దేశీయ మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉత్తమ అమ్మకాలు పొందుతున్న 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric), ఈ ఏడాది ఏకంగా రూ. 1472.08 కోట్ల నష్టాన్ని పొందినట్లు సమాచారం. ఈ ఏడాది ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిన కంపెనీల జాబితాలో ఒకటిగా ఉన్నప్పటికీ.. నష్టాలను ఎందుకో పొందాల్సి వచ్చింది, అసలైన కారణాలు ఏంటనేది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఉత్పత్తి, విక్రయాల విస్తరణ కారణంగా.. నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 784.15 కోట్ల నష్టాన్ని చవి చూసిన కంపెనీ, ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 1472.08 కోట్లు నష్టపోయినట్లు సమాచారం.
ఓలా ఎలక్ట్రిక్ గత ఆర్ధిక సంవత్సరం కంటే, ఈ ఆర్ధిక సంవత్సరంలో రెట్టింపు నష్టాన్ని చవి చూసినప్పటికీ.. అమ్మకాల పరంగా ఈ ఏడాది 2.5 లక్షల యూనిట్లను విక్రయించినట్లు ఇటీవలే వెల్లడించింది. ఈ అమ్మకాలు 2023 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ మధ్య జరిగినట్లు సమాచారం.
ఇదీ చదవండి: ఒకప్పుడు పాములు, తేళ్లు తిరిగే కంపెనీ.. టాటా చేతిలో పడ్డాక..
అమ్మకాల పరంగా కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ఓలా ఎలక్ట్రిక్.. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‌లో ఎస్1, ఎస్1 ప్రో, ఎస్1 ఎక్స్ వంటి మోడళ్లను విక్రయిస్తోంది. వచ్చే ఏడాది చివరి నాటికి కంపెనీ ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది. అంతే కాకుండా.. ఓలా ఎలక్ట్రిక్ దాని అనుబంధ సంస్థ ఓలా సెల్ టెక్నాలజీస్ ద్వారా తమిళనాడులో గిగాఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది. ఫ్యాక్టరీ మార్చి 2024 నాటికి 1.4 GWh సామర్థ్యంతో సెల్ ఉత్పత్తిని ప్రారంభించాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment