Athers electric scooter
-
ఏథర్ కొత్త మోడళ్లు.. ధర ఎంతంటే..
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ 2025లో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. ఇందులో విభిన్న వేరియంట్లను ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది. స్కూటర్ బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి ధర నిర్ణయించినట్లు పేర్కొంది. ప్రతి వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే ప్రయాణించే దూరాల్లో మార్పు ఉంటుందని తెలిపింది.కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం మోడల్‌ను అనుసరించి ఎక్స్‌షోరూమ్ ధర కింది విధంగా ఉంది.ఏథర్ 450ఎస్ధర రూ.1,29,999 (ఎక్స్-షోరూమ్), ఐడీసీ రేంజ్ 122 కిమీ.ఏథర్ 450ఎక్స్ 2.9 కిలోవాట్2.9 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యం, ధర రూ.1,46,999(ఎక్స్-షోరూమ్), ఐడీసీ రేంజ్ 126 కిమీ.ఏథర్ 450ఎక్స్ 3.7 కిలోవాట్ 3.7 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యం, ఐడీసీ(ఇండియన్ డ్రైవింగ్ సైకిల్) రేంజ్ 161 కి.మీ, ధర రూ.1,56,999(ఎక్స్-షోరూమ్).ఏథర్ 450 అపెక్స్ధర రూ.1,99,999 (ఎక్స్-షోరూమ్), ఐడీసీ రేంజ్ 157 కి.మీ.ఇదీ చదవండి: మస్క్ మంచి మనసు.. భారీ విరాళంఏథర్ 450 ఎక్స్, 450 అపెక్స్ మోడళ్లు మల్టీ మోడ్ ట్రాక్షన్ కంట్రోల్‌ను కలిగి ఉన్నాయి. ఇది స్మూత్ సర్ఫేస్(తక్కువ ఘర్షణ కలిగిన ఉపరితలాలు)పై స్కూటర్ జారిపోకుండా నిరోధిస్తుంది. దాంతో రైడర్ భద్రతను పెంచినట్లు కంపెనీ తెలిపింది. రైడర్లు బైక్ నడుపుతున్న సమయంలో రెయిన్ మోడ్, రోడ్ మోడ్, ర్యాలీ మోడ్ అనే మూడు విభిన్న మోడ్‌లను ఎంచుకోవచ్చని పేర్కొంది. -
శ్రీలంకకు బెంగళూరు ఎలక్ట్రిక్ స్కూటర్లు
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీదారు ఏథర్ ఎనర్జీ.. తన ఎలక్ట్రిక్ స్కూటర్లను శ్రీలంకకు ఎగుమతి చేయడం ప్రారంభించింది. ఇప్పటికే మొదటి బ్యాచ్ ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను పంపించించినట్లు సమాచారం. ఈ పండుగ సీజన్ ముగిసే నాటికి శ్రీలంకలో తమ మోడల్‌ల డెలివరీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.శ్రీలంకకు ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను పంపిస్తున్న ఫోటోలను కంపెనీ సీఈఓ 'తరుణ్ మెహతా' తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. గత ఏడాది నేపాల్‌లో అంతర్జాతీయంగా అరంగేట్రం చేసిన తరువాత ఏథర్ స్కూటర్లను దిగుమతి చేసుకుంటున్న విదేశీ మార్కెట్ శ్రీలంక.ఏథర్ 450ఎస్భారతదేశంలో ఏథర్ 450ఎస్ ధర రూ.1.55 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే శ్రీలంకలో ఈ స్కూటర్ ధర ఎలా ఉంటుందనే విషయం తెలియాల్సి ఉంది. ఇండియాలో ఏథర్ ఎనర్జీ 450ఎక్స్, 450 అపెక్స్, రిజ్టా స్కూటర్లను కూడా విక్రయిస్తోంది.శ్రీలంకలో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించాలనే ప్రణాళిక ఆగస్ట్‌లోనే మొదలైంది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ పండుగ సీజన్ ముగిసే నాటికి శ్రీలంకలో తన మొదటి ఎక్స్పీరియన్స్ సెంటర్లను ప్రారంభించాలని యోచిస్తోంది. దీనికోసం కంపెనీ అట్మాన్ గ్రూప్, సినో లంక ప్రైవేట్ లిమిటెడ్ వంటి వాటితో జతకట్టింది. శ్రీలంకలో ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను కూడా మెరుగుపరచాలని కంపెనీ యోచిస్తోంది.ఇండియన్ మార్కెట్లో ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్.. స్టాండర్డ్, ప్రో ప్యాక్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది 2.9 కిలోవాట్ సామర్థ్యం కలిగిన ఒకే బ్యాటరీ పొందుతుంది. ఈ స్కూటర్ ఒక చార్జితో 115 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 90 కిమీ వరకు ఉంది.Ather’s second international market is set to go live by this festive!First shipment of 450s have left for Sri Lanka 🇱🇰 from our warehouses in 🇮🇳❤️ pic.twitter.com/EyfYCHPuIf— Tarun Mehta (@tarunsmehta) October 17, 2024 -
ఏథర్ ఎనర్జీ కీలక నిర్ణయం.. 4000 మందికి ఉద్యోగావకాశాలు
బెంగళూరు బేస్డ్ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ 'ఏథర్ ఎనర్జీ' మహారాష్ట్రలో కొత్త తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సన్నద్ధమైంది. దీనికోసం సంస్థ ఏకంగా రూ. 2000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఉపముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు.బిడ్కిన్, ఔరంగాబాద్ ఇండస్ట్రియల్ సిటీ (AURIC)లో ఏర్పాటు చేయనున్న ఈ కొత్త ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మాత్రమే కాకుండా.. బ్యాటరీలను కూడా తయారు చేయనున్నట్లు ఏథర్ ఎనర్జీ ఒక ప్రకటనలో తెలిపింది.ఏథర్ ఎనర్జీ మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్న కొత్త ప్లాంట్ ద్వారా సుమారు 4000 మందికి ఉపాధి లభిస్తుందని, రాష్ట్రంలో ఆటోమోటివ్ రంగంలో ఇదే అతి పెద్ద పెట్టుబడిగా దేవేంద్ర ఫడ్నవీస్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పేర్కొన్నారు. ఈ ప్లాంట్ ఏటా 10లక్షల కంటే ఎక్కువ వాహనాలను, బ్యాటరీలను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు.ఏథర్ ఎనర్జీ ప్రస్తుతం తమిళనాడులోని హోసూర్‌లో రెండు తయారీ కేంద్రాలను కలిగి ఉంది. ఇందులో ఒకటి బ్యాటరీలను ఉత్పత్తి చేస్తుంది. మరొకటి వాహనాల అసెంబ్లింగ్ కోసం ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఉన్న కంపెనీ ప్లాంట్ల వార్షిక సామర్థ్యం 4.3 లక్షల బ్యాటరీ ప్యాక్‌లు & 4.2 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు.మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్న కొత్త ప్లాంట్ బ్రాండ్ వాహనాలను విరివిగా ఉత్పత్తి చేస్తుంది. తద్వారా ఏథర్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. బుక్ చేసుకున్న కస్టమర్లకు కూడా వేగంగా డెలివరీ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని ఏథర్ ఎనర్జీ కో ఫౌండర్ & సిటీఓ స్వప్నిల్ జైన్ పేర్కొన్నారు.Big investment in Maharashtra in automotive sector!Welcome to Maharashtra, Ather !Just got done with a meeting with the Founder of Ather Energy, Shri Swapnil Jain and I’m glad to share that he informed about their great decision that Ather Energy, the leading electric scooter… pic.twitter.com/Hc8EeaDdM6— Devendra Fadnavis (@Dev_Fadnavis) June 26, 2024 -
‘ఏథర్’లో ఉన్నదంతా అమ్మేసుకున్న సచిన్ బన్సాల్
ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీలో తనకున్న 7.5 వాటానంతా అమ్మేసుకుని ఆ సంస్థ నుంచి వైదొలిగారు. 2014 నుంచి ఏథర్ కంపెనీలో దాదాపు రూ.400 కోట్లు ఇన్వెస్ట్ చేసిన తొలి ఇన్వెస్టర్లలో బన్సాల్ ఒకరు.ఎకనామిక్స్ టైమ్స్ కథనం ప్రకారం.. తన వాటాలో 2.2 శాతం భాగాన్ని హీరో మోటోకార్ప్‌కు రూ .124 కోట్లకు విక్రయించిన సచిన్ బన్సాల్ మిగిలిన 5.3 శాతం వాటాను జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌కు సుమారు రూ .282 కోట్లకు విక్రయించారు. ఈ డీల్ తర్వాత ఈవీ స్టార్టప్‌లో హీరో మోటోకార్ప్ వాటా 40 శాతానికి పెరగనుంది.2024 ఆర్థిక సంవత్సరంలో ఏథర్ టర్నోవర్ రూ.1,753 కోట్లుగా ఉందని, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.1,784 కోట్లతో పోలిస్తే ఇది 1.7 శాతం తగ్గిందని హీరో మోటోకార్ప్ తెలిపింది. -
లక్ష కంటే ఖరీదైన స్కూటర్.. చిల్లరతో కొనేసాడు - ఎక్కడో తెలుసా?
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో జేబులో డబ్బు పెట్టుకునే వారే కరువయ్యారు. ఏ చిన్న వస్తువు కొనాలన్నా అంతా ఆన్లైన్ పేమెంట్ చెల్లిస్తున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రమే తనకు ఇష్టమైన స్కూటర్ కొనటానికి మొత్తం చిల్లర ఇచ్చి షోరూమ్ వారికే షాక్ ఇచ్చాడు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన వ్యక్తి ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనడానికి మొత్తం చిల్లర అందించాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. సుమారు లక్ష కంటే ఖరీదైన స్కూటర్‌ను చిల్లరతో కొనేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఏథర్ ఎనర్జీ సీఈఓ 'తరుణ్ మెహతా' స్కూటర్ డెలివరీ చేసి, స్వయంగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతలో ఫోటో షేర్ చేస్తూ.. జైపూర్ వ్యక్తి 10 రూపాయల నాణేలతో స్కూటర్ కొన్నాడని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. జైపూర్ వ్యక్తి కొనుగోలు చేసిన ఏథర్ 450 సిరీస్ ఖచ్చితమైన మోడల్‌ను మెహతా పేర్కొనలేదు. కాబట్టి దీని ధర ఎంత అనేది స్పష్టంగా తెలియదు. ఏథర్ 450ఎక్స్, 450ఎస్, 450అపెక్స్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుందో. వీటి ధరలు రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.75 లక్షల మధ్య ఉన్నాయి. ఇదీ చదవండి: 2000 ఉద్యోగాలు రెడీ..! ఎక్కడో తెలుసా? A new Ather owner just bought himself a 450 in Jaipur ... all with 10Re coins! pic.twitter.com/VWoOJiQey2 — Tarun Mehta (@tarunsmehta) February 17, 2024 -
సబ్సిడీ ఎత్తేస్తే అంతే.. సీఈవో ఆందోళన!
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని ఉపసంహరించుకోవడంపై ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు తరుణ్ మెహతా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్య ఎలక్ట్రిక్ టూవీలర్ పరిశ్రమలో ఒకటీ రెండు సంవత్సరాల వృద్ధి స్తబ్దతకు దారితీయవచ్చని ఆయన అంటున్నారు. పరిశ్రమ మనుగడ కోసం రాయితీలపైనే పూర్తిగా ఆధారపడనప్పటికీ వచ్చే ఏప్రిల్‌లోనే సబ్సిడీని నిలిపివేస్తే కంపెనీలు మరింత కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. ఈ దృష్టాంతం పరిశ్రమ వృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో జాప్యానికి దారి తీస్తుంది. ఈ ఏడాది మార్చిలో ముగియనున్న ఫేమ్2(FAME-II) పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే గత ఏడాది జూన్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీ మొత్తాన్ని తగ్గించింది. ఉన్నట్టుండి సబ్సిడీని తగ్గించడం వల్ల కలిగిన ప్రతికూల ప్రభావాన్ని తరుణ్ మెహతా ఎత్తిచూపారు. దీనివల్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమ 2023లో వృద్ధిని కోల్పోయిందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడంలో పేరుగాంచిన చండీగఢ్ ఫేమ్ స్కీమ్ లేకపోతే ప్రభావితం కావచ్చన్నారు. దేశం అంతటా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల స్వీకరణను ప్రోత్సహించడంలో ఫేమ్ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. ఇది కాలుష నియంత్రణ, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి దోహదం చేస్తోంది. అయితే బ్యాటరీ ఖర్చులు అధికంగా ఉండటం, విడి భాగాలపై సరఫరా పరిమితులు ఎలక్ట్రిక్ వాహనాలను మరింత ఖరీదైనవిగా మార్చాయి. -
రూ.20000 తగ్గింపుతో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ - వివరాలు
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బెంగళూరు బేస్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ 'ఏథర్ ఎనర్జీ' 2024 ప్రారంభంలోనే తమ అమ్మకాలను పెంచుకోవడానికి, కొత్త కస్టమర్లను ఆకర్శించడానికి '450ఎస్' ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు మీద అద్భుతమైన ఆఫర్స్ అందించడం ప్రారంభించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు మీద కంపెనీ ఇప్పుడు రూ. 20000 తగ్గింపును ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఈ స్కూటర్ బెంగళూరులో రూ.1.09 (ఎక్స్-షోరూమ్) లక్షలకు, ఢిల్లీలో రూ.97,500 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరలు లభిస్తోంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ ఏథర్ 450 ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఒక సింగిల్ చార్జితో 115 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది కేవలం 3.9 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 90 కిమీ వరకు ఉంటుంది. ఇదీ చదవండి: అబ్బురపరుస్తున్న గ్యాడ్జెట్స్.. ఎప్పుడైనా చూసారా! ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ హోమ్ ఛార్జర్ ద్వారా 0 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోవడానికి సుమారు 6 గంటల 36 నిమిషాల సమయం పడుతుంది. సంక్రాంతి పండుగలో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారు రూ. 20000 తగ్గింపుతో కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కేవలం ఈ నెలలో మాత్రమే లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
బంపరాఫర్, ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్!
ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలనుకుంటున్నారా? అయితే డిసెంబర్ 31లోపు కొనేసేయండి. ఈ లోపాటు వెహికల్స్ ధరలు తక్కువ ధరకే లభ్యం కానున్నాయి. కొత్త ఏడాది ప్రారంభంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫేమ్ పథకంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని, ఫలితంగా ఈవీ ధరలకు రెక్కలొచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణుల అంచనా. డిసెంబర్ నెలలలో ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థలు ఓలా, ఎథేర్ మోటార్స్, హీరో మోటోకార్పొతో పాటు పలు ఇతర ఆటోమొబైల్ సంస్థలు ఈవీలపై ఆఫర్లు అందిస్తున్నాయి. వాటిల్లో ముందుగా ఎథేర్ మోటార్స్ 450 ఎస్ అండ్ 450 ఎక్స్ మోడళ్లపై రూ.6,500 క్యాష్ బెన్ఫిట్స్ అందిస్తుంది. అదనంగా రూ.1500 కార్పొరేట్ బెన్ఫిట్స్ను సొంతం చేసుకోవచ్చుకోవచ్చు. ఇక ఎథేర్ ఎలక్ట్రిక్ డిసెంబర్ స్కీమ్ కింద మరో రూ.5,000 ఆదా చేసుకోవచ్చు. ఓలా సైతం ఇయర్ ఎండ్ ఆఫర్ కింద రూ.20వేల వరకు సబ్సిడీ, ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్‌లపై రూ.5 వేల వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు డౌన్ పేమెంట్ తగ్గుతుంది. జీరో ప్రాసెసింగ్ ఛార్జీలు వర్తిస్తాయి. మరో ఈవీ సంస్థ హీరో మోటోకార్ప్ సైతం విడా వి1 ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.38,500విలువ చేసే ఆఫర్లను అందిస్తుంది. రూ.7,500 వరకు ఈఎంఐ బెన్ఫిట్స్, రూ.8,259 విలువ చేసే బ్యాటరీ వారెంటీ పొడిగింపు, రూ.6,500 డిస్కౌంట్, రూ.5,000 ఎక్స్ఛేంజీ బోనస్, రూ.7,500 లాయల్టీ డిస్కౌంట్, రూ.2,500 కార్పొరేట్ డిస్కౌంట్, రూ.1,125 విలువచేసే సబ్స్క్రిప్షన్ ప్లాన్లతో మొత్తం కలిపి రూ.38,500 వరకు ప్రయోజనాల్ని అందిస్తోంది. -
ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు దారులకు బంపరాఫర్!
ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ కొనుగోలు దారులకు బంపరాఫర్ ప్రకటించింది. ఎథేర్ స్కూటర్ కొనుగోలు దారులకు ఎక్స్చేంజ్, కార్పొరేట్, ఫెస్టివల్ ఆఫర్లతో పాటు పలు స్కీమ్‌లను అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రత్యేక ఎక్ఛేంజ్ ఆఫర్లో భాగంగా కొనుగోలుదారులు ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథేర్ ప్రో వెర్షన్ మోడల్ 450 ఎక్స్ (2.9 కిలోవాట్ అండ్ 3.7 కిలోవాట్), 450ఎస్ (2.9 కిలోవాట్). మోడళ్లపై రూ .40,000 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే, ఈ ఎక్ఛేంజ్ ఆఫర్లో వాహనదారుల పాత పెట్రోల్ వేరియంట్ టూ వీలర్, కొనుగోలు చేసి ఎన్ని సంవత్సరాలైంది. బండి కండీషన్, కొనుగోలు చేసే సమయంలో దాని ఒరిజనల్ ప్రైస్ ఎంత ఉందనే దానిని పరిగణలోకి తీసుకుని ఈ భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఎథేర్ ప్రతినిధులు తెలిపారు. ఏథర్ 450 ఎస్ ప్రో వెర్షన్‌పై రూ .5,000 ఫెస్టివల్ బెన్ఫిట్స్, రూ .1,500 కార్పొరేట్ బెన్ఫిట్స్ను అందిస్తుంది. మరోవైపు, 450 ఎక్స్ వేరియంట్లు కూడా అదే కార్పొరేట్ స్కీమ్‌ను అందిస్తుంది. చివరగా, ఏథర్ 5.99శాతం వడ్డీ 24 నెలల ఈఎంఐని అందిస్తుంది. ఈ ఫెస్టివల్ ఆఫర్లన్నీ నవంబర్ 15 వరకు అందుబాటులో ఉంటాయి. ఎక్స్చేంజ్ ఆఫర్లో గరిష్టంగా రూ.40,000 డిస్కౌంట్, ఇతర స్కీమ్స్ కలిపి ఏథర్ 450 ధరలు గణనీయంగా తగ్గాయి. ఏథర్ 450ఎస్ అసలు ధర రూ.1,32,550 నుంచి రూ.86,050కు తగ్గింది. ఏథర్ 450 ఎక్స్ 2.9 కిలోవాట్ అండ్ 450 ఎక్స్ 3.7 కిలోవాట్ల ధరలు వరుసగా రూ.1,01,050, రూ.1,10,249 (ఢిల్లీలో అన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు) గా ఉన్నాయి. -
తక్కువ ధరలో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్, ధర ఎంతంటే?
సాక్షి, ముంబై: స్వదేశీ ఎలక్ట్రిక్ వాహన సంస్థ ఏథర్ ఎనర్జీ భారతదేశంలో కొత్త ఏథర్ 450ఎస్‌ను విడుదల చేసింది. ఫేమ్-II సబ్సిడీ కోతతో ఈవీల ధరలు బాగా పెరిగిన నేపథ్యంలో ఏథర్ 450ఎస్ పేరుతో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ. 1,29,999గా నిర్ణయించింది. బుకింగ్‌లను కూడా షురూ చేసింది. (AsmiJain ఫ్రెండ్ అంకుల్ కోసం: ఇండోర్ అమ్మడి ఘనత) తమ 450 ఎస్ IDC (ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్) 3 kWh బ్యాటరీ ప్యాక్‌తో పరిధి 115 కి.మీ. రేంజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. గంటకు 90 కి.మీవేగంతో అత్యుత్తమ సాంకేతికత, పనితీరును అందిస్తుందని ఏథర్ఎనర్జీ కో-ఫౌండర్, సీఈవో తరుణ్ మెహతా తెలిపారు. ఫేమ్-IIఫ్రేమ్‌వర్క్ కింద తమ బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ 450 ఎక్స్ కొత్త ధరలను కూడా ప్రకటించింది. మునుపటి ధరతో పోలిస్తే స్వల్పంగా పెరిగి రూ. 1,65,000 (ఎక్స్-షోరూమ్ బెంగుళూరు)కి అందుబాటులో ఉంటుంది. టాప్ వేరియంట్ ప్రో ప్యాక్ ఏథర్ 450 ఎక్స్ రూ. 1.45 లక్షల నుండి రూ. 1.65 లక్షల వరకు ఉంటుంది. పాత ధరలతో పోలిస్తే దాదాపు రూ. 32,000 వరకు పెరిగింది. -
ఓలాకి ధీటుగా ఏథర్ సరసమైన స్కూటర్ - త్వరలో..
బెంగళూరు బేస్డ్ కంపెనీ అయిన 'ఏథర్ ఎనర్జీ' (Ather Energy) ఇప్పటికే ఏథర్ 450, 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే వీటి ధరలు రూ. లక్ష కంటే ఎక్కువ కావడం వల్ల చాలా మంది కొనుగోలు చేయడానికి కొంత వెనుకాడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ మార్కెట్లో మరో సరికొత్త సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఏథర్ ఎనర్జీ మార్కెట్లో విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు '450ఎస్' (450S) అని తెలుస్తోంది. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న కంపెనీ స్కూటర్ల కంటే తక్కువ ధరకే లభిస్తాయి. అంతే కాకుండా ఈ స్కూటర్ మార్కెట్లో 'ఓలా ఎస్1 ఎయిర్'కి ప్రధాన ప్రత్యర్థిగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఏథర్ 450S ఎలక్ట్రిక్ స్కూటర్ 2023 చివరి నాటికి మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అంతే కాకుండా ట్రేడ్‌మార్క్ కోసం కంపెనీ గత మార్చిలో అప్లై కూడా చేసింది. ఈ స్కూటర్ డిజైన్, ఫీచర్స్, ఇతర వివరాలను గురించి కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు. కానీ ఇది చూడటానికి దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటుందని భావించవచ్చు. (ఇదీ చదవండి: దీపికా పదుకొణె ట్విటర్ అకౌంట్ పోతుందా? ఎలాన్ మస్క్ కొత్త రూల్ ఏం చెబుతోందంటే?) త్వరలో విడుదల కానున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ దాని మునుపటి మోడల్స్ కంటే తక్కువ ఫీచర్స్ కలిగి ఉండే అవకాశం ఉంది. కావున ఇందులో 7 ఇంచెస్TFT టచ్‌స్క్రీన్, ఆటో హోల్డ్, రైడింగ్ మోడ్ వంటి ఫీచర్స్ బహుశా లభించకపోవచ్చు. అంతే కాకుండా రేంజ్ కూడా కొంత తక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఈ స్కూటర్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ఎలక్ట్రిక్ వెహికల్ వాహనదారులకు ముఖ్య గమనిక!
ఎలక్ట్రిక్ వాహనదారులకు ముఖ్య గమనిక. ఇప్పటికే ఈవీ వెహికల్‌ను కొనుగోలు చేశారా? అదనంగా ఛార్జర్లతో పాటు వెహికల్‌కు సంబంధించిన ఎక్విప్మెంట్ కోసం డబ్బులు ఖర్చు చేశారా? అయితే మీకో శుభవార్త. దేశంలో ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలైన ఎథేర్ ఎనర్జీ, టీవీఎస్ మోటార్స్, ఓలా, హీరో మోటో కార్ప్ కంపెనీలు డబ్బుల్ని రిఫండ్ చేస్తున్నట్లు ప్రకటించాయి. ద్విచక్ర వాహనం తయారు చేసే సంస్థలకు ఫేమ్ పథకం కింద కేంద్రం కొన్ని రాయితీలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. వాహన తయారీ సంస్థలు వాహనదారులకు విక్రయించే వెహికల్ ధర రూ.1.5 లక్షలు మించకూడదు. ధర మించితే ఫేమ్ పథకం సదరు తయారీ సంస్థలకు వర్తించదు. అయినప్పటికీ దేశంలోని కొన్ని ఆటోమొబైల్ సంస్థలు నిబంధనలు ఉల్లంఘించి ఛార్జర్లు, వాహనానికి వినియోగించే ఇతర వస్తువులకు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కేంద్రం రాయితీ కింద చెల్లించాల్సిన రూ.800 కోట్లను ప్రభుత్వం నిలిపివేసింది. ఆయా ఆటోమొబైల్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. తాజాగా కేంద్రం నిర్ణయంతో ఓలా ఎలక్ట్రిక్‌కు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలిందంటూ నివేదికలు పేర్కొన్నాయి. 2021 నుంచి ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఓలా ఎస్1, ఎస్1 ప్రో విక్రయాలు జరిపే సమయంలో హోం ఛార్జర్లకు అదనంగా డబ్బులు వసూలు చేసింది. ఆ మొత్తం విలువ రూ.131 కోట్లుగా ఉంది. తాజాగా కేంద్రం నిర్ణయంతో ఆ భారీ మొత్తాన్ని ఓలా తన వాహన దారులకు చెల్లించాల్సి ఉందని సమాచారం. రీఫండ్‌పై ఓలా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అటు ఏథర్ ఎనర్జీ, టీవీఎస్ మోటార్, హీరో మోటోకార్ప్ సైతం స్పందించలేదు. చదవండి👉 ‘ఎలివేట్’ పేరిట హోండా కొత్త కారు.. మూడేళ్ల నుంచి ఊరిస్తూ.. చివరికి ఇలా -
3వ తరం ఏథర్ 450ఎక్స్ త్వరలోనే: అద్భుతమైన బ్యాటరీతో
సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ మరో కొత్త స్కూటర్‌ను తీసుకొస్తోంది. 3వ తరం 450X స్వదేశీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రేపు(మంగళవారం) ఆవిష్కరించ నుంది. లాంచింగ్ తరువాత బుకింగ్‌లను స్టార్ట్ చేయనుంది. అలాగే ధర ఫీచర్లపై లాంచింగ్ తరువాత మాత్రమే అధికారిక కన్మఫరమేషన్ వస్తుంది. ప్రస్తుతం అందిస్తున్న 75-80 కిలోమీటర్ల పరిధితో పోలిస్తే ఒక్కచార్జ్కి 146 కి.మీ సామర్థ్యమున్న బ్యాటరీని అందించడం కీలకమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కొత్త ఫీచర్ల అంచనాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుత ఏథోర్ 450ఎక్స్‌లోని 2.8 kWh బ్యాటరీతో పోలిస్తే 19 కిలోల నికెల్ కోబాల్ట్ ఆధారితంగా పెద్ద బ్యాటరీని ఈస్కూటర్లో జోడించింది. ప్రస్తుతమున్న వార్ప్, స్పోర్ట్, రైడ్, ఎకో ,స్మార్ట్ ఎకో రైడింగ్ మోడ్స్‌తో కొత్త 3వ-జెన్ ఏథర్ 450ని తీసుకురానుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏథర్ 450 ప్లస్ ధర రూ.1.58 లక్షలు (ఆన్-రోడ్)గా ఉంది. అయితే 450ఎక్స్ ధర రూ. 1.81 లక్షలుగా ఉంటుందని అంచనా. తన ఉత్పత్తులకు ఎప్పుడూ ప్రీమియం ధరను నిర్ణయించే ఏథర్ ఎనర్జీ ఈ సారి కూడా అదే చేయబోతోంది. -
ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో అదరగొట్టిన ఏథర్
సాక్షి,ముంబై: బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్, ఏథర్ ఎనర్జీ బంపర్ సేల్స్ సాధించింది. 2022 , మే నెలలో ఇండియాలో 3,787 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఈ మేరకు సంస్థ సేల్స్ వివరాలను వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే సేల్స్ నిరాశాజనకంగా ఉన్నప్పటికీ, ఈ ఏడాదిలో గత నెలలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేయడం విశేషం. అయితే ఏప్రిల్ 2022లో 3,779 యూనిట్లతో పోలిస్తే ఏథెర్ అమ్మకాలలో కేవలం 0.21 శాతం వృద్ధిని నమోదు చేసింది. 450ఎక్స్, 450 ప్లస్ స్కూటర్‌కు మంచి ఆదరణ లభించిందని పైథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్, రవ్నీత్ ఎస్ ఫోకెలా తెలిపారు. అలాగే దిగ్గజ సంస్థ హీరో మోటో కార్ప్‌తో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా 128 మిలియన్ డాలర్లను సాధించడం సంతోషంగా ఉందన్నారు. కాగా దేశంమొత్తంమీద ఈవీ ఛార్జింగ్ గ్రిడ్ల ఏర్పాటుకు Magentaతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం 35 నగరాల్లో దాదాపు 330కు పైగా ఫాస్ట్ ఛార్జింగ్ ఏథర్ గ్రిడ్ పాయింట్లను ఇన్స్టాల్ చేసింది. రాబోయే మూడేళ్లలో 5వేల పాయింట్లను ఇన్స్టాల్ చేయాలని యోచిస్తోంది. -
ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి షాక్.. పెరగనున్న ఈవీ ధరలు!
న్యూఢిల్లీ: మీరు కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక షాకింగ్ న్యూస్. ఉక్రెయిన్ సంక్షోభంతో తలెత్తిన సరఫరా అంతరాయాల మధ్య దిగుమతి చేసుకున్న బ్యాటరీల వల్ల కలిగిన నష్టాలను తగ్గించుకోవడానికి దేశంలోని ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహన తయారీకంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచాలని చూస్తున్నట్లు పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. బ్లూమ్‌బెర్గ్ ఎన్ఈఎఫ్ నుంచి సేకరించిన డేటా ప్రకారం.. 2021లో బ్యాటరీ సెల్స్ సగటు ఖర్చు కిలోవాట్-గంటకు(కెడబ్ల్యుహెచ్) సుమారు $ 101 లేదా సుమారు ₹7,670/ కిలోవాట్'గా ఉంది. ₹5,500 పెంచిన అథర్ ఎనర్జీ అయితే, ప్రస్తుతం ఈవి బ్యాటరీ సెల్స్ ధర 130 డాలర్లు లేదా అంతకంటే పైగా పెరిగినట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ఇండియా ఆటోమోటివ్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ సౌమెన్ మండల్ అన్నారు. సరఫరా అంతరాయాలు, అంతర్జాతీయ కారణాల వల్ల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు ఆయన అన్నారు. ఓలా ఎస్1 స్కూటర్లో 2.98 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటే, ఏథర్ 450ఎక్స్'లో 2.61 కిలోవాట్ల బ్యాటరీ ఉంది. దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీకంపెనీ అథర్ ఎనర్జీ ఇప్పటికే తన 450ఎక్స్ స్కూటర్ ధరలను జనవరిలో 3శాతం లేదా ₹5,500 కంటే కొంచెం ఎక్కువ పెంచింది. ఆ సమయంలో ఇన్ పుట్ ఖర్చులు పెరగడమే ప్రధాన కారణమని కంపెనీ పేర్కొంది. ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ భవిష్ అగర్వాల్ మార్చి 17న ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలను పెంచనున్నట్లు ప్రకటించారు. ఓలా ఎస్ 1 ప్రో ధర ప్రస్తుతం ₹1,29,999. అయితే, ఓలా ఎలక్ట్రిక్, వచ్చే నెలలో మళ్లీ అమ్మకానికి వచ్చినప్పుడు స్కూటర్ కొత్త ధర ఎలా ఉంటుందో ఇంకా ప్రకటించలేదు. "బ్యాటరీ సెల్స్ తయారీకి అవసరమైన ముడి పదార్థాల ధరలు ప్రపంచ ఘర్షణలు, వాణిజ్య ఆంక్షల కారణంగా పెరిగాయి. దీంతో చైనా, కొరియా & తైవాన్ వంటి ప్రధాన సెల్-తయారీ దేశాలలో బ్యాటరీ సెల్ ధరల పెరుగుదలకు కారణం అయ్యింది. బ్యాటరీ సెల్ ధరలు పెరగడంతో, భారతదేశం బ్యాటరీ తయారీదారులు చెల్లించే దిగుమతి ఖర్చులు కూడా పెరిగాయి. గత రెండు నెలల్లో, సెల్ ధరలు దాదాపు 30% పెరిగాయి" అని గ్రేటర్ నోయిడాకు చెందిన బ్యాటరీ తయారీదారు లోహమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రజత్ వర్మ చెప్పారు. (చదవండి: నాటో, తూర్పు ఐరోపా దేశాలపై పరోక్ష దాడులకు దిగిన రష్యా..!) -
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి ఏథర్ గుడ్‌న్యూస్.. సీబిల్ స్కోర్ లేకున్నా రుణాలు!
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనేవారికి శుభవార్త తెలిపింది. సీబిల్ స్కోర్ లేకున్నా వారికి రుణాలను మంజూరు చేసేందుకు ప్రముఖ 2 బ్యాంకులతో సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ ఏథర్ ఎనర్జీ తన ఈ-స్కూటర్ల కొనుగోలు చేసేవారికి రిటైల్ ఫైనాన్స్‌ను అందించడానికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ఒప్పందంలో భాగంగా ఈ-స్కూటర్ వినియోగదారులకు తక్షణ రుణ సదుపాయాన్ని అందించగలమని ఏథర్ ఎనర్జీ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు ప్రైవేట్ రంగ బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లతో కొనుగోలుదారులకు గరిష్ట రుణాలను అందించనున్నాయి. తమ కస్టమర్లు కొనుగోలు సమయంలో వాహనం విలువలో 95 శాతం వరకు రుణాలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారని, 2-3 సంవత్సరాల పాటు చెల్లించుకునేందుకు అవకాశం ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఫైనాన్సింగ్ సదుపాయం అందుబాటులో ఉండడం వల్ల వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయడం సులభతరం అవుతుందన్నారు. దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఈ రంగంలో గత ఏడాది 20 శాతం వృద్ది రేటును నమోదు చేసిందని కంపెనీ పేర్కొంది. తమ వినియోగదారులకు కొనుగోలును సులభతరం చేయడమే లక్ష్యంగా సంస్థ పెట్టుకున్నట్లు తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులు కొత్త ఖాతాదారులకు(క్రెడిట్ హిస్టరీ లేనివారికి) రుణాలను అందిస్తున్నాయి, వీరి వాటా మొత్తం సంఖ్యలో 20-25 శాతం వాటాను కలిగి ఉంది. క్రెడిట్ హిస్టరీ లేనివారికి రుణాలు కాగా, టైర్-2, టైర్-3 నగరాల్లో విస్తరణ దృష్ట్యా ఎలాంటి క్రెడిట్ హిస్టరీ లేని కస్టమర్లకు వాహన రుణాలు అందించడం చాలా ముఖ్యమని ఏథర్ ఎనర్జీ పేర్కొంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడంతో వినియోగదారులకు రుణ సదుపాయం సులభతరం అవుతుంది. భారతదేశంలో విక్రయించే 10 వాహనాల్లో 8 ద్విచక్ర వాహనాలను ఫైనాన్స్ రూపంలో తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. భారతదేశంలో ద్విచక్ర వాహన రంగంలో ఫైనాన్స్ రుణాలు 50 శాతానికి దగ్గరగా ఉందని అథర్ ఎనర్జీ తెలిపింది. 2025 నాటికి దేశీయ ద్విచక్ర వాహన లోన్ మార్కెట్ విలువ 12.3 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తాజా నివేదిక తెలిపింది. (చదవండి: ఎల్ఐసీ పాలసీదారులకు అలర్ట్..! ఇదే చివరి అవకాశం..!) -
ఆపిల్ తయారీ కంపెనీతో జట్టు కట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ..!
స్వదేశీ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఎథర్ ఎనర్జీ తన ఎథర్ 450 ఎక్స్, ఎథర్ 450 ప్లస్ స్కూటర్లకి చెందిన కీలక భాగాలను తయారు చేయడానికి ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ సంస్థ సబ్సిడరీ భారత్ ఎఫ్ఐహెచ్'తో భాగస్వామ్యం ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. ఎథర్ ఎనర్జీ నేడు చేసిన ఒక ప్రకటనలో.. దేశీయంగా ఏర్పడుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల డిమాండ్ కొరతను తీర్చడానికి ఈ భాగస్వామ్యం ఒప్పందం సంస్థకు సహకరిస్తుందని తెలిపింది. ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ దేశీయంగా ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్'లను అసెంబ్లింగ్ చేస్తుంది. భారత్ ఎఫ్ఐహెచ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జోష్ ఫౌల్గర్ మాట్లాడుతూ.. "భారతదేశంలో వారి ఎలక్ట్రిక్ వాహన ప్రయాణానికి మద్దతు ఇవ్వడంలో ఎథర్ ఎనర్జీతో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో మంచి పేరు గల సంస్థలో అంతర్భాగం కావడంతో మా ఎలక్ట్రానిక్స్ తయారీ సేవలు, సాంకేతిక నైపుణ్యాన్ని విస్తరించడానికి మేము ఎదురు చూస్తున్నాము" అని ఆయన అన్నారు. బ్యాటరీ మేనేజ్ మెంట్ సిస్టమ్, డ్యాష్ బోర్డ్ అసెంబ్లీ, పెరిఫెరల్ కంట్రోల్ యూనిట్, డ్రైవ్ కంట్రోల్ మాడ్యూల్స్ కోసం ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్(పీసీబీ) అసెంబ్లీలు వంటి వాటిని భారత్ ఎఫ్ఐహెచ్ తయారు చేస్తుంది. భారత్ ఎఫ్ఐహెచ్ ఈ ఉత్పత్తులను ఎథర్ ఎనర్జీ కోసం 'టర్న్ కీ' మోడల్'పై తయారు చేస్తుంది. వారి ఫెసిలిటీ వద్ద ఎథర్ స్కూటర్ల కోసం విడిభాగాల ఉత్పత్తిని ప్రారంభించింది. ఎథర్ ఎనర్జీ ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో దూసుకెళ్తుంది. గత ఏడాది అమ్మకాల్లో 20 శాతం వృద్దిని నమోదు చేసింది. ఎథర్ ఎనర్జీ దాదాపు 99 శాతం ఉత్పత్తులు దేశీయంగా తయారు చేస్తుంది. దీర్ఘకాలిక డిమాండ్ దృష్టిలో ఉంచుకొని ఎథర్ ఎనర్జీ తన హోసూర్ ఫెసిలిటీని సంవత్సరానికి 120,000 నుంచి 400,000 యూనిట్ల సామర్ధ్యానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. (చదవండి: దయచేసి క్రిప్టోకరెన్సీలు విరాళం ఇవ్వండి: ఉక్రెయిన్ పోలీసులు) -
ప్రముఖ ఐపీఎల్ జట్టుతో అథర్ ఎనర్జీ ఈవీ కంపెనీ కీలక ఒప్పందం..!
అహ్మదాబాద్: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ అథర్ ఎనర్జీ, కొత్త ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అహ్మదాబాద్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ జట్టుతో కీలక ఒప్పందం చేసుకుంది. గుజరాత్ టైటాన్స్ జట్టు తమ ప్రధాన భాగస్వామిగా అథర్ ఎనర్జీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. వ్యూహాత్మక భాగస్వామ్యం ఒప్పందంలో భాగంగా తొలిసారి ఐపీఎల్లో పాల్గొంటున్న గుజరాత్ టైటాన్స్ అధికారిక జట్టు జెర్సీల మీద అథర్ ఎనర్జీ బ్రాండ్ పేరు కనిపించనుంది. అథర్ ఎనర్జీ సంస్థ దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 24 నగరాల్లో తన ఉనికిని చాటింది. రాబోయే 12 నెలల్లో 100కు పైగా నగరాల్లో విస్తరించాలని భావిస్తుంది. 2013లో మద్రాస్ పూర్వ విద్యార్థులు తరుణ్ మెహతా, స్వప్నిల్ జైన్ స్థాపించిన అథర్ ఎనర్జీ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగంలో తన ప్రత్యేకతను చాటుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ అనుగుణంగా అథర్ ఎనర్జీ దేశవ్యాప్తంగా సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. ప్రస్తుతం, కంపెనీ భారతదేశం అంతటా 30 రిటైల్ అవుట్ లెట్లు కలిగి ఉంది. మార్చి 2023 నాటికి, 100 నగరాల్లో 150 అనుభవ కేంద్రాలను ప్రారంభించాలని యోచిస్తోంది. అథర్ ఎనర్జీ అత్యంత పోటీ ఉన్న ఆటోమోటివ్ రంగంలో తన పంత ఎంతో నిరూపిస్తుంది. ఐపీఎల్లో ఇతర జట్లకు యువ జట్టు గుజరాత్ టైటాన్స్ పోటీ ఇస్తుందని సంస్థ పేర్కొంది.గుజరాత్ టైటాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం ఒప్పందంలో భాగంగా అథర్ ఎనర్జీ దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. (చదవండి: ఎలాన్ మస్క్ భారీ విరాళం.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రపంచ కుబేరుడు..!) -
ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు దారులకు భారీ షాక్, రూపాయి ధర కాస్త రూ.5 వేలకు పెరిగింది
దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్స్ సంస్థ అథర్ ఎనర్జీ వాహనదారులకు భారీ షాకిచ్చింది. ముడి సరుకుల ధరల పెరుగుదల, లాజిస్టిక్స్ సవాళ్ల నేపథ్యంలో వెహికల్స్ ధరల్ని పెంచతున్నట్లు ప్రకటించింది. ఆటో మొబైల్ మార్కెట్లో ఇతర సంస్థలు ఆయా వెహికల్స్ ధరల్ని పెంచుకుంటూ పోతే ఒక్క అథర్ ఎనర్జీ మాత్రం ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై భారీ తగ్గింపు ప్రకటించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కోవిడ్ కారణంగా ముడిసరుకులు పెరగడంతో పాటు ఇతర కారణాల వల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరల్ని పెంచుతున్నట్లు తెలిపింది. అయితే ఈ పెరుగుదల డైరెక్ట్‌గా కాకుండా..వెహికల్స్‌కి ఛార్జింగ్ పెట్టుకునే ఛార్జర్ ధరల్ని పెంచినట్లు చెప్పింది. వాస్తవానికి అథర్ ఎనర్జీ డాట్ పోర్టబుల్ ఛార్జర్ ధర రూపాయి మాత్రమే ఉండగా.. ఆ ధర కాస్త ఇప్పుడు రూ.5,475కు పెరగడం గమనార్హం. అథర్ ఎనర్జీ అథర్ ఎనర్జీ 'అథర్ ఎనర్జీ 450 ప్లస్, అథర్ 450 ఎక్స్' రెండు వేరియంట్ల స్కూటర్లపై అమ్మకాలు జరుపుతుంది. బెంగళూరులో అథర్ ఎనర్జీ 450 ప్లస్ రూ. 1.31 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండగా, అథర్ ఎనర్జీ 450 ఎక్స్ ధర రూ. 1.5 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ స్కూటర్ల ధరలు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. ప్రతి రాష్ట్రంలో అందించే ఎలక్ట్రిక్ వెహికల్ సబ్సిడీలను బట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు మారిపోతుంటాయి. కాగా, గత ఏడాది నవంబర్‌లో అథర్ ఎనర్జీ హోసూర్ కేంద్రంగా తన రెండవ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఉత్పత్తిని పెంచుతున్నట్లు ప్రకటించింది. రెండో యూనిట్ అందుబాటులోకి వస్తే ఈ ఏడాది చివరి నాటికి సంస్థ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రస్తుత 1.20 లక్షల యూనిట్ల నుండి సంవత్సరానికి 4-లక్షల వాహనాలకు విస్తరిస్తుందని ఆథర్ ఎనర్జీ ప్రతినిధులు తెలిపారు. పెద్ద సంస్థలు.. భారీ పెట్టుబడులు 2013లో బెంగళూరు కేంద్రంగా తరుణ్ మెహతా, స్వప్నిల్ జైన్ లు ఎలక్ట్రిక్ వెహికల్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థలో హీరో మోటోకార్ప్, టైగర్ గ్లోబల్, ఫ్లిప్‌కార్ట్ కోఫౌండర్ సచిన్ బన్సల్‌లు భారీ పెట్టుబుడులు పెట్టారు. బెంగుళూరు కేంద్రంగా అథర్ ఎనర్జీ సంస్థను ప్రారంభించగా.. ఆ సంస్థ వెహికల్స్ కొనుగోళ్లు పెరగడంతో ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుతుంది. ఇందుకోసం వచ్చే 5ఏళ్లలో రూ.650 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆథర్ ఎనర్జీ సీఈఓ తరుణ్ మెహతా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. చదవండి: ఒక్క కారు ధర రూ.3.50 కోట్లు..ఐనా సరే కొనాల్సిందే ! -
ఓలాకు గట్టిపోటీ..! భారీ ప్రణాళికతో ఏథర్..!
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. ఓలా లాంటి కంపెనీల రాకతో ఎలక్ట్రిక్ వాహనాల బూమ్ మరింత ఎక్కువైంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లో ఓలాకు గట్టిపోటీ ఇచ్చేందుకుగాను ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీదారు ఏథర్ ఎనర్జీ సిద్దమైంది. తమిళనాడులో హోసూర్‌లో రెండో ప్లాంట్‌ను ఏర్పాటుచేసుందుకు ప్రణాళికలు రచిస్తోన్నట్లు తెలుస్తోంది. ఏడాదిలో 4 లక్షల యూనిట్స్..! దేశవ్యాప్తంగా ఏథర్ 450 ప్లస్, 450ఎక్స్ అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను ఏథర్ ప్రవేశపెట్టింది. ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ ఎక్కువగా పెరగడంతో...ప్రస్తుతం కంపెనీ చేస్తోన్న వార్షిక ఉత్పత్తిని 120,000 యూనిట్ల నుంచి 400,000 యూనిట్లకు విస్తరించనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. భారీగా పెరిగిన అమ్మకాలు..! గత ఏడాదిలో పోలిస్తే 12 రెట్లు అధికంగా అమ్మకాలను నమోదు చేసినట్లు ఏథర్ వెల్లడించింది. నవంబర్ 2020 నుంచి ఏథర్ అమ్మకాలు నెలవారీగా సగటున 20 శాతం మేర పెరిగాయి. 2021 ఏప్రిల్, అక్టోబర్ మధ్య వాక్-ఇన్ కస్టమర్లు, వెబ్ ఎంక్వైరీలు, టెస్ట్ రైడ్లలో మూడు రెట్ల అధికంగా పెరిగినట్లు ఏథర్ పేర్కొంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్ సంఖ్యలు నాలుగు రెట్లు పెరిగాయి. చదవండి: ట్విటర్ ఒక్కటే కాదు.. ఈ దిగ్గజ కంపెనీల కూడా భారతీయులే సీఈఓలు..! -
ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాలకు అడ్డాగా భారత్.. లక్షల కోట్ల బిజినెస్!
బెంగళూరు: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రముఖ మార్కెట్‌గా మారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ 2030 నాటికి 200 బిలియన్ డాలర్ల(సుమారు రూ.14 లక్షల కోట్ల)కు పైగా చేరుకోవచ్చు. పునరుత్పాదక ఇంధనం, ఛార్జింగ్ స్టేషన్లు & దాని సరఫరా గొలుసును బలోపేతం చేయడం వల్ల ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాలకు భారత్ ఒక కేంద్రంగా మారే అవకాశం ఉన్నట్లు ఈ రంగంలోని ఎలక్ట్రిక్ వాహన తయారీదారులు, నిపుణులు తెలిపారు. భారతదేశంలో ఈవీ తయారీదారుల సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతుంది. ఈవీ మొబిలిటీ మార్కెట్ కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతోంది. ఇండియా ఎనర్జీ స్టోరేజీ అలయన్స్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో ఈవీ మార్కెట్ 2026 వరకు 36 శాతం పెరిగే అవకాశం ఉంది. అలాగే, ఈవీ బ్యాటరీ మార్కెట్ ఇదే కాలంలో 30 శాతం వరకు విస్తరిస్తుంది. బెంగళూరు టెక్ సమ్మిట్ (బిటిఎస్ 2021)లో మెహర్ ఎనర్జీ వెంచర్స్ సీఈఓ ముస్తఫా వాజిద్ మాట్లాడుతూ.. "సరఫరా గొలుసు వ్యవస్థను ఇంకా అభివృద్ధి పరచాలి. ఎలక్ట్రిక్ వాహనాలకు భారతదేశం అతిపెద్ద మార్కెట్, ప్రపంచవ్యాప్తంగా తేలికపాటి వాహన పరిశ్రమకు కేంద్రంగా కూడా ఉంటుంది. మనకు ఇందులో బిలియన్ డాలర్ల అవకాశం ఉంది" అని అన్నారు. (చదవండి: Multibagger: రూ.లక్షతో రూ.6.5కోట్లు లాభం.. కళ్లుచెదిరే రాబడి!) దేశం పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 100 జీడబ్ల్యుగా ఉందని, దీనిని 2030 నాటికి 400 జీడబ్ల్యుకి పెంచాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. రాబోయే రెండేళ్లలో ఐపీఓ కోసం ప్లాన్ చేస్తున్న అథర్ ఎనర్జీ 20ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. ఓఈఎంలు(ఒరిజినల్ ఎక్విప్ మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్) సప్లై ఛైయిన్ సామర్ధ్యం చాలా బలంగా ఉందని, అయితే దురదృష్టవశాత్తు సప్లై ఛైయిన్ లో చాలా వరకు వెనుకబడి ఉన్నట్లు అథర్ ఎనర్జీ కో ఫౌండర్, సీఈఓ తరుణ్ మెహతా తెలిపారు. "చైనాతో పోలిస్తే భారతదేశంలో కొత్త డిజైన్ ప్రవేశపెట్టడానికి సగటున 5-6 రెట్లు ఎక్కువ సమయం పడుతుంది" అని ఆయన అన్నారు. -
గ్రిడ్ 2.0 ఈవీ స్టేషన్స్ లాంచ్ చేసిన అథర్ ఎనర్జీ
ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ అథర్ ఎనర్జీ నేడు(అక్టోబర్ 31) తర్వాతి తరం ఎలక్ట్రిక్ వేహికల్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ లాంచ్ చేసినట్లు ప్రకటించింది. దీనిని అథర్ గ్రిడ్ 2.0 పేరుతో పిలుస్తున్నారు. ఈ కొత్త తరం ఫాస్ట్ ఛార్జింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ నెట్ వర్క్ ఓవర్ ది ఎయిర్(ఓటిఏ) వంటి ఆధునాతన ఫీచర్లతో పనిచేయనుంది. అథర్ ఎనర్జీ ఇప్పటికే బెంగళూరు, చెన్నైలో ఈ కొత్త ఫాస్ట్ ఛార్జింగ్ నెట్ వర్క్‌ను ఇన్ స్టాల్ చేయడం ప్రారంభించింది. త్వరలో దేశంలోని ఇతర నగరాల్లో కూడా వీటిని లాంచ్ చేయనుంది. కంపెనీ ప్రస్తుత ఛార్జింగ్ గ్రిడ్లతో పోలిస్తే కొత్త జెనెరేషన్ పబ్లిక్ ఛార్జింగ్ నెట్ వర్క్ వేగంగా చార్జ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అథర్ గ్రిడ్ 2.0ను అన్నీ వాతావరణ పరిస్థితులకు తట్టుకునే విధంగా నిర్మించినట్లు సంస్థ తెలిపింది. ఈ గ్రిడ్ 2.0 అన్ని వేళలా అందుబాటులో ఉంటుంది. తద్వారా అన్ని నగరాల్లో అన్ని ఛార్జింగ్ లొకేషన్ల రియల్ టైమ్ వివరాలు అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ ఎలక్ట్రిక్ వేహికల్ పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై దృష్టి సారించింది. దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ల కోసం అతిపెద్ద ఫాస్ట్ ఛార్జింగ్ నెట్ వర్క్ ఏర్పాటు చేసింది. అథర్ గ్రిడ్ ఛార్జింగ్ నెట్ వర్క్ ప్రస్తుతం 215కి పైగా ప్రదేశాలలో, 21 నగరాల్లో విస్తరించి ఉంది. కంపెనీ 2022 చివరి నాటికి మరో 500 నగరాల్లో ఛార్జింగ్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. That's right! Our all new Ather Grid 2.0 charging points will start rolling out across all cities. Check it out when you see one ⚡ https://t.co/zwW6gnWy73 — Ather Energy (@atherenergy) October 31, 2021 (చదవండి: వారం రోజుల్లో సుమారు రెండున్నర లక్షల కోట్లు ఖతమ్..!) -
ఈవీ ఛార్జింగ్ కష్టాలకు చెక్.. 15 నిమిషాల్లో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జ్!
ఈవీ కంపెనీలు తమ కస్టమర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాయి. ఎలక్ట్రిక్ వేహికల్(ఈవీ) కంపెనీలు కొన్ని సంవత్సరాల క్రితం వరకు మైలేజీ సమస్యపై దృష్టి సారించి ఆ సమస్యను పరిష్కరించాయి. అయితే, ఇప్పుడు ఈవీ కొనుగోలుదారులు ప్రధానంగా ఎదుర్కొంటున్న ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సమస్యలపై ఫోకస్ పెట్టాయి. బెంగళూరుకు చెందిన స్టార్టప్ ఎక్స్ పోనెంట్ ఎనర్జీ ఈ సమస్యకు సమాధానం కనుగొన్నట్లు పేర్కొంది. ఎక్స్ పోనెంట్ ఎనర్జీ తన టెక్నాలజీ కేవలం 5-15 నిమిషాల్లో ఏదైనా వాణిజ్య ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీని సున్నా నుంచి 100 శాతానికి చార్జ్ చేయగలదని పేర్కొంది. ఈవీ స్టార్టప్ అథర్ ఎనర్జీలో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ గా పనిచేసిన స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు అరుణ్ వినాయక్ ప్రకారం.. ఈ టెక్నాలజీకి ప్రత్యేక బ్యాటరీలు కూడా అవసరం లేదు. నేడు ఉపయోగించే రెగ్యులర్ లిథియం-అయాన్, ఇతర సాధారణ బ్యాటరీ రకాలకు ఈ టెక్నాలజీ అనుకూలంగా ఉంది. భారతదేశం అంతటా ఛార్జ్ పాయింట్ ఆపరేటర్లు (సీపీఓలు) నడుపుతున్న ఈవీ తయారీదారులు, కంపెనీలతో ఎక్స్ పోనెంట్ కలిసి పనిచేయనున్నట్లు ఈవీ స్టార్టప్ అథర్ ఎనర్జీ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్(సీపీఓ) వినాయక్ చెప్పారు. (చదవండి: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త!) "ఈవిలు పర్యావరణ హితం అని చెప్పడం సమంజసం, కానీ ఛార్జింగ్ సమస్య కారణంగా ఎక్కువగా కొనుగోళ్లు జరగడం లేదు" అని వినాయక్ చెప్పారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఎక్స్ పోనెంట్ ఎనర్జీ కొత్తగా ఫ్లెక్సిబుల్ ఎనర్జీ స్టాక్ అని పిలిచే కొత్త టెక్నాలజీ అభివృద్ధి చేసింది. ఇది ఎలక్ట్రిక్ వాహనలను వేగంగా చార్జ్ చేయడానికి ఉద్దేశించిన హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ కలయిక. కంపెనీ ఒక యాజమాన్య బ్యాటరీ నిర్వహణ వ్యవస్థను(బిఎమ్ఎస్) రూపొందించింది. ఇది బ్యాటరీ ప్యాక్ ఏవిధంగా ఛార్జ్ చేయబడుతోంది, ఆ ప్యాక్ లోని విభిన్న కణాల ఆరోగ్యం ఏమిటి మొదలైనవాటిని బిఎమ్ఎస్ మానిటర్ చేస్తుంది. ఈ రోజు మార్కెట్లో ఉన్న ఏ బిఎమ్ఎస్ కంటే ఎక్స్ పోనెంట్ బిఎమ్ఎస్ 10 రెట్లు ఖచ్చితమైనదని ఆయన పేర్కొన్నారు. ఈవీ బ్యాటరీలో లోపల వేలాది కణాలు ఉంటాయి, వేహికల్ పవర్ సోర్స్ కనెక్ట్ చేసినప్పుడు ఇది విభిన్న స్థాయిల్లో ఛార్జ్ కావొచ్చు. ఎక్స్ పోనెంట్స్ బిఎమ్ఎస్ దాని ఆరోగ్యంతో సహా మొత్తం బ్యాటరీ ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకుంటుంది. ఇది బ్యాటరీల కోసం కస్టమైజ్డ్ ఛార్జింగ్ ప్రొఫైల్స్ ను కూడా సృష్టిస్తుంది, ఇది ఛార్జింగ్ చేసేటప్పుడు దానికి ప్రవహించే విద్యుత్ ను మాడ్యులేట్ చేసుకొని దాని ఆధారంగా వాహనాన్ని చార్జ్ చేస్తుంది అని అన్నారు.(చదవండి: 11 ఏళ్లకు అంతా ఉల్టా పల్టా? ఫేస్బుక్ డిలీట్ అంటూ కవర్ పేజీ) -
'అథర్' ఎలక్ట్రిక్ స్కూటర్ బంపర్ ఆఫర్.. ఏ స్కూటర్‌కైనా ఛార్జింగ్ ఫ్రీ
ఎలక్ట్రిక్ వాహనదారులకు 'అథర్ ఎనర్జీ' బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఎలక్ట్రిక్ వాహనదారులకు తగినంతగా ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే వారి సమస్యకు చెక్ పెట్టేలా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉచితగా ఛార్జింగ్ సర్వీస్‌ను పొడిగిస్తున్నట్లు అథర్ ఎనర్జీ సీఈఓ తరుణ్ మెహతా ప్రకటించారు. అంతేకాదు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య ను 500పెచేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. బెంగళూరు కేంద్రంగా అథర్ ఎనర్జీ 450 ఎక్స్, 450 ఎక్స్ ప్లస్ ఎలక్ట్రికల్ స్కూటర్ల (ఈవీ) అమ్మకాల్ని ముమ్మరం చేసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈవీలపై ఇస్తున్న సబ్సీడీ ఆధారంగా వెహికల్ ధరల్ని తగ్గిస్తుంది. పనిలో పనిగా అథర్ గ్రిడ్ పేరుతో అందిస్తున్న ఉచిత ఛార్జింగ్ సర్వీస్‌ను ఈ ఏడాది డిసెంబర్ వరకు పొడిగిస్తున్నట్లు తరుణ మెహతా వెల్లడించారు.ఈ గ్రిడ్ లోకేషన్లలో అథర్ సంస్థతో పాటు ఇతర కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉచితంగా ఛార్జింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు అథర్ ప్రకటించింది. ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాట్లు ఎలక్ట్రిక్ వాహనదారులు ఛార్జింగ్ పాయింట్లను వినియోగిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో వాహనదారుల అవసరాన్ని బట్టి ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు అథర్ సీఈఓ తెలిపారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఉన్న 24 ప్రధాన నగరాల్లో 200 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పినట్లు, 2022 మార్చి నాటికి ఆ సంఖ్యను 500 పెంచనున్నారు. ప్రతి నెల 45 కొత్త ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు తగ్గకుండా ఉండేలా చూసుకుంటున్నట్లు అథర్ ఎనర్జీ సీఈఓ తరుణ మెహతా అన్నారు. చదవండి: కొత్త చట్టం, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్లు ఉండేలా ఇళ్లను నిర్మించాలి.. -
అథర్ బంపర్ ఆఫర్.. ఏ స్కూటర్‌కైనా ఛార్జింగ్ ఫ్రీ
ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్తు అంటూ ఇటు ప్రభుత్వం నుంచి అటు అటోమొబైల్ ఇండస్ట్రీ వరకు ప్రకటనలు గుప్పిస్తోన్నారు. అయితే ఈవీలకు సంబంధించి ఛార్జింగ్ పాయింట్ సమస్యను తీర్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. తాజాగా గ్రిడ్ లోకేషన్ పేరుతో ఛార్జింగ్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ముందుకు వచ్చింది అథర్ సంస్థ. గ్రిడ్ లోకేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ స్టార్టప్ అథర్ సంస్థ 450 , 450 ఎక్స్ పేరుతో రెండు స్కూటర్లను మార్కెట్లో రిలీజ్ చేసింది. తొలుత బెంగళూరు, చెన్నైలో మొదలైన స్కూటర్ల అమ్మకాలు ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, పూనే, అహ్మదాబాద్ ఇలా మొత్తం పదమూడు నగరాల్లో స్కూటర్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఇంటి దగ్గర ఛార్జింగ్ పాయింట్స్ కాకుండా ఈ స్కూటర్లు బయట ఛార్జింగ్ చేసుకునేందుకు వీలుగా గ్రిడ్ లోకేషన్ పేరుతో ఛార్జింగ్ పాయింట్లను అథర్ ఏర్పాటు చేసింది. డబుల్ సెంచరీ క్రాస్ బెంగళూరులో పది, చెన్నైలో మూడింటితో గ్రిడ్ లోకేషన్ ఛార్జింగ్ పాయింట్లను అథర్ ప్రారంభించింది. ఆ తర్వాత ఒక్కో నగరంలో ఈ పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లను పెంచుకుంటూ పోయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పది వరకు గ్రిడ్ లోకేషన్ పాయింట్లు ఉన్నాయి. తాజాగా దేశ వ్యాప్తంగా డబుల్ సెంచరీ మార్కుని అథర్ అందుకుంది. బంపర్ ఆఫర్ ఇప్పటి వరకు అథర్ ఛార్జింగ్ స్టేషన్లలో కేవలం ఈ కంపెనీకి చెందిన 450 సిరీస్ స్కూటర్ల ఛార్జింగ్‌కే అవకాశం ఉండేంది. అయితే తాజాగా 200ల గ్రిడ్ లోకేషన్ (పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్)ను దాటిన శుభసందర్భంలో అథర్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ గ్రిడ్ లోకేషన్లలో అథర్ సంస్థతో పాటు ఇతర కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉచితంగా ఛార్జింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు అథర్ ప్రకటించింది. 2021 డిసెంబరు 31 వరకు ఈ ఉచిత సౌకర్యం వినియోగించుకోవచ్చని అథర్ ట్వీట్టర్లో తెలిపింది. We just crossed 200 Ather Grid locations! 🥳 If this tweet gets 200 RTs, we'll offer free charging on all Ather Grids until December 31st, 2021. pic.twitter.com/csgKHjUeEU — Ather Energy (@atherenergy) September 17, 2021 విస్తరణ బాటలో గ్రిడ్ లోకేషన్ ఛార్జింగ్ పాయింట్లను కస్టమర్లకు అనువుగా ఉండేలా ఆఫీసులు, పబ్లిక్ పార్కులు, కేఫేలు, మాల్స్‌లలో అథర్ సంస్థ ఏర్పాటు చేస్తోంది. ప్రతీ నెల 45 కొత్త గ్రిడ్లు ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా 500 గ్రిడ్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అథర్ స్కూటర్లు లభించే నగరాల్లో ప్రతీ నాలుగు కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేయబోతున్నట్టు ఆ కంపనీ ప్రతినిధులు తెలిపారు. ఈ ఛార్జింగ్ పాయింట్లో ఒక నిమిషం పాటు ఛార్జింగ్ చేస్తే 1.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించే అవకాశం ఉంది. చదవండి : ఇకపై ఈజీగా ఎలక్ట్రిక్ వెహికల్‌ను సొంతం చేసుకోవచ్చు!