IDFC Bank
-
ఆర్బీఐ కఠిన చర్యలు.. నాలుగు కంపెనీల రిజిస్ట్రేషన్ రద్దు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నాలుగు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ఓ ప్రైవేటు బ్యాంక్‌పై కఠిన చర్యలు తీసుకుంది. నాలుగు ఎన్‌బీఎఫ్‌సీల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను రద్దు చేసింది. అలాగే ఓ ప్రైవేటు బ్యాంకుకు రూ.1కోటి జరిమానా విధించింది. ఆర్బీఐ రిజిస్ట్రేషన్ రద్దు చేసిన కంపెనీలలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కుండల్స్ మోటార్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, తమిళనాడుకు చెందిన నిత్య ఫైనాన్స్ లిమిటెడ్, పంజాబ్ ఆధారిత భాటియా హైర్ పర్చేజ్ ప్రైవేట్ లిమిటెడ్, హిమాచల్ ప్రదేశ్ ఆధారిత జీవన్‌జ్యోతి డిపాజిట్స్ అండ్ అడ్వాన్సెస్ లిమిటెడ్ ఉన్నాయి. ఆర్బీఐ చట్టంలో నిర్వచించిన విధంగా ఈ కంపెనీలు ఇప్పుడు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వ్యాపార లావాదేవీలను నిర్వహించలేవు. ఇక 'రుణాలు, అడ్వాన్సులు - చట్టబద్ధమైన ఇతర పరిమితులు'పై ఆర్బీఐ మార్గదర్శకాలను పాటించనందుకు గానూ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు రూ.1కోటి పెనాల్టీ విధించింది. తమ ఆదేశాలు, చట్టబద్ధమైన నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు ఈ బ్యాంకుకు ఇదివరకే షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఆర్బీఐ పేర్కొంది. -
ఐడీఎఫ్సీ ఫస్ట్‌లో వాటా విక్రయం
న్యూఢిల్లీ: పీఈ దిగ్గజం వార్బర్గ్ పింకస్ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ నుంచి పూర్తిగా వైదొలగింది. తాజాగా బ్యాంకులోగల మొత్తం 2.25 శాతం వాటాను విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా షేరుకి రూ. 75.24 సగటు ధరలో 15.88 కోట్ల బ్యాంకు షేర్లను అమ్మివేసింది. వీటి విలువ రూ. 1,195 కోట్లుకాగా.. క్లోవర్‌డెల్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా 2023 డిసెంబర్‌కల్లా ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లో 2.25 శాతం వాటాను కలిగి ఉంది. అయితే కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు. గతేడాది సెప్టెంబర్‌లోనూ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లో 4.2% వాటాను వార్బర్గ్ పింకస్ రూ. 2,480 కోట్లకు విక్రయించిన విషయం విదితమే. కాగా.. గురువారం బీఎస్ఈలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేరు 3.1% క్షీణించి రూ. 75.4 వద్ద ముగిసింది. -
ఈ బ్యాంకులో వడ్డీ రేట్లు మారాయ్..
బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లను (FD) సురక్షితమైన ఎంపికగా చాలా మంది పరిగణిస్తారు. నేటికీ పెట్టుబడి కోసం ఎఫ్డీలను ఎంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు డిపాజిటర్లను ఆకట్టుకోవడానికి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ప్రకటిస్తున్నాయి. తాజగా ప్రైవేట్ రంగ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC FIRST Bank) ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. ఐడీఎఫ్సీ బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినవారు లేదా చేయాలనుకుంటున్న వారు సవరించిన వడ్డీ రేట్లను పరిశీలించవచ్చు. ప్రస్తుతం బ్యాంకు ఖాతాదారులకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఎఫ్డీ సౌకర్యాన్ని అందిస్తోంది. మీరు 3 శాతం నుండి 8 శాతం వరకు వడ్డీ ప్రయోజనం పొందవచ్చు. 500 రోజుల ఎఫ్డీపై బ్యాంక్ అత్యధికంగా 8 శాతం వడ్డీ రేటును ఇస్తోంది. ఎఫ్డీ చేసే సీనియర్ సిటిజన్లకు ఐడీఎఫ్సీ బ్యాంక్ మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తోంది. వీరికి 50 బేసిస్ పాయింట్లు ఎక్కువగా వడ్డీని అందిస్తోంది. ఈ బ్యాంకులో సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 8.50 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం.. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలపై ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. కొత్త ఎఫ్డీ వడ్డీ రేట్లు 2024 మార్చి 21 నుండి అమలులోకి వస్తాయి. సాధారణ పౌరులకు వడ్డీశాతం 7 నుండి 45 రోజులు - 3 శాతం 46 నుండి 180 రోజులు - 4.50 శాతం 181 రోజుల నుండి ఏడాదిలోపు - 5.75 శాతం 1 సంవత్సరం - 6.50 శాతం 1 సంవత్సరం 1 రోజు నుండి 499 రోజులు - 7.50 శాతం 500 రోజులు - 8 శాతం 501 రోజుల నుండి 548 రోజులు - 7.50 శాతం 549 రోజుల నుండి 2 సంవత్సరాల వరకు - 7.75 శాతం 2 సంవత్సరాల 1 రోజు నుండి 3 ఏళ్ల వరకు - 7.25 శాతం 3 సంవత్సరాల 1 రోజు నుండి 10 ఏళ్ల వరకు - 7 శాతం సీనియర్ సిటిజన్లకు.. 7 నుండి 45 రోజులు - 3.50 శాతం 46 నుండి 180 రోజులు - 5 శాతం 181 రోజుల నుండి ఏడాదిలోపు - 6.25 శాతం 1 సంవత్సరం - 7 శాతం 1 సంవత్సరం 1 రోజు నుండి 499 రోజులు - 8 శాతం 500 రోజులు - 8.50 శాతం 501 రోజుల నుండి 548 రోజులు - 8 శాతం 549 రోజుల నుండి 2 సంవత్సరాల వరకు - 8.25 శాతం 2 సంవత్సరాల 1 రోజు నుండి 3 ఏళ్ల వరకు - 7.75 శాతం 3 సంవత్సరాల 1 రోజు నుండి 10 ఏళ్ల వరకు - 7.50 శాతం -
ఎప్పుడో తీసుకున్న రూ. 1000 అప్పుకు..2 కోట్లు చెల్లించిన బ్యాంక్ సీఈఓ
-
రూ.1000 అప్పుకు రూ.2 కోట్లు తిరిగిచ్చాడు!
చేసిన మేలును మరిచిపోయే ఈ రోజుల్లో కూడా ఎప్పుడో తీసుకున్న 1000 రూపాయలకు ఏకంగా రూ.2 కోట్లు తిరిగి ఇచ్చి అందరి చేతా ఔరా అనిపించుకున్నారు. ఇంతకీ ఆయన ఎవరు, ఎక్కడ పనిచేస్తున్నారు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వైద్యనాథన్ (Vaidyanathan) అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఐడీఎఫ్సీ (IDFC) ఫస్ట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ అంటే కొందరికి గుర్తొస్తుంది. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కంటే ఈయన చేసిన దాతృత్వం వల్ల చాలా మందికి సుపరిచయం. ఆపదలో ఉన్న వారికి తన షేర్లను గిఫ్ట్ ఇస్తూ ఎంతోమందిని ఆదుకుంటున్నారు. వైద్యనాథన్ ఇప్పటికి రూ. 80 కోట్ల విలువ చేసే షేర్లను ప్రజలకు పంచిపెట్టారు. తాజాగా మరో 5.5 కోట్ల రూపాయల విలువైన షేర్లను మరో ఐదు మందికి గిఫ్ట్‌గా ఇచ్చేసారు. అంటే 7 లక్షల షేర్స్ (మార్చి 22న ఒక్కో షేర్ ధర రూ.78 వద్ద ముగిసింది) గిఫ్ట్ ఇచ్చారు. ఇందులో రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారి వింగ్ కమాండర్ 'సంపత్ కుమార్' ఉన్నారు. ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. సంపత్ కుమార్ గతంలో ఎప్పుడో వైద్యనాథన్‌కు 1000 రూపాయలు అప్పుగా ఇచ్చారట. దాన్ని గుర్తుపెట్టుకుని ఇప్పుడు వైద్యనాథన్ ఏకంగా వైద్య సహాయం కోసం 2.50 లక్షల షేర్స్ (సుమారు రూ. 2 కోట్లు) గిఫ్ట్ ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతోంది. కేవలం వెయ్యి రూపాయలకు.. 2 కోట్ల రూపాయలు గిఫ్ట్ ఇచ్చారంటే అయన దాతృత్వాన్ని మాటల్లో వర్ణించడం కష్టం. రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారికి మాత్రమే కాకూండా మనోజ్ సహాయ్ అనే వ్యక్తికి 50 వేల షేర్స్, సమీర్ మాత్రే అనే వ్యక్తికి మరో 50 వేల షేర్స్ అందించారు. తన సహోద్యోగి మరణించడం వల్ల అతని కుటుంబాన్ని ఆదుకోవడంలో భాగంగా వారికి 75వేల షేర్స్ ఇచ్చారు. ఎ.కనోజియా అనే వ్యక్తికి కూడా 2.75 లక్షల షేర్స్ ఇచ్చినట్లు సమాచారం. ఈ కాలంలో కూడా ఇలాంటి వారు ఉన్నారంటే నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి. -
ఐడీఎఫ్సీ విలీనానికి ఆర్బీఐ అనుమతి
న్యూఢిల్లీ: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లో ఐడీఎఫ్సీ లిమిటెడ్, ఐడీఎఫ్సీ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ (ఐడీఎఫ్సీ ఎఫ్‌హెచ్‌సీఎల్) విలీనానికి ఆర్బీఐ తన అనుమతి తెలియజేసింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లో ఐడీఎఫ్సీ ఫైనాన్షియల్ హోల్డింగ్ ద్వారా ఐడీఎఫ్సీ వాటాలు కలిగి ఉంది. ఇప్పుడు రివర్స్ మెర్జర్ విధానంలో బ్యాంక్‌లో ఐడీఎఫ్సీ విలీనం కానుంది. ఈ విలీన ప్రక్రియకు ఆర్బీఐ నిరభ్యంతరాన్ని (నో అబ్జెక్షన్) తెలియజేసినట్టు ఐడీఎఫ్సీ లిమిటెడ్ స్టాక్ ఎక్స్చేంజ్లకు వెల్లడించింది. తొలుత ఐడీఎఫ్సీ లిమిటెడ్‌లో ఐడీఎఫ్సీ ఎఫ్‌హెచ్‌సీఎల్ విలీనం అవుతుంది. అనంతరం ఐడీఎఫ్సీ వెళ్లి ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లో విలీనం అవుతుంది. ఐడీఎఫ్సీ వాటాదారుల వద్దనున్న ప్రతి 100 షేర్లకు గాను 155 బ్యాంక్ షేర్లు లభించనున్నాయి. విలీనం అనంతరం ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ స్టాండలోన్ పుస్తక విలువ 4.9 శాతం పెరగనుంది. -
ఎల్ఐసీ నుంచి క్రెడిట్ కార్డు.. భలే బెనిఫిట్స్!
ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతోపాటు ఇతర ఫైనాన్స్ సంస్థలు సైతం క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కూడా క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. దీనిపై ప్రమాద బీమాతో పాటు ఆకర్షణీయమైన ప్రయోజనాలను ఎన్నింటినో అందిస్తోంది. ఎల్ఐసీ, ఐడీఎఫ్సీ బ్యాంక్, మాస్టర్ కార్డులు కలిసి సంయుక్తంగా ఈ క్రెడిట్ కార్డులను ప్రారంభించాయి. ఎల్ఐసీ క్లాసిక్, ఎల్ఐసీ సెలక్ట్ పేరుతో రెండు క్రెడిట్ కార్డులు లాంచ్ అయ్యాయి. ఈ క్రెడిట్ కార్డుల ద్వారా యూజర్లకు ఎన్నో ప్రయోజనాలు లభించనున్నాయి. వీటి ద్వారా బీమా ప్రీమియం చెల్లిచిందనందుకు రివార్డ్ పాయింట్లను పొందవచ్చు. రూ. 5 లక్షల ప్రమాద బీమా ఉచితంగా లభిస్తుంది. వార్షిక ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. వడ్డీ కూడా ఎల్ఐసీ తక్కువగానే వసూలు చేస్తోంది. బెనిఫిట్స్‌లో కొన్ని.. ఎల్ఐసీ క్లాసిక్ క్రెడిట్ కార్డుకు ఎలాంటి జాయినింగ్ ఫీజు, వార్షిక ఫీజు ఉండవు. 48 రోజుల వరకు అన్ని ఏటీఎంలలో క్యాష్ విత్‌డ్రాయల్‌పై ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఈ క్రెడిట్ కార్డుతో తొలి ఈఎమ్ఐపైన 5 శాతం క్యాష్‌బ్యాక్. రూ. 399 విలువైన 6 నెలల ఫార్మ్ఈజీ ప్లస్ మెంబర్ షిప్. ట్రావెల్లో డొమెస్టిక్ ఫైట్లను బుక్ చేసుకుంటే రూ. 500 డిస్కౌంట్. లెన్స్‌కార్ట్ గోల్డ్ సభ్యత్వం ఉచితంగా పొందొచ్చు. భారతదేశంలోని అన్ని ఇంధన స్టేషన్స్‌లో ప్రతి నెల రూ. 300 ఇంధన సర్‌ఛార్జ్‌పై 1 శాతం రాయితీ. ఎల్ఐసీ క్లాసిక్ క్రెడిట్ కార్డుపై రూ.2 లక్షల ప్రమాద బీమా ఎల్ఐసీ సెలక్ట్ క్రెడిట్ కార్డుకు కూడా ప్రవేశ, వార్షిక ఛార్జీలు లేవు. ప్రతి మూడు నెలలకు రెండుసార్లు కాంప్లమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్. ఎల్ఐసీ సెలక్ట్ క్రెడిట్ కార్డుపై రూ. 5 లక్షల ప్రమాద బీమా. -
క్యూఆర్ కోడ్‌తో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ - డిజిటల్ రూపీ చెల్లింపులు
న్యూఢిల్లీ: యూపీఐ క్యూఆర్ కోడ్‌కు డిజిటల్ రూపీని (సీబీడీసీ) అనుసంధానం చేసినట్లు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ వెల్లడించింది. దీంతో ఇక క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి డిజిటల్ రూపీ ద్వారా చెల్లింపులు జరపవచ్చని సంస్థ తెలిపింది. వ్యాపారవర్గాలు నిరాటంకంగా డిజిటల్ రూపీ రూపంలో చెల్లింపులను పొందేందుకు ఇది సహాయపడగలదని బ్యాంకు ఈడీ మదివణన్ బాలకృష్ణన్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సీబీడీసీ వినియోగాన్ని మరింతగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు యూపీఐ ఇంటరాపరబిలిటీ ఉపయోగపడగలదని వివరించారు. భౌతిక కరెన్సీకి సమాన హోదా ఉండే డిజిటల్ రూపీని రిజర్వ్ బ్యాంక్ గతేడాది అధికారికంగా ప్రవేశపెట్టింది. -
BCCI: ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్‌కు రూ.4.20 కోట్లు!
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఖాతాలో కొత్త టైటిల్ స్పాన్సర్షిప్ ద్వారా వచ్చే మూడేళ్లలో రూ. 235 కోట్లు చేరనున్నాయి. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన ‘ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్’ బోర్డు మ్యాచ్‌ల టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులు సొంతం చేసుకుంది. బీసీసీఐ నిర్వహించబోయే అంతర్జాతీయ (సీనియర్ పురుషుల, మహిళల) మ్యాచ్‌లతో పాటు దేశవాళీ టోర్నీలు, అండర్–19, అండర్–23 టోర్నీలకు ఈ హక్కులు వర్తిస్తాయి. కొత్త ఒప్పందం ప్రకారం ఐడీఎఫ్సీ ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్‌కు బీసీసీఐకి రూ. 4 కోట్ల 20 లక్షలు చెల్లిస్తుంది. మూడేళ్ల వ్యవధిలో మొత్తం 56 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరుగుతాయి. వచ్చే నెలలో ఆ్రస్టేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌తో మొదలయ్యే ఒప్పందం 2026 ఆగస్టు వరకు అమల్లో ఉంటుంది. తాజా ఒప్పందానికి ముందు వరకు ‘మాస్టర్ కార్డ్’ ఒక్కో మ్యాచ్‌కు రూ.3 కోట్ల 80 లక్షలు చెల్లించింది. -
ఐడీఎఫ్సీ ఫస్ట్ ఫలితాలు ఆకర్షణీయం
ముంబై: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ జూన్ త్రైమాసికానికి మెరుగైన ఫలితాలను ప్రకటించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 61 శాతం వృద్ధితో రూ.765 కోట్లకు దూసుకుపోయింది. క్రితం ఏడాది ఇదే కాలానికి నికర లాభం రూ.474 కోట్లుగానే ఉంది. నికర వడ్డీ ఆదాయం 36 శాతం వృద్ధితో రూ.3,745 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో వడ్డీ ఆదాయం రూ.2,571 కోట్లుగా ఉంది. నిర్వహణ లాభం 45 శాతం వృద్ధితో రూ.1,427 కోట్లకు పెరిగినట్టు బ్యాంక్ తెలిపింది. రుణ ఆస్తుల నాణ్యత కూడా మెరుగుపడింది. స్థూల ఎన్పీఏలు 2.17 శాతానికి తగ్గాయి. ఇవి క్రితం ఏడాది ఇదే త్రైమాసికం చివరికి 3.36%గా ఉంటే, ఈ ఏడాది మార్చి చివరికి 2.51 శాతంగా ఉండడం గమనా ర్హం. నికర ఎన్పీఏలు 0.70 శాతానికి పరిమితమయ్యాయి. ‘‘46.5% కాసా రేషియోతో బలమైన ఫ్రాంచైజీని నిర్మిస్తున్నాం. బలమైన బ్రాండ్, విలువలు, కస్టమర్ అనుకూలమైన ఉత్పత్తులు, డిజిటల్ ఆవిష్కరణలతో మా రిటైల్ డిపాజిట్లు చక్కగా వృద్ధి చెందుతున్నాయి’’అని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ, సీఈవో వి.వైద్యనాథన్ తెలిపారు. ఫండెడ్ అసెట్స్ (రాబడినిచ్చే ఆస్తులు) 25% వృద్ధితో రూ.1,71,578 కోట్లకు పెరిగాయి. మొత్తం రుణ ఆస్తుల్లో ఇన్ఫ్రా రుణాలు 2.2 శాతానికి తగ్గాయి. -
ఐడీఎఫ్సీ రీజినల్ ఆఫీస్‌ను ప్రారంభించిన నందమూరి కల్యాణ్ రామ్ (ఫొటోలు)
-
హెచ్డీఎఫ్సీ తర్వాత.. ఐడీఎఫ్సీ బ్యాంకులో ఐడీఎఫ్సీ విలీనం
ముంబై: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులో మాతృ సంస్థ ఐడీఎఫ్సీ లిమిటెడ్ విలీనం కానుంది. పూర్తిగా షేర్ల మార్పిడి ద్వారా లావాదేవీని చేపట్టనున్నారు. ఇందుకు రెండు సంస్థల బోర్డులూ ఆమోదించినట్లు ఐడీఎఫ్సీ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు తాజాగా వెల్లడించాయి. విలీన ప్రతిపాదన ప్రకారం ఐడీఎఫ్సీ వాటాదారులకు తమ వద్దగల ప్రతీ 100 షేర్లకుగాను 155 ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు షేర్లు జారీ చేయనున్నారు. ప్రధానంగా మౌలిక రంగానికి రుణాలందించే ఐడీఎఫ్సీ 1997లో ఆవిర్భవించింది. 2015లో ఐసీఐసీఐ, ఐడీబీఐ తరహాలో బ్యాంకింగ్ అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. 2018 డిసెంబర్లో క్యాపిటల్ ఫస్ట్‌ను టేకోవర్ చేసింది. -
ఐడీఎఫ్సీ ఫస్ట్ లాభం రెట్టింపు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ సంస్థ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 134 శాతం జంప్‌చేసి రూ. 803 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 343 కోట్లు ఆర్జించింది. నిర్వహణ లాభంలో 61 శాతం వృద్ధి(రూ. 1,342 కోట్లు) ఇందుకు దోహదం చేసింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి సైతం బ్యాంక్ నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 2,437 కోట్లకు చేరింది. 2021–22లో రూ. 145 కోట్లు మాత్రమే ఆర్జించింది. వెరసి క్యూ4తోపాటు పూర్తి ఏడాదికి సంస్థ చరిత్రలోనే రికార్డు లాభాలను ఆర్జించినట్లు బ్యాంక్ వెల్లడించింది. క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 35 శాతం మెరుగుపడి రూ. 3,597 కోట్లను తాకగా.. పూర్తి ఏడాదికి రూ. 9,706 కోట్ల నుంచి రూ. 12,635 కోట్లకు ఎగసింది. కాగా.. క్యూ4లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.7 శాతం నుంచి 2.51 శాతానికి, నికర ఎన్పీఏలు 1.53 శాతం నుంచి 0.86 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 16.82 శాతంగా నమోదైంది. -
ఉరకలేసిన ఉత్సాహం.. మారథాన్‌తో సరికొత్త జోష్
ఖైరతాబాద్/గచ్చిబౌలి: ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ ఉత్సాహంగా సాగింది. ఆదివారం ఉదయం పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమైన ఫుల్ మారథాన్ గచ్చిబౌలి స్టేడియంలో ముగిసింది. దాదాపు 9 వేల మంది పాల్గొన్న ఈ మారథాన్ దేశంలోనే రెండవ అతిపెద్దదిగా నిర్వాహకులు పేర్కొంటున్నారు. అనంతరం హాఫ్ మారథాన్‌ను ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ, సీఈఓ వైద్యనాథ్ జెండా ఊపి ప్రారంభించారు. హాఫ్ మారథాన్‌లో 3240 మంది పాల్గొన్నారు. ఆ తరువాత 5కె ఫన్ రన్ ప్రారంభమైంది. ఈ రన్లో 5వేల మంది పాల్గొన్నారు. ఫుల్ మారథాన్ నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమై ఎన్టీఆర్ గార్డెన్, ట్యాంక్‌బండ్ మీదుగా నెక్లెస్ రోడ్డు, ఖైరతాబాద్ ప్లై ఓవర్, రాజ్‌భవన్, పంజగుట్ట ప్లై ఓవర్, బంజారాహిల్స్ రోడ్‌నెం–2, కెబిఆర్ పార్క్, జూబ్లిహిల్స్ రోడ్‌నెం 45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, భయో డైవర్సిటీ జంక్షన్, త్రిబుల్ ఐటి జంక్షన్, జిఎంసి బాలయోగి స్టేడియంకు చేరుకుంటారు. హాఫ్ మారథాన్‌లో పీపుల్స్ ప్లాజా నుంచి నేరుగా ఖైరతాబాద్ ప్లై ఓవర్ నుంచి ఫుల్ మారథాన్ రూట్లోనే జిఎంసి బాలయోగి స్టేడియానికి చేరుకున్నారు. ఉత్సాహంగా సాగిన మారథాన్‌లో రేస్ డైరెక్టర్ ప్రశాంత్ మోర్పారియో తదితరులు పాల్గొన్నారు. విజేతలకు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో బహుమతులు అందజేశారు. ఎన్ఎండీసీ చైర్మెన్, ఎండి సుమిత్ దేబ్, శాట్స్ చైర్మెన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎండి, సీఈఓ వైద్యనాథన్‌లు విజేతలకు బహుమతులు అందజేశారు. -
ఐడీఎఫ్సీ బ్యాంక్ లాభం రికార్డ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ సంస్థ ఐడీఎఫ్సీ బ్యాంక్ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో బ్యాంక్ చరిత్రలోనే అత్యధికంగా రూ. 474 కోట్ల నికర లాభం ఆర్జించింది. ప్రొవిజన్లు తగ్గడం ఇందుకు సహకరించాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 630 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ.4,932 కోట్ల నుంచి రూ. 5,777 కోట్లకు బలపడింది. వడ్డీ ఆదాయం మరింత అధికంగా 20 శాతం ఎగసి రూ. 4,922 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 855 కోట్లను తాకింది. మొండి రుణాలకు ప్రొవిజన్లు రూ. 1,872 కోట్ల నుంచి రూ. 308 కోట్లకు భారీగా తగ్గాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.61 శాతం నుంచి 3.36 శాతానికి వెనకడుగు వేశాయి. నికర ఎన్పీఏలు సైతం 2.32 శాతం నుంచి 1.30 శాతానికి బలహీనపడ్డాయి. నికర వడ్డీ మార్జిన్లు 5.5 శాతం నుంచి 5.89 శాతానికి మెరుగుపడ్డాయి. కనీస మూలధన నిష్పత్తి 15.77 శాతంగా నమోదైంది. -
ఐడీఎఫ్సీ బ్యాంక్ లాభం జూమ్
న్యూఢిల్లీ: గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ సంస్థ ఐడీఎఫ్సీ బ్యాంక్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 168 శాతం జంప్‌చేసి రూ. 343 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 128 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 4,811 కోట్ల నుంచి రూ. 5,385 కోట్లకు బలపడింది. నికర వడ్డీ ఆదాయం 36 శాతం ఎగసి రూ. 2,669 కోట్లకు చేరింది. ఫీజు, ఇతర ఆదాయం 40 శాతం వృద్ధితో రూ. 841 కోట్లను తాకింది. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి మాత్రం ఐడీఎఫ్సీ బ్యాంక్ నికర లాభం 68 శాతం క్షీణించి రూ. 145 కోట్లకు పరిమితమైంది. 2020–21లో రూ. 452 కోట్లు ఆర్జించింది. కోవిడ్–19 రెండో దశ ప్రభావం లాభాలను దెబ్బతీసినట్లు బ్యాంక్ పేర్కొంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 18,179 కోట్ల నుంచి రూ. 20,395 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం సైతం 32 శాతం ఎగసి రూ. 9,706 కోట్లకు చేరింది. కాగా.. రిటైల్ విభాగంలో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.01 శాతం నుంచి 2.63 శాతానికి దిగివచ్చినట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో వి.వైద్యనాథన్ వెల్లడించారు. ఈ బాటలో నికర ఎన్పీఏలు సైతం 1.9 శాతం నుంచి 1.15 శాతానికి తగ్గినట్లు పేర్కొన్నారు. -
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి ఏథర్ గుడ్‌న్యూస్.. సీబిల్ స్కోర్ లేకున్నా రుణాలు!
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనేవారికి శుభవార్త తెలిపింది. సీబిల్ స్కోర్ లేకున్నా వారికి రుణాలను మంజూరు చేసేందుకు ప్రముఖ 2 బ్యాంకులతో సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ ఏథర్ ఎనర్జీ తన ఈ-స్కూటర్ల కొనుగోలు చేసేవారికి రిటైల్ ఫైనాన్స్‌ను అందించడానికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ఒప్పందంలో భాగంగా ఈ-స్కూటర్ వినియోగదారులకు తక్షణ రుణ సదుపాయాన్ని అందించగలమని ఏథర్ ఎనర్జీ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు ప్రైవేట్ రంగ బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లతో కొనుగోలుదారులకు గరిష్ట రుణాలను అందించనున్నాయి. తమ కస్టమర్లు కొనుగోలు సమయంలో వాహనం విలువలో 95 శాతం వరకు రుణాలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారని, 2-3 సంవత్సరాల పాటు చెల్లించుకునేందుకు అవకాశం ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఫైనాన్సింగ్ సదుపాయం అందుబాటులో ఉండడం వల్ల వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయడం సులభతరం అవుతుందన్నారు. దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఈ రంగంలో గత ఏడాది 20 శాతం వృద్ది రేటును నమోదు చేసిందని కంపెనీ పేర్కొంది. తమ వినియోగదారులకు కొనుగోలును సులభతరం చేయడమే లక్ష్యంగా సంస్థ పెట్టుకున్నట్లు తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులు కొత్త ఖాతాదారులకు(క్రెడిట్ హిస్టరీ లేనివారికి) రుణాలను అందిస్తున్నాయి, వీరి వాటా మొత్తం సంఖ్యలో 20-25 శాతం వాటాను కలిగి ఉంది. క్రెడిట్ హిస్టరీ లేనివారికి రుణాలు కాగా, టైర్-2, టైర్-3 నగరాల్లో విస్తరణ దృష్ట్యా ఎలాంటి క్రెడిట్ హిస్టరీ లేని కస్టమర్లకు వాహన రుణాలు అందించడం చాలా ముఖ్యమని ఏథర్ ఎనర్జీ పేర్కొంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడంతో వినియోగదారులకు రుణ సదుపాయం సులభతరం అవుతుంది. భారతదేశంలో విక్రయించే 10 వాహనాల్లో 8 ద్విచక్ర వాహనాలను ఫైనాన్స్ రూపంలో తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. భారతదేశంలో ద్విచక్ర వాహన రంగంలో ఫైనాన్స్ రుణాలు 50 శాతానికి దగ్గరగా ఉందని అథర్ ఎనర్జీ తెలిపింది. 2025 నాటికి దేశీయ ద్విచక్ర వాహన లోన్ మార్కెట్ విలువ 12.3 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తాజా నివేదిక తెలిపింది. (చదవండి: ఎల్ఐసీ పాలసీదారులకు అలర్ట్..! ఇదే చివరి అవకాశం..!) -
ఇది కదా సహాయమంటే.. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు రూ.2 కోట్ల బహుమానం!
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ, సీఈవో వి.వైద్యనాథన్ మరోసారి తన ఉదారత చాటుకున్నారు. మరణించిన సహోద్యోగి కుటుంబ సభ్యులకు తన వద్ద ఉన్న బ్యాంకు 5 లక్షల షేర్లను బహుమతిగా ఇచ్చారు. నేటి షేరు ముగింపు ధర బట్టి చూస్తే వీటి విలువ రూ.2 కోట్లుకు పైగా ఉంటుంది. ''మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ వి.వైద్యనాథన్ తన వద్ద ఉన్న ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 5,00,000 ఈక్విటీ షేర్లను చాలా కాలం పాటు తనకు బాగా తెలిసిన మరణించిన సహోద్యోగి కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు బహుమతిగా ఇచ్చినట్లు" బ్యాంక్ పేర్కొంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు గురువారం బీఎస్ఈలో 1.55 శాతం పెరిగి రూ.42.65 వద్ద ముగిశాయి. వైద్యనాథన్ ఇలా బహుమతిగా షేర్లు ఇవ్వడం మొదటిసారి కాదు. అతను ఇంతకు ముందు తన ట్రెయినర్, పనిమనిషి, డ్రైవర్‌తో పాటు అయిదుగురికి 9 లక్షల షేర్లను బహుమతిగా ఇచ్చి ఉదారత చాటుకున్నారు. నాటి షేరు ముగింపు ధర బట్టి చూస్తే వీటి విలువ రూ.3.95 కోట్లుగా ఉంటుంది. ఈ అయిదుగురి సొంత ఇంటి కల సాకారం చేసేందుకు ఆయన ఈ మేరకు సహాయం చేశారు. వీరెవ్వరితోనూ ఆయనకు బంధుత్వం లేదని స్టాక్ ఎక్సేంజీలకు బ్యాంకు తెలిపింది. వైద్యనాథన్ ఇలా బహుమతిగా షేర్లను ఇస్తూ ప్రసిద్ధి చెందాడు. ఉదాహరణకు, గత ఏడాది మేలో వైద్యనాథన్ బ్యాంకు 4.5 లక్షల షేర్లను రూ.2.34 కోట్ల చొప్పున ముగ్గురు వ్యక్తులకు విరాళంగా ఇచ్చారు. వారందరికీ ఒక్కొక్కరికి 1.5 లక్షల షేర్లు వచ్చాయి. 2020లో వైద్యనాథన్ తన పాఠశాల ఉపాధ్యాయుడికి రూ.30 లక్షల మొత్తం విలువ గల ఈక్విటీ షేర్లను బహుమతిగా ఇచ్చారు. (చదవండి: హ్యాకర్ల దెబ్బకు వణికిపోతున్న రష్యా.. వెబ్సైట్లు డౌన్.!) -
లక్కంటే వీళ్లదే.. ఒక్క రోజులోనే కోటీశ్వరులయిన డ్రైవర్, పనిమనిషి
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ, సీఈవో వి. వైద్యనాథన్ మరోసారి తన ఉదారత చాటుకున్నారు. తన ట్రెయినర్, పనిమనిషి, డ్రైవర్‌తో పాటు అయిదుగురికి 9 లక్షల షేర్లను బహుమతిగా ఇచ్చి ఉదారత చాటుకున్నారు. సోమవారం నాటి షేరు ముగింపు ధర బట్టి చూస్తే వీటి విలువ రూ. 3.95 కోట్లుగా ఉంటుంది. సొంతింటి కోసం ఈ అయిదుగురి సొంత ఇంటి కల సాకారం చేసేందుకు ఆయన ఈ మేరకు సహాయం చేశారు. వీరెవ్వరితోనూ ఆయనకు బంధుత్వం లేదని స్టాక్ ఎక్సేంజీలకు బ్యాంకు తెలిపింది. వ్యక్తిగత ట్రెయినర్ రమేష్ రాజుకు 3 లక్షల షేర్లు, పనిమనిషి ప్రాంజల్ నర్వేకర్.. డ్రైవర్ అలగర్‌సామికి చెరి 2 లక్షలు, ఆఫీస్ సపోర్ట్ ఉద్యోగి దీపక్ పఠారే మరో పని మనిషి సంతోష్ జోగ్లేకు చెరి 1 లక్ష షేర్లను వైద్యనాథన్ బహుమతిగా ఇచ్చారు. గతంలో ఆయన గతంలో కూడా వ్యక్తిగత హోదాలో కొందరు వ్యక్తులకు ఇలాగే షేర్లను బహుమానంగా ఇచ్చారు. మరోవైపు, సామాజిక సేవా కార్యకలాపాల కోసం వైద్యనాథన్‌కు చెందిన రుక్మణి సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ 2 లక్షల షేర్లను విరాళంగా ఇచ్చినట్లు బ్యాంక్ వివరించింది. -
కిరాణా వర్తకులకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: కిరాణా వర్తకుల మూలధన నిధుల అవసరాలకు మద్దతుగా నిలిచేందుకు ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ నూతనంగా ఒక ‘క్రెడిట్ ప్రోగ్రామ్’ను ప్రకటించింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు భాగస్వామ్యంతో సులభ రుణాలను సమకూర్చనుంది. కిరాణా వర్తకుల ఇబ్బందులను పరిష్కరించేందుకు, వ్యాపార వృద్ధికి నిధుల అవసరాలను తీర్చేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టు ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ ప్రకటించింది. ఇందులో భాగంగా కిరాణా వర్తకులు ఎటు వంటి వ్యయాలు లేకుండానే రుణ సాయాన్ని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు, ఇతర ఫిన్‌టెక్ సంస్థల నుంచి పొందొచ్చని తెలిపింది. ఈ రుణాలు రూ.5,000 నుంచి రూ.2 లక్షల వరకు.. 14 రోజుల కాలానికి ఎటువంటి వడ్డీ లేకుండా లభిస్తాయని పేర్కొంది. చదవండి : ఆ పేరు మార్చండి, అమెజాన్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు -
డిక్సన్ టెక్- ఐడీఎఫ్సీ ఫస్ట్.. భల్లేభల్లే
ముంబై, సాక్షి: బుధవారం 10 రోజుల ర్యాలీకి బ్రేక్ పడినప్పటికీ తిరిగి దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా వైట్ గూడ్స్ కాంట్రాక్ట్ తయారీ దిగ్గజం డిక్సన్ టెక్నాలజీస్, ప్రయివేట్ రంగ సంస్థ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. డిక్సన్ టెక్నాలజీస్ బోట్ బ్రాండ్ కంపెనీ ఇమేజిన్ మార్కెటింగ్ ప్రయివేట్ లిమిటెడ్‌తో ట్విన్ వైర్లెస్ స్పీకర్ల తయారీకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు డిక్సన్ టెక్నాలజీస్ పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ప్లాంటులో వీటిని తయారు చేయనున్నట్లు వెల్లడించింది. మరోవైపు సొంత అనుబంధ సంస్థ ప్యాడ్గెట్ ఎలక్ట్రానిక్స్ ద్వారా మోటరోలాతోనూ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. దీనిలో భాగంగా మోటరోలా బ్రాండ్ స్మార్ట్ ఫోన్లను రూపొందించనున్నట్లు పేర్కొంది. ప్యాడ్గెట్ ఇటీవలే కేంద్ర ప్రభుత్వ పీఎల్ పథకానికి అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో డిక్సన్ టెక్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 6.2 శాతం జంప్‌చేసి రూ. 15,345కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 5.4 శాతం లాభపడి రూ. 15,220 వద్ద ట్రేడవుతోంది. గత మూడు నెలల్లో ఈ కౌంటర్ 75 శాతం ర్యాలీ చేయడం విశేషం! చదవండి: (ఆన్లైన్ బ్రాండ్ బోట్‌కు భారీ నిధులు) ఐడీఎఫ్సీ ఫస్ట్‌బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) మూడో త్రైమాసికంలో రిటైల్ రుణాలలో 24 శాతం వృద్ధితో రూ. 66,635 కోట్లకు చేరినట్లు ఐడీఎఫ్సీ ఫస్ట్‌బ్యాంక్ వెల్లడించింది. వెరసి క్యూ3(అక్టోబర్- డిసెంబర్)లో ఫండెడ్ ఆస్తులు(రుణాలు) 0.7 శాతం పెరిగి రూ. 1.1 ట్రిలియన్లను తాకినట్లు తెలియజేసింది. పీఎస్ఎల్ కొనుగోళ్లతో కలిపి రిటైల్ ఫండెడ్ అసెట్స్ వాటా 64 శాతానికి చేరినట్లు వెల్లడించింది. మొత్తం డిపాజిట్లు 41 శాతం పెరిగి రూ. 77,289 కోట్లకు చేరగా.. వీటిలో రిటైల్ విభాగం 100 శాతం జంప్‌చేసి రూ. 58,435 కోట్లను తాకినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 7 శాతం జంప్‌చేసి రూ. 44.35 వద్ద ట్రేడవుతోంది. తద్వారా గత జనవరి 20న సాధించిన ఏడాది గరిష్టం రూ. 45.5కు చేరువైంది. చదవండి: (టాటా క్లిక్‌లో టాటా గ్రూప్ భారీ పెట్టుబడులు) -
బేయర్ క్రాప్‌సైన్స్- ఐడీఎఫ్సీ ఫస్ట్- హై’జంప్
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించడంతో విదేశీ దిగ్గజం బేయర్ క్రాప్‌సైన్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ఇదే కాలంలో ఆకర్షణీయ పనితీరు చూపడంతో ప్రయివేట్ రంగ సంస్థ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. బేయర్ క్రాప్‌సైన్స్ చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకోగా.. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 5 శాతం ఎగసింది. వివరాలు చూద్దాం.. బేయర్ క్రాప్‌సైన్స్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో అగ్రి కెమికల్స్ దిగ్గజం బేయర్ క్రాప్ సైన్స్ రూ. 31.5 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 57 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం 82 శాతం ఎగసి రూ. 459 కోట్లను తాకింది. వాటాదారులకు షేరుకి రూ. 25 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తొఅలుత బేయర్ క్రాప్ షేరు ఎన్ఎస్ఈలో 11 శాతం దూసుకెళ్లి రూ. 4920కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 10.5 శాతం ఎగసి రూ. 4910 వద్ద ట్రేడవుతోంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ప్రయివేట్ రంగ సంస్థ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ రూ. 71.5 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 218 కోట్ల నికర నష్టం నమోదైంది. నికర వడ్డీ ఆదాయం 40 శాతం ఎగసి రూ. 1563 కోట్లను తాకింది. స్థూల మొండిబకాయిలు 2.83 శాతం నుంచి 2.6 శాతానికి బలహీనపడ్డాయి. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేరు 5 శాతం లాభపడి రూ. 20 వద్ద ట్రేడవుతోంది. అయితే రుణ నాణ్యత, కోవిడ్-19 ప్రభావం, బలహీన కస్టమర్లు వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కౌంటర్‌కు మోర్గాన్ స్టాన్లీ, క్రెడిట్ స్వీస్ అండర్‌వెయిట్ రేటింగ్‌ను ప్రకటించాయి. -
