Service Center
-
8 వేల మారుతీ సుజుకీ సర్వీసింగ్ కేంద్రాలు
వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా దేశవ్యాప్తంగా సర్వీసింగ్ కేంద్రాలను విస్తరిస్తోంది. 2030–31 నాటికి మొత్తం 8,000 టచ్ పాయింట్లు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా చేసుకున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ తెలిపారు. నెక్సా 500వ టచ్ పాయింట్‌ను కంపెనీ తాజాగా ప్రారంభించింది.నెక్సా, అరీనా బ్రాండ్లలో మారుతీ సుజుకీ ఇండియాకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,240 సర్వీసింగ్ కేంద్రాలు ఉన్నాయి. ‘కస్టమర్లకు సౌలభ్యం, అత్యుత్తమ కారు యాజమాన్య అనుభవాన్ని స్థిరంగా అందించడమే మా లక్ష్యం. వినియోగదార్లకు దగ్గరవ్వాలి. తద్వారా సమీపంలో మారుతీ సుజుకీ సర్వీస్ టచ్పాయింట్ని కనుగొనగలమన్న భరోసా వారికి ఉంటుంది. వార్షిక తయారీ సామర్థ్యాన్ని, అమ్మకాలను గణనీయంగా పెంచడానికి ప్రణాళిక చేస్తున్నందున సర్వీస్ నెట్‌వర్క్‌ను ఏకకాలంలో బలోపేతం చేస్తాం’ అని టాకేయూచీ వివరించారు.మారుతీ సుజుకీ తన మొదటి నెక్సా సర్వీస్ సెంటర్‌ను 2017 జూలైలో ప్రారంభించింది. 2023–24లో 90 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒక సంవత్సరంలో ఇదే అత్యధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కంపెనీ కొత్తగా 78 నెక్సా సర్వీస్ టచ్పాయింట్లను తెరిచింది. 500ల సర్వీస్ టచ్పాయింట్ల మైలురాయిని 7 సంవత్సరాల 5 నెలల వ్యవధిలో చేరుకుంది. -
దీపావళి వీడియో కాదు.. సర్వీస్ స్టేషన్ ఫుటేజ్ చూపండి: కునాల్ కమ్రా
ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్.. కంపెనీలో జరిగిన దీపావళి వేడుకలకు సంబంధించిన ఒక వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోపైన స్పందించిన కునాల్ కమ్రా.. ఓలా సర్వీస్ స్టేషన్ ఫుటేజీని షేర్ చేయమని భవిష్ అగర్వాల్‌ను కోరారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.సేల్స్ తరువాత నాణ్యమైన సర్వీస్ అందించడం లేదనే సమస్యతో ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్‌తో రగడ మొదలైంది. అప్పటి నుంచి ఓలా కస్టమర్లు లేవనెత్తే అనేక సమస్యలను కునాల్ హైలైట్ చేస్తూ వస్తున్నారు.నెలకు 80,000 కస్టమర్ ఫిర్యాదులను కంపెనీ ఎందుకు పరిష్కరించడం లేదనికునాల్ కమ్రా.. ఓలా సీఈఓను అడిగారు. దీనిపై స్పందించిన భవిష్ అగర్వాల్, ఓలా పరువు తీసేందుకు కమ్రా డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. అంతే కాకుండా భవిష్ అగర్వాల్ కూడా కమ్రాను ఒక సర్వీస్ సెంటర్లో ఒక రోజు పని చేయాలని కోరారు.ఇదీ చదవండి: ఓలా సీఈఓ జాబ్ ఆఫర్.. ఓకే అన్న కమెడియన్!ఇటీవల ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్.. కమెడియన్ కునాల్ కమ్రాకు జాబ్ ఆఫర్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. దీనికి కమ్రా అంగీకరిస్తూ కొన్ని షరతులను కూడా వెల్లడించారు. కాగా ఇప్పుడు మళ్ళీ భవిష్ అగర్వాల్ చేసిన పోస్టుకు.. కామెంట్ చేశారు. దీనిపైనా నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.Service station ka footage dikhao… https://t.co/Zmp1Yzoh3i— Kunal Kamra (@kunalkamra88) October 31, 2024 -
ఓలా సీఈఓ జాబ్ ఆఫర్.. ఓకే అన్న కమెడియన్!
ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ కమెడియన్ కునాల్ కమ్రాకు జాబ్ ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఆఫర్‌ను అంగీకరించాలంటే తనకు కొన్ని షరతులు ఉన్నాయని కునాల్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సర్వీసు సెంటర్ వద్ద పోగైన వాహనాల ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్, కునాల్ కమ్రాల మధ్య మాటల యుద్ధం సాగింది.ప్రభుత్వ విభాగమైన సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు గతంలో షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి పది వేలకుపైగా ఫిర్యాదులు వచ్చినట్లు సీసీపీఏ తెలిపింది. సర్వీసు లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య పద్ధతులను అనుసరించడం, వినియోగదారు హక్కుల ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడుతుందని సంస్థపై ఆరోపణలు వచ్చాయి. ఇయితే ఈ ఫిర్యాదుల్లో 99.1 శాతం సమస్యలను పరిష్కరించిందని కంపెనీ ఇటీవల పేర్కొంది.ఇదీ చదవండి: సైబర్ దొంగ.. ఏఐకూ బెంగ!ఈ పరిణామాల నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ కునాల్ కమ్రాకు జాబ్ ఆఫర్ చేశారు. దానిపై కునాల్ ఎక్స్ వేదికగా కొన్ని డిమాండ్లను లేవనెత్తారు. వాటిని తీరిస్తే తాను జాబ్‌లో చేరుతానని చెప్పారు. ‘ఓలాతో కలిసి పనిచేయడానికి కంపెనీ సీఈఓ ఆఫర్‌ను అంగీకరించడం తప్ప నాకు వేరే మార్గం లేదు. నన్ను కంపెనీ విషయాలకు సంబంధించి వేలసార్లు ట్యాగ్ చేశారు. నేను ఓలా ఉద్యోగిగానే భావిస్తున్నాను. కంపెనీ ఆఫర్‌ను స్వీకరించాలంటే కొన్ని డిమాండ్లను తీర్చాలి.ఓలా సర్వీస్ సెంటర్లలో స్కూటర్ ఇచ్చిన కస్టమర్లకు ఏడు రోజుల్లో సర్వీస్ అందేలా కంపెనీ చర్య తీసుకోవాలి.ఏడు రోజులు దాటినా మరమ్మతులు పూర్తి కాకపోతే వేరే స్కూటర్‌ను తాత్కాలికంగా వినియోగదారులకు అందించాలి.స్కూటర్ రిపేర్ పూర్తయ్యే వరకు రోజువారీ రవాణా ఖర్చుల కింద రూ.500 ఇవ్వాలి.కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు రెండు బీమాలు అందించాలి. వాహనానికి ఒకటి, సర్వీస్‌లకు మరొకటి. కస్టమర్లకు సర్వీస్ ఇన్సూరెన్స్ ఉచితంగా అందించాలి’ అని కునాల్ అన్నారు. -
కాల్ హోల్డ్‌లో పెట్టారా..? రూ.4.6 లక్షల కోట్లు నష్టం!
మీరెప్పుడైనా సమస్య పరిష్కారం కోసం కస్టమర్‌కేర్‌కు కాల్ చేశారా..? మన సమస్య చెప్పాకా చాలా వరకు కాల్ సెంటర్ సిబ్బంది ‘కాసేపు హోల్డ్‌లో ఉండండి’ అనడం గమనిస్తాం. అయితే 2023లో అలా కస్టమర్లను హోల్డ్‌లో ఉంచిన సమయం ఎంతో తెలుసా..? ఏకంగా 15 బిలియన్ గంటలు(1500 కోట్ల గంటలు). దాంతో శ్రామికశక్తి వల్ల కలిగిన ఆర్థిక నష్టం రూ.4.6 లక్షల కోట్లు. ఈమేరకు ‘సర్వీస్ నౌ’ అనే సంస్థ విడుదల చేసిన ‘కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ 2024’ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.సర్వీస్‌నౌ సంస్థ 18 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న 4,500 మంది భారతీయులపై సర్వే నిర్వహించి ఈ నివేదిక రూపొందించింది. నివేదికలోని వివరాల ప్రకారం..2023లో కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసిన సగటు వ్యక్తి 30.7 గంటలు హోల్డ్‌లో గడిపాడు. 2023లో అన్ని కాల్‌సెంటర్లు కలిపి 1500 కోట్ల గంటలు కస్టమర్లను హోల్డ్‌లో ఉంచాయి. అలా వినియోగదారుల శ్రామికశక్తి వల్ల కలిగిన ఆర్థిక నష్టం రూ.4.6 లక్షల కోట్లు. కాల్ కనెక్ట్ అవ్వకపోవడంతో వెయిటింగ్లో ఉన్నవారు 50% కంటే ఎక్కువే. తమ సమస్యలను మూడు రోజుల్లోగా పరిష్కరించకపోతే 66% మంది ఇతర కంపెనీ సర్వీసుల్లోకి మారడానికి సిద్ధంగా ఉన్నారు.సర్వీస్‌నౌ ఇండియా టెక్నాలజీ అండ్ బిజినెస్ సెంటర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎండీ సుమీత్ మాథుర్ మాట్లాడుతూ..‘కస్టమర్లకు సర్వీసు అందడంలో ఆలస్యం అవుతోంది. దాంతో 2024లో కంపెనీలు మూడింట రెండొంతుల మంది కస్టమర్లను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలామంది వినియోగదారులు చాట్బాట్లు, సెల్ఫ్-హెల్ప్ గైడ్ల వంటి ఏఐ సొల్యూషన్లపై ఆధారపడుతున్నారు. టెక్నాలజీ పెరగడంతో 62% మంది కస్టమర్లు కాల్సెంటర్లకు ఫోన్ చేయకుండా స్వయంగా సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. దాదాపు 50% మంది వినియోగదారులకు టెక్నాలజీని ఉపయోగించి తమ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో సరైన అవగాహన లేదు. కంపెనీ మేనేజ్మెంట్, సిబ్బంది మధ్య అంతర్గత కమ్యూనికేషన్ లోపించడంతో హోల్డింగ్ సమయం పెరుగుతుంది. సిబ్బందిలో నిర్ణయాధికారం లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంది.ఇదీ చదవండి: ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై కఠిన చర్యలుటెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో దాదాపు చాలామంది ప్రస్తుతం ఏఐ సొల్యూషన్స్‌పై ఆధారపడుతున్నారు. దానివల్ల కాల్సెంటర్లను ఆశ్రయించడం తగ్గింది. ఏదైనా అత్యవసరమైతే తప్పా వాటిని సంప్రదించడం లేదు. కాల్సెంటర్లకు కాల్ చేసే కస్టమర్ల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని నివేదిక చెబుతుంది. హోల్డింగ్ సమయాన్ని తగ్గించాలని, అందుకు అనువుగా ఏఐ ఆధారిత సేవలను మరింత మెరుగుపరచాలని అధ్యయనం సూచిస్తుంది. -
300 నగరాల్లో కియా కేంద్రాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కియా ఇండియా విక్రయ, సర్విస్ కేంద్రాలను విస్తరిస్తోంది. కియా 2.0 వ్యూహంలో భాగంగా డిసెంబర్‌కల్లా 300 నగరాలు, పట్టణాల్లో అడుగు పెట్టడం ద్వారా టచ్ పాయింట్స్ సంఖ్యను 700లకు చేరుస్తామని ప్రకటించింది. ప్రస్తుతం 236 నగరాలు, పట్టణాల్లో కంపెనీకి 522 సేల్స్, సర్విస్ సెంటర్స్ ఉన్నాయి. -
సర్వీస్ సెంటర్లలో మారుతీ సుజుకీ రికార్డ్! ఏకంగా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ సర్వీస్ నెట్వర్క్ దేశవ్యాప్తంగా 4,500ల కేంద్రాల మార్కును చేరుకుంది. హైదరాబాద్‌లోని రాంపల్లి సర్వీస్ సెంటర్ ఈ ఘనతను సొంతం చేసుకుంది. 2022–23లో భారత్‌లో 310 సర్వీస్ టచ్ పాయింట్లను ఏర్పాటు చేశామని సంస్థ సర్వీస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మీడియాకు తెలిపారు. ‘పట్టణేతర ప్రాంతాల్లో అత్యధికంగా ఇవి ప్రారంభం అయ్యాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయిలో సర్వీస్ కేంద్రాలను అందుబాటులోకి తేవడం సంస్థ చరిత్రలో తొలిసారి. 2023–24లో కొత్తగా 350 కేంద్రాలను నెలకొల్పుతాం. సర్వీసు కోసం నగరాల్లో 10–15 కిలోమీటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 25 కిలోమీటర్లకు మించి కస్టమర్ ప్రయాణించకూడదు అన్నది మా లక్ష్యం. సర్వీస్ టచ్ పాయింట్స్ 2,271 నగరాలు, పట్టణాల్లో విస్తరించాయి. 335 సర్వీస్ ఆన్ వీల్స్ వర్క్‌షాప్స్ ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 326 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా అత్యధికంగా 2.23 కోట్ల వాహనాలకు సర్వీసు అందించాం’ అని వివరించారు. ఇదీ చదవండి: Maruti Suzuki Jimny: మారుతీ జిమ్నీ వచ్చేసింది.. చవకైన 4X4 కారు ఇదే.. -
Sparsh Hospice: దేవతల్లాగే కనిపించారు.. వాళ్ల నవ్వు అద్భుతం!
బిడ్డను పొత్తిళ్లలో చూసుకున్నంతటి ప్రేమను కుటుంబం అంతా పంచుతుంది మహిళ. జీవితం చివరి దశలో ఉన్న వారిని అక్కున చేర్చుకునే ప్రేమ కూడా అమ్మ సొంతమే అని హైదరాబాద్‌లోని స్పర్శ్ హాస్పిస్ స్పష్టం చేస్తుంది. ఇంటి బాధ్యతల్లోనూ, చదువుల్లోనూ మునిగి ఉండే మహిళ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మానవ సేవయే మాధవ సేవగా భావించడానికి కదులుతోంది. జీవితం నేర్పిన అనుభవాల పాఠాలను మూటగట్టుకొని సేద తీరుతున్న చివరి దశ ఎప్పుడూ భయపెడుతూనే ఉంటుంది. తప్పక వచ్చి చేరే దశను కుటుంబం అంతా జాగ్రత్తగా చూసుకుంటుంది. కానీ, కొన్ని సందర్భాల్లో అది ఆ కుటుంబానికి కష్టంగా మారచ్చు. వృద్ధాప్యంతోనూ, జబ్బుతోనూ ఉండే చివరి దశను గౌరవంగా, ప్రేమగా, బాధ్యతగా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకోసారి కుటుంబంలో ఇది అన్నివేళలా కుదరని పరిస్థితి ఉండచ్చు. అలాంటప్పుడు స్పర్శ్ లాంటి కేంద్రాల్లో సేవ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావచ్చు. సమాజ బాధ్యతల్లో తామూ ‘సేవ’లో పాలుపంచుకోవచ్చు అనే వారి సంఖ్య పెరుగుతోంది. దీంట్లో మరీ ముఖ్యంగా తమ ఇంటి పరిధులను దాటి సేవలో భాగం పంచుకుంటోంది మహిళ. ‘ఇదో అనిర్వచనీయమైన అనుభూతి. ప్రతిఫలం ఏమీ ఆశించని సేవ ఇంతకు మించి ఉండదు. మన అమ్మానాన్నలకు సేవ చేసుకున్నట్టే’ అంటున్నారు స్వచ్ఛంద సేవికలు. వాళ్ల నవ్వు అద్భుతం.. సైకాలజీ అండ్ ఫిలాసఫీ లో డిగ్రీ సెకండియర్ చేస్తున్నాను. నా ఫ్రెండ్ శోభ క్యాన్సర్‌తో బాధపడుతున్నప్పుడు నేను స్పర్శ్ సెంటర్‌కి వెళ్లాను. తన ద్వారా ఇలాంటి ఒక సేవ ఉంటుందని తెలిసింది. అక్కడ అందరూ చాలా సహనంగా ఉండటం కనిపించింది. సేవ పొందుతున్న చివరిదశలో ఉన్నవారు దేవతల్లాగే కనిపించారు. భవిష్యత్తును చాలా పాజిటివ్‌గా చూస్తారు వాళ్లంతా. నాకు అది చాలా నచ్చింది. వారానికి ఒకసారి వెళ్లి అక్కడ వాళ్లతో మాట్లాడి వస్తుంటాను. వాళ్లే చాలా ధైర్యంగా ఉంటారు. నాకు భవిష్యత్తు గురించి మంచి విషయాలు చెబుతుంటారు. శారీరకంగా బెడ్ మీద నుంచి కూడా లేవడానికి వారికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ, వాళ్లలో ఒక మంచి నవ్వు ఉంటుంది. వారిలో ఆ నవ్వు చూడటానికి వెళుతుంటాను. – మహిక, స్టూడెంట్ ప్రతిఫలం ఆశించకూడదు.. మా నాన్నగారు క్యాన్సర్‌తో చనిపోవడంతో నా ఆలోచన సేవ వైపుగా మళ్లింది. క్యాన్సర్ పేషెంట్‌కు ఎలాంటి సేవ అందించాలనే విషయంలో చాలా తపన పడ్డాను. చివరి దశలో ఉన్న వాళ్లకి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించాను. మా వారి ఫ్రెండ్ ద్వారా స్పర్శలో సేవ చేసే అవకాశం లభించింది. స్వచ్ఛందంగా పాల్గొన్నప్పుడు ఆ అనుభూతిని స్వయంగా పొందాను. చివరి దశలో ఉన్నవారికి ఓదార్పు ఇవ్వాలి. వండాలి, తినిపించాలి. మందులు వేయాలి. మాట్లాడాలి. ప్రతిదీ వారికి దగ్గరగా ఉండాలి. అదంతా ఒక అసాధారణమైన అనుభూతి. డబ్బు ఒక్కటే కాదు మనసు కూడా ఉండాలి. ఎప్పుడైనా సరే ఏమీ ఆశించని ప్రేమ ఇవ్వడం అనేది చాలా గొప్ప. పాతికేళ్లపాటు గృహిణిగా ఉన్న నేను, సేవ ద్వారా చాలా మందికి చేరువయ్యాను. బయటకు వచ్చి సమాజ బాధ్యతలో మరొక ప్రపంచాన్ని చూశాను. బాధలో ఉన్నవారికి ‘నేనున్నాను’ అని ధైర్యం ఇవ్వడమనేది చాలా ముఖ్యం. ఏమీ ఆశించకుండా చేసినప్పుడే మనం చేసిన సేవకు సార్థకత ఉంటుందని అభిప్రాయం. – పద్మారెడ్డి, బిజినెస్ ఉమన్ అవగాహనే ప్రధానం చివరిదశలో ఉన్నవారికి సేవ చేసుకునే భాగ్యం నాలుగేళ్లుగా నాకు లభించింది. చాలా మందికి ఈ చివరి దశలో ఉన్న సెంటర్ గురించి తెలియదు. చివరి దశలో ఉన్నవారిని ఎలా చూసుకోవాలో కూడా తెలియదు. డాక్యుమెంటేషన్, సోషల్ మీడియా, డోనర్ రిపోర్ట్‌ను స్వచ్ఛందంగా చేస్తుంటాను. నాకు తెలిసిన వారందరికీ మానవ సేవలో ఉన్న గొప్పదనాన్ని గురించి చెబుతుంటాను. ఈ దశలో ఉన్నవారిని ఎలా జాగ్రత్తగా, ప్రేమగా చూసుకోవాలో తెలుస్తుంది. – నేహారాణి పటేల్, ఉద్యోగి సేవాగుణానికి నైపుణ్యం తోడు.. విద్యాసంబంధ సంస్థలతో కలిసి వర్క్ చేస్తుంటాను. ఒకరి ద్వారా తెలిసి స్పర్శ్ కేంద్రాన్ని విజిట్ చేశాను. ముఖ్యంగా సేవాగుణం ఉండటంతో పాటు నైపుణ్యం గల వాళ్లతో మాట్లాడి ఇలాంటి సేవ గురించి పరిచయం చేస్తాను. డాక్టర్ల దగ్గరకు చివరి దశలో ఉన్న పేషెంట్స్ వస్తుంటారు. అలాంటి వారికి సేవ అందించడానికి ఈ సెంటర్‌కి తీసుకువస్తుంటాను. అలాగే ఆన్లైన్ మ్యాగజైన్స్, డాక్యుమెంటరీ, వీడియో, సోషల్ మీడియాలో పబ్లిష్ చేయడం.. వంటివి చేస్తుంటాను. దీని ద్వారా మరికొందరికి ఈ సర్వీస్ అందేలా చూస్తాను. – అన్నపూర్ణ, సాఫ్ట్‌స్కిల్స్ ట్రైనర్ చదవండి: Women's Day 2022: విజయవంతంగా 25 ఏళ్లు.. రూ. 20 సభ్యత్వంతో మొదలై.. ఇప్పుడు కోటికి పైగా నిధులతో.. -
ఎక్స్70 సిరీస్ కస్టమర్లకు వివో ప్రత్యేక సర్వీసులు
హైదరాబాద్: కొన్నాళ్ల క్రితం ఆవిష్కరించిన ఎక్స్ సిరీస్ ఫోన్ల కస్టమర్లకు మరింత మెరుగైన సర్వీసులు అందించడానికి ఎక్స్ కేర్ పేరిట ప్రత్యేక ప్రోగ్రాం రూపొందించినట్లు స్మార్ట్ఫోన్ల తయారీ దిగ్గజం వివో వెల్లడించింది. ఈ ప్రోగ్రాం కింద వివో ఎక్స్70 సిరీస్ కస్టమర్లందరూ వర్చువల్ లైవ్ డెమో సెషన్లు, ఉత్పత్తుల హోమ్ డెలివరీ, ఇంటి వద్దే రిపేర్ సర్వీసులు మొదలైన సదుపాయాలు పొందవచ్చని పేర్కొంది. ఇరవై నాలుగ్గంటలూ నేరుగా ఏజంటుకు కాల్ చేసే ఫీచర్‌తో పాటు వివో సర్వీస్ సెంటర్లలో ఎక్స్‌క్లూజివ్ కౌంటర్ కూడా ఉంటుందని వివరించింది. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో కస్టమర్ల ఇంటి దగ్గరే రిపేర్ సర్వీసులు కూడా పొందవచ్చని వివో తెలిపింది. సెంటర్‌కు 30 కి.మీ. పరిధిలో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చని, అది దాటితే పికప్, డ్రాప్ సర్వీసు పొందవచ్చని పేర్కొంది. ఒక ఐఎంఈఐ నంబరుకు మూడు ఉచిత సర్వీసులు అందుకోవచ్చు. ఆ తర్వాత నుంచి ప్రతి విజిట్‌కు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. -
ఆధార్ కార్డుదారులకు తీపికబురు.. కొత్తగా మరో 166 కేంద్రాలు!
న్యూఢిల్లీ: ఆధార్ కార్డుదారులకు తీపికబురు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఏఐ) దేశవ్యాప్తంగా కొత్తగా మరో 166 ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్లను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ మేరకు ఒక ప్రకటనను కూడా యూఐడీఏఐ విడుదల చేసింది. ప్రస్తుతానికి దేశంలో ఉన్న 166 ఆధార్ సేవా కేంద్రాల్లో 55 మాత్రమే తెరిచి ఉన్నాయి. అంతేగాకుండా, బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వాలు 52,000 ఆధార్ ఎన్ రోల్ మెంట్ కేంద్రాలను నడుపుతున్నాయి. యుఐడీఏఐ విడుదల చేసిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 122 ప్రదేశాలలో 166 ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్లను ప్రారంభించాలని భావిస్తోంది. ఇప్పటికే దేశంలో ఉన్న ఆధార్ కేంద్రాలు వికలాంగులతో సహ 70 లక్షల మందికి సేవలందించాయి. మోడల్ ఏలోని ఆధార్ సేవా కేంద్రాలు రోజుకు 1,000 అభ్యర్థనలను మాత్రమే హ్యాండిల్ చేయగలవు. అదే సమయంలో, మోడల్-బి కేంద్రాలు-500, మోడల్-సీ కేంద్రాలు 250 అభ్యర్థనలను మాత్రమే స్వీకరిస్తాయి. (చదవండి: Paytm ఢమాల్.. రెండు రోజుల్లో పదివేల కోట్ల లాస్!) యుఐడీఏఐ ఇప్పటి వరకు 130.9 కోట్ల మందికి ఆధార్ నంబర్లను జారీ చేసింది. బ్యాంకులు, పోస్టాఫీసులు, కామన్ సర్వీస్ సెంటర్లు, ఆఫీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్, యూఐడీఏఐ ఆపరేటెడ్ ఆధార్ సర్వీస్ సెంటర్లలో మాత్రమే ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నాయి. పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా ఇతర వివరాలను సరిచేయడం, ఫోటోను అప్ డేట్ చేయడం, పీవీసీ కార్డుకు అప్లై చేసుకోవడం వంటి ఇతర సేవలు ఇక్కడ లభిస్తాయి. (చదవండి: రేయ్.. ఎవర్రా మీరు? ఎక్కడి నుంచి వచ్చార్రా?) -
ఓలా ఎలక్ట్రిక్ బైక్స్‌లో ఏదైనా సమస్య వస్తే ఏలా..! కంపెనీ ఏం చెప్తుంది..?
ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఓలా ఎలక్ట్రిక్ తన స్కూటర్లతో సంచలనాన్ని ఆవిష్కరించింది. ప్రీ బుకింగ్స్‌లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు రికార్డు నమోదు చేసిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన ప్రియులు ఒక్కసారిగా ఎగబడడంతో ఓలా అమ్మకాలు జరిపిన తొలిరోజులో రూ. 600 కోట్లు, రెండు రోజుల్లో మొత్తంగా రూ. 1100 కోట్ల విలువైన స్కూటర్లను ఓలా విక్రయించింది. చదవండి: జేమ్స్‌బాండ్-007 భాగస్వామ్యంతో స్పెషల్ ఎడిషన్ బైక్..! ఏదైనా సమస్య వస్తే ఎలా...! దేశ ప్రజలు నుంచి ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ అత్యంత ఆదరణను పొందాయి. ఈ స్కూటర్లను బుక్ చేసిన కస్టమర్లకు రాబోయే నెలలో డెలివరీ చేయనున్నట్లు ఓలా పేర్కొంది. అంతేబాగానే ఉంది కానీ ఒక వేళ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏదైనా సమస్య తలెత్తితే ఎలా...అనే ప్రశ్నపై కంపెనీ వర్గాలు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు అద్భుతమైన డిమాండ్ ఉన్నప్పటికీ, కంపెనీ సర్వీస్ నెట్వర్క్ విషయానికి వస్తే కొంత సందేహం ఉంది. డీలర్లు, సేవా కేంద్రాల రూపంలో కంపెనీకి భౌతికంగా ఎక్కువ ఉనికి లేదు. కొనుగోలుదారులు స్కూటర్లను కొన్న తర్వాత వారిని తొలిచే అతి పెద్ద ప్రశ్నగా నిలుస్తోంది. ఇంటి వద్దకే... ఎలక్ట్రిక్ స్కూటర్లను సర్వీస్ చేయడానికి తీసుకోవలసిన చర్యలపై ఓలా ఎలక్ట్రిక్ తన అధికారిక వెబ్సైట్లో లిస్ట్ చేసింది. ప్రామాణిక కార్ కంపెనీలతో పోలిస్తే సర్వీసింగ్, మెయింటెన్స్ విషయంలో ఓలా ఎలక్ట్రిక్ భారీ తారతామ్యం ఉంది. ఆన్లైన్ డెలివరీ ప్రక్రియను స్నేహపూర్వకంగా మార్చాలని కంపెనీ యోచిస్తున్నందున... ఎలక్ట్రిక్ బైక్‌ల సర్వీసులను కూడా కస్టమర్ ఇంటి వద్దే జరపాలని కంపెనీ యోచిస్తోంది. ఓలా బైక్‌లో ఏదైనా సమస్య తలెత్తితే...ఓలా ఎలక్ట్రిక్ యాప్‌ను ఉపయోగించి..సర్వీస్‌పై రిక్వెస్ట్ చేయడంతో ఓలా బైక్ టెక్నీషియన్ ఇంటి వద్దకే వచ్చి రిపేర్ చేస్తాడని తెలుస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ బైక్స్‌లోని ప్రిడిక్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ సహయంతో వాహనదారులను సర్వీస్, రిపేర్ కోసం అలర్ట్‌లను అందిస్తోంది. కాగా త్వరలోనే ఆఫ్‌లైన్, ఆన్లైన్ కొనుగోళ్లను ఓలా చేపట్టనుంది. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా పలు ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది. చదవండి: ఈ టైర్లు అసలు పంక్చరే కావు..! -
తపాలా.. మారుతోందిలా
సాక్షి, అమరావతి: ఇప్పటి వరకు బట్వాడా, ఆర్థిక సేవలకే పరిమితమైన పోస్టాఫీసులు.. సేవా కేంద్రాలుగా మార్పు చెందుతున్నాయి. రైల్వే టికెట్లు, బస్ టికెట్లు, పాస్‌పోర్టు స్లాట్ బుకింగ్, పాన్‌కార్డ్ తదితర సేవలన్నీ ఇకపై పోస్టాఫీసుల్లోనూ లభించనున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు అన్ని రకాల సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు పోస్టాఫీసులను సర్వ సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నట్లు ఏపీ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ డా.అభినవ్ వాలియా ‘సాక్షి’కి తెలిపారు. కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహకారంతో దాదాపు 60కి పైగా సేవలను పోస్టాఫీసుల ద్వారా అందించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం మన రాష్ట్రంలోని పోస్టాఫీసుల ద్వారా 20 వరకు సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. ఇక నుంచి మొబైల్, డీటీహెచ్, ఇన్సూరెన్స్ ప్రీమియం, పాన్‌కార్డు, రైల్వే, బస్, విమాన టికెట్లు, పాస్‌పోర్ట్ కోసం స్లాట్ బుకింగ్, ఆర్టీఏ, నేషనల్ పెన్షన్ స్కీం, ఫాస్ట్ ట్యాగ్ తదితర సేవలన్నింటినీ పోస్టాఫీసుల ద్వారా అందిస్తామన్నారు. ఇందుకోసం తపాలా సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నామని.. రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీతో పాటు జిల్లా స్థాయిలో శిక్షణా కమిటీలను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటికే 3,000 మంది ఆన్లైన్ సేవలపై శిక్షణ పూర్తి చేసుకున్నారని వివరించారు. ఇప్పటివరకు 11 వేలకు పైగా సేవలు.. రాష్ట్రంలో ఇప్పటికే 1,568 పోస్టాఫీసులను సర్వ సేవా కేంద్రాలుగా మార్చినట్లు అభినవ్ వాలియా తెలిపారు. వీటి ద్వారా ఇప్పటి వరకు రూ.1.26 కోట్ల విలువైన 11 వేలకు పైగా సేవలను అందించామని పేర్కొన్నారు. ప్రతి సేవకు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. సెప్టెంబర్ నెలలో మరో 500 పోస్టాఫీసుల్లో సేవలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. డిసెంబర్ నాటికి రాష్ట్రంలో ఉన్న 10,000కు పైగా పోస్టాఫీసులను సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఐఆర్టీసీ ద్వారా రైల్వే టికెట్లు 50 చోట్ల మాత్రమే అందుబాటులోకి వచ్చాయని.. త్వరలోనే అన్ని పోస్టాఫీసుల్లో అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ విధంగా మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. -
రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ కొన్న వారికి గుడ్ న్యూస్!
రాయల్ ఎన్ఫీల్డ్ (ఆర్ఈ) కంపెనీకి చెందిన కొత్త బైక్ ఈ మధ్య కొన్నారా? అయితే, మీకు ఒక తీపికబురు. కంపెనీ తాజాగా సర్వీస్ కేర్ 24 అనే కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉన్న వారు ఒకసారి ఉచితంగానే ఫ్రీ సర్వీస్ పొందొచ్చు. ఈ సర్వీస్ కేర్ 24లో నాలుగు జనరల్ సర్వీసులు, రెండు సార్లు ఇంజిన్ ఆయిల్ మార్చుకోవచ్చు. అయితే, బైక్ ఛాసిస్ నెంబరు వెరిఫికేషన్ తర్వాతనే ఈ సర్వీస్ అందించనున్నట్లు తెలిపింది. సర్వీస్ కేర్ 24లో భాగంగా ఒకసారి ఫుల్ సర్విస్ చేస్తే అన్ని పన్నులతో కలిపి రూ.2,499 ఖర్చు అవుతుంది. ఈ ప్యాకేజ్ తీసుకున్న వారికి అదనపు రిపేర్ అవసరం అయితే విడిభాగాలపై, లూబ్రికేషన్పై 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే లేబర్ చార్జీల్లో 20 శాతం తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఈ సర్వీస్ ప్యాకేజ్ కొనుగోలు చేయాలని భావించే వారు రాయల్ ఎన్ఫీల్డ్ వెబ్‌సైట్‌కు వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్యాకేజీని కొనుగోలు చేయొచ్చు. ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసిన తర్వాత ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. రాయల్ ఎన్ ఫీల్డ్ నిపుణులు ఈ సర్విస్ అందించనున్నట్లు పేర్కొంది. మా వాహనాల పట్ల అదనపు సంరక్షణ, శ్రద్ధ అవసరం అని మాకు ఎల్లప్పుడూ తెలుసనని కంపెనీ పేర్కొంది. చదవండి: గంటకు 70 కి.మీ వేగం.. రూ.80కే.. 800 కిలోమీటర్ల ప్రయాణం -
క్రిస్మస్ రోజున సర్వీస్ సెంటర్లు
హైదరాబాద్: క్రిస్మస్ పండుగ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ సర్వీస్ సెంటర్లు వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా సోమవారం నగరంలోని బీఎస్ఎన్ఎల్ సర్వీస్ సెంటర్లలో వేడుకలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. -
పాస్‌పోర్ట్ ఇక్కడే పొందొచ్చు
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నగరంలో సేవా కేంద్రం ప్రారంభం న్యూశాయంపేట : వరంగల్ ఉమ్మడి జిల్లా, చుట్టు పక్క జిల్లా వాసులకు పాస్‌పోర్ట్ పొందే అవకాశం ఇక నుంచి సులభతరం కానుంది. ఉమ్మడి జిల్లా, ఖమ్మం తదితర చుట్టు పక్కల ప్రాంతవాసులు పాస్‌పోర్ట్ కోసం హైదరాబాద్ కు వెళ్లకుండా వరంగల్‌లో ఏర్పాటు చేసిన సేవా కేంద్రం ద్వారా పాస్‌పోర్ట్‌ను పొందవచ్చు. విదేశాంగ శాఖ, తపాలా మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేవా కేంద్రాన్ని బుధవారం హన్మకొండ హెడ్‌పోస్టాఫీస్‌లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అధికారుల కృషితో నెలరోజుల్లో ఉగాది సందర్భంగా సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పాస్‌పోర్ట్ కోసం జిల్లా వాసులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో నగరంలో సేవా కేంద్రాన్ని ఏర్పాటుకు కృషి చేశామన్నారు. హెదరాబాద్ తర్వా త వేగంగా వరంగల్ నగరం ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న తరుణంలో విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లే విద్యార్థుల కోసం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇక్కడే పక్కా భవనం నిర్మించి ఇస్తామని దానికనుగుణంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధి కారులు చర్యలు తీసుకొని ఇప్పుడు నెలకు వెయ్యి పాస్‌పోర్ట్‌లను తర్వాత కాలంలో మూడు వేలకు పెంచాలని కోరారు. ఈ సందర్భంగా నెల రోజుల చిన్నారి పులిగిల్ల శ్రేయన్కు పాస్ పోర్ట్‌ను కడియం చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మికాంతారావు, ఎంపీ దయాకర్, నగర మేయర్ నన్నపనేని నరేందర్, రీజినల్ పాస్‌పోర్డ్ అధికారి డాక్టర్ విష్ణువర్థన్‌రెడ్డి, చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బ్రిగేడియర్ బి.చంద్రశేఖర్, పోస్ట్ మాస్టర్ జనరల్ కల్నల్ ఎలీషా, జెడ్పీ చైర్పర్సన్ జి.పద్మ, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, తాటికొండ రాజ య్య, అరూరి రమేష్, వి.సతీష్, ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ అమ్రపాలి, సీపీ సుధీర్‌బాబు, సీఎఫ్ఓ అక్బర్ పాల్గొన్నారు. మొదటి రోజు 15 మంది దరఖాస్తు వరంగల్: హన్మకొండ హెడ్పోస్ట్ ఆఫీస్‌లో ఉగాది పర్వదినాన నూతనంగా ప్రారంభమైన పాస్‌పోర్టు కార్యాలయంలో పలువురు నూతన పాస్‌పోర్టుల కోసం, రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొదటి రోజున 15మంది పాస్‌పోర్టుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఐటీ ఇంచార్జ్ అబ్ధుల్ తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లా అడిషనల్ ఏపీఆర్వోగా పనిచేస్తున్న ఈవీ.కిరణ్మయి తన పాస్‌పోర్టు రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. -
పోలీస్ స్టేషన్లు ఆధునిక దేవాలయాలు
సైదాబాద్: నగరంలో పోలీస్స్టేషన్లను దేవాలయాలుగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. మోడల్ పోలీస్స్టేషన్ల ఏర్పాటులో భాగంగా గురువారం ఆయన సైదాబాద్ పోలీస్‌స్టేన్ నూతన భవనానికి నగర పోలీస్‌కమిషనర్ మహేందర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో 23 పోలీస్స్టేషన్లను రూ.75 కోట్లతో మోడల్ పీఎస్లుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇందులో 16 శాంతిభద్రతలు, 6 ట్రాఫిక్, 1 మహిళా పోలీస్స్టేషన్లు ఉన్నట్లు తెలిపారు. నేరాలపై కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు సమాచారం అందుతుందన్నారు. పోలీసులు ప్రజలకు చేరువైనప్పుడే నేరాల నియంత్రణ సాధ్యమన్నారు. ప్రజల పోలీస్స్టేషన్లు: కమిషనర్ మహేందర్‌రెడ్డి ఇది మా పోలీస్స్టేషన్లు అని ప్రజలు చెప్పుకునేలా ప్రతి పోలీస్‌స్టేషన్‌ను తీర్చిదిద్దనున్నట్లు నగర పోలీస్‌కమిషనర్ మహేందర్‌రెడ్డి అన్నారు. పోలీస్‌స్టేషన్‌ను సర్వీస్ సెంటర్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు హైదరాబాద్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, నగరంలో చీటింగ్, డ్రగ్స్, కల్తీని రూపుమాపేందుకు కృషి చేస్తున్నామన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ కెమెరాల సహాయంతో నగరంలో ఎక్కడ ఎం జరుగుతుందో తెలుసుకుంటున్నామన్నారు నేరం చేస్తే పోలీసులకు దొరికిపోతామని భయం కల్గించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్, ఐజీలు మల్లారెడ్డి, శ్రీనివాస్, అధికారులు మురళీకృష్ణ, ప్రేమ్‌కుమార్, ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్, ఏసీపీ సుధాకర్, కాట్న సత్తయ్య, డీఐ కోరుట్ల నాగేశ్వర్రావు, సిబ్బంది, కార్పొరేటర్లు సింగిరెడ్డి స్వర్ణలతరెడ్డి, సామ స్వప్నరెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. స్టేషన్ కు రూ.75 వేలు కాచిగూడ: రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతున్నామని హోంమంత్రి నాయిని నరసింహా రెడ్డి అన్నారు. గురువారం ఆయన కాచిగూడ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి నెలా పోలీస్ స్టేషన్లకు రూ.75వేలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నగరంలో దొంగతనాలు, క్రైమ్‌రేటు తగ్గిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎం.ఎస్. ప్రభాకర్, కార్పొరేటర్లు ఎక్కాల చైతన్య కన్నా, కాలేరు పద్మవెంకటేష్, గరిగంటి శ్రీదేవి రమేష్, పోలీస్ అధికారులు మల్లారెడ్డి, రవీందర్, లక్ష్మినారాయణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.