ఏకధాటిగా 40 గంటలు ఎగిరే డ్రోన్‌.. ఇంకెన్నో ప్రత్యేకతలు | MQ 9B Drone That Flies For 40 Hours At A Time | Sakshi
Sakshi News home page

ఏకధాటిగా 40 గంటలు ఎగిరే డ్రోన్‌.. ఇంకెన్నో ప్రత్యేకతలు

Published Fri, Feb 2 2024 2:57 PM | Last Updated on Fri, Feb 2 2024 3:01 PM

MQ 9B Drone That Flies For 40 Hours At A Time - Sakshi

అమెరికా, భారత్‌ మధ్య ‘ఎంక్యూ-9బీ ప్రిడేటర్‌ డ్రోన్ల’పై ఒప్పందం చివరి దశకు చేరుకుంది. దాదాపు 4 బిలియన్ల డాలర్ల(రూ.33 వేలకోట్లు) విలువైన ఒప్పందంలో భారత్‌కు ఎంక్యూ-9బీ సాయుధ డ్రోన్ల అమ్మకానికి అమెరికా ఆమోదం తెలిపింది. ఈ డీల్‌ అమెరికా-భారత వ్యూహాత్మక సంబంధాన్ని బలోపేతం చేయనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

ఎంక్యూ-9బీ ప్రిడేటర్‌ డ్రోన్ల ప్రత్యేకతలు ఇవే..

  • సముద్రపు నిఘా కోసం సీ గార్డియన్‌ డ్రోన్లు, భూసరిహద్దు పరిరక్షణ నిఘా కోసం స్కై గార్డియన్‌ డ్రోన్లను ప్రత్యేకంగా వినియోగించుకోవచ్చు.
  • ఈ సాయుధ డ్రోన్లకు ప్రత్యేక సామర్థ్యాలు ఉంటాయి. 
  • ఫైటర్‌జెట్‌లు చేయగలిగే పనులు సైతం ఇవి చేస్తాయి. 
  • వీటికి హెల్‌ఫైర్‌ క్షిపణులు అమర్చి ఉంటాయి. 
  • శత్రువులను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, మందుగుండు సామగ్రితో విధ్యంసం సృష్టిస్తాయి.

  • ఈ డ్రోన్లను నిఘా సామర్థ్యం ఉంటుంది.
  • మానవతా సహాయం, విపత్తుల సమయంలో రక్షణ చర్యలు, గాలింపు చర్యలు, గాలో ముందస్తు హెచ్చరికలు, ఎలక్ట్రానిక్‌ వార్‌పేర్‌, యాంటీ సర్ఫేస్‌ వార్‌ఫేర్‌, యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ల్లో ఈ డ్రోన్లను ఉపయోగించవచ్చు.
  • మాదకద్రవ్యాల అక్రమరవాణా, పైరసీ వంటి పరిస్థితులను ఎదుర్కొవడానికి కూడా ఈ డ్రోన్లను మోహరించవచ్చు.

ఇదీ చదవండి: జనవరిలో ‘తయారీ’కి కొత్త ఆర్డర్ల బూస్ట్‌

  • అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ఏకధాటిగా 30 నుంచి 40 గంటలపాటు ఈ డ్రోన్లు గాల్లో ఎగరగలవు. 
  • 40,000 అడుగుల ఎత్తు వరకు ఎగిరే సామర్థ్యం వీటికి ఉంటుంది.
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement