బెంగళూరు బేస్డ్ కంపెనీ అయిన 'ఏథర్ ఎనర్జీ' (Ather Energy) ఇప్పటికే ఏథర్ 450, 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే వీటి ధరలు రూ. లక్ష కంటే ఎక్కువ కావడం వల్ల చాలా మంది కొనుగోలు చేయడానికి కొంత వెనుకాడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ మార్కెట్లో మరో సరికొత్త సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఏథర్ ఎనర్జీ మార్కెట్లో విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు '450ఎస్' (450S) అని తెలుస్తోంది. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న కంపెనీ స్కూటర్ల కంటే తక్కువ ధరకే లభిస్తాయి. అంతే కాకుండా ఈ స్కూటర్ మార్కెట్లో 'ఓలా ఎస్1 ఎయిర్'కి ప్రధాన ప్రత్యర్థిగా నిలుస్తుందని భావిస్తున్నారు.
ఏథర్ 450S ఎలక్ట్రిక్ స్కూటర్ 2023 చివరి నాటికి మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అంతే కాకుండా ట్రేడ్‌మార్క్ కోసం కంపెనీ గత మార్చిలో అప్లై కూడా చేసింది. ఈ స్కూటర్ డిజైన్, ఫీచర్స్, ఇతర వివరాలను గురించి కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు. కానీ ఇది చూడటానికి దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటుందని భావించవచ్చు.
(ఇదీ చదవండి: దీపికా పదుకొణె ట్విటర్ అకౌంట్ పోతుందా? ఎలాన్ మస్క్ కొత్త రూల్ ఏం చెబుతోందంటే?)
త్వరలో విడుదల కానున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ దాని మునుపటి మోడల్స్ కంటే తక్కువ ఫీచర్స్ కలిగి ఉండే అవకాశం ఉంది. కావున ఇందులో 7 ఇంచెస్TFT టచ్‌స్క్రీన్, ఆటో హోల్డ్, రైడింగ్ మోడ్ వంటి ఫీచర్స్ బహుశా లభించకపోవచ్చు. అంతే కాకుండా రేంజ్ కూడా కొంత తక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఈ స్కూటర్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment