అనేక రంగాల్లో డ్రోన్ల వినియోగం జరుగుతున్నందున ఆర్థిక వ్యవస్థలోని దాదాపు అన్ని రంగాలకు డ్రోన్లు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తున్నాయని సింధియా వ్యాఖ్యానించారు. డ్రోన్ల వినియోగం కారణంగా దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, ఆర్థికాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. దేశంలో వివిధ రంగాల్లో డ్రోన్ల వినియోగాన్ని పెంచేందుకు గత నెల 25వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ సరళీకృత డ్రోన్ పాలసీని ప్రకటించిందని, ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగానే డ్రోన్ రంగానికి కేంద్రప్రభుత్వం 21 రోజుల్లోనే పీఎల్‌ఐను ప్రకటించిందని సింధియా వెల్లడించారు. రాబోయే రోజుల్లో డ్రోన్ రంగానికి భారత్ నేతృత్వం వహించే సామర్థ్యం ఉందని తెలిపారు. ఆవిష్కరణ, సమాచార సాంకేతికత, ఇంజనీరింగ్, భారీ దేశీయ డిమాండ్ కారణంగా 2030 నాటికి భారతదేశం ప్రపంచ డ్రోన్ హబ్‌గా మారే అవకాశం ఉందని వెల్లడించారు. -
టీకాలు ఎగిరొస్తాయ్!
వికారాబాద్: దేశంలో డ్రోన్ల ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ సరఫరాను ప్రారంభించే ప్రక్రియకు రంగం సిద్ధమైంది. తెలంగాణ నుంచే ఈ కార్యక్రమం ప్రారంభమవుతుండటం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ‘ఆకాశ మార్గం ద్వారా మందులు’ ప్రాజెక్టు ఈ నెల 11న ప్రారంభం కానుంది. విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో కలసి జిల్లా కేంద్రాల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు డ్రోన్ల ద్వారా టీకా చేరవేసే ప్రక్రియను ప్రారంభించనున్నారు. శనివారం ప్రయోగాత్మకంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో కార్యక్రమం జరుగనుంది. జిల్లా పరిధిలోని ఐదు పీహెచ్‌సీలకు మొదటి రోజు డ్రోన్ల ద్వారా చేరవేయనున్నారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రామయ్యగూడ, వికారాబాద్ మండల పరిధిలోని సిద్దులూరు, ధారూర్ మండల పరిధిలోని నాగసముందర్, బంట్వారం, బొంరాస్‌పేట పీహెచ్‌సీలకు ముందుగా డ్రోన్ల ద్వారా సరఫరా చేస్తారు. ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం కలెక్టర్ పర్యవేక్షణలో అధికారులు డ్రోన్ల ద్వారా టీకా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విమానయాన శాఖ, పోలీసు శాఖల అనుమతులు, పీహెచ్‌సీలకు సరఫరా చేయాల్సిన టీకా బాక్సులు, నిల్వ తదితర అంశాలను పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్లు గగనతలంలో ఎగరటం, గమ్యస్థానాలకు చేరే వరకు పర్యవేక్షణ, వాటి రక్షణను పోలీసు శాఖ పర్యవేక్షిస్తుంది. ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రి సబితారెడ్డి ఈ నెల 11న కార్యక్రమం జరిగే వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం ఆవరణలోని మైదానాన్ని బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. సభా వేదిక, డ్రోన్లు ఎగిరే ప్రదేశం, మీడియా గ్యాలరీ తదితరాలను పరిశీలించిన మంత్రి.. ఏర్పాట్లన్నీ పక్కాగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట కలెక్టర్ నిఖిల, ఎస్పీ నారాయణ, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలే యాదయ్య, ఫైలట్ రోహిత్‌రెడ్డి ఉన్నారు. అంతకుముందు వికారాబాద్ నుంచి అనంతగిరి రోడ్డులోని 100 పడకల ఆస్పత్రిని సబిత సందర్శించారు. కోవిడ్ పరీక్షల కోసం ఆర్టీపీసీఆర్ సెంటర్ ప్రారంభిస్తామని చెప్పారు. 9–10 కి.మీ. దూరం వరకు.. డ్రోన్ల ద్వారా టీకాలను తీసుకెళ్తుండటం దేశంలో ఇదే తొలిసారి. అందువల్ల గురు, శుక్రవారాల్లో అధికారులు వీటిని పరీక్షించనున్నారు. ఈ రెండు రోజులు డ్రోన్లు కనుచూపు మేర నుంచి 500–700 మీటర్ల దూరం వరకు ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. ఈనెల 11 నుంచి 9–10 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా సరఫరా చేయడాన్ని ప్రారంభిస్తారు. ఇవి టీకాతోపాటు, మందులు, ఇతర వైద్య పరికరాలను కూడా తీసుకెళ్తాయి. దీనికోసం డ్రోన్‌ఆధారితవస్తు రవాణాలో పేరొందిన స్కై ఎయిర్ కన్సార్టియం.. బ్లూడార్ట్ ఎక్స్‌ప్రెస్‌తో కలిసి పనిచేస్తోంది. -
ప్రజా ఉద్యమంలా హరితహారం
భువనగిరి: 230 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ మొ దలుపెట్టిన హరితహారం కార్యక్రమం ప్రజా ఉద్యమంలా సాగుతోందని అటవీశాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని వడాయి గూడెం గ్రామ పరిధిలోని ఆంజనేయ అభయారణ్యంలో డ్రోన్ మెషీన్ ద్వారా సీడ్‌బౌల్స్‌ను చల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏడేళ్ల కాలంలో హరితహారం లక్ష్యాన్ని చేరుకున్నామని, రాష్ట్రంలో 5 శాతం గ్రీన్‌బెల్ట్ పెరిగిందని పేర్కొన్నారు. 2030లోగా 1 బిలియన్ సీడ్‌బౌల్స్ ప్లాంటేషన్ చేసేలా కార్యాచరణను రూపొందించినట్లు తెలిపారు. ఈ ఏడాది అభయారణ్యాల్లో డ్రోన్ ద్వారా ప్లాంటేషన్ ప్రారంభించినట్లు వెల్లడించారు. మొక్కలు నాటడానికి వీల్లేని ప్రాంతాలు, కొండలపై డ్రోన్ ద్వారా సీడ్‌బౌల్స్ వెదజల్లుతున్నామని, సంవత్సరం తర్వాత శాటిలైట్ ద్వారా పరిస్థితిని తెలుసుకుంటామని తెలిపారు. అంతకుముందు మండలంలోని హన్మాపురం, తుక్కాపురం గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలను పరిశీలించి మొక్కలు నాటారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, సీసీఎఫ్ అక్బర్, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, డీఆర్డీఓ ఉపేందర్‌రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి పాల్గొన్నారు. -
ఇక డ్రోన్ల వినియోగం మరింత సులభతరం
సాక్షి, న్యూఢిల్లీ: నమ్మకం, స్వీయ ధృవీకరణ, చొరబడని పర్యవేక్షణ ప్రాతిపదికన దేశంలో డ్రోన్లను సులభంగా వినియోగించేలా కేంద్ర పౌర విమానయాన శాఖ ముసాయిదా నియమాలను జారీ చేసింది. మానవ రహిత విమాన వ్యవస్థ(యూఏఎస్) నిబంధనలు-2021లో పేర్కొన్న 25 ఫారంలతో పోల్చితే దేశంలో డ్రోన్లను ఆపరేట్ చేయడానికి నింపాల్సిన ఫారంల సంఖ్యను ఆరుకు తగ్గిస్తూ ఈ ముసాయిదా నిబంధనలను రూపొందించారు. మానవ రహిత విమాన వ్యవస్థ నిబంధనలు-2021 ఈ ఏడాది మార్చి 12 నుంచి అమల్లోకి వచ్చింది. డ్రోన్ నియమావళి-2021 నోటిఫై అయితే దేశంలో మానవ రహిత విమాన వ్యవస్థ నిబంధనలు-2021 స్థానంలో అమలవుతుంది. ముసాయిదా నిబంధనలలో రుసుమును నామమాత్ర స్థాయికి కుదించారు. అలాగే డ్రోన్ పరిమాణానికి, దీనితో సంబంధం ఉండదని ముసాయిదా తెలిపింది. నిర్ధిష్ట ప్రమాణాల ధ్రువీకరణ పత్రం, నిర్వహణ ధ్రువీకరణ పత్రం, దిగుమతి క్లియరెన్స్, ఇప్పటికే ఉన్న డ్రోన్ల అంగీకారం, ఆపరేటర్ అనుమతి, ఆర్అండ్ డీ సంస్థ అధీకృత ధ్రువీకరణ, విద్యార్థి రిమోట్ పైలట్ లైసెన్స్ సహా వివిధ ఆమోదపత్రాల అవసరాన్ని ముసాయిదా నియమావళి రద్దు చేసింది. విమానాశ్రయం చుట్టూ 8 నుంచి 12 కిలోమీటర్ల మధ్యలో 400 అడుగుల వరకు, గ్రీన్ జోన్లలో 400 అడుగుల వరకు ఎగిరేందుకు అనుమతి అవసరం లేదని ముసాయిదా నిబంధనలు పేర్కొన్నాయి. డ్రోన్ల బదిలీ, రిజిస్ట్రేషన్ కోసం సులభమైన ప్రక్రియను సూచించాయి. చిన్న డ్రోన్లకు (వాణిజ్యేతర ఉపయోగం కోసం), నానో డ్రోన్లు, ఆర్అండ్డీ సంస్థలకు పైలట్ లైసెన్స్ అవసరం లేదని నిబంధనలు పేర్కొన్నాయి. సరుకు డెలివరీ కోసం డ్రోన్ కారిడార్లు అభివృద్ధి చేయనున్నట్టు, దేశంలో డ్రోన్ స్నేహపూర్వక నియంత్రణ పాలనను సులభతరం చేయడానికి డ్రోన్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్టు ముసాయిదా తెలిపింది. డ్రోన్ శిక్షణ, పరీక్షల నిర్వహణ అధీకృత డ్రోన్ పాఠశాల నిర్వహిస్తుంది. శిక్షణ ప్రమాణాలను, డ్రోన్ పాఠశాలల పర్యవేక్షణ, ఆన్లైన్లో పైలెట్ లైసెన్స్‌ల జారీ వంటి అంశాలను డీజీసీఏ అమలుచేస్తుంది. ఎయిర్ వర్తీనెస్ సర్టిఫికెట్ జారీచేసే అధికారాన్ని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, లేదా దాని పరిధిలోని అధీకృత సంస్థలు కలిగి ఉంటాయి. తయారీదారు స్వీయ ధ్రువీకరణ మార్గం ద్వారా డిజిటల్ స్కై ప్లాట్ఫామ్లో వారి డ్రోన్‌కు ప్రత్యేక గుర్తింపు సంఖ్య పొందవచ్చు. ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలను ఆగస్టు 5లోగా తెలియపరచవచ్చని నియమావళి పేర్కొంది. దేశంలో నమోదు చేసుకున్న విదేశీ యాజమాన్యంలోని కంపెనీల డ్రోన్ కార్యకలాపాలకు ఎటువంటి పరిమితి ఉండదని ముసాయిదా పేర్కొంది. డిజిటల్ స్కై ప్లాట్‌ఫాం వ్యాపార–స్నేహపూర్వక సింగిల్–విండో ఆన్లైన్ వ్యవస్థగా అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపింది. -
పుట్టపర్తి ఎయిర్‌పోర్ట్‌కు మహర్దశ
సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి ఎయిర్పోర్ట్ నుంచి పూర్తిస్థాయి వాణిజ్య సర్వీసులను నడిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం ఇప్పుడు పుట్టపర్తి విమానాశ్రయం ద్వారా అనంతపురం జిల్లాకు విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. కొంతకాలంగా నిరుపయోగంగా ఉన్న విమానాశ్రయాన్ని ప్రభుత్వం తీసుకొని నిర్వహించడానికి గల మార్గాలపై సత్యసాయి ట్రస్ట్ సభ్యులతో చర్చలు జరుపుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఏవియేషన్ సలహాదారు భరత్ రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. పారిశ్రామికంగా చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న అనంతపురం జిల్లాకు ఈ విమానాశ్రయం మరింత కలిసి వస్తున్న నేపథ్యంలో దీన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ఏపీ ఏవియేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్) ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ నెల 5న సత్యసాయి ట్రస్ట్ సభ్యులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రానున్న 6 నెలల్లో పుట్టపర్తి విమానాశ్రయాన్ని వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావాలని ఏపీఏడీసీఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. రన్‌వే విస్తరణకు, ప్రహరీగోడ నిర్మాణానికి, 100 మంది ప్రయాణికులు కూర్చునే విధంగా టెర్మినల్ భవనాన్ని విస్తరిస్తే సరిపోతుందని, ఇందుకోసం కొంత స్థలం సేకరించాల్సి ఉంటుందని ఏపీఏడీసీఎల్ అధికారులు తెలిపారు. డ్రోన్ హబ్‌గా పుట్టపర్తి డ్రోన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి పుట్టపర్తి అనుకూలంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. బెంగళూరు, హైదరాబాద్ వంటి పట్టణాలకు దగ్గరగా ఉండటంతో పుట్టపర్తిని వేగంగా డ్రోన్ హబ్‌గా తీర్చిదిద్దవచ్చని భరత్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో కంటికి కనిపించనంత దూరం వెళ్లే డ్రోన్ పరీక్షలను నిర్వహించడానికి కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. -
డ్రోన్లతో శాంతి భద్రతల పర్యవేక్షణ
సాక్షి, ముంబై: లోకల్ రైల్వే పరిధిలో నేరాలను నిరోధించేందుకు డోన్ల ద్వారా నిఘా వేయాలని, శాంతి భద్రతలు పర్యవేక్షించాలని సెంట్రల్ రైల్వే నిర్ణయించింది. ముంబై రీజియన్ పరిధిలోని రైల్వే యార్డులు, వర్క్ షాపులు, రైల్వే స్టేషన్లు, స్టేషన్ బయట రైల్వే హద్దులో డ్రోన్ల ద్వారా నిఘా పెట్టనున్నారు. అందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ‘నింజా యూఏవీ డ్రోన్’లను కొద్దిరోజుల ముందే కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఒక డ్రోన్ సెంట్రల్ రైల్వే ఆధీనంలోకి వచ్చింది. మరికొన్ని డ్రోన్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. లోకల్ రైల్వే హద్దులో రైలు పట్టాల వెంబడి అక్కడక్కడ జూదం అడ్డాలున్నాయి. అక్కడ మద్యం సేవించడం, పేకాట ఆడటంలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతుంటారు. వీటితోపాటు వర్క్ షాపులు, యార్డులు, లూప్లైన్లో ఆగి ఉన్న రైలు బోగీల నుంచి విలువైన వస్తువులను దొంగిలిస్తున్నారు. రైల్వే ట్రాక్‌కు ఆనుకుని ఉన్న మురికివాడల ప్రజలు ఈ చోరీలకు పాల్పడుతున్న వెలుగులోకి వచ్చింది. వర్క్ షాపులు, యార్డుల నుంచి రాత్రి వేళల్లో చోరీలు జరుగుతున్నాయి. అందుకు రైల్వే సిబ్బంది సహకారం ఉంటుందని పోలీసులు తమ దర్యాప్తులో వెల్లడించారు. అదేవిధంగా రైల్వే ట్రాక్‌లపై, ప్లాటఫారాల పక్కన చెత్త వేయడం, స్టేషన్ బయట రైల్వే హద్దులో అక్రమంగా స్థలం ఆక్రమించుకుని వ్యాపారులు చేసుకోవడం. వచ్చిపోయే ప్రయాణికులకు ఇబ్బందులు సృష్టించడం లాంటివి కూడా జరుగుతున్నాయి. వీటిని అరికట్టడంతో పాటు వీటన్నింటిపై నిఘా వేయడానికి రైల్వే డ్రోన్ల సాయం తీసుకుంటోంది. పశ్చిమలో కొత్త సీసీటీవీ కెమెరాలు రైల్వే స్టేషన్, పరిసరాల్లో నేరాలను నియంత్రించేందుకు అదనంగా మరిన్ని సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పశ్చిమ రైల్వే ఇటీవలె నిర్ణయం తీసుకుంది. వీటిని చర్చిగేట్–విరార్ స్టేషన్ల మధ్య లోకల్ రైల్వే హద్దులో ఏర్పాటు చేయనుంది. పాత సీసీటీవీ కెమెరాలు తొలగించి వాటి స్థానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన 2,729 కెమెరాలను అమర్చనున్నారు. దీంతో ఏదైనా నేరం జరిగితే ఈ కెమెరాల ద్వారా దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. రైల్వే పోలీసులు నేరస్తులను సునాయాసంగా పట్టుకోవచ్చు. ప్రస్తుతం పశ్చిమ మార్గంలో లోకల్ రైల్వే స్టేషన్ పరిధిలో 1,200 సీసీటీవీ కెమెరాలున్నాయి. వీటిని తొలగించి వాటి స్థానంలో 2,729 అధునాతన సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. అంటే అదనంగా 1,529 సీసీటీవీ కెమెరాలు అందుబాటులోకి రానున్నాయి. తెరపైకి మహిళల భద్రత.. రైళ్లలో రాకపోకలు సాగించే ప్రయాణికులపై ప్రధానంగా మహిళలు, యువతులను ఈవ్‌టీజింగ్ చేయడం, అసభ్యకరంగా ప్రవర్తించడం లాంటివి జరుగుతున్నాయి. దీంతో మహిళా ప్రయాణికుల భద్రత తెరమీదకు వచ్చింది. ఇదివరకే మహిళ బోగీలలో సీసీటీవి కెమెరాలు బిగించారు. కానీ, అనేక సందర్భాలలో అవి పని చేయకపోవడం, రైలు కదలడం వల్ల అందులో రికార్డయిన వీడియో క్లిప్పింగులు స్పష్టంగా కనిపించకపోవడం లేదా కెమెరాల డైరెక్షన్ మారిపోవడం లాంటి సమస్యలు ఉన్నాయి. దీంతో ప్లాట్‌ఫారాలపై, రైల్వే స్టేషన్ ఆవరణలో అదనంగా మరిన్ని కెమెరాలు ఏర్పాటు చేయాలని పశ్చిమ రైల్వే నిర్ణయం గతంలోనే తీసుకుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన కెమరాల వల్ల అందులో రికార్డయిన క్లిప్పింగులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో రైల్వే పోలీసులు ఏదైనా నేరం జరిగినప్పుడు వెంటనే నేరస్తులను పట్టుకోవడంలో సఫలీకృతులవుతారు. రైల్వే స్టేషన్, పరిసరాల్లో 2,729 ఆధునిక సీసీటీవీ కెమెరాలు అమర్చడంవల్ల మహిళలతోపాటు సామాన్య ప్రయాణికులకు మరింత భద్రత కల్పించినట్లవుతుందని అధికారులు తెలిపారు. ఆధునిక కెమెరాలు అమర్చే స్టేషన్లు బోరివలి (అత్యధికంగా)–325, ముంబై సెంట్రల్ టెర్మినస్–315, బాంద్రా టెర్మినస్–170, అంధేరీ–192, చర్చిగేట్–157, గోరేగావ్–137, జోగేశ్వరీ–136, కాందివలి–116, బోయిసర్–115, దహిసర్–113 స్టేషన్లతోపాటు మెరైన్ లైన్స్, చర్నిరోడ్, గ్రాంట్రోడ్, మహాలక్ష్మి, లోయర్ పరేల్, ప్రభాదేవి, దాదర్, మాటుంగా, మాహీం, బాంద్రా, ఖార్, శాంతకృజ్, విలేపార్లే, రామ్‌మందిర్, మలాడ్, మీరారోడ్, భాయిందర్, నాయ్‌గావ్, నాలాసోపారా, విరార్ స్టేషన్లలో నూతన కెమెరాలు అమర్చనున్నారు. -
గామీణ ప్రాంతాల్లోనూ 5జీ ట్రయల్స్!
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ 5జీ పరీక్షలు జరిపేలా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆదేశాలు వెలువరించే అవకాశం ఉంది. ఆరు నెలలపాటు ట్రయల్స్ నిర్వహించుకునేలా భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాకు కేంద్రం అనుమతించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, కోల్‌కత, బెంగళూరు, గుజరాత్లో ఈ పరీక్షలు జరుగుతాయి. టెస్టుల్లో భాగంగా టెలి మెడిసిన్, టెలి ఎడ్యుకేషన్, డ్రోన్ ఆధారిత వ్యవసాయం తీరును సైతం పర్యవేక్షిస్తారు. అనుమతి రుసుము చెల్లించిన తర్వాత ఎంటీఎన్ఎల్కు కూడా ట్రయల్ స్పెక్ట్రం కేటాయించనున్నారు. ఢిల్లీలో 5జీ ట్రయల్స్ కోసం సీ-డాట్‌తో ఈ సంస్థ చేతులు కలిపింది. భారత్‌లో 5జీ పరీక్షల కోసం ఎరిక్సన్, నోకియా, శామ్సంగ్, సి-డాట్ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రమే వినియోగించుకునేందుకు అనుమతి ఉంది. చైనా కంపెనీలకు ఈ విషయంలో అవకాశం ఇవ్వలేదు. రిలయన్స్ జియో తన సొంత టెక్నాలజీతోపాటు శామ్సంగ్ నెట్వర్క్ గేర్స్‌ను వినియోగిస్తున్నట్టు సమాచారం. 4జీతో పోలిస్తే 5జీ డౌన్లోడ్ వేగం పదిరెట్లు మెరుగ్గా ఉంటుందని టెలికం శాఖ అంచనా వేస్తోంది. చదవండి: స్పేస్ ఎక్స్ కు పోటీగా దూసుకెళ్తున్న వన్‌వెబ్ -
కంటి చూపు పరిధి దాటి ఎగరనున్న డ్రోన్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయోగాత్మకంగా ఆకాశ మార్గంలో డ్రోన్ల ద్వారా కరోనా వ్యాక్సిన్లను రాష్ట్రంలోని మారుమూల గ్రామాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)కు తరలించేందుకు కేంద్రం నుంచి రాష్ట్రం మరో కీలక సడలింపు పొందింది. కంటి చూపు పరిధి రేఖను దాటి (బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్).. ఆకాశంలో అత్యంత ఎత్తులో డ్రోన్లను ఎగురవేయడానికి వీలుగా.. ‘మానవ రహిత విమాన వ్యవస్థ (యూఏఎస్) నిబంధనలు–2021లను సడలిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. డ్రోన్ల వ్యాక్సిన్ల పంపిణీ కోసం అత్యంత ఎత్తులో వాటిని ఎగురవేయడానికి సడలింపులు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గత మార్చి 9న కేంద్ర పౌర విమానయాన శాఖకు లేఖ రాసింది. అయితే, కంటి చూపు మేర(విజువల్ లైన్ ఆఫ్ సైట్)లో మాత్రమే డ్రోన్లను ఎగరవేయడానికి సడలింపులు ఇస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ ఏప్రిల్ 29న ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో కంటి చూపు పరిధి రేఖ దాటి డ్రోన్లను ఎగురవేయడానికి ఎట్టకేలకు షరతులతో కూడిన అనుమతి లభించింది. వ్యాక్సిన్ల పంపిణీ అవసరాల కోసం డ్రోన్లను ఎగురవేయడానికి అనుసరించాల్సిన ప్రామాణిక పద్ధతుల(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్/ఎస్ఓపీ)కు సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) నుంచి ఆమోదం పొందాలని పౌర విమానయాన శాఖ సూచిం చింది. డీజీసీఏ నుంచి ఎస్ఓపీకి ఆమోదం లభించిన నాటి నుంచి ఏడాది పాటు ఈ సడలింపులు అమల్లో ఉంటాయని తెలిపింది. తాజా అనుమతులతో సుదూర ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలకు వ్యాక్సిన్లను చేరవేర్చడానికి దోహదపడనుంది. రాష్ట్రం ఈ సడలింపులు కోరినా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సైతం ఈ ప్రయోజనం పొందనున్నాయి. వికారాబాద్‌లో ట్రయల్స్... వికారాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ నెల 4వ వారంలో లేదా జూన్ ప్రారంభంలో డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లను జిల్లాలోని మారు మూల గ్రామాల పీహెచ్‌సీలకు తరలించేందు కు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ట్రయ ల్స్‌లో వచ్చిన ఫలితాల ఆధారంగా డ్రోన్ల ద్వారా టీకాల పంపిణీ కోసం విధివిధానాలను రూపొందించనున్నారు. 24 రోజుల పాటు డ్రోన్లతో ట్రయల్స్ నిర్వహించడానికి ఐటీ శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఇక్కడ చదవండి: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు తండాలో నో కరోనా.. ఆదర్శంగా నిలుస్తున్న గిరిజనులు -
‘అనంత’లో డ్రోన్ ప్రయోగాలు
సాక్షి, అమరావతి: సుదీర్ఘ ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా అత్యవసర మందులు, ఇతర వస్తువులను సరఫరా చేసే పరీక్షలకు అనంతపురం జిల్లా వేదిక కానుంది. దేశంలోనే తొలిసారిగా కంటికి కనిపించనంత దూరంగా (బీవీఎల్వోఎస్) డ్రోన్లను పరీక్షించేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతులిచ్చింది. రాష్ట్రానికి చెందిన వాల్యూథాట్‌తో పాటు కర్ణాటకకు చెందిన ఇన్ డ్రోన్స్ సంస్థలు కన్సా ర్షియంగా ఏర్పడి ఏపీ డ్రోన్ కార్పొరేషన్‌తో కలిపి అనంతపురం జిల్లా పుట్టపర్తి సమీపంలో ఈ ప్రయోగాలు నిర్వహించనున్నాయి. డ్రోన్‌కు సుమారు 8 కిలోల బరువున్న వస్తువులను అమర్చి 27.5 కి.మీ దూరం రిమోట్ సాయంతో పంపి పరీక్షలు నిర్వహించనున్నట్లు వాల్యూ థాట్ సీఈవో మహేష్ అనిల్ నంద్యాల ‘సాక్షి’కి వివరించారు. జీపీఎస్ ద్వారా డ్రోన్ తీసుకెళ్లిన వస్తువులను నిర్దేశిత గమ్యానికి సురక్షితంగా చేర్చి తిరిగి వచ్చిందా లేదా పర్యవేక్షిస్తామని, ఈ విధంగా 100 గంటలు ప్రయోగం చేయాల్సి ఉంటుందని సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వంశీ మాదిరెడ్డి తెలిపారు. ఈ ప్రయోగాలకు అనుమతులు, ఏర్పాట్లను ఏపీ డ్రోన్ కార్పొరేషన్ అందిస్తుంది. పుట్టపర్తి ఎయిర్‌పోర్టు సమీపంలోని ఒక ప్రభుత్వ రంగ సంస్థ స్థలాన్ని ప్రయోగానికి వేదికగా నిర్ణయించారు. ఈ నెలాఖరు నుంచి పరీక్షలు జరుగుతాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రకృతి విపత్తులు, సరిహద్దుల రక్షణ, అత్యవసర మందులు, ఆహార సరఫరా వంటి కార్యక్రమాల్లో డ్రోన్స్‌ను విరివిగా వినియోగించుకోవచ్చు. -
ఇక డ్రోన్స్‌తో ఫుడ్ డెలివరీ!
న్యూఢిల్లీ: దేశీయంగా ఫుడ్ డెలివరీ సేవల్లో డ్రోన్లను కూడా ఉపయోగించే దిశగా ప్రయత్నాలు వేగవంతమవుతున్నాయి. ఇందుకు సంబంధించి సంక్లిష్టమైన బీవీఎల్వోఎస్ డ్రోన్లతో ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహించేందుకు 13 సంస్థల కన్సార్షియానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతులిచ్చింది. ఫుడ్ డెలివరీ స్టార్టప్ సంస్థలైన జొమాటో, స్విగ్గీ, డుంజోతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ దన్నుగా ఉన్న డ్రోన్ స్టార్టప్ ఆస్టీరియా ఏరోస్పేస్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. సెప్టెంబర్ 30 నాటికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్దేశించిన నిర్దిష్ట గగనతలంలో ఈ కన్సార్షియం కనీసం 100 గంటల ఫ్లైట్ టైమ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డీజీసీఏకి నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ టెస్టులు జూలై తొలి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. స్థానికంగా డ్రోన్ ఆధారిత సర్వీసులను అభివృద్ధి చేసుకునే దిశగా భారత్‌కు ఇది తొలి అడుగు కానుంది. గతేడాది నుంచే ప్రయత్నాలు .. సుదీర్ఘ దూరాల శ్రేణి డ్రోన్ ఫ్లయిట్స్‌ను ప్రయోగాత్మకంగా అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు భారత్ గతేడాదే ప్రకటించింది. జొమాటో గతేడాదే డ్రోన్లను ఉపయోగించి డెలివరీ చేసే ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. 5 కేజీల పేలోడ్‌తో 10 నిమిషాల వ్యవధిలో 5 కి.మీ. దూరాన్ని డ్రోన్ అధిగమించినట్లు గోయల్ చెప్పారు. ఇది గరిష్టంగా గంటకు 80 కి.మీ. వేగాన్ని అందుకున్నట్లు వివరించారు. 15 నిమిషాల కన్నా తక్కువ వ్యవధిలోనే కస్టమర్‌కు ఫుడ్ డెలివరీ పూర్తి చేసే దిశగా జొమాటో ప్రయత్నాలు చేస్తోంది. ‘ఇంత వేగంగా డెలివరీ చేయాలంటే రహదారి మార్గం ద్వారా కుదరదు. ఆకాశమార్గం ద్వారా మాత్రమే 15 నిమిషాల్లో డెలివరీ వీలవుతుంది‘ అని గోయల్ తెలిపారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా మరింత వేగవంతంగా ఫుడ్ డెలివరీ సేవలు అందించడం కోసం జొమాటో 2018లో స్థానిక డ్రోన్ స్టార్టప్ సంస్థ టెక్‌ఈగిల్‌ను కూడా కొనుగోలు చేసింది. డ్రోన్ ట్రయల్స్‌కు తమకు అనుమతులు లభించినట్లు చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ మే నెలలో వెల్లడించింది. అనుమతి తప్పనిసరి... డ్రోన్ల వినియోగానికి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో.. వీటి తయారీ, వినియోగానికి సంబంధించి మసాయిదా నిబంధనలను పౌర విమానయాన శాఖ విడుదల చేసింది. డీజీసీఏ నుంచి అనుమతి కలిగిన తయారీ సంస్థ లేదా దిగుమతిదారు.. డీజీసీఏ నుంచి అమోదం పొందిన సంస్థ లేదా వ్యక్తికి డ్రోన్లను విక్రయించొచ్చు. అంటే డ్రోన్ల విక్రయాలకు, కొనుగోలుకు కూడా డీజీసీఏ అనుమతి తప్పనిసరి. డ్రోన్లు వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఎదురయ్యే నష్టాలకు థర్డ్ పార్టీ బీమాను తీసుకోవడం కూడా తప్పనిసరి అని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. -
పారిశుధ్యం పనుల్లో డ్రోన్ ల వినియోగం
-
డ్రోన్లతో భారత్‌లోకి పాక్ ఆయుధాలు
చండీగఢ్: పాకిస్థాన్‌లోని ఖలిస్థాన్ ఉగ్రమూకలు సెప్టెంబర్ 9 నుంచి 16 వరకు డ్రోన్ల ద్వారా 80 కేజీల బరువుగల ఆయుధాలూ, మందుగుండు సామాగ్రిని సరిహద్దులగుండా భారత్‌లోనికి జారవిడిచినట్టు భారత భద్రతాదళాలూ, పంజాబ్ పోలీసులు ధృవీకరించారు. కశ్మీర్లో ఉగ్రవాదుల కార్యకలాపాలను ప్రేరేపించడం కోసం పాకిస్తాన్ గూఢచారి వ్యవస్థ మద్దతుతో ఖలిస్థాన్ తీవ్రవాద శక్తులు ఈ చర్యకు పాల్పడినట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల 22వ తేదీన అమృత్‌సర్‌లోని తరన్ తరన్ జిల్లాలో డ్రోన్ల ద్వారా జారవిడిచిన ఆయుధసామగ్రిపై విచారణ జరపడంతో విషయంవెలుగులోకి వచ్చింది. పంజాబ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలను ముమ్మరం చేయడం కోసం పాకిస్తాన్, జర్మనీ మద్దతుతో ఖలిస్తాన్ జిందాబాద్ ఉగ్రమూకలు కుట్రపన్నుతున్నట్టు భారత భద్రతాదళాలు వెల్లడించాయి. పాకిస్థాన్ సరిహద్దుల్లో 2 కిలోమీటర్ల దూరం నుంచి ఈ డ్రోన్లను పంపించారు. అయితే ఇవి 2000 అడుగుల ఎత్తులో ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించి, 1200 అడుగుల కిందకి దిగి ఆయుధాలను జారవిడిచినట్టు వెల్లడయ్యింది. డ్రోన్ల ద్వారా జారవిడిచిన వాటిలో ఐదు ఏకే – 47 తుపాకులు, 16 మ్యాగజైన్స్, 472 రౌండ్లకు సరిపడా మందుగుండ్లు, చైనాలో తయారైన నాలుగు 30 బోర్ పిస్టల్స్ తదితర సామాగ్రితో పాటు ఐదు సాటిలైట్ ఫోన్లు, రెండు మొబైల్ ఫోన్లు, రెండు వైర్లెస్ సెట్లు, 10 లక్షల నకిలీ కరెన్సీని పోలీసులు స్వా«ధీనం చేసుకున్నారు. డ్రోన్లు వస్తే పేల్చేస్తాం హిసార్: ఇతర దేశాల సరిహద్దుల నుంచి భారత్‌లోకి ఎలాంటి డ్రోన్లు, అనుమానిత పరికరాలు ప్రవేశించినా వెంటనే పసిగట్టే సత్తా మన సైనిక దళాలకు ఉందని సౌత్ వెస్ట్రన్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అలోక్‌సింగ్ క్లేర్ చెప్పారు. భారత్–పాక్ సరిహద్దు వెంట ఉగ్రవాదులు డ్రోన్ల సాయంతో ఆయుధాలను జార విడుస్తున్నా రంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. పాకిస్తాన్ భూభాగం నుంచి భారత్‌లోకి వైపు డ్రోన్లు ప్రవేశిస్తే వెంటనే పేల్చేస్తామని స్పష్టం చేశారు. డ్రోన్ల గురించి ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న డ్రోన్ల సామర్థ్యం పరిమితమేనన్నారు. -
దోమల నివారణకు డ్రోన్ టెక్నాలజీ
సాక్షి, హైద్రాబాద్ : నగరంలో ఆధునాతన టెక్నాలజీ ఉపయోగించి చెరువులు, నాలాల సుందరీకరణ పనులు చేపడుతున్నామని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. శుక్రవారం మియాపూర్ గుర్నాధం చెరువులో దోమల నివారణకు డ్రోన్ టెక్నాలజీతో యాంటీ లార్వా మందు పిచికారీ పనులను జీహెచ్ఎంసీ చేపట్టింది. ఈ కార్యక్రమానికి మేయర్‌తోపాటు ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు మేక రమేష్, నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. మేయర్ మాట్లాడుతూ సిబ్బందికి వీలుకాని చోట డ్రోన్లతో మందుల పిచికారీ, గుర్రపు డెక్క తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నామని, రానున్న రోజుల్లో నగరమంతా ఇదే టెక్నాలజీ ఉపయోగిస్తామని తెలిపారు. -
నిఘా కోసం చైనా డ్రోన్లు
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో జైషే ఉగ్రవాద శిక్షణ శిబిరంపై భారత వైమానిక దళం మెరుపుదాడి చేయడంతో పాకిస్తాన్‌కు రక్షణ పరంగా తన వైఫల్యాలేమిటో తెలిసి వచ్చింది. దాంతో భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తపడుతోంది. భారత్ విషయంలో ఇంత వరకు అనుసరిస్తున్న వ్యూహాలను మార్చుకుంటోంది. సైనిక స్థావరాల వద్ద భద్రతను పటిష్టం చేయడం, సరిహద్దులో నిఘాను పెంచడం వంటి చర్యలు తీసుకుంటున్నట్టు భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. ఏ మాత్రం దొరక్కుండా, రాడార్లకు కూడా చిక్కకుండా భారత్ దాడి చేయడం, ఆ తర్వాత భారత్‌పై దాడికి చేసిన యత్నం విఫలమవడాన్ని పాక్ సైన్యం జీర్ణించుకోలేకపోతోందని భారత నిఘావర్గాల భోగట్టా. అత్యాధునిక ఆయుధాలు, నిఘా వ్యవస్థలను సత్వరమే సమకూర్చుకోవాలని, సరిహద్దులో నిఘాను పెంచాలని నిర్ణయించింది. వాస్తవాధీన రేఖ, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లలో నిఘాకోసం మరిన్ని డ్రోన్లను ఉపయోగించాలని, వాటిని చైనా నుంచి కొనాలని నిర్ణయించింది. అలాగే, సరిహద్దులో చైనా తయారీ మధ్యంతర క్షిపణులను మోహరించాలని కూడా ఆలోచిస్తోంది. అత్యాధునిక రైన్బో డ్రోన్లు, యూఏవీల కొనుగోలుకు చైనాతో ఒప్పందాలు కుదుర్చుకుంది. మరోవైపు ఉగ్ర సంస్థలకు కూడా జాగ్రత్తలు చెబుతోంది. ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించవద్దని, వాస్తవాధీన రేఖకు దూరంగా శిబిరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్టు నిఘా వర్గాల సమాచారం. అలాగే, ఉగ్రవాదులంతా పాక్ సైనిక యూనిఫాంలు లేకుండా బయట తిరగవద్దని కూడా స్పష్టం చేసింది. భారత్‌పై దాడుల కోసం ఉగ్రవాదుల కన్సార్టియం ఏర్పాటుకు ఐఎస్ఐ ప్రయత్నిస్తోందని తెలిసింది. ఇందుకోసం జైషే, హఖానీ, తాలిబన్, ఐసిస్ వంటి ఉగ్ర సంస్థల మధ్య సమావేశాలు ఏర్పాటు చేస్తోందని నిఘా వర్గాలు పసిగట్టాయి. -
భారత్‌కు ఏ సాయం చేయడానికైనా రెడీ
జెరూసలేం : ఉగ్రదాడులతో ఇబ్బందులు పడుతున్న భారత్‌కు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఎలాంటి ఆత్మరక్షణ చర్యలు తీసుకున్నా, వాటిని సమర్థిస్తామని ఇప్పటికే అమెరికా స్పష్టం చేసింది. తాజాగా ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి అవసరమైన విజ్ఞానాన్ని, సాంకేతికను భారత్‌కు అందించేందుకు సిద్ధమని ఇజ్రాయెల్ ప్రకటించింది. పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఇజ్రాయెల్ సైనికుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. ఈ విపత్కర పరిస్థితుల్లో తమ మిత్రదేశం భారత్‌కు వెన్నుదన్నుగా ఉంటామని తెలిపింది. ‘ఏ సహాయం కావాలో చెప్పండి, ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి భారత్‌కు ఏ విధమైన సాయమైనా బేషరతుగా అందిస్తాం’ అని భారత్‌లో కొత్తగా నియమితులైన ఇజ్రాయెల్ రాయబారి రాన్ మాల్కా తెలిపారు. తమకు అత్యంత మిత్రదేశమైన భారత్‌తో మరింత దృఢమైన సంబంధాలను పెంపొందించుకునేందుకు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సుముఖంగా ఉన్నారని తెలిపారు. కాగా, ఉగ్రవాద నిర్మూలనలో ఇజ్రాయెల్ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. డ్రోన్ సాంకేతికతో టెర్రరిస్టులను మట్టుపెట్టడంలో ప్రత్యేకత సాధించింది. (భారత్‌కు మద్దతు ఇస్తాం: అమెరికా) ఇదిలాఉండగా.. కశ్మీర్లో 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలితీసుకున్న ‘పుల్వామా ఆత్మాహుతి ఉగ్రదాడి’కి సూత్రధారిగా భావిస్తున్న కమ్రాన్ అలియాస్ అబ్దుల్ ఘాజీ రషీద్‌సహా ముగ్గురు జైషే మహ్మద్ ముష్కరులను భద్రతా దళాలు హతమార్చాయి. సోమవారం జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఓ ఆర్మీ మేజర్ సహా ఐదుగురు భద్రతా సిబ్బంది, ఓ పౌరుడు అమరులయ్యారు. పోలీస్ డీఐజీసహా 9 మంది సిబ్బంది గాయపడ్డారు. పుల్వామా ఉగ్రదాడి జరిగిన ప్రదేశానికి 12 కి.మీ.ల దూరంలోని పింగ్లాన్‌లో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. -
డ్రోన్ల శక్తి పెరిగింది....
శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ కంపెనీ ఎల్రాయ్.. ఏకంగా 250 కిలోల బరువును మోసుకెళ్లగలిగే డ్రోన్లను సిద్ధం చేసింది. వస్తువుల రవాణాకు ఉపయోగపడే డ్రోన్లు ఇప్పటికే కొన్ని అందుబాటులో ఉన్నప్పటికీ అవన్నీ కేవలం పది, ఇరవై కిలోల బరువు మాత్రమే మోసుకెళ్లగలవు. పైగా ఇవి ప్రయాణించే దూరం కూడా చాలా తక్కువ. ఈ నేపథ్యంలో ఎల్రాయ్ 250 కిలోల బరువును మోసుకెళ్లగలిగే డ్రోన్లను సిద్ధం చేయడం.. అది కూడా ఏకంగా 300 మైళ్ల దూరం ప్రయాణించేలా సిద్ధం చేయడం విశేషం. ఆరు రోటర్లతో కూడిన ఈ డ్రోన్లు నిట్టనిలువుగా పైకి ఎగురుతాయి. నేలకు దిగగలవు కూడా. వీటితోపాటు వెనుకభాగంలో ఏర్పాటు చేసిన ఇంకో రోటర్ కారణంగా వేగంగా ముందుకెళ్లగలదని కంపెనీ సీఈవో డేవిడ్ మెరిల్ తెలిపారు. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ అవసరం కూడా లేకుండా ఇది హైబ్రిడ్ వపర్ ట్రెయిన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. విపత్తుల సందర్భంలో సరుకులు రవాణా చేసేందుకు ఈ డ్రోన్లు బాగా ఉపయోగపడుతాయని.. భవిష్యత్తులో ట్రక్కులకు బదులుగా ఈ డ్రోన్లను వాడాలన్నది తమ లక్ష్యమని మెరిల్ వివరించారు. ఇప్పటికే దాదాపు 70 కోట్ల రూపాయల నిధులు సేకరించిన తాము మరిన్ని నిధుల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. -
డ్రోన్లకు డిజిటల్ పర్మిట్
ముంబై: డ్రోన్ ఆపరేటర్లు ఆన్లైన్లో నమోదుచేసుకునే సదుపాయాన్ని పౌర విమానయాన శాఖ ప్రారంభించింది. ‘డిజిటల్ స్కై’ అనే పోర్టల్ ద్వారా ఈ ప్రక్రియ చేపడతారు. డ్రోన్ ఆపరేటర్లు వనటైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డ్రోన్ పైలట్లు, యజమానుల వివరాల్ని నమోదుచేయాలి. నానో డ్రోన్స్ చట్టబద్ధంగా ఎగిరేందుకు అనుమతులిచ్చినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. డిజిటల్ నమోదుకు సంబంధించిన చెల్లింపుల్ని భారత్ కోష్ పోర్టల్ ద్వారా స్వీకరిస్తున్నట్లు తెలిపింది. గ్రీన్జోన్లో డ్రోన్ ఎగరడానికి ముందు సమయం, ప్రాంతం లాంటి వివరాల్ని ముందస్తుగా చెప్పాలి. యెల్లో జోన్లో ఆపరేట్ చేయాలంటే మాత్రం తప్పకుండా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. రెడ్ జోన్లో డ్రోన్లను అనుమతించరు. ఏయే ప్రాంతాలు ఏయే జోన్ల కిందికి వస్తాయో త్వరలో ప్రకటిస్తారు. -
చౌక ఇళ్ల నిర్మాణానికి డ్రోన్లు...
ఇప్పటికే బోలెడన్ని రంగాల్లో ఎంతో ఉపయోగపడుతున్న డ్రోన్లను ఇళ్ల నిర్మాణానికీ వాడుకోవచ్చునని నిరూపించారు స్టెఫానీ ఛాల్టెయిల్ అనే టెకీ. బార్సిలోనా ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్‌కు చెందిన ఛాల్టెయిల్ భవన నిర్మాణ పద్ధతులపై చాలా ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. కొన్ని పనులను డ్రోన్ల వంటి యంత్రాలు/రోబోల సాయంతో చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని స్టెఫానీ అంచనా. ఇందులో భాగంగా గత ఏడాది డ్రోన్లకు అడుసుతో కూడిన పైపులు బిగించి చిన్న చిన్న నిర్మాణాలకు ప్రయత్నించి విజయం సాధించారు. ముందుగా తయారు చేసిన ఫ్రేమ్‌వర్క్‌పై ఈ డ్రోన్లు అడుసును చల్లుతాయి. మారుమూల ప్రాంతాల్లో చౌకగా ఆవాసాలను ఏర్పాటు చేసుకునేందుకు ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుందని అంచనా. ఫ్రేమ్స్‌ను అతి తక్కువ శ్రమతో సిద్ధం చేసుకోవచ్చునని, మట్టి, సున్నం, ఇసుక, నూనెలు వంటి వాటిని వేర్వేరు మోతాదుల్లో కలుపుకోవడం ద్వారా బయోషాట్క్రీట్ తయారు చేసుకోవచ్చునని. త్వరగా దృఢంగా మారిపోయే వీటితో ఆవాసాల నిర్మాణం బాగా జరుగుతుందన్నారు. -
రైలు పట్టాలకు డ్రోన్ల రక్షణ!
రైల్వే ట్రాక్‌ల భద్రత, సంరక్షణకు ఇకపై లైన్మెన్లు రేయింబవళ్లు కష్టపడాల్సిన పనిలేదు. లైన్మెన్లకు ఊరటనిచ్చే ఓ సరికొత్త విధాన రూపకల్పన బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఐఐటీ రూర్కీ విద్యార్థులకు అప్పజెప్పింది. రైల్వే ట్రాక్‌ని అనునిత్యం పర్యవేక్షించే డ్రోన్ల తయారీతో ఐఐటీ రూర్కీ ఈ విధానానికి రూపకల్పన చేయబోతోంది. టెలికం ఇండస్ట్రీ, రైల్వే ప్రోత్సాహంతో ఐఐటీ రూర్కీ తయారు చేసిన రైల్వే ట్రాక్‌ని పర్యవేక్షించే డ్రోన్లను ఉత్తరాఖండ్‌లో తొలిసారిగా పరీక్షించారు. త్వరలోనే రైల్వేలో ప్రవేశ పెట్టబోయే ఈ డ్రోన్లపై పేటెంట్ కోసం ఐఐటీ రూర్కీ ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ట్రాక్ పర్యవేక్షణకు మాత్రమే ఉపయోగపడే ఈ డ్రోన్లను భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఆపదలో ఉన్న వారిని గుర్తించి, రక్షించేందుకు ఉపయోగించే వీలుందంటున్నారు నిపుణులు. సమర్థవంతమైన రైల్వేల నిర్వహణ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించాలన్న కేంద్ర ప్రభుత్వ యోచనలో భాగంగా ఈ డ్రోన్లను తయారు చేసి త్వరలోనే ప్రవేశ పెట్టనున్నామని ఇండియన్ రైల్వే అధికార ప్రతినిధి ఆర్డీ బాజ్‌పేయ్ వెల్లడించారు. ఇప్పటికే జబల్పూర్, భోపాల్, కోటా డివిజన్లలో రైల్వే ట్రాక్ పర్యవేక్షణకు వీటిని ఉపయోగించినట్టు తెలిపారు. 2017–18లో రైళ్లు 54 సార్లు పట్టాలు తప్పాయి. గతేడాది 78 సార్లు, 2010–11లో 141 పర్యాయాలు రెళ్లు పట్టాలు తప్పాయి. 2016–17లో రైల్వే ప్రమాదాల్లో గాయపడిన వారూ, మరణించిన వారూ 607 మంది. గతేడాది రైలు ప్రమాదాల్లో మరణించిన, గాయపడిన వారి సంఖ్య 254కి తగ్గింది. ట్రాక్‌ల వీడియో దృశ్యాలూ, ఫొటోలను తీసే డ్రోన్ల ద్వారా పర్యవేక్షించే వీలుంటుంది కనుక రైలు ప్రమాదాలను భారీగా తగ్గించొచ్చని నిపుణులు భావిస్తున్నారు. -
రెడీ.. వన్.. టూ.. త్రీ..
పిజ్జాల డెలివరీలు.. పెళ్లిళ్లలో 360 డిగ్రీల్లో ఫోటోలు, వీడియోలు..సెల్ఫీ వీడియోలు, ఫొటోలు తీసుకునేందుకు.. పుష్కరాలు వంటి ఉత్సవాల్లో భద్రతను పరిశీలించేందుకు.. డ్రోన్లు అన్న పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేవి ఇవే. కానీ భవిష్యత్తులో అదీ ఇదీ అని కాకుండా దాదాపు అన్ని రంగాల్లోనూ తమదైన ముద్ర వేసేందుకు డ్రోన్లు సిద్ధమవుతున్నాయి! మన దేశంలో ఇప్పటివరకూ సైన్యం, భద్రతా రంగాల్లో డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తుండగా.. ఇకపై పరిస్థితి మారిపోనుంది.సాధారణ ప్రజలు కూడా డ్రోన్లను వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వీలు కల్పిస్తుండటమే దీనికి కారణం. ఇంతకీ డ్రోన్లతో మనకు ప్రయోజనమెంత, వాటి వినియోగంపై ఆంక్షలేమిటి, డ్రోన్లతో భవిష్యత్తు ఏమిటో తెలుసా? విమానాశ్రయాన్ని మూసేసి..! కొద్దినెలల క్రితం మైసూరు విమానాశ్రయం ఓ రెండు గంటలపాటు మూతపడింది. విమానాల రాకపోకలపై ఆంక్షలు పెట్టేశారు. ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా. విమానయాన శాఖ, కొన్ని స్టార్టప్ కంపెనీలు డ్రోన్లను పరీక్షించాయి. బెంగళూరుకు చెందిన స్కైలార్క్ ఇంజనీర్లు భద్రతా రంగంలో డ్రోన్లను మరింత సమర్థంగా ఎలా వాడవచ్చు, వేర్వేరు రంగాల్లో డ్రోన్ల వినియోగంతో వచ్చే లాభాలేమిటి అన్న అంశాలను ప్రభుత్వ ఉన్నతాధికారులకు ప్రత్యక్షంగా చూపారు. డ్రోన్లతో భారత్ ఆర్థికంగా బలోపేతం అవుతుందని, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, సామాజికంగా మార్పులు వస్తాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పెను మార్పులకు డ్రోన్లు ఉపయోగపడతాయని అంచనా. ఇప్పటికే 40 వేలకుపైగా డ్రోన్లు ప్రైవేటు వ్యక్తులు వినియోగించడంపై ఆంక్షలు ఉన్నా.. మన దేశంలో ఇప్పటికే 40 వేలకుపైగా డ్రోన్లు ఉన్నట్టు అంచనా. 2022 నాటికి ప్రపంచం మొత్తమ్మీద డ్రోన్ల వాడకం రెట్టింపు అవుతుందని, వాటి మార్కెట్ 10 వేల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక్క యూరప్‌లోనే లక్షా 50 వేల కొత్త ఉద్యోగాల కల్పనకు డ్రోన్లు కారణమవుతాయని అంచనా. డ్రోన్లు నడిపేందుకు ప్రత్యేక నైపుణ్యం ఉన్న వారు అవసరమవుతారు. అలాగే అనవసరమైన డ్రోన్లను కూల్చేసేందుకు నిపుణుల అవసరం ఉంటుంది. ఆయా రంగాల్లోని అవసరాలకు తగ్గట్టుగా కొత్త కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. డ్రోన్లతో వ్యవ’సాయం’ మట్టి నాణ్యతని పరీక్షించి, సాగు చేసుకోదగ్గ పంటలపై సూచనలు ఇవ్వడం మొదలుకొని... దిగుబడులను అంచనా వేయడం వరకు డ్రోన్లు వ్యవసాయానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి. పంట పొలాల్లోని ప్రతి మొక్క, చెట్లను ఫొటోలు తీసి.. విశ్లేషించి వాటి ఆరోగ్యం ఎలా ఉందో గుర్తించవచ్చు. పొలంలోని ఏభాగంలో పోషకాల కొరత ఉందో.. ఎక్కడ ఎక్కువైందో తెలుసుకోవచ్చు. ఎరువులు, కీటకనాశినులను సమర్థంగా, తక్కువ సమయంలో పొలమంతా చల్లేందుకు డ్రోన్లను వాడుకోవచ్చు. ఇక విత్తనాలు నాటే డ్రోన్లు కూడా వస్తున్నాయి. చైనా, జపాన్ వంటి దేశాలు వ్యవసాయ రంగంలో డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తున్నాయి. మనదేశంలో పంజా బ్, కర్ణాటక తదితర రాష్ట్రాల రైతులు డ్రోన్లను వినియోగించడం మొదలుపెట్టారు. ఇక డ్రోన్ల సహాయంతో క్లౌడ్ సీడింగ్ చేయడం ద్వారా కరువు ప్రాంతాల్లో వర్షాలు కురిపించడం, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయ చర్యలు, అభయారణ్యాల్లో వేటగాళ్ల నుంచి జంతువుల సంరక్షణకు డ్రోన్లను విస్తృతంగా వినియోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. డ్రోన్లపైనా నిఘా పెడతాయి డ్రోన్లు ఉగ్రవాదుల చేతుల్లో పడితే అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించవచ్చన్న భయం ఇన్నాళ్లూ వెంటాడేది. ఇప్పుడు అలాంటి ఆందోళనలు లేవు. శత్రు డ్రోన్లకు అడ్డుకట్టే వేసే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఇలా పక్కదారిపట్టే డ్రోన్ల ఆచూకీ కనిపెట్టడానికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఇఎల్) శక్తిమంతమైన రాడర్లు, జామర్లను రూపొందించింది. విమానాశ్రయాలు, పార్లమెంటు, సరిహద్దు ప్రాంతాలు, సైనిక శిబిరాలు వంటి ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడం వల్ల డ్రోన్లతో ఎవరైనా దాడికి దిగుతారన్న భయం ఉండ దు. ప్రస్తుతం 3 కిలోమీటర్ల పరిధిలో ఉండే డ్రోన్లను మాత్రమే ఈ టెక్నాలజీ ద్వారా పసిగట్టవచ్చు. ఈ పరిధిని పెంచడానికి పరిశోధనలు జరుగుతున్నాయి. అవయవ రవాణాతో ప్రాణదానం అవయవాలను దానం చేస్తే ఒక ప్రాణాన్ని నిలపవచ్చన్న అవగాహన ఈ మధ్య కాలంలో అందరిలోనూ పెరుగుతోంది. కానీ అవయవాలను సకాలంలో అవసరమైన చోటికి సరఫరా చేయడం సవాల్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలోనే ఒక ఊరి నుంచి మరో ఊరికి రవాణా, ట్రాఫిక్ జామ్‌లు వంటి ఇబ్బందులు లేకుండా అవయవాలను సరఫరా చేయడానికి డ్రోన్లు ఉపయోగపడతాయి. గుండె, కాలేయం వంటి అవయవాలను డ్రోన్ల సాయంతో తరలించడానికి అవసరమయ్యే తక్కువ బరువున్న సరికొత్త బాక్స్‌ను శాస్త్రవేత్తలు ఇప్పటికే రూపొందించారు. ఇక మీదట ఈ అంబులెన్స్ డ్రోన్లు మనుషుల ప్రాణాలను కాపాడడానికి ఉపయోగపడతాయి. హింసాత్మక ఘటనలకు చెక్! జాతరలు, ఉత్సవాలు, సభలు సమావేశాల సమయాల్లో భద్రతా ఏర్పాట్ల కోసం డ్రోన్లను వినియోగించడం ఇప్పటికే మొదలైంది. అంతేకాదు అలాంటి కార్యక్రమాల్లో ఎవరైనా హింసకు పాల్పడే అవకాశాలుంటే.. ముందుగానే గుర్తించి, హెచ్చరికలు జారీ చేసేలా డ్రోన్లను అభివృద్ధి చేస్తున్నారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ రకమైన డ్రోన్లు రెండు కెమెరాల సాయంతో వీడియోలు తీయడమే కాకుండా.. ఐదు రకాల ముఖ కవళికలు, చర్యల ఆధారంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని గుర్తిస్తాయి. తన్నడం, పిడిగుద్దులు, పొడవడం, కాల్చడం వంటి చర్యలను కూడా ఇవి గుర్తించగలవు. తద్వారా సమస్య పెద్దది కాకముందే అధికారులు రంగంలోకి దిగేందుకు వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వరంగల్), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (బెంగళూరు) శాస్త్రవేత్తలు వీటిని వచ్చే నెలలో పరీక్షించనున్నారు. శత్రు స్థావరాలపై కిల్లర్ డ్రోన్ల నిఘా వందేళ్ల క్రితం మిలటరీ అవసరాల కోసమే తయారు చేసిన డ్రోన్లు.. ఇప్పుడు చాలా శక్తిమంతంగా తయారయ్యాయి. ప్రస్తుతం భారత సైన్యం దగ్గర 200కి పైగా డ్రోన్లు ఉన్నాయి. కొన్ని డ్రోన్లను సరిహద్దుల్లో గస్తీ కోసం వినియోగిస్తుండగా.. శత్రుస్థావరాలపై నిఘా పెట్టే విదేశీ రాడార్లను పసిగట్టే కిల్లర్ డ్రోన్లను ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేశారు. ఇక రూ. 2,650 కోట్ల వ్యయంతో డీఆర్డీవో సొంతంగా డ్రోన్ల తయారీ ప్రాజెక్టును కూడా ప్రారంభించింది. యుద్ధభూమిలో వినియోగిం చడానికి మరో 400 డ్రోన్ల అవసరముందని రక్షణ శాఖ అంచనా వేస్తోంది? -
వైద్యంలోనూ డ్రోన్ల సాయం!
అమెరికా: రోడ్లు సరిగా లేని మారుమూల ప్రాంతాలకు అత్యవసర పరిస్థితుల్లో చేరుకోవాలంటే చాలా కష్టం. ఆఫ్రికన్ దేశమైన రువాండాలో రోడ్లు, మౌలిక వసతుల పరిస్థితి అసలే చాలా ఘోరంగా ఉంటుంది. ఏదైనా ప్రమాదాలు జరిగినపుడు ఆహారపదార్థాలు, మందులు, రక్తం పంపిణీ చేయడం అక్కడి అధికారులకు తలనొప్పితో కూడుకున్న వ్యవహారం. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు డ్రోన్ల సాయం తీసుకునేందుకు వినియోగించేందుకు రంగం సిద్ధమైంది. వైద్య పరికరాలు, ఇతరత్రా అత్యవసర సామగ్రిని అవసరమైన ప్రదేశానికి పంపేందుకు డ్రోన్ సేవలను రువాండాతో పాటు అమెరికాకు చెందిన జిప్‌లైన్ అనే సంస్థ త్వరలో ప్రారంభించనుంది. వెయ్యి కొండల దేశమని పేరున్న రువాండాలో దాదాపు 1.1 కోట్ల మంది జనాభా ఉన్నారు. జిప్‌లైన్ అభివృద్ధి చేసిన డ్రోన్లు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రులకు మందులు, రక్తం, ఇతర సామగ్రి సరఫరా చేస్తాయి. రోజుకు ఎన్ని సార్లయినా ఎక్కడికైనా వెళ్లి రాగలిగే ఈ డ్రోన్ల సైన్యాన్నే సిద్ధం చేస్తున్నారు. గోడౌన్లలోని అధికారులకు ఫోన్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా డాక్టర్లు సమాచారం పంపడమే ఆలస్యం ఈ డ్రోన్లు తమ పని ప్రారంభిస్తాయి. దూరాన్ని బట్టి సాధ్యమైనంత త్వరలో నిర్దేశిత ప్రాంతంలో సామగ్రిని వదిలేస్తుంది. ప్యారాచూట్ సాయంతో సామగ్రి ఉన్న బ్యాగ్‌ను భద్రంగా కిందికి దించుతుంది.