ఐడీఎఫ్సీ బ్యాంక్ నష్టాలు రూ.370 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఐడీఎఫ్సీ బ్యాంక్‌కు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.370 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గతేదాది ఇదే క్వార్టర్లో రూ.234 కోట్ల నికర లాభం వచ్చిందని ఐడీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలు తగ్గినా, కేటాయింపులు పెరగడంతో ఈ క్యూ2లో భారీగా నష్టాలు వచ్చాయని వివరించింది. తగ్గిన మొండి బకాయిలు... గత క్యూ2లో రూ.2,365 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.2,453 కోట్లకు పెరిగిందని ఐడీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. రుణ నాణ్యత మెరుగుపడిందని పేర్కొంది. గత క్యూ2లో 3.92 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు 1.63 శాతానికి తగ్గాయని తెలిపింది. అలాగే నికర మొండి బకాయిలు 1.61 శాతం నుంచి 0.59 శాతానికి తగ్గాయని వివరించింది. అంకెల పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు రూ.2,002 కోట్ల నుంచి రూ.895 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.805 కోట్ల నుంచి రూ.321 కోట్లకు తగ్గాయని తెలిపింది. మొండి బకాయిలు తగ్గినా, కేటాయింపులు మాత్రం రూ.601 కోట్లకు పెంచామని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐడీఎఫ్సీ బ్యాంక్ షేర్ 2.3 శాతం లాభంతో రూ.35.20 వద్ద ముగిసింది. -
ఐడీఎఫ్సీ బ్యాంక్, క్యాపిటల్ ఫస్ట్ విలీనం
సాక్షి, ముంబై: ఐడీఎఫ్సీ బ్యాంక్, క్యాపిటల్ ఫస్ట్ విలీనంపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ క్యాపిటల్ ఫస్ట్, ఐడీఎఫ్సీ సంస్థలు శనివారం ధృవీకరించాయి. ఈ వీలీనం ద్వారా ఒక జాయింట్ వెంచర్‌గా ఏర్పడనున్నట్టు వెల్లడించాయి. వీటి ఆమోదానికి సంబంధించిన అన్నిఅనుమతులను పొందిన తరువాత సుమారు 64లక్షల మంది వినియోగదారులు రూ. 1.4కోట్ల ఆస్తులతో ఈ జాయింట్ సంస్థ ఆవిర్భవిస్తుంది. మరోవైపు ఈ కంపెనీకి బిపిల్ జెమానీ మధ్యంతర సీఈవోగా ఉండనున్న నేపథ్యంలో తక్షణమే ఆయన ఐడీఎఫ్సీ సీఎఫ్‌వో పదవికి రిజైన్ చేశారు. అలాగే క్యాపిటల్ ఫస్ట్ ఫౌండర్ వైద్య నాథన్ కొత్త సంస్థకు ఎండీ, సీఈవోగాను, ఐడీఎఫ్సీకు చెందిన రాజీవ్ లాల్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉంటారు. ఈ ఒప్పందం ప్రకారం 10 క్యాపిటల్ ఫస్ట్ షేర్లకు గాను, ఐడీఎఫ్సీ 139 షేర్లు దక్కనున్నాయి. కొత్త ఇటీవల శ్రీరామ్ సిటీ యూనియన్‌తో విలీనాన్ని రద్దు చేసుకున్న ఐడీఎఫ్సీ ఇదే విధంగా క్యాపిటల్ ఫస్ట్‌తో విలీనాన్ని కూడా రద్దు చేసుకోనుందని వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ అధికారిక ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. -
మరో మెగా విలీనం రద్దు
ముంబై : ఇటీవలే టెలికాం కంపెనీలు ఆర్‌కామ్-ఎయిర్‌సెల్ విలీనం కథ కంచికి చేరిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మెగా విలీనం కూడా రద్దయింది. అది ఐడీఎఫ్సీ బ్యాంకు, శ్రీరామ్ క్యాపిటల్ విలీనం. నాలుగు నెలల చర్చల అనంతరం కూడా ఇరు వైపుల నుంచి వాల్యుయేషన్ పరంగా ఆమోదయోగ్యంగా లేరని ఈ విషయం తెలిసిన ముగ్గురు అధికారులు చెప్పారు. ఈ విలీన చర్చలు రద్దయినట్టు త్వరలోనే ప్రకటన వస్తుందని తెలిపారు. వాటాదారుల సంతోషంగా లేరు. రెగ్యులేటరీ సంతోషంగా లేదు. ఈ సమయంలో ఎలాంటి మంచి జరుగదు అని ఓ వ్యక్తి చెప్పారు. ఇది చాలా కిష్టమైన డీల్ అని, నిరాశలో ఉన్న ఒకరు లేదా ఇద్దరు మైనార్టీ వాటాదారులు ఈ చర్చ ప్రక్రియలో పాల్గొన్నారని పేర్కొన్నారు. జూలై తొలివారం నుంచి ఇరు కంపెనీలు ఎక్స్‌క్లూజివ్‌గా చర్చలు జరుపుతున్నాయి. ఈ రెండు విలీనమైన అతిపెద్ద బ్యాంకుగా, ఇన్సూరెన్స్ బిజినెస్‌గా ఎదగాలని ప్రయత్నం చేశాయి. ఇరు గ్రూప్‌లు అక్టోబర్ 5ను డెడ్‌లైన్‌గా విధించుకున్నాయి. కానీ అప్పటికీ ఇరు గ్రూప్‌లు ఓ ఏకగ్రీవ నిర్ణయానికి రాలేకపోయాయి. స్టేక్ వాల్యుయేషన్ విషయంలో ఇరు కంపెనీలకు చెడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు 2014లో బ్యాంకింగ్ లైసెన్సు వచ్చింది. అప్పటి నుంచి కూడా ఈ బ్యాంకు అంత బలమైన డిపాజిట్ బేస్‌ను నిర్వహించలేకపోతుంది. ఇరు సంస్థలు విలీన చర్చలు ప్రారంభించే ముందు 'పెళ్లిళ్లు స్వర్గంలోనే నిర్ణయించబడతాయి'' అంటూ ఐడీఎఫ్సీ బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజీవ్ లాల్ అన్నారు.