బేయర్‌ క్రాప్‌సైన్స్‌- ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌- హై’జంప్‌ | Bayer cropscience- IDFC first Bank jumps | Sakshi
Sakshi News home page

బేయర్‌ క్రాప్‌సైన్స్‌- ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌- హై’జంప్‌

Published Tue, May 26 2020 12:45 PM | Last Updated on Tue, May 26 2020 12:46 PM

Bayer cropscience- IDFC first Bank jumps - Sakshi

గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో టర్న్‌అరౌండ్‌ ఫలితాలు సాధించడంతో విదేశీ దిగ్గజం బేయర్‌ క్రాప్‌సైన్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ఇదే కాలంలో ఆకర్షణీయ పనితీరు చూపడంతో ప్రయివేట్‌ రంగ సంస్థ ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ కౌంటర్‌ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. బేయర్‌ క్రాప్‌సైన్స్‌ చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకోగా.. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 5 శాతం ఎగసింది. వివరాలు చూద్దాం..

బేయర్‌ క్రాప్‌సైన్స్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో అగ్రి కెమికల్స్‌ దిగ్గజం బేయర్‌ క్రాప్‌ సైన్స్‌ రూ. 31.5 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 57 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం 82 శాతం ఎగసి రూ. 459 కోట్లను తాకింది. వాటాదారులకు షేరుకి రూ. 25 చొప్పున డివిడెండ్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తొఅలుత బేయర్‌ క్రాప్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 11 శాతం దూసుకెళ్లి రూ. 4920కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 10.5 శాతం ఎగసి రూ. 4910 వద్ద ట్రేడవుతోంది.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ప్రయివేట్‌ రంగ సంస్థ ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ రూ. 71.5 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 218 కోట్ల నికర నష్టం నమోదైంది. నికర వడ్డీ ఆదాయం 40 శాతం ఎగసి రూ. 1563 కోట్లను తాకింది. స్థూల మొండిబకాయిలు 2.83 శాతం నుంచి 2.6 శాతానికి బలహీనపడ్డాయి. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ షేరు 5 శాతం లాభపడి రూ. 20 వద్ద ‍ట్రేడవుతోంది. అయితే రుణ నాణ్యత, కోవిడ్‌-19 ప్రభావం, బలహీన కస్టమర్లు వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ కౌంటర్‌కు మోర్గాన్‌ స్టాన్లీ, క్రెడిట్‌ స్వీస్‌ అండర్‌వెయిట్‌ రేటింగ్‌ను ప్రకటించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement