![How Owners Will Get Their Ola S1 Repaired Without Service Centre - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/25/ola-electric.jpg.webp?itok=SF3KWfcQ)
ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఓలా ఎలక్ట్రిక్ తన స్కూటర్లతో సంచలనాన్ని ఆవిష్కరించింది. ప్రీ బుకింగ్స్‌లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు రికార్డు నమోదు చేసిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన ప్రియులు ఒక్కసారిగా ఎగబడడంతో ఓలా అమ్మకాలు జరిపిన తొలిరోజులో రూ. 600 కోట్లు, రెండు రోజుల్లో మొత్తంగా రూ. 1100 కోట్ల విలువైన స్కూటర్లను ఓలా విక్రయించింది.
చదవండి: జేమ్స్‌బాండ్-007 భాగస్వామ్యంతో స్పెషల్ ఎడిషన్ బైక్..!
ఏదైనా సమస్య వస్తే ఎలా...!
దేశ ప్రజలు నుంచి ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ అత్యంత ఆదరణను పొందాయి. ఈ స్కూటర్లను బుక్ చేసిన కస్టమర్లకు రాబోయే నెలలో డెలివరీ చేయనున్నట్లు ఓలా పేర్కొంది. అంతేబాగానే ఉంది కానీ ఒక వేళ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏదైనా సమస్య తలెత్తితే ఎలా...అనే ప్రశ్నపై కంపెనీ వర్గాలు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు అద్భుతమైన డిమాండ్ ఉన్నప్పటికీ, కంపెనీ సర్వీస్ నెట్‌వర్క్ విషయానికి వస్తే కొంత సందేహం ఉంది. డీలర్లు, సేవా కేంద్రాల రూపంలో కంపెనీకి భౌతికంగా ఎక్కువ ఉనికి లేదు. కొనుగోలుదారులు స్కూటర్లను కొన్న తర్వాత వారిని తొలిచే అతి పెద్ద ప్రశ్నగా నిలుస్తోంది.
ఇంటి వద్దకే...
ఎలక్ట్రిక్ స్కూటర్లను సర్వీస్ చేయడానికి తీసుకోవలసిన చర్యలపై ఓలా ఎలక్ట్రిక్ తన అధికారిక వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసింది. ప్రామాణిక కార్ కంపెనీలతో పోలిస్తే సర్వీసింగ్, మెయింటెన్స్ విషయంలో ఓలా ఎలక్ట్రిక్ భారీ తారతామ్యం ఉంది. ఆన్‌లైన్ డెలివరీ ప్రక్రియను స్నేహపూర్వకంగా మార్చాలని కంపెనీ యోచిస్తున్నందున... ఎలక్ట్రిక్ బైక్ల సర్వీసులను కూడా కస్టమర్ ఇంటి వద్దే జరపాలని కంపెనీ యోచిస్తోంది.
ఓలా బైక్‌లో ఏదైనా సమస్య తలెత్తితే...ఓలా ఎలక్ట్రిక్ యాప్‌ను ఉపయోగించి..సర్వీస్‌పై రిక్వెస్ట్ చేయడంతో ఓలా బైక్ టెక్నీషియన్ ఇంటి వద్దకే వచ్చి రిపేర్ చేస్తాడని తెలుస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ బైక్స్‌లోని ప్రిడిక్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ సహయంతో వాహనదారులను సర్వీస్, రిపేర్ కోసం అలర్ట్‌లను అందిస్తోంది. కాగా త్వరలోనే ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ కొనుగోళ్లను ఓలా చేపట్టనుంది. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా పలు ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది.
చదవండి: ఈ టైర్లు అసలు పంక్చరే కావు..!
Comments
Please login to add a commentAdd a comment