బేయర్ క్రాప్ సైన్స్ చైర్మన్ పదవికి మాల్యా రాజీనామా | Vijay Mallya resigns as Bayer CropScience chairman | Sakshi
Sakshi News home page

బేయర్ క్రాప్ సైన్స్ చైర్మన్ పదవికి మాల్యా రాజీనామా

Published Wed, Jun 22 2016 12:27 AM | Last Updated on Mon, Sep 4 2017 3:02 AM

బేయర్ క్రాప్ సైన్స్ చైర్మన్ పదవికి మాల్యా రాజీనామా

బేయర్ క్రాప్ సైన్స్ చైర్మన్ పదవికి మాల్యా రాజీనామా

న్యూఢిల్లీ: బేయర్ క్రాప్‌సైన్స్ కంపెనీ చైర్మన్, డెరైక్టర్ పదవులకు విజయ్ మాల్యా రాజీనామా చేశారు. ఈయన 2004 మార్చిలో బోర్డు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. విజయ్ మాల్యా స్వచ్ఛంద రాజీనామాను ఆమోదిస్తున్నామని, ఇది జూన్ 30 నుంచి అమల్లోకి వస్తుందని బేయర్ క్రాప్‌సైన్స్ బీఎస్‌ఈకి నివేదించింది. వచ్చే బోర్డు మీటింగ్‌లో కొత్త చైర్మన్ ఎంపికను ప్రకటిస్తామని తెలిపింది. కాగా బేయర్ క్రాప్‌సైన్స్ కంపెనీ భారత్‌లో విత్తనాలు, పంట సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తులను విక్రయిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement