Ola Electric
-
ఓలా ఎలక్ట్రిక్ 'నష్ట' కష్టాలు..
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన(ఈ2డబ్ల్యూ) కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ (Ola Electric) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(Q3)లో నికర నష్టం భారీగా పెరిగి రూ. 564 కోట్లకు చేరింది. ఆదాయం నీరసించడం, తీవ్రతర పోటీ, సర్వీస్ సవాళ్లతో పెరిగిన వ్యయాలు ప్రభావం చూపాయి.గతేడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 376 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,296 కోట్ల నుంచి రూ. 1,045 కోట్లకు క్షీణించింది. మొత్తం వ్యయాలు రూ. 1,597 కోట్ల నుంచి రూ. 1,505 కోట్లకు తగ్గాయి. ఈ కాలంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 3.33 లక్షల యూనిట్ల ఈ2డబ్ల్యూ రిజిస్ట్రేషన్లు నమోదైనట్లు ఓలా వెల్లడించింది. గతేడాది క్యూ3తో పోలిస్తే ఇవి 37 శాతంపైగా అధికమని తెలియజేసింది. సర్వీసింగ్ సమస్యల పరిష్కారానికి రూ. 110 కోట్లు వెచ్చించినట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో ఓలా షేరు ఎన్ఎస్ఈలో 2.4 శాతం నీరసించి రూ. 70 వద్ద ముగిసింది.ఎంఅండ్ఎం లాభం స్పీడ్ఆటో రంగ దేశీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 20 శాతం జంప్‌చేసి రూ. 3,181 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో రూ. 2,658 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతం ఎగసి రూ. 41,470 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 35,299 కోట్ల టర్నోవర్ నమోదైంది.ఆటో విభాగంలో అమ్మకాలు 16 శాతం పుంజుకుని 2,45,000కు చేరగా.. యూవీ విక్రయాలు 1,42,000 యూనిట్లను తాకాయి. ఈ విభాగం ఆదాయం 21 శాతం జంప్‌చేసి రూ. 23,391 కోట్లకు చేరింది. నికర లాభం 20 శాతం బలపడి రూ. 1,438 కోట్లయ్యింది. వ్యవసాయ పరికరాల విభాగం నికర లాభం 11 శాతం పుంజుకుని రూ. 996 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో ఎంఅండ్ఎం షేరు ఎన్ఎస్ఈలో 1.7 శాతం లాభంతో రూ. 3,193 వద్ద ముగిసింది. -
ఓలా ఈ–బైక్ 501 కిలోమీటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఓలా ఎలక్ట్రిక్ తాజాగా రోడ్‌స్టర్ ఎక్స్ సిరీస్‌తో మోటార్‌సైకిల్స్ విభాగంలోకి ప్రవేశించింది. రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ మోడళ్లను ఆవిష్కరించింది. ధర రూ.74,999 నుంచి ప్రారంభమై రూ.1,54,999 వరకు ఉంది. వాహనం పరుగెడుతున్నప్పుడు కూడా చార్జింగ్ అవుతుంది. ఐపీ67 రేటెడ్ బ్యాటరీ, స్మార్ట్ కనెక్టివిటీతో 4.3 అంగుళాల ఎల్సీడీ, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రివర్స్ మోడ్ వంటి ఏర్పాటు ఉంది. గరిష్ట పవర్ 7–11 కిలోవాట్ ఉంది. నిర్వహణ వ్యయం రూ.500.. రోడ్‌స్టర్ ఎక్స్ సిరీస్‌లో వేరియంట్‌నుబట్టి 2.5–4.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్‌తో 140–252 కిలోమీటర్లు పరిగెడుతుంది. గరిష్ట వేగం గంటకు 105–118 కిలోమీటర్లు. రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ సిరీస్‌లో 4.5–9.1 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. ఒకసారి చార్జింగ్‌తో 252–501 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గరిష్ట వేగం గంటకు 125 కిలోమీటర్లు. నెలవారీ నిర్వహణ వ్యయం పెట్రోల్ బైక్‌కు రూ.4,000 అయితే రోడ్‌స్టర్ ఎక్స్‌తో రూ.500 మాత్రమేనని ఓలా తెలిపింది. మార్చిలో డెలివరీలు ఉంటాయి. మరో రెండు మోడల్స్.. రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ప్రో మోడల్స్‌లో సైతం కంపెనీ పలు వేరియంట్లను రూపొందిస్తోంది. రోడ్‌స్టర్‌లో 3.5–6 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉంది. ఒకసారి చార్జింగ్‌తో 151–248 కి.మీ. ప్రయాణిస్తాయి. గరిష్ట వేగం గంటకు 116–126 కిలోమీటర్లు. ధర రూ.1,04,999 నుంచి రూ.1,39,999 వరకు ఉంది. అలాగే రోడ్‌స్టర్ ప్రో సిరీస్‌లో 8–16 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్‌తో 316–579 కిలోమీటర్లు పరుగు తీస్తాయి. గరిష్ట వేగం గంటకు 154–194 కిలోమీటర్లు. ధర రూ.1,99,999 నుంచి రూ.2,49,999 వరకు ఉంది. డెలివరీలు 2026 జనవరి నుంచి మొదలవుతాయి. -
ఓలాకు బజాజ్ గట్టి దెబ్బ
ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓలా ఎలక్ట్రిక్‌కు (Ola Electric) బజాజ్ (Bajaj Auto) గట్టి దెబ్బ కొట్టింది. 2024 డిసెంబర్లో ఓలా ఎలక్ట్రిక్‌ని అధిగమించి ఎలక్ట్రిక్ టూ-వీలర్ (Electric Two-Wheeler) మార్కెట్లో కొత్త లీడర్‌గా అవతరించింది. వాహన్ పోర్టల్‌లోని రిటైల్ సేల్స్ డేటా ప్రకారం.. బజాజ్ ఇప్పుడు 25% మార్కెట్ వాటాను కలిగి ఉంది. మునుపటి నెల కంటే 3 శాతం వాటాను పెంచుకుంది.మరోవైపు తీవ్రమైన పోటీలో ఓలా ఎలక్ట్రిక్ వెనుకబడిపోయింది. 2024 డిసెంబర్లో కంపెనీ మార్కెట్ వాటా 19%కి పడిపోయింది. అంతకుముందు నెలతో పోల్చితే ఇది 5% క్షీణించింది. దీంతో మూడో స్థానానికి పరిమితమైంది. ఇక టీవీఎస్ (TVS) మోటార్స్ 23% మార్కెట్ వాటాతో రెండవ అతిపెద్ద ప్లేయర్‌గా తన స్థానాన్ని నిలుపుకొంది.బజాజ్ విజయానికి కారణాలుబజాజ్ ఆటో వృద్ధికి దాని చేతక్ 35 సిరీస్ వ్యూహాత్మక లాంచ్ కారణమని చెప్పవచ్చు. ఫీచర్-రిచ్ స్కూటర్లను తక్కువ ఉత్పత్తి ఖర్చుతో దాని మునుపటి మోడళ్ల కంటే 45% తక్కువకే టీవీఎస్ అందిస్తోంది. ఇది తక్కువ ధరలో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లను కోరుకునే వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంది.తీవ్ర పోటీఎలక్ట్రిక్ టూవీలర్లకు ఆదరణ పెరుగుతుండటంతో ఈ మార్కెట్లో ప్రస్తుతం పోటీ తీవ్రంగా మారింది. భిన్న వ్యూహాలతో కంపెనీలు వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. టీవీఎస్ వివిధ బ్యాటరీ సామర్థ్యాలతో (2-4 kWh) స్కూటర్లను అందించడం ద్వారా తన పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. ముఖ్యంగా కంపెనీ ఫ్లాగ్షిప్ ఐ-క్యూబ్ (I-Qub) 250 ప్రత్యేక ఈవీ అవుట్లెట్లతో సహా దాదాపు 4,000 స్టోర్లలో అందుబాటులో ఉంది.మరో కంపెనీ ఏథర్ ఎనర్జీ తన ఫ్యామిలీ-ఓరియెంటెడ్ రిజ్టా స్కూటర్‌ను విడుదలతో ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్ర వంటి బలమైన ఈవీ మార్కెట్లను ఆకట్టుకుంది. అంతేకాకుండా ఉత్తర భారతదేశమంతటా తన ఉనికిని విస్తరించడంపై కూడా కంపెనీ దృష్టి సారిస్తోంది.ఓలాకు సవాళ్లుఒకప్పుడు ఈవీ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించిన ఓలా ఎలక్ట్రిక్.. ఇప్పుడు పెరిగిన పోటీ, ధరల సవాళ్ల కారణంగా మార్కెట్ వాటాలో తిరోగమనాన్ని చవిచూసింది. ఎస్1 (Ola S1) స్కూటర్ స్వాపింగ్ బ్యాటరీ వెర్షన్‌ను రూ.59,999కే ప్రారంభించడం, తమ నెట్‌వర్క్‌ను 800 నుండి 4,000 స్టోర్లకు విస్తరించడం వంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కంపెనీ తన ఆధిక్యాన్ని కొనసాగించలేకపోయింది. -
సెల్ఫీ కొట్టు.. స్కూటర్ పట్టు: ఎలా అంటే?
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric).. సరికొత్త ఎస్1 ప్రో 'సోనా' లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్‌ను తీసుకు వస్తున్నట్లు వెల్లడించింది. ఈ స్కూటర్ ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఇతర స్కూటర్ల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఈ స్కూటర్ సొంతం చేసుకోవాలంటే డబ్బు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. ఇంకెలా ఈ స్కూటర్ సొంతం చేసుకోవచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం.ఓలా ఎలక్ట్రిక్ పరిచయం చేసిన కొత్త ఎస్1 ప్రో 'సోనా' లిమిటెడ్ ఎడిషన్ గోల్డ్ కలర్ ఎలిమెంట్స్ పొందుతుంది. కాబట్టి వీల్స్, మిర్రర్స్ వంటివన్నీ కూడా బంగారు రంగులో ఉండటం చూడవచ్చు. ఈ స్కూటర్ డ్యూయెల్ టోన్ డిజైన్ థీమ్‌తో పెర్ల్ వైట్, గోల్డ్ రంగులను పొందుతుంది.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లిమిటెడ్ ఎడిషన్ ఆఫర్లో మరింత పర్సనలైజ్డ్ అనుభవం కోసం రూపొందించిన ప్రత్యేక ఫీచర్లతో వస్తోంది. ఇందులో మూవ్ ఓఎస్ సాఫ్ట్వేర్ కూడా లభిస్తుంది. ఈ మోడల్ గోల్డ్ థీమ్ యూజర్ ఇంటర్ఫేస్, కస్టమైజ్డ్ మూవ్ఓఎస్ డ్యాష్‌బోర్డ్‌ని పొందుతుంది. వ్యక్తిగత ప్రాధాన్యతలకు అనుగుణంగా పర్సనలైజ్డ్ చేసుకునేందుకు మరింత సూక్ష్మమైన, ప్రీమియం చిమ్స్ ఇందులో ఉన్నాయి.ఈ స్కూటర్‌ను ఎలా సొంతం చేసుకోవచ్చంటే?ఓలా ఎలక్ట్రిక్ ఎంపిక చేసిన కస్టమర్లకు ఓలా సోనా కాంటెస్ట్ ద్వారా ఎస్1 ప్రో సోనా లిమిటెడ్ ఎడిషన్‌ను గెలుచుకునే అవకాశం ఉంది. ఇందులో పాల్గొనాలకునేవారు ఓలా ఎస్1తో రీల్ పోస్ట్ చేయాలి లేదా బ్రాండ్ స్టోర్ వెలుపల ఒక ఫోటో లేదా సెల్ఫీ తీసుకుని #OlaSonaContest అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఓలా ఎలక్ట్రిక్‌ను ట్యాగ్ చేయాలి. డిసెంబర్ 25న ఓలా స్టోర్లలో జరిగే పోటీలో విజేతను ప్రకటిస్తారు. -
ఒకటే బ్రాండ్.. 4 లక్షల మంది కొనేశారు
2024 ముగియడానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది ఆటోమొబైల్ మార్కెట్ బాగా అభివృద్ధి చెందింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది అనేక కొత్త వాహనాలను దేశీయ విఫణిలో అడుగుపెట్టాయి. ఇందులో టూ వీలర్స్ ఉన్నాయి, ఫోర్ వీలర్స్ కూడా ఉన్నాయి. ఎన్ని కొత్త వాహనాలు మార్కెట్లో అడుగుపెట్టినా.. ప్రజలు మాత్రం 'ఓలా ఎలక్ట్రిక్' స్కూటర్స్ కొనుగోలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఓలా ఎలక్ట్రిక్ ఈ ఒక్క ఏడాది (2024) సుమారు నాలుగు లక్షల స్కూటర్లను విక్రయించింది. దీంతో దేశంలోనే అత్యధిక రిటైల్ విక్రయాలను సాధించిన స్కూటర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. వాహన్ డేటా ప్రకారం.. 2024 డిసెంబర్ 15 ఉదయం 7 గంటల సమయం నాటికి దేశంలో అమ్ముడైన మొత్తం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏకంగా 4,00,099 యూనిట్లు అని తెలిసింది.ఇదీ చదవండి: రూ.2 లక్షల కంటే తక్కువ ధర.. ఇవిగో బెస్ట్ బైకులు!ఓలా ఎలక్ట్రిక్ ప్రపంచ ఈవీ దినోత్సవం (సెప్టెంబర్ 9) నాటికి 3 లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించింది. ఓలా ఎలక్ట్రిక్ తరువాత మంచి ఎక్కువ స్కూటర్లను విక్రయించిన కంపెనీల జాబితాలో టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ వంటివి ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే.. మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరిగిపోతున్నట్లు స్పష్టమవుతోంది. -
ఓలా షోరూంకు తాళం వేసిన కస్టమర్.. ఏం జరిగిందంటే?
సాక్షి, విశాఖపట్నం: నగరంలో ఓలా కస్టమర్ ప్రస్టేషన్ పీక్కు చేరింది. ఏకంగా ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌కి తాళం వేశాడు. బైక్‌లో పదేపదే సమస్యలు వచ్చినా సిబ్బంది స్పందించడం లేదని కస్టమర్ సీరియస్ అయ్యారు. నడిరోడ్డుపై తరచూ బైక్ ఆగిపోవడంతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వీస్ చేయకపోగా బెదిరిస్తున్నారంటూ కస్టమర్ ఆరోపించారు.కాగా, ఇటీవల కర్ణాటకలోని కాలబురగి జిల్లాలో ఓలా ఎలక్ట్రిక్ బైక్ కస్టమర్ తన బైక్‌ను రిపేర్ చేయడం లేదని షోరూం సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఏకంగా ఓలా షోరూంకు నిప్పు పెట్టి తగులబెట్టిన సంగతి తెలిసిందే. గతంలో మరో ప్రాంతంలో ఓలా బైక్‌కి చెప్పుల దండ వేసి ఊరేగించగా.. మరో ఘటనలో కస్టమర్.. స్కూటీని తగులబెట్టాడు. రిపేర్ వచ్చిన తన స్కూటీని ఆటోలో తీసుకొచ్చి షోరూం ముందే బైక్‌ను సుత్తితో పగలగొట్టాడు. ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
ఓ మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? ఇవి చూడండి
భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. అయితే మార్కెట్లోని ఉత్తమ ఈవీ స్కూటర్లు ఏవి? వాటి ధర, రేంజ్ వంటి వివరాలు ఎలా ఉన్నాయనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.బజాజ్ చేతక్ (Bajaj Chetak)ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో.. ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయిస్తోంది. దీని అమ్మకాలు ప్రస్తుతం ఆశాజనకంగానే ఉన్నాయి. కాగా ఈనెల 20న మరో అప్డేటెడ్ మోడల్ లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధమైంది. కాగా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బేస్ మోడల్ 2.88 కిలోవాట్ బ్యాటరీతో 123 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ ధర రూ. లక్ష కంటే ఎక్కువ.టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఒకటి టీవీఎస్ ఐక్యూబ్. రూ. 89999 ప్రారంభ ధర వద్ద లభించే ఈ స్కూటర్ 2.2 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ద్వారా 75 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 75 కిమీ/గం. ఇది 12.7 సెంమీ TFT డిస్ప్లే కలిగి, ఎల్ఈడీ హెడ్‌లైట్, 4.4 కిలోవాట్ BLDC మోటార్ వంటివి పొందుతుంది.ఇదీ చదవండి: భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కారు: 1.86 లక్షల మంది కొనేశారుహీరో విడా (Hero Vida)రూ. 96000 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద అందుబాటులో ఉన్న హీరో విడా మంచి అమ్మకాలు పొందుతున్న ఒక బెస్ట్ మోడల్. ఇందులో 2.2 కిలోవాట్ రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక సింగిల్ ఛార్జీతో 94 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 69 కిమీ/గం. ఈ స్కూటర్ 7 ఇంచెస్ డిజిటల్ TFT టచ్‌స్క్రీన్ పొందుతుంది.ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric)ప్రారంభం నుంచి గొప్ప ఆదరణ పొందిన ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. అవి ఓలా గిగ్, ఓలా గిగ్ ప్లస్, ఓలా ఎస్1 జెడ్, ఓలా ఎస్1 జెడ్ ప్లస్. కంపెనీ వీటి కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కాబట్టి కేవలం 499 రూపాయలతో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2025లో ప్రారంభమవుతాయి. -
డిసెంబర్ 20 నాటికి 3200: సీఈఓ ట్వీట్
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసిన కస్టమర్లతో అసంతృప్తి పెరిగిపోతున్న తరుణంలో.. కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ ఓ శుభవార్త చెప్పారు. వాహనాల సర్వీసుల్లో జాప్యం కలగకుండా చూడటానికి దేశ వ్యాప్తంగా మరో 3,200 సర్వీస్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.డిసెంబర్ 20 నాటికి 3,200 కొత్త స్టోర్స్ ప్రారంభించనున్నట్లు భవిష్ అగర్వాల్ వెల్లడించారు. ఆ తరువాత కంపెనీ మొత్తం నెట్వర్క్ 4,000 అవుట్లెట్లకు చేరుకుంటుంది.ప్రస్తుతం దేశంలో ఓలా స్టోర్లు కేవలం 800 మాత్రమే ఉన్నాయి. వీటి సంఖ్య త్వరలోనే 4,000లకు చేరుకుంటుంది. వినియోగదారులకు మరింత చేరువ కావడమే లక్ష్యంగా సీఈఓ ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ప్రారంభం కానున్న స్టోర్లలో సర్వీస్ కూడా లభిస్తుంది. కాబట్టి కస్టమర్లు నిశ్చింతగా.. తమ వాహనంలో ఏర్పడ్డ సమస్యలను పరిష్కరించుకోవచ్చు.ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఓలా ఎస్1 ఎక్స్, ఓలా ఎస్1 ప్రో, ఓలా ఎస్1 ఎయిర్ వంటి స్కూటర్లను విక్రయిస్తోంది. ఇవి కాకుండా మరో మూడు (ఓలా ఎస్1 జెడ్, ఓలా గిగ్, ఓలా గిగ్ ప్లస్) స్కూటర్లను కంపెనీ ఇటీవలే లాంచ్ చేసింది. ఇవి త్వరలోనే అమ్మకానికి రానున్నాయి. కాగా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోకి కూడా అడుగు పెట్టడానికి యోచిస్తోంది. ఇది బహుశా వచ్చే ఏడాది మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.Taking the Electric revolution to the next level this month.Going from 800 stores right now to 4000 stores this month itself. Goal to be as close to our customers as possible.All stores opening together on 20th Dec across India. Probably the biggest single day store opening…— Bhavish Aggarwal (@bhash) December 2, 2024 -
రూ. 39999కే ఎలక్ట్రిక్ స్కూటర్: ఓలా సరికొత్త వెహికల్స్ చూశారా..
భారతీయ టూ వీలర్ తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' ఎట్టకేలకు దేశీయ విఫణిలో ఒకేసారి నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. అవి ఓలా గిగ్, ఓలా గిగ్ ప్లస్, ఓలా ఎస్1 జెడ్, ఓలా ఎస్1 జెడ్ ప్లస్. కంపెనీ వీటి కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కాబట్టి కేవలం 499 రూపాయలతో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2025లో ప్రారంభమవుతాయి.ఓలా ఎలక్ట్రిక్ లాంచ్ చేసిన స్కూటర్లు.. గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్ కస్టమర్ల రోజువారీ వినియోగానికి, వాణిజ్యపరమైన వినియోగానికి అనుకూలంగా ఉంటాయి. అంతే కాకుండా ఇవి రిమూవబుల్ బ్యాటరీ ఆప్షన్ కలిగి ఉంటాయి.ఓలా గిగ్: రూ. 39,999ఓలా గిగ్ ప్లస్: రూ. 49,999ఓలా ఎస్1 జెడ్: రూ. 59,999ఓలా ఎస్1 జెడ్ ప్లస్: రూ. 64,999ఓలా గిగ్రోజువారీవినియోగానికి లేదా తక్కువ దూరాలు ప్రయాణించడానికి.. ఈ స్కూటర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. పేలోడ్ కెపాసిటీ బాగేనా ఉంటుంది. ఇందులోని 1.5 కిలోవాట్ రిమూవబుల్ బ్యాటరీ 112 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. దీని టాప్ స్పీడ్ 25 కిమీ/గం మాత్రమే. కంపెనీ దీనిని ప్రధానంగా గిగ్ వర్కర్ల కోసం లాంచ్ చేసినట్లు సమాచారం.ఓలా గిగ్ ప్లస్కొంత ఎక్కువ లగేజ్ తీసుకెళ్లడానికి ఓలా గిగ్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ పనికొస్తుంది. గంటకు 45 కిమీ వేగంతో ప్రయాణించే ఈ స్కూటర్ రేంజ్ 81 కిమీ మాత్రమే. అయితే రెండు బ్యాటరీల ద్వారా 157 కిమీ రేంజ్ పొందవచ్చు. ఇందులో కూడా 1.5 కిలోవాట్ రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. గిగ్ వర్కర్లు వేగవంతమైన డెలివరీ కోసం ఈ స్కూటర్లు ఉపయోగపడతాయి. రోజువారీ వినియోగానికి, నగర ప్రయాణనికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.ఓలా ఎస్1 జెడ్ఓలా ఎస్1 జెడ్ అనేది వ్యక్తిగత వినియోగం కోసం ఉపయోగించే స్కూటర్. పరిమాణంలో ఇది కొంత చిన్నదిగా ఉండటం వల్ల దీనిని రద్దీగా ఉండే అర్బన్, సెమీ-అర్బన్ రోడ్లపై కూడా సాఫీగా రైడ్ చేయవచ్చు. ఈ స్కూటర్ ఒక బ్యాటరీ ప్యాక్‌తో 75 కిమీ రేంజ్.. రెండుతో 146 కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే ఇది 1.8 సెకన్లలో 0 నుంచి 20 కిమీ/గం.. 4.8 సెకన్లలో 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది.ఓలా ఎస్1 జెడ్ ప్లస్ఇక చివరగా.. ఓలా ఎస్1 జెడ్ ప్లస్ విషయానికి వస్తే, ఇది దృఢమైన నిర్మాణం, అధిక పేలోడ్ కెపాసిటీ పొందుతుంది. దీనిని కూడా వ్యక్తిగత వినియోగం కోసం లేదా వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ స్కూటర్ ఒక బ్యాటరీ ప్యాక్‌తో 75 కిమీ రేంజ్.. రెండుతో 146 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది కూడా 1.8 సెకన్లలో 0 నుంచి 20 కిమీ/గం.. 4.8 సెకన్లలో 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది.ఓలా పవర్పాడ్ఓలా ఎలక్ట్రిక్ కేవలం కొత్త స్కూటర్లను లాంచ్ చేయడమే కాకుండా.. పవర్పాడ్ కూడా లాంచ్ చేసింది. ఇది పోర్టబుల్ బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. గృహోపకరణాలు, లైట్లు, ఫ్యాన్లు, ఇతర ముఖ్యమైన ఎలక్ట్రిక్ పరికరాలకు శక్తినిచ్చే ఇన్వర్టర్‌గా ఉపయోగపడుతుంది. 500W అవుట్‌పుట్‌ను కలిగిన ఓలా పవర్పాడ్.. 1.5 కిలోవాట్ బ్యాటరీ, 5 ఎల్ఈడీ బల్బులు, 3 సీలింగ్ ఫ్యాన్లు, 1 టీవీ, 1 మొబైల్ ఛార్జింగ్, 1 Wi-Fi రూటర్ వంటి వాటికి మూడుగంటల పాటు శక్తినిస్తుంది. అంటే పనిచేసేలా చేస్తుంది. దీని ధర రూ. 9999 మాత్రమే.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుల వినియోగం తగ్గిందా?: రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయంటే..ఓలా ఎలక్ట్రిక్.. కొత్త స్కూటర్లను లాంచ్ చేసిన సందర్భంగా కంపెనీ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి మూలకు ఎలక్ట్రిక్ వాహనాలను అందించాలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఓలా గిగ్, ఎస్1 జెడ్ స్కూటర్ల లాంచ్ ఈవీ రంగం వృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నామన్నారు. సరసమైన ధర వద్ద లభించే ఈ స్కూటర్లు తప్పకుండా మంచి ఆదరణ పొందుతుందని అన్నారు.Say hello to Ola S1 Z & Gig range, starting at just ₹39K!Affordable, accessible, and now with a portable battery pack that doubles up as home inverter using the Ola PowerPodReservations open, deliveries Apr’25!🛵⚡🔋Ola S1 Z: https://t.co/jRj8k4oKvQOla Gig:… pic.twitter.com/TcdfNhSIWy— Bhavish Aggarwal (@bhash) November 26, 2024 -
ఓలా ఎలక్ట్రిక్ కీలక నిర్ణయం: వందలాది ఉద్యోగులపై ఎఫెక్ట్
దేశీయ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) 500 మంది ఉద్యోగులను తొలగించింది. సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఉద్యోగులను ఇంటికి పంపించినట్లు సమాచారం. ఇందులో వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు.భారతీయ విఫణిలో.. ప్రారంభం నుంచి అనేక విమర్శలకు గురవుతూ వస్తున్న ఓలా ఎలక్ట్రిక్.. ఇప్పటికి కూడా విక్రయానంత సేవలు అందించడంలో అంతంత మాత్రంగానే ఉందని.. చాలామంది కస్టమర్లు విమర్శిస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో ఉద్యోగులను తొలగించడం అనేది కంపెనీ తీసుకున్న కఠినమైన నిర్ణయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఓలా ఎలక్ట్రిక్ లేఆఫ్స్ ప్రక్రియ జులై నుంచి కొనసాగుతున్నట్లు, ఇందులో భాగంగానే దశల వారీగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ లేఆఫ్స్ ప్రక్రియ ఈ నెల చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగులతో కంపెనీ లాభాలను గడించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఓలా ఎలక్ట్రిక్‌కు తగ్గిన నష్టం
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) రంగ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు వెలువరించింది. అయితే కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర నష్టం స్వల్పంగా తగ్గి రూ. 495 కోట్లకు పరిమితమైంది. అధిక విక్రయాలు ఇందుకు సహకరించాయి.గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 524 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ. 873 కోట్ల నుంచి రూ. 1,214 కోట్లకు ఎగసింది. వాహన విక్రయాలు 74 శాతం జంప్‌చేసి 98,619 యూనిట్లను తాకాయి. 2025 మార్చికల్లా కంపెనీ 2,000 సొంత ఔట్లెట్లకు నెట్‌వర్క్‌ను విస్తరించనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ పేర్కొంది. 2024 సెప్టెంబర్‌కల్లా 782 స్టోర్లను కలిగి ఉంది. ఫలితాల నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ షేరు బీఎస్ఈలో 2.5% నష్టంతో రూ. 73 వద్ద ముగిసింది. -
డిసెంబర్ నాటికి వెయ్యి సర్వీస్ సెంటర్లు: భవిష్ అగర్వాల్
బెంగళూరు: ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తమ సర్వీస్ సెంటర్లను 30 శాతం మేర పెంచుకుంది. కొత్తగా 50 సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు 500 మంది టెక్నీషియన్లను నియమించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇది దోహదపడగలదని వివరించాయి. అలాగే, సర్వీస్ వ్యూహాలు, ప్రక్రియలను మెరుగుపర్చుకునేందుకు తగు సూచనలు ఇచ్చేందుకు ఎర్న్స్ట్ అండ్ యంగ్‌ను నియమించుకున్నట్లు పేర్కొంది.ఓలా వాహన సర్వీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. అత్యుత్తమ ఆఫ్టర్–సేల్స్ అనుభూతిని అందించేందుకు 2024 డిసెంబర్ నాటికి తమ సర్వీస్ నెట్‌వర్క్‌ను 1,000 సెంటర్లకు పెంచుకోనున్నట్లు ఓలా వ్యవస్థాపకుడు, సీఎండీ భవీష్ అగర్వాల్ సెప్టెంబర్‌లో ప్రకటించారు. -
ఓలా సీఈఓ జాబ్ ఆఫర్.. ఓకే అన్న కమెడియన్!
ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ కమెడియన్ కునాల్ కమ్రాకు జాబ్ ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఆఫర్‌ను అంగీకరించాలంటే తనకు కొన్ని షరతులు ఉన్నాయని కునాల్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సర్వీసు సెంటర్ వద్ద పోగైన వాహనాల ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్, కునాల్ కమ్రాల మధ్య మాటల యుద్ధం సాగింది.ప్రభుత్వ విభాగమైన సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు గతంలో షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి పది వేలకుపైగా ఫిర్యాదులు వచ్చినట్లు సీసీపీఏ తెలిపింది. సర్వీసు లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య పద్ధతులను అనుసరించడం, వినియోగదారు హక్కుల ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడుతుందని సంస్థపై ఆరోపణలు వచ్చాయి. ఇయితే ఈ ఫిర్యాదుల్లో 99.1 శాతం సమస్యలను పరిష్కరించిందని కంపెనీ ఇటీవల పేర్కొంది.ఇదీ చదవండి: సైబర్ దొంగ.. ఏఐకూ బెంగ!ఈ పరిణామాల నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ కునాల్ కమ్రాకు జాబ్ ఆఫర్ చేశారు. దానిపై కునాల్ ఎక్స్ వేదికగా కొన్ని డిమాండ్లను లేవనెత్తారు. వాటిని తీరిస్తే తాను జాబ్‌లో చేరుతానని చెప్పారు. ‘ఓలాతో కలిసి పనిచేయడానికి కంపెనీ సీఈఓ ఆఫర్‌ను అంగీకరించడం తప్ప నాకు వేరే మార్గం లేదు. నన్ను కంపెనీ విషయాలకు సంబంధించి వేలసార్లు ట్యాగ్ చేశారు. నేను ఓలా ఉద్యోగిగానే భావిస్తున్నాను. కంపెనీ ఆఫర్‌ను స్వీకరించాలంటే కొన్ని డిమాండ్లను తీర్చాలి.ఓలా సర్వీస్ సెంటర్లలో స్కూటర్ ఇచ్చిన కస్టమర్లకు ఏడు రోజుల్లో సర్వీస్ అందేలా కంపెనీ చర్య తీసుకోవాలి.ఏడు రోజులు దాటినా మరమ్మతులు పూర్తి కాకపోతే వేరే స్కూటర్‌ను తాత్కాలికంగా వినియోగదారులకు అందించాలి.స్కూటర్ రిపేర్ పూర్తయ్యే వరకు రోజువారీ రవాణా ఖర్చుల కింద రూ.500 ఇవ్వాలి.కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు రెండు బీమాలు అందించాలి. వాహనానికి ఒకటి, సర్వీస్‌లకు మరొకటి. కస్టమర్లకు సర్వీస్ ఇన్సూరెన్స్ ఉచితంగా అందించాలి’ అని కునాల్ అన్నారు. -
99.1 శాతం ఫిర్యాదుల పరిష్కారం
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ల నుంచి వచ్చిన 10,644 ఫిర్యాదుల్లో 99.1 శాతం పరిష్కరించినట్లు తెలిపింది. సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి పది వేలకుపైగా ఫిర్యాదులు వచ్చినట్లు సీసీపీఏ గతంలో తెలిపింది. సర్వీసు లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య పద్ధతులను అనుసరించడం, వినియోగదారు హక్కుల ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడుతుందని సంస్థపై ఆరోపణలు వచ్చాయి.ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసిన వివిధ సమస్యలు, అంశాలపై లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి సీసీపీఏ 15 రోజులు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మొత్తం అందిన 10,644 ఫిర్యాదుల్లో 99.1 శాతం సమస్యలను పరిష్కరించినట్లు తాజాగా కంపెనీ పేర్కొంది. ఏ కంపెనీ అయినా కస్టమర్లకు సరైన సర్వీసు అందించకపోతే దానికి ఆదరణ తగ్గుతుంది. ఫలితంగా కంపెనీకి కస్టమర్లు తగ్గి రెవెన్యూ దెబ్బతింటుంది. కంపెనీలకు అతీతంగా ప్రతి సంస్థ స్పందించి కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించాలని పలువురు కోరుతున్నారు.ఇదీ చదవండి: గూగుల్ 15 జీబీ స్టోరేజ్ నిండిందా? ఇలా చేయండి..కంపెనీ సర్వీసుకు సంబంధించి ఇటీవల కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య సామాజిక మాధ్యమాలు వేదికగా వివాదం నెలకొంది. కంపెనీ సర్వీసు సరిగా లేదని పేర్కొంటూ సర్వీస్ సెంటర్ ముందు పోగైన ఓలా ఎలక్ట్రిక్ వాహనాల ఫొటోను కమ్రా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంతో వివాదం మొదలైంది. దీనిపై భవిష్ స్పందించిన తీరుపై నెటిజన్ల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. అదే సమయంలో నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదులు రావడంపై సీసీపీఏ ఓలాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. -
ఓలాపై ఫిర్యాదుల వెల్లువ.. తగ్గుతున్న ఈవీల విక్రయాలు..
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ టూవీలర్ల తయారీలో ఉన్న ఓలాపై దేశవ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యత, అమ్మకాల తర్వాత సేవకు సంబంధించి 10,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు పరిష్కరించకపోవడంతో వినియోగదారుల హక్కుల నియంత్రణ సంస్థ సెంట్రల్ కంజ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఓలాకు నోటీసును జారీ చేసింది. నేషనల్ కంజ్యూమర్ హెల్ప్‌లైన్‌కు (ఎన్సీహెచ్) ఏడాది కాలంగా ఓలా ఎలక్ట్రిక్‌పై ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిని పరిష్కరించాల్సిందిగా కంపెనీలో ఉన్నత స్థాయి అధికారులకు విన్నవించినా వారు పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం. దీంతో సెంట్రల్ కంజ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ క్లాస్ యాక్షన్ కోసం ఈ ఫిర్యాదులను పరిశీలించడం ప్రారంభించింది.ఏడాదిలో ఎన్‌సీహెచ్‌కు 10,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు అందాయని గుర్తించింది. చీఫ్ కమిషనర్ నిధి ఖరే, కమిషనర్ అనుపమ్ మిశ్రా నేతృత్వంలోని సీసీపీఏ వినియోగదారుల ఫిర్యాదులను పరిశీలించింది. వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, సేవల్లో లోపాలు, తప్పుదారి పట్టించే దావాలు, అన్యాయమైన వాణిజ్య పద్ధతులు అవలంభించడంతో సీసీపీఏ అక్టోబర్ 7న ఓలాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ప్రతిస్పందించడానికి కంపెనీకి 15 రోజుల గడువు ఇచ్చింది. సీసీపీఏ నుండి షోకాజ్ నోటీసు అందుకున్నట్టు అక్టోబర్ 7న ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది.ఇవీ ఫిర్యాదులు..ఉచిత సేవా వ్యవధి/వారంటీ సమయంలో చార్జీల వసూలు, సేవలు ఆలస్యం కావడంతోపాటు అసంతృప్తికరం, వారంటీ ఉన్నప్పటికీ సర్వీసు తిరస్కరణ లేదా ఆలస్యం, సరిపోని సేవలు, పునరావృతం అవుతున్న లోపాలు, అస్థిర పనితీరు, అధిక చార్జీలు, ఇన్వాయిస్లో తేడాలు ఉంటున్నాయని ఓలాపై ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అలాగే రీఫండ్ చేయకపోవడం, డాక్యుమెంటేషన్‌ను అందించడంలో వైఫల్యం, వృత్తిపర ప్రవర్తన, పరష్కారం కానప్పటికీ ఫిర్యాదుల మూసివేత, బ్యాటరీ, వాహన విడి భాగాలతో బహుళ సమస్యలను వినియోగదార్లు ఎదుర్కొంటున్నారు.చదవండి: మిడ్‌క్యాప్ విభాగంలో మెరుగైన రాబడులు ఇలా!కాగా, నేషనల్ కంజ్యూమర్ హెల్ప్‌లైన్‌ను (ఎన్సీహెచ్) డిపార్ట్మెంట్ ఆఫ్ కంజ్యూమర్ అఫైర్స్ పునరుద్ధరించింది. వ్యాజ్యానికి ముందు దశలో ఫిర్యాదుల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా వినియోగదారులకు ఒకే పాయింట్‌గా ఎన్సీహెచ్ ఉద్భవించింది. ఇది దేశంలోని వినియోగదారులందరికీ అందుబాటులో ఉంది. వినియోగదారులు 17 భాషలలో టోల్–ఫ్రీ నంబర్ 1800114000 లేదా 1915 ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. వాట్సాప్, ఎస్ఎంఎస్, మెయిల్, ఎన్సీహెచ్ యాప్, వెబ్ పోర్టల్, ఉమంగ్ యాప్‌ల ద్వారా బాధితులు తమ సౌలభ్యం ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు.తగ్గుతున్న విక్రయాలు.. భారత ఎలక్ట్రిక్ టూ వీలర్ల రంగంలో తొలి స్థానంలో కొనసాగుతున్న ఓలా ఎలక్ట్రిక్ సెప్టెంబర్‌లో 23,965 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. యూనిట్ల పరంగా అమ్మకాలు 11 నెలల కనిష్టానికి చేరుకోవడం గమనార్హం. ఈ ఏడాది జూలైలో ఓలా మార్కెట్ వాటా 39 శాతం కాగా సెప్టెంబర్‌లో ఇది 27 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది మార్చిలో ఏకంగా 52,136 యూనిట్లను కంపెనీ విక్రయించింది. చదవండి: బంగారం కొనడానికి గోల్డెన్ ఛాన్స్!.. ఎందుకంటే?ఈ–టూ వీలర్స్ విక్రయాల పరంగా భారత్‌లో టాప్–2లో ఉన్న టీవీఎస్ మోటార్ కో స్థానాన్ని బజాజ్ ఆటో కైవసం చేసుకోవడం విశేషం. గత నెలలో బజాజ్ ఆటో 166 శాతం అధికంగా 18,933 యూనిట్లు విక్రయించింది. జనవరి–సెప్టెంబర్ కాలంలో ఈ కంపెనీ అమ్మకాలు దాదాపు మూడింతలై 1,19,759 యూనిట్లను సాధించింది. 21.47 శాతం మార్కెట్ వాటాను పొందింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే కొద్ది నెలల్లోనే బజాజ్ చేతక్ తొలి స్థానానికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. -
హర్ష్ గోయెంకా ఓలా స్కూటర్‌ను ఎలా వాడుతారో తెలుసా..?
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంపై ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్‌ను అందులో ట్యాగ్ చేశారు. ఇటీవల కమెడియన్ కునాల్ కమ్రా, భవిష్ అగర్వాల్ మధ్య ఆన్లైన్ వేదికగా జరిగిన మాటల యుద్ధంతో ఈ ఓలా వ్యవహారం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్‌టాపిక్‌గా నిలిచింది.హర్ష్ గోయెంకా తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓలా ఎలక్ట్రిక్‌పై స్పందిస్తూ ‘తక్కువ దూరంలోని గమ్యాలు చేరాలంటే నేను ఓలా స్కూటర్ వినియోగిస్తాను. ఒక ‘కమ్రా’(ఇంటి గది) నుంచి మరో ఇంటి గదికి వెళ్లాలనుకుంటే ఓలా స్కూటర్ వాడుతాను’ అన్నారు. తన ట్విట్లో కునాల్ కమ్రా పేరుతో అర్థం వచ్చేలా ప్రస్తావించారు.If I have to travel close distances, I mean from one ‘kamra’ to another, I use my Ola @bhash pic.twitter.com/wujahVCzR1— Harsh Goenka (@hvgoenka) October 8, 2024ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం సాగింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్లు, ప్రతికామెంట్లతో మాటల దాడి చేసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్ ముందు పోగైన వాహనాల ఫొటోను షేర్ చేస్తూ కమ్రా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టడంతో వాగ్వాదం ప్రారంభమైంది. కస్టమర్ల ఇబ్బందులను తెలియజేస్తూ కమ్రా పెట్టిన పోస్టుకు ‘ఇది పెయిడ్ పోస్టు’ అని అగర్వాల్ బదులివ్వడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.ఇదీ చదవండి: అనుకున్నదే జరిగింది.. వడ్డీలో మార్పు లేదుఓలా ఎలక్ట్రిక్ సంస్థకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఇటీవల షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి 10,000కు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు సీసీపీఏ తెలిపింది. సర్వీసు లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య పద్ధతులను అనుసరించడం, వినియోగదారు హక్కుల ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడుతుందని సంస్థపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసిన వివిధ సమస్యలు, అంశాలపై లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి సీసీపీఏ 15 రోజుల గడువు ఇచ్చింది. -
ఓలా ఎలక్ట్రిక్‌కు మరో షాక్
న్యూఢిల్లీ: విద్యుత్ స్కూటర్ల సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌కు వరుసగా షాకులు తగులుతున్నాయి. తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అనుచిత వ్యాపార విధానాలతో నిబంధనలను ఉల్లంఘిస్తోందన్న ఆరోపణలతో సెంట్రల్ కన్సూ్యమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) తాజాగా షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనిపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సూచించినట్లు ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలిపింది. అయితే, తమ ఆర్థిక, నిర్వహణ కార్యకలాపాలపై దీని ప్రభావం ఉండదని పేర్కొంది. అలాగే, సీసీపీఏ ఎలాంటి జరిమానాలు విధించలేదని తెలిపింది. ఈ వార్తలతో ఓలా షేరు మంగళవారం మరో 6% పడింది. చివర్లో కోలుకుని 5 శాతం లాభంతో రూ. 95 వద్ద క్లోజైంది. వాహనాల సర్విస్ నాణ్యతపై సోషల్ మీడియాలో స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాతో ఓలా వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ మధ్య వాగ్వాదం ప్రభావంతో సోమవారం కంపెనీ షేరు 8 శాతం పైగా పతనమైంది. -
ఓలాకు మరో దెబ్బ! షోకాజ్ నోటీసు జారీ
ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి 10,000కు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు సీసీపీఏ తెలిపింది. సర్వీసు లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య పద్ధతులను అనుసరించడం, వినియోగదారు హక్కుల ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడుతుందని సంస్థపై ఆరోపణలు వస్తున్నాయి.ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసిన వివిధ సమస్యలు, అంశాలపై లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి సీసీపీఏ 15 రోజుల గడువు ఇచ్చింది. ఏ కంపెనీ అయినా కస్టమర్లకు సరైన సర్వీసు అందించకపోతే దానికి ఆదరణ తగ్గుతుంది. ఫలితంగా కంపెనీకి కస్టమర్లు తగ్గి రెవెన్యూ దెబ్బతింటుంది. కంపెనీలకు అతీతంగా ప్రతి సంస్థ స్పందించి కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించాలని పలువురు కోరుతున్నారు.🚨🚨 Sources to CNBC-TV18 ⬇️⚡Central Consumer Protection Authority (CCPA) issues showcause notice to @OlaElectric for class action⚡ Ola Electric given 15 days to respond to CCPA showcause notice on service issues and more⚡ #OlaElectric faces more than 10,000 complaints… pic.twitter.com/fNbdBLsQQq— CNBC-TV18 (@CNBCTV18News) October 7, 2024ఇదీ చదవండి: పేరుకుపోతున్న వాహన నిల్వలుఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం సాగింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్లు, ప్రతికామెంట్లతో మాటల దాడి చేసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్ ముందు పోగైన వాహనాల ఫొటోను షేర్ చేస్తూ కమ్రా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టడంతో వాగ్వాదం ప్రారంభమైంది. కస్టమర్ల ఇబ్బందులను తెలియజేస్తూ కమ్రా పెట్టిన పోస్టుకు ‘ఇది పెయిడ్ పోస్టు’ అని అగర్వాల్ బదులివ్వడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. -
ఈ–టూ వీలర్స్‌లో బజాజ్ టాప్–2
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో 88,156 యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. 2023 సెప్టెంబర్‌తో పోలిస్తే ఇది 40 శాతం అధికం. 2024 జనవరి–సెప్టెంబర్‌లో 31 శాతం వృద్ధితో 7,99,103 యూనిట్లు రోడ్డెక్కాయి. ఈ ఏడాది ఒక మిలియన్ యూనిట్ల మైలురాయిని పరిశ్రమ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే ఒక ఏడాదిలో ఈ స్థాయి విక్రయాలు నమోదుకావడం ఇదే తొలిసారి అవుతుంది. 2023లో దేశవ్యాప్తంగా 8,48,003 యూనిట్ల ఈ–టూవీలర్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. 2024 మార్చిలో అత్యధికంగా 1,37,741 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత ఆగస్ట్‌లో 87,256 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. అన్ని విభాగాల్లో కలిపి ఈ ఏడాది సెప్టెంబర్‌లో 1,48,539 యూనిట్ల ఈవీలు అమ్ముడయ్యాయి. ఇందులో ఈ–టూ వీలర్ల వాటా ఏకంగా 59 శాతం ఉంది. ఏడాదిలో 166 శాతం వృద్ధి.. ఇప్పటి వరకు ఈ–టూ వీలర్స్ విక్రయాల పరంగా భారత్‌లో టాప్–2లో ఉన్న టీవీఎస్ మోటార్ కో స్థానాన్ని బజాజ్ ఆటో కైవసం చేసుకోవడం విశేషం. గత నెలలో బజాజ్ ఆటో 166 శాతం అధికంగా 18,933 యూనిట్లు విక్రయించింది. జనవరి–సెప్టెంబర్ కాలంలో ఈ కంపెనీ అమ్మకాలు దాదాపు మూడింతలై 1,19,759 యూనిట్లను సాధించింది. 21.47 శాతం మార్కెట్ వాటాను పొందింది. తొలి స్థానంలో కొనసాగుతున్న ఓలా ఎలక్ట్రిక్ 11 నెలల కనిష్టానికి 23,965 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఈ ఏడాది జూలైలో ఓలా మార్కెట్ వాటా 39 శాతం కాగా సెపె్టంబర్లో ఇది 27 శాతానికి పడిపోవడం గమనార్హం. టీవీఎస్ మోటార్ కో గత నెలలో 17,865 యూనిట్ల అమ్మకాలను సాధించి 20.26 శాతం వాటాతో మూడో స్థానానికి పరిమితం అయింది. ఏథర్, హీరో మోటోకార్ప్, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ తర్వాతి స్థానాల్లో పోటీపడుతున్నాయి. 19 నెలల కనిష్టానికి.. ఎలక్ట్రిక్ కార్లు, ఎస్‌యూవీల అమ్మకాలు సెప్టెంబర్‌లో 19 నెలల కనిష్టానికి పడిపోయాయి. గత నెలలో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 5,733 యూనిట్లు నమోదయ్యాయి. 2023 సెప్టెంబర్‌తో పోలిస్తే ఇది 9 శాతం తగ్గుదల. ఈ ఏడాది మార్చిలో అత్యధికంగా 9,661 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. 2024 జనవరి–సెప్టెంబర్‌లో 15 శాతం వృద్ధితో 68,642 యూనిట్లు రోడ్డెక్కాయి. తొలి స్థానంలో ఉన్న టాటా మోటార్స్ గత నెలలో 3,530 ఈవీలను విక్రయించింది. ఈ కంపెనీ మార్కెట్ వాటా 61 శాతానికి వచ్చి చేరింది. 2023 సెప్టెంబర్‌లో ఇది 68 శాతం నమోదైంది. ఎంజీ మోటార్ ఇండియా 955 యూనిట్ల అమ్మకాలతో 16.65 శాతం వాటాతో రెండవ స్థానంలో పోటీపడుతోంది. 443 యూనిట్లతో మూడవ స్థానంలో నిలిచిన మహీంద్రా అండ్ మహీంద్రా 7.72 శాతం వాటా కైవసం చేసుకుంది. బీవైడీ ఇండియా, సిట్రన్, బీఎండబ్లు్య ఇండియా, మెర్సిడెస్ బెంజ్, హ్యుండై మోటార్ ఇండియా, వోల్వో ఆటో ఇండియా, కియా ఇండియా, ఆడి, పోర్ష, రోల్స్ రాయిస్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. -
మెగా ఐపీఓ వేవ్!
స్టాక్ మార్కెట్లో బుల్ రంకెల నేపథ్యంలో పబ్లిక్ ఆఫర్లు (ఐపీఓ) పోటెత్తుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 62 కంపెనీలు దాదాపు రూ.64,513 కోట్ల భారీ మొత్తాన్ని సమీకరించాయి. ఇందులో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ (రూ. 6,550 కోట్లు), ఫస్ట్‌క్రై (రూ. 4,194 కోట్లు), ఓలా ఎలక్ట్రిక్ (రూ.6,146 కోట్లు), డిజిట్ ఇన్సూరెన్స్ (2,165 కోట్లు) తదితర దిగ్గజాలున్నాయి. గతేడాది మొత్తంమీద 57 కంపెనీలు కలిపి రూ.49,436 కోట్ల నిధులను మార్కెట్ నుంచి దక్కించుకున్నాయి. దీంతో పోలిస్తే ఈ ఏడాది 29 శాతం అధికం కావడం గమనార్హం. మరోపక్క, మరో 75 కంపెనీలు రూ.1.5 లక్షల కోట్ల నిధుల వేట కోసం ఆవురావురుమంటూ వేచిచూస్తున్నాయి. ఇందులో 23 కంపెనీలకు సెబీ గ్రీన్ సిగ్నల్ కూడా లభించింది. హ్యుందాయ్ ఇండియా, స్విగ్గీకి ఇప్పటికే సెబీ ఇప్పటికే ఓకే చెప్పగా... తాజాగా విశాల్ మెగామార్ట్, ఆక్మే సోలార్, మమతా మెషినరీకి కూడా ఆమోదం లభించింది. సెబీ లైన్ క్లియర్ చేసిన ఐపీఓల విలువ దాదాపు రూ.72,000 కోట్లు! మిగా 53 కంపెనీలు రూ.78 వేల కోట్ల నిధుల సమీకరణ బాటలో ఆమోదం కోసం వేచి చూస్తున్నాయి. కాగా, రూ. 1,19,882 కోట్ల నిధుల సమీకరణతో 2021 ఏడాది అత్యధిక ఐపీఓల రికార్డును దక్కించుకుంది. మార్కెట్ రికార్డు పరుగుల నేపథ్యంలో మూడేళ్ల తర్వాత పబ్లిక్ ఇష్యూలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆమోదం లభించినవి డిసెంబర్‌లోపు గనుక ఐపీఓలను పూర్తి చేసుకుంటే 2024 గత రికార్డును బ్రేక్ చేసే చాన్సుంది!! -
ఓలా ఎలక్ట్రిక్ కారు ప్రాజెక్టు: క్లారిటీ ఇచ్చిన భవిష్
ఎలక్ట్రిక్ ద్విచక్రవాహన విభాగంలో అగ్రగామిగా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ మూడేళ్ళ క్రితమే ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఇప్పుడు ఈ ప్రెజెక్టును నిలిపివేస్తున్నట్లు కంపెనీ సీఈఓ భవిష్ అగర్వల్ వెల్లడించారు.ఓలా ఎలక్ట్రిక్ ఈ నెల ప్రారభంలో ఐపీఓ ప్రారంభించిన తరువాత లాభాలను ఆర్జించడంపై దృష్టి సారించింది. ముఖ్యంగా భారతీయ వినియోగదారులకు సంబంధించిన ఉత్పత్తులపై ఎక్కువ దృష్టి పెట్టనున్నట్లు భవిష్ అన్నారు.నిజానికి 2022లో పుల్ గ్లాస్ రూఫ్‌తో కూడిన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును విడుదల చేయబోతున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది. ఆ తరువాత అదే ఏడాది ఆగష్టు 15న జరిగిన ఓ ఈవెంట్లో ఈ కారుకు సంబంధించిన స్కెచ్‌లు విడుదల చేశారు. అప్పట్లోనే ఈ కారు తయారు కావడానికి సుమారు రెండేళ్లు పడుతుందని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.భారతదేశంలో ప్రస్తుతం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో అగ్రగామిగా ఉంది. ఈ కంపెనీకి సవాలుగా ఓలా ఎలక్ట్రిక్ సింగిల్ చార్జితో 500 కిమీ రేంజ్ అందించే కారును లాంచ్ చేయనున్నట్లు ఎప్పుడో చెప్పింది. కానీ ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు ఐపీఓకు వెళ్లడం వల్ల ఈ ఎలక్ట్రిక్ కార్ ప్రాజెక్ట్‌ను నిలిపివేయాలన్న ఓలా నిర్ణయాన్ని భవిష్ అగర్వాల్ ధృవీకరించారు. అయితే ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో మళ్ళీ ప్రారంభమవుతుందా? లేదా? అనే విషయాలను సీఈఓ స్పష్టం చేయలేదు. -
ఓలా ఈ–బైక్స్ వచ్చేశాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్ విభాగంలోకి ప్రవేశించింది. రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్ ప్రో వేరియంట్లను ప్రవేశపెట్టింది. 2.5–16 కిలోవాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యంతో తయారయ్యాయి. ధర రూ.74,999 నుంచి మొదలై రూ.2,49,999 వరకు ఉంది. 2025 దీపావళి నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి. ఒకసారి చార్జింగ్‌తో వేరియంట్‌నుబట్టి 200 నుంచి 579 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. టాప్ స్పీడ్ గంటకు 124–194 కిలోమీటర్లు. కాగా, క్విక్ కామర్స్‌లోకి ఓలా ఎంట్రీ ఇచ్చింది. ఇందుకోసం ఓలా క్యాబ్స్ కాస్తా ఓలా కన్జూమర్ అయింది. అలాగే ఓలా పే పేరుతో యూపీఐ సేవలను సైతం కంపెనీ ఆవిష్కరించింది. అనుబంధ కంపెనీ కృత్రిమ్ ఏఐ 2026 నాటికి ఏఐ చిప్‌ను ప్రవేశపెట్టనుంది. -
ఎలక్ట్రిక్ టూవీలర్స్ పోటీ!
ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు మళ్లీ ఫుల్ స్వింగ్‌లో పరుగులు తీస్తున్నాయి. తాజాగా జూలై నెలలో సేల్స్ దాదాపు రెట్టింపు కావడం దీనికి నిదర్శనం. మరోపక్క, ఈ విభాగంలో పోటీ ఫాస్ట్ చార్జింగ్ అవుతోంది. మార్కెట్ లీడర్‌గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్‌కు సాంప్రదాయ టూవీలర్ దిగ్గజాలు షాకిస్తున్నాయి. ధరల యుద్ధానికి తెరతీసి, ఓలా మార్కెట్ వాటాకు గండికొడుతున్నాయి. ఐపీఓ సక్సెస్‌తో దండిగా నిధుల జోష్‌లో ఉన్న ఓలా.. ఈ పోటీని ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తి రేపుతోంది! ఈ ఏడాది జూలై నెలలో దేశవ్యాప్తంగా మొత్తం 1,07,016 ఈ–టూవీలర్లు రోడ్డెక్కాయి. గతేడాది అమ్ముడైన 54,616 వాహనాలతో పోలిస్తే 96 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది జూన్‌లో అమ్మకాలు 79,868 మాత్రమే. గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న సేల్స్ మళ్లీ ఎలక్ట్రిక్ వేగంతో దూసుకెళ్తున్నాయి. పెట్రోలు టూవీలర్లలో రారాజులుగా ఉన్న సాంప్రదాయ టూవీలర్ కంపెనీలు.. బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్, హీరో మోటో సైతం ఎలక్ట్రిక్ బరిలో తగ్గేదేలే అంటూ కాలుదువ్వడమే దీనికి ప్రధాన కారణం. జూలైలో బజాజ్ ఆటో ఏకంగా 17,642 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించడం విశేషం. జూన్‌తో పోలిస్తే 80 శాతం సేల్స్ పెరిగాయి. మార్కెట్ వాటా సైతం 11.6 శాతం నుంచి 16.9 శాతానికి జంప్ చేసింది. ఇక టీవీఎస్ అమ్మకాలు 30 శాతం పైగా ఎగబాకి 19,471 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ రెండింటితో పోలిస్తే వెనుకబడ్డ హీరో మోటో 5,044 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి సత్తా చాటింది. మొత్తంమీద చూస్తే, ఈ మూడు దిగ్గజాల ‘ఎలక్ట్రిక్’ వాటా 40 శాతానికి పైగా ఛార్జింగ్ అయింది. ఇందులో టీవీఎస్, బజాజ్ వాటాయే దాదాపు 35 శాతం గమనార్హం. ఓలాకు షాక్... రెండు నెలల క్రితం, మే నెలలో దాదాపు 50 శాతం మార్కెట్ వాటాతో తిరుగులేని స్థానంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్‌కు పోటీ సెగ బాగానే తగులుతోంది. జూన్‌లో కంపెనీ 36,781 వాహనాలు విక్రయించగా.. జూలైలో ఈ సంఖ్య కాస్త మెరుగుపడి 41,597కు చేరింది. అయితే, మార్కెట్ వాటా మాత్రం జూన్‌లో 47.5 శాతానికి, ఆపై జూలైలో ఏకంగా 40 శాతానికి పడిపోయింది. ఓలాకు తగ్గుతున్న మార్కెట్ వాటాను సాంప్రదాయ టూవీలర్ కంపెనీలు ఎలక్ట్రిక్ వేగంతో కొట్టేస్తున్నాయి. మరోపక్క, పూర్తిగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్న ఏథర్ ఎనర్జీ క్రమంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది. జూన్‌లో 6,189 (8% మార్కెట్ వాటా), జూలైలో 10,080 (10% వాటా) వాహనాలను అమ్మింది. అయితే, దీని స్కూటర్ల ధరలు రూ. లక్ష పైనే ఉన్నాయి. సాంప్రదాయ టూవీలర్ దిగ్గజాలు రూ. లక్ష లోపు ధరతో ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేస్తుండటంతో.. ఓలా, ఏథర్ వంటి పూర్తి ఈవీ కంపెనీలు కూడా ధరల యుద్ధంలోకి దూకాల్సిన పరిస్థితి నెలకొంది. మార్కెట్ వాటా పతనంతో ఓలా ఇక పూర్తిగా ఈ–టూవీలర్లపైనే దృష్టిసారించాలని నిర్ణయించుకుంది.భారీ నెట్వర్క్, సర్వీస్ ప్లస్..తొలిసారిగా రూ. లక్ష లోపు స్కూటర్లను ప్రవేశపెట్టడం కూడా బజాజ్, టీవీఎస్, హీరో అమ్మకాలు పుంజుకున్నాయి. ‘ఈ 3 సాంప్రదాయ టూవీలర్ కంపెనీలకు విస్తృత డి్రస్టిబ్యూషన్ నెట్వర్క్, బ్రాండ్ విలువ, సర్వీస్ సదుపాయాలు దన్నుగా నిలుస్తున్నాయి.మార్కెట్ వాటాను కొల్లగొట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి’ అని రీసెర్చ్ సంస్థ నోమురా ఆటోమోటివ్ రిటైల్ విభాగం హెడ్ హర్షవర్ధన్ శర్మ పేర్కొన్నారు. ధరల పోరు, బ్యాటరీ టెక్నాలజీలో మెరుగుదల వంటివి ఈ విభాగంలో పోటీని మరింత తీవ్రతరం చేయనుంది. తాజా పరిణామాలతో ఛార్జింగ్ స్టేషన్ల భారీ పెరుగుదలతో పాటు ఇతరత్రా మౌలిక సదుపాయాలు జోరందుకుంటాయని, వినియోగదారులకు కూడా ఇది మేలు చేకూరుస్తుందని హర్షవర్ధన్ చెప్పారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
Ola Electric IPO: పేటీఎం బాస్ షేర్లు విక్రయించడం లేదా?
ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు వస్తుండటంలో మార్కెట్లో అందరి దృష్టి దీనిమీదే ఉంది. ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ రీటైల్ సబ్స్క్రిప్షన్లు ఆగస్టు 2 నుంచి 6వ తేదీ వరకు ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంటాయి. ఒక్కో షేర్ ధరను రూ.72 - 76గా కంపెనీ నిర్ణయించింది.కాగా ఓలా ఎలక్ట్రిక్‌లో గణనీయమైన సంఖ్యలో షేర్లున్న పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ, బాలివుడ్ డైరెక్టర్ జోయా అక్తర్, ఆమె సోదరుడు బాలివుడ్ నటుడు సోదరుడు ఫర్హాన్ అక్తర్ రానున్న ఐపీఓలో తమ షేర్లను విక్రయించకుండా అంటిపెట్టుకోనున్నారు. మనీకంట్రోల్ కథనం ప్రకారం.. వీరు ఆఫర్ ప్రైస్ బ్యాండ్ రూ. 72-76 షేరు ఎగువ ముగింపులో 26 శాతం లాభాల వద్ద ఉన్నారు.విజయ్ శేఖర్ శర్మ, అక్తర్ ద్వయం పెట్టుబడి తేదీ 2021 డిసెంబర్ 21గా నమోదైంది. అప్పటి నుంచి బెంచ్‌మార్క్ నిఫ్టీ 48.32 శాతం పెరిగింది. శర్మ తన పెట్టుబడి సంస్థ వీఎస్ఎస్ ఇన్వెస్ట్‌కో ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఏడు సిరీస్ సి ప్రిఫరెన్స్ షేర్లను రూ.7.5 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పుడవి ప్రైస్ బ్యాండ్ దిగువన రూ. 8.96 కోట్లు, ప్రైస్ బ్యాండ్ ఎగువన రూ. 9.46 కోట్లుగా ఉన్నాయి.జోయా అక్తర్ సింగిల్ సిరీస్ సి ప్రిఫరెన్స్ షేర్‌ను రూ. 1.07 కోట్లకు కొనుగోలు చేయగా, ఫర్హాన్ 2 షేర్లను రూ. 2.14 కోట్లకు కొనుగోలు చేశారు. ఫర్హాన్‌తో కలిసి ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సహ వ్యవస్థాపకుడు రితేష్ సిధ్వానీ కూడా ఓలా ఎలక్ట్రిక్ సిరీస్ సి రౌండ్లో రెండు షేర్లను కొనుగోలు చేశారు. ప్రిఫరెన్స్ షేర్ల మార్పిడి తర్వాత, శర్మ ఓలా ఎలక్ట్రిక్‌లో 12.45 లక్షలు, జోయా అక్తర్ 1.78 లక్షలు, ఫర్హాన్ అక్తర్ 3.56 లక్షలు, రితేష్ సిధ్వానీ 3.56 లక్షల షేర్లను కలిగి ఉన్నారు. -
ఓలా ఎలక్ట్రిక్ వచ్చేస్తోంది.. టార్గెట్ రూ. 5,500 కోట్లు
ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ వచ్చే వారం ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రానుంది. ఆగస్టు 2న రిటైల్ సబ్స్క్రిప్షన్లు ప్రారంభించనున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. సంస్థాగత పెట్టుబడిదారులకు మాత్రం ఒక రోజు ముందుగా ఆగస్టు 1న సబ్స్క్రిప్షన్లు తెరుచుకోనున్నాయి. ఆగస్టు 6న ఐపీఓ ముగుస్తుంది.ఐపీఓ ద్వారా రూ. 5,500 కోట్లను (సుమారు 657 మిలియన్ డాలర్లు) ఆర్జించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఆఫర్ ఫర్ సేల్ (OFS)లో భాగంగా దాదాపు 38 మిలియన్ షేర్లను విక్రయించాల్సి ఉందని కంపెనీ తెలిపింది. 2023 డిసెంబర్లో దాఖలు చేసిన డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌లో సూచించిన 47.4 మిలియన్ షేర్ల విక్రయం కంటే ఇది దాదాపు 20% తక్కువ.ఓలా ఎలక్ట్రిక్ సుమారు 4.2 బిలియన్ డాలర్ల నుంచి 4.4 బిలియన్ డాలర్ల వాల్యూషన్‌తో ఐపీఓకు వస్తోంది. సింగపూర్‌కు చెందిన పెట్టుబడి సంస్థ టెమాసెక్ గతేడాది 140 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన తర్వాత కంపెనీ విలువను 5.4 బిలియన్ డాలర్లుగా నిర్ణయించింది. ఆ మొత్తంతో పోలిస్తే.. ఇప్పుడు కంపెనీ ఐపీఓ వాల్యూషన్ 20 శాతం మేర తగ్గడం గమనార్హం. -
ఎలక్ట్రిక్ స్కూటర్లపై ప్రత్యేక ఆఫర్లు
బెంగళూరు: ’ఓలా ఎలక్ట్రిక్ రష్’ ప్రచార కార్యక్రమంలో భాగంగా విద్యుత్ వాహనాల సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తమ ఎస్1 పోర్ట్‌ఫోలియోపై రూ. 15,000 వరకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఇవి జూన్ 28 వరకు వర్తిస్తాయి. వీటి ప్రకారం ఎస్1 ఎక్స్+పై రూ. 5,000, ఎస్1 ప్రో.. ఎస్1 ఎయి ర్‌పై రూ. 2,500 ఫ్లాట్ డిస్కౌంటు లభిస్తుంది.ఎస్1 ఎక్స్+పై రూ. 5,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్, మొత్తం ఎస్1 శ్రేణిపై నిర్దిష్ట క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై రూ. 5,000 వరకు క్యాష్‌బ్యాక్ సహా మొత్తం రూ. 10,000 వరకు అదనపు ప్రయోజనాలను కూడా కస్టమర్లు పొందవచ్చు. ఎస్1 పోర్ట్‌ఫోలియోలో ఆరు వేరియంట్లు ఉన్నాయి.మొత్తం ఉత్పత్తుల శ్రేణి బ్యాటరీలపై 8 ఏళ్లు/80,000 కి.మీ. మేర ఎక్స్టెండెడ్ వారంటీని కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. కావాలంటే పరిమితిని పెంచుకునేందుకు కస్టమర్లు రూ. 4,999–రూ. 12,999 వరకు చెల్లించి యాడ్–ఆన్ వారంటీని ఎంచుకోవచ్చు. -
దిగ్గజ ఐపీవోలకు ఓకే.. సెబీ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, హెల్త్‌కేర్ రంగ కంపెనీ ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్ పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు కంపెనీలూ 2023 డిసెంబర్లో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. రూ. 5,500 కోట్లకు రెడీ ఐపీవో ద్వారా ఓలా ఎలక్ట్రిక్ రూ. 5,500 కోట్లకుపైగా సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఇష్యూ నిధులలో అత్యధిక శాతాన్ని సామర్థ్య విస్తరణ, సెల్ తయారీ ప్లాంట్, ఆర్అండ్డీపై పెట్టుబడులకు వినియోగించనుంది. ఇష్యూలో భాగంగా రూ. 5,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 9.52 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. రూ. 1,226 కోట్లు సెల్ తయారీ యూనిట్‌కు, రూ. 1,600 కోట్లు ఆర్‌అండ్‌డీకి, మరో రూ. 800 కోట్లు రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. ఇక బెయిన్ క్యాపిటల్‌కు పెట్టుబడులున్న ఎమ్క్యూర్ ఫార్మా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది.ఆఫీసర్స్ చాయిస్ @ రూ. 267–281 ఆఫీసర్స్ చాయిస్ విస్కీ తయారీ కంపెనీ అలైడ్ బ్లెండర్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 267–281 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 25న ప్రారంభమై 27న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 24న షేర్లను కేటాయించనుంది. ఇష్యూలో భాగంగా రూ. 1,000 కోట్ల ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 500 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 53 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయాలి. -
ఓలా ఎలక్ట్రిక్ నష్టాలు ఇన్ని కోట్లా.. కారణం ఏంటంటే?
దేశీయ మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉత్తమ అమ్మకాలు పొందుతున్న 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric), ఈ ఏడాది ఏకంగా రూ. 1472.08 కోట్ల నష్టాన్ని పొందినట్లు సమాచారం. ఈ ఏడాది ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిన కంపెనీల జాబితాలో ఒకటిగా ఉన్నప్పటికీ.. నష్టాలను ఎందుకో పొందాల్సి వచ్చింది, అసలైన కారణాలు ఏంటనేది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఉత్పత్తి, విక్రయాల విస్తరణ కారణంగా.. నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 784.15 కోట్ల నష్టాన్ని చవి చూసిన కంపెనీ, ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 1472.08 కోట్లు నష్టపోయినట్లు సమాచారం. ఓలా ఎలక్ట్రిక్ గత ఆర్ధిక సంవత్సరం కంటే, ఈ ఆర్ధిక సంవత్సరంలో రెట్టింపు నష్టాన్ని చవి చూసినప్పటికీ.. అమ్మకాల పరంగా ఈ ఏడాది 2.5 లక్షల యూనిట్లను విక్రయించినట్లు ఇటీవలే వెల్లడించింది. ఈ అమ్మకాలు 2023 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ మధ్య జరిగినట్లు సమాచారం. ఇదీ చదవండి: ఒకప్పుడు పాములు, తేళ్లు తిరిగే కంపెనీ.. టాటా చేతిలో పడ్డాక.. అమ్మకాల పరంగా కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ఓలా ఎలక్ట్రిక్.. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‌లో ఎస్1, ఎస్1 ప్రో, ఎస్1 ఎక్స్ వంటి మోడళ్లను విక్రయిస్తోంది. వచ్చే ఏడాది చివరి నాటికి కంపెనీ ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది. అంతే కాకుండా.. ఓలా ఎలక్ట్రిక్ దాని అనుబంధ సంస్థ ఓలా సెల్ టెక్నాలజీస్ ద్వారా తమిళనాడులో గిగాఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది. ఫ్యాక్టరీ మార్చి 2024 నాటికి 1.4 GWh సామర్థ్యంతో సెల్ ఉత్పత్తిని ప్రారంభించాలని భావిస్తున్నారు. -
ఇలా ఎలా అనిపించిన ఓలా..
ప్రారంభంలో మంచి ప్రజాదరణ పొందిన ఓలా ఎలక్ట్రిక్.. క్రమంగా తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద లెక్కకు మించిన కంప్లైంట్ అందుకుంది. స్కూటర్లలో ఎన్ని సమస్యలు తలెత్తినప్పటికీ.. అమ్మకాల్లో మాత్రం కనీవినీ ఎరుగని విధంగా దూసుకెళ్లినట్లు నివేదికల ద్వారా తెలిసింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. ఓలా ఎలక్ట్రిక్ నివేదికల ప్రకారం, 2023 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ వరకు కంపెనీ మొత్తం సేల్స్ 2,52,647 యూనిట్లుగా నమోదైనట్లు తెలుస్తోంది. కేవలం ఒక సంవత్సర కాలంలో 2.5 లక్షల యూనిట్ల అమ్మకాలు సొంతం చేసుకున్న కంపెనీకి ఓలా ఈ ఏడాది కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది అత్యధిక అమ్మకాలు చేపట్టిన కంపెనీగా ఓలా ఎలక్ట్రిక్ నిలిచింది. ఆ తరువాత స్థానాల్లో టీవీఎస్ (1,62,399 యూనిట్లు), ఏథర్ ఎనర్జీ (1,01,940 యూనిట్లు) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ లెక్కన ఓలా ఎలక్ట్రిక్ నెలకు సుమారు 20000 యూనిట్లను విక్రయించినట్లు సమాచారం. ఇదీ చదవండి: న్యూ ఇయర్ రాకముందే ఉద్యోగులకు షాకిచ్చిన కంపెనీ.. నెలవారీ అమ్మకాల పరంగా ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ వాటా 30.50శాతం, టీవీఎస్ వాటా 19.60 శాతం, ఏథర్ వాటా 12.30శాతంగా ఉంది. ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో రూ. 90000 నుంచి రూ. 1.47 లక్షల ధర మధ్య లభించే స్కూటర్లను విక్రయిస్తోంది. కంపెనీ రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. బహుశా ఇది 2024 చివరి నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. -
ఐపీవో బాటలో ఓలా, ఫస్ట్‌క్రై
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీ ఓలా, ఈకామర్స్ సంస్థ ఫస్ట్‌క్రై పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతున్నాయి. వచ్చే వారం క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ యాజమాన్యం దేశ, విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు రోడ్‌షోలను నిర్వహిస్తోంది. ఇక ఫస్ట్‌క్రై కొత్త ఏడాది(2024)లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల తదుపరి స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కావచ్చని అంచనా. పీఈ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ రెండు సంస్థలలోనూ పెట్టుబడులున్న సంగతి తెలిసిందే. కాగా.. రెండు కంపెనీలూ వచ్చే వారం సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేసే సన్నాహాల్లో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఐపీవో ద్వారా ఫస్ట్‌క్రై 50 కోట్ల డాలర్లు(సుమారు రూ. 4,150 కోట్లు) సమీకరించే అవకాశముంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం దీనిలో 60 శాతం వరకూ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనుండగా.. మిగిలిన 40 శాతం ఈక్విటీని కొత్తగా జారీ చేసే వీలుంది. కాగా.. రంజన్ పాయ్ కంపెనీ ఎంఈఎంజీ ఫ్యామిలీ ఆఫీస్, హర్ష్ మరియావాలా సంస్థ షార్ప్ వెంచర్స్, హేమేంద్ర కొఠారీ సంస్థ డీఎస్పీ ఫ్యామిలీ ఆఫీస్ ఇటీవలే ఫస్ట్‌క్రైలో రూ. 435 కోట్ల విలువైన వాటాలను సొంతం చేసుకోవడం గమనార్హం! -
పెట్టుబడిదారులకు శుభవార్త, ఐపీఓకి ఓలా ఎలక్ట్రిక్.. ఎప్పుడంటే?
స్టాక్ మార్కెట్లోని పెట్టుబడిదారులకు శుభవార్త. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్ త్వరలో ఐపీఓకి రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆ సంస్థ ఫౌండర్, సీఈఓ భవిష్ అగర్వాల్ డిసెంబర్ 20న సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హియరింగ్ ప్రాస్పెక్ట్ (DRHP)ని దాఖలు చేయనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఐపీఓ ద్వారా 700 మిలియన్ డాలర్లను సేకరించనున్నారు. ఓలా లక్ష్యం అదే ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్ పెట్టుబడులున్న ఓలా సంస్థ వచ్చే ఏడాదిలో ఆ సంస్థ విలువ 7 నుంచి 8 బిలియన్ డాలర్ల మధ్య ఉండేలా ఓ లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. దానికి అనుగుణంగా ఐపీఓ ద్వారా నిధులు సేకరించి.. వాటితో ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో వినియోగించే లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేసే మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుందని సమాచారం. నవంబర్ 17 నుంచే ప్రయత్నాలు ప్రారంభం ఓలా ఎలక్ట్రిక్ నవంబర్ 17న తన ఐపీఓ కోసం సన్నాహకాలు ప్రారంభించింది. కంపెనీ పేరును ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ నుండి ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్‌గా మార్చే ప్రయత్నాలు చేసింది. అయితే ఏదైనా కంపెనీ ఐపీఓకి రావాలంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని పబ్లిక్ కంపెనీగా మార్చాల్సి ఉంటుంది. అందుకే తన కంపెనీ పేరును మార్చనుంది. -
ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు - క్లారిటీ ఇచ్చిన సంస్థ!
Ola Electric: రెండు రోజులకు ముందు (అక్టోబర్ 28) ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు చెలరేగిన సంఘటన మీద కంపెనీ (ఓలా ఎలక్ట్రిక్) స్పందిస్తూ, ప్రమాదానికి కారణాలను వెల్లడించింది. దీని సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పూణేలోని పింప్రి - చించ్వాడ్ ప్రాంతంలో గత శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కాలిపోతుండగా.. స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇందులో స్కూటర్ నుంచి పొగలు రావడం, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆపడానికి చేసిన ప్రయత్నాలు వంటి దృశ్యాలను చూడవచ్చు. ఇదీ చదవండి: మెటాలో జాబ్.. రూ.6.5 కోట్ల వేతనం - ఎందుకు వదిలేసాడో తెలుసా? ఈ విషయంపై ఓలా కంపెనీ స్పందిస్తూ.. కంపెనీకి చెందినవి కాకుండా ఇతర పరికరాలను స్కూటర్లో ఉపయోగించడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి, ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిపింది. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు, బ్యాటరీ కూడా చెక్కుచెదరకుండా ఉపయోగించడానికి అనువుగానే ఉందని స్పష్టం చేసింది. Important update pic.twitter.com/K7pw71Xoxo — Ola Electric (@OlaElectric) October 29, 2023 -
నడిరోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు - వైరల్ వీడియో
ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో అకారణంగా మంటలు చెలరేగడం, తద్వారా అనుకోని ప్రమాదాలు సంభవించడం గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కూడా అలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పూణెలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన వీడియో పూణే మిర్రర్ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి పొగలు రావడం గమనించవచ్చు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలంలో తగిన చర్యలు తీసుకుంటున్నారు. పూణే మిర్రర్ వెల్లడించిన సమాచారం ప్రకారం, ఉదయం 8:30 గంటల ప్రాంతంలో స్కూటర్లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు, కానీ ఈ ప్రమాదానికి కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. దీనిపై ఓలా ఎలక్ట్రిక్ విచారణ చేపట్టనుంది. బాధితునికి కొత్త స్కూటర్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇదీ చదవండి: ముఖేష్ అంబానీకి మరో మెయిల్! అడిగింది ఇవ్వకుంటే చంపేస్తామంటూ.. ఎలక్ట్రిక్ వాహనాల్లో చెలరేగే మంటలపై సంబంధిత కంపెనీలు సమగ్ర వివరణ ఇవ్వాలని గతంలోనే ఆదేశించింది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ ఫైర్, ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ ఈ పరిశోధన చేపట్టి కొన్ని బ్యాటరీ ప్యాక్‌లు, మాడ్యూల్స్ డిజైన్లతో సహా బ్యాటరీలలో కొన్ని లోపాలను నివేదించింది. One more incident of an Ola electric scooter catching fire has been reported near the parking lot of D.Y Patil College in Pimpri Chinchwad. This alarming event occurred near the Institute's parking area, igniting at approximately 8:30 in the morning. Upon receiving the report,… pic.twitter.com/tr0K3yn9pp — Pune Mirror (@ThePuneMirror) October 28, 2023 -
ఓలా ఎలక్ట్రిక్‌కు రూ.3,200 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వా హనాల తయారీలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ తాజా గా రూ.3,200 కోట్ల నిధులను అందుకుంది. టెమసెక్ నేతృత్వంలోని ఇన్వెస్టర్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మొత్తాన్ని సమకూర్చాయి. ఎలక్ట్రిక్ వెహికిల్స్ వ్యాపార విస్తరణకు, అలాగే తమిళనాడులోని కృష్ణగిరి వద్ద లిథియం అయాన్ సెల్ తయారీ ప్లాంటు ఏర్పాటుకు ఈ నిధులను వెచి్చంచనున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ద్విచక్ర వాహనాల తయారీ సామర్థ్యాన్ని పెంచడం, ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లతోపాటు ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టడం.. అలాగే గిగాఫ్యాక్టరీ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా వృద్ధిని వేగవంతం చేయాలని ఓలా ఎలక్ట్రిక్ లక్ష్యంగా చేసుకుంది. ‘ఆటోమొబైల్స్ రంగంలో ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ యుగానికి ముగింపు పలకడమే మా లక్ష్యం. అంతర్జాతీయంగా ఈవీ హబ్‌గా మారే దిశగా భారత ప్రయాణంలో కంపెనీ నెలకొల్పుతున్న గిగాఫ్యాక్టరీ పెద్ద ముందడుగు. ఈవీలు, సెల్ విభాగంలో ప్రధాన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నాం. స్థిర మొబిలిటీ వైపు వేగవంతంగా మళ్లడానికి తయారీని పరుగులు పెట్టిస్తున్నాం’ అని ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్, సీఈవో భవీశ్ అగర్వాల్ తెలిపారు. -
ప్రతి పది సెకన్లకు ఒక బైక్..హాట్‌కేకుల్లా ఓలా స్కూటర్ల అమ్మకాలు!
ప్రముఖ ఎలక్ట్రిక్ తయారీ సంస్థ ఓలా ఫెస్టివల్ సేల్‌ను నిర్వహించింది. ఈ సేల్‌లో ఓలా ఈవీ బైక్స్ హాట్‌కేకుల్లా అమ్ముడు పోయాయని ఆ కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాలపై భవిష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా 2022 ఫెస్టివల్ సీజన్‌తో పోల్చితే.. ఈ ఏడాది దసరా, నవరాత్రులలో ప్రతి పది సెకన్లకు ఒక ఓలా బైక్‌ను అమ్మినట్లు పేర్కొన్నారు. దీంతో 2022 కంటే ఈ ఏడాది 2.5 రెట్లు అమ్ముడు పోయినట్లు సంతోషం వ్యక్తం చేశారు. Our sales have gone through the roof this Dussehra and Navratri! Selling a scooter every 10 seconds right now, and almost 2.5x of last year!😀 India’s EV moment is here this festive season!#endICEage — Bhavish Aggarwal (@bhash) October 24, 2023 అందుబాటులో ఐదు మోడళ్లు ఓలా దేశీయ మార్కెట్లో 5 మోడల్స్‌ను అమ్ముతుంది. గత ఆగస్ట్ నెలలో ఎస్1 ఎయిర్, ఎస్1 ప్రో జనరేషన్2, ఎస్1 ఎక్స్ పేరుతో మూడు వేరియంట్స్‌ను వాహనదారులకు పరిచయం చేసింది. 2030 నాటికి భారత్ లక్ష్యం ఇదే 2030 నాటికి భారతదేశం రోడ్ల పై ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే తిరగాలని అప్పటి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 2017లో ప్రకటించారు. అంతేకాదు, 2030 నాటికి దేశంలో 30 శాతం ప్రైవేటు కార్లు, 70 శాతం కమర్షియల్ వాహనాలు, 40 శాతం బస్సులు, 80 శాతం ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలు ఉండాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. తాజాగా, ఓలా సేల్స్ చూస్తుంటే భారత ప్రభుత్వ నిర్ధేశించిన లక్ష్యం త్వరలోనే నెరవేరుతుందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. చదవండి👉 నెలకు రూ.70వేలు సంపాదించుకోవచ్చు.. ఓలా సీఈవో బంపరాఫర్ -
గ్లాస్ సీలింగ్ బ్రేక్స్:ఈ మెకానికల్ ఇంజనీర్ గురించి తెలిస్తే ఫిదా
దేశీయ ఐఐటీ గ్రాడ్యుయేట్లు ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద కంపెనీలను లీడ్ చేస్తున్నారు. కొత్త ఆవిష్కరణకు నాంది పలుకు తున్నారు. పురుషులతో పాటు సమానంగా మహిళలు మెకానికల్ ఇంజనీరింగ్, డిజైనింగ్ రంగాల్లో సత్తా చాటుతున్నారు. కొత్త మహీంద్రా థార్‌ను డిజైన్ చేసిన మహిళ, BITS పిలానీకి చెందిన మెకానికల్ ఇంజనీర్ రామ్‌కృపా అనంతన్ విశేషంగా నిలుస్తున్నారు. ఆటోమోటివ్ పరిశ్రమలో రామ్‌కృపా అనంతన్ పేరు తెలియని వారు లేరు అతిశయోక్తి కాదు.ముఖ్యంగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్‌లో డిజైన్ హెడ్‌గా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. అంతేకాదు సొంత డిజైన్ స్టూడియోను కూడా నిర్వహిస్తున్న రామ్ కృపా అనంతన్ గురించి, ఆమె సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం. మహీంద్రా అండ్ మహీంద్ర అండ్ లేటెస్ట్ వాహనాల్లో థార్ SUVకున్న క్రేజ్గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి అంతటి ప్రజాదరణ ఉన్న థార్ 2వ తరం థార్ ఆవిష్కారం వెనుక చీఫ్ డిజైనర్ రామ్ కృపా. పాపులర్ బొలెరో, మహీంద్రా SUV విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత కూడా ఆమెదే. థార్, XUV700, స్కార్పియోలాంటి మహీంద్రా ఉత్పత్తులకు చీఫ్ డిజైనర్ గా తన సత్తా చాటుకున్నారు. ఎవరీ రామ్ కృపా అనంతన్ బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ , ఐఐటీ బాంబే నుంచి మాస్టర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్ ను పూర్తి చేశారు. ఆ తర్వాత 1997లో మహీంద్రా అండ్ మహీంద్రాలో ఇంటీరియర్ డిజైనర్‌గా కరియర్‌ను మొదలు పెట్టారు. 2005లో డిజైన్ హెడ్‌గా మహీంద్రా XUV 500 SUVని డిజైన్ చేసిన క్రెడిట్ దక్కించుకున్నారు.అలాగే XUV 700, స్కార్పియో ఐకానిక్ డిజైన్లను రూపకల్పన చేశారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత, రామ్‌కృపా అనంతన్ చీఫ్ డిజైనర్ పాత్రకు పదోన్నతి పొందారు. క్రక్స్ స్టూడియో, మైక్రో ఈవీ కాన్సెప్ట్ రెండేళ్ల తరువాత ప్రస్తుతం ఆమె సొంతంగా KRUX డిజైన్ స్టూడియో స్థాపించారు. 20 శాతం అప్‌సైకిల్ భాగాలను ఉపయోగించి Two 2 అనే మైక్రో-మొబిలిటీ కాన్సెప్ట్ వాహనాన్ని ఆవిష్కరించారు. చిన్న బ్యాటరీతో కూడా ఎక్కువ పరిధినిస్తుంది. 'ఓలా ఎలక్ట్రిక్'లో కృపా అనంతన్ దేశీయ ఈవీ మేకర్ బెంగళూరుకు చెందిన కంపెనీ తన ఎలక్ట్రిక్ కారు ‘ఓలా ఎలక్ట్రిక్ సెడాన్‌ను విడుదల చేయనుంది. దీని ధర రూ. 15 నుండి రూ. 25 లక్షల శ్రేణిలో ఉంటుందని అంచనా. గత ఏడాది ఆగస్టులో రామకృపా అనంతన్ ఓలా ఎలక్ట్రిక్స్‌లో డిజైన్ హెడ్‌గా చేరారు. ద్విచక్ర వాహనం , రాబోయే నాలుగు-చక్రాల విభాగాలకు ఆమె లీడ్‌గా ఉన్నారు. -
ఓలా ఎస్1 ఎయిర్: కస్టమర్లకు గుడ్ న్యూస్
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఎస్ 1 ఎయిర్ డెలివరీలను షురూ చేసింది. ఓలా ఎస్1,ఎస్1 ప్రోకి తరువాత గత నెలలో లాంచ్ అయిన ఇ-స్కూటర్ ఎస్ 1 ఎయిర్.ఇప్పటి వరకు 50వేల బుకింగ్‌లో ప్రజాదరణ పొందిన S1 Air డెలివరీలు 100 కంటే ఎక్కువ నగరాల్లో ప్రారంభమయ్యాయని, ఇతర మార్కెట్లలో త్వరలో మొదలవనున్నాయని కంపెనీ ఒకప్రకటనలో తెలిపింది. ఆసక్తిగల కస్టమర్లు దేశవ్యాప్తంగా 1,000కు పైగా ఎక్స్పీరియన్స్ నెట్‌వర్క్‌లో ఏదైనా ఒకదానిలో,లేదా యాప్‌ద్వారా S1 ఎయిర్, సులభమైన ఫైనాన్సింగ్ఎంపికలు తదితర సమాచారాన్ని తెలుసుకోవచ్చు అనిప్రకటించింది. S1Air 3 kWh బ్యాటరీ సామర్థ్యం, 6kW గరిష్ట మోటారు శక్తి, 151 కిమీల సర్టిఫైడ్ రేంజ్ మరియు 90 km/hr గరిష్ట వేగాన్నిఅందిస్తుంది.ట్విన్ ఫ్రంట్ ఫోర్క్, ఫ్లాట్ ఫుట్‌బోర్డ్, భారీ 34-లీటర్ బూట్ స్పేస్ , డ్యూయల్-టోన్బాడీ కలిగి ఉంది. ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి ఛార్జింగ్ చేస్తే 125 కిలోమీటర్ల వరకు ప్రయాణించ వచ్చు. స్టెల్లార్ బ్లూ, నియాన్, పింగాణీ వైట్, కోరల్ గ్లామ్, లిక్విడ్ సిల్వర్ , మిడ్నైట్ బ్లూ ఆరు రంగుల్లో అందుబాటులో ఉంది. -
కళ్లు చెదిరేలా ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ.. వీడియోలు షేర్ చేసిన సీఈవో
భారతీయ మార్కెట్లో ప్రారంభం నుంచి అత్యధిక ప్రజాదరణ పొందుతున్న ఓలా ఎలక్ట్రిక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒక్క డీలర్షిప్ కూడా లేకుండా అధిక విక్రయాలు పొందిన ఈ సంస్థ ఇప్పుడు మరింత దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో భాగంగానే ఇటీవల ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ రెండు వీడియోలను ట్విటర్ వేదికగా షేర్ చేశారు. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సీఈఓ భవిష్ అగర్వాల్ ఓలా ఫ్యూచర్ఫ్యాక్టరీకి సంబంధించిన వీడియోలను షేర్ చేశారు. ఇందులోని ఒక వీడియో కంపెనీలో లోపల జరుగుతున్న కార్యకలాపాలను చూపిస్తోంది. మరో వీడియోలో నిర్మాణంలో వేగంగా దూసుకెళ్తున్న గిగాఫ్యాక్టరీని చూడవచ్చు. ఇదీ చదవండి: రూ. 200 కోట్లు కంటే ఎక్కువ ఖరీదైన కారు! ఎందుకింత రేటు? ఈ వీడియోలను షేర్ చేస్తూ ఈ రోజు ఫ్యూచర్‌ఫ్యాక్టరీలో.. రానున్న రోజుల్లో ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరుగుతుందని ట్వీట్ చేసాడు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే వేలమంది వీటిని వీక్షించగా.. చాలా మంది లైక్ చేస్తున్నారు. మరి కొందరు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. At the Futurefactory today. Major changeover from Gen 1 production to all Gen 2 products happening this week - Air, Pro, X! Capacity doubling and number of products going from 1 to 5. Also, Gigafactory construction underway. Crazy momentum and activity! pic.twitter.com/bymdf8qoPG — Bhavish Aggarwal (@bhash) August 20, 2023 -
సంతకం చేయలేకపోయిన కొత్త ఉద్యోగి! ఎందుకో తెలిస్తే..
Ola Electric New Employee: భారతీయ దిగ్గజ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ 'ఓలా' మార్కెట్లో పొందుతున్న ప్రజాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్1, ఎస్1 ప్రో, ఎస్ 1 ఎయిర్ అనే మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో మంచి అమ్మకాలను పొందింది. అయితే తాజాగా ఎస్1 స్కూటర్ ఉత్పత్తి నిలిపి వేసి ఆ స్థానంలో ఎస్1 ఎయిర్ ఉత్పత్తికి ప్రాధాన్యత కల్పితూ ప్రొడక్షన్ కూడా ప్రారంభించింది. కొత్త ఉద్యోగి.. ఓలా ఎస్1 ఎయిర్ లైమ్ గ్రీన్ స్కూటర్ మీద కంపెనీ ఉద్యోగులు సంతకాలు చేశారు. కానీ ఇటీవల ఉద్యోగిగా నియమితమైన 'బిజిలీ' (కుక్క) మాత్రం సంతకం చేయకుండా సీటుపై కూర్చుంది. దీనికి సంబంధించిన ఒక ఫోటో సంస్థ సీఈఓ తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే చాలా మంది కస్టమర్లు ఎస్1 ఎయిర్ స్కూటర్ కోసం బుకింగ్స్ చేసుకుంటున్నారు. డెలివరీలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. దీని ధర రూ. 85099 నుంచి రూ. 1.1 లక్షల మధ్య ఉండనుంది. డిజైన్ అండ్ ఫీచర్స్ అన్నీ కూడా దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటుంది. ఈ స్కూటర్ ధర ఈ నెల 15 తరువాత రూ. 10వేలు వరకు పెరిగే అవకాశం ఉంది. ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ వేతనం ఎంతో తెలుసా? మరో ఐదేళ్లూ అదే జీతం! ఇక బిజిలీ విషయానికి వస్తే.. గత కొన్ని రోజులకు ముందు కంపెనీ సీఈఓ కుక్కకు ఉద్యోగం కల్పిస్తూ దానికి ఐడీ కార్డుని కూడా ప్రొవైడ్ చేశారు. దీనికి 440V అనే ఎంప్లాయ్ ఐడీ, బ్లడ్ గ్రూప్, అడ్రస్ వంటి వాటిని కూడా దాని కార్డులో మెన్షన్ చేశారు. ఇతర ఉద్యోగులకు మాదిరిగానే దీనికి సకల సదుపాయాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. The first S1 Air. Bijlee couldn’t sign so she sat on it! pic.twitter.com/7zwhpmjmI5 — Bhavish Aggarwal (@bhash) August 6, 2023 -
కుక్కకు జాబ్ ఇచ్చిన కంపెనీ సీఈఓ.. వైరల్ పోస్ట్!
ప్రైవేట్ సంస్థల్లో అయినా ప్రభుత్వ కార్యాలయాల్లో అయినా ఎక్కడైనా మనుషులే ఉద్యోగాలు చేస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఓలా సీఈఓ బెంగళూరు సమీపంలో ఉన్న కంపెనీ ఆఫీసులో కుక్కకి ఉద్యోగం ఇచ్చినట్లు, దానికి సంబంధించిన ఫోటోలను ట్విటర్ ద్వారా షేర్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, బిజ్లీ (Bijlee) అనే శునకాన్ని కంపెనీ ఉద్యోగిగా చేర్చుకున్నట్లు భవిష్ అగర్వాల్ అధికారికంగా వెల్లడించాడు. దీనికి 440V అనే ఎంప్లాయ్ ఐడీ, బ్లడ్ గ్రూప్, అడ్రస్ వంటి వాటిని కూడా దాని కార్డులో మెన్షన్ చేశారు. ఇతర ఉద్యోగులకు మాదిరిగానే దీనికి సకల సదుపాయాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ధనవంతుడవ్వాలనే తపన సరిపోదు.. ఈ టిప్స్ తప్పనిసరి! ఓలా సీఈఓ గతంలో కూడా కుక్కలకు సంబంధించిన పోస్టులను ట్విటర్ వేదికగా షేర్ చేశారు. అయితే ఈ సారి ఉద్యోగమిచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు. ఇది కోరమంగళ ఇండస్ట్రియల్ ఎస్టేట్, హోసూర్ రోడ్డు, బెంగళూరులో పనిచేయనుంది. ఈ పోస్ట్ చూసిన చాలామంది నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అతి తక్కువ సమయంలో ఈ కుక్క ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగిపోయింది. New colleague now officially! pic.twitter.com/dFtGMsOFVX — Bhavish Aggarwal (@bhash) July 30, 2023 -
షాకింగ్: ఓలా ఎస్1 స్కూటర్‌కు గుడ్ బై, కస్టమర్లు ఏం చేయాలి?
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. 2021లో విడుదల చేసిన తన ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు ప్రకటించింది. కంపెనీ తన అధికారిక వెబ్సైట్ నుండి ఎస్1 వేరియంట్‌ను తొలగించి ఎస్1 ప్రోపై, ఎస్ 1 ఎయిర్ మోడల్స్ ఫోకస్ పెట్టనుంది. ఓలా ఎస్ 1 ఎయిర్ లాంచింగ్ సందర్బంగా ఎస్1 స్కూటర్ అమ్మకాలను నిలిపివేస్తున్నట్టు ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది. ఈ నిర్ణయానికి కారణంపై స్పష్టతలేదు. అయితే పరిమిత ఉత్పత్తి సామర్థ్యం ,ఇతర వేరియంట్లకు అధిక డిమాండ్ కారణంగా కావచ్చని అంచనా. దీని ప్రకారం ఇకపై ఓలా పోర్ట్‌ఫోలియోలో ఎస్1 ఎయిర్, ఎస్1 ప్రో మోడల్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఫీచర్ల పరంగా ఎస్ 1 ఎయిర్, ఎస్1 ప్రొ దాదాపు ఒకే రకంగా ఉన్న కారణంగా ఎస్ 1 వేరియంట్ అమ్మకాలను నిలిపి వేసిందే మోననేది అంచనా. అలాగే రెండింటీ మధ్య పేర్లలో భిన్నం తప్ప పెద్దగా తేడా ఏమీ లేదని భావిస్తున్నారు. (ఢిల్లీలో అత్యంత సంపన్న మహిళ ఎవరో తెలుసా? నిర్మాత కూడా!) ఎస్1 బుక్ చేసుకున్న వారు ఏంచేయాలి? ఎస్1 వేరియంట్‌ను బుక్ చేసిన కస్టమర్లు ప్లాన్లలో మార్పు గురించి తెలియజేస్తూ కంపెనీ ఇమెయిల్‌ను పంపింది. ఈక్రమంలో వారికి మూడు ఆప్షన్లు ఇచ్చింది. S1 ప్రో వేరియంట్‌కి అప్‌గ్రేడ్ కావడం, 2022 చివరిలో ఎస్1 ప్రొడక్షన్ పునఃప్రారంభమయ్యే వరకు వేచి ఉండటం లేదా వారి బుకింగ్‌ను రద్దు చేసి మనీ రీఫండ్ పొందడం. ఎస్ 1 ప్రొ ధర రూ. 1,29,999, ఎక్స్-షోరూమ్ (FAME 2 సబ్సిడీతో సహా). ఓలా యాప్‌లో జనవరి 21న సాయంత్రం 6 గంటలకు తుది చెల్లింపు విండో తెరిచినప్పుడు అప్‌గ్రేడ్‌ని ఎంచుకున్న కస్టమర్లు రూ. 30,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఓల్ ఎస్1 ఎయిర్ ఇప్పటికే ఉన్న కస్లమర్లకోసం ముందస్తు బుకింగ్‌లను మొదలు పెట్టింది. విండోను తెరిచిన మొదలు పెట్టిన గంటలోపు 1,000 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిందని సీఈఓ భవిష్ అగర్వాల్ ట్విటర్లో ప్రకటించారు. సామాన్య ప్రజానీకం ప్రజల ఈ నెల 31నుంచి సేల్ షురూ అవుతుంది. ఎస్1 ఎయిర్ డెలివరీలు ఆగస్టు 2023లో ప్రారంభమవుతాయి. ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ఎయిర్ ధర రూ. 85,099-1.1లక్షల మధ్యలో ఉంటుందని భావిస్తున్నారు. After S1 Air, buying an ICE scooter means losing money every month. BUY EV and save money!! pic.twitter.com/GkBVThEyN1 — Bhavish Aggarwal (@bhash) July 28, 2023 ఫ్యూచర్ ప్లాన్స్ అలాగే ఓలా OS4పై పని చేస్తోందట. త్వరలో సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించనుందని మార్కెట్ వర్గాల అంచనా. అంతేకాదు .ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లపై కూడా పని చేస్తోంది. తమ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను విస్తరింపజేయనున్నామని భవిష్ హింట్ కూడా ఇచ్చిన నేపథ్యంలో ఓలా బైకులు కూడా రంగంలోకి దిగనున్నాయనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. 3000! I’m also heading to the factory now 😳 https://t.co/q89piwCOfA — Bhavish Aggarwal (@bhash) July 27, 2023 -
మంటల్లో కాలిన ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫోటోలు వైరల్!
Electric Scooter Fire: దేశీయ మార్కెట్లో ప్రారంభం నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన ఓలా ఎలక్ట్రిక్ మధ్యలో కొన్ని అవాంతరాలను కూడా ఎదుర్కొంది. ఇందులో బ్యాటరీ ఫైర్ అవ్వడం, ముందు భాగంలో ఉండే పోర్క్ ఇస్స్యూ వంటివి ఉన్నాయి. కాగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూండా చూసుకుంటామని కంపెనీ సీఈఓ భవిష్ అగార్వల్ తెలిపారు. అయితే మళ్ళీ కేరళలో ఎలక్ట్రిక్ స్కూటర్ మంటల్లో కాలిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కేరళలోని తిరువనంతపురంలో జరిగిన సంఘటనలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా మంటల్లో కాలిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపైన జులై 19న నెడుమంగడ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అగ్ని ప్రమాదానికి కారణం ఏంటనే దిశలో విచారణ జరుగుతోంది. ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంటి ఆవరణలో నిలిపి ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు బాధితుడు వెల్లడించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో రూ. 1.49 లక్షల ఖరీదైన స్కూటర్ దాదాపు కాలిపోయింది. ఈ ప్రమాదంలో టీవీ వంటివి కాలిపోయి మొత్తం మీద సుమారు రూ. 4.49 లక్షలు నష్టం వాటిల్లినట్లు కూడా తెలుస్తోంది. పోలీసులు ఈ విషయం మీద కంపెనీలు మెయిల్ పంపినట్లు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్లు మంటల్లో కాలిపోవడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలో చాలానే వెలుగులోకి వచ్చాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. సంబంధిత కంపెనీలు దీనిమీద స్పష్టమైన రిపోర్ట్ అందించాలని అప్పట్లోనే ఆదేశించింది. కానీ చాలా రోజుల తరువాత మళ్ళీ స్కూటర్ కాలిపోయిన సంఘట వెలుగులోకి రావడం మళ్ళీ ప్రశార్థకంగా మారింది. దీనిపైన కంపెనీ ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది. Ola S1 pro burnt in Thiruvananthapuram Kerala, details awaited @OlaElectric pic.twitter.com/z6JC1IUuZC — fasil (@fasilfaaaz) July 22, 2023 -
ఓలా ఎస్1 ఎయిర్ లాంచింగ్ బంపర్ ఆఫర్: మూడు రోజులే!
Ola S1 Air introductory price: దేశీయ అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఓలా లేటెస్ట్ ఓలా S1 ఎయిర్. దీనికి సంబంధించి ఒక కీలకవిషయాన్ని ఓలా సీఈఓ భవిష్అగర్వాల్ ప్రకటించారు. పరిచయ ఆఫర్‌గా 10వేల తగ్గింపును ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు.ఎస్1 ఎయిర్ జూలై 28- 30 తేదీల మధ్య కొనుగోలు చేసిన వారికి ప్రారంభ ధర రూ. 1,09,999కే లభిస్తుందని పేర్కొన్నారు. జూలై 31 తరువాత దీని ధర రూ. 1,19,999గా ఉంటుదని, అందుకే ఇపుడే మీ ఎలాఎస్1 ఎయిర్‌ను తక్కువ ధరకే రిజర్వ్ చేసుకోమ్మని సూచించారు. అలాగే S1ఎయిర్ డెలివరీ ఆగస్టు ప్రారంభంలో ప్రారంభమవు తుందని చెప్పారు. 500,000 కి.మీ వరకు పరీక్షించామని కూడా ఆయన వెల్లడించారు. గత రెండు నెలలుగా వ్యక్తిగతంగా ఎస్1 ఎయిర్ని చాలా ఎక్కువగా నడిపాను.. ఇది నిజంగా అద్భుతమైన స్కూటర్ అతి త్వరలో వస్తుందిన ట్వీట్ చేశారు. ఓలా నుంచి అత్యంత చవకైన మోడల్ ఓలా ఎస్ 1 ఎయిర్ స్కూటర్ జూలై నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని గతంలో ప్రకటించారు. 999 రూపాయల వద్ద ఈ స్కూటర్ కు సంబంధించిన ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రధానంగా FAME సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం సవరించిన నేపథ్యంలో రూ.1.10 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. 3 kWh బ్యాటరీతో లాంచ్ అయిన ఎస్1 ఎయిర్ పూర్తి ఛార్జ్‌పై 125 కిమీ రేంజ్‌ను అందిస్తుంది. అలాగే గరిష్ఠంగా గంటకు 85 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. Purchase for S1 Air will open from 28th July-30th July for reservers and all our existing community, at an introductory price of ₹1,09,999. Everyone else can purchase from 31st July at ₹1,19,999. Reserve now to get the introductory price! Deliveries start early August! pic.twitter.com/EBM35oSh0B — Bhavish Aggarwal (@bhash) July 21, 2023 -
మరో వివాదంలో ఓలా ఎలక్ట్రిక్: సోషల్ మీడియాలో ఫోటో వైరల్
Ola Electric Scooter : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించి ఒక వివాదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అత్యాధునిక ఫీచర్లతో ఈవీ స్కూటర్లను లాంచ్ చేసి, ఈవీ మార్కెట్లో దూసుకుపోతున్న ఓలా ఎలక్ట్రిక్‌పై తాజాగా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్, బ్యాటరీ చార్జింగ్, క్వాలిటీ దుమారం మరోసారి వెలుగులోకి వచ్చింది. (కాగ్నిజెంట్ సీఈవో కీలక నిర్ణయం: ఉద్యోగుల్లో ఉత్సాహం) 20 శాతం చార్జ్కాగానే ఆగిపోతోందంటూ ఓలా S1 స్కూటర్ వినియోగదారుడు ఆందోళన వ్యక్తం చేసిన ఫొటో ఒకటి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఈ స్కూటర్ సమస్యలను పరిష్కరించడంలో ఓలా టీమ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సంబంధిత కస్టమర్ సర్వీస్ సెంటర్ ముందు ఒక బ్యానర్‌తో సహా స్కూటర్‌ను నిలిపాడు. ఏడాది కాలంగా స్కూటర్‌ను ఉపయోగిస్తున్నాను..ఈ స్కూటర్‌ను వదిలి వెళ్లినప్పటి నుంచి తనకు సర్వీస్ సెంటర్ నుంచి ఎలాంటి కాల్స్ రాలేదని, వారిని సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు స్పందించడం లేదని పేర్కొన్నాడు. అలాగే స్కూటర్లోని అలైన్మెంట్ బుష్ ఐదుసార్లు మార్చానని కూడా పేర్కొన్నాడు. (సాక్షి మనీ మంత్రా: రికార్డు స్థాయిలో మార్కెట్ దూకుడు.. తగ్గేదేలే!) దీనికి సంబంధించి ఫొటోను ఓలా ఎలక్ట్రిక్ పేరడీ అనే ట్విటర్ ఖాతాలో ఇది పోస్టు అయింది. ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీకాదు.. ఇదో అధ్వాన్నమైన సర్వీస్ సెంటర్ అని కమెంట్ చేయడం గమనార్హం. అంతేకాదు ఈ పోస్ట్ క్రింద, తమ కెదురైన అనుభవాలను ఓలా స్కూటర్ కస్టమర్లు ఫోటోలు షేర్ చేయడం గమనార్హం. ఓలాను స్కామ్ కంపెనీ అని మరొకరు పేర్కొన్నారు. అయితే దీనిపై ఓలా అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOP) ప్రకారం వివరాలను కోరినట్టు తెలుస్తోంది. #News #OLAElectricComplaints #OLAElectric #CustomersProtesthttps://t.co/PhFDv1dulT — Ola Electric #Parody (@OlaEV_parody) July 19, 2023 అయితే ఇలాంటి ఫిర్యాదులు రావడం ఇదే తొలిసారి కాదు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిందో అంతే విమర్శలను కూడా ఎదుర్కొంది. గతంలో ఓలా S1 స్కూటర్లపై కొనుగోలు చేసిన కస్టమర్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ స్కూటర్లను రీకాల్ చేసిన సంగతి తెలిసిందే. Calicut ola service center work overload approx 200 scooters work pending Service slot not available now We also need two service centers Please resolve this as soon as possible@bhash @OlaElectric pic.twitter.com/mhT7vD3ltJ — fasil (@fasilfaaaz) July 19, 2023 -
మరో ఓలా స్కూటర్ రానుందా? భవిష్ అగర్వాల్ ఏం చెబుతున్నాడంటే?
Ola Upcoming Electric Scooter: భారతీయ మార్కెట్లో ప్రారంభం నుంచి మంచి ఆదరణ పొందుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన దిగ్గజం 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) ఇప్పుడు మార్కెట్లో మరో స్కూటర్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విషయాన్ని ఓలా సీఈఓ 'భవిష్ అగర్వాల్' (Bhavish Aggarwal) తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. భవిష్ అగర్వాల్ ట్విటర్ ద్వారా అందించిన సమాచారం ప్రకారం, వచ్చే నెలలో (2023 జూలై) మరో ఉత్పత్తిని వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. దీనిని ఎండ్ఐస్ఏజ్ (#endICEAge) షో పార్ట్ వన్ అని అన్నారు. అయితే త్వరలో వెల్లడించనున్న స్కూటర్ ఏది అనేదానికి సంబంధించిన అధికారిక వివరాలను వెల్లడించలేదు. ఇప్పటికే మార్కెట్లో విక్రయానికి ఉన్న ఓలా ఎస్1, ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ జాబితాలో మరో స్కూటర్ చేరనుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని భావిస్తున్నాము. ఇది కూడా ఇప్పటికే ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగా తప్పకుండా మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉంది. Announcing our next product event in July. Calling it the #endICEAge show, Part 1! Part 1 of the show would end ICE age in scooters! With S1 Pro, S1 Air and … XXXX 😉😎 And maybe one more thing!😀 pic.twitter.com/7Qz5JRg9I7 — Bhavish Aggarwal (@bhash) June 19, 2023 -
ఫాక్స్‌కాన్ రంగంలోకి: రాయిల్ ఎన్ఫీల్డ్, ఓలా ఏమైపోవాలి?
ప్రపంచంలోనే అతిపెద్ద యాపిల్ ఐఫోన్ తయారీ ఫాక్స్‌కాన్ భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోందట. ఈమేరకు ప్రస్తుతం పలు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీంతో ఈ-బైక్ మార్కెట్లో రానున్నకాలంలో కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లను రిలీజ్ చేయాలని భావిస్తున్న ఓలా ఎలక్ట్రిక్, రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థలకు గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, యాపిల్ ఐఫోన్ తయారీదారు తన వార్షిక నివేదికలో ఆగ్నేయాసియాలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ప్లాంట్‌ను స్థాపించడానికి కంపెనీకి సహాయం చేస్తుందని పేర్కొంది. దీనిపై ఫాక్స్‌కాన్ ఎగ్జిక్యూటివ్‌లతో చర్చించడానికి భారతీయ ప్రతినిధి బృందం త్వరలో తైవాన్ను సందర్శించాలని యోచిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. అయితే పలు బ్రాండ్ ఎలక్ట్రిక్ టూవీలర్స్‌ను తయారు చేస్తుందా లేదా జాయింట్ వెంచర్ ద్వారా ఒకే బ్రాండ్‌కు పరిమితమవుతుందా అనేది స్పష్టత లేదు. (టీసీఎస్‌కు భారీ ఎదురుదెబ్బ: బిగ్ డీల్ నుంచి ట్రాన్సామెరికా ఔట్!) కాగా ఇప్పటికే తమిళనాడులో పెద్ద ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్న ఫాక్స్‌కాన్ మహారాష్ట్రలో కూడా ఈవీ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ఆసక్తిగా ఉంది. అటు తెలంగాణపై కూడా దృష్టి సారిస్తోన్న సంగతి తెలిసిందే. (అమెరికా గుడ్ న్యూస్: వీలైనన్ని ఎక్కువ వీసాలిచ్చేందుకు తీవ్ర కృషి!) -
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త ధరలు - ఇలా ఉన్నాయి
Ola Electric Price Hiked: భారతదేశంలో రోజు రోజుకి మంచి అమ్మకాలతో దూసుకెళ్తున్న 'ఓలా ఎలక్ట్రిక్' ఇప్పుడు కస్టమర్లకు ఒక షాకింగ్ న్యూస్ వెల్లడించింది. కంపెనీ ఇప్పుడు తన ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను అమాంతం పెంచినట్లు ప్రకటించింది. ఓలా ఎలక్ట్రిక్ కొత్త ధరలను గురించి మరికొన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొత్త ధరలు.. నివేదికల ప్రకారం.. ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 & ఎస్1 ప్రో ధరలు మాత్రమే పెరిగాయి. ఎంట్రీ లెవెల్ మోడల్ అయిన 'ఎస్1 ఎయిర్' ధరలు మారలేదు. ఓలా మిడ్-స్పెక్ ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్లనులో లభిస్తుంది. అవి ఒకటి 2 కిలోవాట్ బ్యాటరీ కలిగిన వేరియంట్, రెండు 3 కిలోవాట్ బ్యాటరీ కలిగిన వేరియంట్. గతంలో ఎస్1 3kWh ధర రూ. 1.15 లక్షలు కాగా, ఇప్పుడు ఈ స్కూటర్ ధర రూ. 15,000 పెరిగి రూ. 1.30 లక్షలు చేరింది. అదే సమయంలో S1 ప్రో ధర రూ. 1.40 లక్షలకు చేరింది. (ఇదీ చదవండి: ఇప్పుడు ప్రపంచ కుబేరుడు ఇతడే..) ఇక ఓలా ఎలక్ట్రిక్ ఎంట్రీ లెవెల్ మోడల్ ఎస్1 ఎయిర్ విషయానికి వస్తే, ఇది 2kWh, 3kWh, 4kWh అనే మూడు బ్యాటరీ ఫ్యాక్స్ కలిగి ఉంటుంది. వీటి ధరలు వరుసగా రూ. 84999, రూ. 99999, రూ. 1.10 లక్షలు. రేంజ్ విషయానికి వస్తే 85 కిమీ, 125 కిమీ, 165 కిమీ. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇవి చాలా ఉత్తమంగా ఉంటాయి. ధరల పెరుగుదల అమ్మకాలపైన ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నాము. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
భవిష్ అగర్వాల్ ట్వీట్.. ఇలా చేస్తే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మీదే..!
Ola S1 Pro Special Edition: ఆధునిక కాలాన్ని సోషల్ మీడియా ప్రపంచాన్ని ఎలేస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏమి జరిగినా నిమిషాల్లో వైరల్ అయిపోతోంది. అంతే కాకుండా కొన్ని సంఘటన మీద ట్రోల్స్ అండ్ మీమ్స్ మరింత ఎక్కువవుతున్నాయి. మీమ్స్ చేసేవారికి ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భవిష్ అగర్వాల్ ట్విటర్ వేదికగా ఐసీఈ అండ్ పెట్రోల్ వెహికల్స్ మీద మీమ్స్ చేయడానికి ట్రై చేయండి, అందులో ఒక బెస్ట్ మీమ్స్ చేసిన ఒకరికి ఓలా ఎస్1 ప్రో స్పెషల్ ఎడిషన్ లభిస్తుందని ట్వీట్ చేసాడు. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ చక్కర్లు కొట్టేస్తోంది. ఇప్పటికే కొంత మంది మీమ్స్ చేయడం ప్రారంభించి పోస్ట్ కూడా చేస్తున్నారు. Trying to make some funny ICE and petrol vehicle memes. If you have some, share here! Best one today will get an Ola S1 Pro special edition 🙂 — Bhavish Aggarwal (@bhash) May 27, 2023 ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ఉచితంగా కావాలనుకునేవారు ఐసీఈ, పెట్రోల్ వెహికల్స్ మీద మీమ్స్ చేయవచ్చు. ఇది మీమ్స్ చేసేవారికి మంచి సువర్ణావకాశమనే చెప్పాలి. ఎందుకంటే రూ. లక్ష కంటే ఎక్కువ ఖరీదైన స్కూటర్ ఒక్క మీమ్స్ చేయడం ద్వారా ఉచితంగా పొందవచ్చు. బహుశా ఈ అవకాశం ఈ రోజు మాత్రమే అని తెలుస్తోంది. -
500వ షోరూమ్ ప్రారంభించిన ఓలా ఎలక్ట్రిక్ - ఎక్కడంటే?
దేశీయ మార్కెట్లో ప్రారంభం నుంచి మంచి ఆదరణ పొందుతూ ఉత్తమ అమ్మకాలు పొందిన 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) ఎట్టకేలకు తన 500వ షోరూమ్ ప్రారంభించింది. ప్రారంభంలో ఒక్క షోరూమ్ కూడా లేకుండా మొదలైన ఓలా ఇప్పుడు భారీ స్థాయిలో ఎక్స్పీరియన్స్ సెంటర్స్ & షోరూమ్‌లను ప్రారంభించడంలో బిజీ అయిపోయింది. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పుడు ఈ షోరూమ్ ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు తన 500వ షోరూమ్‌ను జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 300 నగరాల్లో ఓలా షోరూమ్ ఉన్నట్లు సమాచారం. అయితే 2023 ఆగష్టు నాటికి దేశంలో ఈ షోరూమ్‌ల సంఖ్య 1000కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం కంపెనీ తగిన ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ ఎక్స్పీరియన్స్ సెంటర్లను, షోరూమ్‌లను పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నప్పటికీ కొనుగోలుదారులు మాత్రం ఎక్కువ భాగం కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా యాప్‌ల ద్వారా వాహనాలను బుక్ చేసుకుంటున్నారు. అయితే కంపెనీకి చెందిన షోరూమ్‌లు వాహనాలను గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మాత్రమే కాకుండా టెస్ట్ రైడ్ వంటి సదుపాయాలను అందించడానికి ఉపయోగపడుతున్నాయి. (ఇదీ చదవండి: బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. జీరో బ్యాలెన్స్ ఉన్నా నో వర్రీస్!) ఓలా 500వ స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా కంపెనీ సిఎమ్ఓ 'అన్షుల్ ఖండేల్వాల్' మాట్లాడుతూ.. ప్రస్తుతం 500వ షోరూమ్ ప్రారంభమైంది, అయితే రానున్న రోజుల్లో మరిన్ని సవాళ్ళను ఎదుర్కోవడానికి సంస్థ సిద్ధంగా ఉంటుందన్నారు. భారత్‌కు సుస్థిర భవిష్యత్తు అందించడానికి తమ కృషి ఇలాగే కొనసాగుతూ ఉంటుందని ఆయన అన్నారు. (ఇదీ చదవండి: ట్రక్కు డ్రైవర్‌గా మారిన ఇంజినీర్.. సంపాదన రూ. 50 లక్షల కంటే ఎక్కువే!) ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ విభాగంలో ఓలా ఎలక్ట్రిక్ వాటా సుమారు 40 శాతం వరకు ఉంది. కంపెనీ గత నెలలో ఏకంగా 30,000 యూనిట్లకుపైగా విక్రయించి, ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో గత కొన్ని నెలలుగా అగ్రస్థానంలో నిలబడింది. రానున్న రోజుల్లో కూడా కంపెనీ మరింత గొప్ప అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము. -
ఈ–స్కూటర్ కస్టమర్లకు చార్జర్ డబ్బు వాపస్
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాలతో పాటు చార్జర్లను విడిగా కొనుగోలు చేసిన కస్టమర్లకు సదరు చార్జర్ల డబ్బును వాపసు చేయనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్, ఎథర్ ఎనర్జీ తెలిపాయి. ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. స్వార్ధ శక్తులు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ విద్యుత్ వాహనాల పరిశ్రమ గత కొన్నాళ్లుగా అసాధారణంగా వృద్ధి చెందినట్లు సోషల్ మీడియా సైట్ ట్విటర్లో ఓలా పేర్కొంది. ఈ నేపథ్యంలో కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అర్హులైన కస్టమర్లందరికీ చార్జర్ల డబ్బును తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. అయితే, ఎంత మొత్తం చెల్లించనున్నదీ మాత్రం వెల్లడించలేదు. ఇది సుమారు రూ. 130 కోట్లు ఉండొచ్చని అంచనాలు నెలకొన్నాయి. ఇక, ఈవీ స్కూటర్లతో కలిపే చార్జర్లను విక్రయించే అంశంపై భారీ పరిశ్రమల శాఖతో కొన్నాళ్లుగా చర్చలు జరుపుతున్నట్లు ఎథర్ ఎనర్జీ తెలిపింది. చట్టబద్ధంగా ఇలా చేయాల్సిన అవసరం లేనప్పటికీ వాహనాలతో పాటే చార్జరును కూడా ఇచ్చేలా తమ నిబంధనలు మార్చుకున్నట్లు వివరించింది. అలాగే 2023 ఏప్రిల్ 12కు ముందు కొనుగోలు చేసిన వాహనాల విషయంలో చార్జర్లకు వసూలు చేసిన మొత్తాన్ని రిఫండ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఇదే తరహాలో టీవీఎస్ మోటార్ కంపెనీ తాము రూ. 20 కోట్లు పైచిలుకు వాపసు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. -
ఓలా స్కూటర్ పోయింది... ఈ టెక్నాలజీతో దొరికింది
-
దేశంలో పెరిగిపోతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం.. కింగ్ మేకర్‌గా ఓలా
దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. వాహనదారుల్లో అవగాహన పెరిగిపోతుండడం, ఆర్ధిక పరమైన అంశాలు కలిసి రావడంతో ఈవీ వెహికల్స్‌ను కొనుగోలు చేసేందుకు మక్కువ చూపిస్తున్నారు. రెడ్‌సీర్ నివేదిక ప్రకారం.. ఆర్ధిక సంవత్సరం 2023లో దాదాపూ 7.3లక్షల ఈవీ టూ వీలర్ వెహికల్స్ అమ్ముడు పోయ్యాయి. ఈ వెహికల్స్ అమ్మకాలు ఆర్ధిక సంవత్సరం 2022 కంటే 3 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈవీ ద్విచక్రవాహనాల విభాగంలో 22 శాతం మార్కెట్ వాటాతో ఓలా అగ్రస్థానంలో కొనసాగుతుంది. మార్చి త్రైమాసికంలో దాని వాటా 30 శాతానికి చేరుకుంది. "ఎండ్-టు-ఎండ్ డిజిటల్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు, టెక్-ఫస్ట్ ప్రొడక్ట్ వంటి అంశాలు ఓలాకు కలిసి వచ్చాయని రెడ్‌సీర్ తన నివేదికలో పేర్కొంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓలా ఎలక్ట్రిక్ బాస్ భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ..ఈవీ రంగం సాంకేతికతతో కూడుకున్నది. అందులో ఒకటి సాఫ్ట్వేర్, బ్యాటరీ. ఈ రెండింటిలోనూ మాకు నైపుణ్యం ఉందని అన్నారు. కాబట్టే తమ సంస్థ ఉన్నతమైన లక్ష్యాలు చేరుకోవడంలో పోటీపడుతున్నట్లు తెలిపారు. -
పోయిందనుకున్న స్కూటర్ పట్టించింది - ఓలా ఫీచర్.. అదిరిపోలా!
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో 'ఓలా' ఒకటి. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రారంభంలో కొన్ని సమస్యలకు గురైనప్పటికీ, ప్రస్తుతం మంచి సంఖ్యలో అమ్మకాలను పొందుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఇందులో ఉన్న అప్డేటెడ్ ఫీచర్స్ అనే చెప్పాలి. ఇందులో ఆ ఫీచర్స్ ఇటీవల దొంగతనం సమయంలో కూడా గుర్తించడానికి సహాయపడ్డాయి. నివేదికల ప్రకారం, జోధ్‌పూర్ ప్రాంతానికి చెందిన 'అంజలి పాల్' అనే మహిళ ఓలా స్కూటర్‌ను గుర్తుతెలియని దుండగులు దొంగలించి ప్యాకర్స్ అండ్ మూవర్స్ సహాయంతో వేరే నగరానికి పంపించాలి నిర్చియించుకుని దానిని పూర్తిగా ప్యాక్ చేసి ఉంచారు. అయితే స్కూటర్ పోగొట్టుకున్న అంజలి తన ఎలక్ట్రిక్ స్కూటర్లోని జిపిఎస్ నావిగేషన్ ద్వారా పోలీసుల సహాయంతో పట్టుకుంది. స్కూటర్ దొంగిలించబడిన తర్వాత అది ఎక్కడ ఉందో కనిపెట్టడానికి ఓనర్ లొకేషన్ ట్రాకింగ్ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగానే అంజలి పాల్ తన స్కూటర్ కనిపెట్టగలిగింది. దీనికి కంపెనీ కూడా సహాయం చేసినట్లు తెలుస్తోంది. జోధ్‌పూర్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైపూర్‌లో ఈ స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ తమ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఆధునిక ఫీచర్స్ అందిస్తుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నిజానికి దొంగల భారీ నుంచి రక్షించుకోవడానికి కార్లలో, బైకులలో యాంటీ తెఫ్ట్ అలారం వంటివి అందిస్తారు. దీనితో పాటు నావిగేషన్ అందుబాటులో ఉన్నప్పుడు దొంగతనం జరిగిన తర్వాత కూడా కనిపెట్టడానికి సహాయపడుతుంది. (ఇదీ చదవండి: Boult Rover Pro: కేవలం రూ. 2499కే స్మార్ట్‌వాచ్: లేటెస్ట్ డిజైన్ & అంతకు మించిన ఫీచర్స్) లేటెస్ట్ వాహనాల్లో యాంటీ-థెఫ్ట్ అలారం వంటి ఫీచర్స్ అందుబాటులో ఉన్నప్పటికీ దొంగిలించడానికి దొంగలు కూడా అధునాతన సాధనాలను ఉపయోగిస్తున్నారు. అలాంటి సమయంలో దొంగతనాలకు చెక్ పెట్టడానికి స్టీరింగ్ లాక్స్, గేర్ లాక్స్, వీల్ లాక్స్ & జిపిఎస్ ట్రాకర్స్ చాలా ఉపయోగాడతాయి. (ఇదీ చదవండి: సి3 కొత్త వేరియంట్ లాంచ్ చేసిన సిట్రోయెన్ - ధర ఎంతంటే?) గతంలో కూడా జిపిఎస్ లొకేషన్ అండ్ టెక్నాలజీ ద్వారా అనేక హై ఎండ్ కార్లు రికవరీ చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం ఓలా వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లు అలాంటి ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల మాత్రమే పోయిన స్కూటర్ మళ్ళీ పొందగలిగారు. ఇది నిజంగా కంపెనీ కస్టమర్లకు అందించిన వరమనే చెప్పాలి. I GOT MY OLA SCOOTER BACK🥰 special thanks to @OlaElectric @ola_supports @bhash they provided us the ola location several times. And special thanks to the sub inspector @SulochanaJaat and rajendra sir posted in basani police station jodhpur @CP_Jodhpur @JdprRuralPolice https://t.co/qxH3AERtk1 pic.twitter.com/DnfYeylXLD — Anjali Pal (@anjalipal8477) April 13, 2023 -
ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్ల విస్తరణలో పెరిగిన వేగం! ఒకే రోజు..
ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ని దృష్టిలో ఉంచుకుని ఓలా ఎలక్ట్రిక్ దేశ వ్యాప్తంగా ఒకే రోజున 50 ఎక్స్పీరియన్స్ సెంటర్లను ప్రారంభించింది. ఇందులో మూడు సెంటర్లు హైదరాబాద్ నగరంలో ప్రారంభం కావడం విశేషం. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. తమ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలను అందించడంలో భాగంగానే సంస్థ ఎక్స్పీరియన్స్ సెంటర్లను వేగంగా ప్రారంభిస్తోంది. ఈ కొత్త ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్లు హైదరాబాద్ మాదాపూర్ శ్రీరామకాలనీలో (హైటెక్ సిటీ రోడ్), నాగోల్‌లోని ఆదర్శ్ నగర్, మెహదీపట్నంలో రేతిబౌలిలో మొత్తం మూడు కొత్తగా ప్రారంభమయ్యాయి. ఎక్స్పీరియన్స్ సెంటర్లను ప్రారంభించిన సందర్భంగా ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. ఓలా కస్టమర్లకు మరింత చెరువులో ఉండటానికి లేదా కొత్త కస్టమర్ల సందేహాలను తీర్చడానికి గత కొన్ని రోజులుగా దేశం మొత్తం మీద అనుభవ కేంద్రాలను ప్రారంభిస్తున్నాము, రానున్న రోజుల్లో మరిన్ని భారతీయ ప్రధాన నగరాల్లో ఈ కేంద్రాలను ప్రారభినానున్నట్లు తెలిపారు. (ఇదీ చదవండి: ఓలా ఎస్1 ప్రో కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్: ఈ నెల 16 వరకే..!) నిజానికి ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్లు వినియోగదారులకు ఒకే ప్రదేశంలో సమగ్రమైన సేవలను అందించేలా డిజైన్ చేశారు. ఎస్1, ఎస్1 ప్రో స్కూటర్లను ఈ సెంటర్ల ద్వారా టెస్ట్ రైడ్ చేయడానికి కూడా తీసుకెళ్లే సదుపాయం కల్పిస్తారు. అంతే కాకుండా కొనుగోలుదారులకు మరింత సులభమైన పద్దతిలో ఫైనాన్సింగ్ ఎంపికల గురించి కూడా సమచారం అందించడంలో సహాయపడతాయి. -
ఓలా ఎస్1 ప్రో కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్
భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' మార్కెట్లో ఎస్1, ఎస్1 ప్రో స్కూటర్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా మంచి అమ్మకాలు పొందుతున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపైన కంపెనీ ఇప్పుడు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. కావున కొనుగోలుదారుడు సాధారణ ధర కంటే తక్కువకే ఈ స్కూటర్ సొంతం చేసుకోవచ్చు. నివేదికల ప్రకారం, ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కంపెనీ రూ. 5,000 తగ్గింపును ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా కొనాలనుకునే కస్టమర్ రూ. 1.25 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ కేవలం ఈ నెల 16 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు 2021లో రూ. 10,000 వరకు పెరిగాయి. ఆ సమయంలో కంపెనీ అమ్మకాల పరంగా కొంత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తరువాత కాలంలో దేశీయ మార్కెట్లో ప్రత్యులకు గట్టి పోటీ ఇవ్వడానికి తమ స్కూటర్ల మీద మంచి ఆఫర్స్ అందించడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఇప్పుడు రూ. 5వేలు డిస్కౌంట్ ప్రకటించడం జరిగింది. (ఇదీ చదవండి: మహిళల కోసం ఫైర్ బోల్ట్ నయా స్మార్ట్‌వాచ్ - తక్కువ ధర & ఎక్కువ ఫీచర్స్) ఓలా ఎలక్ట్రిక్ 2023 మార్చి అమ్మకాల్లో 27,000 యూనిట్లను విక్రయించి మంచి వృద్ధిని నమోదు చేసింది. గత ఏడు నెలలుగా దేశీయ విఫణిలో తిరుగులేని అమ్మకాలు పొందుతున్న ఓలా ఇప్పుడు కూడా మంచి అమ్మకాలను పొందుతూ 30 శాతం పెరుగుదలను నమోదు చేసింది. -
భారీగా పెరిగిన ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు: మార్చిలో ఏకంగా..
భారతీయ మార్కెట్లో రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ఓలా ఎలక్ట్రిక్ మంచి అమ్మకాలను పొందుతూ దాని ప్రత్యర్థుల కంటే శరవేగంగా ముందుకు దూసుకెళ్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ 2023 మార్చి అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్లో మొత్తం 27,000 యూనిట్లను విక్రయించినట్లు తెలిసింది. గత ఏడు నెలలుగా దేశీయ విఫణిలో తిరుగులేని అమ్మకాలు పొందుతున్న ఓలా ఇప్పుడు కూడా మంచి అమ్మకాలను పొందుతూ 30 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ అమ్మకాలు మంచి పురోగతిని సాధించాయి. కంపెనీ అమ్మకాలు గత కొన్ని నెలలుగా క్రమంగా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో కంపెనీ ఉత్తమ అమ్మకాలు పొందటానికి, అదే సమయంలో కస్టమర్లకు నాణ్యమైన సేవలను అందించడానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. (ఇదీ చదవండి: హోండా కొత్త బైక్.. ధర చాలా తక్కువ) ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు దేశం మొత్తం మీద ఎక్స్పీరియన్స్ సెంటర్లను ప్రారంభించడానికి సిద్ధమైంది, ఇందులో భాగంగానే 400 కంటే ఎక్కువ సెంటర్లను ప్రారభించింది. రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాము. ఇవన్నీ కంపెనీ అమ్మకాలు పెరగటానికి చాలా దోహదపడ్డాయి. ఓలా ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లో టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఏథర్ 450ఎక్స్, హీరో విడా వి1 వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు ప్రత్యర్థిగా ఉన్నప్పటికీ మంచి సంఖ్యలో అమ్మకాలు పొందటం గొప్ప విషయం అనే చెప్పాలి. ఇప్పటికే కంపెనీ ఎస్1, ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ వంటి వాటిని విక్రయిస్తూ ముందుకు సాగుతోంది. రానున్న రోజుల్లో కంపెనీ ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయనుంది. -
ఓలా ఎలక్ట్రిక్ దూకుడు: రూ. 2,475 కోట్ల సమీకరణ !
బెంగళూరు: ఎలక్ట్రిక్ వాహన తయారీదారు వోలా ఎలక్ట్రిక్ నిధుల సమీకరణ బాట పట్టింది. విస్తరణ ప్రణాళికలు, ఇతర కార్పొరేట్ అవసరాల రీత్యా 30 కోట్ల డాలర్లు (రూ. 2,475 కోట్లు) సమకూర్చుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. త్వరలోనే నష్టాల నుంచి బయటపడి, లాభాలు ఆర్జించగలదన్న అంచనాల నడుమ కంపెనీ తాజా నిధుల సమీకరణకు తెరతీయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. (ఇదీ చదవండి: ఇది నమ్మక ద్రోహమే..తక్షణమే రాజీనామా చెయ్యండి! జుకర్‌బర్గ్ ఆగ్రహం) 2023, 2024లో మాస్-మార్కెట్ స్కూటర్, మాస్-మార్కెట్ మోటార్‌సైకిల్, మల్టిపుల్ ప్రీమియం బైక్స్ లాంటి మరిన్ని ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌ను లాంచ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవిష్ అగర్వాల్ గతంలో చెప్పారు. అలాగే 2025 చివరి నాటికి భారతదేశంలో విక్రయించబడే మొత్తం టూవీలర్స్, 2030 నాటికి దేశంలో విక్రయించేకార్లన్నీఎలక్ట్రిక్ వెహికల్స్ కావాలనేది కంపెనీ మిషన్ ఎలక్ట్రిక్ లక్క్ష్యమని ప్రకటించిన సంగతి తెలిసిందే. (రూ. 32 వేల బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 1,999కే) దీనికి తోడు ఇటీవలే తమిళనాడు క్రిష్ణగిరిలో ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ హబ్‌ను ఏర్పాటు చేయడానికి భూమి సేకరణకు అక్కడి ప్రభుత్వంతో MOU సంతకం కుదుర్చుకుంది ఓలా. ఇందులోసెల్ ఫ్యాక్టరీ, ఫోర్-వీలర్ ఫ్యాక్టరీ, సప్లయర్ ఎకోసిస్టమ్ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ద్విచక్ర వాహనాల ఫ్యాక్టరీని కూడా విస్తరించాలని కంపెనీ భావిస్తోందని తెలుస్తోంది. -
ఎలక్ట్రిక్ బైక్ నడుపుతున్నారా?.. ఓలా సంస్థ కీలక నిర్ణయం.. ఉచితంగా!
ప్రముఖ ఎలక్ట్రిక్ సంస్థ ఓలా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఆ సంస్థకు చెందిన స్కూటర్లలలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో పాటు, అగ్నికి ఆహుతైన ఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఎస్1 ఈవీ వెహికల్స్‌లో ఫ్రంట్ ఫోర్క్ ఉన్నట్టుండీ విరిగిపోవడంతో వాహనదారులు స్వల్పంగా గాయపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ తరుణంలో ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫ్రంట్ ఫోర్క్‌లో ఏదైనా అసౌకర్యంగా ఉంటే ఫ్రీగా అప్‌గ్రేడ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. మార్చి 22 నుంచి అప్ గ్రేడ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. అపాయింట్మెంట్ బుక్ చేసుకునేందుకు తామే కస్టమర్లను సంప్రదిస్తామని ఓలా తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. Important update about your Ola S1! pic.twitter.com/ca0jmw1BsA — Ola Electric (@OlaElectric) March 14, 2023 -
ఫోటో పెట్టు.. ఓలా స్కూటర్ పట్టు: భవిష్ అగర్వాల్
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ తయారీ సంస్థ ఓలా ఇటీవల హోలీ స్పెషల్ ఎడిషన్ స్కూటర్ తీసుకువచ్చింది. కంపెనీ ఈ స్కూటర్లను కేవలం 5 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. ఈ స్కూటర్ కావాలనుకునే వారు కేవలం హోలీ సెలబ్రేషన్స్ ఫోటో పెట్టి సొంతం చేసుకోవచ్చు. హోలీ స్పెషల్ ఎడిషన్ స్కూటర్ కేవలం ఎస్1 వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. ఎస్1 వేరియంట్‌కి ఉన్న డిమాండ్ కారణంగా దీనిని విడుదల చేయడం జరిగిందని భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ స్కూటర్ వివిధ రంగుల కలయికతో చూడటానికి కొత్తగా కనిపిస్తుంది. (ఇదీ చదవండి: చిన్నప్పుడే ఆ ఉద్యోగంపై మనసుపడిన ఇషా అంబానీ) ఓలా ఎస్1 హోలీ ఎడిషన్ ఖాకీ, గెరువా, నియో మింట్, మార్ష్‌మల్లో, కోరల్ గ్లామ్ వంటి కలర్స్ పొందుతుంది. ఈ స్కూటర్ 2 kWh, 3 kWh బ్యాటరీ ప్యాక్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. 2 kWh వెర్షన్ 90 కిమీ/గం వేగంతో 90 కిలోమీటర్ల పరిధిని, 3 kWh వెర్షన్ 141 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఓలా ఎస్1 2 కిలోవాట్ వెర్షన్ ధర రూ. 90,000 కాగా 3 kWh వెర్షన్ ధర రూ. 1.08 లక్షలు. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది, ఎటువంటి మార్పులు లేదు. డబ్బు చెల్లించకుండా కేవలం ఫోటో పెట్టి 5 యూనిట్లను మాత్రమే పొందవచ్చు, అంటే ఐదు మంది కస్టమర్లు మాత్రమే స్కూటర్లను ఉచితంగా సొంతం చేసుకోవచ్చు. Due to popular demand, we will build 5 of these as a special Holi edition! Comment with pic/video of how you celebrated holi with your S1 and best 5 will get one! pic.twitter.com/y2VEoMPUWT — Bhavish Aggarwal (@bhash) March 9, 2023 -
డెలివరీ బాయ్‌తో భవిష్ అగర్వాల్ సెల్ఫీ: ఓలా స్కూటర్‌తో చాలా అదా అంటూ..
ఓలా ఎలక్ట్రిక్ ప్రారంభంలో కొన్ని ఆటంకాలను ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో సజావుగా ముందుకు సాగిపోతోంది. క్రమంగా కంపెనీ అమ్మకాలు కూడా వృద్ధి చెందుతున్నాయి. ఇటీవల భవిష్ అగర్వాల్ ఒక ఆసక్తికరమైన ఫోటోను ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. భవిష్ అగర్వాల్ షేర్ చేసిన ఫొటోలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌తో ఉన్న జొమాటో డెలివరీ బాయ్‌ని చూడవచ్చు. ఈ డెలివరీ బాయ్ 9 నెలల్లో లక్ష కంటే ఎక్కువ ఖర్చులను ఆదా చేసాడని, అతడు రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను వాడుతున్నాడని కూడా భవిష్ ట్విట్టర్ పోస్ట్‌లో రాశాడు. జొమాటో డెలివరీ బాయ్ ఉపయోగించే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకదానిలో ఛార్జింగ్ పూర్తయినప్పుడు, ఇంకోదానిని ఉపయోగిస్తాడు. అప్పుడు ఛార్జింగ్ కాలీ అయిన స్కూటర్‌కి ఛార్జింగ్ వేసుకుంటాడు. ఈ విధంగా రెండు స్కూటర్లను నిరంతరం ఉపయోగిస్తూనే ఉన్నాడు డెలివరీ బాయ్ సంతోష్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో 50,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాడు. దీంతో సాధారణ 9 నెలల్లో లక్షకంటే ఎక్కువ ఆదా చేసాడని చెప్పాడు. ప్రస్తుతం ఎక్కువమంది ఉపయోగిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఓలా కంపెనీ స్కూటర్లు ఉండటం గమనార్హం. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు ఎస్1, ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. ఓలా ఎస్1 ప్రో 4 కిలోవాట్ లిథియం ఆయన బ్యాటరీతో 181 కిమీ పరిధిని అందిస్తుందని ARAI ద్వారా ధృవీకరించబడింది. ఇది 750W కెపాసిటీ గల పోర్టబుల్ ఛార్జర్‌తో దాదాపు 6 గంటల్లో, ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో 75 శాతం వరకు ఛార్జ్ చేయబడుతుంది. ఓలా ఎలక్ట్రిక్ గత ఏడాది దీపావళి సందర్భంగా 'ఎస్1 ఎయిర్' స్కూటర్ లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 84,999 (ఎక్స్-షోరూమ్). ఇది ఒక ఫుల్ చార్జ్ తో గరిష్టంగా 101 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇందులో 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ మరియు 4.5 కిలోవాట్ హబ్-మౌంటెడ్ మోటారు ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు. Met Santosh at a traffic junction. Very enterprising guy! Owns 2 @OlaElectric scooters and has driven more than 50000 kms! Drives the second one when the first is on charging at our hyper charging station. Has saved more than ₹1 lakh in just 9 months! pic.twitter.com/89OxmM2uy9 — Bhavish Aggarwal (@bhash) February 28, 2023 -
షాకింగ్ న్యూస్.. ఓలా బ్యాటరీ కొనాలంటే అంత చెల్లించాలా?
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను డిమాండ్ బాగా పెరుగుతోంది, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ 'ఓలా' ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ప్రారంభం నుంచి కొన్ని సమస్యల ఉన్నప్పటికీ మంచి అమ్మకాలనే పొందింది. అయితే ఇటీవల ఓలా ఎలక్ట్రిక్‌కి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ వెలువడింది. తరుణ్ పాల్ అనే వ్యక్తి ట్విటర్లో చేసిన ఒక పోస్ట్ ఓలా వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇందులో ఓలా ఎస్1 బ్యాటరీ ధర రూ. 66,549 (3kwh), ఎస్1 ప్రో 4kwh బ్యాటరీ ధర రూ. 87,298 అని తెలిపాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెట్రోల్ స్కూటర్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి, దీనికి ప్రధాన కారణం వాటిలో ఉపయోగించే బ్యాటరీ ప్యాక్. ఈ బ్యాటరీ ప్యాక్ ఖరీదు వెహికల్ ధరలో 70 శాతం ఉంటుందని చాలా కంపెనీలు గుర్తించాయి. కావున వాహనంలో ఏదైనా సమస్య వల్ల బ్యాటరీ పాడైపోతే కొత్త బ్యాటరీ ఇన్స్టాల్ చేయడానికి వినియోగదారుడు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలి. మార్కెట్లో ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు రూ. 99,999 (ఎస్1) నుంచి రూ. 1,29,999 వరకు (ఎస్1 ప్రో) ఉన్నాయి. కంపెనీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాల వారంటీ అందిస్తున్నాయి. కంపెనీ నియమాల ప్రకారం 3 సంవత్సరాల లోపల బ్యాటరీలో ఏదైనా సమస్య ఏర్పడితే ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా బ్యాటరీ రీప్లేస్ చేస్తారు. ప్రస్తుతం, భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించే చాలా కంపెనీలు బ్యాటరీలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాయి. దీని వల్ల ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కొంత ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న బ్యాటరీలు భారతీయ వాతావరణ పరిస్థితులను అనుకూలంగా లేకపోవడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోతూ ఉంటాయి, ఈ ప్రమాదాలను అరికట్టడానికి దీనిపైన సమగ్ర పరిశీలనలు జరుగుతున్నాయి. అయితే, తరుణ్ పాల్ చెప్పినట్టు ఓలా బ్యాటరీ ధరలు ఎంతమేరకు ఉంటాయనేది క్లారిటీ లేదు. అధికారికంగా వెల్లడి కావాల్సిఉంది. -
ఓలా సంచలనం: ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఈవీ హబ్, భారీ పెట్టుబడులు
చెన్నై: ఓలా సీఈవోభవిష్ అగర్వాల్ వ్యాపార విస్తరణలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న ఓలా తాజాగా మరో అడుగుముందుకేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద EV హబ్‌ను ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఎలక్ట్రిక్ కార్లు, లిథియం-అయాన్ సెల్‌లను తయారు చేసేందుకు ఓలా రూ.7,614 కోట్ల పెట్టనుంది. ఇందుకోసం తమిళనాడు ప్రభుత్వం ఎంఓయూ కూడా కుదుర్చుకుంది. ఓలా వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తన అనుబంధ కంపెనీలైన ఓలా సెల్ టెక్నాలజీస్ (OCT) , ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ (OET) ద్వారా ఒక ఒప్పందంపై సంతకం చేసారని శనివారం ట్వీట్ చేశారు. (ఇవీ చదవండి: ఎయిరిండియా మెగా డీల్: 2 లక్షలకు పైగా ఉద్యోగాలు) (భారీగా లిథియం నిక్షేపాలు: ఇక భవిష్యత్తంతా అద్భుతమే! ఆనంద్ మహీంద్ర) తమిళనాడులో టూ వీలర్, కార్ల లిథియం సెల్ గిగాఫ్యాక్టరీలతో ప్రపంచంలోనే అతిపెద్ద EV హబ్‌ను ఏర్పాటు చేస్తుంది. తమిళనాడుతో ఈరోజు ఎంఓయూపై సంతకం చేశామని భవిష్ వెల్లడించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, అగర్వాల్ మధ్య ఒప్పందం కుదిరిందంటూ ఒక ఫోటోను కూడా షేర్ చేశారు. కృష్ణగిరి జిల్లాలో ఈ 20 గిగా వాట్ల బ్యాటరీ తయారీ యూనిట్ఏర్పాటు కానుంది. మొత్తం పెట్టుబడిలో దాదాపు రూ.5,114 కోట్లు సెల్ తయారీ ప్లాంట్‌లోకి, మిగిలిన రూ.2,500 కోట్లు కార్ల తయారీ యూనిట్లోకి వెళ్తాయి. Ola will setup the worlds largest EV hub with integrated 2W, Car and Lithium cell Gigafactories in Tamil Nadu. Signed MoU with Tamil Nadu today. Thanks to Hon. CM @mkstalin for the support and partnership of the TN govt! Accelerating India’s transition to full electric! 🇮🇳 pic.twitter.com/ToV2W2MOsx — Bhavish Aggarwal (@bhash) February 18, 2023 సంవత్సరానికి 140,000 ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్లను ఉత్పత్తి చేయడానికి ఒక యూనిట్‌ను ఏర్పాటు చేయాలనేది ప్రణాళిక. 2024 నాటికి కార్లను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 500కిలోమీటర్ల రేంజ్‌తో కారును తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. ఈ క్రమంలో ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ 2024 నాటికి ఫోర్-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (EVలు) ప్రారంభించాలనే ప్రణాళికను మరింత ముందుకు తీసుకువెళ్లే క్రమంలో తాజా డీల్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పెట్టుబడుదల ద్వారా 3,111 ఉద్యోగాలను సృష్టించనుందట. తమిళనాడు కొత్త ఈవీ పాలసీని తీసుకొచ్చిన కొన్ని రోజుల తర్వాత ఈ డీల్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఆటో హబ్‌గా ఉన్న తమిళనాడులో హోసూర్‌లోని కంపెనీ ప్రస్తుత సౌకర్యం ప్రపంచంలోనే అతిపెద్దఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ యూనిట్లలో ఒకటి అని తమిళనాడు ప్రభుత్వపెట్టుబడి ప్రమోషన్ ఏజెన్సీ గైడెన్స్ తమిళనాడు సీఎండీ విష్ణు అన్నారు. తమిళనాడు ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ 2023 ప్రకారం రాష్ట్ర వస్తువులు, సేవల పన్ను (SGST), పెట్టుబడి లేదా టర్నోవర్ ఆధారిత సబ్సిడీ , అధునాతన కెమిస్ట్రీ సెల్ సబ్సిడీ 100 శాతం రీయింబర్స్మెంట్ ఉన్నాయి. తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ నుండి కొనుగోలు చేసే విద్యుత్‌పై ఐదేళ్లపాటు విద్యుత్ పన్నుపై 100 శాతం మినహాయింపు, స్టాంప్ డ్యూటీపై మినహాయింపు ,భూమి ధరపై సబ్సిడీని కూడా రాష్ట్రం అందిస్తుంది. గత ఐదేళ్లలో, ఈవీ సె క్టార్లో 48,000 ఉద్యోగాల ఉపాధి అవకాశాలతో కూడిన ప్రాజెక్టులను సాధించింది. -
ఇంకోసారి, వందల మంది ఉద్యోగుల్ని తొలగించిన ఓలా!
రైడ్ షేరింగ్ సంస్థ ఓలా కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థకు చెందిన అన్నీ విభాగాలకు చెందిన ఉద్యోగుల్లో సుమారు 200 మందిని ఫైర్ చేసింది. సంస్థ పునర్నిర్మాణం పేరుతో గతేడాది 1100 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపిన ఓలా.. తాజాగా మరోసారి ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపేందుకు శ్రీకారం చుట్టుంది. ఐఎన్‌సీ 42 నివేదికల ప్రకారం.. ఓలా సంస్థ నిర్వహిస్తున్న కార్యకలాపాల్లోని ఓలా క్యాబ్స్, ఓలా ఎలక్ట్రిక్ 200 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే గత సెప్టెంబర్ నుంచి ఉద్యోగుల తొలగింపుపై సంస్థ సీఈవో భవిష్ అగర్వాల్ చర్చిస్తుస్తున్నారని, తాజాగా నిర్ణయం మేరకు ఐటీ ఉద్యోగులపై కంపెనీ వేటు వేసిందని వెలుగులోకి వచ్చినట్లు రిపోర్ట్లు హైలెట్ చేస్తున్నాయి. ఓలా సైతం ఉద్యోగుల తొలగింపుల్ని ధృవీకరించింది. ఈ అంశంపై ఓలా అధికారి మాట్లాడుతూ.. ‘సామర్థ్యాలను మెరుగుపరుచుకునే క్రమంలో మేము క్రమం తప్పకుండా కంపెనీ పునర్నిర్మాణ చర్యలను తీసుకుంటాం. ఈ నేపథ్యంలో కొందరిని తొలగించడం అదే విధంగా మా ప్రాధాన్యత రంగాలైన ఇంజనీరింగ్ , డిజైన్‌లో కొత్త నియామకాలు జరుగుతుంటాయి. ఈ ప్రక్రియ ప్రతి ఏడాది జరుగుతుందని’ తెలిపారు. -
ఇదేందయ్యా..ఇది నేను చూడలా.. ‘ఓలా’ ఎలక్ట్రిక్ స్కూటర్ వైరల్!
కార్పోరేట్ ప్రపంచంలో బ్రాండ్ వ్యాల్యూ చాలా ముఖ్యం. ఒక్కసారి పోయిందా ఇక అంతే సంగతులు. అందుకే కార్పొరేట్ కంపెనీలు కోట్లు కుమ్మురించి బ్రాండ్ వ్యాల్యూని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తాయి. కానీ అగ్గిపుల్ల నుంచి సబ్బుబిళ్ళ వరకు తన స్ట్రాటజీతో మార్కెట్లో బ్రాండ్‌ను క్రియేట్ చేయడంలో ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ సమర్ధుడు. ఓలా! ఈవీ మార్కెట్లో కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించి గత ఐదేళ్లుగా ఎన్నో కంపెనీలు ప్రయత్నించినా.. ఓలా వచ్చిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ప్రీ బుకింగ్‌లోనే లక్షకు పైగా ఆర్డర్లు సాధించింది. లక్ష రూపాయలు చెల్లించి.. స్కూటర్ డెలివరీ కోసం నెలల తరబడి కస్టమర్లు ఎదురు చూసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ గతేడాది డిసెంబర్లో విడుదలైన ఓలా వెహికల్స్‌లో లోపాలు తలెత్తాయి. ఆర్ అండ్ డీ మీద దృష్టి సారించకుండా నాసిరకం వెహికల్స్ తయారు చేశారంటూ కొనుగోలు దారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వెహికల్తో పెట్టుకుంటే ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్త మయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన భవిష్ అగర్వాల్ బ్రాండ్‌ను, ప్రొడక్ట్ వ్యాల్యూలో మార్పులు చేశారు. తయారీలో రాజీపడకుండా కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నారు. మరోవైపు స్కూటర్ల విజయ ప్రస్థానాన్ని రోజుకో రకంగా వివరిస్తున్నారు. తాజాగా ఓలా స్కూటర్‌ను ఎలా క్రియేటీవ్‌గా వినియోగించుకోవచ్చో తెలుపుతూ ఓ వీడియోని షేర్ చేశారు. ఆ వీడియోలో ఓలా స్పీకర్లను ఉపయోగించి ఓ యువకుడు లైవ్ క్రికెట్ కామెంటరీ ఇవ్వడం నెటిజన్లను విపరీంగా ఆకట్టుకుంటుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ ప్రాంతంలో యువకులు గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నారు. అయితే గ్రౌండ్ సమీపంలో పార్క్ చేసిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వైర్లెస్ స్పీకర్ ఫీచర్ సాయంతో ఆ వెహికల్ పక్కనే యువకుడు ఫోన్లో క్రికెట్ కామెంటరీ ఇవ్వడం వైరల్‌గా మారింది. ఆ వీడియోను షేర్ చేసిన భవిష్.. మా వెహికల్‌ను అత్యంత సృజనాత్మకంగా వినియోగించుకోవడం తొలిసారి చూస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై నెటిజన్లు రీట్వీట్ చేస్తున్నారు. ఓ నెటిజన్ భవీష్ ఇది ఇండియా.. ఇక్కడ అన్నీ సాధ్యమేనని ట్వీట్ చేస్తుంటే.. ఆటోమొబైల్ మార్కెట్లో తయారీ దారులకు గేమ్ ఛేంజర్ వెహికల్ అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరూ చూసేయండి This has to be the most creative use of our vehicle I have seen so far 😄👌🏼 https://t.co/QjCuv4wGQG — Bhavish Aggarwal (@bhash) December 22, 2022 -
ఎలక్ట్రిక్ స్కూటర్ లవర్స్‌కు అదిరే ఆఫర్: పది ఎస్1 ప్రో స్కూటర్లు ఫ్రీ
సాక్షి, ముంబై: ఎలక్ట్రిక్ స్కూటర్ లవర్స్‌కు ఓలా ఎలక్ట్రిక్ గుడ్ న్యూస్ చెప్పింది.డిసెంబర్ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. డిసెంబర్ టు రిమెంబర్ అంటూ ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. అలాగే జీరో డౌన్ పేమెంట్‌తో పాటు మరిన్ని ఆఫర్లు ఉన్నాయి. అయితే బేస్ వేరియంట్‌పై ఈ ఆఫర్ వర్తించదు. అలాగే 10 ఈ స్కూటర్లను ఉచితంగా అందించనుంది. గతంలో అక్టోబర్లోప్రకటించిన ఈ ఆఫర్‌ను తర్వాత నవంబర్ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఆఫర్‌ను డిసెంబర్ 31 2022 వరకు పొడిగించింది. ఓలా ఎస్1 ప్రోపై డిస్కౌంట్ ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.10వేల తగ్గింపును అందిస్తోంది. తద్వారా ఈ స్కూటర్‌ను రూ.1,29,999 (ఎక్స్-షోరూమ్)కే సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.1,39,999. జీరో డౌన్ పేమెంట్ జీరో డౌన్ పేమెంట్‌తో నెలకు కనిష్టంగా రూ.2,499 ఈఎంఐ ఆప్షన్‌తో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు. 8.99 శాతం వడ్డీరేటుతోపాటు, వెహికల్ ఫైనాన్స్‌పై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజ్ ఉంటుంది. ఉండదు. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై అదనపు డిస్కౌంట్ కూడా లభ్యం. 10 ఎస్1 ప్రో స్కూటర్లు ఉచితంగా పది ఎస్1 ప్రో స్కూటర్లను కస్టమర్లకు ఉచితంగా అందించేందుకు కాంటెస్టును నిర్వహిస్తున్నట్టు ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ తెలిపారు. లక్ష యూనిట్ల విక్రయాలను అత్యంత వేగంగా సాధించిన సంస్థగా ఓలా అవతరించింది, అలాగే ఈ సెగ్మెంట్లో 50 శాతానికి పైగా ఆదాయ మార్కెట్ వాటాతో వరుసగా 3 నెలలో( నవంబరు) కూడా అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్రాండ్‌గా కూడా అవతరించింది. కాగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు నవంబర్ 2022లో 20,000 యూనిట్లను దాటేశాయని ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ట్విటర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాగే విస్తరణలో భాగంగా 11 నగరాల్లో 14 కొత్త ఎక్స్పీరియన్స్ కేంద్రాలను ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50 ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్లు ఉన్నాయి. త్వరలోనే మరో 100 సెంటర్లను ప్రారంభించాలని ఓలా భావిస్తోంది. From winning an Ola 🛵, to endless offers while buying it...if there weren’t enough reasons to switch to the Ola S1, here are some more. Own the #1 EV in India and make it a December to remember! 🎁🥳🎄 #EndICEage ⚡️ pic.twitter.com/8aZyqcy9pq — Ola Electric (@OlaElectric) December 5, 2022 -
‘ఒక్కో బిజినెస్ షట్‌డౌన్’..అనుకున్నది సాధిస్తున్న ఓలా సీఈవో భవిష్ అగర్వాల్!
ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థ ఓలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓలా క్యాబ్స్ ప్రయాణంలో కస్టమర్లకు అందించే ఓలా ప్లే సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఓలా 2016లో క్యాబ్‌లో ప్రయాణించే కస్టమర్ల కోసం క్లౌడ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే టాటా ప్లే సర్వీసుల్ని ప్రారంభించింది. ప్రయాణంలో ప్యాసింజర్లు వారికి నచ్చిన మ్యూజిక్ వినొచ్చు. ఎంటర్టైన్మెంట్ వీడియోల్ని వీక్షించొచ్చు. క్యాబ్ ప్రయాణాన్ని ట్రాక్ చేయొచ్చు. అయితే తాజాగా ఓలా నవంబర్ 15నుంచి కస్టమర్లకు ఆ సదుపాయాల్ని అందివ్వబోమని స్పష్టం చేసింది. తన బిజినెస్ ఫోకస్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై పెడుతున్నట్లు తెలిపింది. కాబట్టే ఖర్చును తగ్గిస్తూ ఆదాయం లేని సర్వీసుల్ని నిలిపి వేస్తుంది. ఉద్యోగుల్ని తొలగిస్తుంది. ప్రారంభించిన ఏడాది లోపే సీఈవో భవిష్ అగర్వాల్ ఓలా డాష్ పేరుతో గ్రాసరీ డెలివరీ మార్కెట్లో అడుగు పెట్టారు. కస్టమర్లు ఆర్డర్ చేసిన నిత్యవసర సరకుల్ని 10 నుంచి 15 నిమిషాల్లో డెలివరీ చేస్తామని ఆ సందర్భంగా ప్రచారం చేశారు. ప్రచారం, బ్రాండ్ కలిసి రావడంతో ఓలా డాష్ వ్యాపారం బాగానే జరిగింది. కానీ భవిష్ ఓలా ఎలక్ట్రిక్‌పై దృష్టిసారించడంతో క్విక్ కామర్స్ బిజినెస్ నష్టాల బాట పట్టింది. వెరసీ బిజినెస్ ప్రారంభించిన ఏడాది లోపే షట్‌డౌన్ చేశారు. ఉద్యోగుల తొలగింపు ఓలా డాష్ షట్‌డౌన్ తర్వాత ఓలా ఎలక్ట్రిక్ పేరుతో ఈవీ మార్కెట్లో అడుగుపెట్టారు. ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో వెహికల్స్‌ను ఆటోమొబైల్ మార్కెట్‌కు పరిచయం చేశారు. కానీ ఓలా ఈవీపై క్రియేట్ అయిన హైప్ కారణంగా కొనుగోలు దారుల అంచనాల్ని అందుకోలేకపోయింది. ఒకానొక దశలో ఓలా వెహికల్స్ అగ్నికి ఆహుతవ్వడం, చిన్నచిన్న రోడ్డు ప్రమాదాలకే ఆ వెహికల్స్ పార్ట్లు ఊడిపోవడంతో అప్రతిష్టను మూటగట్టుకుంది. దీంతో ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గారు. ఖర్చు తగ్గించుకునేందుకు భవిష్ అగర్వాల్ గట్టి ప్రయత్నాలే చేశారు. ఒక్కో బిజినెస్ కార్యకలాపాల్ని నిలిపివేశారు. కాస్ట్ కటింగ్ పేరుతో 400 నుంచి 500 మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపారు. ఇలా భవిష్ అగర్వాల్ ఆటోమొబైల్ మార్కెట్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా.. చివరికి అనుకున్నది సాధిస్తున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. టార్గెట్ యూరప్ దేశీయంగా 2021 డిసెంబర్ నుంచి 2022 నవంబర్ మధ్య కాలానికి ఏకంగా లక్ష వెహికల్స్‌ను తయారు చేశారు. నవంబర్ 24 కల్లా కోటి ఈవీ బైక్స్‌ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే సమయంలో అంతర్జాతీయ ఈవీ మార్కెట్‌పై భవిష్ అగర్వాల్ కన్నేశారు. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే నేపాల్‌కు ఈవీ వెహికల్స్‌ను ఎగుమతులు ప్రారంభించింది.ప్రస్తుతం యూరప్ దేశమైన ఇటలీలో జరుగుతున్న ఎస్పోసిజియోన్ ఇంటర్నేషనల్ సిక్లో మోటోసిక్లో ఇ యాక్సెసోరి (EICMA) మోటర్ సైకిల్ షోలో ఓలా ఎస్1 ప్రోను ప్రదర్శిస్తున్నట్లు భవిష్ ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది క్యూ1లో యూరప్ కంట్రీస్‌లో భారత్ నుంచి వరల్డ్ ఈవీ ప్రొడక్ట్‌ను అందిస్తామని పునరుద్ఘాటించారు. చదవండి👉 ‘బండ్లు ఓడలు ..ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో’! -
ఓలా ఎలక్ట్రిక్ బైక్ కమింగ్ సూన్, సీఈవో ట్వీట్ వైరల్
సాక్షి, ముంబై: ఇండియాలో ఇ-మొబిలిటీ మార్కెట్లో ఓలా భారీ వ్యూహాలనే రచిస్తోంది. ఇప్పటికే ఎస్1, ఎస్1 ఎయిర్, ఎస్1 ప్రొ ఎలక్ట్రిక్ స్కూటర్లతో కస్టమర్లను ఆకట్టుకున్న ఓలా ఎలక్ట్రిక్ ఇపుడిక ఎలక్ట్రిక్ బైక్‌లను తీసుకురానుంది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. ఇదీ చదవండి : ప్రేమలో పడిన మిలిందా గేట్స్, కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కారును తీసుకురానున్నట్టు ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే ప్రకటించింది. ఈ పైప్‌లైన్‌లో ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ను చేర్చింది. త్వరలోనే ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్న స్పోర్ట్స్, క్రూయిజర్, అడ్వెంచర్ లేదా కేఫ్ రేసర్ ఏది కావాలి అంటూ ట్విటర్ తన ఫాలోnయర్లను అడిగారు భవిష్ అగర్వాల్. అయితే ఆసక్తికరంగా స్పోర్ట్స్ కేటగిరీ అత్యధిక ఓట్లను పొందుతోంది. వచ్చే ఏడాది బైక్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. Building some 🏍️🏍️!! — Bhavish Aggarwal (@bhash) November 10, 2022 రాబోయే ఎలక్ట్రిక్ బైక్‌ను కూడా సరసమైన ధరలో, ఆధునిక ఫీచర్లతో తీసుకొస్తున్నందని అంచనా. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 ఆదరణ బాగా లభించడంతో ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు ట్రిమ్‌లలో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. (అరిగిపోయిన చెప్పులకు అన్ని వేల డాలర్లా? ఎవరివో గుర్తు పట్టగలరా?) Which bike style do you like — Bhavish Aggarwal (@bhash) November 10, 2022 -
‘బండ్లు ఓడలు ..ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో’!
బండ్లు ఓడలు అవ్వడం.. ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో’ అనే సామెత మనం వినే ఉంటాం. ఇప్పుడు ఈ సామెత ఓలా సీఈవో భవిష్ అగర్వాల్‌కు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. కార్పొరేట్ వరల్డ్‌లో బ్రాండ్ వ్యాల్యూ చాలా ముఖ్యం. ఒక్కసారి పోగొట్టుకుంటే నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఇటీవలి కాలంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ప్రీ బుకింగ్‌లోనే లక్షకు పైగా ఆర్డర్లు సాధించిన ఓలా పరిస్థితులు ఒకానొక దశలో తారుమారయ్యాయి. కొనే నాథుడే లేడు సమ్మర్ సీజన్లో ఆ సంస్థ తయారు చేసిన ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్ లోపాలు సీఈవో భవిష్ అగర్వాల్‌ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. వెహికల్స్‌లోని బ్యాటరీలు హీటెక్కి కాలిపోవడం. వాహనదారులు ప్రమాదాలకు గురికావడం. నాసిరకం మెటీరియల్‌తో వెహికల్స్ తయారు చేయడంతో చిన్న పాటి రోడ్డు ప్రమాదాలకే ఆ వెహికల్ టైర్లు ఊడిపోవడం లాంటి వరుస ఘటనలతో వాహనదారుల్లో ఆందోళన మొదలైంది. అదే సమయంలో ఓలా ఈవీ వెహికల్స్ కొనుగోలు చేయాలనుకున్న వాహన దారులు సైతం వెనక్కి తగ్గారు. దీంతో తయారు చేసిన వెహికల్స్ అమ్ముడు పోక.. స్టాక్ మిగిలిపోయింది. చదవండి👉 ఓలా..! ఎందుకిలా..! నెలకూడా కాలేదు..అప్పుడే.. దీనికి తోడు సంస్థను వివాదాలు చుట్టుముట్టడంతో ఉద్యోగులు, ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ, వాటి విడుదలలో కీరోల్ ప్లే చేస్తున్న టాప్ లెవల్ ఎక్జిక్యూటీవ్‌లు సంస్థను వదిలేస్తున్నా భవిష్ మాత్రం అన్నీ తానై సంస్థను ముందుండి నడిపించారు. ఓలా మినహాయి మిగిలిన వ్యాపారాల్ని క్లోజ్ చేశారు. ఓలా ఈవీలపై దృష్టిసారించారు. రోజువారీ కార్యకలాపాల నుండి వైదొలిగి ఇంజనీరింగ్ విధులు, టీమ్ బిల్డింగ్, ఉత్పత్తులపై ఫోకస్ చేయడమే కాదు..టూవీలర్లతో పాటు కార్లను మార్కెట్లోకి విడుదల చేసే పనిలో పడ్డారు. కట్ చేస్తే.. Crossed 1 lakh vehicles produced yesterday. In just 10th month of production, probably fastest ever for a new auto company in India. Just getting started and #EndICEage is coming nearer and nearer! pic.twitter.com/FnJWLEQ1D8 — Bhavish Aggarwal (@bhash) November 3, 2022 కట్ చేస్తే తాజాగా ఈవీ చరిత్రలో అత్యంత వేగంగా వెహికల్స్ తయారీ చేసిన సంస్థగా ఓలా సరికొత్త రికార్డులను నమోదు చేసింది. కేవలం పది నెలల్లో లక్ష(నిన్నటితో) వెహికల్స్‌ను తయారు చేసింది. ఈ సందర్భంగా దేశీయ ఆటోమొబైల్ చరిత్రలో ఇంత వేగంగా వెహికల్స్‌ను తయారు చేసిన దాఖలాలు లేవని భవిష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. టార్గెట్ కో అంటే కోటి అంతేకాదు డిసెంబర్ 2021లో ఓలా వెహికల్స్ తయారీ ‘సున్నా’ కాగా నవంబర్ 2022 నాటికి ఆ సంఖ్య లక్షకు చేరింది. నవంబర్ 2023నాటికి 10లక్షలు, నవంబర్ 2024 నాటికి కోటి వెహికల్స్ తయారీని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. Our cumulative production numbers: Dec 2021: 0 Nov 2022: 1,00,000 Nov 2023: 10,00,000 Nov 2024: 1,00,00,000 This is the journey to #EndICEAge by 2025 🙂😎 pic.twitter.com/HV8x6JbCgm — Bhavish Aggarwal (@bhash) November 4, 2022 నవంబర్‌లో ఓలా ఒక్క నెలలో ఏకంగా తన ఎస్1 సిరీస్ 20 వేల ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను అమ్మింది. అదనంగా, దాని మొత్తం అమ్మకాలు నెలవారీగా 60 శాతం పెరిగాయి. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తమ విక్రయాల్లో 4 రెట్లు వృద్ధిని నమోదు చేసినట్లు ఓలా వెల్లడించింది. ఈ కాలంలో ప్రతి నిమిషానికి ఒక స్కూటర్‌ను విక్రయించినట్లు నివేదించింది. కాగా, ఓలా వెహికల్స్ ఉత్పత్తి, అమ్మకాలపై భవిష్ అగర్వాల్ సంతోషం వ్యక్తం చేస్తుండగా..ఆయన సహచరులు మాత్రం ‘బండ్లు ఓడలు అవ్వడం..ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో’.. సంస్థ పని ఇక అయిపోయిందిలే అని అనుకునే సమయంలో తన అపారమైన వ్యాపార నైపుణ్యాలతో సంస్థను గట్టెక్కించారంటూ భవిష్ అగర్వాల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 20000 Ola S1 units sold in October, highest ever for an EV company in India! 60% growth month on month for @OlaElectric. The Ola community is now bigger than ever and Mission Electric 2025 is in sight! We will #EndICEage together💪🏼 pic.twitter.com/hyU0xiD6WL — Bhavish Aggarwal (@bhash) November 1, 2022 చదవండి👉 ఓలా: వెళ్లిపోతాం..ఇక్కడే ఉంటే మునిగిపోతాం..పెట్టేబేడా సర్దుకుని! -
తక్కువ ధరలో ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ఎయిర్ వచ్చేసింది..సర్ప్రైజ్ ఆఫర్
సాక్షి,ముంబై: ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను నేడు (శనివారం, అక్టోబరు 22)న లాంచ్ చేసింది. ఎప్పటినుంచో ఊరిస్తున్న ఈ స్కూటర్ బడ్జెట్ ధరలో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓలా ఎలక్ట్రిక్ ఎస్1తో పోలిస్తే 20వేల రూపాయల తగ్గింపుతో సరికొత్త ఎస్1 ఎయిర్‌ను తీసుకురావడం గమనార్హం. రోజూ ఒక స్కూటర్, అందరికీ స్కూటర్.అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓలా ఎస్ 1 ఎయిర్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త మోడల్ S1 ధర రూ.84,999గా ఉంచింది. అయితే లాంచింగ్ ధర రూ. 79,999గా నిర్ణయించింది. కేవలం 999 రూపాయలు చెల్లించి దీన్ని ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. ఈ లాంచింగ్ ఆఫర్ అక్టోబర్ 24 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతందని కంపెనీ ప్రకటించింది. ఫాస్ట్ ఛార్జర్‌తో స్కూటర్ 15 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుందని ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ఓలా ఈవెంట్లో తెలిపారు. ఇది కాకుండా, లాక్,అన్లాకింగ్ కోసం అధునాతన ఫీచర్లను అందించినట్టు చెప్పారు. అధునాతన డిజైన్‌తో అప్డేట్ చేసిన ఎస్1 ఎయిర్ ఎకో, రెగ్యులర్, స్పోర్ట్‌తో సహా మూడు రైడింగ్ మోడ్స్‌లో, అయిదు రంగుల్లో లభించ నున్నాయి. ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లే, బహుళ రైడ్ ప్రొఫైల్‌లు, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, మ్యూజిక్ అండ్ కాల్ కంట్రోల్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. డెలివరీలు ఏప్రిల్ 2023 మొదటి వారంలో ప్రారంభం. A scooter for everyday, a scooter for everyone. The most awaited Ola S1 Air is here at an introductory price of Rs. 79,999! Offer valid till 24th October only. Hurry! Reserve now for Rs. 999 🥳🥳 pic.twitter.com/KmV0DGRs3Z — Ola Electric (@OlaElectric) October 22, 2022 -
భవిష్ అగర్వాల్ మామూలోడు కాదు..ఎలాన్ మస్క్‌కే ఝలక్ ఇచ్చాడు
ఓలా అధినేత భవిష్ అగర్వాల్..టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు మరోసారి ఝలక్ ఇచ్చారు. టెస్లాకు ధీటుగా తక్కువ ధరకే ఖరీదైన కార్లను పోలి ఉండేలా ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లో విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. భారత్‌కు చెందిన ఓలా ఎలక్ట్రిక్ అమెరికాకు చెందిన టెస్లాకు గట్టిపోటీ ఇస్తుంది. బిలియనీర్లు వినియోగించే పాష్ కార్లతో పోలి ఉండేలా ఓలా ఈవీ వెహికల్‌ను తక్కువ , సరసమైన ధరకే అందిస్తున్నట్లు తెలిపారు. చీపెస్ట్ టెస్లా కారు ధర 50వేల డాలర్లు. అంత భారీ మొత్తంలో వెచ్చించి ఆ కారును కొనలేం. అందుకే ఈవీ మార్కెట్లో సరికొత్త రెవెల్యూషన్తో టెస్లా కార్ల ధరల్ని 1000డాలర్ల నుంచి 50వేల డాలర్ల మధ్య ధరలతో వివిధ వేరియంట్ల కార్లను మార్కెట్‌కు పరిచయం చేయనున్నట్లు బ్లూంబెర్గ్ ఇంటర్వ్యూలో భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు. ‘ఓలా స్టార్టప్ ప్రయాణం అంత సులువు జరగలేదు. ఎన్నో రిస్కులు తీసుకున్నాం. ఇప్పటికే భారత్ మార్కెట్లో వరల్డ్ లార్జెస్ట్ టూ వీలర్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. రానున్న పదేళ్లలో దేశీయ ఈవీ మార్కెట్ వ్యాల్యూ దశాబ్దం చివరి నాటికి 150 బిలియన్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నా. ఓలా ఇందులో పాత్ర పోషించడం ఖాయం. ఎందుకంటే గత డిసెంబర్లో కొనుగోలు దారులు ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ లాంచ్‌కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కొంత మంది ఓలా గురించి వ్యతిరేక ప్రచారం చేశారు. అయినా ముందు సాగే దిశగా ఓలా సామ్రాజ్యాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.’ ‘చవకైన ఈవీలను తయారు చేయడం మాత్రమే కాకుండా, 5జీ, గ్రీన్ ఎనర్జీ, సస్టైనబుల్ మొబిలిటీలో గ్లోబల్ ఫుట్‌ప్రింట్‌ను పెంపొందించడం ద్వారా భారత్ ప్రత్యర్థులకు సవాల్ విసురుతుంది’ అని అన్నారు. చదవండి👉 ఎలన్ మస్క్ ట్విటర్ కొనుగోలు..సీఈఓ పరాగ్ అగర్వాల్ భార్య అదిరిపోయే ట్విస్ట్! -
ఓలా దివాలీ గిఫ్ట్: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, అతిచౌక ధరలో
సాక్షి, ముంబై: దీపావళి సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ తన వినియోగదారుల కోసం మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో అతి చౌకధరలో కొత్త వేరియంట్‌ను వినియోగ దారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. రూ.80 వేల లోపు ధరకే ఈ కొత్త వేరియంట్ స్కూటర్‌ను అందుబాటులోకి తేనుందని సమాచారం. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొత్త వేరియంట్‌ను తీసుకొస్తున్నట్టు కంపెనీ సీఈవో భావిష్ అగర్వాల్ ఆదివారం ట్వీట్ చేశారు. అక్టోబర్ 22న కంపెనీ దీపావళి ఈవెంట్ జరగ బోతోంది. తమ అతిపెద్ద ప్రకటనలలో ఇది కూడా ఒకటి. త్వరలో కలుద్దాం అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి ఒక టీజర్ కూడా వదిలారు. ఇందులో ఆగస్ట్ 15 ఈవెంట్లో వాగ్దానం చేసినట్లుగా కంపెనీ MoveOS 3ని Ola S1కి రోల్‌అవుట్‌గా ప్రకటించే అవకాశం ఉందని అంచనా. (హీరో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. బుకింగ్.. ఫీచర్లు, ధర వివరాలు) ఓలా ఎలక్ట్రిక్ ..ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.99,999లకు భారత్ మార్కెట్లో ప్రస్తుతం లభిస్తోంది. ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో ఈ-స్కూటర్లు దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇది టీవీఎస్ జూపిటర్ , సుజుకి యాక్సెస్ వంటి ప్రముఖ 125సీసీ స్కూటర్లకు పోటీ ఇస్తోంది. దీనికితోడు హీరో మోటాకార్స్ కూడా తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడా బ్రాండ్ కింద రెండు వేరియంట్లలో విడా వీ1, వీ1 ప్రొను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. Our Diwali event will be on 22nd Oct. One of the biggest announcements ever from Ola. See you soon! pic.twitter.com/389ntUnsDe — Bhavish Aggarwal (@bhash) October 8, 2022 -
తొలిసారి ఓలా బంపర్ ఆఫర్: ఎస్1 ప్రొపై భారీ తగ్గింపు
న్యూఢిల్లీ : ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తొలిసారి తన యూజర్లుకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై డిస్కౌంట్లను అందిస్తోంది. అందులోనూ ఈ ఫెస్టివ్ సీజన్లో కసమర్లను ఆకట్టు కునేలా ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 10వేల వరకు తగ్గింపు ధరకు అందిస్తామని ప్రకటించింది. ఎస్1 ప్రో లాంచింగ్ ధర 1.40 లక్షల (ఎక్స్-షోరూమ్). తాజా ఆఫర్‌తో దీనిపై 10 వేల తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా, పండుగ విక్రయం కోసం కొనుగోలు విండో ఇప్పటికే ప్రత్యక్షంగా ఉంది. ఓలా ఎలక్ట్రిక్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఈ పండుగ ఆఫర్‌ను ప్రకటించింది. ‘‘ఓలా పండుగ ఆఫర్‌ను ఉపయోగించు కోండి, ఎస్ 1 ప్రో 10,000 తగ్గింపుతో పండగ చేస్కోండి.. ఇతర ఫైనాన్స్ ఎంపికలు కూడా ఉన్నాయి. ఈ ఆఫర్ దసరా (అక్టోబర్ 05, 2022న) వరకు చెల్లుబాటులో ఉంటుంది’’ అని తెలిపింది. ప్రత్యేక ఆఫర్‌ను పొందేందుకు, వినియోగదారులు ఓలా అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి. పండుగ ఆఫర్ ట్యాబ్‌ను క్లిక్ చేసిన తర్వాత, ఆసక్తి గల కస్టమర్లు ఎస్1 ప్రోని డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేసే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అలా వివరాలను నమోదు చేసిన తరువాత ఓలా ఎస్1 ప్రోను రూ. 1.30 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు కొనుగోలు చేయవచ్చు. -
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు..ఇక విదేశాల్లో రయ్..రయ్!
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ అంతర్జాతీయ విపణిలో అడుగు పెట్టనుంది. తొలుత నేపాల్‌లో ప్రవేశిస్తోంది. ఇందుకోసం సీజీ మోటార్స్‌తో పంపిణీ ఒప్పందం చేసుకుంది. వచ్చే త్రైమాసికం నుంచే ఓలా ఎస్1, ఎస్1 ప్రో స్కూటర్లను ఎగుమతి చేస్తామని ప్రకటించింది. రెండవ దశలో లాటిన్ అమెరికా, ఆసియాన్, యూరోపియన్ యూ నియన్‌కు విస్తరించనున్నట్టు వెల్లడించింది. చదవండి : బ్యాంకుల మొండి బాకీలు తగ్గుతాయ్ -
మార్కెట్లోకి ఓలా న్యూ వెర్షన్ స్కూటర్, అదిరే ఫీచర్లు, కేవలం రూ.499తో మన ఇంటికి!
ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న ఓలా మరో సంచలనానికి సై అంది. ఇప్పటికే దేశం నలుమూలలా విడుదలైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు రయ్ రయ్ మంటూ రోడ్లపై పరుగులు పెడుతుండగా ఆగస్టు 15న ఈ కంపెనీ నుంచి రెండో ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎస్1 (Ola S1)ని కూడా రిలీజ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో నావిగేషన్, సహచర యాప్, రివర్స్ మోడ్ వంటి సాఫ్ట్వేర్ ఫీచర్లు ఉన్నాయి. లేటస్ట్ టెక్నాలజీ, సౌకర్యవంతమైన రైడ్‌ని అందివ్వగల ఈ స్కూటర్ ధరని రూ.99,000గా నిర్ణయించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేవలం రూ.499 చెల్లించి కస్టమర్లు ఈ స్కూటర్ని బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఆగస్టు 15 నుంచి 31 వరకు బుక్ చేసుకున్న వారికి మాత్రమే. ఈ తేదీలో బుక్ చేసుకున్న కస్టమర్లకు సెప్టంబర్ 7 నుంచి డెలివరీ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. Ola S1 బ్యాటరీ 3KWh సామర్థ్యం ఉండగా, ఒక సారి చార్జ్ చేస్తే 141 కిలోమిటర్లు ప్రయాణించవచ్చు. ఇందులో 3 రకాల డ్రైవింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎకో మోడ్‌లో 128 కిలోమిటర్లు , సాధారణ మోడ్ (నార్మల్ మోడ్) 101 కిలోమీటర్లు, స్పోర్ట్స్ మోడ్‌లో 90కి.మీ వరకు ప్రయాణించవచ్చు. దీని టాప్ స్పీడ్ 95kmphగా ఉంది. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఐదు కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. చదవండి: ఖాతాదారులకు షాకిచ్చిన ఎస్బీఐ: మూడు నెలల్లో మూడోసారి -
మిషన్ ఎలక్ట్రిక్ 2022: మెగా ఈవెంట్లో ఓలా ఏం చేయబోతోంది?
సాక్షి, ముంబై: ఓలా ఎలక్ట్రిక్ ఏడాది కూడా సంచలనానికి తెరతీయనుందా? ఆగస్టు 15న మిషన్ ఎలక్ట్రిక్ 2022 పేరుతో తన ఉత్పత్తులను పరిచయం చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని హోరెత్తించిన నేపథ్యంలో ఓలా కొత్త ఎలక్ట్రిక్ కారు, ఎలక్ట్రిక్ స్కూటర్ , ఈవీ బ్యాటరీని లాంచ్ చేయనుందనే అంచనాలు ఊపందుకున్నాయి. మరికొన్ని గంటల్లో ఈ సస్పెన్స్‌కు తెరపడనుంది. ఓలాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన తొలి ఎలక్ట్రిక్ కారును ఆగస్టు 15, 2022న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయనుంది. ఈ మేరకు ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ తన వీల్స్ ఆఫ్ ద రెవల్యూషన్ అంటూ సోషల్ మీడియా హ్యాండిల్లో ఎలక్ట్రిక్ కారు చిన్న వీడియోను షేర్ చేశారు. ఎలక్ట్రిక్ కారును ప్రకటిస్తూ అగర్వాల్ ట్విటర్లో ఒక వీడియోను పంచుకున్నారు. “పిక్చర్ అభీ బాకీ హై మేరే దోస్త్. 15 ఆగస్ట్ 2గంటలకు కలుద్దాం" అంటూ ట్వీట్ చేశారు. భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మరో రెండు కొత్త ఉత్పత్తులను కూడా పరిచయం చేయనుంది. ఫ్లాగ్షిప్ S1 ప్రోతో పోలిస్తే మరింత సరసమైన ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కావచ్చని భావిస్తున్నారు.గత ఏడాది ఇదే రోజున ఓలా తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. S1, S1 ప్రో వేరియంట్లను పరిచయం చేసింది. అయితే ప్రస్తుతం S1 అమ్మకాలను నిలిపివేసి , S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మాత్రమే విక్రయిస్తున్న సంగతి గమనార్హం Wheels of the revolution! pic.twitter.com/8zQV3ezj6o — Bhavish Aggarwal (@bhash) August 13, 2022 -
ఆగస్టు 15న ఓలా మరో సంచలనం: బీ రెడీ అంటున్న సీఈవో
సాక్షి, ముంబై: క్యాబ్ సేవలు, ఎలక్ట్రిక్ బైక్స్‌తో హవాను చాటుకుంటున్న ఓలా త్వరలోనే తన తొలి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనుంది. ఓలా ఎలక్ట్రిక్ ఆగస్ట్ 15న ఒక స్పోర్టీ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించ నుందని తెలుస్తోంది. ఈ మేరకు ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని వెల్లడించారు. భవిష్ అగర్వాల్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, కార్ లాంచింగ్‌ను ధ్రువీకరించారు. 75వ స్వాతంతత్ర్య దినోత్సవం సందర్భంగా కొత్త ప్రొడక్ట్‌ను ఇండియాలో లాంచ్ చేయ నున్నట్లు ట్వీట్ చేశారు. దీంతో పాటు అతి చౌక ధరలో కొత్త ఎస్1 స్కూటర్‌ను తీసుకురానుందని సమాచారం. ఆగస్టు 15న మేము ఏమి ప్రారంభించ బోతున్నామో ఊహించగలరా? అంటూ ట్వీట్ చేసిన భవీష్ అగర్వాల్ నాలుగు ఆప్షన్లు కూడా ఇచ్చారు. అలాగే లాంచ్ ఈవెంట్‌ను ఆన్‌లైన్‌లోస్ట్రీమ్ చేయనున్నామని, సంబంధిత వివరాలను త్వరలోనే వెల్లడి స్తామన్నారు. Any guesses what we’re launching on 15th August??!! — Bhavish Aggarwal (@bhash) August 5, 2022 ఓలా ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కాన్సెప్ట్ తక్కువ ధరలో కొత్త S1, భారతదేశపు అత్యంత స్పోర్టియస్ట్ కారు, సెల్ ఫ్యాక్టరీ , S1లో కొత్త ఉత్తేజకరమైన రంగుఅంటూ నాలుగు హింట్స్ ఇచ్చారు. దీంతో ఈ నాలింటిని పరిచేయనుందనే అంచనాలు మార్కెట్ వర్గాలు నెలకొన్నాయి. స్పోర్టీ ఎలక్ట్రిక్ కారు 10 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండనుందట. అలాగే ఈ ఆగస్ట్ 15న ఫ్యూచర్ ఫ్యాక్టరీలో సెల్ తయారీ ప్లాంట్, కార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే ప్రణాళికలతో సహా అనేక కార్యకలాపాలను వెల్లడించవచ్చని భావిస్తున్నారు. కాగా ఓలా ఎలక్ట్రిక్ ఈ కొత్త ఫోర్-వీలర్ లాంచింగ్‌పై గత కొద్ది కాలంగా అప్డేట్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓలా ఇండియాలో ఎస్1, ఎస్1 ప్రో, అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. -
ఓలా సరికొత్త రికార్డ్, ప్రపంచంలోనే అతిపెద్ద ఐబీసీ సెంటర్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ బెంగళూరులో అత్యాధునిక బ్యాటరీ ఇన్నోవేషన్ సెంటర్‌ను (బీఐసీ) ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం సుమారు రూ.4,000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సోమవారం కంపెనీ ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత అధునాతన సెల్ పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఇదేనని వెల్లడించింది. 165 రకాల ప్రత్యేక, ఆధునిక విభిన్న ల్యాబ్ పరికరాలతో ఈ కేంద్రం కొలువుదీరనుందని ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్, సీఈవో భవీశ్ అగర్వాల్ తెలిపారు. బ్యాటరీ ప్యాక్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, టెస్టింగ్ అన్నీ కూడా ఒకే గొడుకు కింద ఉంటాయని చెప్పారు. పరిశోధన, అభివృద్ధికై 500 మంది పీహెచ్డీ, ఇంజనీరింగ్ అభ్యర్థులతోసహా అంతర్జాతీయంగా నైపుణ్యం కలిగిన సిబ్బందిని ఓలా నియమించుకోనుంది. వీరికి మరో 1,000 మంది పరిశోధకులు సహాయకులుగా ఉంటారు. ఇటీవలే లిథియం అయాన్ సెల్‌ను ఓలా ఎలక్ట్రిక్ ఆవిష్కరించింది. దేశీయంగా అభివృద్ది చేసిన తొలి లిథియం అయాన్ సెల్ ఇదే. 2023 నుంచి పెద్ద ఎత్తున వీటి ఉత్పత్తి చేపట్టనున్నట్టు కంపెనీ ప్రకటించింది. -
లిథియం అయాన్ సెల్ తయారీలో ఓలా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన తయరీలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ లిథియం అయాన్ సెల్‌ను ఆవిష్కరించింది. దేశీయంగా అభివృద్ది చేసిన తొలి లిథియం అయాన్ సెల్ ఇదే కావడం విశేషం. వచ్చే ఏడాది నుంచి పెద్ద ఎత్తున వీటి ఉత్పత్తి చేపట్టనున్నట్టు కంపెనీ మంగళవారం ప్రకటించింది. నిర్దిష్ట రసాయనాలు, పదార్థాలు ఉపయోగించడం వల్ల తక్కువ స్థలంలో ఎక్కువ శక్తిని ఈ సెల్ నిక్షిప్తం చేస్తుంది. అలాగే సెల్ మొత్తం జీవిత కాలాన్ని మెరుగుపరుస్తుందని కంపెనీ వివరించింది. ‘ప్రపంచంలోని అత్యంత అధునాతన సెల్ రిసర్చ్ సెంటర్‌ను నిర్మిస్తున్నాం. ఇది సంస్థ సామర్థ్యం పెంచేందుకు, ఆవిష్కరణలకు దోహదం చేస్తుంది. ప్రపంచంలో అత్యంత అధునాతన, సరసమైన ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తులను వేగంగా నిర్మించడానికి వీలు కల్పిస్తుంది’ అని ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్, సీఈవో భవీశ్ అగర్వాల్ తెలిపారు. సెల్ తయారీ కేంద్రాన్ని స్థాపిస్తున్న ఓలా.. పరిశోధన, అభివృద్ధికై 500 మంది పీహెచ్డీ, ఇంజనీరింగ్ చదివిన వారిని నియమించుకుంటోంది. -
ఓలాకి గడ్డు కాలం..వందల మంది ఉద్యోగుల తొలగింపు!
ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ ఓలా కీలక నిర్ణయం తీసుకుంది. నిర్వహణ లోపాలు, ఆర్థిక మాంద్యం దెబ్బకు ఖర్చుల్ని తగ్గించుకునేందుకు వందల మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బ్యాటరీ లోపాల కారణంగా ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్ అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో వాహనదారులు సైతం ఆ సంస్థ ఈవీ వెహికల్స్‌ను కొనుగోలు చేసేందుకు వెనక్కి తగ్గారు. ఫండింగ్ సమస్యలు తలెత్తాయి. వెరసి సంస్థను ఆర్ధిక సమస్యల నుంచి గట్టెక్కించేందుకు ఓలా 500 మంది ఉద్యోగుల్నితొలగించనున్నట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో భాగంగా పనితీరును బట్టి ఆయా విభాగాలకు చెందిన ఉద్యోగుల్ని పక్కన పెట్టేస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. అంతేకాదు పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై దృష్టిసారించిన ఓలా.. ఆ సంస్థ అనుసంధానంగా ఉన్న ఓలా కేఫ్, ఫుడ్ పాండా, ఓలా ఫుడ్స్,ఓలా డ్యాష్లను మూసి వేసింది. -
అయ్యో ఓలా ఎలక్ట్రిక్: కస్టమర్ల షాక్ మమూలుగా లేదుగా!
సాక్షి, ముంబై: దేశంలో ఎలక్ట్రానిక్ టూవీలర్స్ సెగ్మెంట్లో టాప్‌లో ఒక వెలుగు వెలిగిన ఓలా ఎలక్ట్రిక్‌కు వరుసగా మరో షాక్ తగిలింది. ఇటీవలి కాలంలో ఎలక్ట్రానిక్ వాహనాల అగ్ని ప్రమాదాల నేపథ్యంలో వినియోగదారుల ఆసక్తి భారీగా తగ్గిపోతోంది. అమ్మకాలు లేక వెలవెలబోతోంది. రిజిస్ట్రేషన్లు పతనంతో నాలుగో స్థానానికి పడిపోయింది. ఓలా రిజిస్ట్రేషన్లు మే 30తో పోలిస్తే జూన్ 30 నాటికి 30 శాతానికి పైగా తగ్గాయి. అయితే ఏప్రిల్,మే నెలల్లో నెలవారీగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు రిజిస్ట్రేషన్లు తగ్గినప్పటికీ జూన్‌లో స్వల్పంగా పెరిగాయి. జూలై 2 నాటి వాహన్ పోర్టల్ తాజా సమాచారం ప్రకారం జూన్‌లో నమోదైన మొత్తం ద్విచక్ర వాహనాల ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు)42,233 యూనిట్లుగా ఉన్నాయి. దీంతో 2022లో ఇప్పటివరకు కేటగిరీలో నమోదైన మొత్తం వాహనాల సంఖ్య 2.4 లక్షల యూనిట్లకు చేరుకుంది. కానీ భవిష్ అగర్వాల్ నేతృత్వంలోని ఓలా ఎలక్ట్రిక్ జూన్‌లో బాగా తగ్గిపోయాయి. అధికారిక డేటా ప్రకారం జూన్ 30 నాటికి 5,869 ఎలక్ట్రిక్ స్కూటర్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఒకినావా ఆటోటెక్ దేశవ్యాప్తంగా 6,976 వాహనాల రిజిస్ట్రేషన్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఆంపియర్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్కూటర్స్ 6,534తో రెండవ స్థానంలో నిలిచింది. 6,486 ఎలక్ట్రిక్ స్కూటర్స్ రిజిస్ట్రేషన్లతో హీరో కంపెనీ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే ఏథర్ ఎనర్జీ 3,797 రిజిస్ట్రేషన్స్, 2,419 రివోల్ట్ వాహనాల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఇటీవల ప్రమాదానికి గురైన కంపెనీల్లో ఒకటైన ప్యూర్ ఈవీ రిజిస్ట్రేషన్లు 1125 యూనిట్లకు తగ్గాయి. ఈ ఏడాది మేలో 1,466 యూనిట్లు ఏప్రిల్‌లో 1,757 యూనిట్లను విక్రయించింది. ఒకినావా మేలో 9,302 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఓలా ఎలక్ట్రిక్ 9,225 యూనిట్ల ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీ చేసింది. ఇది ఇలా ఉంటే కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల బ్యాటరీలలో సెక్యూరిటీ లోపాలున్నట్టు గుర్తించింది. ఈ క్రమంలోనే పెరుగుతున్న అగ్ని ప్రమాదాలు, బ్యాటరీ పేలుళ్లు, బ్యాటరీలలో లోపాలు లాంటి అంశాలపై వివరణ ఇవ్వాల్సిందిగా దాదాపు అన్ని కంపెనీలకు ప్రభుత్వం నోటీసులిచ్చింది.