ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనేవారికి శుభవార్త తెలిపింది. సీబిల్ స్కోర్ లేకున్నా వారికి రుణాలను మంజూరు చేసేందుకు ప్రముఖ 2 బ్యాంకులతో సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ ఏథర్ ఎనర్జీ తన ఈ-స్కూటర్‌ల కొనుగోలు చేసేవారికి రిటైల్ ఫైనాన్స్‌ను అందించడానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ఒప్పందంలో భాగంగా ఈ-స్కూటర్ వినియోగదారులకు తక్షణ రుణ సదుపాయాన్ని అందించగలమని ఏథర్ ఎనర్జీ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు ప్రైవేట్ రంగ బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లతో కొనుగోలుదారులకు గరిష్ట రుణాలను అందించనున్నాయి.
తమ కస్టమర్లు కొనుగోలు సమయంలో వాహనం విలువలో 95 శాతం వరకు రుణాలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారని, 2-3 సంవత్సరాల పాటు చెల్లించుకునేందుకు అవకాశం ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఫైనాన్సింగ్ సదుపాయం అందుబాటులో ఉండడం వల్ల వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయడం సులభతరం అవుతుందన్నారు. దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఈ రంగంలో గత ఏడాది 20 శాతం వృద్ది రేటును నమోదు చేసిందని కంపెనీ పేర్కొంది. తమ వినియోగదారులకు కొనుగోలును సులభతరం చేయడమే లక్ష్యంగా సంస్థ పెట్టుకున్నట్లు తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులు కొత్త ఖాతాదారులకు(క్రెడిట్ హిస్టరీ లేనివారికి) రుణాలను అందిస్తున్నాయి, వీరి వాటా మొత్తం సంఖ్యలో 20-25 శాతం వాటాను కలిగి ఉంది.
క్రెడిట్ హిస్టరీ లేనివారికి రుణాలు
కాగా, టైర్-2, టైర్-3 నగరాల్లో విస్తరణ దృష్ట్యా ఎలాంటి క్రెడిట్ హిస్టరీ లేని కస్టమర్లకు వాహన రుణాలు అందించడం చాలా ముఖ్యమని ఏథర్ ఎనర్జీ పేర్కొంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడంతో వినియోగదారులకు రుణ సదుపాయం సులభతరం అవుతుంది. భారతదేశంలో విక్రయించే 10 వాహనాల్లో 8 ద్విచక్ర వాహనాలను ఫైనాన్స్ రూపంలో తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. భారతదేశంలో ద్విచక్ర వాహన రంగంలో ఫైనాన్స్ రుణాలు 50 శాతానికి దగ్గరగా ఉందని అథర్ ఎనర్జీ తెలిపింది. 2025 నాటికి దేశీయ ద్విచక్ర వాహన లోన్ మార్కెట్ విలువ 12.3 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తాజా నివేదిక తెలిపింది.
(చదవండి: ఎల్‌ఐసీ పాలసీదారులకు అలర్ట్..! ఇదే చివరి అవకాశం..!)
Comments
Please login to add a commentAdd a comment