Bayer Crop Science
-
డ్రోన్లతో వ్యవసాయం.. హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా మొదలు
Bayer conducts drone trial in agriculture: వ్యవసాయ రంగంలో ప్రసిద్ధి చెందిన బేయర్ క్రాప్ సైన్స్ లిమిటెడ్ సంస్థ అధునాత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చేలా మరో ప్రయోగానికి తెరలేపింది. తొలిసారిగా వ్యవసాయంలో డ్రోన్లను ఉపయోగించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌కి సమీపంలో చాందీపా దగ్గర బేయర్ సంస్థకి సంబంధించిన మల్టీ క్రాప్ బ్రీడింగ్ సెంటర్లో వ్యవసాయంలో డ్రోన్లను పూర్తి స్థాయిలో వినియోగించాలని నిర్ణయించింది. వ్యవసాయ మంత్రి హర్షం సాయంలో డ్రోన్ల వినియోగానికి సంబంధించి గత ఐదేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా బేయర్ సంస్థ సైతం ఇప్పటికే పలు దశల్లో ప్రయోగాలు చేపట్టింది. వాటన్నింటీని క్రోడీకరించి ఉత్తమమైప పద్దతిలో వ్యవసాయంలో డ్రోన్ల వినియోగానికి తెరలేపింది. అందులో భాగంగా పరిశోధనల పరంగా కాకుండా నేరుగా వ్యవసాయంలో డ్రోన్లను ఉపయోగించనుంది. బేయర్ సంస్థ చేపట్టిన ఈ పైలెట్ ప్రాజెక్టు పట్ల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ హర్షం వ్యక్తం చేశారు. రైతులకు ప్రయోజనం జనరల్ ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి చెందిన డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. వరి, మొక్కజోన్న, చెరుకు, గోధుమ, కూరగాయల సాగుకు సంబంధించి డ్రోన్లను ఉపయోగించడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి పొందవచ్చని బేయర్ సంస్థ చెబుతోంది. తక్కువ కమతాలు ఉన్న ఏసియాలోని ఇతర దేశాల్లోని రైతులు ఇప్పటికే డడ్రోన్లు ఉపయోగించి మంచి ఫలితాలు పొందుతున్నారని, అదే పద్దతిలో ఇండియాలోని చిన్న, సన్నకారు రైతులకు సైతం డ్రోన్లతో ఉపయోగం ఉంటుందని బేయర్స్ క్రాప్ సైన్స్ లిమిటెడ్ పీఈవో నరేన్ అన్నారు. -
బేయర్ క్రాప్‌సైన్స్ -టొరంట్.. లాభాల పవర్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో సస్య రక్షణ రంగ దిగ్గజం బేయర్ క్రాప్‌సైన్స్ కౌంటర్‌కు భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఇదే కాలం(ఏప్రిల్-జూన్)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ప్రయివేట్ రంగ కంపెనీ టొరంట్ పవర్కౌంటర్ సైతం వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. బేయర్ క్రాప్‌సైన్స్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో బేయర్ క్రాప్‌సైన్స్ నికర లాభం 86 శాతం ఎగసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 252 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 29 శాతం పుంజుకుని రూ. 1,228 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో బేయర్ క్రాప్‌సైన్స్ షేరు 10 శాతం దూసుకెళ్లి రూ. 6,174 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 15 శాతం దూసుకెళ్లి రూ. 6,450కు చేరింది. వెరసి చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది! టొరంట్ పవర్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో టొరంట్ పవర్ రూ. 373 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ1తో పోలిస్తే ఇది35 శాతం వృద్ధికాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 19 శాతం నీరసించి రూ. 3,042 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో టొరంట్ పవర్ షేరు 5.2 శాతం జంప్‌చేసి రూ. 345 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 358 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం! -
అలెంబిక్ ఫార్మా- బేయర్ క్రాప్.. భళా
గతంలో సూచనప్రాయ అనుమతి పొందిన డిఫిరాజిరాక్స్ ట్యాబ్లెట్లకు తుది అనుమతి పొందినట్లు వెల్లడించడంతో అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క సస్యరక్షణ ఉత్పత్తుల విక్రయానికి ఎఫ్ఎంసీజీ దిగ్గజంతో జత కట్టినట్లు వెల్లడించడంతో బేయర్ క్రాప్‌సైన్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్ థలసేమియా సంబంధ చికిత్సకు వినియోగించగల ఏఎన్‌డీఏ(డిఫిరాజిరాక్స్ ట్యాబ్లెట్ల)కు యూఎస్ఎఫ్డీఏ తుది అనుమతి లభించినట్లు హెల్త్‌కేర్ కంపెనీ అలెంబిక్ ఫార్మా తాజాగా పేర్కొంది. నోవర్తిస్ తయారీ జడెను ట్యాబ్లెట్లకు జనరిక్ వెర్షన్ అయిన ఈ ట్యాబ్లెట్లను 180 ఎంజీ డోసేజీలో విక్రయించేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేసింది. కంపెనీ ఇప్పటికే 90 ఎంజీ, 360 ఎంజీ డోసేజీలలో విక్రయించేందుకు అనుమతి పొందింది. 180 ఎంజీ ట్యాబ్లెట్లకు 5.3 కోట్ల డాలర్ల(రూ. 400 కోట్లు) మార్కెట్ ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో అలెంబిక్ ఫార్మా షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 926 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 944 వరకూ ఎగసింది. తద్వారా 52 వారాల గరిష్టాన్ని తాకింది. బేయర్ క్రాప్‌సైన్స్ సస్యరక్షణ ఉత్పత్తుల విక్రయానికి ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీతో జత కట్టినట్లు ఆగ్రో కెమికల్స్ దిగ్గజం బేయర్ క్రాప్‌సైన్స్ తాజాగా పేర్కొంది. దీనిలో భాగంగా ఐటీసీకి చెందిన ఈచౌపల్ ద్వారా పంటల పరిరక్షణకు సంబంధించిన ఉత్పత్తులను దేశవ్యాప్తంగా మరింత మంది రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేసింది. ఇందుకు వీలుగా ఇప్పటికే మైసూరులో పరిశీలనాత్మక ప్రాజెక్టును చేపట్టినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో బేయర్ క్రాప్‌సైన్స్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 5708 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 5718 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం! -
బేయర్ క్రాప్‌సైన్స్- ఐడీఎఫ్సీ ఫస్ట్- హై’జంప్
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించడంతో విదేశీ దిగ్గజం బేయర్ క్రాప్‌సైన్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ఇదే కాలంలో ఆకర్షణీయ పనితీరు చూపడంతో ప్రయివేట్ రంగ సంస్థ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. బేయర్ క్రాప్‌సైన్స్ చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకోగా.. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 5 శాతం ఎగసింది. వివరాలు చూద్దాం.. బేయర్ క్రాప్‌సైన్స్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో అగ్రి కెమికల్స్ దిగ్గజం బేయర్ క్రాప్ సైన్స్ రూ. 31.5 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 57 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం 82 శాతం ఎగసి రూ. 459 కోట్లను తాకింది. వాటాదారులకు షేరుకి రూ. 25 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తొఅలుత బేయర్ క్రాప్ షేరు ఎన్ఎస్ఈలో 11 శాతం దూసుకెళ్లి రూ. 4920కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 10.5 శాతం ఎగసి రూ. 4910 వద్ద ట్రేడవుతోంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ప్రయివేట్ రంగ సంస్థ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ రూ. 71.5 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 218 కోట్ల నికర నష్టం నమోదైంది. నికర వడ్డీ ఆదాయం 40 శాతం ఎగసి రూ. 1563 కోట్లను తాకింది. స్థూల మొండిబకాయిలు 2.83 శాతం నుంచి 2.6 శాతానికి బలహీనపడ్డాయి. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేరు 5 శాతం లాభపడి రూ. 20 వద్ద ట్రేడవుతోంది. అయితే రుణ నాణ్యత, కోవిడ్-19 ప్రభావం, బలహీన కస్టమర్లు వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కౌంటర్‌కు మోర్గాన్ స్టాన్లీ, క్రెడిట్ స్వీస్ అండర్‌వెయిట్ రేటింగ్‌ను ప్రకటించాయి. -
మార్కెట్లోకి ‘మోవెంటోఎనర్జీ’ కీటకనాశిని
-
మార్కెట్లోకి ‘మోవెంటోఎనర్జీ’ కీటకనాశిని
సాక్షి, గుంటూరు : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బేయర్ క్రాప్ సైన్స్ అంతర్జాతీయ ప్రమాణాలు, నూతన సాంకేతిక పరిశోధనలతో రూపొందించిన కీటకనాశిని ‘మోవెంటో ఎనర్జీ’ ఉత్పాదనను సోమవారం మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా గుంటూరులో జరిగిన కార్యక్రమంలో కంపెనీ సౌత్ బిజినెస్ యూనిట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్.మోహనరావు మాట్లాడుతూ 1863లో జర్మనీలో స్థాపించిన బేయర్ కంపెనీ ఎన్నో విశిష్ట ఉత్పాదనలను సుమారు 165 దేశాలలో కోట్లాది మంది రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. సౌత్ కోస్టల్ డివిజినల్ మేనేజర్ ఎస్.నరసయ్య మాట్లాడుతూ నూతనంగా విడుదల చేసిన మోవెంటో ఎనర్జీ ఒక అద్భుతమైన క్రిమిసంహారిణి అని తెలిపారు. క్రాప్ మేనేజర్ పి.శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ మోవెంటో ఎనర్జీ మొక్కలోని ప్రసరణ ద్వారా అనేక రకాల రసంపీల్చు పురుగులను నియంత్రిస్తుందన్నారు. ప్రొడక్ట్ మేనేజర్ అరింధమ్ ముఖర్జీ మాట్లాడుతూ.. ఈ మందు కూరగాయల పంటలు, పత్తి పంటలో రసంపీల్చు పురుగులను దీర్ఘకాలంగా నియంత్రించడమే కాకుండా పూర్తి రక్షణ ఇచ్చేందుకు చిగురు నుంచి వేరు వరకు వ్యాపించి ఉంటుందని పేర్కొన్నారు. లాం ఫారం పత్తి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.చెంగారెడ్డి మాట్లాడుతూ దేశ రైతాంగానికి నూతన పరిశోధన ఫలాలను అందించడంలో బేయర్ కంపెనీ ముందుంటుందని చెప్పారు. -
బేయర్ క్రాప్ సైన్స్ చైర్మన్ పదవికి మాల్యా రాజీనామా
న్యూఢిల్లీ: బేయర్ క్రాప్‌సైన్స్ కంపెనీ చైర్మన్, డెరైక్టర్ పదవులకు విజయ్ మాల్యా రాజీనామా చేశారు. ఈయన 2004 మార్చిలో బోర్డు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. విజయ్ మాల్యా స్వచ్ఛంద రాజీనామాను ఆమోదిస్తున్నామని, ఇది జూన్ 30 నుంచి అమల్లోకి వస్తుందని బేయర్ క్రాప్‌సైన్స్ బీఎస్ఈకి నివేదించింది. వచ్చే బోర్డు మీటింగ్‌లో కొత్త చైర్మన్ ఎంపికను ప్రకటిస్తామని తెలిపింది. కాగా బేయర్ క్రాప్‌సైన్స్ కంపెనీ భారత్‌లో విత్తనాలు, పంట సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తులను విక్రయిస్తోంది.