Bayer conducts drone trial in agriculture: వ్యవసాయ రంగంలో ప్రసిద్ధి చెందిన బేయర్ క్రాప్ సైన్స్ లిమిటెడ్ సంస్థ అధునాత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చేలా మరో ప్రయోగానికి తెరలేపింది. తొలిసారిగా వ్యవసాయంలో డ్రోన్లను ఉపయోగించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌కి సమీపంలో చాందీపా దగ్గర బేయర్ సంస్థకి సంబంధించిన మల్టీ క్రాప్ బ్రీడింగ్ సెంటర్‌లో వ్యవసాయంలో డ్రోన్లను పూర్తి స్థాయిలో వినియోగించాలని నిర్ణయించింది.
వ్యవసాయ మంత్రి హర్షం
సాయంలో డ్రోన్ల వినియోగానికి సంబంధించి గత ఐదేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా బేయర్ సంస్థ సైతం ఇప్పటికే పలు దశల్లో ప్రయోగాలు చేపట్టింది. వాటన్నింటీని క్రోడీకరించి ఉత్తమమైప పద్దతిలో వ్యవసాయంలో డ్రోన్ల వినియోగానికి తెరలేపింది. అందులో భాగంగా పరిశోధనల పరంగా కాకుండా నేరుగా వ్యవసాయంలో డ్రోన్లను ఉపయోగించనుంది. బేయర్ సంస్థ చేపట్టిన ఈ పైలెట్ ప్రాజెక్టు పట్ల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ హర్షం వ్యక్తం చేశారు.
రైతులకు ప్రయోజనం
జనరల్ ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి చెందిన డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. వరి, మొక్కజోన్న, చెరుకు, గోధుమ, కూరగాయల సాగుకు సంబంధించి డ్రోన్లను ఉపయోగించడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి పొందవచ్చని బేయర్ సంస్థ చెబుతోంది. తక్కువ కమతాలు ఉన్న ఏసియాలోని ఇతర దేశాల్లోని రైతులు ఇప్పటికే డడ్రోన్లు ఉపయోగించి మంచి ఫలితాలు పొందుతున్నారని, అదే పద్దతిలో ఇండియాలోని చిన్న, సన్నకారు రైతులకు సైతం డ్రోన్లతో ఉపయోగం ఉంటుందని బేయర్స్ క్రాప్ సైన్స్ లిమిటెడ్ పీఈవో నరేన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment