
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కియా ఇండియా విక్రయ, సర్విస్ కేంద్రాలను విస్తరిస్తోంది. కియా 2.0 వ్యూహంలో భాగంగా డిసెంబర్‌కల్లా 300 నగరాలు, పట్టణాల్లో అడుగు పెట్టడం ద్వారా టచ్ పాయింట్స్ సంఖ్యను 700లకు చేరుస్తామని ప్రకటించింది.
ప్రస్తుతం 236 నగరాలు, పట్టణాల్లో కంపెనీకి 522 సేల్స్, సర్విస్ సెంటర్స్ ఉన్నాయి.